వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
ముంబయి : ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో రెపోరేటుతో పాటు రివర్స్ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రెపోరేటు 8శాతంగా ఉండగా రివర్స్ రెపోరేటు 7శాతం గా ఉంది. భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకే కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారమిక్కడ తెలిపారు.
అయితే అసవరమైనప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కిందటి మానిటరీ పాలసీలో కీలక వడ్డీరేట్లను 7.75శాతం నుంచి 8శాతానికి పెంచిన సంగతి విధితమే . గత నవంబర్‌లో 11.24శాతం పెరిగిన ద్రవ్యోల్భణం ఇపుడిప్పుడే నియంత్రణలోకి వస్తుందని ఆయన అన్నారు. 2012-13 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి రేటు మాత్రం 4.5శాతానికి తగ్గిందని ఈ ఆర్ధిక సంవత్సరం అది 4.9శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది.