
న్యూఢిల్లీ: మొండిబాకీలు (ఎన్‌పీఏ) భారీగా పేరుకుపోయిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్‌బీ) రిజర్వ్ బ్యాంక్ మరింతగా దృష్టి సారించింది. ఎన్‌పీఏలను కట్టడి చేసే దిశగా వీటిపై ఆంక్షలు విధించింది. సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నిబంధనల పరిధిలోకి చేర్చింది.
అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ జాబితాలో ఉన్నట్లు తెలియవచ్చింది.
తాజాగా మరో అయిదు బ్యాంకులు కూడా పీసీఏ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రా బ్యాంక్‌తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈ లిస్టులో ఉండొచ్చని అంచనా.
పీసీఏ నిబంధనలు వర్తిస్తే...?
బ్యాంకులపై ఆర్‌బీఐ గనక పీసీఏ (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్) ప్రయోగిస్తే... బ్యాంకులు కొత్త శాఖలు తెరవడంపైన, సిబ్బందిని నియమించుకోవటంపైన ఆంక్షలు అమల్లోకి వస్తాయి. అలాగే రుణ లావాదేవీలపైనా పరిమితులు అమలవుతాయి. భారీ రుణాలివ్వాలంటే ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి అవుతుంది. మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకులు అంతర్గతంగా పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ఆర్‌బీఐ ఈ నిబంధనలు ప్రయోగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment