ఫ్రీ సినిమా పేరిట సైబర్‌ మోసం.. ఏం చేస్తున్నారంటే.. | Cyber Attack Through Social Media With Free Movies | Sakshi
Sakshi News home page

ఫ్రీ సినిమా పేరిట సైబర్‌ మోసం.. ఏం చేస్తున్నారంటే..

Dec 30 2023 1:58 PM | Updated on Dec 30 2023 3:16 PM

Cyber Attack Through Social Media With Free Movies - Sakshi

సైబర్ నేరస్థులు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అదే కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఆసక్తి. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్‌లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. కానీ ప్రస్తుతం అధికారికంగా విడుదలైన తర్వాతే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే భావనతో ఇతర ప్లాట్‌ఫామ్‌ల్లో సెర్చ్‌ చేస్తున్నారు.

అలా జనాలు చేస్తున్న ప్రయత్నాలే సైబర్‌ నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్‌ ఛానల్‌ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. 

ఇదీ చదవండి: ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్ లోడ్‌ అనే లింక్‌లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే పాప్‌అప్‌ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement