రూ. 88,000 కోట్ల విలువైన రూ. 500 నోట్లు కనిపించడం లేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఆర్‌బీఐ కొట్టిపారేసింది. కరెన్సీ నోట్లపై వివరణ తప్పుగా ఉందని పేర్కొంది.
పలు నివేదికల ప్రకారం.. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌లో 375.450 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించినట్లు రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఆర్‌టీఐ) వెల్లడించింది. అయితే, ఆర్‌బీఐ మాత్రం ఏప్రిల్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్య కాలంలో కేవలం 345.000 మిలియన్ల నోట్లు మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు చెప్పింది. మరి మిగిలిన కరెన్సీ నోట్లు ఎక్కుడున్నాయి? అనే అంశం చర్చాంశనీయంగా మారింది.
ఈ క్రమంలో నోట్ల విషయంలో నివేదికలు అస్పష్టంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తెలిపింది. ప్రింట్ ప్రెస్‌లలో ముంద్రించిన నోట్లన్ని ఆర్‌బీఐ వద్దకు చేరాయని, అందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓ వర్గానికి చెందిన మీడియా సంస్థలు కరెన్సీ నోట్ల గురించి కథనాలు ప్రచురించాయి. ఆ కథనాలు తన దృష్టికి రావడంతో ఆర్‌బీఐ స్పందించింది. ఈ నివేదికలు సరైనవి కావని ఆర్‌బీఐ పేర్కొంది.
Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw
— ReserveBankOfIndia (@RBI) June 17, 2023
నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించే ప్రోటోకాల్‌లతో సహా, ప్రెస్‌లలో ముద్రించబడిన, సరఫరా చేయబడిన బ్యాంక్ నోట్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన వ్యవస్థలను కలిగి ఉన్నామని ఆర్‌బీఐ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ ఇస్తున్న సమాచారం సరైందేనని, ప్రజలు వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ వెల్లడించింది.
ఇదీ చదవండి : స్టార‍్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’!
Comments
Please login to add a commentAdd a comment