Shloka Mehta
-
శ్లోకా మెహతా స్టైలిష్ లుక్ సీక్రెట్ ఇదే..! ఆ స్పెషల్ లెహంగాలు..
రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ ఇంట గత నెల జులైలో గ్రాండ్‌గా అనంత్ రాధికల వివాహం జరిగి సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో అంబానీ మహిళలంతా స్టైలిష్ ఐకాన్లు లాగా అత్యంత ఆకర్షణీయంగా కనిపించారు. ఆ వివాహ తంతులో ఆ ఇంట మహిళలు ధరించిన జ్యువెలరీ దగ్గర నుంచి చీరల వరకు ప్రతిది హైలెట్‌గా కనిపడింది. అయితే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది శ్లోకా మెహతా అనే చెప్పాలి. ఆమె ప్రతి ఈవెంట్‌కి ధరించిన డ్రెస్, జ్యువెలరీ ఇలా ప్రతిదీ అత్యంత లగ్జరియస్‌గా ఉండటమే గాక ఆమె కూడా స్టైలిష్ ఐకానిక్‌గా మెరిసింది. ఆ కార్యక్రమంలో అందరి దృష్టి శ్లోకా మీదనే ఉంది. అంతలా తన విభిన్నమైన స్టైలిష్ లుక్‌తో కట్టిపడేసింది శ్లోకా. అందుకు కారణం ఎవరో తెలుసా..!ఆమె ఎవరో కాదు ముఖేశ్ నీతా అంబానీల ప్రత్యేక అనుబంధ కలిగిన మహిళ. శ్లోకా మెహతాకి స్వయనా చెల్లెలు అయినా దియా మెహతా జాతియా. ఆమె స్కూల్ చదువంతా అంబానీ స్కూల్లోనే సాగింది. ఆ తర్వాత తన అభిరుచి రీత్యా లండన్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్లో చేరి ఫ్యాషన్‌కి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్ చేసింది. View this post on Instagram A post shared by Diya Mehta Jatia (@dmjatia) ఇక దియా అంబానీ ఇంట జరిగే గ్రాండ్ వేడుకలో తన అక్క శ్లోకా రూపాన్ని అందంగా కనిపంచేలా ప్రముఖ డిజైనర్లతో కలిసి మంచి లెహంగాలను డిజైన్ చేసింది. అవి కూడా మన వారసత్వానికి చిహ్నంగా ఉండే చీరలనే ఎంపిక చేసుకుని మరీ డిజైన్ చేయడమ ఆమె ప్రత్యేకత. ఆ వివాహ వేడుకలో జరిగే ప్రతి తంతులో ఇషా ప్రతి లుక్‌ని చాలా అద్భుతంగా తీర్చదిద్దింది. ఆమె కేవలం ఫ్యాషన్ డిజైనర్ మాత్రమే గాదు విభిన్న వెంచర్లు కలిగిన వ్యాపారవేత్త కూడా. అంతేగాఉ ఆమె అత్యంత డిమాండ్ ఉన్న స్టైలిస్ట్ డిజైనర్లో ఒకరు కూడా. ఆమె యూకే ఆధారిత రెస్టారెంట్ యజమాని ఆయుష్ జాతియాను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.(చదవండి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి మర్లెనా ఇష్టపడే రెసిపీ ఇదే..!) -
అనంత్-రాధిక రిసెప్షన్ : అంబానీ మనవడి రియాక్షన్, వైరల్ వీడియో
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ చిన్న కుమారుడు రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసాయి. పెళ్లి తరువాత శుభ్ ఆశీర్వాద్ , మంగళ్ ఉత్సవ్‌లను నిర్వహించారు గత కొన్ని రోజులుగా గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏదో ఒక ముచ్చట సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ రిసెప్షన్లో అంబానీ వారసుడు పృథ్వీ ఆకాశ్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకాకుమారుడు పృథ్వీ అంబానీ సందడి ప్రత్యేకంగా నిలుస్తోంది. అనంత్, రాధిక పెళ్లి తరువాత అంబానీ ఫ్యామిలీ అంతా ఫోటోకు ఫోజులిస్తుండగా అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చిన పృథ్వీ రాధిక కాళ్ల దగ్గర జారి పడి పోయాడు. కానీ వెంటనే లేచి సర్దుకున్నాడు. దీంతో తల్లి శ్లోకా కంగారుపడుతూ ముందుకొచ్చింది. ఇంతలో నానమ్మ అతడికి మైక్ అందివ్వగా జై శ్రీకృష్ణ అంటూ ముద్దుగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.Wow what a landing...Chalo koi to nikla humhre jesa inki family me 😂😃😃 pic.twitter.com/pRMBdKaC1Z— Piku (@RisingPiku) July 15, 2024 -
అత్తకు తగ్గ, పెద్దింటి కోడలు: శ్లోకా మెహతా బర్త్‌డే స్పెషల్
-
అంబానీ పెద్ద కోడలు శ్లోకా బర్త్‌డే : ఆకాశ్ స్పెషల్ విషెస్ వైరల్
ఒకవైపు రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం అంతా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా బర్త్డేఈ రోజు. ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ శ్లోకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ముందుగా అంబానీ పెద్ద కుమారుడు, శ్లోకా మెహతా భర్త ఆకాశ్ అంబానీ తన భార్యకు స్పెషల్ విషెస్ అందించారు. తరువాత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఇషా, ఆనంద్ పిరామిల్ దంపతులతోపాటు కాబోయే వధూవరులు అనంత్, రాధిక మర్చంట్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందించారు. ప్రసిద్ధ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్ ఎండీ కుమార్తె శ్లోకా మెహతా. 1990, జూలై 11 న పుట్టింది. 2019 మార్చిలో ఆకాశ్ అంబానీనీ పెళ్లాడింది. వీరికి పృథ్వీ , వేద ఆకాశ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.కాగా జూలై 12న తన చిరకాల ప్రేయసి రాధిక మర్చంట్‌ను అనంత్ పెళ్లాడ బోతున్నాడు. ఈ పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అతిథి మర్యాదల ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. అంతేకాదు వీరి పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్‌గా నిలిచింది. ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుక చాల కలర్ఫుల్గా సాగింది. ఈ హల్దీ వేడుకలో ఇషా పిరమల్, శ్లోకా మెహతా రంగరంగుల లెహంగాలతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో కాబోయే పెళ్లి కూతరు రాధిక ఆమె సోదరి సాంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణ శోభను తీసుకొచ్చారు. ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా, అనామికా ఖన్నా డిజైనర్ వేర్ లెహంగాను ధరించింది. ఆమె ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బంగారు రంగు వంటి మరెన్నో రంగులతో కూడిన శక్తివంతమైన లెహంగా సెట్‌ను ధరించింది. దానికి తగినట్టుగా చిలుక ఆకుపచ్చ స్కర్ట్ దానిపై పూల ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు. ఇక ఇషా మల్టీకలర్ కలర్ లెహంగాను ధరించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ టోరాని దిల్ రంగ్ జీవా లెహంగా సెట్‌తో అలరించింది. ఇది ఇండో వెస్టట్రన్ టచ్‌తో కూడిన సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా. దీనికి రా సిల్క్‌తో రూపొందించిన టాసెల్ అలంకారాలు హైలెట్‌గా ఉండగా, అందమైన నెక్లైన్తో కూడిన ప్రత్యేకమైన బ్లౌజ్ మరింత అకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!) -
వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా..!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఓ రేంజ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇంటిలో జరిగే ఆఖరి వివాహం కావడంతో మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల లగ్జరీ క్రూయిజ్‌లో ఏకంగా 800ల మంది అతిథుల సమక్షంలో అనంత్-రాధికల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన అంబానీ కుటుంబ సభ్యుల వేషాధారణకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ వేడుకల్లో వధువు ధరించిన ప్రతి డ్రెస్ హైలెట్‌గా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా రాధిక ధరించిన అనంత్ లవ్ లెటర్ని ముద్రించిన గౌను అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక ఈ వేడుకలో ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం ప్రిన్స్ రేంజ్లో తన వేషాధారణతో ఆకట్టుకుంది. ఈ వేడుకలో రాధికాకు ఏ మాత్రం తగ్గకుండా ఆమె ఆహార్యం ఉంది. ముఖ్యంగా ఆమె ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ధరించిన డ్రెస్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆమె నీలం- బంగారు డ్రెస్‌లో యువరాణిలో మెరిసింది శ్లోకా మెహతా. ఆమె ఈ వేడుకలో కోసం ధరించిన వెర్సాస్ బ్రాండ్ గౌనుని ఎంచుకుంది. ఈ గౌను 2018 మెట్ గాలో జిగి హడిద్ ఫ్యాషన్ శైలిని అనుకరించింది. ఈ గైనును రూపొందించింది స్టైలిస్ట్ దియా మెహతా జటియా. ఆమె ఈ వెర్సాస్ గౌను శ్లోకా మెహతా కోసం ఎందుకు రూపొందించారో వెల్లడించింది. శ్లోకా మెహతా ఇద్దరు పిల్లల తల్లి. మాతృత్వం రీత్యా శరీరాకృతి మారడం సహజం. అది బయటకు కనిపించకుండా ఉండేలా ఆమెలో ఉన్న యువరాణి లుక్‌ని వెలికి తీసేలా ప్రజెంట్ చేసేందుకు ఈ వెర్సాస్ గౌనుని రూపొందించామని చెప్పారు. మెట్ గాలాలో ఆకర్షణగా కనిపించిన జిగి హడిడ్ రూపాన్ని మెహాతాలో కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసేందుకు ఇలా నీలం బంగారు గౌనుని డిజైన్ చేశామని అన్నారు. శ్లోకా ఈ గౌనుకి తగ్గట్టుగా రోజీ మేకప్, డైమండ్ జ్యువెలరీని ధరించింది. ఈ గౌనులో శ్లోకా యువరాణి రేంజ్ స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఒత్తిడికి గరైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా? పరిశోధన ఏం చెబుతోందంటే..) -
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
శ్లోకా మెహతా వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం వారి రేంజ్ తగ్గట్టుగానే లగ్జరీయస్‌గా ఉంటారు. ఇటీవలే ముంఖేశ్ నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో శ్లోకా మెహతా అంబానీల లెవల్‌కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్ బ్రాండ్స్‌తో తళుక్కుమన్నారు. ఇంతfరకు అంబానీల కుటుంబంలోని మగవాళ్లు అత్యంత లగ్జరీయస్ వాచ్‌లు ధరించడం గురించి విని ఉన్నాం. ఆ కుటుంబంలోని మహిళలు కూడా అలాంటివి ధరిస్తారని శ్లోకా మెహతా ప్రూవ్ చేశారు. నిజానికి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అంబానీ కుటుంబం తొమ్మిది పేజీల మెనులో ఏయే రోజులు సెలబ్రెటీలు, అతిథులు ఎలాంటి డ్రెస్ కోడ్ ధరించాలనే రూల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, విదేశీ ప్రముఖులు వరకు అందరూ ఈ వేడుకలకు తగ్గ వస్త్రధారణతో సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో శ్లోకా మెహతా డైమండ్స్‌తో పొదిగిన నెక్లెస్, జూకాలతో అందర్నీ ఆకర్షించారు. ఈ వేడుకల్లో ఆమె ఎరుపురంగు వేలెంటినో డ్రస్‌తో అంబానీ కోడలు అంటే ఇది అనేంత రేంజ్లో గ్లామరస్ లుక్‌లో కనిపించారు. డైమండ్స్ అంటే ఇష్టపడే శ్లోకా ఈ వేడుకల్లో చేతికి పటేక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్ డైమండ్ వాచ్‌ని ధరించింది. మొత్తం వాచ్ అంతా ట్రాన్స్పరెంట్ వజ్రాలతో పొదగబడి ఉంటుంది. ఎంత దూరాన ఉన్న చేతికి ఉన్న వాచ్ ఆకర్షణ కనిపించడమే దీని ప్రత్యేకత. అయితే ఈ వాచ్ ఖరీదు వింటే కళ్లు బైర్లుకమ్మడం గ్యారంటీ. ఇంతకీ ఈ వాచ్ ధర ఎంతంటే అక్షరాల రూ. 4.8 కోట్లు. అమ్మ బాబోయే! జస్ట్ వాచ్కే అన్ని కోట్లా..! అని నోరెళ్లబెట్టకండి. అందులోనూ అంబానీ పెద్ద కోడలు ఆ మాత్రం రేంజ్ మెయింటెయిన్ చేయాల్సిందే కదూ. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) (చదవండి: అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్: ఇవాంకా ట్రంప్ డ్రస్ స్టయిల్ అదిరిందిగా!) -
అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ : డైమండ్ నగలతో మెరిసిపోయిన శ్లోకా
బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకులు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మరి ఇంత ఘనంగా జరుగుతున్న వేడుకల్లో అంబానీ ఇంటి పెద్ద కోడలు కూడా అదే రేంజ్లో ఉండాలిగా. జామ్ నగర్లో 'ఎవర్‌ల్యాండ్‌లో ఈవినింగ్' ధీమ్‌తో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఆకాష్ అంబానీ సతీమణి శ్లోకా మెహతా భారీ వజ్రాలతో మెరిసిపోయింది. తన ఐకానిక్ ఫ్యాషన్ స్లయిల్తో శ్లోకా ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేసింది. పాప్ సంచలనం రిహన్నగాలా ఈవెంట్, కాక్టెయిల్ పార్టీలో ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ వాలెంటినో రెడ్ గౌనులో అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. ఫ్లోరల్ క్రాప్ ఆఫ్ షోల్డర్ టాప్‌తో పాటు సీక్విన్డ్ వర్క్ లాంగ్ స్కర్ట్‌తో మోడ్రన్ లుక్‌లో అదర గొట్టేసింది. డైమండ్లు పొదిగిన లేయర్డ్ నెక్లెస్, డైమండ్ స్టడ్ చెవిపోగులు, లేయర్డ్ బ్రాస్లెట్, డైమండ్ రింగ్, అద్భుతమైన డైమండ్ వాచ్‌తో ధగ ధగ లాడిపోయింది. తన ఎటైర్‌లో వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె అని నిరూపించుకుంది. గతంలో అనంత్-రాధిక మర్చంట్ లగాన్ లఖ్వాను వేడుకలో కూడా శ్లోకా గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే. -
అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా..
త్వరలో ముఖేష్ అంబానీ ఫ్యామిలిలో మరో వ్యక్తి చేరనున్నారు. నీతా అంబానీ చిన్న కొడుకు 'అనంత్ అంబానీ' రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల సంఖ్య ఓ అడుగు ముందుకు వేయనుంది. అయితే ఈ కథనంలో అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. ఆనంద్ పిరమల్ అజయ్ పిరమల్ & డాక్టర్ స్వాతి పిరమల్ కుమారుడైన ఆనంద్ పిరమల్ 'పిరమల్ గ్రూప్' బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. శ్లోకా మెహతా రస్సెల్ మెహతా, మోనా మెహతా కుమార్తె శ్లోకా మెహతా రోజీ బ్లూ ఇండియా కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లా & న్యూజెర్సీలోని ఐవీ లీగ్ సంస్థ అయిన ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి ఆంత్రోపాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. రాధిక మర్చంట్ వీరేన్ మర్చంట్ & శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఎన్కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్ బోర్డులో ఒకరుగా ఉన్నారు. ఈమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. -
గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్
భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ ఏమి చేసినా చెప్పుకోదగ్గదిగానే ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడిపే వీరు ఎప్పుడూ లగ్జరు కార్లను కొనుగోలు చేయడమే కాకుండా గిఫ్ట్స్ కూడా చాలా లగ్జరిగానే ఉండేట్లు అందిస్తారు. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీ తన కోడలు శ్లోకా మెహతాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నీతా అంబానీ తన కోడలు శ్లోక మెహతాకు ఇచ్చిన నెక్లెస్ విలువ ఏకంగా రూ.451 కోట్లు అని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ గిఫ్ట్‌ను శ్లోకా మెహతా 2019లో ఆకాష్ అంబానీని వివాహం చేసుకున్నప్పుడు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 91 వజ్రాలు పొదిగిన ఈ నెక్లెస్‌లో 407.48 క్యారెట్ ఎల్లో డైమెండ్ కూడా కలిగి ఉంది. మరికొన్ని గిఫ్ట్స్ వివరాలు ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీ 44వ పుట్టినరోజు సందర్భంగా రూ.240 కోట్ల విలువైన ఏ319 లగ్జరీ జెట్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా గత కొన్ని రోజులకు ముందు ఆమెకు రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీని కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పటి వరకు ఇదే భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు గిఫ్ట్ అని తెలుస్తోంది. ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా.. అనంత్ అంబానీ నిశ్చితార్థం సందర్భంగా ఆకాష్ అంబానీ రూ.1.3 కోట్ల విలువైన 18కె పాంథెరే డి కార్టియర్ బ్రూచ్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ముఖేష్ అంబానీ మాత్రం ఆ సమయంలో సుమారు రూ. 4.5 కోట్ల బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. -
ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. గత వారం (మే 31న) ఆకాష్-శ్లోక దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. 2020 డిసెంబరులో ఈ దంపతులకు తొలి సంతానంగా పృథ్వీ అనే కొడుకు పుట్టాడు. అయితే పాపాయి పేరుపై అభిమానులు చాలా ఊహాగానాలే చేశారు. వీటన్నింటికీ చెక్‌పెడుతూ ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ తమ బిడ్డ లిటిల్ ప్రిన్సెస్ పేరు ‘వేద ఆకాష్ అంబానీ’ గా వెల్లడించారు. (మనవరాలి కోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. "శ్రీకృష్ణ భగవానుడి దయ, ధీరూభాయ్ అండ్ కోకిలాబెన్ అంబానీల ఆశీర్వాదంతో, పృథ్వీ తన చిన్న చెల్లెలు వేద ఆకాష్ అంబానీగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది" అని ప్రకటించారు. ‘వేద’ అంటే ఏమిటి? వేద పేరుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది, జ్ఞానం, జీవితంపై ఆలోచనాత్మక దృక్పథాన్ని ఇది సూచిస్తుందట. వేద అనేది 'జ్ఞానం' ‘తెలివి తేటలను’ సూచించే సంస్కృత మూలాలున్నదని జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట. అంతేకాదు గొప్ప సక్సెస్, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి తన తల్లి, తాత ముఖేశ్ అంబానీలకు గొప్ప పేరు తెస్తుందని చెబుతున్నారు. కాగా ఆయిల్-టు-టెలికాం-టు-రిటైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలు . వీరిలో కవలలు ఆకాష్ . ఇషా కాగా చిన్న కుమారుడు అనంత్. రిటైల్ వెంచర్ బాధ్యతలు చూస్తున్న ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. ఆకాష్ రిలయన్స్ జియోకు సారధ్యం వహిస్తున్నాడు. ఇక న్యూ ఎనర్జీ వింగ్ హెడ్‌గా ఉన్న అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాధికా మర్చంట్‌తో ఇప్పటికే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) -
రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కోడలికి బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ నెక్లెస్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు గిఫ్ట్‌గా ఇచ్చిన రూ. 451 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇక మార్కెట్లో కనిపించదట. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? శ్లోకా మెహతాకు ముఖేశ్, నీతా అంబానీలు బహుమతిగా ఇచ్చిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్‌గా నిలిచినసంగతి తెలిసిందే. ‘మౌవాద్ ఎల్' సాటిలేని 91-డైమండ్ నెక్లెస్' ను వివాహ వేడుకలో శ్లోకా మెహతాకి ఈ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆకాశ్ అంబానీ, శ్లోక మెహత 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. 91 వజ్రాలతో, ముఖ్యంగా ఇంటర్నల్‌గా ఎలాంటి దోషం లేని వజ్రాన్ని పొదిగిన దీని విలువ 451 కోట్ల రూపాయలు. ఈ ప్రత్యేకమైన డైమండ్ నెక్లెస్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) తాజా నివేదికల ప్రకారం డిజైన్ మార్పుకారణంగా ఈ ఖరీదైన డైమండ్ నెక్లెస్ సెట్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదు. ఈ డైమండ్స్ పసుపు రంగును పెంచడానికి, మరింత బ్రైట్‌గా చేయడంతో డిజైన్‌లో కూడా మర్పులు చేసి రీకట్ చేశారట. ఫలితంగా దాదాపు 200 క్యారెట్ల విలువైన ఈ నెక్లెస్ బరువు 100 క్యారెట్లకు పైగా తగ్గింది. 2022లో సథెబీలో 'మౌవాద్ ఎల్ ఇన్‌కంపారబుల్ 91 డైమండ్ నెక్లెస్'ను ప్రదర్శించారు. కాగా శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆకాశ్- శ్లోక దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి ఉన్నాడు. Behold the most expensive necklace ever created ― The L'Incomparable Diamond Necklace, only made possible by Mouawad. #Mouawad #MouawadDiamondHouse #RareJewels #Diamond #GuinnessWorldRecordhttps://t.co/0dlypdX1MH pic.twitter.com/Zf28a5CWa1 — Mouawad (@mouawad) August 2, 2018 -
ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్
ఇటీవల అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో సంబరాలు అమరాన్నంటాయి. కుటుంబ సభ్యులంతా హాస్పిటల్‌కి వెళ్లి దంపతులను అభినందించారు. అంతే కాకుండా ఆ బిడ్డను ఇంటికి తీసుకెళుతున్నప్పుడు నీతా అంబానీ ఎంతగానో ఉప్పొంగిపోయింది. శ్లోకా మెహతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బిడ్డతో కలిసి భర్త ఆకాష్ అంబానీ, నీతా అంబానీ, ముఖేష్ అంబానీతో కలిసి ఇంటికి ఖరీదైన లగ్జరీ కారులో బయలుదేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆకాష్ అంబానీ ముద్దుల తనయని కూడా చూడవచ్చు. బేబీ పింక్ క్యాప్‌లో పాప ముద్దుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారసురాలితో బయలుదేరిన కుటుంబం చాలా ఆనందంగా ఉంటడం ఇక్కడ గమనించవచ్చు. యువరాణి స్వాగతం పలకడానికి అప్పటికే ఇంటిని చాలా అందంగా అలంకరించారు. ఇప్పటికే ఆకాష్ అంబానీ & శ్లోకా మెహతా దంపతులకు పృథ్వీ అనే రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కాగా ప్రస్తుతానికి రెండవ బిడ్డ పేరుని ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: ముద్దుల మనవరాలి కోసం కొండమీద కోతినైనా తీసుకురాగల సామర్థ్యం ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సొంతం. అందుకే ఏకంగా మనవరాలు బుల్లి ప్రిన్సెస్‌ను ఇంటికి తీసుకెళ్లందుకు భారీ కాన్వాయ్‌నే ఏర్పాటు చేయారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌నుంచి లగ్జరీ కార్లతో కూడిన భారీ కార్ కాన్వాయ్‌తో పాపాయిని ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో బిజినెస్ వర్గాల్లోనూ విశేషంగా నిలుస్తోంది. దిగ్గజ పారిశ్రామికవేత్త మనవరాలు భారీ భద్రత మధ్య, దేశీయ, విదేశీ లగ్జరీ కార్లు కాన్వాయ్‌తో ఇంటికి చేరింది. సుమారు 50 కోట్లకు పైగా విలువైన 20కి పైగా కార్లు ఉన్నాయి.రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి సూపర్ లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్ ముంబై వీధుల్లో సందడి చేసింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే పృథ్వి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అంబానీ కుటుంబంలోని ఈ పాపాయి రావడంతో ముఖేశ్, నీతా అంబానీ తరువాతి వారసుల సంఖ్య నాలుగుకి చేరింది. కుమార్తె ఇషా, ఆనంద్ పిరామల్ దంపతులకు ట్విన్స్ కృష్ణ ,ఆదియా ఉన్నారు. -
అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?
సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ ఇంటికి ఆడబిడ్డ రూపంలో లక్ష్మీదేవి తరలి వచ్చింది. ముఖేశ్, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులకు సోమవారం(మే 31న) కుమార్తె పుట్టింది.దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అంబానీ కుటుంబం దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బుజ్జి పాపాయికి ఏం పేరు పెడతారనే చర్చ కూడా ఊపందుకుంది. (వారసురాలొచ్చేసింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆకాష్ అంబానీ దంపతులు) ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల మనవరాలు అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కమెంట్ చేస్తున్నారు. మే 31న మిథున రాశి (జెమిని) పాపాయి పుట్టిందని, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం,‘కే’ అనే అక్షరం ఉత్తమమైందని భావిస్తున్నారు. అంతేకాదు కష్వి, కైరా, కియానా, కుహూ, కనికా , క్రిష్టి లాంటి పేర్లయితే బావుంటాయంటూ కమెంట్ చేశారు. కాగా 2019, మార్చిలో పెళ్లి చేసుకున్న శ్లోకా మెహతా-ఆకాష్ అంబానీ జంటకు ఇప్పటికే పృథ్వీ అనే కుమారుడు ఉన్నాడు. డిసెంబర్ 2020లో పృథ్వీకి జన్మనిచ్చిన శ్లోకా గత ఏప్రిల్‌లో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించినన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా? -
వారసురాలొచ్చేసింది.. అంబానీ ఇంట మళ్ళీ ఆనందాల వెల్లువ..!!
భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఇంటికి వారసురాలు వచ్చేసింది. ముకేశ్ పెద్ద కొడుకు 'అకాశ్ అంబానీ & శ్లోక మెహతా' దంపతులు మరో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా బుధవారం హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనించింది. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు. కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన 'పరిమల్ నథ్వానీ' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో ఆకాష్, శ్లోక అంబానీల ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ అమూల్యమైన క్షణాలు జీవితంలో అపారమైన ప్రేమను తెస్తాయని ట్వీట్ చేశారు. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?) 2023 ఏప్రిల్ నెలలో ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో కనిపించిన శ్లోక మెహతా మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది. (ఇదీ చదవండి: మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?) Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi — Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023 ఇదిలా ఉండగా గత సంవత్సరం ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రసవించిన ఈమె ఇండియాకు కవలలతో రావడంతో అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఆ సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి వేదపండితులు రప్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అంతే కాకుండా ఇంటికి కవలలు వచ్చిన సంతోషంతో సుమారు 300 కేజీల బంగారం దానం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఐదు అనాధ శరణాలయాలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు. -
కొడుకు పెళ్లికి అంబానీ దంపతుల వినూత్న ఆహ్వానం!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం. ఈ కుటుంబంలో ఏ వేడుకనైనా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీల వివాహాలు అత్యంత విలాసవంతంగా జరిగాయి. ఆ వేడుకలకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇదీ చదవండి: Ambani advice: ఏం చెప్పారు సార్.. అల్లుడికి అంబానీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం 2019 మార్చి 9న జరిగింది. ఈ వేడుకలో ఆకాశ్ తల్లి నీతా అంబానీ, సోదరి ఇషా అంబానీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వైభవోపేతంగా జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వయంగా చేతి రాతతో వివాహ ఆహ్వానం తమ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహానికి అతిథులకు వినూత్నంగా ఆహ్వానం పలికారు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు. స్వయంగా చేతి రాతతో వివాహ ఆహ్వానాలను అతిథులకు పంపారు. వాటికి సంబంధించిన ఫోటో అంబానీ కుటుంబానికి చెందిన ఒక ఫ్యాన్ పేజీలో ఇటీవల ప్రత్యక్షమైంది. ‘శ్రీకృష్ణుని కృపా కటాక్షాలతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మా ప్రియమైన కుమారుడు ఆకాశ్, అతని సోల్ మేట్ శ్లోకతో వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము...’ అంటూ ఆ ఆహ్వాన పత్రికలో రాశారు. అయితే ఈ పత్రికను ముఖేష్ అంబానీ, నీతా అంబానీలలో స్వయంగా ఎవరు రాశారన్నది మాత్రం తెలియలేదు. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
తాత అయిన ముకేష్ అంబానీ
న్యూఢిల్లీ: భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తాత అయ్యారు. ముకేశ్ అంబా నీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోక దంపతులకు ముంబైలో కొడుకు పుట్టాడని అంబానీ కుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తాత. నానమ్మలైనందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొత్త శిశువు రాక అంబానీ, మెహత కుటుంబాల్లో ఆనందోత్సాహాలను నింపిందని వివరించారు. వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోక, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో జరిగింది. -
రూ. 300 కోట్ల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్
ఆకాశమంత పందిరిలా సాగే కార్పొరేట్ వెడ్డింగ్‌లో ప్రతీ అంశమూ ప్రత్యేకంగానే నిలుస్తుంది. వెడ్డింగ్ కార్డులు దగ్గరినుంచి, సంగీత్, బారాత్‌లంటూ పెళ్లి దాకా సాగా హడావిడి ఇంతా అంతా కాదు. ఈనేపథ్యంలోనే రిలయన్స్ కుటుంబం కొత్త కోడలికి ఇచ్చిన భారీ కానుక ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. అక్షరాలా 300 కోట్ల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్‌ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తన కొత్త కోడలు శ్లోకా మెహతాకు కానుకగా ఇచ్చారు. నిజానికి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారట మొదట నీతా అంబానీ. కానీ సమయానికి తగ్గట్టుగా మనసు మార్చుకున్న నీతా దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారట. అందుకే అత్యంత విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ గిఫ్ట్‌గా అందించారట. తనెంతో ఇష్టంగా చేయించిన వజ్రాల హారాన్ని శ్లోకా మెడలో అలంకరించి నీతా ముచ్చట పడిపోగా, అటు అత్తగారిచ్చిన ప్రేమ పూర్వక కానుకతో శ్లోకా కూడా అంతే మురిసిపోయారట.. వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు మార్చి తొమ్మిదిన ముంబైలో అత్యంత వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram #akashambani #akashloka #shlokamehta #ishaambani #anantambani #anandpiramal #radhikamerchant #nitaambani #neetaambani #mukeshambani #kokilabenambani #akustoletheshlo #ambani #ambaniwedding #ambaniengagement #weddingcelebrations #weddingbells #wedmegood #weddingoftheyear #indianwedding #bridesofindia #sabyasachibride #weddingdecor #engagementdecor #floraldecor #engagement #weddingsutra A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on Mar 19, 2019 at 9:43pm PDT -
ఘనంగా ఆకాశ్, శ్లోకా వివాహం
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. అంగరంగా వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత ముఖేశ్, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్ అంబానీ .. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం జరిగిన భరాత్‌లో ముఖేశ్ భార్య నీతాతో పాటు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లాలు సందడి చేశారు. రాత్రి 8.15 గంటల తర్వాత వివాహ కార్యక్రమం మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకల్లో ఐక్యరాజ్యసమతి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు టోనీబ్లేయర్ దంపతులు, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ వేడుకల్లో రజనీకాంత్, ప్రియాంక్ చోప్రా, ఐశ్వర్య రాయ్, అభిషేక్, అమితాబ్, అమీర్ ఖాన్ , రతన్ టాటా, సచిన్, టైగర్ ష్రాప్, దిశా పటాని, కియరా అద్వానీ, జాన్వీ కపూర్, విద్యాబాలన్, అలియా భట్, పాండ్యా సోదరులు, యువరాజ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, గతేడాది ముఖేశ్ కుతూరు ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరమల్‌తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
అంబానీ ఇంట పెళ్లి సందడి
-
ఆ పెళ్లికి అతిరథ మహారథులు
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రోజు (మార్చి 9వ తేదీ శనివారం, రాత్రి ) ఆకాశ్, శ్లోకా మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లి సందడి ముంబై జియో టవర్స్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకుకు దేశ విదేశాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులతో పాటు, హితులు, సన్నిహితులు, బంధు మిత్రులతో పెళ్లి వేడుక కళకళలాడుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖేశ్, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్ అంబానీ .. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ వివాహానికి ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీ కుటుంబ సభ్యులు, కోకిలా బెన్ అంబానీ సందడి చేస్తుండగా, పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రముఖులు ఇప్పటికేవివాహ వేదికకు తరలి వచ్చారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమతి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, టోనీబ్లేయర్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. View this post on Instagram Amazing decor 👍👍👍👍#akashambani #shlokamehta wedding ❤️#bigfatindianwedding #desibride #weddingoftheyear @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Mar 9, 2019 at 2:48am PST -
ఆకాశ్, శ్లోకా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ , శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. స్విస్‌లోని సెయింట్ మోర్తిజ్ వేదికగా మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగాయి. ఈ వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులు ఆకాశ్-శ్లోకా గుర్రపు బండిలో కాసేపు ఊరేగుతూ వేదికకు చేరుకుని అందర్నీ అలరించారు. బాణా సంచావెలుగులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. సుమారు 850 మంది అతిథులు హాజరైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు రణ్‌బీర్ కపూర్,అలియా భట్ తోపాటు లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇంకా కరణ్ జోహార్, పింకీ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లూనా పార్క్‌లో ప్రత్యేక వినోద కార్యక్రమాలతోపాటు అతిథుల సౌకర్యార్థం హోటల్ మోర్టిజ్లోని అత్యంత విలాసవంతమైన గదులను బుక్ చేశారట. కాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం మార్చి 9న ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే. View this post on Instagram Firecracker show done right! 💯 #ambanipreweddingcelebrations A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 9:40pm PST View this post on Instagram Yet another video of the fireworks last night to prove the grandeur of the event! 💥 A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 11:39pm PST View this post on Instagram Ranbir Kapoor blesses the Couple Of The Hour - Akash & Shloka! 💜 A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 12:06pm PST -
వైరల్: ఆకాశ్ అంబానీ పెళ్లి పత్రిక
-
ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి కదా..!
ముంబై: ‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ బహుశా ప్రస్తుతం ఇలాంటి పాటలనే అంబానీ కుటుంబ సభ్యులు పాడుకుంటున్నారనుకుంటా. ఎందుకంటే అంబానీ ఇంట వివాహమంటే అందరిలోనూ భారీగానే అంచనాలే ఉంటాయి. దీంతో ఆహ్వాన పత్రికల నుంచి మొదలు వివాహ వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి పందిరి, సంగీత్, మెహందీ, వివాహ వేడుకలు ఇవన్నీ వార్తల్లో నిలిచేవే. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతాల గారాల పట్టి ఈశా వివాహ వేడుకలను జనం మరువకముందే మరో వేడుకకు అంబానీ కుటుంబం సిద్దమైంది. ఆకాశ్ అంబానీ వివాహం వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చి 9న జియో వరల్డ్ సెంటర్ వేదిక జరగనున్న విషయం తెలిసిందే. (అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!) ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలు కాగా.. అతిథులను ప్రత్యేకంగా పిలిచే పనిలో పడ్డారు. ఇక తొలి వివాహ ఆహ్వాన పత్రికకు సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే వీరి పెళ్లి పత్రికకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఇప్పడు దానికి సంబంధించి మరో వీడియో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత గ్రాండ్ డిజైన్ చేసిన ఈ పత్రికలో ముఖేశ్-నీతా అంబానీలు స్వహస్త్రాలతో రాసిన లేఖ తొలుత దర్శనమిస్తుంది. అనంతరం వివాహానికి సంబంధించిన వివరాలు, అతిథలుకు ఇచ్చే బహుమతులు కనిపిస్తాయి. కృష్ణుడు, గణపతి పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటాయి. దీంతో ఈ పత్రిక చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి కదా.. ఆ మాత్రమైనా ఉండాలి’ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. (అంబానీ ఇంట వివాహం : స్టాలిన్‌కు ఆహ్వానం) -
ఆ వేడుకలో బాలీవుడ్ చిందులు
మొన్నామధ్య సోనమ్ కపూర్ పెళ్లితో బాలీవుడ్ దద్దరిల్లింది. తారాగణం అంతా కదిలివచ్చి పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యాపారదిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివాహ వేడుకకు హాజరై సందడిచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ముంబైలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్ చేసిన డ్యాన్స్‌లు వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్లు హైలెట్‌గా నిలిచారు. ఈ కార్యాక్రమానికి ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, టైగర్ ఫ్రాఫ్, కరణ్ జోహార్, విద్యాబాలన్, మాధురి దీక్షిత్, అలియాభట్ ఇలా భారీ తారాగణం విచ్చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలు చిన్ననాటి స్నేహితులు. శ్లోకా మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారంలో పేరుగాంచినవారన్న సంగతి తెలిసిందే. ఈ నూతన జంట ఈ ఏడాది చివరికల్లా పెళ్లిబంధంతో ఒక్కటవ్వనున్నారు. -
అంబానీ ఇంట హోరెత్తిన పెళ్లి సంబరాలు
-
ఘనంగా ఆకాశ్ నిశ్చితార్థం
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం శనివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, బాలీవుడ్, క్రీడ, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, మనోజ్ సిన్హా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (కుటుంబ సమేతంగా), ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ ప్రియాదత్ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపార రంగం నుంచి రతన్ టాటా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కోటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్, ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ముంబైలో వధువు శ్లోక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ (భార్య గౌరీతో కలిసి), రేఖ, అనిల్ కపూర్, రణ్‌బీర్ కపూర్, విద్యా బాలన్, మాధుర్ భండార్కర్, విదూ వినోద్ చోప్రా, జావెద్ అక్తర్‌లు క్రీడా రంగం నుంచి సచిన్, హర్భజన్, జహీర్ ఖాన్ తదితరులు ఈ నిశ్చితార్థ కార్యక్రమం విందుకు హాజరయ్యారు. వీరి పెళ్లి డిసెంబర్లో జరగొచ్చని తెలుస్తోంది. -
ఆకాశ్, శ్లోకల ప్రీ-ఎంగేజ్మెంట్లో నీతా అంబానీ డ్యాన్స్
-
ఆకాశ్-శ్లోకా మెహతాల మెహందీ ఫంక్షన్
-
నీతా అంబానీ డ్యాన్స్ వీడియో వైరల్
ముంబై : బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాల నిశ్చితార్థపు ముందస్తు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రేపు(శనివారం) సౌత్ ముంబైలోని అంటిలియాలో ఉన్న అంబానీ 27 అంతస్తుల భవనంలో వీరి నిశ్చితార్థపు వేడుకను అంబానీ ఫ్యామిలీ ఘనంగా నిర్వహించబోతోంది. ఈ నిశ్చితార్థానికి ముందస్తుగా జరుగుతున్న వేడుకలకు ఫిల్మ్ ఇండస్ట్రికి చెందిన షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్లు హాజరయ్యారు.షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్‌తో ఈ పార్టీకి హాజరు కాగ, సచిన్ తన సతీమణి అంజలితో కలిసి ఈ వేడుకల్లో సందడి చేశారు. అంతేకాక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న ప్రియాంక చోప్రా, తన బాయ్‌ఫ్రెండ్ అమెరికా సింగర్ నిక్ జోనస్‌తో కలిసి ఈ ప్రీ-ఎంగేజ్మెంట్ పార్టీలో తళుక్కున మెరిశారు. బుధవారం అంబానీ హౌజ్‌లో జరిగిన మెహందీ వేడుకతో ఈ ప్రీ-ఎంగేజ్మెంట్ పార్టీలు ప్రారంభయ్యాయి. ఆకాశ్, శ్లోకాలకు అంబానీ గారాల పట్టి, ఆ ఇంటి ఆడబిడ్డ ఇషా అంబానీ హారతి పడుతున్న వీడియోను సైతం ట్విటర్లో పోస్టు చేశారు. ఆ వీడియోలో మెరూన్ రంగు చీరలో మెరిసిపోతున్న నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. అంతేకాక కొడుకు నిశ్చితార్థపు సంబురాల్లో నీతా డ్యాన్సులతో అలరించారు. ఆకాశ్ అంబానీ కూడా తన కాబోయే భార్య శ్లోకాతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఘనంగా ప్రి ఎంగేజ్మెంట్ పార్టీ
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ప్రి ఎంగేజ్మెంట్ పార్టీ గురువారం రాత్రి ముంబైలోని ముకేశ్ నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు షారూక్ ఖాన్ దంపతులు, రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్, విదూ వినోద్ చోప్రా, ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ దంపతులు తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో కలసి వచ్చారు. (అంజలి, సచిన్ తెందూల్కర్ , గౌరి, షారుఖ్‌ఖాన్ , ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ) -
అట్టహాసంగా ఆకాశ్, శ్లోకాల మెహందీ ఫంక్షన్
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాల మెహందీ వేడుక ముంబైలోని అంబానీ రెసిడెన్సీలో బుధవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ దిగ్గజాలు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల మెహందీ వేడుకకు చెందిన ఓ ఫోటోను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వేడుకలో ప్రియాంక ప్రముఖ డిజైనర్ తరుణ్ తాహిలియాని డిజైన్ చేసిన తెలుపు రంగు చీరను కట్టుకుని తళుక్కుమని మెరిసారు. ‘కంగ్రాట్యులేషన్స్ ఆకాశ్, శ్లోకా! ఈ వేడుకు ఎంత అద్భుతంగా ఉంది. లవ్ యూ బోత్. ప్రీ, ప్రీ.. ఎంగేజ్మెంట్ పార్టీ’ అనే క్యాప్షన్‌తో ప్రియాంక ఈ ఫోటోను షేర్ చేశారు. త్వరలోనే ప్రియాంక చోప్రా కూడా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆకాశ్, శ్లోకాల మెహందీ వేడుకకు చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో నేవి బ్లూ టాప్, హెవీ ఎంబ్రాయిడ్తో క్రీమ్ లెహంగాలో శ్లోకా ముసిముసి నవ్వులతో మెరిసిపోగా.. ఆకాశ్ తెల్లటి కుర్తాతో సింపుల్‌గా కనిపించాడు. గుండ్రటి చెవిదిద్దులు, పింక్ లిప్స్‌తో శ్లోకా మెరిసిపోయింది. ప్రియాంకతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్, కిరణ్ రావులు పాల్గొన్నారు. శనివారం వీరి ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతుంది. ఈ నిశ్చితార్థపు ఆహ్వానాలను కూడా అంబానీ ఫ్యామిలీ జూన్ మొదటి వారంలోనే అందరికీ అందించింది. రెండు నెలల క్రితమే శ్లోకా, ఆకాశ్‌ల పెళ్లి నిశ్చియమైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నిశ్చియమైన కొన్ని రోజులకే, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైంది. వీరి ఫోటోలు, అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన పార్టీల ఫోటోలు అప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగ, శ్లోకా మెహతా డైమాండ్ వ్యాపారి రస్సెల్ మెహతా, మోన మెహతాల కూతురు. రోజీ బ్లూ డైమాండ్స్‌ను వీరి కుటుంబం నిర్వహిస్తోంది. -
శ్లోకాకు ఆకాశ్ ఎలా ప్రపోజ్ చేశాడంటే...
దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. జూన్ 30న ఆకాశ్ అంబానీ, శ్లోకాకు అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ప్రయాణం మొదలైన రోజు నుంచి ఆకాశ్ - శ్లోకా ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోన్నాయి. అయితే ఇంతకూ ఆకాశ్ శ్లోకాకు ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా...? ఆకాశ్ - శ్లోకా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులనే సంగతి తెలిసిందే. అయితే గత మార్చి 24న ఆ స్నేహబంధం కాస్తా ప్రేమ బంధంగా మారింది. మార్చి 24న గోవాలో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీకి ముఖేశ్ అంబాని, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్‌తో పాటు మరికొందరు దగ్గరి స్నేహితులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో...సూర్యుడు అస్తమిస్తుండగా...తన మనసులో ఉదయించిన ప్రేమను ఆకాశ్ తన చిన్న నాటి నేస్తం శ్లోకాకు తెలియజేసాడు. ఆ తర్వాత ఇంకేముంది...శ్లోకాతోపాటు కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడం...పార్టీ చేసుకోవడం అంతా మాయాలా జరిగిపోయాయంటున్నాడు ఆకాశ్. అన్నట్లు ఆ సమయంలో శ్లోకా కుంటుంబం కూడా అక్కడే ఉంది. ఈ నెల 30న ఆకాశ్ - శ్లోకాల నిశ్చితార్థపు వేడుక అంబానీల నివాసం అంటిల్లాలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ఎంగేజ్మెంట్ హోస్ట్‌గా స్టార్హీరో?
ముంబై : దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. వీరి పెళ్లితో పాటు, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైపోయింది. దీంతో అంబానీ కుటుంబమంతా పెళ్లి పనులతో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ, శ్లోకాకు జూన్ 30న అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్నారు. అంబానీ రెసిడెన్సీలోని అంటిల్లాలో ఈ వేడుక జరుగబోతుంది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కదలి రాబోతున్నారు. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థపు వేడుకకు హోస్ట్‌గా నిర్వహించబోతున్నారని అంబానీ సన్నిహిత వర్గాలు చెప్పాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు రాబోతున్న ఈ ఈవెంట్‌కు, కింగ్ ఖాన్‌ను మించిన హోస్ట్ మరెవరూ ఉండరని పలువురంటున్నారు. బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి, ఈ కపుల్ స్టేజీపై చిందులు కూడా వేయబోతున్నారట. కాగ, ఈ ఏడాది మార్చి 24న రోజి బ్లూ డైమాండ్స్ రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాకు ఆకాశ్ లవ్ ప్రపోజ్ చేయడం, ఆమె అంగీకరించడం జరిగింది. ఆ అనంతరం అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చింది. శ్లోకా, ఆకాశ్‌లు చిన్ననాటి స్నేహితులు. రస్సెల్, మోనా మెహతాలకు శ్లోకా చిన్న కూతురు. -
వినూత్నంగా ఆకాశ్, శ్లోకాల పెళ్లి కార్డు
-
అదరగొడుతున్న ఆకాశ్, శ్లోకాల పెళ్లి కార్డు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, డైమాండ్ వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను మనువాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం అధికారికంగా ఈ నెల 30న ముంబైలో 39 అట్లామౌంట్ రోడ్లో జరుగబోతోంది. మరోవైపు వీరి పెళ్లి కూడా డిసెంబర్లో జరుగబోతున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన కార్డు తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ కార్డు అంబానీ ఫ్యామిలీ స్థాయిని మించి ఉంది. ఆకర్షణీయమైన తెల్లటి రంగు బాక్స్.. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే చిన్న ఆలయం.. గ్లాస్ డోర్‌తో ఉన్న ఆ ఆలయంలో, అన్ని శుభకార్యాలకు ఫలప్రదమైన వినాయకుడి విగ్రహం ఉన్నాయి. ఆ చిన్ని ఆలయంపైనే ఆకాశ్, శ్లోకాల వెడ్డింగ్ కార్డు ఉంది. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కూడా ఆన్లైన్లో హల్చల్ చేసింది. ప్రస్తుతం వివాహ ఆహ్వాన పత్రిక ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థానికి అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో ఆమె బుధవారం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. నిశ్చితార్థపు తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ అంబానీ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక కూడా గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఆకాశ్, శ్లోకా నిశ్చితార్థం ; తొలి ఆహ్వానం ఎవరికంటే..
ముంబై : దేశీ కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల పెళ్లి గురించి ప్రతి విషయం వైరల్‌గా మారుతుంది. మార్చిలోనే గోవాలో వీరి నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖేశ్ దంపతులు తమ సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చారు. కాగా వీరి నిశ్చితార్థ వేడుకను అధికారికంగా జూన్ 30న ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్లో జరపనున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ తాజాగా ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా ముఖేశ్ సతీమణి నీతా అంబానీ అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె... తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఆకాశ్ అంబానీ, శ్లోకా ఆహ్వాన పత్రిక..
-
ఆకాశ్, శ్లోకా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్, వైరల్
ముంబై : అంబానీ ఫ్యామిలీలో ఏది జరిగినా స్పెషలే. ఇక కూతురు, కొడుకుల వివాహమంటే ఏ రేంజ్లో జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి అంగరంగ వైభవంగా.. అతిథులకు కళ్లు జిగ్గేల్లామనేలా ఆనందంలో ముంచేస్తుంది. ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ వివాహం, తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతతో నిశ్చియమైంది. ఆకాశ్‌తో పాటు అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరుగబోతోంది. వీరి వివాహాలను ధృవీకరించిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇప్పటికే గ్రాండ్‌గా పార్టీలు కూడా చేసింది. తాజాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ అధికారికంగా చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఈ నిశ్చితార్థపు వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని అంబానీ ఫ్యామిలీ ఎంతో అట్టహాసంగా రూపొందించింది. జూన్ 30న శనివారం ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్లో నిశ్చితార్థపు వేడుక ఉంటుందని, తమ ప్రియమైన వారందరూ హాజరుకావాలంటూ అంబానీ ఫ్యామిలీ తన కొడుకు నిశ్చితార్థానికి ఆహ్వానిస్తోంది. ఆకాశ్, శ్లోకాల వివాహం చేయాలని నిర్ణయించిన అనంతరం, బాలీవుడ్ నటీనటులకు, సెలబ్రిటీలకు, ఆకాశ్, శ్లోకాల స్నేహితులకు ముఖేష్ అంబానీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. తాజాగా నిశ్చితార్థాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలోనే పెళ్లి తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. డైమాండ్ వ్యాపారి రస్సెల్, మోనా మెహతాల కూతురే శ్లోకా మెహతా. ఆకాశ్, శ్లోకాలు ఎంతో కాలంగా స్నేహితులు కావడం విశేషం. -
శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ డ్యాన్స్
-
డాన్స్‌తో అదరగొట్టిన ఈషా, శ్లోక
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఈషా అంబానీకి ఇటీవలే బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్‌తో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థపు వేడుక ఈ నెల 7న ముంబైలో ఘనంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుకలో ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలు స్టెప్పులు వేసి తమ కూతురు వివాహ సంతోషాన్ని పంచుకున్నారు. ఈషా అంబానీ నిశ్చితార్థ వేడుక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తల్లి నీతా అంబానీతో ఈషా వేసిన డ్యాన్స్, తండ్రి ముఖేష్ అంబానీతో వేసిన స్టెపుల వీడియోలకు తెగ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా అన్న ఆకాశ్ అంబానీకి కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ వేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. వదినా మరదలు ఇద్దరూ కలిసి ‘పద్మావత్’లోని ‘ఘూమర్’ పాటకు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇషా, శ్లోకాల జోడి బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ డ్యాన్స్ వీడియోలో ఎర్రటి లెహంగాలో శ్లోకా మెరిసిపోగా, ఐవర్ రంగు లెహంగాలో ఈషా జిగేల్‌మనిపిస్తోంది. కాగా వివాహం నిశ్చయమైన ఆనంద్, ఈషాలు ఎంతో కాలంగా మంచి స్నేహితులు. ఇటీవలే ఆనంద్, ఈషాకు మహాబలేశ్వర్ ఆలయంలో ప్రపోజ్ చేశాడు. ఆనంద్ ప్రతిపాదనకు ఈషా ఓకే చెప్పగానే, వెంటనే ఇరు కుటుంబాలు కలిసి విందు ఏర్పాటు చేయడం, అనంతరం ఎంగేజ్మెంట్ పార్టీ నిర్వహించడం జరిగింది. అటు ఆకాశ్ అంబానీ వివాహం కూడా ఈషా వివాహం నిశ్చయమవడానికి కొన్ని రోజుల ముందే రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతతో నిశ్చయమైంది. శ్లోకా మెహతా, ఆకాశ్ వివాహ నిశ్చితార్థ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. -
అంబానీ కోడలు సంపదెంతో తెలుసా?
న్యూఢిల్లీ : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టబోతోంది. ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను త్వరలోనే పరిణయం ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్లోకా మెహతా గురించి ఫినాప్ రిపోర్టు పలు ఆసక్తికర విషయాలను నివేదించింది. శ్లోకా మెహతా సంపద, ఆమె ఇప్పటి వరకు చేపట్టిన బాధ్యతలు అన్నింటితో ఒక రిపోర్టు నివేదించింది. ఈ రిపోర్టులో శ్లోకా మెహతాకు రూ.120 కోట్ల నికర సంపద ఉన్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే బెస్ట్ లగ్జరీ కార్లను ఆమె కలిగి ఉన్నారని, వీటిలో మినీ కాపర్, మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ వంటి కార్లు ఉన్నాయని పేర్కొంది. ఇటీవలే ఆమె రూ.4 కోట్ల విలువైన బెంట్లీ లగ్జరీ కారును కొనుగోలు చేసిందని రిపోర్టు చేసింది. గత కొన్నేళ్లుగా శ్లోకా మెహతా సంపద 23 శాతానికి పైగా పెరిగినట్టు తెలిపింది. శ్లోకా మెహతా తండ్రి రస్సెల్ మెహతా, రోజీ బ్లూ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్. రోజి బ్లూ అనే సంస్థ డైమాండ్ కటింగ్, పాలిషింగ్, ట్రేడింగ్ కంపెనీ. భారత్‌లో ఈ కంపెనీ చాలా బలమైనదిగా ఉంది. భారత్‌తో పాటు రోజీ బ్లూ సంస్థ యూఏఈ, ఇజ్రాయిల్, బెల్జియం, అమెరికా, జపాన్, హాంకాంగ్, చైనాలలో కూడా తన కార్యకలాపాలను సాగిస్తోంది. 1960 నుంచి రస్సెల్ మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సంస్థ క్లీన్ క్రెడిట్ హిస్టరీనే కలిగి ఉంది. శ్లోకా మెహతా రస్సెల్ మెహతా, మోనా మెహతాలకు చిన్న కూతురు. ఆమె సోదరుడు విరాజ్ నిషా సేథ్‌ను పెళ్లి చేసుకున్నారు. నిషా సేథ్ గ్రేట్ ఈస్టరన్ షిప్పింగ్ ఫ్యామిలీకి చెందిన ఆమె. సోదరి దియా ఆయుష్ జతియా, హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్ల కొడుకు అమిత్ జతియాను గతేడాది వివాహమాడారు. 2014లో శ్లోకా మెహతా రోజీ బ్లూ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇది రోజీ బ్లూ గ్రూప్ కంపెనీకి చెందిన దాతృత్వ సంస్థ. ఎన్జీఓలను, వాలంటీర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కనెక్ట్‌ఫర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. పెళ్లి చేసుకోబోతున్న ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాలు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుకున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఉంది. అంబానీ, మెహతా కుటుంబాల మధ్య కూడా అనుబంధం ఉంది. ఒకరి ఇంట్లో జరిగే వేడుకలకు మరొకరు హాజరయ్యేవారు. ఆ విధంగా నీతా, ముఖేష్ అంబానీలకు శ్లోకా నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచి తెలుసు. చదువుల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే శ్లోకా ఇంటర్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ స్కూలు నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. -
వారిద్దరి ప్రేమ.. ఓ పద్య రూపంలో
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. ముఖేష్ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కూతురు శ్లోక మెహతా వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య మార్చి 24న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే అంబానీ కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్న శ్లోక మెహతకు నీతా అంబానీ, ఇషా అంబానీ ప్రత్యేక రీతిలో ఆహ్వానం పలికారు. కాబోయే వధూవరులను ఉద్దేశిస్తూ.. వారి అపురూపమైన ప్రేమను తెలుపుతూ నీతా అంబానీ ఏకంగా ఓ పద్యమే రాశారు. ‘ఏబీసీడీలు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లారు. అప్పట్లో వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలీదు. చిన్నప్పుడు వారు తిన్న జెల్లీ బీన్స్, చాకొలెట్స్ వారి జీవితాలను మధురంగా మార్చాయి. చిన్నప్పుడు వేసుకున్న పోనీటెయిల్స్, ఆడుకున్న బార్బీ బొమ్మలు, చిన్న చిన్న గొడవలు..ఇవన్నీ జరిగి ఏళ్లు గడిచిపోయాయి. ఈరోజు ఇద్దరూ పెద్దవారయ్యారు. వారికళ్లలో ప్రేమ దాగి ఉంది. ఇద్దరి హృదయాలు ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అన్న ఒక్క మాటే కోరుకుంటున్నాయి. వారిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడూ ఒకరికొకరు ఇలా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ నీతా ఈ పద్యాన్ని రాశారు. అటు ఇషా అంబానీ కూడా ఆకాశ్-శ్లోక ఎంగేజ్మెంట్ రోజు హృదయాన్ని హత్తుకునే మెసేజ్‌ను తన వదినకు అందించారు. ‘ఈ రోజు మొత్తం హృదయాలకు సంబంధించింది. శ్లోకా ఓ హృదయం, ఆకాశ్ ఓ హృదయం. ఇది హృదయాలకు సంబంధించిన వేడుక. నేను, అనంత్ మీ వివాహం జరగబోతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు కలిగినంత సంతోషం ఇదివరకెప్పుడూ కలగలేదనుకుంటా. వదిన రూపంలో నాకు సోదరి దొరుకుతోంది. శ్లోకను వదిన అని పిలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్లోక నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె సోదరి దియా నేను కలిసే చదువుకున్నాం. తల్లులు వేరైనా.. నేను, శ్లోక, దియా అక్కాచెల్లెళ్లలా ఉండేవాళ్లం. శ్లోక మా ఇంట్లోకి వస్తున్న సందర్భంగా మా కుటుంబం పరిపూర్ణం అయినట్లుగా ఉంది’ అని ఇషా అంబానీ అన్నారు. నీతా అంబానీ, ఇషా అంబానీ శ్లోకా మెహతాను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానించిన తీరు ఆకట్టుకుటోంది. డిసెంబర్లో ముంబైలో శ్లోక, ఆకాశ్‌ల వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. -
ముకేశ్ తనయుడి ముందస్తు నిశ్చితార్థ విందు
-
ఘనంగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థం
-
ఆకాశ్ అంబానీ పెళ్లి డిసెంబర్లో!!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. స్కూల్లో తనతో కలిసి చదువుకున్న వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం ఈ ఏడాది డిసెంబర్ నెల మొదట్లో జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవడం కోసం ఇరు కుటుంబాలు, సన్నిహితులు తాజాగా(ఈ నెల 24న) గోవాలోని ఒక ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో కలుసుకున్నట్లు సమాచారం. అయితే, నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలొస్తున్నాయి. గోవా కార్యక్రమానికి సంబంధించి ముకేశ్, రసెల్ మెహతా కుటుంబ సభ్యుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆకాశ్, శ్లోకా చేతిలో చేయివేసి నిలుచునున్న ఫొటో, శ్లోకాకు ముకేశ్ అంబానీ స్వీట్ తినిపిస్తున్న ఫొటో కూడా ఉంది. కార్యక్రమానికి ముకేశ్, నీతా అంబానీలతో పాటు ఆకాశ్ నాన్నమ్మ కోకిలాబెన్ కూడా హాజరయ్యారు. కాగా, వివాహ ఉత్సవాలు 4–5 రోజుల పాటు ఉంటాయని, డిసెంబర్ 8–12 మధ్య ముంబైలోని ఒబెరాయ్ హోటల్ ఇందుకు వేదికయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, అధికారికంగా ఇరు కుటుంబాల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, ఆకాశ్‌లు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఇరు కుటుంబాలకు చాలా ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉంది. ముకేశ్ అంబానీకి ముగ్గురు సంతానం. వీరిలో కుమార్తె ఈషా, ఆకాశ్‌లు కవలలు. ఇక చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ఆకాశ్ ఇప్పటికే రిలయన్స్ టెలికం వెంచర్ జియో డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. రసెల్, మోనా మెహతాలకు ముగ్గురు సంతానం కాగా, శ్లోకా చిన్న కుమార్తె. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వచ్ఛంద సంస్థలకు వాలంటీర్లను అందించే కనెక్ట్‌ఫర్ అనే సంస్థకు ఆమె సహ–వ్యవస్థాపకురాలు. కాగా శ్లోకా తల్లి మోనా మెహతాతో పీఎన్బీ రుణ కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. -
అంబానీ ఇంట పెళ్లి సందడి...!
న్యూఢిల్లీ : అంబానీల ఇంట్లో పెళ్లి బాజా మోగనుందా? అపర కుబేరుడు, దేశీ కార్పొరేట్ రంగ రారాజు ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారా? విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇంతకీ ఈ కార్పొరేట్ యువరాజును మనువాడబోయే వధువు ఏవరంటారా...! డైమండ్ కింగ్‌గా పేరుగాంచిన రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా అంటూ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిశ్చితార్థంపై కొద్ది వారాల్లో ప్రకటన వెలువడనుందని.. ఈ ఏడాది డిసెంబర్ ఆరంభంలో వివాహం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయా వర్గాల సమాచారం. అయితే, ఈ పెళ్లి విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరు కుటుంబాలు నిరాకరించడం గమనార్హం. నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి ఇంకా తేదీలేవీ ఖరారు కాలేదని ముకేశ్ అంబానీ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపారు. 'ఆకాశ్ అంబానీ పెళ్లికి సంబంధించిన శుభవార్తను తగిన సమయంలో ముకేశ్ కుటుంబమే స్వయంగా అందరితో పంచుకుంటుంది. పెళ్లి ఖరారైతే కచ్చితంగా అది భారత్‌లోనే జరుగుతుంది' అని ఆయా వర్గాలు వివరించారు. ఈ నెల 24న నిశ్చితార్థం ఉండొచ్చన్న వార్తలను తోసిపుచ్చారు. ఎవరీ శ్లోకా మెహతా? 'రోజీ బ్లూ డైమండ్స్' అధినేత రసెల్ మెహతా కుటుంబంతో ముకేశ్ అంబానీ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీ కూడా ఒకరికొకరు ఇదివరకే తెలుసనేది సంబంధిత వార్గాల సమాచారం. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో వీరిద్దరూ కలిసి చదువుకోవడం విశేషం. 2009లో హైస్కూలు విద్యను పూర్తి చేసుకున్న శ్లోకా మెహతా... ఆ తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ డిగ్రీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. రోజీ బ్లూ ఫౌండేషన్‌లో 2014 జూలై నుంచి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన వాలంటీర్లను అందించే 'కనెక్ట్‌ఫర్' అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా ఆమె. రసెల్, మోనా మెహతాల ముగ్గురు సంతానంలో చివరి కుమార్తె శ్లోకా. ఇక ముకేశ్, నీతా అంబానీలకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు ఆకాశ్, కుమార్తె ఈషా అంబానీలు కవలలు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం వెంచర్ రిలయన్స్ జియో కంపెనీ బోర్డులో ఇప్పటికే ఆకాశ్ అంబానీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మెగా కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి మోనా మెహతాతో బంధుత్వం ఉండటం కొసమెరుపు. అప్పట్లోనే ఇష్టపడ్డారా..? ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్, శ్లోకా ఒకరినొకరు ఇష్టపడేవారని, 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి కాగానే ఆకాశ్ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచారని తెలుస్తోంది. శ్లోక కూడా అతని ప్రేమను అప్పుడే అంగీకరించడం, తాజాగా కుటుంబ సభ్యులు ఒకే చెప్పేయడంతో వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ప్రచారం సాగుతోంది.