ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల ప్రైవేట్ జెట్ ఇదే.. | Mukesh Ambani Rs 1000 Crore Boeing 737 MAX 9 Private Jet | Sakshi
Sakshi News home page

ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల ప్రైవేట్ జెట్ ఇదే..

Published Sat, Mar 29 2025 12:26 PM | Last Updated on Sat, Mar 29 2025 12:38 PM

Mukesh Ambani Rs 1000 Crore Boeing 737 MAX 9 Private Jet

భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలుసు. వీరు విలాసవంతమైన నివాసంలో ఉంటూ.. ఖరీదైన కార్లను ఉపయోగిస్తుంటారు. ఇవి కాకుండా ఈయన వెయ్యి కోట్ల రూపాయల ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారు.

ముకేశ్ అంబానీ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ బోయింగ్ 737 మ్యాక్స్ 9. దీని విలువ రూ.1000 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన విమానం భారతదేశంలోని ఏ వ్యాపారవేత్త దగ్గరా లేదు. దీంతో అత్యంత ఖరీదైన విమానం కలిగిన వ్యాపారవేత్తగా అంబానీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్‌ను.. వాషింగ్టన్‌లోని రెంటన్‌లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేసి ఇండియాకు డెలివరీ చేశారు. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ కాస్త ఆలస్యం అయింది. మొత్తానికి అంబానీ భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 యజమానిగా నిలిచారు.

ఇదీ చదవండి: అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..

బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్‌ను ముకేశ్ అంబానీ ప్రేత్యేకంగా తయారు చేసుకున్నారు. ఈ జెట్ మాత్రమే కాకుండా.. బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ERJ-135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేట్ విమానాలు అంబానీ వద్ద ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement