ఇటీవల అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో సంబరాలు అమరాన్నంటాయి. కుటుంబ సభ్యులంతా హాస్పిటల్‌కి వెళ్లి దంపతులను అభినందించారు. అంతే కాకుండా ఆ బిడ్డను ఇంటికి తీసుకెళుతున్నప్పుడు నీతా అంబానీ ఎంతగానో ఉప్పొంగిపోయింది.
శ్లోకా మెహతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బిడ్డతో కలిసి భర్త ఆకాష్ అంబానీ, నీతా అంబానీ, ముఖేష్ అంబానీతో కలిసి ఇంటికి ఖరీదైన లగ్జరీ కారులో బయలుదేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆకాష్ అంబానీ ముద్దుల తనయని కూడా చూడవచ్చు. బేబీ పింక్ క్యాప్‌లో పాప ముద్దుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారసురాలితో బయలుదేరిన కుటుంబం చాలా ఆనందంగా ఉంటడం ఇక్కడ గమనించవచ్చు.
యువరాణి స్వాగతం పలకడానికి అప్పటికే ఇంటిని చాలా అందంగా అలంకరించారు. ఇప్పటికే ఆకాష్ అంబానీ & శ్లోకా మెహతా దంపతులకు పృథ్వీ అనే రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కాగా ప్రస్తుతానికి రెండవ బిడ్డ పేరుని ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment