telegram
-
స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు
స్పామ్, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల్లో స్పామ్ మెసేజ్‌లు, కాల్స్‌తోపాటు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్టెల్ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
విశ్వంభర దర్శకుడి టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్
ప్రముఖ దర్శకుడు వశిష్ట టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించాడు. తన టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, దాని నుంచి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా పట్టించుకోవద్దని కోరాడు.వశిష్ట విషయానికి వస్తే.. చేసింది ఒక్క సినిమానే అయినా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బింబిసార మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. గతంలో ఇతడు ప్రేమలేఖ రాశా అనే మూవీలోనూ చిన్న పాత్రలో నటించాడు.విశ్వంభర విషయానికి వస్తే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని విక్రమ్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు.త్రిష, కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.Hi everyone, I just found out that my Telegram account has been hacked. If you receive any messages from it, please ignore them. Thank you!— Vassishta (@DirVassishta) November 15, 2024చదవండి: 20 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న టాప్ హీరోయిన్ -
టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తన సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఈ సమాచారం నియంత్రణకు ప్లాట్ఫామ్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. దాంతో సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ పావెల్‌ను ఇటీవల పారిస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఫలితంగా కంపెనీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.ప్లాట్‌ఫారమ్ సెర్చ్ ఫంక్షన్‌ని ఉపయోగించి ఇకపై చట్టవిరుద్ధ కార్యకలాపాలు, కంటెంట్ కోసం వెతకలేరని తెలిపింది. ఒకవేళ వినియోగదారులు అలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి పలుమార్లు ప్రయత్నిస్తే చట్టబద్ధంగా అవసరమైతే వారి ఫోన్ నంబర్లు, ఐపీ చిరునామాలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తుందని సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. టెలిగ్రామ్ సెర్చ్ ఫీచర్ స్నేహితులు, వార్తలను కనుగొనడం కోసం ఉద్దేశించబడిందని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కోసం కాదని ఈ సందర్భంగా దురోవ్ తెలిపారు. టెలిగ్రామ్‌లో డ్రగ్స్, స్కామ్, పిల్లల లైంగిక వేదింపులు, హింస..వంటి కంటెంట్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేకంగా కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?పారిస్ పోలీసులు దురోవ్ పావెల్‌ను ఇటీవల అరెస్ట్ చేయడంతో నిబంధనల ప్రకారం ఐదు మిలియన్ యూరోలు(రూ.46 కోట్లు) విలువ చేసే బాండ్‌ను అందించి న్యాయ పర్యవేక్షణలో ఉన్నారు. దాంతోపాటు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు అమలు చేస్తున్నారు. దురోవ్ అరెస్ట్ సమయంలో టెలిగ్రామ్‌ను నిలిపేస్తారేమోననే వార్తలు రావడం గమనార్హం. -
హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్.. సంచలనాల సీఈవో..
-
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
టెలిగ్రామ్ సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ అక్రమ రవాణా.. ఇతరత్రా చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని ప్యారిస్ కోర్టు ధృవీకరించింది. దీంతో ఈ వ్యవహారంలో ఆయన విచారణ ఎదురోవాల్సి ఉండనుంది. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో అభ్యంతరకర కార్యకలాపాలకు(నేరాలుగా పరిగణిస్తూ..) పాల్పడేందుకు ఆయన అనుమతి ఇచ్చారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. అంతేకాదు.. యాప్‌లో పిల్లలపై అశ్లీల కంటెంట్ వ్యాప్తి చేశారనే అరోపణలకుగానూ అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు ప్యారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. దీంతో.. కోర్టు అనుమతితో ఆయన్ని ఫ్రాన్స్ విచారణ జరపనుంది. రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్లమంది వినియోగిస్తున్నారు. దురోవ్ అరెస్టుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. వాక్ స్వాతంత్య్రంపై పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని రష్యా అంటోంది... గత శనివారం సాయంత్రం అజర్బైజాన్ నుంచి పారిస్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 39 ఏళ్ల పావెల్ దురోవ్‌ను అక్కడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలోనే ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసిన ఫ్రాన్స్ అధికారులు.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్‌లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్‌కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్‌ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్‌ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్‌గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్‌ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్‌ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్‌కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్‌కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను ప్రాన్స్ నిషేధిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సంస్థ సీఈఓ పావెల్ దురోవ్(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గతంలో ఫ్రెంచ్ అధికారులు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తాజాగా తనను అరెస్టు చేయడంతో ఒకవేళ ఆరోపణలు రుజువైతే స్థానికంగా ప్రాన్స్‌లో ఈ యాప్‌ను నిషేధిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్ఫామ్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ నియంత్రిత కంటెంట్ నిర్వహణలో విఫలమయ్యారని పారిస్ అధికారులు తెలిపారు. అయితే టెలిగ్రామ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ పద్ధతులు సమర్థంగా ఉన్నాయని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!ఈ వ్యవహారంపై రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్న దురోవ్‌ను సంప్రదించాలంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందడం లేదని తెలిపింది. ఇదిలాఉండగా, రష్యా, ఉక్రెయిన్తోపాటు గతంలోని సోవియట్ కూటమిలో భాగంగా ఉన్న దేశాల్లో ఈ యాప్ ప్రజాదరణ పొందింది. అయితే యూజర్ డేటాను పంచుకోవడానికి దురోవ్ నిరాకరించడంతో 2018లో రష్యా ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది. ఈ నిషేధం 2021లో ముగిసింది. -
టెలిగ్రామ్ అధినేత అరెస్ట్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. యాప్‌కు సంబంధించిన నేరాలకు సంబంధించి దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు శనివారం పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.ఫ్రెంచ్ రాజధానికి ఉత్తరాన ఉన్న లే బోర్గెట్ విమానాశ్రయంలో ఈ ఫ్రాంకో-రష్యన్ బిలియనీర్‌ను నిర్బంధించినట్లు అధికారి ఒకరు ఏఎఫ్పీకి చెప్పారు. ఆయన అజర్‌బైజాన్‌లోని బాకు నుండి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు కేసుకు దగ్గరగా ఉన్న మరొకరు తెలిపారు. దురోవ్‌ను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సమాచారం.మైనర్లపై హింసను నిరోధించడంలో కృషి చేసే ఫ్రాన్స్‌కు చెందిన ఆఫ్మిన్ సంస్థ మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తులో సమన్వయ ఏజెన్సీగా దురోవ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసుకు దగ్గరగా ఉండే మరో అధికారి ఈ విషయాన్ని తెలిపారు. -
పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!
వివాహం చేసుకోలేదు..ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతాడు..అలాంటిది తనకు 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారు. అదేంటి పెళ్లి కాకుండా, ఒంటిరిగా ఉంటూ అంతమందికి ఎలా తండ్రాయ్యాడు..? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ అతను ఎవరు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం.ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తనకు 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు టెలిగ్రామ్‌లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండేందుకే పావెల్ ఇష్టపడుతారు. అలాంటి వ్యక్తి 100 మందికి ఎలా తండ్రాయ్యడో టెలిగ్రామ్ పోస్ట్‌లో వివరంగా తెలిపారు.పావెల్ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రపంచవ్యాప్తంగా నాకు 100కు పైగా పిల్లలు ఉన్నారు. ఎన్నడూ వివాహం చేసుకోని, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అనుకుంటున్నారా.. సుమారు 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నా వద్దకు వచ్చి విచిత్రమైన కోరిక కోరాడు. తనకు, తన భార్యకు సంతానోత్పత్తి సమస్య కారణంగా పిల్లలు పుట్టలేదని చెప్పాడు. తనకు సంతానం కలగడానికి నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. దాంతో నాకు విపరీతంగా నవ్చొచ్చింది. ఆ సమస్య ఎంత తీవ్రమైందో నిజానికి ఆ సమయంలో నాకు తెలియదు. స్పెర్మ్ దానానికి అంగీకరించి క్లినిక్‌కు వెళ్లాను. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దొరకడం చాలా కష్టమని డాక్టర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. సంతానంలేని వారికి స్పెర్మ్ దానం చేయడం గొప్ప విషయం అని అన్నాడు. దాంతో సమస్య ఎంత తీవ్రమైందో అర్థమైంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’‘ప్రపంచవ్యాప్తంగా నాకు 12 దేశాల్లో దాదాపు 100 మంది పిల్లలున్నారు. నిజానికి ఇలా చెప్పడం ఆమోదయోగ్యం కాకపోయినా స్పెర్మ్ దాతగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారింది. దాన్ని తగ్గించడంలో నా వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. మరికొందరు ఆరోగ్యవంతమైన పురుషులను వీర్యదానం కోసం ప్రోత్సహించాలనుకుంటున్నాను. దానివల్ల పిల్లలు కావాలనుకునే కుటుంబాలకు ఎంతో సహాయం చేసినట్లవుతుంది’ అని దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్‌లో ఈమేరకు చేసిన పోస్ట్‌ను ఇప్పటికే సుమారు 20 లక్షల మంది వీక్షించారు. దాంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
12 దేశాల్లో నూరుమందికి పైగా పిల్లలు : టెలిగ్రాం సీఈవో సంచలన ప్రకటన
ప్రముఖ షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ టెలిగ్రామ్, టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశాడు. తనకు 12 దేశాలలో వంద మందికి పైగా పిల్లలు ఉన్నారంటూ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించడం చర్చకు దారి తీసింది. “బయోలాజికల్ పిల్లలు” ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వేదికపై పంచుకున్నాడు. స్పెర్మ్ డొనేషన్ పై ఉన్న అపోహలను, వ్యతిరేకతనుతొలగించేందుకు ఈ పోస్ట్ పెడుతున్నా అంటూ కొన్ని సంగతులను షేర్ చేశాడు. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను 1.8 మిలియన్ల మంది వీక్షించారు. స్పెర్మ్ డొనేషన్ ద్వారా 100 మందికి పైగా పిల్లలకు తండ్రిని అంటూ తన సుదీర్ఘమైన పోస్ట్‌లో వెల్లడించాడు. అంతేకాదు తన పిల్లలు ఒకరినొకరు మరింత సులభంగా గుర్తించే వీలుగా తన డిఎన్ఎను ఓపెన్ సోర్సింగ్ చేస్తానని ప్రకటించాడు. స్మెర్ప్ డోనర్ ఎలా అయ్యాడుపెళ్లి చేసుకోకుండా, ఒంటరిగా జీవనం సాగిస్తున్న తాను 100మందికి తండ్రిని ఎలా అయ్యిందీ, తాను స్పెర్మ్ డోనర్గాఎలా మారిందీ ఆ పోస్ట్‌లో వివరించాడు. తనకు వందకు మందికి పైగా బయోలాజికల్ పిల్లలు ఉన్నారని ఈ మధ్యనే తెలిసిందని రాసుకొచ్చాడు.‘‘పదిహేనేళ్ల క్రితం నా స్నేహితుడు ఓ విచిత్రమైన రిక్వెస్ట్ తో నా దగ్గరకు వచ్చాడు. సంతానోత్పత్తి సమస్య కారణంగా తనకు, తన భార్యకు పిల్లలు పుట్టలేదని, తమకు బిడ్డ బిడ్డ పుట్టడానికి క్లినిక్ లో నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. తను జోక్ చేస్తున్నాడేమో అనుకుని, నేను గట్టిగా నవ్వేశాను. కానీ, అతడు సీరియస్ గానే ఆ రిక్వెస్ట్ చేశాడు’’ అని టెలిగ్రామ్ తెలిపాడు."హై-క్వాలిటీ డోనర్ మెటీరియల్" కొరత ఉందని , స్పెర్మ్ దానం ద్వారా ఎక్కువ మంది జంటలకు సహాయం చేయడం పౌర కర్తవ్యమని చెప్పారని వెల్లడించాడు. ఈ క్రమంలోనే వీర్యదానం చేయడానికి క్లినిక్‌ను సందర్శించినప్పుడు, అత్యంత-నాణ్యత కలిగిన వీర్యం అని తేలిందట. వీంతో ఇబ్బడి ముబ్బడిగా రిక్వెస్ట్‌లు రావడం మొదలయ్యాయి. మొదట్లో ఇదంతా విచిత్రంగా అనిపించినా, తరువాత ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నానని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం తాను వీర్య దాతగా ఉండటం మానేశానని చెప్పాడు. అయితే ఐవీఎఫ్ క్లినిక్‌లో ఫ్రీజ్ చేసిన తన వీర్యం అందుబాటులో ఉందని వెల్లడించాడు. పిల్లలను పొందాలనుకునే వారు దీన్ని ఉపయోగించుకోవచ్చని సూచించాడు. భవిష్యత్తులో తన బయోలాజికల్ పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, ఉపయోగ పడేందుకు వీలుగా తన డీఎన్ఏ ను ఓపెన్ సోర్స్ చేయనున్నట్లు దురోవ్ వెల్లడించారు.ఎవరీ పావెల్ దురోవ్రష్యా నుండి పారిపోయిన పావెల్ ఆ తర్వాత సోషల్ నెట్వర్క్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ఒకదాన్ని లాంచ్ చేశాడు. అందుకే అతనిని ‘రష్యా మార్క్ జుకర్‌బర్గ్" అని పేరు పొందాడు. ఆ కంపెనీ నుంచి తొలగించడంతో ఆ తరువాత టెలిగ్రామ్‌ను స్థాపించాడు. దురోవ్ తన ప్రత్యేకమైన జీవనశైలితో పాపులర్. అతను నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తాడు. -
మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ సేవలు గడిచిన 24 గంటల్లో పలుసార్లు నిలిచిపోయాయి. యూజర్లు టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపడం, డౌన్లోడ్, లాగిన్ చేసేపుడు ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదు చేశారు.దాదాపు 6700 మందికిపై టెలిగ్రామ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్‌డిటెక్టర్ డేటా ద్వారా తెలిసింది. మొత్త ఫిర్యాదు చేసిన వారిలో 49 శాతం మంది మెసేజ్‌లు పంపించడంతో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. 31 శాతం మంది యాప్ పనిచేయలేదని, 21 శాతం మంది లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.Twitter users to telegram users right now#telegramdown pic.twitter.com/X4gP9hYn1R— Dr.Duet🇵🇸 (@Drduet56) April 26, 2024ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, లక్నో, పాట్నా, జైపుర్, అహ్మదాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.అయితే ఇప్పటివరకు టెలిగ్రామ్ ఈ సమస్యపై స్పందించలేదు. ఇలా ప్రముఖ యాప్‌లో సమస్య ఎదురైందనే వార్త క్షణాల్లో వైరల్ అవ్వడంతో వాటికి సంబంధించి ట్విటర్లో చాలా మీమ్స్ చక్కర్లు కొట్టాయి.telegram users rn#telegramDownpic.twitter.com/wz7KYfLwIS— F. 🇵🇸🚩 (@aaatankwaadi) April 26, 2024 -
ఏడాదిలోపు ప్రముఖ యాప్‌లో 100 కోట్ల యూజర్లు
ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ ఏడాదిలోపు 1 బిలియన్(100 కోట్లు) యాక్టివ్ యూజర్లను సంపాదిస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాప్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. దుబాయ్‌లో టెలిగ్రామ్ యాప్ సబ్స్క్రైబర్లు వేగంగా పెరుగుతున్నారని దురోవ్ చెప్పారు. సందేశాలు, కాల్లు, ఇతర ఫైల్‌లను పంపడానికి యాప్ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏడాదిలో ఒక బిలియన్(100 కోట్లు) నెలవారీ యాక్టివ్ యూజర్ మార్కును అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ యాప్‌లో 90 కోట్ల యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని చెప్పారు. టెలిగ్రామ్ ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకటైన మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ 2 బిలియన్ల(200 కోట్లు) కంటే ఎక్కువ నెలవారీ యాక్లివ్ యాజర్లును కలిగి ఉంది. యాప్ యాజమాన్యం భౌగిళిక రాజకీయాల్లో తటస్థ వైఖరి పాటిస్తున్నట్లు దురోవ్ స్పష్టతనిచ్చారు. రష్యాలో జన్మించిన ఆయన 2014లో తాను స్థాపించిన కంపెనీలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ రష్యా నుంచి వెళ్లిపోయాడు. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత టెలిగ్రామ్‌ను రెండు ప్రభుత్వాలు విరివిగా వాడడం మొదలుపెట్టాయి. యుద్ధానికి సంబంధించిన చాలా విషయాలు పంచుకోవడానికి దీన్ని వేదికగా మార్చుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని ప్రధాన మీడియా, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు ఇందులో కంటెంట్ ఛానెల్‌లను నిర్వహించారు. ఇదీ చదవండి: కొత్త యూజర్లు ఫీజు చెల్లించాల్సిందే.. ఎందుకంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ తన రోజువారీ వీడియో అప్డేట్లను ఇందులోనే పోస్ట్ చేసేవారు. క్రెమ్లిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా సాగిన ర్యాలీ విషయాలను టెలిగ్రామ్‌లో తెలియజేసింది. అయితే ఈ యాప్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు వినియోగిస్తున్నారని కొందరు విమర్శలు చేయడం గమనార్హం. -
వాట్సాప్ నుంచి వేరే యాప్‌లకూ మెసేజ్‌లు!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్‌లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్‌ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు. ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్‌ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్‌తో మెసేజ్‌ల షేరింగ్‌లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది. ఏఏ యాప్‌లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్‌ను టెస్ట్చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్‌లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్‌ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. -
ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే..
సైబర్ నేరస్థులు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అదే కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఆసక్తి. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. కానీ ప్రస్తుతం అధికారికంగా విడుదలైన తర్వాతే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే భావనతో ఇతర ప్లాట్ఫామ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. అలా జనాలు చేస్తున్న ప్రయత్నాలే సైబర్ నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్ ఛానల్‌ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇదీ చదవండి: ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..! సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్ లోడ్ అనే లింక్‌లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే పాప్అప్ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. -
ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. నోటీసులు అందించడానికి కారణమేంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఆయా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను కూడా అమలు చేయాలని తెలిపింది. ఈ నియణామాన్ని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ప్రకటనలో తెలిపింది. దీనిని ఉల్లంఘిస్తే.. సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం! There will be ZERO #tolerance for criminal & #harmful content on Indian #Internet. #ITRules under the #ITAct clearly lays down the expectation from #Intermediaries: They cannot host #criminal & harmful content like #CSAM. If Intermediaries do not act swiftly to clean up such… pic.twitter.com/PRQ9VypbR6 — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 6, 2023 -
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్‌లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్‌కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్‌లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్‌ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్‌లో పెట్టుబడులు, ట్రేడింగ్‌కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్‌ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్‌కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్‌ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్‌లు, పోర్ట్‌ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్‌లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్‌ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్‌ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్‌ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్‌లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్‌లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్‌లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్‌లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్‌పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్‌ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్‌ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్‌కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్‌కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్‌లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్‌బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్‌బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్‌లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. -
రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మేడ్ ఇన్ చైనా!
సాక్షి, హైదరాబాద్: చైనాలో కూర్చున్న సూత్రధారులు కథ నడుపుతున్నారు... దుబాయ్‌లో ఉంటున్న పాత్రధారులు వీరి ఆదేశాలు పాటిస్తున్నారు. గుజరాత్లో నివసించే సహాయకులు ముందుండి పని చేస్తున్నారు. ఈ పంథాలో సాగిన రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించడం ద్వారా హైదరాబాదీయులు కీలకపాత్ర పోషించారు. ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంతోపాటు ముంబై, అహ్మదాబాద్‌లకు చెందిన 9 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి ఆయన శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. టాస్క్‌లకు రూపమిచ్చేది చైనాలో.. ఈ ఫ్రాడ్‌లో కథ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వచ్చే ప్రకటనలతో మొదలవుతుంది. దీనికి ఆకర్షితులై స్పందించిన వారికి లింకులు పంపడం ద్వారా ఆ రెండు యాప్స్‌లోని గ్రూపుల్లో చేరుస్తారు. ముందు తమ వద్ద ఇన్వెస్ట్ చేసి, తాము పంపే టాస్క్‌లు పూర్తి చేసి లాభాలు పొందాలని. ఆ తర్వాత ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తారు. వాళ్లు పంపే లింకులకు లైక్స్ కొట్టడం, నిర్ణీత విధానంలో షేర్ చేయడం వంటి తేలికపాటి టాస్క్‌లే ఉంటాయి. సూత్రధారులుగా ఉన్న చైనీయులు లీ లూ గువాంఘెజు, నాన్ ఏ, కివిన్ జున్ ఆ దేశంలోనే ఉండి ఆకర్షణీయమైన టాస్క్‌లు రూపొందిస్తున్నారు. చిన్న లాభాలు ఇస్తూ ఉచ్చులోకి... ఇందులో పెట్టుబడి రూ.5 వేల నుంచి మొదలవుతుంది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను బాధితులు డౌన్లోడ్ చేసుకుంటారు. రూ.5 వేలకు రూ.వెయ్యి, రూ.10 వేలకు రూ.2 వేలు,రూ.15 వేలకు రూ.3వేల చొప్పున లాభం ఇస్తారు. అలా క్రమంగా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ఆస్కారం లేకుండా మరికొంత పెడితేనే కుదురుతుందని చెబుతారు. ఇలా ఒక్కో బాధితుడితో రూ.లక్షల్లో పెట్టించిన తర్వాత ఆ యాప్ పని చేయడం మానేస్తుంది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల నుంచి వీరిని తొలగించేసి బ్లాక్ చేసేస్తారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రూ.712 కోట్లు ఇన్వెస్ట్ చేసి నిండా మునిగిపోయారు. రెండు యాప్‌ల ద్వారా దుబాయ్ నుంచి.. చైనీయుల ఏజెంట్లు అనిస్, ఆరిఫ్, శైలేష్, పీయూష్, ఖాన్, శెల్లీ దుబాయ్‌లో ఉంటున్నారు. అహ్మదాబాద్‌లో ఉన్న ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి వీరితోపాటు చైనీయులతో టచ్‌లో ఉంటున్నారు. వాళ్లకు కావాల్సిన షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, నగదును క్రిప్టోకరెన్సీగా మార్చడం వీరి విధి. ఇలా చేసినందుకు ఈ ద్వయానికి 3 శాతం కమీషన్ వస్తోంది. లక్నోకు చెందిన వికాస్, మనీష్, రాకేష్ తదితరులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని షెల్ కంపెనీలు, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఖాతాల వివరాలను ప్రజాపతి ద్వయం దుబాయ్‌లోని వారికి పంపుతుంది. వీటికి లింకైన సిమ్‌కార్డులతో కూడిన ఫోన్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు. వీరితోపాటు దుబాయ్‌లో ఉన్న వాళ్లు ఆ ఫోన్లలో కూల్‌టెక్, ఎయిర్డ్రాయిడ్ అనే యాప్స్ వేసుకుంటున్నారు. వీటి ద్వారా ఇక్కడి ఫోన్లకు వచ్చిన ఓటీపీలను దుబాయ్‌లోని వాళ్లు చూడగలుగుతున్నారు. క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు... బాధితుల నుంచి కాజేసిన మొత్తాన్ని దుబాయ్‌లోని పాత్రధారులు అమెరికన్ డాలర్లతో సమానమైన క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. వీరికి ఒక్కో డాలర్‌కు రూ.10 కమీషన్‌గా వస్తోంది. వీళ్లు చైనాలోని సూత్రధారులకు వాలెట్స్ ద్వారా డబ్బు పంపేస్తున్నారు. ప్రజాపతులు వాడిన మూడు వాలెట్స్‌లో హిబ్బుల్ వాలెట్ కూడా ఉంది. దీని ద్వారా ఉగ్రవాదులకు నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రజాపతి ద్వయానికి రావాల్సిన కమీషన్‌ను దుబాయ్‌లోని కేటుగాళ్లు ముంబైకి చెందిన ఏజెంట్లు గగన్, గుడ్డు, నయీమ్ ద్వారా హవాలా రూపంలో పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మునావర్ మహ్మద్, ఆరుల్ దేవ్, సమీర్ ఖాన్, ఎస్.సుమేథ్ కూడా ఉన్నారు. ఈ భారీ మోసాన్ని ఛేదించిన పోలీసులు ఈ నలుగురితోపాటు ప్రజాపతి ద్వయం, గన్, గుడ్డు, నయీమ్‌లను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10,53,89,943లను ఫ్రీజ్ చేశారు. -
కొవిన్ పోర్టల్ డేటా లీక్.. ఆర్బీఐ అప్రమత్తం!
కోవిడ్-19 వ్యాక్సిన్ టీకాలు అందించే భారత ప్రభుత్వ పోర్టల్ కోవిన్‌లో నమోదు చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్లో లభ్యమైనట్లు కోవిన్ డేటా లీకేజీపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. డేటా లీకేజీ అంశంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. డేటా లీకేజీ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం బ్యాంకుల్ని అప్రమత్తం చేసినట్లు జాతీయ, అంతర్జాతీయంగా ఆర్ధిక సేవల్ని అందించే సౌత్ ఏసియా ఇండెక్స్ నివేదించింది. కొవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్‌లోని (CoWIN ) సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. కోవిన్‌లో వ్యక్తిగత ఫోన్ నెంబర్లతో వారి వివరాల్ని నమోదు చేసుకున్న ప్రముఖుల పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, జెండర్, పుట్టిన తేదీ, వ్యాక్సినేషన్ సెంటర్‌తో ఇతర వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్లో లభ్యమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. Just IN:— Major data breach in India; Personal data of all vaccinated Indians have been leaked online. ☆ Leaked data has Aadhaar, voter ID, Passport numbers & mobile numbers of Indians who got covid-19 vaccines. — South Asia Index (@SouthAsiaIndex) June 12, 2023 అంతేకాదు కోవిన్ పోర్టల్‌లో అప్డేట్ చేసుకున్న విదేశీ ప్రయాణాల వివరాలు, వారి పాస్‌పోర్ట్ సమాచారం టెలిగ్రామ్ ఛానల్లో ప్రత్యక్షమైనట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. వ్యక్తిగత వివరాలు లీకైన ప్రముఖుల్లో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రాజేష్ భూషణ్‌తో పాటు అతని భార్య ఉత్తరాఖండ్ కోటద్వార్ బీజేపీ ఎమ్మెల్యే రితూ ఖండూరి భూషణ్‌ల ఆధార్, పుట్టిన తేదీ వివరాలు ఉన్నాయని సమాచారం. ఈ తరుణంలో డేటా లీక్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐటీ శాఖలు అప్రమత్తమయ్యాయి. విచారణను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదీ చదవండి : బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్! -
అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అరీఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో టెలీగ్రాం, డార్క్‌నెట్ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్‌ను పట్టుకుని, ఒక లాప్టాప్, రెండు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్‌లో శివమొగ్గలో ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
వాట్సాప్‌కు పోటీగా టెలిగ్రాంలో కొత్త ఫీచర్స్..
కొత్త అప్డేట్స్ ఎల్లప్పుడూ యాప్స్‌కు బూస్టింగ్‌నిచ్చే అంశాలేనని భావిస్తోంది టెలిగ్రామ్. ఇందులో భాగంగా వాట్సాప్ పోటీని తట్టుకునేందుకు టెలిగ్రామ్ సరికొత్త అప్డేట్స్తో లేటెస్ట్ ఫీచర్స్‌ను విడుదల చేసింది. వినియోగదారుల చాట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసే ఫీచర్‌ను జోడించింది. ప్రొఫైల్ పిక్చర్, ఎమోజీ కేటగిరితో పాటు ఇతర ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఫీచర్‌తో మొత్తం చాట్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం లభించినట్లయింది. టెలిగ్రామ్‌లో ఎగువన ఉన్న ట్రాన్స్‌లేటింగ్ ఎంటైర్ చాట్స్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ ఫీచర్ సేవలను పొందొచ్చు. వినియోగదారులను ఉత్తేజపరిచే ఫీచర్స్‌లో ఇదీ ఒకటిగా నిలవనుందని టెలిగ్రామ్ అంచనా వేస్తోంది. ప్రీమియం కస్టమర్లకు మాత్రమే.. ట్రాన్స్‌లేటింగ్ ఎంటైర్ చాట్స్ కేవలం టెలిగ్రాం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్‌ను పొందాలంటే వ్యక్తిగత సందేశాలను ఎంచుకుని అనువాదం నొక్కితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అదే ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఇక ప్రొఫైల్ ఫోటో మేకర్‌తో వినియోగదారులు తమ ప్రొఫైల్ చిత్రంలో ఏదైనా స్కిక్కర్ లేదా యానిమేటెడ్ ఎమోజీని మార్చుకునేందుకు అనుమతిస్తుంది. టెలిగ్రామ్ ప్రీమియం లేకపోయిన్పటికీ.. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాల కోసం యానిమేటెడ్, అలాగే అనుకూల ఎమోజీలను ఉపయోగించవచ్చని టెలిగ్రామ్ ప్రకటించింది. అంతేకాకుండా టెలిగ్రామ్ కూడా కొన్ని ప్రత్యేక ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా స్టిక్కర్లు, ఎమోజీలను వర్గాల వారీగా క్రమబద్ధీకరించింది. దీంతో వినియోగదారులు పది లక్షల కంటే ఎక్కువ విభిన్న స్టిక్కర్లు, ఎమోజీలను షేర్ చేసే అవకాశముంది. టెలిగ్రామ్ మరో సరికొత్త ఫీచర్ "నెట్వర్క్ యూసేజ్"ను కూడా తమ కస్టమర్లకు పరిచయం చేసింది. దీని ద్వారా వైఫై, మొబైల్ డేటాను కస్టమర్లు ఎంత వినియోగించారో తెలుసుకునేందుకు టెలిగ్రామ్ అనుమతిస్తుంది. వారి డేటాకు అనుగుణంగా ఆటో డౌన్లోడ్ సెట్టింగ్‌లను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించింది. "ఆటో-సేవ్ ఇన్కమింగ్ మీడియా" ఫీచర్ ద్వారా వీడియా పరిమాణం, వీడియో రకం, ఏ చాట్ నుంచి వీడియో వచ్చిందనే విషయాలను సులభంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. చదవండి: చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. ఈసారి ఏకంగా -
యూటీఐ మ్యూచువల్ ఫండ్ పేరుతో మోసపూరిత ప్రచారం
న్యూఢిల్లీ: యూపీఐ మ్యూచువల్ ఫండ్ బంపర్ ఆఫర్ స్కీమ్ అందిస్తున్నట్లు ఇన్స్టెంట్ మెసేజింగ్ టూల్–టెలిగ్రామ్‌పై నడుస్తున్న ప్రచారం పట్ల మదుపరులు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచింది. అలాంటి ఆఫర్ లేదా ఉత్పత్తి ఏదీ కూడా యుటీఐ మ్యూచువల్ ఫండ్ అందించడం లేదా విక్రయించడం లేదని స్పష్టం చేసింది. ‘‘అద్భుతమైన రాబడులు అని చెప్పి మదుపరులను మోసగించేందుకు కొంతమంది చేస్తోన్న మోసపూరిత ప్రక్రియ ఇది. ఎలాంటి సందర్భంలోనూ యుటీఐ మ్యూచువల్ ఫండ్ అలాంటి రాబడులు వస్తాయనే హామీ ఇవ్వదు’’అని యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా తప్పు దోవ పట్టించే, తప్పుడు ఆఫర్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యుటీ ఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి సంబంధిత అధీకృత పోర్టల్ నుంచి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
టెలిగ్రామ్, వాట్సప్‌లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే!
ముంబై: రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలో ఎలాంటి పెట్టుబడులు పెట్టొందంటూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘టెలిగ్రామ్, వాట్సప్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలు మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టి మోసపోద్దు. ఈ సంస్థలకు ఎక్స్చేంజ్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో గత నెలలో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సైతం ఎక్స్చేంజ్ నిషేధించింది. ఇది చదవండి: కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి -
జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, గంటల వ్యవధిలోని ఆన్లైన్లో లీక్
Shahid Kapoor Jersey Movie Leaked Online: షాహిద్ కపూర్ తాజా చిత్రం జెర్సీ మూవీ టీంకు షాక్ తగిలింది. ఎన్నోసార్లు వాయిదా పుడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు నేడు(ఏప్రిల్ 22న) విడుదలైంది. ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో హిట్ కొట్టిన షాహిద్ ఈ మూవీతో మరో హిట్కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జెర్సీ విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో లీకవడంతో మూవీ టీం, హీరో షాహిద్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ మూవీ విడులైన గంట వ్యవధిలోనే తమిళ్రాక్స్, టెలిగ్రామలో లీకైంది. అయితే ఈ సినిమా పైరసి పట్ల చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి లీకువీరులు తమ చేతివాటం చూపించారు. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ చిత్రాలు గట్టి పోటి ఇస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాగా వచ్చిన జెర్సీ తొలి రోజే ఆన్‌లైన్‌లోకి లీకవడం మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షాహిద్ ఎమోషనల్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో అతడి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్‌కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. చదవండి: హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే.. -
సబ్స్క్రైబర్లతో టెలిగ్రామ్ కుంభకోణం!! కేసు,సెబీ సోదాలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను వినియోగించుకుని షేర్ల ట్రేడింగ్ సంబంధ కుంభకోణానికి తెరతీశాయన్న ఆరోపణలున్న సంస్థలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ తాజగా సోదాలకు దిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎనిమిది సంస్థలకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు, స్వాదీన చర్యలను చేపట్టింది. ఈ సంస్థలు తొమ్మిది టెలిగ్రామ్ చానళ్ల నిర్వహణ ద్వారా 50 లక్షలకుపైగా సబ్స్కయిబర్లకు రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు వీటిలో లావాదేవీలు చేపట్టేలా చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఆయా కౌంటర్లలో కృత్రిమంగా లావాదేవీల పరిమాణం, ధరల పెరుగుదలకు దారిచూపినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీటితో లింక్ చేసిన సంస్థలు అధిక ధరల వద్ద షేర్లను విక్రయించేందుకు వీలు కల్పించాయి. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోగా.. ఈ సంస్థలు లబ్ది పొందినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలకు సంబంధించి తాజాగా ఏడుగురు వ్యక్తులు, ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన పలు ప్రాంతాలలో సోదాలు, స్వాధీన చర్యలు చేపట్టినట్లు సెబీ వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, భావనగర్, మధ్యప్రదేశ్‌లోని నీముచ్, ఢిల్లీ, ముంబైలలో సోదాలు జరిగినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సెబీ అధికారులు 34 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్‌టాప్‌లు, 4 డెస్క్‌టాప్‌లు, 4 ట్యాబ్లెట్లతోపాటు.. 2 హార్డ్ డిస్కులు, పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. -
వాట్సాప్, టెలిగ్రామ్ వాడుతున్న ఉద్యోగులకు కేంద్రం గట్టి హెచ్చరిక..!
ఇక నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో ముఖ్యమైన సమాచారం, పత్రాలను షేర్ చేయడం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం తన అధికారులకు తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కొత్తగా కమ్యూనికేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్‌లను అస్సలు ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరినీ ఆదేశించింది. ఇందుకు గల కారణాలను కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సోషల్ మీడియా యాప్‌ల సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్నాయని, అందుకే దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని భారత వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయవచ్చు అని తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాధనాల ద్వారా మాత్రమే కనెక్ట్ కావాలని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ తెలిపింది. ఈ ఆర్డర్ అమెజాన్ అలెక్సా, యాపిల్ హోమ్ పాడ్, గూగుల్ మీట్, జూమ్ మొదలైన వాటికి కూడా ఈ నిబందనలు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలోని లొసుగులను విశ్లేషించిన తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్‌లను వాడవద్దు అని కేంద్రం ఆర్డర్ జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచార లీక్ కావడం, జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు & ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ నిరంతరం ఉల్లంఘించిన ఫలితంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన ఆదేశాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్నీ మంత్రిత్వ శాఖల అధికారులు పాటించాలని సూచించింది. గోప్యమైన లేదా జాతీయ భద్రతా సంబంధిత సమస్యలను చర్చించే సమావేశాల సమయంలో స్మార్ట్-వాచీలు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని కేంద్రం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు వర్చువల్ సమావేశాల కూడా వర్తిస్తుంది అని తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సి-డిఎసి), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఏర్పాటు చేసిన మద్యమాల ద్వారా మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ జరపాలని కేంద్రం పేర్కొంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్'లో వాటిపై అదిరిపోయే ఆఫర్స్..!) -
ఫేస్బుక్ డౌన్ అయ్యిందో లేదో...! టెలిగ్రామ్ రయ్రయ్ అంటూ రాకెట్లా..!
రష్యాకు చెందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త రికార్డును నమోదుచేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సుమారు ఒక బిలియన్ (100కోట్లకు) పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది. టెలిగ్రామ్‌ను రష్యాకు చెందిన పావెల్ దురోవ్ 2013లో స్థాపించారు. కలిసొచ్చిన ఫేస్బుక్ డౌన్...! అక్టోబర్ 4 న ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో టెలిగ్రామ్‌కు బాగా కలిసొచ్చింది. ఫేస్బుక్ డౌన్ అవ్వడంతో సుమారు 70 మిలియన్ల కొత్త యూజర్లు టెలిగ్రామ్ తలుపు తట్టారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ కావడం ఇదే తొలిసారి. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన సెన్సార్ టవర్ డేటా ప్రకారం... ఈ ఏడాది ఆగస్టులో టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డౌన్లోడ్ల మైలురాయిని దాటిందని పేర్కొంది. ఒక బిలియన్ డౌన్లోడ్స్ను దాటిన యాప్స్ జాబితాలో వాట్సప్ , ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ , స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్ సరసన టెలిగ్రామ్ కూడా చేరింది. అంతేకాకుండా టెలిగ్రామ్ భారత మార్కెట్లో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా ఆవిర్భవించిందని సెన్సార్ టవర్ వెల్లడించింది. భారత్, రష్యా, ఇండోనేషియా దేశాలు టెలిగ్రామ్ ప్రధాన మార్కెట్స్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో యాప్ ఇన్‌స్టాల్స్‌లో భారత్ నుంచి 22 శాతం, రష్యా 10 శాతంతో, ఇండోనేషియా 8 శాతంతో టెలిగ్రామ్ నిలిచింది. 2021 ప్రథమార్ధంలో 214.7 మిలియన్ యూజర్లు టెలిగ్రామ్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. 2020తో పోలిస్తే 61 శాతం మేర అత్యధికంగా డౌన్లోడ్స్ పెరిగాయి. చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
ఫేస్బుక్ డౌన్.. వారికి మాత్రం పండుగే పండుగ!
రెండు రోజుల క్రితం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో అమెరికాకు చెందిన ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ వినియోగం ఒకేసారి 23 శాతం పెరిగింది. ఫేస్బుక్లో ఈ అంతరాయం కారణంగా సుమారు 2.7 బిలియన్ వినియోగదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఫేస్బుక్ యాజమాన్యంలోని యాప్స్ లో అంతరాయం కలగడంతో సిగ్నల్, టెలిగ్రామ్, టిక్ టాక్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లను యూజర్లు ఎక్కువగా వినియోగించారు. దీంతో ఇతర యాప్స్ వినియోగం భారీగా పెరిగింది. టెలిగ్రామ్ వినియోగం 18 శాతం, సిగ్నల్ యాప్ వినియోగం 15 శాతం పెరిగినట్లు ఆ సంస్థలు నివేదించాయి. అక్టోబర్ 4(సోమవారం) ఫేస్బుక్లో అంతరాయం ఏర్పడిన సమయంలో 70 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ను వినియోగించారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ సేవలు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపాలే కారణమని వెల్లడైంది. కన్ఫిగరేషన్ మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడింది ఆ సంస్థ ఇంజినీర్ల బృందం తన బ్లాగ్‌లో వెల్లడించింది. (చదవండి: గూగుల్ నుంచి ‘స్నోకోన్’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా?) -
టెలిగ్రామ్ ద్వారా మోసాలు.. అమ్మకానికి జనన, మరణ ధ్రువపత్రాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల క్రితం మరణించగా సంబంధిత వ్యక్తి వారసులు ఆయన మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారులు రికార్డుల్లో లేదని తెలిపారు. దీంతో వారసులు ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడి సహాయంతో రూ.1,000 చెల్లించి విజయనగరం జిల్లాలోని ఓ పీహెచ్సీ రికార్డుల్లో నమోదైనట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. అనంతపురం జిల్లాకే చెందిన ఓ వృద్ధుడు ఆధార్ కార్డులో వయసు మార్పు కోసం ఇదే తరహాలో రూ.900 చెల్లించి జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు ఓ అంతర్రాష్ట్ర ముఠా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో యథేచ్ఛగా కొనసాగిస్తోంది. 1990 తర్వాత జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. వీటిని మంజూరు చేసే అధికారం గ్రామ, మండల, పురపాలక స్థాయి అధికారులకు ఉంది. జనన, మరణాల వివరాలు రికార్డుల్లో లేకపోతే తగిన ధ్రువీకరణ పత్రాలను అందించి మీసేవ లేదా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్డీవో వాటిని రికార్డుల్లో నమోదు చేసి.. ఆయా పత్రాల మంజూరుకు అనుమతి ఇస్తారు. కానీ ఇవన్నీ లేకపోయినా కేవలం రూ.600తో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందిస్తోంది.. అంతర్రాష్ట్ర ముఠా. ఈ ముఠా ఆగడాలను పరిశీలిస్తే సాంకేతికంగా ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తుల నేతృత్వంలోనే ఈ దందా భారీ ఎత్తున సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ముఠా మోసాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. మీసేవా, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకుల నంబర్లు సేకరించి.. ఆన్లైన్ ద్వారా సరికొత్త దందాకు తెరలేపిన అంతర్రాష్ట్ర ముఠా ముందుగా ప్రజలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం సంప్రదించే ఇంటర్నెట్, మీసేవా సెంటర్లపై కన్నేస్తోంది. వాటి నిర్వాహకుల నంబర్లను సేకరించి.. వారిని టెలిగ్రామ్ యాప్ ద్వారా తమ గ్రూపు సభ్యులుగా చేర్చుకుంటోంది. గ్రూప్ అడ్మిన్‌కు వివరాలు పంపి.. ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లిస్తే చాలు.. జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని మంజూరు చేయడం తీవ్ర నేరం. విద్రోహశక్తులు, సైబర్ నేరగాళ్లకు ఇవి ఊతంగా మారే ప్రమాదం లేకపోలేదు. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హత పొందడం, బీమా సంస్థల నుంచి సొమ్మును పొందటం, ఉద్యోగాల్లో పదోన్నతి పొందడం, తదితర చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే అవకాశమూ ఉంది. ఫోన్‌పేలో రూ.600 చెల్లిస్తే చాలు.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారు టెలిగ్రామ్‌లో ‘సర్టిఫికెట్ సర్వీస్ చార్జబుల్’ అనే గ్రూపు నిర్వాహకుడికి వివరాలను పంపి రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. రితేష్‌కుమార్ అనే వ్యక్తి ఫోన్‌పే నంబర్ 9939844009కు నగదు పంపి.. ఆ స్క్రీన్ షాట్‌ను పంపితే చాలు.. క్షణాల్లో సంబంధిత రాష్ట్రంలోని ఏదైనా ఓ పీహెచ్సీలో నమోదు చేసిన పత్రాలను ఆన్లైన్లోనే సదరు వ్యక్తులకు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కొద్దు టెలిగ్రామ్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్న ముఠా ఉచ్చులో ప్రజలెవరూ చిక్కుకోవద్దు. ముఖ్యంగా ఇంటర్నెట్, మీసేవా నిర్వాహకులు ఈ ముఠా సభ్యుల మాటలు నమ్మి ప్రజలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలను అందించవద్దు. ఇలాంటివాటిని ఉపయోగించి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందినా, బీమా సంస్థలను మోసం చేసినా, ఉద్యోగోన్నతి కోసం వీటిని ఉపయోగించినా నేరంగా పరిగణిస్తాం. –డాక్టర్ కె.ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం గతంలో ఆధార్ కార్డుల్లో వయసు మార్పు ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఈ ముఠా అందజేస్తున్నట్లు సమాచారం. తాము అందిస్తున్న ధ్రువీకరణ పత్రాల్లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా అన్ని వివరాలు పక్కాగా ఉంటాయని ఈ ముఠా టెలిగ్రామ్ గ్రూపులలో సందేశాలు పంపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి జనన ధ్రువీకరణ పత్రం కావాలని టెలిగ్రామ్ గ్రూపులో సదరు ముఠా సభ్యుడితో చాటింగ్ చేయగా.. వెంటనే అనంతపురం జిల్లా రాయదుర్గం పీహెచ్సీలో డేటా అందుబాటులో ఉందని సంక్షిప్త సందేశం పంపించాడు. హిందూపురంలోనూ ఇదేవిధంగా పత్రాలను అందజేస్తామన్నాడు. అలాగే విశాఖపట్నం చెందిన ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించగా.. విశాఖపట్నం ఆర్సీడీ హాస్పిటల్లో అందజేస్తామని సమాధానం ఇచ్చాడు. ఇలా అడిగిన వెంటనే ఫోన్‌పే ద్వారా డబ్బులు జమ చేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. గతంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి ఆధార్ కార్డుల్లో వయసును విచ్చలవిడిగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఘటనలు విదితమే. అప్పట్లో ఆధార్‌లో వయసు మార్పునకు పాన్‌కార్డులో వయసు మార్చారు. కాగా ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్లో లభించే జనన ధ్రువీకరణ పత్రాలను ఇందుకు వినియోగిస్తుండటం గమనార్హం. -
ఇకపై ‘టెలిగ్రామ్’ లో ఇన్సూరెన్స్ సేవల గురించి తెలుసుకోండి
ముంబై: సాధారణ బీమా పరిశ్రమలో తొలిసారిగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తన పాలసీదారులకు ‘టెలిగ్రామ్’ యూప్ వేదికగా సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు తెలిపింది. టెలిగ్రామ్‌పై చాట్‌బాట్ సాయంతో మోటారు క్లెయిమ్ నమోదు చేయడంతోపాటు.. పురోగతి తెలుసుకోవచ్చని.. బీమా పాలసీ రెన్యువల్, పాలసీ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వివరాల్లో మార్పుల కోసం అభ్యర్థనలు పంపొచ్చని సంస్థ సూచించింది. అదే సమయంలో వాట్సాప్‌పై మరిన్ని సేవలను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల అప్లోడ్, తక్షణ విచారణల సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది. -
ఒకే సారి 1000 మంది వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు
టెక్ ప్రపంచంలో యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు వారిని సొంతం చేసుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.తాజాగా టెలిగ్రామ్ కొత్త అప్డేట్ తెచ్చింది. ఈ అప్డేట్తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో షేరింగ్ ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్‌కు దూరం అవుతున్నారు. అదే సమయంలో ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్ యాప్‌ను వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో టెలిగ్రాం వాట్సాప్‌తో పోటీ పడడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్డేట్లతో దూసుకుపోతుంది. తాజాగా ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు వీడియోలను షేర్ చేసేలా ఫీచర్ ను అప్డేట్ చేసింది. యూజర్లందరు ఒకే సారి గ్రూప్‌కాల్ లో యాడ్ అయ్యే వరకు పరిమితిని పెంచుతూనే ఉండాలని టెలిగ్రామ్ తెలిపింది.1000 మంది వీడియో కాల్ మాట్లాడుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ క్లాసులు, మీటింగ్స్‌లో పాల్గొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో ఫీచర్ టెలిగ్రామ్ తన వీడియో షేరింగ్ ఫీచర్‌ని అప్డేట్ చేసింది. మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్ని ట్యాప్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డైన వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు. -
గూగుల్, ఆపిల్ కంపెనీలపై మండిపడ్డ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు..!
ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ ‘పెగాసస్’ స్పైవేర్‌తో ప్రముఖ జర్నలిస్టులు, పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షనేతలు, మరి కొందరిపై గూఢాచర్యం చేస్తున్నట్లు వార్త కథనాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేశాయి. తాజాగా పెగాసస్ వ్యవహారంపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్పందించాడు. 2011 నుంచి రష్యాలో ఉన్నప్పటీ నుంచి నిఘా నీడలో బతకడం అలవాటు చేసుకున్నానని పేర్కొన్నారు. పెగాసస్ స్పైవేర్‌తో 2018 నుంచి తనపై గూఢాచర్యం నిర్వహిస్తుందని వెల్లడించాడు. తనపై గూఢచర్యం నిర్వహిస్తున్నారనే వార్త తనను పెద్దగా ఆశ్చర్యపర్చలేదని దురోవ్ పేర్కొన్నాడు. తాజాగా గూగుల్, ఆపిల్ దిగ్గజ ఐటీ కంపెనీల ద్వంద్వ వైఖరిపై పావెల్ దురోవ్ మండిపడ్డారు. గూగుల్, ఆపిల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెటును కల్గి ఉందని పేర్కొన్నాడు. ఈ కంపెనీలు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలకు, ఇతర నియంత్రణ సంస్థలపై మోకారిల్లుతాయని పేర్కొన్నారు. పలు యూజర్ల డేటాను ఈ కంపెనీలు బ్యాక్‌డోర్ ద్వారా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థల చేతిలో ఉంచుతాయని తెలిపారు. దీంతో యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాక్‌డోర్ ద్వారా యూజర్ల డేటాను ప్రభుత్వాలు , నియంత్రణ సంస్థలకు అందించే సమయంలో థర్డ్ పార్టీ సంస్థలు యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి పెగాసస్ స్పైవేర్ చక్కని ఉదాహరణ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు కేవలం రెండు రకాల ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉండడంతో తప్పని సరిగా గూగుల్, ఆపిల్ కంపెనీలపై యూజర్లు ఆధారపడవలసి వస్తోందని పేర్కొన్నారు. గూగుల్, ఆపిల్ కంపెనీలకు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగించకుండా మరిన్ని వోఎస్‌లు ఉన్న పోటీ వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు. దురోవ్ పావెల్ గతంలో గూగుల్, ఆపిల్ కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అన్ని డిజిటల్ వస్తువులపై గూగుల్, ఆపిల్ కంపెనీలు 30 శాతం పైగా సేల్స్ టాక్స్‌ను విధించినందుకు తప్పుబట్టారు. -
పెగాసస్ స్పైవేర్ డేంజర్ లింకులను గుర్తించండి ఇలా..?
కొద్ది రోజుల క్రితం నుంచి కరోనా కంటే ఎక్కువగా పెగసస్ స్పైవేర్ గురుంచి చర్చ కొనసాగుతుంది. వ్యక్తుల సమాచారం, కదలికలు, ఫొటోలు, మాట్లాడే కాల్స్ రికార్డు చేసే ఇజ్రాయిల్‌కు చెందిన ఈ పెగసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం కొన్నది. ఈ స్పైవేర్ వల్ల వందలాదిమంది జర్నలిస్టులు, ఉద్యమకారులు, పార్లమెంట్ సభ్యులు, అధికారుల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం అంతా ఇంటలిజెన్స్ వ్యవస్థకు చేరిపోతుంది. ఈ ఉచ్చులో ప్రతి పక్షాలే కాదు, ప్రభుత్వ మంత్రులు, ఎంపీలూ ఉండటం విశేషం. స్పైవేర్, స్టాకర్వేర్లు యాంటీ థెఫ్ట్(ఫోన్ చోరీకి గురికాకుండా చూసేవి) అప్లికేషన్ల రూపంలో పెగసస్ మన ఫోన్లోకి ప్రవేశిస్తుంది. "ఒకసారి గనుక మన ఫోన్లోకి ప్రవేశిస్తే దీనిని గుర్తించడం చాలా కష్టం. ఇది ఒక పరికరంలోకి ప్రవేశించిన తర్వాత మొత్తం ఫోన్ యొక్క నియంత్రణ దాని పరిదిలోకి వస్తుంది. ఇది సందేశాలను చదవగలదు, బహుళ కాలింగ్ యాప్స్ సంభాషణలను వినగలదు, కెమెరాల యాక్సిస్ దానంతట అదే తీసుకుంటుంది" అని ఎఫ్ఎస్ఎంఐ ప్రధాన కార్యదర్శి కిరణ్ చంద్ర చెప్పారు. ఇప్పటి వరకు అనేక మంది కార్యకర్తలు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు, మేధావుల ఫోన్లు పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డాయి. దీని రక్షించడం కోసం ఎఫ్ఎస్ఎంఐ టెలిగ్రామ్ లో ఒక బాట్ ను ప్రారంభించింది. దీని ద్వారా అనుమానం ఉన్న లింకులను నమోదు చేస్తే అది పెగసస్ స్పైవేర్ కు చెందినా లింకు అవునా? కాదా? అని చూపిస్తుంది. అది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మొదట ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను డౌన్ లోడ్ చేయండి. టెలిగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేశాక సెర్చ్ బాక్స్‌లో @fsmi_pegasus_detector_bot అని టైప్ చేయాలి. ఇప్పుడు ఒక డిటెక్టర్ బోట్ ఓపెన్ అవుతుంది. దానిలో స్టార్ట్ అని కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద లింకును అందులో నమోదు చేయాలి. ఆ లింక్ పెగాసస్‌కు సంబంధించినదో.. కాదో మీకు చూపిస్తుంది. -
ఫేస్బుక్ వాడితే ఫోన్ నంబర్ అమ్ముకున్నట్లే!
వాషింగ్టన్: వివిధ దేశాల్లో నానా రకాల వివాదాలతో ఇబ్బందులు పడుతున్న ఆన్లైన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాద సుడిగుండంలో ఇరుక్కుంటోంది. ఫేస్బుక్ వాడకందారుల ఫోన్ నంబర్లు టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెడుతున్నారని ఒక సెక్యూరిటీ అధ్యయనం వెల్లడించింది. ఫేస్బుక్ ఐడీలకు చెందిన ఫోన్ నంబర్లను టెలిగ్రామ్ ఆటోమేటెడ్ బోట్‌ను వినియోగించి ఒక సైబర్ క్రిమినల్ సంస్థ సేకరించి సదరు డేటాను విక్రయిస్తోందని అధ్యయనం తెలిపింది. ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మంది వినియోగదారుల నంబర్లు ఇలా బయటపడి ఉంటాయని పేర్కొంది. ఈ డేటాబేస్‌లో 2019 వరకు వివరాలున్నాయని తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ రిసెర్చర్ అలాన్ గాల్ ఒక ట్వీట్లో వివరాలు వెల్లడించారు. చదవండి: (బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ) 2020లో ఈ సెక్యూరిటీ క్రైమ్ గురించి తొలిసారి తెలిసిందని, వివరంగా పరిశీలిస్తే వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం తస్కరణకు గురైనట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. ఈ బోట్ 2021 జనవరి వరకు యాక్టివ్గానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇదే అంశాన్ని మదర్బోర్డ్ నివేదిక ధృవీకరిస్తూ, టెలిగ్రామ్ బోట్ ద్వారా ఈ వివరాలు తస్కరించారని తెలిపింది. ఒక్క యూజర్ వివరం కావాలంటే 20 డాలర్లు, పెద్ద ఎత్తున కావాలంటే 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు చెల్లించాలని తెలిపింది. ఇప్పటికైనా ఫేస్బుక్ తన యూజర్లను ఈ విషయమై హెచ్చరించాలని సూచించింది. అప్పుడే యూజర్లు హ్యాకింగ్ తదితర ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని తెలిపింది. చదవండి: (వైట్‌హౌస్‌లో పెంపుడు జంతువుల సందడి!!) -
ఫేస్బుక్ యూజర్లకు షాకింగ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి. ఇది 2019 లో ఫేస్బుక్లో లీక్ అయిన ఒక పాచ్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చినట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మదర్‌బోర్డులోని ఒక నివేదిక ప్రకారం, 533 మిలియన్ యూజర్ల ఫోన్ నంబర్లు బహిర్గతమైనాయి. ఇందులో సుమారు 6 లక్షల మంది భారతీయ వినియోగదారుల మొబైల్ నెంబర్లు చోరీకి గురయ్యాయి. యూజర్‌కు చెందిన ఒక్కో ఫోన్ నంబర్ 20 డాలర్ల చొప్పున అమ్ముడు పోయింది. ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్ల విక్రయిస్తున్నట్టు మదర్‌బోర్డు రిపోర్ట్ చేసింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలోన్ గాల్ దీనికి సంబందించిన సమాచారంపై అప్రమత్తం చేశారని నివేదిక తెలిపింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలకు ఫేస్బుక్ వినియోగదారులు ప్రభావితమయ్యారని అలోన్ వెల్లడించారు. బల్క్‌గా 10,000 నెంబర్లకుగాను 5,000 డాలర్లకు విక్రయిస్తున్నారన్నారు. ఈ డేటా బేస్ విక్రయం చాలా అందోళన కలిగించే పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. డేటా కొంచెం పాతదే అయినప్పటికీ, ఇప్పటికే ఫోన్ నంబర్లు చోరీ అయినవారి సైబర్ సెక్యూరిటీ , గోప్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే యూజర్లు తమ ఫోన్ నంబర్లను చాలా అరుదుగా మారుస్తారనీ, సాధారణంగా రెండు లేదా మూడు సంవత్సరాల వ్యవధిలో మార్చే అవకాశం లేదని ఆయన గుర్తుచేశారు. మరోవైపు అటు ఫేస్బుక్ గానీ, ఇటు టెలిగ్రామ్ గానీ ఈ నివేదికపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. కాగా వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ విధానంపై యూజర్లు మండిపడున్నారు. మరోవైపు వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌ను దేశంలో నిషేధించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా సీఏఐటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో పలు దేశాలు అమలు చేస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. వినియోగదారుల డేటా విక్రయంపై ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు తాజా పరిణామంతో మరిన్ని చిక్కులు తప్పవు. In early 2020 a vulnerability that enabled seeing the phone number linked to every Facebook account was exploited, creating a database containing the information 533m users across all countries. It was severely under-reported and today the database became much more worrisome 1/2 pic.twitter.com/ryQ5HuF1Cm — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) January 14, 2021 -
ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం!
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మారనుండటం .. దాని పోటీ సంస్థలకు ఊహించని వరంగా మారుతోంది. వాట్సాప్ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో .. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. వాట్సాప్ వివాదాస్పద మార్పులు ప్రకటించిన గత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తమ యాప్ డౌన్లోడ్లు లక్షల సంఖ్యలో పెరిగాయని సిగ్నల్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ యాక్టన్ వెల్లడించారు. ఇక భారత మార్కెట్లో తమకు అంచనాలు మించిన ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘గడిచిన కొద్ది రోజుల్లో ఊహించని స్థాయిలో వృది నమోదైంది. 40 దేశాల్లో ఐవోఎస్ యాప్ స్టోర్‌లో మాది టాప్ యాప్‌గా ఉంది. అలాగే 18 దేశాల్లో గూగుల్ ప్లేలో నంబర్ వన్‌గా నిల్చింది. ఈ రెండు సిస్టమ్స్‌లో 1 కోటి పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గడిచిన మూడు–నాలుగు రోజుల్లో అసాధారణ వృద్ధి, యూసేజీ కనిపిస్తోంది. ఇదేమీ ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు‘ అని యాక్టన్ తెలిపారు. సరళతరమైన .. సులువైన నిబంధనలు, ప్రైవసీ పాలసీతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2009లో వాట్సాప్‌ను జాన్ కౌమ్‌తో కలిసి యాక్టన్ నెలకొల్పారు. ఆ తర్వాత వాట్సాప్‌ను కొనుగోలు చేసిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ .. దాన్నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు అనుసరించిన విధానాలు నచ్చక యాక్టన్ బైటికొచ్చేశారు. మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో కలిసి సిగ్నల్‌ను ప్రారంభించారు. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కూడా యూజర్ల డేటాను పంచుకునే విధంగా పాలసీని అప్డేట్ చేస్తున్నామని, తమ యాప్‌ను వాడాలంటే కచ్చితంగా ఇందుకు సమ్మతించాల్సి ఉంటుందని వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై చిర్రెత్తుకొచ్చిన యూజర్లు పొలోమంటూ ప్రత్యామ్నాయ యాప్స్ వైపు మళ్లుతున్నారు. టెలిగ్రాం రయ్... ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటినట్లు టెలిగ్రాం వెల్లడించింది. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా 2.5 కోట్ల మంది యూజర్లు చేరినట్లు వివరించింది. భారత్‌లో యూజర్ల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ .. కొత్త యూజర్లు .. ఆసియాలో అత్యధికంగా 38 శాతం మంది చేరినట్లు వెల్లడించింది. యూరప్ (27 శాతం), లాటిన్ అమెరికా (21 శాతం), మధ్య ప్రాచ్యం.. ఉత్తర ఆఫ్రికా ప్రాంతం (8 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సెన్సార్ టవర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో జనవరి 6–10 తారీఖుల మధ్య కొత్తగా 15 లక్షల మేర టెలిగ్రాం డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులో త్వరలోనే 100 కోట్ల యూజర్ల మార్కును సాధించగలమని టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘గత ఏడేళ్లలో అనేకసార్లు డౌన్లోడ్లు ఒకేసారిగా పెరిగిపోవడం జరిగింది. అయితే, ప్రస్తుత పరిస్థితి మాత్రం కాస్త భిన్నమైనది. ఉచిత సర్వీసుల కోసం తమ ప్రైవసీని పణంగా పెట్టేందుకు యూజర్లు సిద్ధంగా లేరు. ప్రారంభం నుంచీ మేం యూజర్ల వివరాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఇతర యాప్‌లలాగా ఆదాయం కోసం మేం జవాబు చెప్పుకునేందుకు టెలిగ్రాంలో షేర్హోల్డర్లు గానీ ప్రకటనకర్తలు గానీ లేరు. ఇప్పటిదాకా మా యూజర్ల వ్యక్తిగత డేటా ఏదీ కూడా ఎవరికీ వెల్లడించలేదు‘ అని దురోవ్ పేర్కొన్నారు. -
టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టెలిగ్రామ్ వినియోగదారులు ఉచితంగానే దీని సేవలను పొందుతున్నారు. తాజాగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ యూజర్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపాడు. వచ్చే ఏడాది నుండి టెలిగ్రామ్ లో రాబోయే కొన్ని ఫీచర్స్ వాడుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే అని తెలిపారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ మాట్లాడుతూ.. మార్కెట్లో పోటీ కారణంగా ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి కొంత డబ్బులు అవసరమని అన్నారు. 2013లో పావెల్ దురోవ్, అతని సోదరుడు నికోలాయ్ టెలిగ్రామ్ ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 500 మిలియన్ల యాక్టీవ్ యూజర్లను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.(చదవండి: వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ పంపండి ఇలా) ప్రస్తుతం కంపెనీని విక్రయించే ఆలోచన లేదని, అందువల్ల నిధులు సమకూర్చడానికి ఇతర మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని 36 ఏళ్ల దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్ మాజీ సోవియట్ యూనియన్ మరియు ఇరాన్ లలో ఒక ప్రముఖ సోషల్ మీడియా వేదికగా కొనసాగుతుంది. ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ప్రైవేట్ కమ్యూనికేషన్స్, సమాచారం, వార్తలను పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కంపెనీ నిర్వహణ ఖర్చులను చెల్లించాడనికి నేను నా వ్యక్తిగత పొదుపుల నుండి నగదు చెల్లించాను అని దురోవ్ చెప్పారు. ప్రస్తుతం ఫ్రీగా అందిస్తున్న సేవలను అలాగే కొనసాగించనున్నట్లు తెలిపారు. కానీ, కొత్తగా బిజినెస్ టీమ్స్, పవర్ యూజర్స్ కోసం తీసుకురాబోయే ఫీచర్ల కోసం మాత్రం ప్రీమియం యూజర్ల నుండి డబ్బులు వసూలు చేయనున్నట్లు పావెల్ దురోవ్ పేర్కొన్నారు. -
వాట్సాప్ vs టెలిగ్రామ్: ఏది సేఫ్?
గతంలో ఒక వివాదాస్పద చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది నిరసనకారులు హాంగ్ కాంగ్ వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేసారు. ఇంత పెద్ద మొత్తంలో నాయకత్వం లేకుండా వారు నిరసన తెలియాజేయడానికి వారి ప్రధాన ప్రచార సాధనం టెలిగ్రామ్. అవును, వారు నిరసనలను నిర్వహించడానికి చాలా మంది టెలిగ్రామ్ లో సమావేశమయ్యారు. అందుకే ఇది ఇప్పటికి సురక్షితమైన కమ్యూనికేషన్ సాధనంగా ఉంది. ప్రపంచంలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ పరిశీలనల(సెన్సార్షిప్) నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడే ప్రజలు, నిరసనకారులు, ఉగ్రవాదులు టెలిగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 2013లో నికోలాయ్ మరియు పావెల్ దురోవ్ చేత స్థాపించబడిన మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా ఉచితంగా టెక్స్ట్ సందేశాలు, ఫోటోలు, వీడియోలు, పత్రాలు, ఇతర ఫైళ్ళను సులభంగా పంపించుకోవచ్చు. టెలిగ్రామ్ ప్రస్తుత ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ గల వాట్సాప్ యాప్ ఇటీవల హ్యాకింగ్ గురి అయిన తర్వాత చాల మంది టెలిగ్రామ్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. (చదవండి: రికార్డు సృష్టించిన ఫౌజీ గేమ్) వాట్సాప్ లేదా టెలిగ్రామ్: అత్యంత సురక్షితమైన యాప్ ఏది? వాట్సాప్ లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ని టెలిగ్రామ్ కూడా అందిస్తుంది. ఒకే సమయంలో ఒకే ఖాతాతో వేర్వేరు పరికరాలలో వాట్సాప్ తో పోలిస్తే సురక్షితంగా లాగిన్ కావచ్చు. టెలిగ్రామ్ లో రహస్యంగా చాట్ చేసుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ నియమాలకు విరుద్దంగా రహస్య చాట్ యొక్క డేటా లోకల్ స్టోరేజ్ లలో నిల్వ చేయబడుతాయి. అలాగే, టెలిగ్రామ్‌లో స్నాప్‌చాట్‌లో లాగా సందేశాలను వాటంతట అవే డిలేట్ అయ్యే విదంగా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ లేనప్పటికీ సీక్రెట్ చాట్ చేసుకోవడం ద్వారా ఇతరులకు సమాచారం తెలియదు. టెలిగ్రామ్ MTProto అని పిలువబడే దాని స్వంత యాజమాన్య ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది. వినియోగదారులు డేటాను టెలిగ్రామ్ విక్రయించదు కాబట్టి దానిని విశ్వసించవచ్చు అని నిపుణులు తెలిపారు. వినియోగదారులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పుడు హ్యాకర్లు వీరిని గుర్తించడం కొంచెం కష్ట్టమని నిపుణులు తెలిపారు. దీనిలో టెలిగ్రామ్ ఉన్న 'రహస్య చాట్' ఫీచర్ అనేది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ లాగా పనిచేస్తుంది. మీరు 'రహస్య చాట్' మీరు నిర్దేశించిన తర్వాత ఆటోమేటిక్ గా మీ డేటా డిలీట్ చేయబడుతాయి. వీటిని తిరిగి పొందడం అసాధ్యం. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి సందేశాలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయకూడదని టెలిగ్రామ్ నిర్ణయించుకుంది. రహస్య చాట్లు అనేవి యూజర్ల ఇష్టానికి సంబంధించింది అని పేర్కొంది. వాట్సాప్ ప్రకటన దారుల కోసం యూజర్ల వ్యక్తిగత డేటాని పొందటానికి అనుమతించినట్లు టెలిగ్రామ్ చేయదని పేర్కొంది. టెలిగ్రామ్ ఆదాయం కోసం వినియోగదారు విరాళాలు సేకరిస్తాం అని తెలిపింది. "లాభాలను సంపాదించడం టెలిగ్రామ్‌కు అంతిమ లక్ష్యం కాదు" అని టెలిగ్రామ్ పేర్కొంది. అన్ని యాప్ ల మాదిరిగానే యూజర్ల డేటా నిల్వ కోసం క్లౌడ్ స్టోరేజీను ఎంచుకుంది. ఎవరైనా హ్యాకర్లు క్లౌడ్ స్టోరేజీపై నియంత్రణ సాధిస్తే సీక్రెట్ చాట్ తప్ప అన్ని సందేశాలు హ్యాకింగ్ గురి అవుతాయి. ఉగ్రవాద దాడులను ప్లాన్ చేసే ఉగ్రవాదులకు మంచి సమన్వయ సాధనంగా టెలిగ్రామ్ వార్తల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానెల్స్ లో ఎక్కువగా చలనచిత్ర, టీవీకి సంబదించిన పైరసీ చిత్రాలను షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కానీ ఈ సమస్యలను పరిష్కరించడానికి సంస్థ కృషి చేస్తోంది అని సంస్థ నిర్వహకులు తెలిపారు. "టెలిగ్రామ్ హింస, నేర కార్యకలాపాలు మరియు దుర్వినియోగదారులకు చోటు కాదు" అని టెలిగ్రామ్ తెలిపింది. టెలిగ్రామ్ విశ్వసనీయమైనది, వేగవంతమైనది, సురక్షితమైనది మనకు ఐఫోన్లు ఎంత సురక్షితంగా భావిస్తామో అంత సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇది రహస్యంగా పనిచేసే జర్నలిస్టులకు సురక్షితమైన సమాచార సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రపంచ శాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి కూడా తన అధికారులను తమ ఫోన్ల నుంచి వాట్సాప్ ను డిలీట్ చేయాల్సిందిగా కోరింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. -
‘కార్డు’ కథ కంచికేనా?
సాక్షి, హైదరాబాద్: ‘క్షేమంగా ఇల్లు చేరగానే ఓ కార్డు ముక్క రాయి...’కొన్నేళ్ల క్రితం ప్రతి ఇంటా సహజంగా వినిపించిన మాట ఇది. కుటుంబ క్షేమ సమాచారమైనా, దుఃఖాన్ని మోసుకొచ్చే వార్తయినా అరచేతంత ఉండే పోస్టు కార్డే దిక్కు. మరీ అత్యవసరమైతే టెలిగ్రామ్ చేయడం తప్ప ఇంటింటినీ పలకరించేది ఈ తోకలేని పిట్టనే. అయితే దాదాపు 150 ఏళ్ల క్రితం పెనవేసుకున్న ఆ బంధం ఇక తెగినట్టేననే అనుమానం కలుగుతోంది. సాంకేతిక విప్లవం నేపథ్యంలో కొరగాకుండా పోయిన తపాలా కార్డు కథ కంచికి చేరుతున్నట్టే కనిపిస్తోంది! రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క పోస్టు కార్డు కూడా లేకుండా పోయింది. గతంలో సరఫరా అయి వాడకుండా మిగిలిపోయినవి ఎక్కడైనా ఉంటే తప్ప ఏ తపాలా కార్యాలయంలోనూ పోస్టుకార్డులు కనిపించడంలేదు. తెలంగాణ సర్కిల్ ప్రధాన తపాలా కార్యాలయం జీపీఓ పరిధిలోనూ కార్డులు కానరావట్లేదు. గత వారం, పది రోజుల సంగతి కాదు... ఏకంగా గత ఆరు నెలలుగా తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు స్వయంగా పోస్టల్ అధికారులు ఇండెంట్ పెట్టినా అవి సరఫరా అవడం లేదు. అబిడ్స్‌లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీఓ) అధీనంలోని స్టాంప్స్, లెటర్స్ విభాగంలో కూడా ఒక్క కార్డు కూడా లేకుండా పోయింది. పోస్టుకార్డులు ఎందుకు సరఫరా కావడంలేదో అధికారులకే అంతు చిక్కకుండా ఉంది. నాసిక్ నుంచి ఆగిన సరఫరా.... ఇన్లాండ్ లెటర్స్, పోస్టు కార్డులు దేశవ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే ముద్రితమవుతాయి. హైదరాబాద్, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లలోనే వాటిని ప్రింట్ చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వాటి డిమాండ్, వాడకం బాగా తగ్గినందున కొన్నేళ్లుగా కేవలం నాసిక్‌లోని ప్రెస్లోనే పోస్టు కార్డులను ముద్రిస్తున్నారు. ఇక్కడి నుంచి గత పార్లమెంటు ఎన్నికలకు పూర్వం కొంత కోటా తెలంగాణకు విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ వాటి జాడలేదు. దీనిపై ఉన్నతాధికారులు వాకబు చేస్తే నాసిక్‌లోని ప్రెస్‌లో వాటి ముద్రణనే నిలిపేసినట్లు తెలిసింది. దీంతో పోస్ట్‌కార్డుల చలామణీని నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇదే విషయమై లోక్‌సభలో సభ్యులు ప్రశ్నించగా కొనసాగిస్తామనే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు మాత్రం ఏ విషయాన్ని స్పష్టం చేయడంలేదు. భారీ నష్టం.... ప్రస్తుతం తపాలా కార్డు విలువ 50 పైసలు. అత్యవసర వస్తువుల పరిధిలోనిదిగా పేర్కొంటూ నామమాత్రపు ధరకే తపాలాశాఖ వాటిని అందుబాటులో ఉంచుతోంది. మందంగా, అట్టలాగా ఉండే పోస్టుకార్డు ముద్రణతో తపాలాశాఖ ఏటా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ కార్డు తయారీకి దాదాపు రూ. 7.45 వరకు ఖర్చవుతుండగా ప్రజలకు కేవలం అర్ధ రూపాయికే అమ్ముతున్నారు. ప్రతి కార్డుపై దాదాపు రూ. 6.95 వరకు నష్టం వస్తోంది. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలనే జనం దాదాపుగా మరచిపోవడం, ఇతర అవసరాలకు కూడా పోస్ట్‌కార్డు వాడకం నామమాత్రంగా మారడంతో వాటిని ఇక నిలిపేయాలని తపాలాశాఖ ఉన్నతాధికారులు గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయితే దశాబ్దాలుగా పెనవేసుకున్న బంధం కావడంతో దాన్ని సెంటిమెంట్‌గా పేర్కొంటూ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అలాంటప్పుడు వాటి ధరనైనా పెంచాలని అధికారులు కోరినా పట్టించుకోలేదు. కానీ క్రమంగా జనం పోస్టుకార్డులను కొనడం బాగా తగ్గించారు. ఇటీవల ఉజ్జాయింపుగా కొన్ని పట్టణాల్లో వాటి వినియోగంపై అధికారులు లెక్కలు తీస్తే తెలంగాణ పరిధిలోని నిజామాబాద్ పట్టణంలో సంవత్సరకాలంలో అమ్ముడుపోయిన కార్డుల సంఖ్య కేవలం 69గా తేలింది. వాణిజ్య అవసరాలకు తప్ప వ్యక్తిగత అవసరాలకు కార్డుల వాడకం దాదాపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో క్రమంగా వాటి ముద్రణను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో వాటి పాత స్టాకు ఉన్నందున వాటినే సర్దుబాటు చేస్తూ అప్పటి వరకు ముద్రణను ఆపేయాలని నిర్ణయించినట్టు అధికారుల సమాచారం. రిటర్న్ కార్డులు ఉన్నా... కొన్ని సంస్థలు రిటర్న్ కార్డులను వాడుతున్నాయి. వినియోగదారులకు పంపి, తదుపరి సమాచారంతో అది తిరిగి సంస్థకు చేరేలా వీటిని రూపొందించారు. ఇవి వాణిజ్యపరమైన అవసరాలకే వాడుతున్నారు. ఇలాంటి కార్డులు జీపీఓ పరిధిలో దాదాపు 10 వేల వరకు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి కార్డు ధర రూపాయిగా ఉంది. కానీ జీపీఓలో ఉన్న స్టాక్ 15 పైసల నాటిది. ఆ పాత స్టాక్‌ను ఇప్పుడు వినియోగించాలంటే రూపాయి ధరకు సరిపోయేలా అంత విలువైన స్టాంపులు అతికించి వాడాల్సి ఉంటుంది. ఇవి తప్ప వేరే కార్డులు పూర్తిగా నిండుకున్నాయి. టెలిగ్రామ్ జాబితాలో చేరుతుందా...? మన దేశంలో 163 ఏళ్లపాటు కొనసాగిన టెలిగ్రామ్ సేవలను బీఎస్ఎన్ఎల్ 2013 జూలై 15న శాశ్వతంగా నిలిపేసింది. సాలీనా రూ. 400 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు పేర్కొంటూ ఆ విభాగాన్ని మూసేసింది. ఇప్పుడు అదే తరహాలో తపాలా కార్డులతో నష్టాలు వస్తున్నందున పోస్టుకార్డు చరిత్రకు కూడా ముగింపు పలుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరికొన్నేళ్లపాటు వాటిని కొనసాగించే అవకాశం ఉందని, డిమాండ్ తక్కువగా ఉన్నందున ముద్రణను తాత్కాలికంగా నిలిపివేసి ఉంటారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆకాశవాణి ప్రేక్షకుల ఆవేదన... పోస్టుకార్డు తరహాలో జనంతో బాగా పెనవేసుకున్న బంధం రేడియో సొంతం. ఆకాశవాణి ప్రసారాలను ఇప్పటికీ చాలా మంది వింటున్నారు. ఇందుకోసం ఆకాశవాణికి ఉత్తరాలు రాసే శ్రోతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పోస్టుకార్డులు శ్రోతల నుంచి ఆకాశవాణికి చేరుతుంటాయి. కానీ గత ఆరు నెలలుగా పోస్టుకార్డులు దొరకడం లేదంటూ శ్రోతలు ఆలిండియా రేడియోకి చెబుతున్నారు. కేవలం పోస్టుకార్డులు మాత్రమే రాసే పద్ధతి అక్కడ అమలులో ఉంది. ఇప్పుడు పోస్టుకార్డులు లేకపోయేసరికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలంటూ రేడియో కేంద్రం పేర్కొంటుండటం గమనార్హం. -
ఫేస్ బుక్ మెసెంజర్ కొత్త ఫీచర్
ఫేస్ బుక్ తన మెసెంజర్ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం తన మెసెంజర్ యాప్ లో డిజిటల్ సంభాషణలను హ్యాకింగ్ బారి నుంచి కాపాడటానికి ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. 900మిలియన్ యూజర్లున్న ఈ మెసెంజర్ యాప్ కు లిమిటెడ్ గా టెస్టింగ్ ను ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ఫేస్ బుక్ వెల్లడించింది. మెసేజింగ్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తన వాట్సాప్ యాప్ కు మూడు నెలల క్రితమే ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ప్రవేశపెట్టింది. 100 కోట్ల మంది యూజర్లున్న ఈ ఈ వాట్పాప్ యాప్ ను 2014లో ఫేస్ బుక్ సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్క్రిప్టెడ్ సంభాషణ యూజర్లు పంపించే వీడియోలకు, పేమెంట్లకు వర్తించదని ఫేస్ బుక్ తెలిపింది. వాట్సాప్ కు వాడిన ఎన్ క్రిప్షన్ టెక్నాలజీనే ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా వాడనుంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వాట్సాప్ మెసేజ్ లు ఎన్క్రిప్టెడ్ అవుతాయి. అదనపు భద్రతా రక్షణతో మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజిటల్ కమ్యూనికేషన్లో జరిగే ఈ గూఢచర్య సంభాషణలు చట్టాలకు సహకరించాలని ప్రభుత్వ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ వల్ల ఉగ్రవాద చర్యలు పెరిగే అవకాశముందంటున్నారు. కేవలం మెసేజ్ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో దీని ద్వారా చాట్ చేసే మెసేజ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంటాయి. యాపిల్ ఇంక్ ఐమెసేజింగ్ ప్లాట్ ఫాంలకు, లైన్, సిగ్నల్, వైబర్, టెలిగ్రాం వంటి ఇతర యాప్ లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తున్నాయి. -
వాట్సప్, టెలిగ్రాంలలో.. అమ్మాయిల అమ్మకం!
టెలిగ్రామ్ యాప్‌లో ఈ మధ్య ఓ ప్రకటన వస్తోంది.. ‘‘అమ్మకానికి అమ్మాయి ఉంది.. కన్నెపిల్ల.. అందంగా ఉంటుంది.. 12 ఏళ్ల వయసు.. ఆమె ధర ఇప్పటికి రూ. 8.5 లక్షల వరకు వెళ్లింది.. త్వరలోనే అమ్ముడుపోతుంది.. తొందరపడండి’’ అంటూ అరబిక్ భాషలో ఈ ప్రకటన ఉంది. పిల్లిపిల్లలు, ఆయుధాల ప్రకటనలతో పాటే ఈ ప్రకటన కూడా వచ్చింది. మైనారిటీ యజీదీ వర్గం వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న ఓ కార్యకర్త ఈ ప్రకటనను మీడియాకు పంపారు. యజీదీ మహిళలను, పిల్లలను ఉగ్రవాదులు బంధించి, వాళ్లను సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా దాదాపు 3వేల మంది మహిళలు, బాలికలను అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్మార్ట్ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రాం లాంటి యాప్‌ల సాయంతో మహిళలను, పిల్లలను ఇలా అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ల ఫొటోలతో పాటు.. వాళ్ల ‘యజమానుల’ వివరాలు కూడా పెడుతున్నారు. ఎక్కడికక్కడ తమ సొంత చెక్‌పోస్టులు పెట్టి, వాటి నుంచి మహిళలు తప్పించుకోకుండా చూస్తున్నారు. బందీలుగా ఉన్న మహిళలను తప్పించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించగా, వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. 2014 ఆగస్టు నెలలో వందలాది మంది యజీదీ మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకున్న ఐఎస్ ఉగ్రవాదులు కుర్దిష్ భాష మాట్లాడే మైనారిటీ వర్గం మొత్తాన్ని నిర్మూలించాలన్న ఆలోచనలో ఉన్నారు. కొన్నాళ్ల పాటు అరబ్, కుర్దిష్ స్మగ్లర్లు మాత్రం ఎలాగోలా ప్రాణాలకు తెగించి నెలకు దాదాపు 134 మంది మహిళలను విడిపించారు. కానీ మే నెలలో ఐఎస్ ఉగ్రవాదులు వాళ్ల మీద విరుచుకుపడటంతో.. గత ఆరు వారాల్లో కేవలం 39 మందిని మాత్రమే విడిపించగలిగారు. ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేసినా.. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మందుపాతరలను ఏర్పాటుచేయడంతో వాళ్లలో చాలామంది చనిపోతున్నారు. వాటి బారి నుంచి అతి కొద్ది మంది మాత్రం ఎలాగోలా తప్పించుకుని.. బయట పడుతున్నారు. -
ఇక ఆ మెసేజ్ లను ఎడిట్ చేసుకోవచ్చట
100 కోట్ల యాక్టివ్ యూజర్లున్న వాట్సాప్ గాని, దాన్ని ప్రత్యర్థి స్థానంలో ఉన్న టెలిగ్రాం కు గాని ఇప్పటివరకూ పంపించిన మెసేజ్ లను ఎడిట్ చేసుకునే సౌకర్యం అందుబాటులో లేదు. అయితే ఎలాగైనా వాట్సాప్ ను అధిగమించి యూజర్లను ఆకట్టుకోవాలని టెలిగ్రాం నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ అందుబాటులో లేని మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 1,000లక్షల యూజర్లున్న టెలిగ్రాం, దాన్ని యూజర్లకి మెసేజ్ లను పంపించిన తర్వాత దానిలో ఏమైనా తప్పులో దొర్లితే ఎడిట్ చేసుకునే సౌకర్యం నేటి నుంచి కల్పించనున్నట్టు పేర్కొంది. అన్నీ టెలిగ్రాం చాట్స్ గ్రూప్స్, వన్ టూ వన్ సంభాషణల్లో మెసేజ్ లకు ఈ ఎడిటింగ్ ఆప్షన్ ను అందిస్తున్నట్టు తన బ్లాగ్ లో పేర్కొంది. పంపించిన మెసేజ్ ను ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మెసేజ్ ను అలాగే హోల్డ్ చేసి పట్టుకుని ఎడిట్ ను ప్రెస్ చేయాలి. ఒకవేళ డెస్క్ టాప్ లో టెలిగ్రాం వాడుతున్నప్పుడు, పైన యారో బటన్ ను ప్రెస్ చేసి, చివరి మెసేజ్ ను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. నెలకు 1,000లక్షల యాక్లివ్ యూజర్లను టెలిగ్రాం కలిగిఉందని కంపెనీ ఇటీవలే ప్రకటించింది. 3,50,000మంది కొత్త యూజర్లు ప్రతిరోజు టెలిగ్రాంలో చేరుతున్నారని తెలిపింది. రోజుకి 1500కోట్ల మెసేజ్ ల సంభాషణను టెలిగ్రాం కలిగి ఉంది. ఈ కొత్త ఫీచర్లతో టెలిగ్రాంకు యూజర్ల సంఖ్య పెరుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. -
ఐఎస్ఐఎస్ 'టెలిగ్రామ్' కుదరిదిక!
బెర్లిన్: తమ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు 'టెలిగ్రామ్' సంస్థ ఉపక్రమించింది. తమ యూజర్లను ఉగ్రవాదం వైపు దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెలిగ్రామ్ నిర్వాహకులు అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. 12 భాషలకు సంబంధించిన సైట్లను ఐఎస్ఎస్ వినియోగిస్తుందని, ఉగ్రవాదులు తమ యాప్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత వారం రోజుల నుంచి తాము చేసిన ప్రయత్నాలు ఫలించి ఐఎస్ఐఎస్ సైట్లను బ్లాక్ చేసే కోడింగ్ విధానాన్ని కనుగొన్నామని వెల్లడించింది. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలిగ్రామ్ యాప్ ద్వారా వ్యక్తిగత ఛాటింగ్ నుంచి గ్రూప్ ఛాటింగ్ వరకు 200 మంది ఒకేసారి మెసేజ్‌లు పంపుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడి తమ యూజర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వారి కార్యకలాపాల వైపు ఆకర్షించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా కోడింగ్ విధానాన్ని అనుసరించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. టెలిగ్రామ్ యూజర్ల సమాచారాన్ని ఐఎస్ఎస్ ఉగ్రవాదులు రిట్రీవ్ చేయకుండా వారి డేటాని ఎన్‌క్రిప్ట్ చేసే యోచనలో యాప్ రూపకర్తలు ఉన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిచండటంతో పాటు తమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఐఎస్ఐఎస్ హెచ్చరిక సంకేతాలు పంపించింది. This week we blocked 78 ISIS-related channels across 12 languages. More info on our official channel: https://t.co/69Yhn2MCrK — Telegram Messenger (@telegram) November 18, 2015 -
టెలిగ్రాం ఖరీదు.. రూ. 15 లక్షలు!
ఒక్క టెలిగ్రాం లక్షల ఖరీదు ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు ఆయన సహాయకుడు పంపిన అలనాటి టెలిగ్రాంను వేలం వేస్తే.. ఇంత వస్తుందని భావిస్తున్నారు. అది కూడా అలాంటి ఇలాంటి సమయంలో కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పంపిన టెలిగ్రామట. నాజీల రహస్య పోలీసు విభాగమైన జెస్టాపో వ్యవస్థాపకుడు హెర్మన్ గోరింగ్.. తమ అధినేత హిట్లర్‌కు 1945 ఏప్రిల్ 23వ తేదీన ఈ టెలిగ్రాం పంపాడు. థర్డ్ రీచ్ నాయకత్వం చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ సందేశం పంపారు. అయితే ఇది హిట్లర్‌కు కోపం తెప్పించడంతో ఆయనను తప్పించి, అడ్మిరల్ కార్ల్ డోయింట్జ్ను తన వారసుడిగా ప్రకటించారు. ''చాలా పెద్ద నేరం చేశావు'' అంటూ టెలిగ్రాంకు హిట్లర్ సమాధానం కూడా పంపారు. హిట్లర్‌కు వెళ్లిన టెలిగ్రాంను రేపు అమెరికాలో వేలం వేస్తారు. దానికి సుమారు రూ. 15 లక్షల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. -
హ్యాట్సాఫ్ వాట్సాప్..
ఉత్తరాలతో సమాచారం చేరవేత అంతంతే, టెలిగ్రామ్ వ్యవస్థే నిలిచిపోయె! మరి అత్యవసర వార్తలు చేరేదెలా? ఎస్టీడీ బూత్‌లు, కాయిన్ బాక్స్లకూ కాలం చెల్లింది.. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ నెట్వర్కింగ్ సిస్టమే. అందరికీ అరచేత అందుబాటులోకి వచ్చింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు యువత, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇంటర్నెట్ వర్కింగ్ సైట్లలో వాట్సాప్ నెట్వర్క్ అందుబాటులోకి రావడంతో సమాచారాన్ని చేరవేసేందుకు మార్గం మరింత సుగమం అయింది. - సిద్దిపేట రూరల్ సాధారణ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌లో మెసేజ్‌లు పంపాలంటే దానికి నిర్దేశించిన ధర చెల్లించాల్సి వస్తుంది. అధికంగా ఎస్ఎంఎస్లు పంపాలంటే ఎస్ఎంఎస్ ఆఫర్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వాట్సాప్ రావడంతో అటు వంటి ఆఫర్ల అవసరం లేకుండా పోయింది. మొదట్లో నెలకు రూ.10 చొప్పున చెల్లించాల్సి వచ్చినప్పటికీ ఇప్పు డు అంతా ఉచితం అయిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, చిన్నచిన్న వీడియో క్లిపింగ్‌లు క్షణాల్లో అవతలి వ్యక్తులకు చేరవేసే అవకాశం కలిగింది. ఈ సోషల్నెట్ వర్క్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగమే ఉందనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందరికీ భలే యూజ్.. వాట్సాప్ నెట్‌వర్క్‌ను అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది ఒక గ్రూపుగా ఏర్పడి వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. పనులను చక్కబెట్టుకుంటున్నారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు రోజువారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూ పంలో వాట్సాప్‌లో పంపిస్తున్నారు. షాపింగ్‌లో ఏదైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడో ఉన్న తమ కుటుంబ సభ్యులకో, ఇష్టమైన స్నేహితులకో చూపించి వారి చాయిస్‌కు అనుగుణంగా వా ట్సాప్ ద్వారా అప్పటికప్పుడే ఫొటోలు తీసి పంపించి, వారి అ భిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గ్రూపు చాట్స్, లొకేషన్ షేర్ చేసుకోవడం, ఫొటోలు, వీడియోలు పంపించుకోనే వీలుంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారవ్యవస్థ అందుబాటులోకి రావడంతో వ్యక్తులు, వ్యవస్థల మధ్య దూరం తగ్గిపోయి సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఎంతో ఉపయోగం.. వాట్సాప్ నెట్వర్కింగ్ వ్యవస్థతో సమాచారం చేరవేయడం సులభతరమైంది. పైసా ఖర్చు లేకుండా నెట్లో సమాచారాన్ని పంపిస్తూ పనులు చక్కబెడుతున్నాం. సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థను సద్వినియోగపర్చుకుంటే సమాజంలో మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. - చంద్రోజు శ్రీనివాస్, టీచర్ క్షణాల్లో సమాచారం.. వాట్సాప్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకోని ఫొటోలు, వీడియోలను క్షణాల్లో పంపించవచ్చు. ఈ సదుపాయాన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోను, మీడియా, ఇతర వర్గాలు చక్కగా సద్వినియోగపర్చుకుంటున్నాయి. పని సులభమైంది. డబ్బుల ఖర్చు తగ్గింది. - రాజేంద్రప్రసాద్, ఎస్ఐ సిద్దిపేట రూరల్ -
రాజకీయాలపై సోషల్ మీడియా ప్రచార ప్రభావం
సోషల్ మీడియా ప్రభావం.. అమెరికలాంటి అగ్ర దేశంలోని ఎన్నికలతోపాటు మనదేశ జాతీయ రాజకీయాల్లోనూ ఇప్పటికే విస్తృతంగా కొనసాగుతున్న సోషల్ మీడియా ప్రచారం యువతపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో యువత రాజకీయ చైతన్యం పొందే అవకాశాలు లేకపోలేదు. స్మార్ట్ఫోన్ల పుణ్యమాని నేటి యువత సోషల్ నెట్వర్క్ సైట్లను అధికంగా ఉపయోగించుకుంటుండంతో.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సెల్ఫోన్లలో యువత ఎక్కువగా ఉపయోగించే ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రాం, అప్లికేషన్ల ద్వారా పబ్లిసిటీ మొదలుపెట్టారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న యువ అభ్యర్థులు తాము పోటీ చేసే వార్డుతోపాటు తాము పోటీ చేస్తున్న పార్టీ గురించి సైతం సోషల్ నెట్వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు. తమ బయోడేటా మొదలుకొని పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ లైక్‌లు, షేరింగ్, కామెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని సీనియర్ అభ్యర్థులు సైతం తమ కుటుంబంలో లేదా తన వర్గానికి చెందిన యువకుల సహకారంతో తమ అకౌంట్స్‌ను నిర్వహిస్తున్నారు. తద్వారా వారు ఓటర్లకు చెప్పాలనుకున్న సమాచారాన్ని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి.. నోటుకు ఓటు అమ్ముకునే వారు కొందరైతే తమకేమస్తుందని అసలు ఓటు హక్కునే వినియోగించుకోని వారు మరికొందరు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువత సైతం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన తలరాతను నిర్దేశించే వారిని ఎన్నుకునే ఈ సమరంలో మన అభ్యున్నతికి పాటుపడే యువ నాయకులను గెలిపించుకునే అవకాశాన్ని వదులుకోకుండా ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. యువత నడుం బిగించి ఓటర్లను చైతన్యవంతం చేసి వంద శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలి. అవినీతి రహిత నవశకానికి పునాది వేయాలి. ఫేస్బుక్ యుద్ధాలు.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే. ఇది పైస్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను విపరీతంగా ఉపాయోగిస్తున్న పార్టీలు దాని ద్వారా విమర్శలు గుప్పించుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక పార్టీ పోస్టు చేస్తుండగా, మరో పార్టీ వారు తమతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గొప్పగా పోస్టు చేసుకుంటున్నారు. ఆయా పార్టీలకు అభిమానులుగా ఉండే సభ్యులు ఈ పోస్టులకు బాగా స్పందించి లైక్‌లు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. అయితే పక్క పార్టీలకు చెందిన అభిమానులు ఒక్కోసారి ప్రత్యర్తి పార్టీల పోస్టులపై వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతున్నారు. దీంతో ఇరు పార్టీల అభిమానులు కామెంట్లతో గొడవలకు దిగుతున్నారు. -
ఇక... పోస్టల్ ఏటీఎం సెంటర్లు!
జిల్లాలో మొదటగా 5 కేంద్రాలు హెడ్ పోస్టాఫీసుల్లో ఏర్పాటు హన్మకొండ, వరంగల్, జనగాం, పరకాల, మహబూబాబాద్‌లో పరిశీలన పూర్తి తీరనున్న ఖాతాదారుల వెతలు హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : టెలిఫోన్, సెల్ఫోన్ల ప్రభావంతో పోస్ట ల్ శాఖలో కీలకమైన టెలిగ్రాం వ్యవస్థ మూతపడితే... ప్రైవేట్ కొరియర్లతో పోస్టు కార్డు జో రు తగ్గిన విషయం తెలిసిందే. వీటికి తోడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల పోటీకి పోస్టాఫీసుల్లో పొదుపు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అ న్ని విధాలుగా వెనుకబడిన పోస్టల్ శాఖ... ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. తాజాగా ఏటీఎం సెంటర్లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. సేవింగ్స్ బ్యాంక్ (ఎస్బీ) ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఐదు ఏటీఎం సెంటర్లు జిల్లాలో హన్మకొండ, వరంగల్ డివిజన్లుగా పోస్టల్ శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తోం ది. హన్మకొండ డివిజన్ పరిధిలో జనగాం, పరకాల, హన్మకొండలో మూడు హెడ్ పోస్టాఫీసులుండగా... 47 సబ్ పోస్టాఫీసులున్నా యి. మరో 372 బ్రాంచీల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నారుు. వరంగల్ డివిజన్ పరిధిలో వరంగల్‌తోపాటు మహబూబాద్‌లలో హెడ్ పోస్టాఫీసులు, 41 సబ్ పోస్టాఫీసులుండగా... 300 బ్రాంచీలున్నా రుు. మొదటగా జిల్లావ్యాప్తంగా ఐదు హెడ్ పోస్టాఫీసు ల్లో ఏటీఎం సెంటర్ల ఏర్పాటుకు పోస్టల్ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఇన్ఫోసిస్, సిఫి కంపెనీల ఇంజినీర్ల బృందం ఇటీవల హన్మకొండ, వరంగల్, జనగాం, పరకా ల, మహబూబాబాద్ పోస్టాఫీసులను పరిశీ లించింది. అంతేకాకుండా... పోస్టల్ శాఖ అధికారులు హెడ్ పోస్టాఫీసుల పరిధిలో ఎస్బీ ఖాతాల వివరాలను కంప్యూటర్లో పొందుపరిచే ప్రక్రియను కూడా చేపట్టారు. ఈ మేరకు వచ్చే ఏడాదిలో పోస్టల్ ఏటీఎంలను నెలకొల్పనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నారుు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది సేవింగ్ బ్యాంక్ ఖాతాదారుల ఉన్న ట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ ఏటీఎంలు అందుబాటులోకి వస్తే... వినియోగదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన బాధ తీరినట్లే. అంతేకాదు... వారు తమ తమ ఖాతాల్లో ఎప్పుడైనా నగదు వేసుకోవచ్చు.... ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. -
కనుమరుగు