
ఒకవైపు రిలయన్స్‌అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం అంతా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా బర్త్‌డేఈ రోజు. ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ శ్లోకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ముందుగా అంబానీ పెద్ద కుమారుడు, శ్లోకా మెహతా భర్త ఆకాశ్ అంబానీ తన భార్యకు స్పెషల్ విషెస్ అందించారు. తరువాత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఇషా, ఆనంద్ పిరామిల్ దంపతులతోపాటు కాబోయే వధూవరులు అనంత్, రాధిక మర్చంట్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందించారు.
ప్రసిద్ధ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్ ఎండీ కుమార్తె శ్లోకా మెహతా. 1990, జూలై 11 న పుట్టింది. 2019 మార్చిలో ఆకాశ్ అంబానీనీ పెళ్లాడింది. వీరికి పృథ్వీ , వేద ఆకాశ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా జూలై 12న తన చిరకాల ప్రేయసి రాధిక మర్చంట్‌ను అనంత్ పెళ్లాడ బోతున్నాడు. ఈ పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అతిథి మర్యాదల ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. అంతేకాదు వీరి పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment