ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కు చైర్మన్ ముఖేష్ అంబానీ. మరోవైపు ఆయన భార్య నీతా అంబానీ ((Nita Ambani) కూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) స్థాపకురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. అంతేకాదు ఐఓసీ సభ్యురాలిగా ఉన్నారు నీతా అంబానీ. బిలియనీర్ అంబానీ తన భార్యకు ఇచ్చిన విలువైన బహుమతి ఒకటి ఇపుడు నెట్టింట సందడిగా మారింది. అదేంటో చూద్దామా.
వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా రాణిస్తున్న తన భార్య ప్రయాణ ఇబ్బంది లేకుండా ముఖేష్ అంబానీ ఆమెకు ఒక ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చాట. 2007లో నీతా అంబానీ పుట్టినరోజున అంబానీ ఈ అందమైన గిప్ట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రయాణాల కోసం కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319ను ప్రైవేట్ జెట్ బహుమతిగా ఇచ్చి నీతాను సర్‌ప్రైజ్ చేశారట. సహా అల్ట్రా-లగ్జరీ ఇంటీరియర్‌లతో అదిరిపోయే దీని విలువ రూ.230 కోట్లు. అత్యంత అందమైన ఈ ప్రైవేట్ జెట్ ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువేమీ కాదు.
కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319 ప్రత్యేకతలు
చూడ్డానికి విలాసవంతంగా, అందంగా ఉండే ప్రైవేట్ జెట్‌లోని సౌకర్యాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్‌తో కూడిన మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుందీ ప్రైవేట్ జెజ్‌లో. ఒకేసారి 10-12 మందికి పైగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అసాధారణ బహుమతి అన్ని సౌకర్యాలతో కూడిన సజావుగా, విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. సుదీర్ఘ ప్రయాణాల సమయంలో సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ జెట్ విమానంలో హై-డెఫినిషన్ స్క్రీన్లు, సరౌండ్ సౌండ్, పెద్ద మీడియా లైబ్రరీ ఉన్నాయి. ప్రీమియం ఫిట్టింగ్‌లు, మార్బుల్ యాక్సెంట్‌లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బాత్రూమ్‌లు ఉన్నాయి. ఈ జెట్ విమానంలో ఎర్గోనామిక్ సీటింగ్ పెద్ద కాన్ఫరెన్స్ టేబుల్, విశాలమైన లాంజ్ ఏరియాదీని సొంతం.
ప్రైవేట్ జెట్‌లో ధీరేంద్ర శాస్త్రి
అనంత్ అంబానీ వివాహ సమయంలో ఈ ప్రైవేట్ జెట్ విశేషమైన దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో అనంత్ తన ప్రయాణానికి ప్రైవేట్ జెట్‌ను అందించి, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించారని వెల్లడించారు.అయితే బిజీగా షెడ్యూల్ కారణంగా తొలిత సంకోచించిన శాస్త్రి అంబానీ ఆహ్వానాన్ని అందుకుని పెళ్లి తంతులుపాల్గొన్నారు. అంతేకాదు అంబాన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దులైపోయారు కూడా. కాగా అంబానీకి దీంతోపాటు బోయింగ్ 737 మాక్స్ 9 కూడా ఉంది. అధునాతన సాంకేతికత, LEAP-18 ఇంజిన్‌లతో కూడిన ఈ విమానం భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌లలో ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment