reserve bank of india
-
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్ 1 నుండి కార్పొరేట్ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.కార్పొరేట్లకు రుణమాఫీదీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్ ప్రదర్శించింది.2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. చిన్న రుణాలు మాఫీ చేయలేమా?పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్ మెటాలిక్స్’... 2018 జూలైలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్ మెటాలిక్స్ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?చట్టాల్లో ఎందుకు తేడా?ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్ లేదా మోటార్ సైకిల్ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. కోల్డ్ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్ గ్రీన్స్ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్సీఐఎల్) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 2023 డిసెంబర్లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్సీఐఎల్ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ -
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే
సాక్షి, అమరావతి: మార్గదర్శి(Margadarshi) ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు(Ramoji Rao)ల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) (ఆర్బీఐ) పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిటర్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది.అంతేకాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద హెచ్యూఎఫ్ను ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా, చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. హెచ్‌యూఎఫ్ అనేది చట్టం సృష్టించిన ఓ జీవి అని పేర్కొంది. హెచ్‌యూఎఫ్ కర్త అనేది.. దాని సభ్యుల నుంచి భిన్నమైన, చట్టపర ప్రత్యేక సంస్థ అని తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందేనని ఖరాకండిగా చెప్పింది.⇒ డిపాజిట్ల వసూలుకు ఎన్నడూ అనుమతించలేదు..కర్త రామోజీరావు మరణించినంత మాత్రాన మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ ఆరోపణలన్నీ తప్పుడు, అసత్య, తప్పుదోవ పట్టించేవేనని స్పష్టం చేసింది. మార్గదర్శి హెచ్‌యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి వస్తుందని మొదటి నుంచీ తాము చెబుతూ వస్తున్నామంది. చట్ట ఉల్లంఘనల గురించి, సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుందన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నామని తెలిపింది.డిపాజిట్ల స్వీకరణకు అనుమతినిస్తూ తాము సర్టిఫికెట్ జారీ చేశామన్న మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం కొట్టేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. -
రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పు
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లను జారీ చేసే ప్రణాళికలను ప్రకటించారు. మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉన్న నోట్లు చట్టబద్ధంగా యథావిధిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త నోట్లు మహాత్మా గాంధీ ఇమేజ్‌తో కొత్త సిరీస్‌లోని రూ.50 నోట్లనే పోలి ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. కేవలం శక్తికాంత దాస్ సంతకం స్థానంలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం మాత్రమే మారుతుందని స్పష్టం చేసింది.శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేతగవర్నర్గా బాధ్యతలు స్వీకరించేకంటే ముందు వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
రుణాలు బంగారంలా పెరిగాయ్!
సాక్షి, బిజినెస్ బ్యూరో: బంగారం ధర ఒక్కటే కాదు.. బ్యాంకుల్లో పసిడి తాకట్టు రుణాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్‌లో రూ.1,01,552 కోట్లుగా ఉన్న బంగారు రుణాలు.. డిసెంబర్ నాటికి రూ.1,72,581 కోట్లకు చేరాయి. అదే 2023 డిసెంబర్‌తో పోలిస్తే బంగారం రుణాల్లో ఏకంగా 71.3 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. అంతకుముందు ఏడాదిలో ఇది 17 శాతమే. భారత్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొత్తం పసిడి రుణాలు డిసెంబర్ నాటికి 41.66 శాతం పెరిగి.. రూ.43,745 కోట్లకు చేరాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్ తీరును ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. పసిడి ధరలకు రెక్కలు రావడంతో ఆభరణాలపై అందుకునే లోన్ విలువ కూడా పెరిగింది. రుణ గ్రహీతలు తమకు ఉన్న ఇతర రుణాల చెల్లింపుల కోసం గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతు న్నాయి. పెట్టుబడికే కాదు చదువులు, ఆరోగ్యం, వివాహం ఇలా ఏ అవసరంలోనైనా ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారం కొనిపెట్టుకోవడం, అవసరానికి తాకట్టు పెట్టడం పెరుగుతోంది.బంగారం లాంటి సౌలభ్యం! ఎవరైనా ఇతర రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్ హిస్టరీ తప్పదు. పైగా ప్రతి నెల ఈఎంఐ రూపంలో వడ్డీ, అసలు కట్టాల్సిందే. అదే గోల్డ్ లోన్‌కు ఏ అడ్డంకీ లేదు. నగలు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత రుణం. చెల్లింపుల్లోనూ సౌలభ్యం ఉంటుంది. నిర్దేశిత కాల పరిమితి ముగిసే సమయానికి బాకీపడ్డ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు, తీసుకునే మొత్తాన్ని బట్టి వార్షిక వడ్డీ 9 నుంచి 26 శాతం వరకు ఉంది. ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. 10 నిమిషాల్లో అప్పు పుడుతుంది. ఇంటికొచ్చి మరీ బంగారం రుణాలిస్తుస్న సంస్థలూ ఉన్నాయి. ఆభరణాల స్వచ్ఛతను బట్టి విలువలో 75 శాతం వరకు రుణం అందుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ సంస్థలు 90 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. నెల నెలా వడ్డీ కట్టే విధానంగానీ, కాలపరిమితి ముగిశాక ఒకేసారి అసలు, వడ్డీ చెల్లించే విధానంగానీ ఎంచుకోవచ్చు. రుణం చెల్లించడంలో విఫలమైతే నిబంధనల ప్రకారం నోటీసులు ఇస్తారు. అయినా స్పందించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తారు.బంగారం, రుణాల లెక్కలివీ..వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం... 2024లో దేశంలో బంగారం డిమాండ్ 802.8 టన్నులుగా నమోదైంది. 2023లో ఇది 761 టన్నులు మాత్రమే. భారతీయుల వద్ద మొత్తంగా సుమారు 25,000 టన్నులకుపైగా బంగారం నిల్వలు ఉన్నట్టు అంచనా. ఇందులో 5.6 శాతం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. 2023–24లో పుత్తడి రుణ విపణి రూ.7.1 లక్షల కోట్లుగా ఉంటే.. రెండేళ్లలోనే రెండింతలైంది. మొత్తం బంగారం రుణాల్లో రూరల్ వాటా 35%, సెమీ అర్బన్ 42%, అర్బన్ వాటా 23 శాతంగా నమోదైంది. ఇక ఎన్బీఎఫ్సీలు అందిస్తున్న బంగారం రుణాల్లో రూ.30,000లోపు తీసుకునేవే 50శాతం దాకా ఉన్నాయి. అన్సెక్యూర్డ్ లోన్స్, క్రెడిట్ కార్డుల కంటే గోల్డ్ లోన్ చవక. బంగారం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 63 శాతంకాగా.. మిగిలినది ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులది.ఇతర రుణాలు కఠినతరం కావడంతో..బ్యాంకుల కఠిన నిబంధనల కారణంగా పర్సనల్ లోన్లు, క్రెడిట్‌కార్డులు వంటి అన్సెక్యూర్డ్ రుణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రుణగ్రహీతలు ప్రత్యామ్నాయంగా బంగారం రుణాలపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత రుణాల విభాగం 2023 డిసెంబర్లో నమోదైన 20.8%తో పోలిస్తే 2024 డిసెంబర్లో వృద్ధి 9.7 శాతమే కావడం గమనార్హం. క్రెడిట్ కార్డ్ రుణాలు 2024 డిసెంబర్లో 15.6% పెరిగాయి. ముందటి ఏడాదిలో ఇది 32.6%. గృహ, వాహనాలు, క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు సహా రిటైల్ లోన్ విభాగంలో బ్యాంకుల రుణాల వృద్ధి 2023 డిసెంబర్లో 17.6% నుంచి 2024డిసెంబర్లో 14.9 శాతానికి తగ్గిపోయిందని రిజర్వుబ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.స్టేట్ బ్యాంకులో గోల్డ్‌లోన్ ఇలా..ఎస్బీఐ.. 18–22 క్యారెట్ల ఆభరణాల స్వచ్ఛతను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ప్రతి 10 గ్రాములకు రూ.45,000 వరకు రుణం ఇస్తోంది. రుణ గ్రహీత మూడేళ్ల వరకు వడ్డీ కట్టుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత లోన్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. బుల్లెట్ రీపేమెంట్ విధానంలో 6 నెలలు లేదా 12 నెలల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ విధానంలో గరిష్టంగా 10 గ్రాములకు రూ.48,000 వరకు లోన్ అందుకోవచ్చు. ప్రతి నెలా నిర్ధేశిత వడ్డీ చెల్లించాలి. టెన్యూర్ ముగిసే ముందు అసలు మొత్తాన్ని కట్టి లోన్‌ను క్లోజ్ చేసుకోవాలి. అయితే గోల్డ్ లోన్‌పై 90 రోజులపాటు వడ్డీ చెల్లించకపోతే ఖాతా ఎన్పీఏ (మొండి బకాయి) అవుతుంది. ఆ తర్వాత 90 రోజుల దాకా కూడా కస్టమర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే బంగారాన్ని వేలం వేస్తారు. ధర పెరిగి.. ఎక్కువ రుణం.. పసిడి ధర పెరిగిపోతుండటంతో దానిపై అందుకునే లోన్ మొత్తమూ పెరుగుతోంది. దీనితో జనం తమ అవసరాల కోసం బంగారం లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పుత్తడి ధర హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.87,650 దాటింది. గతేడాది ధర సుమారు రూ.64,000 మాత్రమే కావడం గమనార్హం.బంగారంపై రుణాల తీరు ఇదీ.. వార్షిక వడ్డీ: 9% నుంచి 26% వరకు రుణమిచ్చేది: కనిష్టంగా రూ.1,500 నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు కాల పరిమితి: 7 రోజుల నుంచి 4 ఏళ్ల వరకు.. ఆభరణం విలువలో రుణం: గరిష్టంగా 75 శాతం -
వడ్డీరేట్ల కోత పక్కా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరగబోయే ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.భారత వృద్ధికి ఊతమిచ్చేందుకు వచ్చే ఆర్బీఐ మానిటరీ సమావేశంలో వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. కార్మికుల అవసరం అధికంగా ఉండే రంగాల్లో ఉద్యోగ కల్పన ఉండవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. దానివల్ల భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడుతాయని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 5-7 తేదీల్లో ఆర్బీఐ ఎంపీసీ(MPC) సమావేశం జరగనుంది. చైనా వంటి దేశాల నుంచి భారీగా వస్తువులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో యాండీ డంపింగ్ డ్యూటీని పెంచే యోచనలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉక్కు, పేపర్‌బోర్డు, రసాయనాలు, పాలిమర్స్ వంటి ప్రత్యేక రంగాలకు దీనిని అమలు చేయబోతున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరికరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది. -
ఎకానమీ స్పీడ్ 6.4 శాతమే..
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది. ముఖ్యంగా తయారీ, సేవల రంగాల పనితీరు బలహీనంగా ఉండడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే.అటు తర్వాత 6.4 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి. 2024–25పై జాతీయ గణాంకాల కా ర్యాలయం తాజా అంచనాలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిసెంబర్ 2024లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వశాఖ తొలి అంచనా 7 శాతంకన్నా కూడా ఈ అంచానలు తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ అంచనాలు ఇవీ.. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని, 2025–26 మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) వరుసగా 6.9 శాతం, 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయి లో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.కీలక రంగాలపై అంచనాలు..తయారీ రంగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.3 శాతంగా అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ విభాగం 9.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. సేవల రంగం: ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం వృద్ధి అంచనా 5.8 శాతం. 2023–24లో ఈ రేటు 6.4 శాతం. వ్యవసాయం: కొంత మెరుగైన ఫలితం వెలువడనుంది. 3.8 శాతం వృద్ధి నమోదవుతుందని గణాంకాలు అంచనా వేస్తున్నాయి. 2023–24లో 1.4 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి కావడం గమనార్హం. ఎకానమీ లెక్కలు ఇలా... ⇒ 2024–25లో ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువ రూ.85.71 ప్రాతిపదికన) ⇒ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం 2024–25లో జీడీపీ విలువ అంచనా రూ. 324.11 లక్షల కోట్లు, 2023–24లో ఈ విలువ రూ. 295.36 లక్షల కోట్లు. అంటే వృద్ధి 9.7 శాతం. ⇒ ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.3 శాతం. గత సంవత్సరంలో ఈ రేటు 4 శాతం. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ): 2024–25లో 4.1 శాతం వృద్ధి, 2023–24లో ఈ రేటు 2.5 శాతం. తలసరి ఆదాయం: ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా 2024–25లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 8.7 శాతం పెరిగి రూ. 2,00,162కు చేరుకునే అవకాశం ఉంది. 2023–24లో ఈ విలువ రూ. 1,84,205. ముందస్తు గణాంకాల ప్రాధాన్యత!ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా తాజా ముందస్తు అంచనాలు ఉపయోగపడతాయి. తగిన అంచనాలు... 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు సమంజసంగానే ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు అధిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకానమీపై కూడా అంతర్జాతీయ అనిశ్చితిలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అంశాలు పరిగనణలోకి తీసుకుంటూ 2025–25లో జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా మేము అంచనా వేస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్మూలధన వ్యయ తగ్గుదల ప్రభావం కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ పురోగతిలో ప్రభుత్వ మూలధన వ్యయాలు కీలకంగా మారాయి. వీటి తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఇక పట్టణ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం అలాగే రుణ వృద్ధి మందగమనం సవాళ్లను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. పట్టణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే రిటైల్ క్రెడిట్ వృద్ధి మందగించింది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్వృద్ధి 6.2 శాతానికి పరిమితం: హెచ్ఎస్బీసీప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతమేనని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. అధికారిక అంచనాతో పోలిస్తే ఇది మరింత తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పెరుగుతుందని నివేదిక విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై –సెప్టెంబర్) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదుకావడం నిరాశాజనకంగా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. క్యూ2 తర్వాత పరిస్థితులు మెరుగు... ‘‘మేము విశ్లేíÙంచే 100 సూచికల ప్రకారం సెప్టెంబర్ తరువాత వృద్ధి సూచికలు మెరుగుపడ్డాయి. అయితే జూన్ త్రైమాసికంతో ఇంకా బలహీనంగానే ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. జూలై–సెపె్టంబర్ కాలంలో 55 శాతం సూచికలు సానుకూలంగా వృద్ధి చెందగా, డిసెంబర్ త్రైమాసికంలో ఇది 65 శాతానికి పెరిగిందని తెలిపింది. వ్యవసాయం, ఎగుమతులు, నిర్మాణ రంగాల్లో మెరుగుదల అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇటీవల వారంలో చాలా చర్చనీయాంశంగా మారిన పట్టణ వినియోగంలో కూడా డిసెంబర్ త్రైమాసికంలో కొంత మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.అయితే, వినియోగ విద్యుత్ సేవలు, ప్రైవేటు పెట్టుబడుల సూచికలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. జూన్ త్రైమాసికంలో 75 శాతం సూచికలు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదని నివేదిక వెల్లడించింది. 2024–25లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుందని, 2025–26లో ఇది 4.4 శాతానికి నివేదిక పేర్కొంది. నవంబరులో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.3 శాతానికి, జనవరిలో 5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అరశాతం రెపో రేటు కోత అంచనా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానం ఫిబ్రవరి, ఏప్రిల్ విధాన సమీక్షలలో 0.25 శాతం చొప్పున రెండు రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వృద్ధే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ ప్రస్తుత 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొన్న నివేదిక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండడమే దీనికి కారణంగా వివరించింది. -
రూ.5000 నోటు వస్తోందా?: ఆర్బీఐ ఏం చెప్పిందంటే..
ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ రూ.500. అయితే రూ.5,000 నోటు కూడా త్వరలో రాబోతుందని, కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపైన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఓ క్లారిటీ ఇచ్చింది.ఆర్బీఐ రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకున్న తరువాత.. వాటి స్థానంలో 5,000 రూపాయల నోట్లు (Rs.5000 Note) వస్తాయని కొందరు సోషల్ మీడియాలో పోటోలను షేర్ చేశారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమే అని, దీనిని ఎవరూ నమ్మొద్దని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.దేశంలో అతిపెద్ద కరెన్సీభారతదేశంలో చాలా మందికి తెలిసిన అతిపెద్ద కరెన్సీ 2,000 రూపాయల నోటే. కానీ ఇండియాకు స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10,000, రూ.5,000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం బహుశా తెలియకపోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ప్రవేశపెట్టిన రూ.10,000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది. ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి.1978లో మొరార్జీ దేశాయ్ (Morarji Desai) నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10,000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5,000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10,000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి.ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లుభారతదేశంలో ప్రస్తుతం రూ. 500 నోట్లు మాత్రమే కాకుండా.. రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 20, రూ. 10 నోట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా 2023 మే 19న ఆర్బీఐ రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత ఇప్పటివరకు వెనక్కి వచ్చిన రెండువేల రూపాయల నోట్లు 98.12 శాతం. అంటే ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. -
సేవలకు ఇక సెలవు..!
ముంబై: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఆరేళ్లలో ఆర్థిక–ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని చెప్పారు. దేశ ద్రవ్య వ్యవస్థకు సంబంధించి కీలక అధికారాలకు సారథ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి గత ఆరేళ్లుగా తాను చేయాల్సిందంతా చేశానని పేర్కొన్నారు.వృద్ధి మందగమనం రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు అధిక స్థాయిలో ఉండడం వల్ల సంభవించబోదని, ఇందుకు పలు కారణాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వృద్ధి పురోగతి– ద్రవ్యోల్బణం కట్టడి ఆర్బీఐ ముందు మున్ముందు ఉన్న సవాలని వివరించారు. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 2018 డిసెంబర్ 12న దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా నియమితులైన రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లు ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి కృషి చేస్తా: సంజయ్ మల్హోత్రాన్యూఢిల్లీ: అన్ని అంశాలను అర్థం చేసుకుని ఆర్థిక వ్యవస్థ పురోగతికి కృషి చేస్తానని ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టనున్న రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఆర్థికశాఖ కార్యాలయం వద్ద విలేకరులు అడిగిన ప్రశ్నకు మల్హోత్రా సమా« ధానం చెబుతూ, ‘‘కీలక బాధ్యతల్లోని అన్ని దృక్కోణాలను అర్థం చేసుకోవాలి. ఆర్థిక వ్యవ స్థకు ఉత్తమమైన చర్యలు చేపట్టాలి’’ అన్నారు. -
జగన్ పాలనలో జీఎస్డీపీ పరుగులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో నికర రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో గణనీయంగా పెరుగుదల నమోదైంది. అంతకు ముందు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కంటే గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలోనే అత్యధికంగా జీఎస్డీపీ పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ మేరకు 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలను ఆర్బీఐ హ్యాండ్‌బుక్ రూపంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జీఎస్డీపీ పెరుగుదలను కూడా వివరించింది.ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలు ఎదురైనా వాటిని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ రెండంకెల వృద్ధి నమోదైనట్లు తెలిపింది. జీఎస్డీపీతో పాటు వ్యవసాయం, తయారీ, నిర్మాణ తదితర రంగాల్లోనూ గత ఐదేళ్లలో సగటున ఏటా రెండంకెల వృద్ధి నమోదు కావడం విశేషం. కోవిడ్ సంక్షోభం లేనప్పటికీ చంద్రబాబు అంతకు ముందు ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీ రూ.3.77 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు పెరగడం విశేషం. అంటే.. ఏటా ఒక లక్ష కోట్లు చొప్పున జీఎస్డీపీ పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం.. జీఎస్డీపీ 2019–20 నుంచి వరుసగా 2023–24 ఆర్థిక ఏడాది వరకు పెరుగుతూనే ఉంది. 2018–19లో చంద్రబాబు పాలనలో ప్రస్తుత ధరల ప్రకారం.. జీఎస్డీపీ రూ.7,90,810 కోట్లు ఉండగా 2023–24 నాటికి ఐదేళ్ల జగన్ పాలనలో రూ.12,91,518 కోట్లకు పెరిగింది. అంటే ఐదేళ్లలో రూ.5,00,708 కోట్ల మేర పెరిగింది. మొత్తం మీద వైఎస్ జగన్ పాలనలో జీఎస్డీపీలో ఏటా సగటున 12.66 శాతం మేర వృద్ధి నమోదైంది.వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత..కోవిడ్ సంక్షోభంలో వ్యవసాయ రంగానికి, రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. దీంతో 2019–20 నుంచి 2023–24 వరకు వరుసగా ఐదేళ్లు వ్యవసాయ రంగంలో కూడా ఏటా సగటున రెండంకెల వృద్ధి సాధ్యమైంది. ప్రస్తుత ధరల ప్రకారం.. ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో జీఎస్డీపీ విలువ రూ.1,69,652 కోట్లు పెరిగింది. అంటే ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో జీఎస్డీపీలో ఏటా సగటున 12.97 శాతం వృద్ధి నమోదైంది. -
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
RBI: ఊహించిందే జరిగింది
భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తగ్గినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ తగ్గుదలను ముందుగానే ఊహించినట్లు ఆర్బీఐ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్ట్‌లపై పెట్టే వ్యయం తగ్గడం వల్లనే ఇలా జీడీపీ ముందగమనంలో ఉందని స్పష్టం చేసింది.2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ(ద్రవ్యోల్బణాన్ని పరిగణించిన తర్వాత) వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. గతేడాది సరాసరి అన్ని త్రైమాసికాల్లో కలిపి ఇది 8 శాతంగా ఉంది. ఈసారి జీడీపీ తగ్గడానికి వ్యవసాయం, సేవల రంగం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి మెరుగవడం కొంత జీడీపీకి ఊతమిచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికంగా ప్రాథమిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెల పెంపంకం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం జీడీపీ వృద్ధిని వెనక్కులాగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రాథమిక రంగంతోపాటు సేవల రంగం కూడా జీడీపీ వృద్ధిని వెనక్కి లాగినట్లు ఆర్బీఐ తెలిపింది. సేవల రంగంలో వాణిజ్యం, రవాణా, బ్యాంకులు, హోటళ్లు, స్థిరాస్తి.. వంటి విభాగాలు వస్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సేవల రంగం 7.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది గతేడాది పది శాతంగా ఉంది. ఇదిలాఉండగా, ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఇతర పథకాలు, పెరుగుతున్న వ్యయ సామర్థ్యం వల్ల ప్రారిశ్రామిక రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతేడాది ఐదు శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి ఈసారి ఏడు శాతానికి చేరింది.ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలుదేశ వృద్ధిలో సింహభాగం ప్రాథమిక, సేవల రంగాలదే. కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విశేష వృద్ధితోపాటు సేవల రంగంలో మెరుగైన ఫలితాలు నమోదైతేనే జీడీపీ గాడిలో పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు పెంచాలని చెబుతున్నారు. దేశంలోని యువతకు ఆ రంగాల్లో పనిచేసేలా నైపుణ్యాలు అందించి మరింత ఉత్పాదకతను పెంచాలని సూచిస్తున్నారు. -
అక్రమ డిపాజిట్ల కేసు.. ‘మార్గదర్శి‘కి ‘ఆర్బీఐ’ షాక్
సాక్షి,హైదరాబాద్: రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్కు తెలంగాణ హైకోర్టులో ఎదరుదెబ్బ తగిలింది. డిపాజిట్ల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) యాక్ట్ తమకు వర్తించదని మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ ప్రస్తతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. అయితే..తమపై అక్రమ డిపాజిట్ల సేకరణ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌కు ఆర్బీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిపాజిట్లు సేకరించడంపై విచారణ కొనసాగించాల్సిందేనని అఫిడవిట్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్-45 వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపింది. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించడం చట్టవ్యతిరేకమని ఆర్బీఐ కుండబద్దలు కొట్టింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆర్బీఐ కోరింది. అక్రమంగా డిపాజిట్లు సేకరణ విషయంలో నేరం రుజువైతే మార్గదర్శి డైరెక్టర్లకు 2 నుంచి 5 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అక్రమ డిపాజిట్ల సేకరణకు సంబంధించి మార్గదర్శిపై 2008లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఆర్బీఐ యాక్ట్‌కు విరుద్ధంగా మార్గదర్శి వేల మంది నుంచి సంవత్సరాల తరబడి అక్రమ డిపాజిట్లు సేకరిస్తోందని, దానిపై చర్యలు తీసుకోవాలనేది ఉండవల్లి కేసు సారాంశం. -
డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితం
‘మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యింది.. మీ ఫోన్‌కు ఓటీపీ పంపాం.. అది చెప్పండి.. వెంటనే ఖాతాను పునరుద్ధరిస్తాం’.. ఈ మాటలు నమ్మి ఎవరైనా ఓటీపీ నంబర్ చెప్పారో అంతే.. వారి ఖాతా ఖాళీ. కొన్నేళ్లుగా బెంబేలెత్తిస్తున్న సైబర్ నేరాల తీరిది. దాదాపు 65 శాతం సైబర్ నేరాలకు ప్రధాన కారణం అవాంఛనీయమైన వ్యక్తులకు ఓటీపీ నంబర్ చెప్పేయడమేనని తేలింది. వేగం పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా పెరుగుతున్న ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో డిజిటల్ చెల్లింపులు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ సైబర్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. అందుకే సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్ చెల్లింపుల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఓటీపీ నంబరుకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని విధానాలను అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. – సాక్షి, అమరావతిమూడు ప్రత్యామ్నాయ విధానాలు..డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు ఆర్బీఐ ‘అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) విధానాలను ఆమోదించింది. అంటే ఓటీపీతోపాటు ఈ అదనపు అథంటికేషన్‌ను కూడా కచ్చితంగా పరిశీలించిన అనంతరమే డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది. ఆ అదనపు అథంటికేషన్ డైనమిక్‌గా ఉంటుంది. చెల్లింపు లావాదేవీ మొదలైన తరువాత అది జనరేట్ అవుతుంది. అది కూడా ఆ ఒక్క లావాదేవీకే పరిమితమవుతుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల్లో మూడు ప్రత్యామ్నాయ విధానాలను పొందుపరిచింది. అవి..నాలెడ్జ్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు)కు మాత్రమే తెలిసిన సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. ఆ ఖాతాదారుడు ముందుగా నిర్ణయించుకున్న పాస్వర్డ్, పాస్‌ఫ్రేజ్, పిన్ నంబర్లలో ఒకదాన్ని ఎంటర్‌చేస్తేనే డిజిటల్ చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. పొసెషన్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు) తాను వ్యక్తిగతంగా కలిగి ఉన్నవాటి సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లకు టోకెన్ల వంటి తనకు మాత్రమే తెలిసిన సమాచారాన్ని ఎంటర్‌చేస్తేనే డిజిటల్ చెల్లింపు పూర్తవుతుంది. బయోమెట్రిక్ బేస్డ్: వేలిముద్రలు, ఐరీస్, ముఖ గుర్తింపు వంటివి. అవి సరిపోలితేనే డిజిటల్ చెల్లింపు సాధ్యపడుతుంది.వీటికి మినహాయింపులు..తాజా మార్గదర్శకాల పేరుతో రోజువారీ సాధారణ లావాదేవీలు, తక్కువ మొత్తం చెల్లింపుల ప్రక్రియకు ప్రతిబంధకం కాకుండా ఆర్బీఐ జాగ్రత్తలు కూడా తీసుకుంది. అందుకే ఈ కొత్త విధానం నుంచి కొన్నింటికి మినహాయింపులిచ్చింది. మినహాయింపులు ఇచ్చిన డిజిటల్ చెల్లింపులు ఏమిటంటే..» దుకాణాలు, వాణిజ్య కేంద్రాలు, ఇతర కేంద్రాల్లో రూ.5వేల లోపు చెల్లింపులు.. » బ్యాంకుల ద్వారా రికరింగ్ చెల్లింపుల (నియమిత కాలంలో ఆటోమెటిగ్గా బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులు) కోసం ముందుగానే ఆమోదించి బ్యాంకుకు తెలిపిన లావాదేవీలు..» రూ.లక్షలోపు మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు..» బీమా ప్రీమియంల చెల్లింపులు.. » క్రెడిట్ కార్డు చెల్లింపులు..» రూ.15వేల వరకు ఇ–మ్యాండేట్ చెల్లింపులు..» టోల్గేట్ల వద్ద చెల్లింపులు. -
మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ.. కారణం ఇదే!
గత కొన్ని రోజులుగా ఆర్బీఐ, నియమాలను అతిక్రమించే బ్యాంకుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధించడమే కాకుండా.. లైసెన్సులు సైతం రద్దు చేస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాని లైసెన్స్‌ను రద్దు చేసింది. లైసెన్స్ రద్దు చేసిన తరువాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోఆపరేటివ్ కమీషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్‌ను మూసివేయడానికి, లిక్విడేటర్‌ను నియమించడానికి ఉత్తర్వు జారీ చేయాలని ఆర్బీఐ కోరింది.బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిపాజిటర్లు తమ డిపాజిట్ మొత్తాలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసిజీసి) నుంచి పొందుతారు. లిక్విడేషన్ తర్వాత, ప్రతి డిపాజిటర్ DICGC నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. -
వేస్ అండ్ మీన్స్, ఓడీ పరిమితుల పెంపు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.47,010 కోట్లు ఉండగా, జూలై 1 నుంచి ఈ పరిమితిని రూ.60,118 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక వెసులుబాటు కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని పెంచేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు ఈ పరిమితులను పెంచినట్లు ఆర్బీఐ పేర్కొంది.ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన సెక్యూరిటీలలో పెట్టుబడుల పరిమాణం, ట్రెజరీ బిల్లుల వేలం, గ్యారెంటీ రిడెంప్షన్ ఫండ్ తదితరాల ఆధారంగా ఈ పరిమితులను పెంచినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అత్యవసర వ్యయాలకు నిధులు లభ్యత లేని పక్షంలో ఆర్థిక వెసులుబాటుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లను, ఓవర్ డ్రాఫ్ట్‌ల ద్వారా ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా నిధులను పొందేందుకు వెసులుబాటు కల్పిస్తారు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.2,252 కోట్లు ఉండగా.. జూలై 1 నుంచి రూ.2,921 కోట్లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే, మిగతా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ పరిమితులను పెంచింది. -
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్‌ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్‌ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్‌వేనని తెలుస్తోంది. -
ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సహకార బ్యాంకులకు జనవరి 18న భారీ జరిమానా విధించింది. ఆర్బీఐ ఏ బ్యాంకులకు ఫైన్ వేసింది, ఎందుకు వేసిందనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది పాడి నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్ RBI నిబంధనలను పాటించకపోవడం వల్ల రూ. 50 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్బీఐ ఈ బ్యాంకుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) రూ. 15 లక్షలు జరిమానా విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం నుంచి విరాళం ఇస్తున్నప్పుడు ఆర్బీఐ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ ఫైన్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు RBI రూ.7 లక్షల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో నిబంధనలను ఈ బ్యాంక్ ఉల్లంఘించడం వల్ల జరిమానా విధించింది. మిగిలిన రెండు బ్యాంకులు కొన్ని నిబంధనలను పాటించకపోవడం వల్ల పెనాల్టీని విధించినట్లు సమాచారం. -
కీలక వడ్డీ రేట్లను మార్చని ఆర్ బిఐ
-
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటినుంచి (4వ తేదీన) ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అక్టోబర్ 6వ తేదీన (శుక్రవారం) ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్ మీడియాకు వెల్లడిస్తారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది. ధరల స్పీడ్‌ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని ఆర్బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం. -
మూడోసారీ మార్పులేదు
ముంబై: ధరల స్పీడ్‌ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఆహార ధరలు పెరుగుతుంటే దీని కట్టడికి అవసరమైతే రేటు పెంపే ఉంటుందని ఉద్ఘాటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రితం 5.1 శాతం అంచనాలను 5.4 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత 6.5 శాతంగానే కొనసాగించాలని మూడురోజులపాటు సమావేశమైన కమిటీ నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ గడచిన మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు.. వృద్ధి ధోరణి: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. ద్రవ్యోల్బణం దాదాపు 6% లోపే: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2%. కొత్త ఉత్పత్తులతో ఊరట: భారీగా ధర పెరుగుతున్న టమాటా సహా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సమీప భవిష్యత్తులో ధరల తీవ్రత ఒత్తిడి ఉంటుంది. అయితే కొత్త పంట వస్తుండడంతో కూరగాయల ధరలు తగ్గవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల చెల్లింపుల పెంపు లక్ష్యం: యూపీఐ చెల్లింపుల్లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించే అంశాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది. యూపీఐ–లైట్లో ఆఫ్‌లైన్ చెల్లింపులలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వినియోగాన్ని ప్రస్తావించింది. అలాగే యూపీఐ లైట్లో చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ. 200 నుండి రూ. 500కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు సంబంధించి రూ.2,000 రోజూవారీ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా ఇన్స్ట్రుమెంట్ల వినియోగం, ధ్రువీకరణల విషయంలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోకుండా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. సీఆర్ఆర్లో లేని మార్పు: బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను యథాతథంగా 4.5% వద్ద కొనసాగింపు. దీనివల్ల ప్రస్తుత బ్యాంకింగ్ ద్రవ్య లభ్యత విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు. అధిక ద్రవ్య లభ్యతపై చర్యలు: రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగినంత వరకూ వెనక్కు తీసుకో వడానికి చర్యలు కొనసాగుతాయి. పెరుగుతున్న ఎన్‌డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ)పై గత మూడు నెలలుగా ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్) 10 శాతానికి పెంపు. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి చర్యలో ఇదొక కీలక చర్య. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 4–6 మధ్య జరుగుతుంది. రుణ గ్రహీతలకు ఊరట ఫ్లోటింగ్ నుంచి ఫిక్సిడ్కు..! పెరుగుతున్న వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి ఊరట నిచ్చేందుకు ఆర్బీఐ పాలసీ సమీక్ష కీలక నిర్ణయం తీసుకుంది. గృహ, ఆటో ఇతర రుణాలు సంబంధించి రుణగ్రహీతలు ఫ్లోటింగ్ రేటు నుంచి ఫిక్సిడ్ రేట్ విధానానికి మారే వెసులుబాటును కలి్పంచనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే ఫ్రేమ్‌వర్క్‌ను త్వరలో ప్రకటించనుంది. ఈ విధానం కింద బ్యాంకులు... రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకునిరావడం, రుణగ్రహీతలు ఫిక్సిడ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలు త్వరలో విడుదల కానున్న ఆర్బీఐ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండనున్నాయి. కాగా, రుణ జారీల విషయంలో బ్యాంకులు ‘‘మభ్యపెట్టే విధానాలను’’ విడనాడాలని, రుణ గ్రహీత వయస్సు, తిరిగి చెల్లింపుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన కాల వ్యవధిలో రుణం తీర్చగలిగేలా రుణాలు మంజూరు చేయాలని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఆయా విషయంలో మభ్యపెట్టే విధానాలు విడనాడి, రుణగ్రహీతకు పూర్తి పారదర్శక విధానాలను పాటించాలని సూచించారు. జాగరూకతతో నిర్ణయాలు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతూ వృద్ధి పటిష్టతకు దోహదపడే పాలసీ ఇది. ఆర్థిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రుణ సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవు. – దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ గృహ డిమాండ్‌కు ఢోకాలేదు ఆర్బీఐ యథాతథ రేటు విధానం వల్ల గృహ డిమాండ్‌కు తక్షణం వచ్చిన సమస్య ఏదీ లేదు. అయితే తదుపరి సమీక్షా సమావేశంలో రేటు కోత ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ విధానం కొనసాగినట్లు స్పష్టమవుతోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
బ్యాంకింగ్ లోపాలు సరిదిద్దరా?
బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ పాలసీల రూప కల్పనలోనూ, వాటి నిర్వహణా సామర్థ్యాలలోనూ అనేక లోపాలు ఏదో రూపంలో తలెత్తుతూనే ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం తప్పులను సరిదిద్దు కోకుండా నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శి స్తోంది. ముఖ్యంగా గత కొద్ది నెల లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీలో అనుసరిస్తున్న ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ ఇదే విష యాన్ని చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల ఆరంభంలో జరిగిన ఎంపీసీ సమావేశం మినిట్స్ వెల్లడయ్యాయి. వడ్డీరేట్ల పెంపుపై సభ్యుల మధ్య విభేదాలు పొడచూపినట్లుగా తెలుస్తోంది. ఏడాదికాలంలో ‘రెపో రేటు’ నాలుగు శాతం నుండి 6.5 శాతానికి పెరిగింది. ‘ద్రవ్య విధానం’ వాస్తవానికి దూరం జరిగిపో తున్నదంటూ జయంత్ వర్మ తాజా సమావేశంలో విమ ర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి అంచనాలకంటే తక్కువగా ఉంటుందన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ అయిన జయంత్ వర్మ, కేంద్రం ఎంపీసీలో నియ మించిన ముగ్గురు నామినీ సభ్యుల్లో ఒకరు. అలాగే గడిచిన ఈ 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలను ‘రైట్ ఆఫ్’ చేసి ఎగవేత దారులకు మేలు చేసింది. అంతే కాక ఉద్దేశపూర్వకంగా రుణాలనూ, వడ్డీలనూ ఎగ్గొట్టిన వారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు కూడా రిజర్వ్ బ్యాంక్ సిద్ధపడింది. రాజీ పరిష్కారం (కాంప్రమైజ్ సెటిల్మెంట్) పేరిట ఈ ప్రక్రి యకు తలుపుల్ని బార్లా తెరిచింది. ఈ అనాలోచిత చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్ప డిన వారు ఎంతమంది ఉన్నారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా పెద్ద మొత్తాలను ఎగవేసిన వారు పదహారు వేల మందికి పైమాటే అని బ్యాంకు నివేదికను బట్టి తెలుస్తోంది. వీళ్లు దాదాపు రూ. 3.46 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇందులో 85 శాతం రుణాలను (రూ. 2.92 లక్షల కోట్లు) ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6 బ్యాంకులకు గత కొన్నేళ్లుగా చైర్పర్సన్లను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇందువల్ల ఆయా బ్యాంకులు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు ప్రక్రియతో మన ఆర్థిక వ్యవస్థ సతమతం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెకాయ లాంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఇన్ని అంతర్గత వ్యవస్థాపరమైన లోపాలూ, నిర్వాహాణా లోపాలతో కొనసాగితే... దేశ ద్రవ్య వ్యవస్థ భవిష్యత్తులో ఏమికానుందో అనే ఆందోళన కలుగక మానదు. ఇటీవల అనేక విదేశీబ్యాంకులు వ్యవస్థాపర, నిర్వహణాపర లోపాలతో దివాలా తీసిన అనుభవాలు కళ్లెదుట కనిపిస్తున్నా వాటి నుండి మనం గుణపాఠం నేర్చుకోకుంటే ఎలా? డా‘‘ కోలాహలం రామ్ కిశోర్ వ్యాసకర్త ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 98493 28496 -
రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ!
రూ. 88,000 కోట్ల విలువైన రూ. 500 నోట్లు కనిపించడం లేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఆర్బీఐ కొట్టిపారేసింది. కరెన్సీ నోట్లపై వివరణ తప్పుగా ఉందని పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌లో 375.450 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించినట్లు రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) వెల్లడించింది. అయితే, ఆర్బీఐ మాత్రం ఏప్రిల్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్య కాలంలో కేవలం 345.000 మిలియన్ల నోట్లు మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు చెప్పింది. మరి మిగిలిన కరెన్సీ నోట్లు ఎక్కుడున్నాయి? అనే అంశం చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలో నోట్ల విషయంలో నివేదికలు అస్పష్టంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. ప్రింట్ ప్రెస్‌లలో ముంద్రించిన నోట్లన్ని ఆర్బీఐ వద్దకు చేరాయని, అందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓ వర్గానికి చెందిన మీడియా సంస్థలు కరెన్సీ నోట్ల గురించి కథనాలు ప్రచురించాయి. ఆ కథనాలు తన దృష్టికి రావడంతో ఆర్బీఐ స్పందించింది. ఈ నివేదికలు సరైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw — ReserveBankOfIndia (@RBI) June 17, 2023 నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించే ప్రోటోకాల్‌లతో సహా, ప్రెస్‌లలో ముద్రించబడిన, సరఫరా చేయబడిన బ్యాంక్ నోట్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన వ్యవస్థలను కలిగి ఉన్నామని ఆర్బీఐ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ఇస్తున్న సమాచారం సరైందేనని, ప్రజలు వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ వెల్లడించింది. ఇదీ చదవండి : స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’! -
రూ. 500 నోట్ల రద్దు.. నిజమేనా?
భారతదేశంలో ప్రస్తుతం నోట్ల రద్దు, ఉపసంహరణ మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. రూ. 2000 నోట్ల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా రూ. 500 నోట్లను కూడా రిజర్వ్ బాంక్ అఫ్ ఇండియా రద్దు చేస్తుందని లేదా ఉపసంహరించుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శక్తికాంత దాస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రూ. 500 నోట్ల రద్దు & ఉపసంహరణకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటి వరకు ఈ విషయంపై ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదని తెలిసింది. అంతే కాకుండా రూ. 1000 నోట్లను మళ్ళీ ప్రవేశపెట్టే ఉద్దేశ్యం అసలే లేదని వెల్లడించారు. (ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం) రూ. 500 నోట్ల రద్దు మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని శక్తికాంత దాస్ వెల్లడించారు. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వివరణ ఇచ్చారు. ఇప్పటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. తిరిగి వచ్చిన నోట్ల విలువ సుమారు రూ.1.82 లక్షల కోట్లు. చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ రూ. 3.62 లక్షల కోట్లు అని గతంలోనే వెల్లడించారు. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) తిరిగి వచ్చిన రూ. 2,000 నోట్లలో 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగా, మిగిలినవి మార్పిడి కోసం వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2023 మే 19న ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడికి లేదా డిపాజిట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు అని కూడా అప్పుడే తెలిపింది. -
RBI: దెబ్బకు ఆర్బీఐ వెబ్సైట్ క్రాష్.. కారణం ఇదే!
Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్ల చాలామని ఉండదని తాజాగా ప్రకటించిన కొంత సమయంలో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకోవడంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది. 2016లో ప్రధానమంత్రి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది. ఎవరూ ఊహించని విధంగా రాత్రి సమయంలో ఈ ప్రకటన చేసినప్పుడు చాలా మంది ప్రజలు దీని గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించారు. ఎక్కువ మంది ఒక్కసారిగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడంలో క్రాష్ అయింది. మళ్ళీ అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృతమైంది. దేశంలో బ్లాక్ మనీ తగ్గించడానికి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి కొత్తగా రూ. 2000 నోట్లు తీసుకువచ్చారు. అయితే వాటి ముద్రణ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయింది. 2018 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల మొత్తం విలువ సుమారు రూ. 6.73 లక్షల కోట్లని సమాచారం. ప్రస్తుతం RBI వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక సారికి కేవలం 10 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోట్లను మార్చుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. కావున రెండు వేల రూపాయలు కలిగి ఉన్న ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు
సాక్షి, ముంబై: కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే, ఈనోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కండిషన్స్ అప్లయ్ ♦ మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ♦ ఏ విత్ డ్రా అయినా, ఎంత డబ్బు ఇవ్వాలన్నా అందులో రూ. 2 వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ ♦ సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ దగ్గరున్న 2 వేల నోట్లను ఏ బ్యాంకులోనయినా డిపాజిట్ చేయొచ్చు ♦ ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్టంగా పది రూ. 2 వేల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. ♦ ఈ నెల 23 నుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉంది ♦ మార్చుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 ♦ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయిన రూ.2 వేల నోటు ముద్రణ “క్లీన్ నోట్ పాలసీ” లో భాగంగానే ఈ నిర్ణయం : ఆర్బీఐ రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89శాతం మార్చి 2017కి ముందు జారీ చేసినవి. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. మార్చి 31, 2018 నాటికి (చెలామణిలో ఉన్న నోట్లలో 37.3శాతం) గరిష్టంగా ఉన్న రూ.6.73 లక్షల కోట్ల నుండి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది, మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8శాతం మాత్రమే ఉన్నాయి. ఈ విలువ సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదని గమనించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అలాగే ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000 రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G — ANI (@ANI) May 19, 2023 -
'షిర్డి ఆలయం నుంచి నాణేలను తీసుకోం'..! అంటున్న బ్యాంకులు
మహారాష్ట్రలో ప్రఖ్యాతి గాంచి షిర్డీ సాయిబాబా ఆలయం నాణేల సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఆలయానికి ప్రతి నెల నాణేల రూపంలో సుమారు రూ. 28 లక్షల వరకు విలువైన నగదు వస్తుంది. దీన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఈ సంస్థ ట్రస్ట్‌కి ప్రభుత్వ సంబంధ బ్యాంకులకు సంబంధించి మొత్తం 13 శాఖల్లో ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్యాంకులు షిర్డీలో ఉండగా, ఒకటి నాసిక్‌లో ఉంది. ట్రస్ట్ ఖాతా ఉన్న ప్రతి బ్యాంకు ఆలయం నుంచి విరాళాలను, డిపాజిట్లను సేకరించడానికి ప్రతి నెల తమ సిబ్బందిని పంపుతాయి. ఐతే నాణేల రూపంలో ఇప్పటికే సుమారు రూ. 11 కోట్లు షిర్డీ సంస్థాన్‌కి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ అయ్యింది. ఇక నాణేలను దాచేందుకు అక్కడ బ్యాంకుల వద్ద స్థలంలో లేదు. దీంతో నాలుగు బ్యాంకుల అధికారులు ప్రతిరోజు లభించే నాణేలను ఉంచడానికి తమ వద్ద స్థలం లేదన్నారు. దీంతో షిర్డీ ట్రస్ట్ నాణేలను ఉంచడం ఒక సమస్యగా మారింది. దీంతో ఈ విషయంలో ఆర్బీఐని జోక్యం చేయయమంటూ..ట్రస్ట్ నేరుగా లేఖ రాయాలని యోచిస్తోంది. ఈ నాలుగు బ్యాంకుల తోపాటు ఇతర బ్యాంకులు కూడా ఇదే మాదిరి నాణేలను దాచేందుకు స్థలం సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రస్ట్ సీఈవో మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి మళ్లీ నాణేల సమ్యస్య తెరపైకి వచ్చింది. ఆలయంలో సగటున రోజువారిగా 50 వేలకు పైగా నాణేలు పేరుకుపోయాయి. నాణేల సేకరణను నాలుగు బ్యాంకులు నిలిపేశాయి. దీంతోపాఏటు మిగిలిన బ్యాంకులు ఇదే సమస్యను ఎదుర్కొటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించమని షిర్డీ సంస్థాన్ అధికారులు తనని సంప్రదించినట్లు తెలిపారు. ఈ విషయమై అహ్మదాబాద్‌లో మిగతా బ్యాంకులను సంప్రదించి..అక్కడ ఖాతాలనుతెరిచే యోచన కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బ్యాంకుల మాత్రం తమ వద్ద నాణేలు చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోయాయని చెబుతున్నాయి. అప్పట్లో ట్రస్ట్ నాణేలను నిల్వ చేయడానికి ఆలయ ప్రాంగణంలో బ్యాంకుల గదులను ఇచ్చింది. కాని కానీ నిబంధనల ప్రకారం అందుకు అనుమతి లేనందున తిరస్కరించినట్లు చెప్పారు. (చదవండి: మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు) -
వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35 వేల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఆపరేట్ చేయని 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి. ఈ డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌కి బదిలీ చేశాయి. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి చివరి నాటికి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసిన డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తాజాగా లోక్‌సభలో తెలియజేశారు. (రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు) ఆర్బీఐకి బదిలీ చేసిన రూ. 35,012 కోట్ల అన్ క్లయిమ్డ్ డిపాజిట్లలో అత్యధికంగా రూ. 8,086 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు సంబంధించినవి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులవి రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 3,904 కోట్లు ఉన్నాయి. -
పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెల 3,5,6వ తేదీల్లో జరపనున్న ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును మరో పావుశాతం పెంచడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఇదీ చదవండి: Twitter gold tick: నీ బ్యాడ్జ్ బంగారం గానూ! ట్విటర్ గోల్డ్ టిక్ కావాలంటే అంతా? ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? జాగరూకత అవసరం: కాగా, వడ్డీరేట్ల పెరుగుదల, దీనికి సంబంధించిన ఎదురయ్యే సవాళ్ల వంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆమె ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బ్యాంకింగ్ పనితీరు, పటిష్టతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! -
ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ!
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ రూ. 2.27 కోట్ల జరిమానా విధించింది. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! లోన్ రికవరీకి సంబంధించి ఆర్బీఎల్ బ్యాంక్‌పై ఆర్బీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆర్బీఐ.. రికవరీ ఏజెంట్ల విషయంలో ఆదేశాలను ఆర్బీఎల్ బ్యాంక్ ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో ఆ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో ఆర్బీఎల్ బ్యాంక్ విఫలమైందని కేంద్ర బ్యాంక్ ఆక్షేపించింది. ఏజెంట్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఈ చర్య 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల కాలంలో గుర్తించిన ఉల్లంఘనలపై మాత్రమే తీసుకున్నదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ పరిధిలోని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాల వసూలు కోసం నియమించుకున్న ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని 2022లో ఆర్బీఐ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. -
ఆన్లైన్లో డబ్బులు పోతే ఏం చేయాలి?!
కూతురు పుట్టినరోజుకు డ్రెస్ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసింది. అయితే, పేమెంట్ మోడ్‌కి వచ్చేసరికి డబ్బులు డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ, షాప్ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్ చేసింది. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ అమౌంట్ రిటర్న్ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్ అయిన మెసేజ్ ఏమీ రాలేదు. ఆ అమౌంట్‌ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. ఫిర్యాదులకు వేదిక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్‌ఫారమ్ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్లోడ్ చేయచ్చు. ఇది ఆర్థిక సైబర్ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్‌లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. CFCFRM టోల్ ఫ్రీ నెంబర్: 1930 ♦ వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి (12 గంటల్లోపు) ♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్‌కు లాగిన్ అయ్యి, ఫిర్యాదు చేయాలి. ♦బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాలెట్ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి. ♦ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్ఐఆర్గా మార్చవచ్చు. RBI వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ : టోల్ ఫ్రీ నెం. 14448 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్ ఆఫ్ కాంటాక్ట్ అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్బిఐచే నియమించబడిన అంబుడ్స్‌మన్ ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్‌మన్ కు ఉంటుంది. అంబుడ్స్‌మన్ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్ సంస్థలు కట్టుబడి ఉంటాయి. దశల వారీగా నివేదించే ప్రక్రియ... ♦ సంబంధిత యుపిఐ సర్వీస్ప్రొవైడర్ పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పె మొదలైన వాటిపై ఫిర్యాదు. ♦టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. ♦https://cms.rbi.org.in పోర్టల్‌కు లాగిన్ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. ♦మీ ఫిర్యాదును CRPC@rbi.org కి ఇ–మెయిల్ చేయచ్చు. (బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీ స్క్రీన్ షాట్లు / యుపిఐ, యాప్ లావాదేవీ స్క్రీన్ షాట్లు/ పంపిన, స్వీకరించిన ఫోన్ నంబర్లు రెండింటినీ జత చేయాలి) ♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్ దానిని హోల్డ్‌లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది. డబ్బులు ఇరుక్కుపోతే.. డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కస్టమర్ PSP యాప్ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు) / TPAPయాప్ (థర్డ్ పా ర్టీ అప్లికేషన్ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి.. (ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ కాలేదు (బి) ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్ అయ్యింది (సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది (డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్ అయ్యింది (ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది (ఎఫ్) నగదు లావాదేవీ పెండింగ్‌లో ఉండిపోయింది (జి) లావాదేవీ అసలు యాక్సెస్ అవలేదు (హెచ్) లావాదేవీ రిజక్ట్ అయ్యింది (ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
-
ద్రవ్యోల్బణానికి అదే ప్రధాన కారణం: ఆర్బీఐ
ముంబై: దేశంలో ఈ ఏడాది తొలి నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరాల సంబంధ సమస్యలే ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన ఒక బులెటిన్‌లో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ ప్రభావం క్షీణించిందని, తగ్గిన ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్, వ్యయాలు భారీగా పెరుగుతున్నాయని బులెటిన్ వివరించింది. ద్రవ్యోల్బణం దిగివచ్చి, డిమాండ్ నిరంతరం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. 2022 ఫిబ్రవరి తర్వాత ద్రవ్యోల్బణం పరిస్థితిని విశ్లేషించిన ఆర్బీఐ పేపర్ ప్రకారం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ఏర్పడిన సరఫరాల వైపు సమస్యలు– రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నవంబర్ వరకూ గడచిన 10 నెలల్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతానికి మించి పెంచాయి. అయితే నవంబర్ నెల్లో భారీగా 90 బేసిస్ పాయింట్లు తగ్గి 5.9 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ‘అటానమీ ఆఫ్ ఇన్ఫ్లెషన్’ అన్న శీర్షికన రూపొందిన ఈ విశ్లేషణా పత్రం రాసిన బృందానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వం వహించారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దాటి ఎందుకు పెరిగిందన్న అంశంపై ఆర్బీఐ ఇటీవలే కేంద్రానికి ఒక నివేదికను అందజేసింది. ఇది రహస్యంగా సమర్పించిన నివేదిక అని, దీనికి బహిర్గతం చేయడం జరగదని ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? -
ఆ బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా ఫైన్!
నియమాలను ఉల్లంఘించే బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఘుళిపించింది. రూల్స్ పాటించని బ్యాంకులపై చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలోనే 13 బ్యాంకులపై జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో చంద్రాపూర్‌లోని శ్రీ కన్యకా నగరి సహకారి బ్యాంక్‌పై గరిష్టంగా రూ. 4 లక్షలు, బీడ్‌లోని వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. వాయ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సతారా, ఇండోర్‌లోని ఇండోర్ ప్రీమియర్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, పటాన్ నగరిక్ సహకారి బ్యాంక్, పటాన్, మేఘాలయలోని ది తురా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లపై ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు ఫైన్ వేసింది. జరిమానాలు విధించిన ఇతర బ్యాంకులు: నాగ్రిక్ సహకరి బ్యాంక్ మర్యాడిట్, జగదల్పూర్; జిజౌ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, అమరావతి; తూర్పు & నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కో-ఆప్ బ్యాంక్, కోల్‌కతా; జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిత్, ఛతర్పూర్; నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాడిట్, రాయ్‌ఘర్; జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిట్, బిలాస్పూర్; జిలా సహకారి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్, షాడోల్‌లకు కూడా భారీగా జరిమానా విధించింది. అయితే ఈ జరిమానాలు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆర్బీఐ తెలిపింది. చదవండి టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
ఏపీ ప్రగతిని ప్రశంసించిన రిజర్వ్ బ్యాంక్ నివేదిక
-
రేటు పెంపు కొనసాగించక తప్పదు
కోల్‌కతా: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత కఠిన ద్రవ్య పరపతి విధానం కొనసాగించక తప్పదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి పుంజుకుంటే, రూపాయి బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు వచ్చే ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 9 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో సమర్‌కాంతి పాల్ స్మారక ప్రసంగంలో రంగరాజన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశం ఏడు శాతం వృద్ధి సాధిస్తే, అది హర్షణీయమైన అంశమే. ► ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (మే నుంచి 1.4 శాతం పెంపుతో ప్రస్తుతం 5.40 శాతం) పెంపు విధానాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నా. ► దేశం నుంచి పెట్టుబడులు తరలిపోవడం వల్లే డాలర్ మారకంలో రూపాయి విలువ 79 నుంచి 80 శ్రేణిలో పతనమైంది. ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. దీనితో దేశీయ కరెన్సీ విలువ మళ్లీ బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. పలు నెలలపాటు ఎడతెగని అమ్మకాల తర్వాత, ఆగస్టు 2022లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ. 22,000 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ► 27 నుంచి 28 శాతానికి పడిపోయిన పెట్టుబడులు రేటు 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులు కూడా భారీగా పెరగాలి. ► విద్యుత్, వ్యవసాయం, మార్కెటింగ్, కార్మిక వంటి కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగాలి. ఆర్థికాభివృద్ధిలో ఇది కీలకం. 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు ‘మంచి సమన్వయంతో, విస్తృత ప్రాతిపదికన జరిగాయి. ► దేశం మరింత పురోగతి సాధించడానికి కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం. వృద్ధి ప్రక్రియలో రెండు వర్గాలూ భాగాస్వాములే. ► కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం మంచిదే, కానీ... శిలాజ ఇంధన వినియోగం తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ప్రయోజనకరంగా ఉంటుందని రంగరాజన్ పేర్కొన్నారు. అయితే దేశం ఈవీల కోసం ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషించారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులు, అంశాల ప్రాతిపదికన ఉపాధి రంగంపై ఈ తీవ్ర ప్రభావం వుండే వీలుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయడ్డారు. -
AP: మూడేళ్లల్లో 34.88 శాతం పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం
సాక్షి, అమరావతి: తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది. 2021–22కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇండియా విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రొవిజనల్ గణాంకాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,07,771కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007 మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఆదుకున్న నవరత్నాలు.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఆర్థిక మందగమనం నెలకొనగా ఆ తరువాత కోవిడ్ సంక్షోభం తలెత్తింది. అయినప్పటికీ 2019 – 20 నుంచి వరుసగా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుండటం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నవరత్నాల ద్వారా వివిధ పధకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి, వస్తు వినియోగం పడిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ వివిధ పథకాల ద్వారా ప్రజల చేతికి నగదు అందించింది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించకుండా కొనసాగాయి. చాలా రాష్ట్రాలు వృద్ధిలో తిరోగమనంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో పెద్దఎత్తున మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టడంతో పాటు పేదలకు గృహ నిర్మాణాలను జోరుగా కొనసాగించడంతో మూడేళ్లుగా వృద్ధితో పాటు తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదవుతోందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. లాక్డౌన్, కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయంతో పాటు ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితంగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 17.57 శాతం పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 31,064 పెరిగింది. మూడేళ్లల్లో 34.88 శాతం పెరుగుదల గత సర్కారు దిగిపోయే నాటికి 2018 – 19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా 2021 – 22లో ఏకంగా రూ.2,07,771కి పెరిగింది. వైఎస్సార్సీపీ పాలనలో మూడేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 34.88 శాతం మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. తలసరి ఆదాయం పెరుగుదల వార్షిక సగటు వృద్ధి 11.62 శాతంగా ఉంది. మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్లను ప్రజల చేతికి పారదర్శకంగా అందించింది. సంక్షోభ సమయంలోనూ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి పేదలను ఆదుకుంది. ఉపాధి పనులు, పేదల ఇళ్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున కొనసాగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది. వీటి ఫలితంగా జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువగా నమోదైంది. డీబీటీ కీలకం జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే అధికంగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదలలో డీబీటీ (నేరుగా నగదు బదిలీ)ప్రధాన పాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ.1.65 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించింది. దీనికి తోడు నాడు – నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టడం తయారీ రంగానికి ఊతమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పురోగతి కనిపిస్తోంది. – ప్రొఫెసర్ ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర విభాగం మాజీ అధిపతి, ఆంధ్రా యూనివర్సిటీ -
'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి దాదాపు ఆరేళ్లవుతోంది. సమాంతర ఆర్థిక వ్యవస్థను అరికట్టి, నగదు రహిత లావాదేవీలను పెంచడానికి, దేశంలో నకిలీ నోట్లను కనిపించకుండా చేయడానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో అట్టహాసంగా ప్రకటించింది. పాత వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేసి, వాటికి బదులుగా కొత్తగా రెండువేలు, ఐదువందల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమన్న రీతిలో కేంద్రం ప్రకటనలు గుప్పించింది. ఇంత జరిగినా, దేశంలో నకిలీ నోట్ల చలామణీ ఇంకా జరుగుతూనే ఉంది. అంతేకాదు, నానాటికీ పెరుగుతూనే ఉంది కూడా. నకిలీ నోట్లు గత ఏడాదిలో 102 శాతం మేరకు పెరిగినట్లు సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. నకిలీ కరెన్సీ బెడద అగ్రరాజ్యాల్లో సైతం ఉంది. ఎన్ని చట్టాలు తెచ్చినా, కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా నకిలీ కరెన్సీ పుట్టుకొస్తూ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థకు చిరకాల సమస్యగా మారిన నకిలీ కరెన్సీ కథా కమామిషూ తెలుసుకుందాం. నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోట్ల ముద్రణను రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతోకాలం కొనసాగించలేదు. దాదాపు మూడేళ్లుగా వీటి ముద్రణ నిలిచిపోయింది. ఈ విషయాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం చలామణీ ఉన్న చోట్ల మొత్తం విలువలో రెండువేల రూపాయల నోట్ల వాటా 1.6 శాతం మాత్రమే. అయినా, గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది 54.16 శాతం అధికంగా రెండువేల రూపాయల నకిలీ నోట్లు చలామణీలోకి వచ్చాయి. వీటి కంటే కొంత విరివిగా ఉన్న ఐదువందల రూపాయల నోట్లు గత ఏడాది కంటే ఈ ఏడాది 101.9 శాతం అధికంగా చలామణీలోకి వచ్చాయి. ఈ సంగతిని ఆర్బీఐ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతకు ముందు ఏడాది నకిలీ కరెన్సీ చలామణీలో 190 శాతం పెరుగుదల నమోదైంది. బ్యాంకింగ్ వ్యవస్థ గుర్తించిన నకిలీ నోట్లలో 6.9 శాతం ఆర్బీఐ వద్ద బయటపడితే, మిగిలిన 93.1 శాతం నకిలీ నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా 2019లో రూ.25 కోట్ల విలువైన 2,87,404 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోగా, 2020లో రూ.92 కోట్ల విలువైన 8,34,947 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అధికారిక సంస్థలు వెల్లడించిన మొత్తంలో మాత్రమే దేశంలో నకిలీ కరెన్సీ చలామణీలో ఉందనుకుంటే పొరపాటే! దేశంలో చలామణీ అవుతున్న నకిలీ కరెన్సీకి సంబంధించిన కచ్చితమైన లెక్కలు ప్రభుత్వానికి కూడా తెలీవు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో స్వయంగా చెప్పారు. యూపీఏ ఓటమి తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశంలో నకిలీ కరెన్సీ కనిపించకుండా చేస్తానని మోదీ గంభీరంగా ప్రకటించారు. నకిలీ కరెన్సీని చలామణీ నుంచి మాయం చేయడానికేనంటూ 2016 నవంబర్ 8న ఉన్నపళాన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పటి వరకు దేశంలో చలామణీలో ఉన్న వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లు చెల్లకుండా పోయాయి. వీటిని మార్చుకోవడానికి పరిమిత గడువు విధించడంతో జనాలు బ్యాంకుల మీదకు ఎగబడ్డారు. మరోవైపు కనీస అవసరాల కోసం డబ్బులు విత్‌డ్రా చేసుకుందామనుకున్నా, ఏటీఎంల నుంచి గరిష్ఠంగా రెండువేల రూపాయల వరకు మాత్రమే తీసుకునే అవకాశం కల్పించడంతో, దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలైన్లలో జనాలు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. మెల్ల మెల్లగా పరిస్థితులు దారిలోకి వచ్చినా, దేశంలో నకిలీ కరెన్సీ కలకలం యథావిధిగా మళ్లీ మొదలైంది. నకిలీ కరెన్సీ సమస్య అంత తేలికగా వదిలించుకోగల వ్యవహారం కాదు. నకిలీ కరెన్సీ తయారీలో కొద్దిమంది స్థానికుల పాత్ర ఉంటే, చాలావరకు విదేశీ గూఢచర్య సంస్థలు, మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకల పాత్ర కూడా ఉంటోంది. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్న అగ్రరాజ్యాలకు సైతం ఈ బెడద తప్పడం లేదు. అతి పురాతన వృత్తుల్లో రెండోది నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ ప్రపంచంలోని అతి పురాతన వృత్తుల్లో రెండోది అని చరిత్రకారులు చెబుతున్నారు. కాగితపు కరెన్సీ వాడుకలోకి రాకముందు నుంచే నకిలీ కరెన్సీ తయారీ బెడద చాలా చోట్ల ఉండేది. అప్పట్లో నకిలీ నాణేలను తయారు చేసేవారు. రోమన్ సామ్రాజ్యంలోని ఆసియా మైనర్ ప్రాంతానికి చెందిన లిడియాలో క్రీస్తుపూర్వం 600 నాటికి నాణేల తయారీ తొలిసారిగా మొదలైంది. తొలినాళ్లలో బంగారు, వెండి నాణేలు వాడుకలో ఉండేవి. తర్వాతికాలంలో కంచు, రాగి వంటి తక్కువ విలువ కలిగిన లోహాల నాణేలు, ఆ తర్వాత అల్యూమినియం, నికెల్ వంటి అతిచౌక లోహాలతో తయారైన నాణేలు క్రమంగా వాడుకలోకి వచ్చాయి. నాణేలు డబ్బుగా వాడుకలోకి వచ్చి, అవి ప్రజలకు అలవాటైన తొలి రోజుల నుంచే నకిలీ నాణేల తయారీ, చలామణీ కూడా ఉండేది. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో చైనా తొలిసారిగా కాగితపు కరెన్సీ తయారు చేయడం మొదలుపెట్టింది. చైనాలో అప్పట్లో కరెన్సీ నోట్ల తయారీకి మల్బరీ కలపను ఉపయోగించేవారు. అందువల్ల మల్బరీ అడవులకు కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసేవారు. నకిలీ కరెన్సీ తయారు చేసేవారికి అప్పట్లో పలుదేశాల్లో మరణదండన విధించేవారు. అయినా నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ కొనసాగుతూనే ఉండేది. పదమూడో శతాబ్దికి చెందిన ఇటాలియన్ రచయిత డాంటే తొలిసారిగా నకిలీ కరెన్సీ ఉదంతాన్ని గ్రంథస్థం చేశాడు. అప్పట్లో ఇటలీలో చలామణీలో ఉన్న ‘ఫ్లోరినో’ అనే బంగారు నాణేలకు నకిలీలు సృష్టించిన మాస్ట్రో ఆడమో అనేవాణ్ణి ఉరితీసిన సంఘటనను డాంటే తన పుస్తకంలో వివరంగా రాశాడు. నకిలీ కరెన్సీకి సంబంధించి చరిత్రలో నమోదైన తొలి ఉదంతం ఇదే! మన దేశంలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికే నకిలీ నాణేల బెడద ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వీటిని ‘కూట నాణేలు’గా పేర్కొన్నాడు. శత్రురాజ్యాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసి, వాటిని లొంగదీసుకునే ఉద్దేశంతో అప్పటి గూఢచర్య వ్యవస్థలు కూట నాణేలను సాధనంగా ఉపయోగించుకునేవి. క్రీస్తుపూర్వం నాటి ఆ పద్ధతి ఇప్పటికీ మారలేదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన దేశంలోకి ఏటా వచ్చిపడుతున్న నకిలీ కరెన్సీ కట్టల్లో పాకిస్తానీ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ హస్తం ఉంటోందనే విషయమై లెక్కలేనన్ని కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్త సమస్య నకిలీ కరెన్సీ ప్రపంచవ్యాప్త సమస్య. నకిలీ కరెన్సీ బెడదను అరికట్టడానికి ప్రతిదేశం తను అధికారికంగా ముద్రించే కరెన్సీలో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేసుకుంటూనే ఉంటుంది. అయినా, నకిలీ నిపుణులు వాటికి దీటుగా నకిలీ కరెన్సీని చాపకింద నీరులా చలామణీలోకి తెస్తూనే ఉంటారు. ప్రపంచంలో విరివిగా నకిలీలకు గురయ్యే కరెన్సీ అమెరికన్ డాలర్. ఆ తర్వాత ఇదే వరుసలోకి బ్రిటన్ పౌండ్, యూరోప్ దేశాల ఉమ్మడి కరెన్సీ యూరో వస్తాయి. అత్యధిక శాతం నకిలీలకు లోనయ్యే ఘనత మెక్సికన్ పెసోకు దక్కుతుంది. 9.91 కోట్ల మెక్సికన్ పెసో నోట్లలో కనీసం 3 లక్షల నకిలీ నోట్లు ఉంటాయంటే, మెక్సికోలో నకిలీ కరెన్సీ బెడద ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, పోలండ్, పోర్చుగల్, జాంబియా, కొలంబియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ నకిలీ కరెన్సీ బెడద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడే వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ, కట్టుదిట్టమైన చట్టాలను దాదాపు అన్ని దేశాలూ చట్టాలను రూపొందించుకున్నాయి. భారత్ సహా చాలా దేశాల్లో నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడితే, గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష వరకు పడే అవకాశాలు ఉంటాయి. చట్టాల్లో ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా, నకిలీ కరెన్సీ బెడద మాత్రం తగ్గడమే లేదు. అనాయాసంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు నకిలీ కరెన్సీ తయారీని ఒక మార్గంగా ఎంచుకుంటారు. సాధారణంగా ఇలాంటి వాళ్లు తయారు చేసే నకిలీ కరెన్సీ అంత నాణ్యంగా ఉండదు. అందువల్ల ఇలాంటి వాళ్లు పోలీసులకు దొరికిపోతుంటారు. గూఢచర్య సంస్థల అండతో కొన్ని ముఠాలు పకడ్బందీగా నకిలీ నోట్లు తయారు చేస్తుంటాయి. శత్రుదేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వాటి లక్ష్యం. ఇలాంటి అధికారిక అండదండలతో తయారయ్యే నకిలీ నోట్లు దాదాపు అసలు నోట్లను పోలి ఉంటాయి. ఇవి నాణ్యతలో అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోవు. వీటిని గుర్తించడమూ కష్టమే. ఇంకోవైపు అంతర్జాతీయ మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకలు కూడా నకిలీ కరెన్సీ తయారీలోను, వ్యాప్తిలోను ఇతోధిక పాత్ర పోషిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ సైన్యం ‘ఆపరేషన్ బెర్న్‌హార్డ్’ పేరిట భారీ ఎత్తున నకిలీ అమెరికన్ డాలర్లు, బ్రిటన్ పౌండ్లు ముద్రించింది. ఆ నోట్ల కట్టలను నిర్ణీత దేశాలకు నిర్దేశిత సమయానికి చేర్చలేకపోవడంతో చరిత్రల అదో విఫలయత్నంగా మిగిలిపోయింది. అమెరికా–సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో అప్పటి సోవియట్ గూఢచర్య సంస్థ ఇబ్బడి ముబ్బడిగా అమెరికన్ డాలర్లకు నకిలీలను ముద్రించి, అమెరికన్ మార్కెట్లోకి సరఫరా చేసేది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరచుగా మన భారత్ రూపాయలకు, బంగ్లాదేశ్ టాకాలకు నకిలీలను ముద్రించి, రెండు దేశాల్లోకి చేరవేస్తూ వస్తోంది. ఇలా ఒక దేశంలోకి మరో దేశం నకిలీ సరఫరా చేయడం తరతరాలుగా సాగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలేవీ ఈ సమస్యను అరికట్ట లేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, అధునాతన ముద్రణ యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాక నకిలీ కరెన్సీ తయారీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడుతున్న ముఠాలు కూడా ఉంటున్నాయంటే, పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మనకు వచ్చిన నోట్లలో ఏవైనా నకిలీవి ఉన్నట్లు అనుమానం వస్తే, వాటిని ఏ బ్యాంకుకైనా తీసుకు వెళ్లవచ్చు. బ్యాంకు సిబ్బంది వాటిని పరిశీలించి, అసలువో నకిలీవో చెబుతారు. ఒకవేళ నకిలీ నోటు అయితే, బ్యాంకు సిబ్బంది ఆ నోటును తీసుకుని, దాని విలువ తెలుపుతూ ఒక రసీదు ఇస్తారు. నకిలీ నోటు మనకు ఎవరి వద్ద నుంచి వచ్చిందో, వారికి ఆ రసీదు చూపించి, ఇచ్చినది నకిలీ నోటని చెప్పవచ్చు. అయితే, ఆ రసీదుకు ఎలాంటి మారక విలువ ఉండదు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేటప్పుడు అక్కడి యంత్రాలు గాని, సిబ్బంది గాని నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకుంటారు. అయితే, లావాదేవీలో దాని విలువ శూన్యం. ఒకసారి డిపాజిట్ చేసిన నగదులో నాలుగు లేదా అంతకు మించిన సంఖ్యలో నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులను ఆప్రమత్తం చేస్తారు. ఐదు లేదా అంతకు మించి నకిలీ నోట్లు వస్తే, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కేసు పెడతారు. కరెన్సీ కట్టుదిట్టాలు నకిలీ కరెన్సీ చలామణీలోకి రాకుండా ఉండేందుకు దాదాపు ప్రతిదేశం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అంత తేలికగా ఎవరూ నకిలీలు తయారు చేయలేని రీతిలో అధికారిక కరెన్సీని రూపొందిస్తుంది. అధికారిక కరెన్సీ రూపకల్పనలో ఎప్పటికప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది. మన దేశం కూడా కరెన్సీ రూపకల్పనలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం మన కరెన్సీలో నకిలీలను కట్టడి చేసేందుకు పొందుపరచిన ముఖ్యాంశాలు ఏమిటంటే... సెక్యూరిటీ త్రెడ్: మన దేశంలో పాత నోట్లలో కూడా సెక్యూరిటీ త్రెడ్ ఉండేది. కొత్తగా 2016 నుంచి చలామణీలోకి తెచ్చిన రెండువేలు, ఐదువందలు, వంద రూపాయలు సహా అన్ని నోట్లలోనూ ఈ సెక్యూరిటీ త్రెడ్‌ను మరింత కట్టుదిట్టంగా రూపొందించారు. వెలుతురులో పెట్టి చూస్తే, ఈ సెక్యూరిటీ త్రెడ్ సన్నని గీతలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనిపై హిందీ ‘భారత్’ అనే చిన్న అక్షరాలు కనిపిస్తాయి. అసలు నోట్లను గుర్తించడంలో సెక్యూరిటీ త్రెడ్ మొదటి అంశం. సెక్యూరిటీ త్రెడ్ మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని 45 డిగ్రీల కోణంలో చూస్తే నీలిరంగులో కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఇలా రంగు మార్పు కనిపించదు. వాటర్ మార్క్: మహాత్మాగాంధీ బొమ్మతో చలామణీలో ఉన్న ప్రతి నోటుపైనా మహాత్మాగాంధీ బొమ్మ వాటర్ మార్క్ ఉంటుంది. నోటుపై సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఆర్బీఐ ముద్ర ఉంటాయి. ఆ పక్కనే ఖాళీగా కనిపించే భాగాన్ని వెలుగులో చూస్తే, అందులో మహాత్మాగాంధీ బొమ్మ వాటర్ మార్క్ కనిపిస్తుంది. గాంధీ వాటర్ మార్క్ బొమ్మ పక్కనే నోటు విలువ తెలిపే సంఖ్య వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంది. సీత్రూ రిజిస్టర్: రూ. 500 నోటుకు ఎడమవైపు 500 సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అనేలా కనిపిస్తుంది. దీనికి సరిగ్గా వెనుక భాగంలోనూ అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే, 500 సంఖ్య పూర్తిగా కనిపిస్తుంది. రూ.2000 నోటులోనూ కనిపించే ఈ సెక్యూరిటీ ఫీచర్‌నే సీత్రూ రిజిస్టర్ ఫీచర్ అంటారు. న్యూ నంబరింగ్ ప్యాటర్న్: నోటుకు కుడివైపున కింది భాగంలో ముద్రించి ఉండే సంఖ్యలో 2015 నుంచి ఒక సెక్యూరిటీ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఎడమ నుంచి కుడివైపు చూస్తున్నప్పుడు ఆ సంఖ్య సైజు పెరుగుతుంది. అయితే, సంఖ్యకు ముందు ఉండే మూడు ఇంగ్లిష్ అక్షరాల సైజు మాత్రం పెరగదు. ఈ సంఖ్య ఏ రెండు నోట్లకు ఒకేలా ఉండదు. ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్: నోటుకు కుడివైపున ఆర్బీఐ చిహ్నం, అశోక స్తంభానికి మధ్యలో నోటు విలువ తెలిపే సంఖ్య ఉంటుంది. కంటికి ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కంటికి సమాంతరంగా పట్టుకున్నప్పుడు నీలం రంగులోకి మారి కనిపిస్తుంది. ఈ సంఖ్య ముద్రణకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వాడుతారు. అలాగే, నోటుకు కుడివైపు చివరి భాగంలో రైజ్డ్ ప్రింటింగ్‌లో చిన్న గుర్తు కనిపిస్తుంది. ఇలా రైజ్డ్ ప్రింటింగ్‌లో రూ.2000 నోటుపై దీర్ఘ చతురస్రం, రూ.500 నోటుపై వృత్తం, రూ.100 నోటుపై త్రిభుజం, రూ.50 నోటుపై చతురస్రం, రూ.20 నోటుపై నిలువుగా ఉండే దీర్ఘ చతురస్రం ఉంటాయి. దృష్టి లోపాలు ఉన్నవారు నోటు విలువను సులువుగా తెలుసుకునేందుకు చేసిన మరో ఏర్పాటు ఇది. నోటు వెనుక వైపు: నోటు వెనుకవైపు తిప్పి చూస్తే, ఎడమవైపు మధ్య భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం, దాని పక్కన కింది భాగంలో స్వచ్ఛ భారత్ చిహ్నం, నినాదం ఉంటాయి. దాని పక్కన లాంగ్వేజ్ ప్యానెల్లో తెలుగు సహా పదిహేను భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది. కుడివైపు చివరి భాగంపైన నోటు విలువ సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది. రూ.2000 నోటుపై మంగళయాన్, రూ.500 నోటుపై ఎర్రకోట, రూ.200 నోటుపై సాంచీ స్థూపం, రూ.100 నోటుపై రాణీ కా వావ్ చిత్రాలు ఉంటాయి. ఇంటాగ్లియో ప్రింటింగ్: నోటుకు మధ్యలో మహాత్మగాంధీ బొమ్మ, ఆర్బీఐ ముద్ర, కుడివైపున అశోక స్తంభం ఉంటాయి. వీటితో పాటు నోటుకు ఇరువైపులా బ్లీడ్ లైన్స్‌ను ప్రత్యేక విధానంలో ముద్రిస్తారు. ఈ విధమైన ముద్రణను ఇంటాగ్లియో ప్రింటింగ్ అంటారు. ఇలా ముద్రించిన నోట్లను తాకుతున్నప్పుడు ఉబ్బెత్తుగా చేతికి తగులుతాయి. రూ.100 నుంచి రూ.2000 వరకు విలువ గల నోట్లపై ఇది కనిపిస్తుంది. మైక్రో లెటరింగ్: ప్రతి నోటులోనూ మహాత్మాగాంధీ బొమ్మకు, దాని పక్కనే ఉన్న నిలువుగీతకు మధ్య ‘ఆర్బీఐ’ అనే అతి చిన్న అక్షరాలు కనిపిస్తాయి. భూతద్దం సాయంతో వీటిని స్పష్టంగా చూడవచ్చు. లాటెంట్ ఇమేజ్: నోటు ఎడమవైపు కింది భాగంలో ఒక బొమ్మ కనిపిస్తుంది. దీనిని లాటెంట్ ఇమేజ్ అంటారు. లాటెంట్ ఇమేజ్ అంటే దాగి ఉన్న బొమ్మ. ఈ బొమ్మ లోపల ఏముందో మామూలుగా చూస్తే కనిపించదు. కంటి ఎదుట సమాంతరంగా ఉంచి, వెలుతురులో పెట్టి చూస్తే, అందులో నోటు విలువ అంకెల్లో కనిపిస్తుంది. ఇది 2005 తర్వాత వచ్చిన వంద రూపాయలు, అంతకు పైబడిన విలువ కలిగిన ప్రతి నోటులోనూ ఉంటుంది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రముఖులు ఏమంటున్నారంటే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా రెపోరేటు ఎందుకు పెంచుతున్నామనే కారణాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. ►పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత, సప్లై చైన్‌లో సమస్యలు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ►భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి ఎకానమీ అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆయా అంశాల పట్ల జాగరూకత అవసరం. ద్రవ్యోల్బణం సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ►ఈ రోజు రెపో రేటును పెంచాలనే నిర్ణయం మే 2020 తరువాత తొలి ‘యూ’ టర్న్‌గా పరిగణించవచ్చు. గత నెలలో మేము సరళతర ద్రవ్య విధానాన్ని క్రమంగా ఉపసంహరించుకునే వైఖరిని వ్యక్తపరిచాము. ఆ చర్యకు అనుగుణంగానే నేటి చర్యను చూడాలి. ►ద్రవ్య విధాన చర్య ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించడం, ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులోనికి తేవడం లక్ష్యంగా ఉందని నేను స్పష్టం చేయదలచుకున్నాను. అధిక ద్రవ్యోల్బణం వృద్ధికి హానికరం. ►ఆగస్ట్ 2018 తర్వాత పాలసీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. ఇది కార్పొరేట్లకు, వ్యక్తులకు రుణ వ్యయాలను పెంచే అవకాశం ఉంది. తాజా ఆశ్చర్యకరమైన పెంపు మే 2020నాటి కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి తీసుకున్న పాలసీ చర్యకు (రేటును 4 శాతం కనిష్టానికి తగ్గించడం) భిన్నమైనది. ►ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి సరళతర ద్రవ్య విధానాన్ని ఉపసంహరించుకుంటూనే, అదే సమయంలో అవసరమైతే సరళతరం వైపు మొగ్గుచూపే అవకాశాలవైపు దృష్టి సారించడాన్ని ఆర్బీఐ కొనసాగిస్తుంది. ►దేశీయ సరఫరాల పరిస్థితి బాగున్నప్పటికీ, అంతర్జాతీయంగా గోధుమల కొరత.. దేశీయ గోధుమ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇది ద్రవ్యోల్బణం సవాళ్లను పెంచుతోంది. ►రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగవచ్చు. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేశానికి మంచి మార్కెట్ అవకాశాలను తెస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితుల్లోనూ భారత్ స్థిరంగా, సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో నిలబడుతోంది. ద్రవ్యోల్బణంపై సీరియస్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాజా పాలసీ స్పష్టం చేస్తోంది. ద్రవ్యోల్బణం సమస్య వేళ్లూనుకునే పరిస్థితిని తలెత్తబోనీయమని స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా నిర్ణయం ఎకానమీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు బలాన్నిస్తుంది. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ డిపాజిట్, రుణ రేట్లు క్రమంగా పెరుగుతాయి. – ఉదయ్ కోటక్, ప్రముఖ బ్యాంకర్ హౌసింగ్‌కు ప్రతికూలమే... రెపో రేటు దిగువ స్థాయిలో ఉంటే, రియల్టీకి అది మేలు చేస్తుంది. మహమ్మారి సమయంలో సరళతర విధానం హౌసింగ్ రంగానికి సానుకూలత అందించింది. తాజా ఆర్బీఐ నిర్ణయం రియల్టీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. హౌసింగ్ డిమాండ్‌కు ఇది ప్రతికూలమే. – హర్ష్ వర్దన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ బిజినెస్ సెంటిమెంట్‌కు దెబ్బ రెపో రేటు, సీఆర్ఆర్ పెంపు ఒకవైపు బిజినెస్ సెంటిమెంట్‌ను, మరోవైపు కొనుగోలుదారు వినియోగ శక్తిని దెబ్బతీస్తుం ది. కరోనా వైరస్ ప్రభావాల నుంచి ఇప్పటికీ తేరుకోని ఎకానమీపై తాజా ఆర్బీఐ నిర్ణయం ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతకు తగిన చర్యలు తీసుకుంటామన్న ఆర్బీఐ ప్రకటన హర్షణీయం.–ప్రదీప్ ముల్తానీ, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ఆటోకు బ్రేకులు... ఆటోమొబైల్ రంగంలో రుణాలు వ్యయభరితం అవుతాయి. అధిక వెయిటింగ్ పిరియడ్ వల్ల పాసింజర్ వాహన విక్రయాలపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, ద్విచక్ర వాహన రంగం మాత్రం రేటు పెంపు ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అధిక ఇంధన ధరలకుతోడు తాజా రెపో రేటు పెంపు ప్రభావం చూపుతాయి – వికేశ్, గులాటి, ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ చదవండి👉నాలుగేళ్ల తర్వాత..ఆర్బీఐ భారీ షాక్!, సామాన్యులపై వడ్డీరేట్ల పిడుగు! -
Telangana: ఎగసిన జల.. లక్ష్మీ కళ
సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు, వ్యవసాయంపై గత ఏడేళ్లలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాష్ట్రానికి లక్ష్మిని తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం 2014–15లో రూ. 5.50 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ 2021–22లో రెట్టింపై రూ. 11.54 లక్షల కోట్లకు పెరిగింది. వ్యవసాయం, అను బంధ రంగాల్లో సాధించిన వృద్ధి జీఎస్డీపీ పెరుగుదలకు దోహదపడింది. ఈ రంగాల ఉత్పత్తి విలువ రూ. 90,828 కోట్ల నుంచి రూ. 2,16,285 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సైతంరూ. 2,78,933కు పెరిగింది. జీఎస్డీపీ వృద్ధిలో ఏటా ఒక రాష్ట్రాన్ని అధిగమిస్తూ రాష్ట్రం పురోగమిస్తోంది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదులపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన వెంటనే నదుల పునరుజ్జీవం, చెరువుల పునరుద్ధరణను సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశంగా చేపట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన 46 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించడంతో 25 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 25 లక్షల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు లభిస్తోందని హరీశ్‌రావు చెప్పారు. గతంలో భారీ వర్షాలకు చెరువులు తెగిప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని, మిషన్ కాకతీయ కింద చెరువు కట్టలు, తూ ములు, అలుగులను పటిష్టం చేయడంతో అలాంటి ఘటనలు జరగడం లేదన్నారు. వా గులు, వంకల్లోని నీళ్లు వృథా కాకుండా రూ. 6 వేల కోట్లతో రాష్ట్రంలో 4 వేల చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి వర్షపు చుక్కను చెరువులు ఒడిసి పట్టుకుంటున్నాయని, చెక్డ్యాముల్లో ఏడాదంతా నీళ్లు నిల్వ ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గోదావరిపై 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 5 రిజర్వాయర్లను నిర్మించడంతో 300 కి.మీల జీవనదిగా మారిందని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లను వెనక్కి తీసుకొచ్చి నదికి కొత్త నడకను సీఎం కేసీఆర్ నేర్పారని ప్రశంసించారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేం ద్రసింగ్ ఆలోచనల్నే సీఎం కేసీఆర్ అమలు చేశారని వివరించారు. ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులకు ఏళ్లు పడుతున్నాయని, ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో రైతు ఆత్మహత్యలు కనుమరుగు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతుబంధు, సాగునీరు, కరెంట్ సదుపాయంతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జల సంరక్షణకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు సదస్సు చివరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేశారు. మూడేళ్లలో మూసీలో తాగునీళ్లు... మూసీ నది ప్రక్షాళన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఎస్టీపీల నిర్మాణం, మురుగు కాల్వ మళ్లింపు పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గోదావరి నీళ్లను సైతం మూసీకి తరలిస్తున్నామన్నారు. రెండు, మూడేళ్లలో మూసీలో స్వచ్ఛమైన తాగునీళ్లను చూస్తామన్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేయగా హరీశ్‌రావు ఈ మేరకు హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన మూసీ నది ఒడ్డున మూడేళ్ల తర్వాత రాజేంద్రసింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో జలవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాజేంద్రసింగ్ ఈ అంళాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దేశంలోని నదులన్నీ ఐసీయూలో..: రాజేంద్రసింగ్ గంగ, యమున, మూసీ సహా దేశంలోని నదులన్నీ ఐసీయూలో ఉన్నాయని, వాటి పరిరక్షణకు అధిక చొరవ తీసుకోవాల్సిన అవసరముందని రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. దేశంలో ఒక్క నది కూడా ఆరోగ్యంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కళ్లలో నీళ్లున్నాయని, నీళ్లపై లక్ష్మిని ఖర్చు పెడుతున్నారని అభినందించారు. -
India GDP: వృద్ధి జోరులో మనమే టాప్..!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని మంగళవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ ప్రభావం లేకపోతే ఎకానమీ మరింత పురోగమించేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యూ2లో 7.9 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా అధికంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. వివిధ సంస్థలు, రేటింగ్ సంస్థల అంచనాలు సైతం 7.8 శాతం నుంచి 8.3 శాతం శ్రేణిలోనే ఉన్నాయి. మరోవైపు రెండవ త్రైమాసికంలో ఈ స్థాయి గణాంకాల నమోదుకు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్ ప్రధాన (బేస్ ఎఫెక్ట్) కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సవాళ్లతో అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. విలువల్లో ఇలా... తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువ రూ.35.73 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.32.96 లక్షల కోట్లు. వెరసి ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కోవిడ్–19 సవాళ్లు దేశంలో ప్రారంభంకాని 2019–20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎకానమీ విలువతో పోల్చి చూస్తే, ఎకానమీ విలువ స్వల్పంగా 0.33 శాతం అధికంగా నమోదయ్యింది. కాగా, ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువలు రూ.59.92 లక్షల కోట్ల నుంచి (2020–21 తొలి ఆరునెలల్లో) రూ.68.11 లక్షల కోట్లకు (13.7 శాతం వృద్ధి) పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 15.9 శాతం క్షీణత నమోదయ్యింది. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦తాజా సమీక్షా నెల్లో ప్రభుత్వ వ్యయాల్లో 8.7% వృద్ధి నమోదవడం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, పెరిగిన వినియోగం ఎకానమీ లో సానుకూలతను సృష్టించాయి. ♦తగిన వర్షపాతంలో జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦దేశీయ డిమాండ్, ఎగుమతులు పెరగడంతో తయారీ రంగంలో 5.5 శాతం పురోగతి నమోదయ్యింది. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం అయితే, అందులో తయారీ రంగం వాటానే దాదాపు 78 శాతం. ♦నిర్మాణం, ట్రేడ్, హోటల్స్ రవాణా, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో 7 నుంచి 8 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. ♦ప్రభుత్వ సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ రంగాల్లో 17.4 శాతం వృద్ధి నమోదుకావడం సానుకూల పరిణామం. ♦ఇక ఉత్పత్తి స్థాయి వరకూ లెక్కించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో వృద్ధి రేటు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 8.5 శాతంగా నమోదయ్యింది. ♦కాగా, జూలై–సెప్టెంబర్ మధ్య చైనా వృద్ధి రేటు 4.9 శాతం. 2021–22పై అంచనాలు ఇలా... గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) కరోనా సవాళ్లతో ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021–22లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎకనమిక్ సర్వే పేర్కొంది. అయితే అటు తర్వాత ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్ దేశాన్ని కుదిపివేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6% శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. క్యూ3లో 6.8%, క్యూ4లో 6.1% వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమీక్ష పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) మంగళవారం ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనా వేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8% ఉంటుందని విశ్లేషించింది. రెండంకెల వృద్ధి దిశగా... భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తోంది. డిమాండ్‌లో గణనీయ వృద్ధి, బ్యాంకింగ్ రంగం పురోగతి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్రితం త్రైమాసికాల్లో దాదాపు 6 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, సెప్టెంబర్ వరకూ గడచిన త్రైమాసికాల్లో వృద్ధి రేటు 13.7 శాతం నమోదుకావడం హర్షణీయ పరిణామం. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 7 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. కేంద్రం చేపడుతున్న రెండవ తరం ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహపడతాయని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణ భారాల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మూలధన వ్యయాల పెంపునకు కృషి జరుగుతుంది. – కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
రూల్స్ ఉల్లంఘన.. ఎస్బీఐకు భారీ పెనాల్టీ
RBI Impose Penalty To SBI: భారతీయ బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. రుణగ్రహీత కంపెనీల్లో ఆ కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో షేర్లను కలిగి ఉందన్న కారణంతో ఎస్బీఐకు ఈ జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 19 సబ్ సెక్షన్ 2 ప్రకారం.. నవంబర్ 26న ఈ పెనాల్టీ విధించింది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏ బ్యాంక్ కూడా 30 శాతం కంటే ఎక్కువ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌ను కలిగి ఉండడానికి వీల్లేదు. చదవండి: ఆర్బీఐ మార్గదర్శకాలు.. కేరళ సర్కార్ అసంతృప్తి ఈ మేరకు 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్బీఐ సూపర్వైజరీ ఎవాల్యుయేషన్ (ఐఎస్ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో ఈ విషయం బయటపడింది. దీంతో ఎస్బీఐకు షోకాజ్ నోటీసు జారీ చేసింది ఆర్బీఐ. అయితే బ్యాంక్ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే షేర్ మార్కెట్లో ఎస్బీఐ నష్టాల బాటలో పయనిస్తోంది. -
దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బైటపడ్డ ఐఓబీ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏఎఫ్) నుంచి ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) బయటపడింది. బ్యాంక్ లావాదేవీలు, వ్యవస్థాగత, పాలనాపరమైన అంశాలకు సంబంధించి ఐఓబీ మెరుగైన ఫలితాల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. కనీస మూలధన నియమావళిని అనుసరించాలని కూడా ఐఓబీకి ఆర్బీఐ సూచించింది. 2015 నుంచీ ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో ఉంది. ఈ నెల ప్రారంభంలో యుకో బ్యాంక్‌ను ఈ పరిధి నుంచి ఆర్బీఐ తొలగించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇంకా పీసీఏ పరిధిలోనే కొనసాగుతుండడం గమనార్హం. కాగా ఐఓబీ 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.831 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. షేర్ మార్కెట్ ముగిసిన తర్వాత ఐఓబీ దిద్దుబాటు చర్యల చట్రం పరిధి నుంచి బయటకు వచ్చిన ప్రకటన వెలువడింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో బుధవారం ఐఓబీ షేర్ ధర 0.49 శాతం పెరిగి 20.45 వద్ద ముగిసింది. చదవండి: అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అయితే, అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఇందులో బ్యాంకుకు చెందిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల మీపై నేరుగానే ప్రభావం పడే అవకాశముంది. అందుకే, అక్టోబర్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారబోతున్నాయో తెలుసుకోండి.(చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ!) ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఖాతాదారుల చెక్‌బుక్‌లు అక్టోబర్ 1 నుంచి చెల్లవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అప్రమత్తం చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు పీఎన్బీ బ్రాంచీ నుంచి కొత్త చెక్‌బుక్స్ పొందాల్సి ఉంటుంది అని తెలిపింది. అప్ డేట్ చేసిన ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌తో కూడిన పీఎన్బీ చెక్‌బుక్స్ అక్టోబర్ 1, 2021 నుంచి చెల్లుబాటు అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తప్పనిసరి చేసిన కొత్త నిబందనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. అక్టోబర్ 1 నుంచి 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు దేశంలోని సంబంధిత హెడ్ పోస్ట్ ఆఫీసు "జీవన్ ప్రమాణ్ సెంటర్స్"లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే డిజిటల్ ఫార్మాట్లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటించినట్లుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ స్థూల వేతనంలో 10 శాతం ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ
ముంబై: ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా నాణేల చెలామణీపై బ్యాంకులకు ప్రోత్సహకాలు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రటించింది. ఇప్పటి వరకూ బ్యాగ్‌కు రూ.25 ప్రోత్సాహకం ఉంటే దీనిని రూ.65కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. గ్రామీణ, చిన్న స్థాయి పట్టణాల విషయంలో అదనంగా మరో రూ.10 ప్రోత్సాహకంగా లభిస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. నాణేల పంపిణీ విషయంలో తమ బిజినెస్ కరస్పాండెంట్ల సేవలను మరింత వినియోగించుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. చదవండి : బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.55 శాతం -
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
ముంబై ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 48 » పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్(సివిల్)–24, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)–24. » జూనియర్ ఇంజనీర్(సివిల్): అర్హత: 65 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/55 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. » వయసు: 01.02.2021 నాటికి 20–30ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1991– 01.02.2021 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్): అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/55శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. » వయసు: 01.02.2021 నాటికి 20–30ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1991 –01.02.2021 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » ఎంపిక విధానం: ఆన్లైన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. » పరీక్షా విధానం: ఆన్లైన్ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ఈ పరీక్ష ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు. » లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్(ఎల్పీటీ): ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఎల్పీటీకి ఎంపిక చేస్తారు. జోన్ ఆధారంగా అఫీషియల్/లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.02.2021 » పరీక్ష తేది: 08.03.2021 » వెబ్సైట్: www.rbi.org.in -
మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు
న్యూఢిల్లీ: బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. కోవిడ్–19 లాక్డౌన్, ఆంక్షల మూలంగా ఆర్థికవ్యవస్థ మందగించిందని, ఏప్రిల్– జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 24 శాతం లోటు నమోదైందని కేంద్రం, ఆర్బీఐల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభావితవర్గాలకు సహాయపడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి ఆర్నెళ్ల పాటు లోన్ల వాయిదాలపై కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఇది ఆగస్టు 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో మారటోరియంను రెండేళ్లు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం... అత్యున్నత న్యాయస్థానానికి తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిస్తుల్లో వడ్డీ కలిపే ఉంటుందని, వాటి వసూలు వాయిదా వేసినందున బ్యాంకులు వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం కాలంలో వడ్డీ వేయకుండా కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించాలని ఆగ్రావాసి గజేంద్ర శర్మ తన పిటిషన్లో కోరారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్న అంశాన్ని బుధవారం విచారిస్తామని సుప్రీం పేర్కొంది. కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో అఫిడవిట్‌ను దాఖలు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. తమకు ఆ అఫిడవిట్ ఇంకా అందలేదని కోర్టు తెలుపగా... బెంచ్ అఫిడవిట్‌ను పరిశీలించాలని, రెండు మూడు రోజుల తర్వాత విచారణ జరిపినా, బుధవారమే విచారణకు స్వీకరించినా నష్టమేమీలేదని మెహతా అన్నారు. వడ్డీపై వడ్డీ అంశాన్ని కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకర్లు కలిసి పరిశీలించే అవకాశమివ్వాలన్నారు. మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. వాయిదా వేసిన కిస్తులపై వడ్డీని మాఫీ చేయడం ఆర్థిక సహజసూత్రాలకు విరుద్ధమని కేంద్రం తెలిపింది. ఒకవేళ వడ్డీ మాఫీ చేస్తే... క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన వారికి అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. -
భారీ డివిడెండ్‌కు ఆర్బీఐ ఆమోదం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పలు కీలక చర్యలు చేపట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.57,128కోట్ల డివిడెండ్‌ను ఆమోదించింది. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో చర్చించారు. బ్యాంక్‌ల పనితీరుపై ఆర్బీఐ అధికారులు అధ్యయనం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు బీ.పీ.కనుంగో, మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రాతా పాట్రా, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబసీష్ పాండా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటుపై దృష్టి సారించాలని ఆర్బీఐ తెలిపింది. -
కోవిడ్-19 ఎఫెక్ట్ : ఆభరణాలపై 90 శాతం రుణాలు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కష్టకాలంలో కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ సడలింపు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు బంగారు ఆభరణాల తనఖాపై ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు బంగారం విలువలో 75 శాతం మించకుండా రుణాలు జారీ చేస్తున్నాయి. కోవిడ్-19 కుటుంబ ఆదాయాలపై పెను ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ తరహా రుణాలకు రుణ విలువ నిష్పత్తి (ఎల్టీవీ)ని 90 శాతం వరకూ పెంచాలని నిర్ణయించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఎల్టీవీ పెంపుతో బ్యాంకులు బంగారు ఆభరణాలపై అధిక మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగింది. గోల్డ్ లోన్లు జారీ చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఈ నిర్ణయం సానుకూల పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాలయ వరకూ రుణం పొందవచ్చు. అయితే బంగారం విలువలో అధిక మొత్తం రుణంగా పొందితే వడ్డీ భారం కూడా అదేస్ధాయిలో పెరుగుతుందనేది గమనార్హం. కాగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంవద్దే కొనసాగనుంది. చదవండి : కీలక వడ్డీ రేట్లు యథాతథం -
ఆర్బీఐపై అమిత్ షా ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఆర్బీఐ సహాయం ద్వార దేశ ఆర్థిక రంగం కుదుటపడే అవకాశం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. కాగా నాబార్డ్‌కు రూ.25 వేల కోట్లు, ఎస్ఐడీబీఐకి 15 వేల కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 50 వేల కోట్లు కేటాయిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీఐ సహాయం ద్వారం దేశంలో రైతులకు, గ్రామీణా ప్రాంత ప్రజలకు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా లాక్డౌన్ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
జనవరి 1 నుంచి పాత ఎస్బీఐ కార్డులు పనిచేయవు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. ఈ నెల 31 లోపు ఎస్బీఐ ఖాతాదారులు తమ హోమ్ బ్రాంచీల్లో మ్యాజిస్టిక్ స్ట్రిప్ డెబిట్ కార్డ్, పాత కార్డ్‌ల స్థానంలో ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ఉన్న ఖాతాదారులు ఆన్లైన్లో కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే పాన్ లేదా ఫామ్ 60లను అప్డేట్ చేయని ఎస్బీఐ ఖాతాదారుల కార్డ్‌లను ఎస్బీఐ డీయాక్టివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఆర్థిక మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు’
సాక్షి, అమరావతి : ఆర్థిక మోసాలకు పాల్పడే వారికి సకాలంలో శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రిజర్వు బ్యాంకుకు సంబంధించి 17వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మోసాలకు పాల్పడే నకిలీ చిట్‌పండ్ కంపెనీలు, ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలపై సకాలంలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక మోసాలను ఆరికట్టేందుకు సంబంధిత కేంద్ర, రాష్ట్ర విభాగాలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్ కంపెనీల్లో ప్రజలు పొదుపు చేసే సొమ్ముకు భరోసాగా నిలబడాలని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే రీతిలో వివిధ ఆర్థిక సంస్థలు జారీ చేసే ప్రకటనలను నిరంతరం పరిశీలించడంతోపాటు.. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో రిజర్వు బ్యాంకు రీజనల్ డైరెక్టర్ సుభ్రతా దాస్, ఆర్థిక, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ ఎస్ రావత్, కిశోర్, కేంద్ర రాష్ట ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. -
టోకు ధరలు.. అదుపులోనే!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో యథాతథంగా జూలై తరహాలోనే 1.08 శాతంగా కొనసాగింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత 4% దిగువన కొనసాగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో దఫా రెపో రేటు కోతకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఆరి్థక వృద్ధి మందగమనం, పారిశ్రామిక రంగం నత్తనడక వంటి అంశాల నేపథ్యంలో మరో దఫా రేటు కోత తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా ఆగస్టు గణాంకాలను చూస్తే, ఆహార ఉత్పత్తుల ధరలు కొంత పెరిగినా, తయారీ రంగంలో ఉత్పత్తుల ధరలు మాత్రం అసలు (జీరో) పెరగలేదు. ఫుడ్ ఆరి్టకల్స్ ధరలు జూలైలో 6.15 శాతం ఉంటే, ఆగస్టులో 7.67 శాతానికి ఎగశాయి. కూరగాయల ధరలు 10.67 శాతం నుంచి 13.07 శాతానికి ఎగశాయి. కాగా ఇంధనం, ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ ధర 4 శాతం పెరిగింది. -
నకిలీ నోటు.. ఇట్టే కనిపెట్టు
కొత్త కరెన్సీ రాకతో ఏ నోటు అసలో.. ఏది నకిలీనో తేల్చుకోలేకపోతున్నాం. మార్కెట్లు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో జరిపే లావాదేవీల్లో నోటు సంగతి బయటపడకున్నా.. బ్యాంక్‌కు వెళ్లితే మాత్రం అసలో.. నకిలో ఇట్టే తేల్చేస్తున్నారు. రూ.100, 200, 500 నోట్లు నకిలీవని తేలితే కొంత వరకు సరిపెట్టుకున్నా.. రూ.2000 నోటు నకిలీదని తేలితే మాత్రం వినియోగదారుడు భారీగా నష్టపోయే పరిస్థితి. అందుకే ముందు జాగ్రత్తలతోనే నోట్లను గుర్తించాలని లేకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు అధికారులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో దొంగనోట్లను గుర్తించడంపై మార్గదర్శకాల్ని విడుదల చేసింది. 17 అంశాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ నోటును దొంగనోటుగా పరిగణించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రూ.2000, 500, 200, 100 నోట్లను నిశితంగా పరిశీలించి దొంగనోటు కాదని నిర్ధారించుకోవాలి. ఏమాత్రం అను మానం వచ్చిన నోటును తిరస్కరించడం మంచిది. అచ్యుతాపురం(యలమంచిలి)చెక్ చేసుకోండి... సాక్షి, విశాఖ : దొంగనోట్లను గుర్తించడంపై అని పోలీసుస్టేషన్లలో సమాచారం ఉంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా నోటు ఇచ్చిన వ్యక్తిపై ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. ఏటీఎంలో వచ్చిన నగదుపై కూడా ఫిర్యాదు చేస్తే సంబంధిత ఏటీఎం నిర్వాహకులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వారపుసంతల్లోనే నకిలీ నోట్ల మార్పిడికి అవకాశం ఎక్కువగా ఉంది. నోటుని అటూ ఇటూ చూసి గల్లాపెట్టెలో వేసేసుకుంటారు. బ్యాంకుకు వెళ్తే ఆ నోటుచెల్లదని చెబుతారు. అప్పడు లబోదిబోమంటారు. నోటు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహిస్తే మంచింది. – లక్ష్మణరావు, ఎస్ఐ 2000 నోటు పరిశీలించండిలా... ముందుభాగం ► దేవనాగరిలిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది ► లైటువెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు ► 45 డిగ్రీల కోణంలో నోటుపై 2000 అంకెను చూడవచ్చు ► మధ్యభాగంలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది ► చిన్న అక్షరాల్లో ఆర్బీఐ 2000 అని ఉంటుంది ► నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది ► భారత్, ఆర్బీఐ, రూ.2000 అంకె ఉంటుంది ► గవర్నర్సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మారుతుంది ► మహాత్మగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ 2000 వాటర్‌మార్క్ ఉంటుంది ► పైభాగంలో ఎడమ వైపున, కిందిభాగంలో కుడివైపున గల నోటు క్రమసంఖ్య అంకెల సైజు ఎడమ నుంచి కుడికి పెరుగుతూ వస్తుంది. ► కుడివైపు కిందభాగంలో రంగుమారే ఇంకుతో రూ.2000 సంఖ్య ఉంటుంది ► కుడివైపు అశోకస్థూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం మహాత్మాగాంధీ బొమ్మ, అశోకస్థూపం చిహ్నం బ్లీడ్లైన్లో తాకితే ఉబ్బెతుగా స్పర్శని ఇస్తాయి. ► కుడివైపు దీర్ఘచతురస్రాకారంలో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది ► కుడి,ఎడమ వైపున ఏడు బ్లీడ్లైన్లు ఉంటాయి. వెనకభాగం... ► నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపు ఉంటుంది ► నినాదంతో సహా ‘స్వచ్ఛ భారత్’లోగో ఉంటుంది ► మధ్యభాగంలో భాషల ప్యానల్ ఉంటుంది ► మంగళయాన్ చిత్రం కూడా... -
కోటక్ మహీంద్రకు ఆర్బీఐ షాక్
సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకునకు ఆర్బీఐ గట్టి షాక్ ఇచ్చింది. ప్రమోటర్ల వాటాలను సంబంధించి సరిమైన సమాచారం అందించలేదన్నకారణంగా భారీ పెనాల్టీ విధించింది. రూ. 2 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రమోటార్ల వాటాల విలీనానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనలను, సూచనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వెల్లడించింది. దీంతో 2 కోట్ల రూపాయల నగదు జరిమానా విధించామని పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ అమలుచేస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంక్‌లో ప్రమోటార్ల వాటా వివరాలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆర్బీఐ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని, నిబంధనలు పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలియజేయాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తరువాతజరిమానా విధించేందుకు నిర్ణయించామని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
ఫారెక్స్ నిల్వలు @ 420.05 బిలియన్ డాలర్లు
ముంబై: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) మే10వ తేదీతో ముగిసిన వారంలో 1.36 బిలియన్ డాలర్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 420.05 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 171.9 మిలియన్ డాలర్లు పెరిగి 418.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) 1.35 బిలియన్ డాలర్లు పెరిగి 392.22 బిలియన్ డాలర్లకి చేరాయి. (అమెరికా డాలర్ మినహాయించి మిగిలిన కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర నిల్వల పెరుగుదల/తరుగుదలను డాలర్లలోనికి మార్చి లెక్కించడాన్నే ఎఫ్‌సీఏగా వ్యవహరిస్తారు.) బంగారం నిల్వలు ఎటువంటి మార్పులులేకుండా 23.021 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా.. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 3 మిలియన్ డాలర్లు పెరిగి 1.454 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫండ్‌తో నిల్వల స్థితి 7 మిలియన్ డాలర్లు పెరిగి 3.35 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. విదేశీ మారక నిల్వలు గతేడాది ఏప్రిల్ 13న 426.028 బిలియన్ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
కూరగాయల ధరల మంట!
న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టోకున కూరగాయల బాస్కెట్ ధరలు ఏప్రిల్‌లో 40.65 శాతం (2018 ఏప్రిల్ ధరలతో పోల్చితే) పెరిగాయి. అయితే మొత్తంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలోని అన్ని విభాగాలనూ కలిపి చూస్తే, ఏప్రిల్‌లో 3.07 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్ ధర టోకును 2018 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2019 ఏప్రిల్‌లో 3.07 శాతం పెరిగిందన్నమాట. అయితే 2018 ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు (2017 ఏప్రిల్‌తో పోల్చితే) 3.62 శాతంగా ఉంది. సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉండే తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇంధనం ధర కూడా ఏప్రిల్‌లో పెద్దగా పెరగలేదు. సూచీలో ఫుడ్ ఆర్టికల్స్ వాటా దాదాపు 20 శాతం. ఒకవైపు ద్రవ్యోల్బణం రేట్లు అదుపులో ఉండడం, మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత నేపథ్యంలో జూన్‌లో ఆర్బీఐ రెపో రేటు కోత మరోసారి ఉండవచ్చని అసోచామ్‌సహా పలు పారిశ్రామిక సంఘాలు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ పరిశోధనా నివేదికలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ టోకు ధరల పరిస్థితిపై మంగళవారం విడుదలైన గణాంకాలను చూస్తే... ►నెలల వారీగా, 2019 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 2.93% ఉంటే... మార్చిలో 3.18%. ► ఇక సూచీలోని ఆహార విభాగాన్ని చూస్తే, ధరల స్పీడ్ ఏప్రిల్‌లో ఏకంగా 7.37 శాతంగా ఉంది. అంతక్రితం నెల అంటే మార్చిలో ఈ స్పీడ్ కేవలం 5.68 శాతమే. ఈ విభాగంలో ఒకటైన కూరగాయల ధరల పెరుగుదల దీనికి కారణం. 2018 డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.42 శాతం క్షీణించింది. అయితే అప్పటినుంచీ పెరుగుతూ వస్తోంది. ఇదే కూరగాయల రేట్లను చూస్తే, 2018 డిసెంబర్లో –19.29 శాతం క్షీణత ఉంటే, 2019 మార్చిలో 28.13 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో ఏకంగా 40.65% పెరిగింది. కాగా ఆలూ ధరల మాత్రం పెరగలేదు. 17.15 శాతం తగ్గాయి. రేటు కోత సంకేతాలు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం)ను మరింత తగ్గించడానికి అనుగుణమైన గణాంకాలు ప్రస్తుతం వస్తున్నాయని పారిశ్రామిక రంగం పేర్కొంటోంది. జూన్ 6న ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్ష ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాలసీ రేటు నిర్ణయానికి ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. బుధవారం నాడు విడుదలైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.92%గా నమోదైంది. ఇది ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యం 4% లోపే ఉండడం గమనార్హం. ఇక మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారింది. మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్బీఐ మరోదఫా రేటు రెపో రేటు తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం 4% దిగువనే ఉన్నందున వచ్చే నెల పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గింపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అసోచామ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ సుభాశ్ సన్యాల్ పేర్కొన్నారు. -
ఇదే ఆఖరి అవకాశం
న్యూఢిల్లీ: చట్టపరమైన మినహాయింపులుంటే తప్ప బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చి తీరాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఇందుకోసం సంబంధిత విధానాలను పునఃసమీక్షించాలని సూచించింది. ఆర్టీఐ చట్టానికి అనుగుణంగా నడుచుకునేందుకు ఆఖరు అవకాశం ఇస్తున్నట్లు హెచ్చరించింది. ‘తదుపరి ఇంకా ఉల్లంఘనలు జరిగితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది‘ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఆర్బీఐపై ఆర్టీఐ కార్యకర్త ఎస్సీ అగ్రవాల్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై విచారణలో భాగంగా న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే.. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని 2015లో ఆర్బీఐకి సుప్రీం కోర్టు సూచించింది. అలాగే ఆర్థిక సంస్థలపై విశ్వాసం దెబ్బతింటుందన్న పేరుతో ఆర్టీఐ చట్ట పరిధిలోకి వచ్చే అంశాలు, డిఫాల్టర్ల వివరాలను దాచిపెట్టి ఉంచడం కుదరదని కూడా స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా.. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై విధించిన జరిమానాలు, వార్షిక తనిఖీ నివేదికకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐని ఎస్సీ అగ్రవాల్ కోరారు. ఇటువంటి వివరాలు వెల్లడించవచ్చంటూ సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్పటికీ .. నిర్దిష్ట విధానం కింద ఆర్టీఐ చట్టం నుంచి వీటికి మినహాయింపు ఉందంటూ, పిటీషనర్ కోరిన సమాచారం ఇవ్వడానికి ఆర్బీఐ నిరాకరించింది. ఈ సమాచారాన్ని ఇవ్వడం కుదరదని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు సూచనలకు విరుద్ధంగా ఆర్బీఐ నిర్దిష్ట సమాచారానికి మినహాయింపులివ్వడం కోర్టు ధిక్కరణ కిందే వస్తుందంటూ అగ్రవాల్ మరో పిటీషన్ దాఖలు చేశారు. -
దాగుడుమూతలు చెల్లవు!
అప్పు ఇచ్చినవారెవరైనా దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి చూస్తారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తారు. కానీ మన బ్యాంకులు అందుకు విరుద్ధం. చిన్న మొత్తాల్లో అప్పులు తీసు కున్నవారు సకాలంలో చెల్లించకపోతే వారిని కోర్టుకీడ్చడంతోసహా రకరకాల మార్గాలు అనుసరి స్తాయి. కానీ భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నవారి జోలికి మాత్రం వెళ్లవు. సరికదా వారి పేర్లు బయటపెట్టడానికి కూడా ససేమిరా అంటున్నాయి. ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు వైఖరిని తప్పు బడుతూ తక్షణం ఎగవేతదార్ల జాబితాను బహిరంగపరచాలని, బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించటం హర్షించదగ్గది. అంతేకాదు... బ్యాంకుల గురించి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కింద ఎవరు ఏ మాదిరి సమాచారం అడిగినా ఇవ్వరాదని నిర్దేశిస్తూ నాలుగేళ్ల క్రితం రూపొందించిన విధానాన్ని ఉపసంహరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేనట్టయితే కోర్టు ధిక్కార నేరం కింద విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిల్ని బ్యాంకింగ్ పరిభాషలో ‘నిర ర్థక ఆస్తులు’(ఎన్పీఏ) అంటారు. ఈ మొండి బకాయిలు కొండల్లా పెరిగిపోవడంతో బ్యాంకింగ్ వ్యవస్థ చతికిలబడుతోంది. తరచు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని లక్షల కోట్ల రూపాయలిచ్చి ఆదుకుంటే తప్ప రోజులు గడవని స్థితి ఏర్పడుతోంది. నిరుడు మార్చినాటికి వివిధ బ్యాంకులకు రావాల్సిన మొండి బకాయిలు స్థూలంగా 10.35 లక్షల కోట్లని ఒక అంచనా. ఇందులో 85 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినవే. ఆ అంచనా ప్రకారం ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యాకున్న ఎన్పీఏలే రూ. 2.23 లక్షల కోట్లు! 2008లో మొత్తం రుణాల్లో ఈ మొండి బకాయిల శాతం 2.3 శాతం ఉంటే 2017నాటికి వాటి వాటా 9.3 శాతానికి చేరుకుంది. ఈ మొండి బకాయిల వ్యవ హారంలో తగిన చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2005లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను విచారించి రూ. 500 కోట్లకు మించి బకాయిపడ్డ కంపెనీల జాబి తాను తమ ముందుంచాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు ఎగవేతదార్ల జాబితాను సీల్డ్ కవర్లో తమకు అందించాలని, అంత భారీ మొత్తంలో రుణాలెందుకు ఇవ్వాల్సి వచ్చిందో బ్యాంకులు వివరించాలని ఉత్తర్వులిచ్చింది. అయినా మన బ్యాంకింగ్ విధానంలో చెప్పు కోదగిన మార్పు రాలేదు. వాస్తవానికి బ్యాంకుల తీరుతెన్నుల్ని పరిశీలించి అంచనా వేయడం కోసం ఏటా ఆర్బీఐ తని ఖీలు నిర్వహిస్తుంది. నివేదికలు రూపొందిస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 35 కింద దానికి ఆ అధికారం ఉంది. నిబంధనల్ని బ్యాంకులు పాటిస్తున్నాయో లేదో చూడటం దీని ప్రధాన ఉద్దే శం. రుణం కోరుతున్న సంస్థ ఉత్పత్తులకు, వ్యాపారానికి మార్కెట్ ఆదరణ లభిస్తుందా, అది రుణాన్ని తిరిగి చెల్లించగలదా, దాని నిర్వహణా సామర్థ్యం ఎలా ఉంది, వీటన్నిటిలో పొంచి ఉన్న ప్రమా దాలు... తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణాలిస్తాయి. వాటికి ఏపాటి ఆస్తు లున్నాయో చూస్తాయి. ఒక సంస్థకు భారీగా రుణం ఇచ్చినప్పుడు ఇవన్నీ సక్రమంగా పరిశీలించారో లేదో చూడటంతోపాటు మొండి బకాయిల స్థితి, వాటికిగల కారణాలు ఆరా తీయడం ఈ తనిఖీల్లోని ప్రధానాంశం. తనిఖీ అనంతరం సంబంధిత బ్యాంకు చీఫ్‌తో చర్చించి నివేదిక రూపొందిస్తారు. ఏ బ్యాంకైనా ప్రజలు తన దగ్గర కూడబెట్టుకున్న సొమ్ముతోనే వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం లొసు గుల మయమై, బ్యాంకులు దివాళా తీస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. కను కనే ఈ తనిఖీలు తప్పనిసరి. కానీ విచిత్రంగా వీటి నివేదికల్ని మాత్రం బయటపెట్టకూడదని ఆర్బీఐ నియమం పెట్టుకుంది. సాధారణ వినియోగదారులు తమ నివేదికల్ని సరిగా అవగాహన చేసుకోలేక తప్పుడు నిర్ధారణలకొచ్చే ప్రమాదం ఉన్నదని వాదిస్తోంది. నివేదిక సారాంశమేమిటో, అది నిర్ధారిస్తున్న అంశా లేమిటో చెప్పడానికి, బ్యాంకింగ్ వినియోగదారులకు అవగాహన కలిగించేందుకు ఆర్థికరంగ నిపుణు లుంటారు. ఈ విషయంలో ఆర్బీఐ ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరమేమిటో అర్ధంకాదు. బ్యాంకులు ఎన్ని అక్రమాలు చేస్తున్నా వినియోగదారులు వాటిని అమాయకంగా నమ్మా లని అది భావిస్తున్నట్టు కనబడుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం ఏ వ్యవస్థకైనా ప్రాణం. అవి లోపించి నప్పుడే అక్రమార్కులు పుట్టుకొస్తారు. ఫలితంగా అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. తమ నిర్వాకం బయటపడటం ఖాయమని అర్ధమైతేనే వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉంటారు. ఎగవేతదార్ల నుంచి బకాయిల్ని త్వరగా వసూలు చేసేందుకు వీలుకల్పిస్తూ రెండేళ్లక్రితం దివాలా కోడ్ తీసుకొచ్చారు. కంపెనీ కోసం రుణాలు తీసుకున్నప్పుడు చూపిన ఆస్తుల్ని అనంతరకాలంలో బదలాయించుకుని, కంపెనీ పేరిట తక్కువ ఆస్తులు చూపి వంచించేవారిని కఠినంగా శిక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్పింది. ఇది అమల్లోకొచ్చాక ఎన్పీఏలు స్వల్పంగానైనా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని మొన్న జనవరినాటి ఆర్బీఐ నివేదిక చెబుతోంది. మంచిదే. కానీ అది ఎగవేతదార్ల భరతం పట్టడానికి ఉద్దేశించింది. దాంతోపాటు బ్యాంకుల నిర్వాకం ఎలా ఉంటున్నదో, అవి తమ డబ్బుతో ఎలా వ్యాపారం చేస్తున్నాయో తెలుసుకునే హక్కు కూడా విని యోగదారులకుంటుందని ఆర్బీఐ గ్రహించడం అవసరం. అది బ్యాంకులపై వినియోగదారుల్లో ఉండే విశ్వాసాన్ని సడలింపజేయదు సరిగదా దాన్ని మరింత పటిష్టపరుస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ పెను గండాల బారిన పడకుండా కాపాడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పచ్చగా ఉండాలన్నా, ఉపాధి అవ కాశాలు ముమ్మరం కావాలన్నా బ్యాంకులు రుణాలివ్వడం అవసరమే. అదే సమయంలో కేవలం ఎగ్గొట్టే ఉద్దేశంతో వేలాది కోట్లు అప్పులు చేసే విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ లాంటివారిని అరి కట్టడం తప్పనిసరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అందుకు దోహదపడతాయి. ఇప్పటికైనా రిజర్వ్ బ్యాంకు కళ్లు తెరవాలి. -
ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్బీఐ నిష్క్రమణ
ముంబై: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)లో రిజర్వ్ బ్యాంక్ తనకున్న పూర్తి వాటాలను కేంద్ర ప్రభుత్వానికి విక్రయించింది. అటు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కూడా వాటాలన్నింటినీ విక్రయించడంతో ఎన్‌హెచ్‌బీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతికి చేరినట్లయింది. ఆర్బీఐ వాటాల విలువ రూ.1,450 కోట్లు కాగా, నాబార్డ్ వాటాల విలువ రూ. 20 కోట్లు. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో, ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో వాటాలు విక్రయించినట్లు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇకపై ఈ రెండు సంస్థల్లోనూ 100 శాతం వాటాలు ప్రభుత్వానికే ఉంటాయని వివరించింది. బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ఆర్బీఐ అదే రంగ సంస్థల్లో వాటాలు కూడా కలిగి ఉండటం సరికాదన్న నరసింహం రెండో కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ రంగానికి ఊతమిచ్చే యోచనతో 1987–88లో బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఎన్‌హెచ్‌బీ ఏర్పాటైంది. కాగా, వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో నిర్వహించిన రెండో విడత డాలర్/రూపాయి స్వాప్ వేలానికి మంచి స్పందన వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 255 బిడ్స్ రాగా అయిదు మాత్రమే అంగీకరించినట్లు పేర్కొంది. -
తక్కువ వడ్డీ దారిలో ఆర్బీఐ: ఫిచ్
న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ పేర్కొంది. దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్‌బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితులు... ఆర్బీఐ రేటు తగ్గింపునకు దోహదపడుతున్న అంశాలుగా ఫిచ్ వివరించింది. ఆర్బీఐ ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 4వ తేదీన రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అంతకుముందు రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ అయినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఫిచ్ తన తాజా ఆసియా పసిఫిక్ సావరిన్ క్రెడిట్ ఓవర్వ్యూ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులోని ముఖ్యాంశాలు... ► మరింత రేటు తగ్గింపునకు అవకాశాలను ఆర్బీఐ అన్వేషించే అవకాశం ఉంది. అయితే 2019లో రేటు తగ్గింపు ఇంతకుమించి ఉండకపోవచ్చు. ► వస్తున్న ఆదాయాలు తగ్గడం– వ్యయాలు పెరగడం వంటి అంశాలు భారత్ ద్రవ్యలోటు పరిస్థితులకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది. కొన్ని నగదు ప్రత్యక్ష బదలాయింపులు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు. ► 2025 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణాన్ని 60 శాతానికి పరిమితం చేయాలన్నది భారత్ ప్రణాళిక. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, భారత్ ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. ► కేంద్ర రుణ భారం తీవ్రంగా ఉంది. ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి. వ్యవస్థాగత అంశాల్లో లోపాలు ఉన్నాయి. అయితే సమీప కాలంలో దేశం పటిష్ట వృద్ధి బాటన కొనసాగే అవకాశం ఉంది. విదేశీ మరకపు నిల్వలు (400 బిలియన్ డాలర్ల ఎగువన) పటిష్టంగా ఉన్నాయి. విదేశీ సవాళ్లను తట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనితో సవాళ్లు–ఆశావహ పరిస్థితులు మధ్య సమతౌల్యత కనిపిస్తోంది. దీనితో ఫిచ్ రేటింగ్స్ (‘బీబీబీ–’ దిగువస్థాయి పెట్టుబడుల గ్రేడ్) యథాతథంగా కొనసాగుతుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు. 2020–21లో 7.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
వరుసగా మూడవదఫా రేటు కోత: బ్యాంక్ ఆఫ్ అమెరికా
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీఓఎఫ్ఏ–ఎంఎల్) అంచనా వేసింది. ‘‘జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా మరోపావుశాతం రేటు కోత ఉంటుందని భావిస్తున్నాం’’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే జరిగితే రెపో 5.75 శాతానికి దిగివస్తుంది. ఆరు నెలల్లో 75 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం (ఫిబ్రవరిలో 20 నెలల కనిష్ట స్థాయి 0.1 శాతం), రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం దిగువనే (మార్చిలో 2.86 శాతం) ఉండటం వంటి అంశాలు ఆర్బీఐ మరోదఫా రేటు కోత అంచనాలకు ఊతం ఇస్తోంది. ఈ ఏడాది ‘‘దాదాపు సాధారణ’’ వర్షపాతం నమోదవుతుందని సోమవారం భారత వాతావరణ శాఖ పేర్కొనడం తాజా విశేషం. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే అంశం. -
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమావేశం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం వరకూ మూడు రోజులు ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ గురువారం ఆర్బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం)పై ప్రకటన వస్తుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వృద్ధికి ఊపును ఇవ్వడానికి మరో దఫా రేటు కోత ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తుండగా, ఇప్పటికే తీసుకున్న రేటు కోత నిర్ణయాలను బ్యాంకింగ్ అమలు చేయడంపైనే ఆర్బీఐ దృష్టి సారిస్తుందని మరికొందరి విశ్లేషణ. -
క్యూ3లో క్యాడ్ 2.5 శాతం
ముంబై: దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) అక్టోబర్–డిసెంబర్ కాలంలో (ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే, 2.5%గా నమోదయ్యింది. విలువలో క్యాడ్ పరిమాణం 16.9 బిలియన్ డాలర్లు. 2017– 2018 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 13.7 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ మధ్య ఈ విలువ 19.1 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.9 శాతం). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కాగా 2018 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ మొత్తం కాలాన్ని తీసుకుంటే, క్యాడ్ జీడీపీలో 2.6 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ రేటు 1.8%. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్ అకౌంట్ లోటు. -
పసిడిపై ఆర్బీఐ గురి
న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయంగా అనిశ్చితి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా అదే బాటలో పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. జనవరిలో 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గణాంకాల ప్రకారం భారత విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) పసిడి వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2018లో 6.2 శాతంగా ఉన్న పరిమాణం జనవరిలో మరికాస్త పెరిగి 6.4 శాతానికి చేరింది. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. 612.5 టన్నులతో నెదర్లాండ్స్ 10వ స్థానంలో ఉంది. రెండు దేశాల నిల్వల మధ్య వ్యత్యాసం కేవలం 5.5 టన్నులు మాత్రమే ఉండటంతో.. త్వరలోనే భారత్ 10వ స్థానానికి చేరొచ్చన్న డబ్ల్యూజీసీ భావిస్తోంది. నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ పసిడి నిల్వల్లో గత దశాబ్దకాలంగా పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. అంతక్రితం దాకా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్‌తో ఒప్పందాల కారణంగా నెదర్లాండ్స్ పసిడి విక్రయిస్తూ నిల్వలను తగ్గించుకుంటూ వచ్చింది. తాజా నిల్వల గణాంకాల ప్రకారం భారత్ త్వరలోనే నెదర్లాండ్స్ స్థానాన్ని ఆక్రమించే అవకాశముందని అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అదే ధోరణి.. వాస్తవానికి మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. డాలర్ బలపడుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వ్‌లలో ఇతరత్రా సాధనాల వాటాను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మిగతా అన్నింటికన్నా బంగారమే పటిష్టమైన హెడ్జింగ్ సాధనంగా ఉంటుందని భావిస్తున్నాయి. అందుకే పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. జనవరిలో స్థూలంగా 13 టన్నుల పసిడిని విక్రయించిన సెంట్రల్ బ్యాంకులు .. 48 టన్నుల మేర కొనుగోళ్లు జరిపాయి. దీంతో నికర కొనుగోళ్లు 35 టన్నులుగా నమోదయ్యాయి. ఇందులో సింహభాగం కొనుగోళ్లు తొమ్మిది సెంట్రల్ బ్యాంకులే జరిపాయి. 2002 తర్వాత జనవరి నెలలో సెంట్రల్ బ్యాంకులు ఈ స్థాయిలో పసిడి కొనుగోలు చేయడం ఇదే ప్రథమమని డబ్ల్యూజీసీ డైరెక్టర్ (మార్కెట్ ఇంటెలిజెన్స్) అలిస్టెయిర్ హెవిట్ తెలిపారు. ఎక్కువగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి తదితర అంశాల నేపథ్యంలో అవి హెడ్జింగ్ కోసం బంగారంపై దృష్టి పెడుతున్నాయని వివరించారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఏకంగా 600 టన్నుల పసిడి కొనుగోలు చేశాయి. ఇది ఆయిదు దశాబ్దాల గరిష్టం కావడం గమనార్హం. వర్ధమాన దేశాల సెంట్రల్ మార్కెట్లే ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. -
వడ్డీ భారం ఎందుకు తగ్గించట్లేదు?
ముంబై: బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. రేటు తగ్గింపు అమల్లో జాప్యం ఎందుకని బ్యాంకర్లను ప్రశ్నించారు. దాస్ గురువారం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్ల చీఫ్‌లతో సమావేశమయ్యారు. రెపో తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం, రుణ వృద్ధి వంటి అంశాలపై ఆయన బ్యాంకర్లతో చర్చించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తదితర బ్యాంకుల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 7న ఆర్బీఐ రెపో రేటును 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంకర్లతో తాజాగా ఆర్బీఐ చీఫ్ సమావేశమయ్యారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘ రేట్లును తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం మనకు చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ తన విధాన రేట్లను తగ్గించినప్పుడు కస్టమర్లకు ఈ ప్రయోజనం అందితీరాలి’’ అని గవర్నర్ స్పష్టం చేశారు. తమ నెలవారీ అసెట్ లయబిలిటీ కమిటీ సమీక్షల్లో వడ్డీరేట్ల తగ్గింపుపై దృష్టి సారించి ఒక నిర్ణయానికి వస్తామని శక్తికాంతదాస్‌కు బ్యాంకర్లు హామీ ఇచ్చినట్లు సమాచారం. దువ్వూరి నుంచీ ఇదే సమస్య... ఆర్బీఐ రేటు తగ్గిస్తున్నప్పటికీ, ఈ ప్రయోజనాన్ని బ్యాంకర్లు బదలాయించకపోవడంతో ప్రధానంగా పరిశ్రమ నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తోంది. నిధుల సమీకరణ వ్యయాల భారం, ఇప్పటికే ఉన్న మొండిబకాయిలు, తగ్గిపోతున్న మార్జిన్లు వంటి అంశాలను బ్యాంకులు సాకుగా చూపుతున్నాయి. గత పావుశాతం పాలసీ రేటు తగ్గింపు సందర్భంగా కూడా కేవలం రెండే బ్యాంకులు– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలే రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. అదీ కేవలం ఐదు బేసిస్ పాయింట్లే (100 బేస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించాయి. దువ్వూరి సుబ్బారావు గవర్నర్‌గా ఉన్న సమయం నుంచీ ఆర్బీఐ– బ్యాంకర్ల మధ్య పాలసీ రేటు బదలాయింపుపైనే వివాదం ఉంది. కేవలం ఇదే ప్రయోజనం నిమిత్తం 2013 జూలైలో దువ్వూరి బీపీఎల్ఆర్ ఆధారిత రేటు స్థానంలో బేస్ రేటును తీసుకువచ్చారు. అప్పటికీ ఫలితం రాకపోవడంతో తదుపరి గవర్నర్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో ఆర్బీఐ 2015 ఏప్రిల్ నుంచి స్వల్పకాలిక నిధుల సమీకరణ వ్యయ ప్రాతిపాదికన ఎంసీఎల్ఆర్ను (మార్జినల్ కాస్ట బేస్డ్ ఫండింగ్) తీసుకువచ్చారు. అయినా తగిన ఫలితం రాలేదు. ఏప్రిల్ నుంచీ కొత్త రేటు విధానం? ప్రస్తుత నిబంధనల ప్రకారం– వడ్డీ తగ్గింపునకు ఆర్బీఐ కేవలం సూచనలు ఇవ్వగలదుతప్ప, ఎటువంటి ఆదేశాలూ జారీచేయలేదు. సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం ఆర్బీఐ పరిశీలినలో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత ప్రైసింగ్ విధానం పరిశీలనలో ఉంది. శక్తికాంతదాస్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్ పటేల్ నుంచి ఈ విధాన ప్రతిపాదన తొలుత వచ్చింది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నీ బాగుంటే ఏప్రిల్‌లో కొత్త రేటు విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వృద్ధి మందగమనం... ధరల స్పీడ్ తగ్గుదల ►రేటు కోతకు దోహదపడిన రెండు అంశాలు ►ఆర్బీఐ సమావేశ మినిట్స్‌లో వెల్లడి ముంబై: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగించడం, ధరలు తక్కువ స్థాయిలో ఉండడం.. రెండూ ఫిబ్రవరి 7వ తేదీ రెపో రేటు కోత నిర్ణయానికి దారితీశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) పేర్కొంది. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ జరిగిన మూడు రోజుల సమావేశం సందర్భంగా కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐకి వచ్చే వడ్డీరేటు) తగ్గింపునకు ఓటు చేశారు. దీనితో ఈ రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. నాటి ఎంపీసీ సమావేశ మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... ►రేటు తగ్గింపు ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వవచ్చని ఆర్బీఐ భావించింది. ప్రస్తుతం ఈ అవసరం ఉందని గవర్నర్ భావించారు. ►ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో, ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని, అలాగే వినియోగం పటిష్టమవ్వాల్సిన పరిస్థితి ఉందని దాస్ తన వాదనలు వినిపించారు. ►వృద్ధి 7.4 శాతం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంటుంటే, కేంద్ర గణాంకాల కార్యాలయం దీనిని 7.2 శాతంగానే అంచనా వేస్తోంది. ఇది వృద్ధి మందగమనానికి సంకేతం. రేటు తగ్గింపు ద్వారా వృద్ధికి ఊతం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సభ్యులు భావించారు. ►బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ వృద్ధి అనుకున్నంతగా లేకపోవడాన్నీ దాస్ ప్రస్తావించారు. ►గవర్నర్ దాస్ సహా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ పాత్ర, ఆర్‌బీఐయేతర సభ్యులు పామీ దువా, రవీంద్ర ఢోలాకియాలు రేటు కోతకు అనుకూలంగా ఓటు చేయగా, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఆర్‌బీఐయేతర సభ్యులు ఛేతన్ ఘాటేలు రేటు కోతను వ్యతిరేకించారు. -
విదేశీ పెట్టుబడుల ఆకర్షణ చర్యలు
ముంబై: దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చేలా వెసులుబాటు కల్పించే కీలక నిర్ణయాన్ని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెలువరించింది. కార్పొరేట్ బాండ్లలో ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులపై ఇప్పటి వరకూ ఉన్న 20 శాతం పరిమితిని తొలగించింది. ఇండియన్ కార్పొరేట్ రుణ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వివరించింది. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గురువారంనాడు కీలక నిర్ణయాలను వెలువరించనుంది. 2018–19 ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఇది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మొట్టమొదటిసారి సమావేశమవుతున్న ఆరుగురు సభ్యుల పరపతి విధాన మండలి ఈ దఫా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) మార్చకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉన్నందున, పాలసీకి సంబంధించి తన పూర్వ ‘జాగరూకతతో కూడిన కఠిన’ వైఖరిని ‘తటస్థం’ దిశగా సడలించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్ పరపతి విధాన సమీక్ష సందర్భంగా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులు తొలిగితే, రేటు తగ్గింపు చర్యలు ఉంటాయని సూచించింది. దేశ పారిశ్రామిక రంగం మందగమన స్థితిలో ఉండడం వల్ల రేటు విషయంలో ఆర్బీఐ కొంత సరళతర వైఖరి ప్రదర్శించవచ్చన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండుసార్లు ఆర్బీఐ రేట్లు పెరిగాయి. రేటు తగ్గింపు వెసులుబాటు... ఆర్బీఐకి రేటు కోతకు వెసులుబాటు ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ అభిప్రాయపడింది. తగ్గిన క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణానికి సానుకూలత అంశాలు తన విశ్లేషణకు కారణమని తాజా నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ నుంచి రూ.69,000 కోట్లు ఆర్బీఐ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.69,000 కోట్లు డివిడెండ్‌గా రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.40,000 కోట్లను డివిడెండ్‌గా పంపిణీ చేసింది. -
రూ. 2,000 నోటుకు కళ్లెం!!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వీటి ముద్రణ నిలిచిపోనుందని పేర్కొన్నాయి. అయితే, చలామణీని తగ్గించడమంటే రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లు యథాప్రకారం చెల్లుబాటవుతాయని, అయితే వీటిని దశలవారీగా తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మరోవైపు, రూ. 2,000 నోట్ల వార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు .. వీటి ముద్రణను ’కనిష్ట’ స్థాయికి తగ్గించినట్లు తెలిపాయి. ముద్రించాల్సిన కరెన్సీ పరిమాణంపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమేనని వివరించాయి. చలామణీలో ఉన్న నగదును ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడే క్రమంగా వీటి ముద్రణ తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘రూ. 2,000 కరెన్సీ నోట్ల ముద్రణను గణనీయంగా తగ్గించడం జరిగింది. కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇలాంటివి కొత్తేమీ కాదు’ అని వివరించారు. మొత్తం కరెన్సీలో 37 శాతం నోట్లు.. బ్లాక్‌మనీని కట్టడి చేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో రూ.1,000, రూ. 500 డినామినేషన్ల పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీ స్థాయిలో ఏర్పడిన నగదు కొరతను సత్వరం అధిగమించేందుకు ప్రభుత్వం రూ. 2,000 నోట్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న 2,000 నోట్ల సంఖ్య సుమారు 328.5 కోట్లుగా ఉంది. ఏడాది తర్వాత 2018 మార్చి ఆఖరు నాటికి ఇది స్వల్పంగా పెరిగి 336.3 కోట్ల నోట్లకు చేరింది. 2017 మార్చి ఆఖరు నాటికి మొత్తం కరెన్సీ విలువలో రూ. 2,000 నోట్ల వాటా 50.2 శాతంగా ఉండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఇది 37.3 శాతానికి తగ్గింది. గతేడాది మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ. 18.03 లక్షల కోట్లు కాగా ఇందులో సుమారు 37 శాతం (దాదాపు రూ. 6.73 లక్షల కోట్ల విలువ) రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. మరో 43 శాతం (విలువ సుమారు రూ. 7.73 లక్షల కోట్లు) రూ. 500 నోట్లు ఉన్నాయి. మిగతా నోట్లు అంతకన్నా తక్కువ విలువ గలవి. అప్పట్లోనే విమర్శలు.. పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌కు ఉపయోగపడుతోందన్న కారణంతో 2016 నవంబర్‌లో రూ.1,000 నోట్లను రద్దు చేసిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల రూపంలో అంతకన్నా అధిక విలువ గల నోట్లను ప్రవేశపెట్టడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. పన్ను ఎగవేతదారులకు, మనీల్యాండరర్స్కు ఈ అధిక విలువ కరెన్సీ నోట్లు మరింత బాగా ఉపయోగపడతాయని, మనీల్యాండరింగ్ లాంటివి అరికట్టడమే తమ ధ్యేయమని చెప్పుకునే కేంద్రం లక్ష్యాల సాధనకు ఇవి ప్రతికూలమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వంటి ప్రముఖులు కూడా దీన్ని ప్రశ్నించిన వారిలో ఉన్నారు. దీనికి తగ్గట్లుగానే గతేడాది పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నగదు కొరత ఏర్పడింది. రాష్ట్రాల్లో ఎన్నికలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో చాలా మంది ఈ పెద్ద నోట్లను భారీ స్థాయిలో దాచి పెట్టుకుని ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటిని రుజువు చేస్తూ ఆదాయ పన్ను శాఖ సోదాల్లో పలు చోట్ల భారీ ఎత్తున రూ. 2,000 నోట్లు బయటపడ్డాయి. -
చిన్న పరిశ్రమ వృద్ధిపై ఆర్బీఐ దృష్టి
ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరింత దృష్టి సారిస్తోంది. ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రంగం ప్రతినిధులతో వచ్చేవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సమావేశం కానున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) ప్రతినిధులతో కూడా తాను వచ్చేవారం సమావేశం కానున్నట్లు శక్తికాంత్ దాస్ ట్వీట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే... ∙ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలు చేయడానికి ఆర్బీఐ బుధవారం ఒక అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వం వహిస్తారు. ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ, 2019 జూన్ నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతపై, ఇందుకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి పెడుతుంది. దేశం మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ వాటా 40%కాగా, తయారీ రంగంలోఈ విభాగం వాటా 45 శాతం.∙ఆర్బీఐ మంగళవారం చిన్న పరిశ్రమలకు భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలోనే ఈ రంగానికి సంబంధించి తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం– రూ. 25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్వ్యవస్థీకరించడానికి ఆర్బీఐ అనుమతించింది. అయితే సంస్థ రుణం పునర్వ్యవస్థీకరించే నాటికి, ఆ సంస్థ జీఎస్టీలో నమోదై ఉండాలి. అయితే జీఎస్టీ నమోదు అవసరం లేదని మినహాయింపు పొందిన ఎంఎస్ఎంఈలకు ఇది వర్తించదు. ఎన్బీఎఫ్సీ ప్రతినిధులతో దాస్ సమావేశం మరో ముఖ్య విశేషం. దేశంలోని అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో పలు ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. లిక్విడిటీ, చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. రుణ పునర్వ్యవస్థీకరణ స్కీమ్‌పై ఎంఎస్ఎంఈ డిమాండ్ ఇదిలావుండగా, ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇంకా రిజిస్టర్ కాని కంపెనీలకూ వర్తింపజేయాలని ఎంఎస్ఎంఈ డిమాండ్ చేసింది. సంబంధిత సంస్థల రుణాలనూ ప్రాధాన్యతా రంగానికి ఇస్తున్న రుణాలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. -
రిజర్వ్ బ్యాంకుకే ‘కన్నం’ వేస్తున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగానే ఉంది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఖాళీ అవుతున్న ఉద్యోగాలే భర్తీ కావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) ఆర్థిక ద్రవ్యలోటు 3.3 శాతాన్ని మించరాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ అది 3.6 శాతానికి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. పరోక్ష పన్నుల వసూళ్లు లక్షిత వసూళ్లకు అంతనంత దూరంలోనే ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ డిసెంబర్ నెల నుంచి 2019, మార్చి నెల వరకు 45 శాతం వసూళ్లు జరగాలి. లక్షిత జీఎస్టీ వసూళ్లలో గత ఎనిమిది నెలల్లో జరిగిన వసూళ్లు 55 శాతం అన్నమాట. ఈ నాలుగు నెలల్లో మిగతా 45 శాతం వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యం. దేశంలోని 11 భారత ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాలా తీశాయి. వాస్తవానికి వీటిని ఎప్పుడో మూసివేయాలి. కానీ 2017, ఏప్రిల్ ఒకటవ తేదీన తీసుకొచ్చిన ‘ప్రాప్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీఏసీ)’ కింద ఈ బ్యాంకులను నెట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన 12 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల్లో 90 శాతం బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసినా, నూతన సిబ్బంది నియామకాలను నిలిపివేసినా పరిస్థితి మెరుగుపడలేదు. రుణాల మాఫీ కోసం, సరైన గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రైతుల రుణాల మాఫీకి మోదీ ప్రభుత్వం సాహసించలేకపోయిందంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా లేదా దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది, అంటే 2019, మేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్కుగానీ, వినియోగదారుడికిగానీ నగదు కొరత రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి నగదు కొరత పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రిజర్వ్ నిధుల మీద కన్నేసింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వ్ నిధులు 9.6 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, ఆపధర్మ నిధి కింద 3.6 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి ఇవ్వలేదు దేశంలోని బంగారం, ఫారెక్స్ నిల్వలు పడిపోయినప్పుడల్లా వాటి నిర్దేశిత స్థాయిని కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ రిజర్వ్ నిధులను విడుదల చేస్తుంది. ఇక ఆపధర్మ నిధిని అనుకోకుండా భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం వాడాలని ఏర్పాటు చేసుకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయగా, ఈ ఆపధర్మ నిధిని 1950లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా ఆపధర్మ నిధులను అడగలేదు. ఆర్బీఐ ఇవ్వలేదు. ఉర్జిత్ పటేల్‌పై అదే ఒత్తిడి ఆర్బీఐ ఆపధర్మ నిధి నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గతకొంత కాలం నుంచి మొన్నటివరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్‌పై ఒత్తిడి చేస్తూ వచ్చింది. తమ మాట వినకపోతే ఆర్బీఐ చట్టంలోని ఏడో షెడ్యూల్ కింద ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉర్జిత్‌కు హెచ్చరిక కూడా చేశారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించడం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ను ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు సభ్యులు రెండు, మూడు సార్లు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదన గురించి చర్చించారు. ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేస్తున్నానని చెప్పుకున్నారు. మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలాన్ని పొడిగించకుండా ఉర్జిత్ పటేల్‌ను కోరి తెచ్చుకున్నందుకు ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాల్సిందే. కానీ రెండు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేంత కృతజ్ఞత చూపలేకపోయారు. ఓ ఆర్థిక నిపుణుడిగా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు కనుక. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఎవరు? ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను తీసుకొచ్చారు. ఆయన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్‌లాగా ఆర్థికవేత్త కాదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుత 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించడం ఇదే కొత్తకాదు. గతంలో 14 మంది ఐఏఎస్–ఐసీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. వారిలో ఎక్కువమంది ఆర్థిక వేత్తలే. 1990లో ఎస్. వెంకటరామన్ తర్వాత చదువురీత్యా ఆర్థిక వేత్తకానీ వ్యక్తిని తీసుకరావడం ఇదే మొదటిసారి. కొత్త గవర్నర్ ప్రభుత్వం మాట వింటారా? అక్షరాలా వింటారు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఏర్పడిన సంక్షోభంలో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అడుగడుగున సమర్థిస్తూ వచ్చిందీ ఈ శక్తికాంత దాసే. అయినా ఆయన ఇప్పటికీ పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పుకాదంటారు. అసలేం అవుతుంది ? మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐని దేవురించాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తెచ్చిన జీఎస్టీనే. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా మోదీ పక్షాన నిలిచిన శక్తికాంత దాస్, ఇప్పుడు కూడా ఆయన పక్షానే నిలిచి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడవచ్చు! ఆ నిర్ణయం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ పార్టీ గట్టెక్కవచ్చు. కానీ ఐదేళ్లకాలంలోనే జింబాబ్వే, అర్జెంటీనా, వెనిజులాలో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు భారత్‌కు కూడా తప్పకపోవచ్చు. ఆ మూడు దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులను (మన రిజర్వ్ బ్యాంక్‌కు సమానం) స్వాధీనం చేసుకున్న పర్యవసానంగా సామాజిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి. -
ఈ నలుగురిలో వారసుడెవరు?
ఆర్బీఐ గవర్నరు పదవికి ఉర్జిత్ పటేల్ ఆకస్మికంగా రాజీనామా చేయటంతో కీలక పదవికి ఖాళీ ఏర్పడింది. బ్యాంకింగ్ రంగాన్ని నడిపించటమే కాదు... తద్వారా యావత్తు ఆర్థిక వ్యవస్థకూ దిశానిర్దేశం చేసే ఈ కీలక పదవి తదుపరి ఎవరిని వరిస్తుందనే విషయమై జోరుగా ఊహగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికయితే ఆర్బీఐ డెప్యూటీ గవర్నరు ఎన్ఎస్ విశ్వనాథన్, ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌తో పాటు ప్రస్తుత కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పేర్లు వినిపిస్తున్నాయి. విశ్వనాథన్ లేదా సుభాష్ చంద్రగార్గ్? డెప్యూటీ గవర్నర్లను గవర్నర్‌గా నియమించటమనే సంప్రదాయాన్ని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఉర్జిత్ పటేల్ కూడా అలా వచ్చినవారే. రఘురామ్ రాజన్‌కు తదుపరి పొడిగింపు ఇస్తారని అంతా ఊహిస్తున్న సమయంలో కొన్ని అంశాల్లో విభేదాల వల్ల కేంద్రం ఆయనకు మరోసారి పొడగింపు ఇవ్వలేదు. అప్పటికప్పుడు కొత్త గవర్నర్‌గా వచ్చే వ్యక్తికి ఆర్బీఐపై పూర్తి అవగాహన ఉండాలి కనక అప్పట్లో ఉర్జిత్‌ను ఎంచుకుందనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు పరిస్థితి ఇంకాస్త భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే పటేల్ రాజీనామా ముందుగా తెలిసినది కాదు. అకస్మాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు కనక... కొత్తగా వచ్చే గవర్నరు ఆ వ్యవస్థతో బాగా సంబంధం ఉన్నవారైతేనే నయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సహజంగానే డెప్యూటీ గవర్నరు ఎన్ఎస్ విశ్వనాథన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలంటే సమర్థుడైన డెప్యూటీ గవర్నరుకే బాధ్యతలు అప్పగించటం మంచిదన్నది ఆర్థిక వర్గాల భావన. ఇక సుభాష్ చంద్ర గార్గ్‌ను తీసుకున్నా ఆయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. పైపెచ్చు ఈ హోదాలో ఆర్బీఐ బోర్డులోనూ కొనసాగుతున్నారు. కాబట్టే ఈయన పేరు కూడా తెరపైకి వస్తోంది. శక్తికాంత దాస్, అజయ్ త్యాగి కూడా... మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌గా అజయ్ త్యాగి ప్రస్తుతం కొనసాగుతున్నారు. మార్కెట్లకు సంబంధించి పలు సంస్కరణలు తేవటంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పలు అంశాల్లో దన్నుగా ఉంటూ వస్తున్నారు. ఇక ఆర్థిక వ్యవహారాల విభాగం మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్ గతంలో ఆ హోదాలో ఆర్బీఐ బోర్డులో కొన్నాళ్లున్నారు. ఆయనకూ ఆర్బీఐ గవర్నెన్స్ పట్ల అవగాహన ఉంది. పైపెచ్చు ఆయనకు మోదీ ప్రభుత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా గార్గ్, దాస్ పేర్లు కూడా గవర్నర్ పదవి రేసులో వినిపిస్తున్నాయి. తక్షణం తాత్కాలిక గవర్నర్ నియామకం ఉర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో తక్షణం ప్రభుత్వం తాత్కాలిక గవర్నర్‌ను నియమించాల్సి ఉంటుందని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. తరవాతే కొత్త గవర్నర్ నియామకం జరుపుతారన్నది ఆయన అభిప్రాయం. గవర్నర్ లేదా డిప్యూటీ గవర్నర్ రాజీనామా పరిస్థితుల్లో ప్రభుత్వం తనకు తానుగా కానీ లేదా ఆర్బీఐ బోర్డు సిఫారసుల ప్రాతిపదికనగానీ కొత్త నియామకం జరపాల్సి ఉంటుందని ఆర్బీఐ యాక్ట్, 1934 పేర్కొంటోంది. కేంద్రం తగిన నిర్ణయం ఆర్బీఐ కార్యకలాపాల పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఆర్బీఐ– కేంద్రం మధ్య సన్నిహిత సహకారమూ అవసరమే. అందుకని గవర్నర్ నియామకంపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నా. – రాకేష్ మోహన్, ఆర్బీఐ మాజీ డెప్యూటీ గవర్నర్ కేంద్రానికి ‘ప్లాన్ బీ’ ఉంటుంది... ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై కేంద్రానికి ఎప్పుడూ ‘ప్లాన్ బీ’ ఉంటుంది. వెంటనే నియామకం జరిపితే, ఇప్పటికే ఒకరు ఎంపికైపోయారన్న భావన వ్యక్తమవుతుంది. వారం దాటిపోతే ఇదంతా రాజకీయమైపోతుంది. వీటన్నింటినీ సమతౌల్యం చేస్తూ నిర్ణయం ఉంటుంది – ప్రణబ్ సేన్, మాజీ చీఫ్ స్టాటిస్టీషియన్ ఇదీ... ఆర్బీఐ బోర్డు డెప్యూటీ గవర్నర్లు నలుగురు... ఎన్ఎస్ విశ్వనాథన్, విరాల్ ఆచార్య, బి.పి.కానుంగో, మహేశ్‌కుమార్ జైన్ డైరెక్టర్లు 12 మంది: పీకే మహంతి, డి.ఎస్.సంఘ్వీ, రేవతీ అయ్యర్, సచిన్ చతుర్వేది, నటరాజన్ చంద్రశేఖరన్, బీఎన్ జోషి, సుధీర్ మన్కడ్, అశోక్ గులాటీ, మనీష్ సబర్వాల్, ఎస్కే మరాఠీ, స్వామినాథన్ గురుమూర్తి, సుభాష్ చంద్రగార్గ్, రాజీవ్ కుమార్. -
రాజీ నుంచి... రాజీనామాకు!!
పటేల్ రాజీనామాకు బీజం ఎప్పుడు పడిందో తెలుసా? ఈ ఏడాది ఆగస్టు 8న. ఆ తరవాత ఆయన రాజీనామా చేస్తారనే వదంతులూ వచ్చాయి. అప్పట్లో పరిస్థితి సర్దు మణిగినా... ఇప్పుడు తప్పలేదు. ఆ పరిణామాలు చూస్తే... 2018 ఆగస్టు 8: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్ రంగ నిపుణుడు సతీష్ మరాఠీలను ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. సెప్టెంబర్ మధ్యలో: ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సభ్యుడు, ప్రముఖ బ్యాంకరు నచికేత్ మోర్‌కు అర్ధాంతరంగా ఉద్వాసన పలికింది. అక్టోబర్ 10: డజను పైగా డిమాండ్లకు అంగీకరించేలా రిజర్వ్ బ్యాంక్ మెడలు వంచేందుకు గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 నిబంధనను ప్రయోగిస్తూ ఆర్బీఐకి కేంద్రం మూడు లేఖలు రాసింది. వీటికి ఆర్బీఐ వారం రోజుల తర్వాత సమాధానాలిచ్చింది. అక్టోబర్ 23: ఆర్బీఐ దాదాపు ఎనిమిది గంటలపాటు మారథాన్ సమావేశం నిర్వహించింది. కా నీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై పరిష్కారం లభించకుండానే భేటీ ముగిసింది. అక్టోబర్ 26: ఆర్బీఐ అటానమీని కాపాడాల్సిన అవసరంపై డిప్యుటీ గవర్నర్ విరల్ ఆచార్య బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కాపాడకుంటే మార్కెట్ల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 29: మరో డిప్యుటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ కూడా గళమెత్తారు. బ్యాంకుల మూలధన నిష్పత్తులను తగ్గించే విషయంలో ఆర్బీఐ విముఖతను స్పష్టం చేశారు. అక్టోబర్ 31: ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి చాలా ముఖ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరింత మెరుగైన గవర్నెన్స్ అవసరమని పేర్కొంది. నవంబర్ 3: మార్కెట్ సూచీలు, రూపాయి, క్రూడ్ ధరలు అన్నీ బాగానే పుంజుకుంటున్నాయంటూ... కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గర్గ్ వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై విరల్ ఆచార్య వ్యాఖ్యలకు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అదే నెల 9వ తారీఖున.. ఆర్బీఐ దగ్గర అసలు ఎన్ని నిధులు ఉండాలన్నది నిర్ణయించేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొనడం మంచిది కాదని గురుమూర్తి వ్యాఖ్యానించారు. కీలక రంగాలకు నిధులందకుండా చేయడం ద్వారా వృద్ధికి విఘాతం కలిగించకూడదంటూ నవంబర్ 17న ఆర్బీఐ బోర్డు సమావేశానికి రెండు రోజులు ముందు.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. నవంబర్ 19: పది గంటల పాటు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు భేటీ. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్నది తేల్చేందుకు ప్యానెల్ ఏర్పాటుకు నిర్ణయం. చిన్న సంస్థలకు ఊరటనిచ్చే చర్యలు. డిసెంబర్ 5: ఆర్బీఐ, కేంద్రం మధ్య సంధి వార్తల నేపథ్యంలో విభేదాలపై స్పందించేందుకు పటేల్ నిరాకరణ. డిసెంబర్ 10: వ్యక్తిగత కారణాలతో గవర్నర్ పదవికి పటేల్ రాజీనామా. -
ఆర్బీఐ గవర్నరు రాజీనామా...
(ముంబై, న్యూఢిల్లీ) : ఆరంభంలోనే పెద్ద నోట్ల రద్దులాంటి ఆర్థిక సునామీలను నిబ్బరంగా తట్టుకున్న భారత రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్ పటేల్... ఆకస్మికంగా రాజీనామా చేసి అందరినీ నివ్వెరపరిచారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎన్పీఏలు పెరిగిపోయిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు కొన్ని కీలక అంశాలపై కేంద్రం, ఆర్బీఐ మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐలోని విరాళ్ ఆచార్య వంటి డెప్యూటీ గవర్నర్లు దీనిపై మాట్లాడారు గానీ.. మితభాషి, మృదుభాషిగా పేరున్న పటేల్ మాత్రం మాట్లాడలేదు. చివరికి రాజీనామా చేసేటపుడూ ప్రభుత్వాన్ని, ఆర్థికశాఖను పొగడటం, తెగడటం వంటివి చేయలేదు. పదవీకాలంలో సహకారం అందించిన సహోద్యోగులకు మాత్రం ధన్యవాదాలు తెలిపారు. నిజానికి రెండేళ్ల కిందట పెద్ద నోట్ల రద్దును ప్రధాన మంత్రి ప్రకటించినపుడు... జనం ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పటేల్‌పై పలు విమర్శలొచ్చాయి. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనే అపవాదు పడింది. కానీ తరవాత దాన్నుంచి మెల్లగా బయటపడ్డారు. కఠిన నిర్ణయాలతో స్వతంత్రంగా తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఆయన విధానాలు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. రిజర్వ్ బ్యాంక్‌ని లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు తలెత్తడంతో కేంద్రం వెనక్కి తగ్గింది కూడా. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అకస్మాత్తుగా పటేల్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ దశలో ఆయన రాజీనామా నిర్ణయం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నప్పటికీ... పదవీకాలం మరో ఎనిమిది నెలలు ఉండగానే పటేల్ రాజీనామా చేయడం గమనార్హం. నోట్ల రద్దుకు నాయకత్వం...! 2016లో ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీకాలాన్ని రెండో దఫా పొడిగించకుండా... ఆ స్థానంలో పటేల్‌ను (55) నియమించింది బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. 2016 సెప్టెంబర్ 5న ఆయన ఆర్బీఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు దాకా అప్పటి గవర్నర్ రఘురామ్ రాజన్ సారథ్యంలో డెప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. 1992 తర్వాత అత్యంత తక్కువ కాలం ఈ హోదాలో ఉన్న గవర్నర్ ఉర్జిత్ పటేలే. మూడేళ్ల పాటు గవర్నర్‌గా నియమితులైన పటేల్ పదవీకాలం ముగియడానికి మరో ఎనిమిది నెలలుంది. రెండో దఫా పదవీకాలం పొడిగింపునకు కూడా అవకాశం ఉండేది. సాధారణంగా ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులయ్యేందుకు ఎక్కువగా బ్యూరోక్రాట్లు, ఆర్థికవేత్తలకే ప్రాధాన్యం దక్కుతోంది. కానీ, కార్పొరేట్ నేపథ్యం కూడా ఉన్న కొద్ది మంది ఆర్బీఐ గవర్నర్లలో పటేల్ ఒకరు. రిజర్వు బ్యాంకుకు రావటానికి ముందు.. ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కార్పొరేట్ దిగ్గజాల్లో పని చేశారు. డిప్యూటీ గవర్నర్‌గా సేవలందించి పూర్తి స్థాయి గవర్నర్‌గా ఎదిగిన వారి జాబితాలో పటేల్‌ది 8వ స్థానం. చివరిసారిగా వైవీ రెడ్డి ఇలాగే నియమితులయ్యారు. మరికొందరు డిçప్యూటీ గవర్నర్లు కూడా గవర్నర్‌గా విధులు నిర్వర్తించినప్పటికీ.. తాత్కాలికంగానే ఆ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్లుగా చేసిన వారిలో చాలా మందికి ఐఎంఎఫ్‌తో కూడా అనుబంధం ఉంది. కొందరు ఐఎంఎఫ్‌లో పనిచేసిన తర్వాత గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టగా.. మరికొందరు గవర్నర్లుగా పదవీ విరమణ అనంతరం ఐఎంఎఫ్‌లో సేవలందించారు. ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం: రాజన్ ఉర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో వృద్ధికి, దేశాభివృద్ధికి కీలక సంస్థలు పటిష్టంగా ఉండటం ఎంతగా అవసరమన్నది ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా బోర్డు సలహాదారు పాత్ర పోషిస్తూ వచ్చేదని, ఆర్బీఐ ప్రొఫెషనల్సే నిర్ణయం తీసుకునే వారని ఆయన పేర్కొన్నారు. కానీ కొన్నాళ్లుగా ఆర్బీఐ బోర్డు స్వభావంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని, దానికి నిర్వహణపరమైన అధికారాలు పెరగడంతో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్పై ప్రతికూల ప్రభావం పడుతుందని రాజన్ చెప్పారు. ఒకవేళ అదే చేయదల్చుకుంటే.. బోర్డులో కూడా ప్రొఫెషనల్సే ఉండాలి తప్ప ఇతరులకు చోటు కల్పించకూడదన్నారు. తద్వారా బోర్డులో ఇటీవల ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్ రంగ నిపుణుడు ఎస్కే మరాఠేల నియామకాన్ని పరోక్షంగా ఆక్షేపించారు. రాజీనామాకు కారణాలు ఇవేనా..? వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ చెబుతున్నప్పటికీ.. అంతకు మించిన కారణాలే ఉన్నాయని ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు చెబుతున్నాయి. పలు అంశాలపై కేంద్రం, ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వివాదాలు రేగాయి. ఇవే అంతిమంగా పటేల్ నిష్క్రమణకు దారి తీసి ఉంటాయన్నది ఆర్థిక నిపుణుల మాట. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని డెప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అక్టోబƇ 26న ఒక ప్రసంగంలో వ్యాఖ్యానించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒక దశలో ఆర్బీఐని కట్టడి చేసేందుకు కేంద్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సెక్షన్ 7(ఎ) నిబంధనను ప్రయోగించిందనే వార్తలొచ్చాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. అయితే, పలు అంశాలకు సంబంధించి బోర్డులోని ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ఆర్బీఐపై ఒత్తిడి పెంచే చర్యలు కొనసాగించింది. అంతిమంగా పటేల్ రాజీనామాకు దారితీసిన అంశాలు దాదాపు ఆరు ఉన్నాయి. అవి.. 1 వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. అయితే వృద్ధి గణాంకాల కోసం తాపత్రయపడుతున్న కేంద్రానికి సమస్యగా మారింది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గిస్తేనే రుణాలు పెరిగి, వృద్ధి రేటు పెరగటం సాధ్యమవుతుందన్నది కేంద్రం ఆలోచన. కానీ ద్రవ్యోల్బణం దృష్ట్యా అప్పటికి తగినట్లుగా ఆర్బీఐ వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న కేంద్రం... ఆర్బీఐ నియంత్రణలోని నిబంధనల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గి రాజుకుంది. 2 ఎన్పీఏల వర్గీకరణ.. బ్యాంకులు మొండి బకాయిలను (ఎన్పీఏ) వర్గీకరించడానికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 12న జారీ చేసిన సర్క్యులర్ ఇరువురి మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఇవి మరీ కఠినంగా ఉన్నాయని కేంద్రం భావించింది. తాజా సర్క్యులర్ కారణంగా ప్రభుత్వ బ్యాంకుల ఎన్పీఏలు మరింత పెరిగాయి. దీంతో భారీ నష్టాలు నమోదు చేశాయి. 3 నీరవ్ మోదీ కుంభకోణం.. అదే సమయంలో నీరవ్ మోదీ కుంభకోణంతో రెండింటి మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆర్బీఐ పర్యవేక్షణా లోపాలతోనే స్కామ్‌లు జరుగుతున్నాయంటూ ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ రంగ బ్యాంకుల్లాగా ఆజమాయిషీ చేసేందుకు తమకు పూర్తి అధికారాల్లేవని, మరిన్ని అధికారాలు ఇస్తే కచ్చితంగా నియంత్రించగలమంటూ పటేల్ కౌంటర్ ఇచ్చారు కూడా!!. 4 ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డిఫాల్ట్ పరిణామాల అనంతరం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) లిక్విడిటీ కొరత ఏర్పడింది. కొత్తగా రుణాలు జారీ చేయటానికి.. తాము బాండ్ల ద్వారా సమీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కొన్ని ఎన్బీఎఫ్సీలు ఇబ్బందులు పడ్డాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆర్బీఐకి కేంద్రం సూచించింది. కానీ వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉందంటూ.. రిజర్వ్ బ్యాంక్ కేంద్రం ఒత్తిళ్లను పట్టించుకోలేదు. 5 నచికేత్ మోర్ తొలగింపు.. పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉండగానే ఆర్బీఐ బోర్డు సభ్యుడు నచికేత్ మోర్‌ను కనీసం ఆయనకు మాటమాత్రమైనా చెప్పకుండా కేంద్రం తొలగించింది. ఇది ఆర్బీఐని చికాకుపరిచింది. మరింత డివిడెండు ఇవ్వాలంటూ ఆర్బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తుండటాన్ని మోర్ గట్టిగా వ్యతిరేకించడమే ఆయన తొలగింపునకు దారి తీసిందన్న అభిప్రాయం నెలకొంది. 6 పేమెంట్స్ సంస్థల నియంత్రణ అంశం.. గూగుల్, పేటీఎం తదితర చెల్లింపు సంస్థల నియంత్రణను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి కాకుండా వేరే నియంత్రణ సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. దీన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఆర్బీఐ బహిరంగంగానే వివరణ నిచ్చింది. బ్యాంకింగ్‌ను చక్కదిద్దారు: ప్రధాని గందరగోళంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను చక్కదిద్దారని, క్రమశిక్షణలో పెట్టారని ఉర్జిత్ పటేల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. చిత్తశుద్ధి గల ప్రొఫెషనల్ అని కితాబిచ్చారు. ‘‘స్థూల ఆర్థిక అంశాలపై అపారమైన అవగాహన గల గొప్ప ఆర్థిక వేత్త ఉర్జిత్ పటేల్. బ్యాంకింగ్ వ్యవస్థను గందరగోళ పరిస్థితి నుంచి బయటపడేసి చక్కదిద్దారు. క్రమశిక్షణలో పెట్టారు. ఆయన సారథ్యంలో ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలిగింది. ఆర్బీఐలో ఆరేళ్ల పాటు డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయనందించిన సేవలు విస్మరించరానివి’ అని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో మోదీ వివరించారు. పటేల్ సేవలు భేష్: జైట్లీ ఆర్బీఐ గవర్నర్‌గా పటేల్ ఎనలేని సేవలందించారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. ఆయన విజ్ఞానంతో తాను కూడా లబ్ధి పొందానని ట్విటర్లో పేర్కొన్నారు. ’ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ దేశానికి ఎనలేని సేవలందించారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను ’ అని జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ.. ఎకానమీ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత రుణంలో ఉర్జిత్ రాజీనామా చేయడం దురదృష్టకరం. ఎకానమీకి ఇది పెద్ద దెబ్బ. – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్బీఐ నిధులను లాక్కోవాలని చూస్తోంది ఉర్జిత్ రాజీనామా తనకు ఆశ్చర్యం కన్నా బాధ కలిగించిందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ద్రవ్య లోటు లక్ష్యాలను చేరుకునేందుకు ఆర్బీఐ నిధులను లాక్కోవాలనే ఎన్డీఏ ప్రభుత్వ అజెండానేతృత్వంలో ఆత్మగౌరవం ఉన్న ఏ నిపుణుడు పనిచేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. – మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విరాల్ రాజీనామా వదంతులు! గవర్నర్‌గా ఉర్జిత్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా రాజీనామా చేశారన్న వదంతులు గుప్పుమన్నాయి. వీటిని ఆర్బీఐ ఖండించింది. ఈ వార్త నిరాధారం, వాస్తవదూరం అని ఆర్బీఐ ప్రతినిధి ప్రకటించారు. పరపతి విధాన విభాగానికి ఇన్చార్జ్ కూడా అయిన విరాల్ ఆచార్య అక్టోబర్ 26వ తేదీన చేసిన ఒక ప్రసంగంలో... ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే... వ్యక్తిగత కారణాల రీత్యా, ప్రస్తుత హోదా నుంచి తక్షణమే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కొన్నాళ్లుగా రిజర్వ్ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఇటీవలి కాలంలో బ్యాంకు సాధించిన విజయాలు ఆర్బీఐ సిబ్బంది, అధికారులు, యాజమాన్యం ఎనలేని సహకారంతోనే సాధ్యపడ్డాయి. ఈ సందర్భంగా నా సహోద్యోగులు, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు తెలపదల్చుకున్నాను. – ఉర్జిత్ పటేల్ -
జైట్లీపై ‘పిల్’ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూలధన నిల్వలకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై దాఖలయిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ పిల్‌ను దాఖలు చేసిన ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాదికి రూ.50,000 కాస్ట్‌ను కూడా సుప్రీం విధించడం గమనార్హం. ఈ మొత్తం డిపాజిట్ చేసే వరకూ శర్మ ఎటువంటి పిల్ దాఖలు చేయలేరని, అందుకు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. పిల్ వేయడానికి తగిన కారణమేమీ కనిపించడం లేదని, పైగా ఆర్థికమంత్రినే ఈ పిల్లో ప్రధాన పార్టీని చేయడం తగదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది .పిల్‌ను చూస్తుంటే, ఆర్థికమంత్రే డబ్బు కాజేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. తొలుత సుప్రీం కాస్ట్ విధించలేదు. పిల్‌ను కొట్టివేసిన తర్వాత కూడా న్యాయవాది వాదనలను కొనసాగించడంతో న్యాయస్థానం సంబంధిత కాస్ట్ విధించింది. -
ఆర్బీఐ డీఫాల్టర్లను ఎందుకు వెల్లడించడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన బడా బాబుల పేర్లును వెల్లడించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఎన్నిసార్లు ఆదేశించినా, ఈ విషయంలోనే సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించినప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ పదే పదే ఒకే మాట చెబుతూ వస్తోంది. దేశం, బ్యాంకుల ఆర్థిక ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని ఆ సమాచారాన్ని వెల్లడించలేక పోతున్నామంటూ పాడిందే పాటగా పాడుతూ వస్తోంది. 2015 నుంచి ఆర్బీఐ తంతూ ఇదే. చివరకు విసిగిపోయిన కేంద్ర సమాచార కమిషన్ ఇదే విషయమై ఆర్బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు స్పందించిన ఆర్బీఐ సమాధానం ఇవ్వడానికి నవంబర్ 26వ తేదీ వరకు గడువు కావాలని సీఐసీని కోరింది. గడువు కావడానికి కారణం ఏమిటో సులభంగానే ఊహించవచ్చు. చీఫ్ సమాచార కమిషనర్ సతీష్ ఆచార్యులు నవంబర్ 20వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఉద్దేశ పూర్వకంగానే ఎగ్గొడుతున్న డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా సతీష్ ఆచార్యులు పట్టుబడుతుండడంతో ఆయన పోయే వరకు నిరీక్షిద్దామనే వైఖరితో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యవహిరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ స్థానంలో వచ్చే కొత్తవారిని ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కొన్ని బడా బ్యాంకులు ఇప్పటికే తమ వెబ్సైట్లలో డీ ఫాల్టర్లయిన బడా బాబుల పేర్లను వెల్లడించాయని ఆదివారం నాడు ఎన్డీటీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార హక్కు కింద ఆర్బీఐని సీఐసీ కోరుతున్న సమాచారం ఇప్పటికే బ్యాంకుల వెబ్సైట్లలో ఉన్నాయని ఆ వార్తా కథనం పేర్కొంది. ఈ సమాచారం బయటకు రావడంతో ఆర్బీఐ చెబుతున్నట్లుగా లేదా భయపడుతున్నట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థగానీ, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిగానీ దెబ్బ తినే సూచనలుగానీ, అల్లకల్లోలం అలికిడిగానీ కనిపించడం లేదే! డీఫాల్టర్ల సమాచారాన్ని వెల్లడించాల్సిన విధి ఆర్బీఐదని 2015లోనే సుప్రీం కోర్టు స్పష్టంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆర్బీఐలో చలనం లేదు. ‘స్వచ్ఛమైన, పారదర్శకమైన పద్ధతిలో చాలా ఆర్థిక సంస్థలు తమ లావా దేవీలను నిర్వహించడం లేదన్నది మాకు బలమైన అనుమానం. వాటితో సంఘటితమైన ఆర్బీఐ, వాటి లావాదేవీలను ప్రజల దష్టికి రాకుండా కప్పి పుచ్చుతోంది. అది భావ్యం కాదు. అగౌర వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవడం ఆర్బీఐ విధి’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మాటలను పెడ చెవిన పెడితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కింద జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇటీవల ఆర్బీఐని తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం బడా డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు ఆర్బీఐని ఆదేశించలేదు? ఆ బడా డీఫాల్టర్లే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి భారీగా విరాళాలు ఇస్తున్న వారే అవడం వల్లనా?! -
31 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: దాదాపు 31 నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. వీటిలో 27 సంస్థలు బెంగాల్‌కి చెందినవే కావడం గమనార్హం. ఆర్బీఐ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఎన్బీఎఫ్సీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో నాలుగు సంస్థలు ఉత్తరప్రదేశ్‌కి చెందినవి ఉన్నాయి. మరోవైపు, ఆయా సంస్థల అభ్యర్ధన మేరకు 17 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో ప్రాపికాన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొదలైనవి ఉన్నాయి. -
ఆర్థిక పుటలో ‘ఈ రోజు’ శాశ్వతం
సాక్షి, న్యూఢిల్లీ : మన జీవితంలో చోటుచేసుకునే కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఎప్పటికీ మరచిపోలేం. ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, పిల్లాడు పుట్టడం, ప్రేమించినవారు మరణించడం తదితర సంఘటనలను మరవలేం. అలాగే మన జీవితాలను ప్రభావితం చేసే సామాజంలో లేదా దేశంలో జరిగే సంఘటనలకు కూడా మరచిపోలేం. వాటి గురించి చెప్పమంటే నిన్న మొన్న జరిగినట్లే చెప్పగలం. అలాంటి సంఘటనల్లో ఒకటి దేశంలో పెద్ద నోట్ల రద్దు. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2016, నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశానికే పెద్ద షాక్ ఇచ్చారు. దేశంలో రోజు రోజుకు పేరుకుపోతున్న నల్లడబ్బును వెలికి తీయడానికి, నకిలీ కరెన్సీని అరికట్టడానికి, టెర్రరిజాన్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన లక్ష్యాల్లో ఏ ఒక్క లక్ష్యమైనా నేరవేరిందా? దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ఉద్యోగావకాశాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపింది? పెద్ద నోట్లను రద్దు చేసిన మరుసటి రోజు నుంచి సామాన్య ప్రజలు ఏటీఎంల ముందు భారీ ఎత్తున క్యూలు కట్టి అష్టకష్టాలు పడ్డారు. రోజుల తరబడి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిలబడినా ప్రయోజనం లేకపోవడంతో అనేక మంది వృద్ధులు, పింఛనుదారులు క్యూలలోనే ప్రాణాలు వదిలారు. అలా దేశవ్యాప్తంగా 150 మందికిపైగా మరణించారు. రైతులు, ముఖ్యంగా కూరగాయ రైతులు, చిల్లర వ్యాపారులు భారీగా నష్టపోయారు. దేశంలో పలు చిన్న ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. చేనేత కార్మికులు ఉపాధినికోల్పోయి వారి వద్ద పనిచేసే కార్మికులు దిక్కులేకుండా పోయారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయి సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఇబ్బందులు పడ్డారు. ఒక్క రియల్ ఎస్టేట్ రంగానికే రెండు లక్షల కోట్ల రూపాయల న ష్టం వాటిల్లింది. పేద, మధ్య తరగతి ఇళ్లలో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోగా, కొన్ని పెళ్ళిళ్లు వాయిదా పడ్డాయి. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన 50 రోజుల్లోనే ప్రతికూల ఫలితాలు రావడం మొదలయ్యాయి. అయినా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయంటూ మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఏడాది గడిచినా ఒక్క మంచి ఫలితం కనిపించలేదు. మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే వచ్చింది. ఈ రోజుకు రెండేళ్లు గడిచాయి. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. దేశం మొత్తం కరెన్సీలో 86 శాతం ఉన్న రూ. 500, రూ 1000 నోట్లను రద్దూ చేయడం వల్ల దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రావని, అదంతా నల్లడబ్బుగా భారత ప్రభుత్వానికి మిగులుతుందని ప్రభుత్వం భావించింది. రద్దు చేసిన నోట్లలో 99. 30 శాతం వెనక్కి తిరిగి వచ్చాయి. అంటే, 10. 720 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన నల్లడబ్బు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలే. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రభుత్వానికి చిక్కిన నల్లడబ్బు మొత్తం 16 వేల కోట్లే. కొత్త నోట్లను ముద్రించడానికి అయిన ఖర్చు 7,965 కోట్ల రూపాయలు. పట్టబడిన నల్ల డబ్బును లాభం అనుకుంటే అందులో నుంచి నోట్ల ముద్రణకు అయిన ఖర్చును తీసివేస్తే మిగిలేది 8, 035 కోట్ల రూపాయలు. పెద్ద నోట్ల రద్దు చేసిన సంవత్సరంలో పట్టుబడిన నకిలీ కరెన్సీ 7.6 లక్షల రూపాయలు. అంతకుముందు పట్టుబడిన నకిలీ కరెన్సీ 6.3 లక్షల రూపాయలు. స్థూల జాతీయోత్పత్తి వృద్థి రేటు అంతకుముందు 7.1 శాతం ఉంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా అది 5. 7 శాతానికి పడిపోయింది. పడిపోయిన వృద్ధి రేటును దాచి పెట్టేందుకు 2017వ ఆర్థిక సంవత్సరం నుంచి మోదీ ప్రభుత్వం వృద్ధి రేటును లెక్కించేందుకు కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టింది. కొత్త పద్ధతి ప్రకారం 2018లో వృద్ధి రేటును 7.3గా చూపింది. కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు ఐదేళ్ల క్రితం వృద్ధి రేటు ఎంత ఉన్నదో కొత్త పద్ధతి ప్రకారం లెక్కించి తప్పనిసరిగా చూపించాలన్నది ఆర్థిక నియమం. ఈ నియమం ప్రకారం యూపీఏ ప్రభుత్వం హయాంలో వృద్ధి రేటు 10.5 శాతమని తేలింది. కేంద్ర ప్రభుత్వం స్టాటటిక్స్ వెబ్సైట్లో ఈ శాతాన్ని తొలుత చూపినా కొన్ని రోజులకే మాయమయింది. అయినప్పటికి రెండేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చూస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సముచితం సాహసోపేతమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు సమర్థించుకున్నారు. సాహసోపేతం కావచ్చుగానీ సముచితం ఎలా అవుతుందో ఆయనకు, ఆయన ప్రభుత్వానికే తెలియాలి. ఆర్థిక చరిత్ర పుటలో ఈ రోజు ఎప్పటికి నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ‘కొన్ని గాయాలు కాలంతోపాటు మానిపోతుంటాయి. కాన్ని పెద్ద నోట్ల రద్దు చేసిన గాయాలు మానకపోగా, కాలంతోపాటు అవి మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, చిన్న, పెద్దా, ముసలి, ముతక, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గాయపర్చింది పెద్ద నోట్ల రద్దు’ అంటూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. -
1న వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు!
ముంబై: దీపావళి నేపథ్యంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్1వ తేదీన ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు విడుదల చేయనుంది. పండుగల సీజన్ ఫండ్స్ డిమాండ్స్‌ను ఎదుర్కొనడానికి నవంబర్ నెలలో మొత్తం రూ.40,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గత వారం ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎన్పీఏల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల వరకూ...
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్పీఏ) సహా బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్షోభం నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్ సమావేశం చర్చించింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌సహా బోర్డ్‌లోని పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్ మొదటివారంలో మరోసారి బోర్డ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది,. పేటీఎం లాంటి ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న కేంద్రం ఆలోచనను ఆర్బీఐ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
రాణా కపూర్‌కు ఆర్బీఐ నో
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిరాకరించింది. కొత్త చీఫ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా నియమించాలని బ్యాంకు బోర్డును ఆదేశించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలకు యస్ బ్యాంక్ బుధవారం ఈ విషయాలను తెలియజేసింది. ‘యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రాణా కపూర్ వారసుడిని 2019 ఫిబ్రవరి 1లోగా ఎంపిక చేయాలని రిజర్వ్ బ్యాంక్ పునరుద్ఘాటించింది‘ అని వివరించింది. దాదాపు రూ.10,000 కోట్ల మేర మొండిబాకీలను పద్దుల్లో సరిగ్గా చూపలేదని ఆడిట్లో తేలిన నేపథ్యంలో మరో విడత సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇదివరకే నిరాకరించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పదవీకాలాన్ని 2019 జనవరి 31 దాకా ఆర్బీఐ కుదించింది. అప్పటికల్లా కొత్త సీఈవోను నియమించాలంటూ ఆదేశించింది. దీంతో కొత్త సీఈవో అన్వేషణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన బ్యాంక్.. కపూర్ పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది. ఈ ప్రతిపాదననే ఆర్బీఐ తాజాగా తోసిపుచ్చింది. 2004లో యస్ బ్యాంక్ ప్రారంభమైనప్పట్నుంచీ రాణా కపూర్ ఎండీ, సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయనకు బ్యాంక్‌లో 10.66 శాతం వాటాలు ఉన్నాయి. బుధవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 6.85 శాతం క్షీణించి రూ. 231.75 వద్ద క్లోజయ్యింది.