12 దేశాల్లో నూరుమందికి పైగా పిల్లలు : టెలిగ్రాం సీఈవో సంచలన ప్రకటన | Russian origin CEO of Telegram claims he has over 100 biological kids | Sakshi
Sakshi News home page

12 దేశాల్లో నూరుమందికి పైగా పిల్లలు : టెలిగ్రాం సీఈవో సంచలన ప్రకటన

Published Tue, Jul 30 2024 4:24 PM | Last Updated on Tue, Jul 30 2024 5:20 PM

Russian origin CEO of Telegram claims he has over 100 biological kids

ప్రముఖ షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ టెలిగ్రామ్, టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశాడు.  తనకు 12 దేశాలలో వంద మందికి పైగా పిల్లలు ఉన్నారంటూ  టెలిగ్రామ్‌ ద్వారా ప్రకటించడం చర్చకు దారి తీసింది.  “బయోలాజికల్ పిల్లలు” ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా  ఈ విషయాన్ని వేదికపై పంచుకున్నాడు. స్పెర్మ్ డొనేషన్ పై ఉన్న అపోహలను, వ్యతిరేకతనుతొలగించేందుకు ఈ పోస్ట్‌ పెడుతున్నా  అంటూ  కొన్ని సంగతులను షేర్‌ చేశాడు.  దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.  ఈ పోస్ట్‌ను 1.8 మిలియన్ల మంది వీక్షించారు. స్పెర్మ్ డొనేషన్ ద్వారా 100 మందికి పైగా పిల్లలకు తండ్రిని అంటూ తన సుదీర్ఘమైన పోస్ట్‌లో  వెల్లడించాడు. అంతేకాదు  తన పిల్లలు ఒకరినొకరు మరింత సులభంగా  గుర్తించే వీలుగా తన డిఎన్ఎను ఓపెన్ సోర్సింగ్ చేస్తానని ప్రకటించాడు.  

స్మెర్ప్‌ డోనర్‌ ఎలా అయ్యాడు
పెళ్లి చేసుకోకుండా, ఒంటరిగా జీవనం సాగిస్తున్న  తాను 100మందికి తండ్రిని ఎలా అయ్యిందీ, తాను  స్పెర్మ్‌ డోనర్‌గాఎలా మారిందీ  ఆ పోస్ట్‌లో వివరించాడు. తనకు వందకు మందికి పైగా బయోలాజికల్ పిల్లలు ఉన్నారని ఈ మధ్యనే తెలిసిందని రాసుకొచ్చాడు.‘‘పదిహేనేళ్ల క్రితం నా స్నేహితుడు ఓ విచిత్రమైన రిక్వెస్ట్ తో నా దగ్గరకు వచ్చాడు. సంతానోత్పత్తి సమస్య కారణంగా తనకు, తన భార్యకు పిల్లలు పుట్టలేదని, తమకు బిడ్డ బిడ్డ పుట్టడానికి క్లినిక్ లో నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. తను జోక్ చేస్తున్నాడేమో అనుకుని, నేను గట్టిగా నవ్వేశాను. కానీ, అతడు సీరియస్ గానే ఆ రిక్వెస్ట్ చేశాడు’’ అని టెలిగ్రామ్ తెలిపాడు.

"హై-క్వాలిటీ డోనర్ మెటీరియల్" కొరత ఉందని , స్పెర్మ్‌ దానం ద్వారా  ఎక్కువ మంది జంటలకు సహాయం చేయడం పౌర కర్తవ్యమని  చెప్పారని వెల్లడించాడు. ఈ క్రమంలోనే వీర్యదానం చేయడానికి క్లినిక్‌ను సందర్శించినప్పుడు, అత్యంత-నాణ్యత కలిగిన వీర్యం అని తేలిందట. వీంతో ఇబ్బడి ముబ్బడిగా  రిక్వెస్ట్‌లు రావడం మొదలయ్యాయి. మొదట్లో ఇదంతా విచిత్రంగా అనిపించినా, తరువాత ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నానని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం తాను వీర్య దాతగా ఉండటం మానేశానని చెప్పాడు. అయితే ఐవీఎఫ్ క్లినిక్‌లో ఫ్రీజ్ చేసిన తన వీర్యం అందుబాటులో ఉందని వెల్లడించాడు. పిల్లలను పొందాలనుకునే వారు దీన్ని ఉపయోగించుకోవచ్చని సూచించాడు. భవిష్యత్తులో తన బయోలాజికల్ పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, ఉపయోగ పడేందుకు వీలుగా తన డీఎన్ఏ ను ఓపెన్ సోర్స్ చేయనున్నట్లు దురోవ్ వెల్లడించారు.

ఎవరీ పావెల్‌ దురోవ్‌
రష్యా నుండి పారిపోయిన పావెల్ ఆ తర్వాత  సోషల్ నెట్‌వర్క్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్  ఒకదాన్ని లాంచ్‌ చేశాడు.  అందుకే  అతనిని ‘రష్యా మార్క్ జుకర్‌బర్గ్" అని  పేరు పొందాడు.  ఆ కంపెనీ నుంచి తొలగించడంతో ఆ తరువాత టెలిగ్రామ్‌ను స్థాపించాడు.  దురోవ్‌ తన ప్రత్యేకమైన జీవనశైలితో పాపులర్‌. అతను నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement