భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ ఏమి చేసినా చెప్పుకోదగ్గదిగానే ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడిపే వీరు ఎప్పుడూ లగ్జరు కార్లను కొనుగోలు చేయడమే కాకుండా గిఫ్ట్స్ కూడా చాలా లగ్జరిగానే ఉండేట్లు అందిస్తారు. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీ తన కోడలు శ్లోకా మెహతాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నీతా అంబానీ తన కోడలు శ్లోక మెహతాకు ఇచ్చిన నెక్లెస్ విలువ ఏకంగా రూ.451 కోట్లు అని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ గిఫ్ట్‌ను శ్లోకా మెహతా 2019లో ఆకాష్ అంబానీని వివాహం చేసుకున్నప్పుడు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 91 వజ్రాలు పొదిగిన ఈ నెక్లెస్‌లో 407.48 క్యారెట్ ఎల్లో డైమెండ్ కూడా కలిగి ఉంది.
మరికొన్ని గిఫ్ట్స్ వివరాలు
ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీ 44వ పుట్టినరోజు సందర్భంగా రూ.240 కోట్ల విలువైన ఏ319 లగ్జరీ జెట్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా గత కొన్ని రోజులకు ముందు ఆమెకు రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీని కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పటి వరకు ఇదే భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు గిఫ్ట్ అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా..
అనంత్ అంబానీ నిశ్చితార్థం సందర్భంగా ఆకాష్ అంబానీ రూ.1.3 కోట్ల విలువైన 18కె పాంథెరే డి కార్టియర్ బ్రూచ్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ముఖేష్ అంబానీ మాత్రం ఆ సమయంలో సుమారు రూ. 4.5 కోట్ల బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment