ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ , శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. స్విస్‌లోని సెయింట్ మోర్తిజ్ వేదికగా మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగాయి. ఈ వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులు ఆకాశ్-శ్లోకా గుర్రపు బండిలో కాసేపు ఊరేగుతూ వేదికకు చేరుకుని అందర్నీ అలరించారు. బాణా సంచావెలుగులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. సుమారు 850 మంది అతిథులు హాజరైనట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా సినీ ప్రముఖులు రణ్‌బీర్ కపూర్,అలియా భట్ తోపాటు లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇంకా కరణ్ జోహార్, పింకీ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
లూనా పార్క్‌లో ప్రత్యేక వినోద కార్యక్రమాలతోపాటు అతిథుల సౌకర్యార్థం హోటల్ మోర్టిజ్‌లోని అత్యంత విలాసవంతమైన గదులను బుక్ చేశారట. కాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం మార్చి 9న ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment