free movie
-
ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే..
సైబర్ నేరస్థులు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అదే కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఆసక్తి. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. కానీ ప్రస్తుతం అధికారికంగా విడుదలైన తర్వాతే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే భావనతో ఇతర ప్లాట్ఫామ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. అలా జనాలు చేస్తున్న ప్రయత్నాలే సైబర్ నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇదీ చదవండి: ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..! సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్లో ఫ్రీ డౌన్ లోడ్ అనే లింక్లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే పాప్అప్ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్ల ద్వారా వచ్చే యాప్లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. -
ఆ సినిమాను థియేటర్లో ఫ్రీగా చూడొచ్చంటా?
అవును మీరు చదివింది నిజమే. రేపు విడుదల కానున్న ఓ సినిమాను మొదటి ఆటలో ఫ్రీగా చూడొచ్చంటా. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఫ్రీగా చూసి నచ్చితే ఓ పది మందికి చెప్పండని నిర్మాతలు తెలిపారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దాం. భార్య భర్తలు, వారి మధ్య తగాదాల నేపథ్యంలో తెరకెక్కిన ‘ఐపీసీ సెక్షన్ భార్యా బంధు’ సినిమా రేపు (జూన్ 29) విడుదల కానంది. ఐపీసీలోని ఓ సెక్షన్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో సీనియర్ నటి ఆమని ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆడవాళ్ల నుంచి మగవారిని రక్షించండి అంటూ సరికొత్తగా ప్రచారం చేస్తూ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి ఆటను ఉచితంగా చూడండి, మీకు నచ్చితే పది మందికి చెప్పండి.. ప్రేక్షకులే ప్రచారకర్తలు అంటూ నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను ఆలూరి సాంబశివరావు నిర్మించగా, రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!! రేపు విడుదలవుతున్న "ఐపిసి సెక్షన్ భార్యాబంధు' ఉదయం ఆట ఉచితంగా చూడండి!! మీకు నచ్చితే పదిమందికి చెప్పండి!! ప్రేక్షకులే ప్రచారకర్తలు!! #IPCSection #BharyaBandhu pic.twitter.com/UmQn5VoR5c — BARaju (@baraju_SuperHit) June 28, 2018 -
టిక్కెట్టు లేకుండా సినిమా!!
సినిమాకు వెళ్లి, టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఎంచక్కా చూస్తే ఎలా ఉంటుంది? దొంగదారిలో వెళ్దామనుకుంటున్నారా.. అక్కర్లేదు. ఓ మళయాళ నిర్మాత చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే భవిష్యత్తులో చాలావరకు సినిమాలను ఉచితంగానే చూడొచ్చు. కనీసం మొదటి వారం వరకైనా కూడా సినిమాను ఉచితంగా ప్రేక్షకులకు అందించాలని ఆ నిర్మాత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్.వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'టెస్ట్ పేపర్' అనే సినిమాను ఇలా ఉచితంగా అందించాలని ఆ సినిమా నిర్మాత మనోజ్ కుమార్ భావిస్తున్నారు. అయితే, ఇది ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే. ముందుగా థియేటర్ల వద్ద ఇచ్చే ఉచిత పాస్లు తీసుకుని ఈ సినిమాకు వెళ్లాలి. సినిమా ప్రదర్శనకు అయ్యే ఖర్చులను ప్రకటనల ద్వారా రాబడతామని నిర్మాత మనోజ్ కుమార్ చెప్పారు. ఇంతకుముందు టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు రూపొందించామని, కానీ సినిమాను ఇలా స్పాన్సర్ చేయించడం మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి అవుతుందని ఆయన అన్నారు. పెద్దపెద్ద బ్రాండ్ల కంటే స్థానిక ప్రకటనల మీదే తాము దృష్టి పెట్టామన్నారు. సీరియళ్లలో అయితే ఎప్పుడు పడితే అప్పుడే మధ్యలో ప్రకటనలు వస్తాయి. కానీ సినిమాలో మాత్రం అలా కాకుండా, మొదట్లోను, ఇంటర్వెల్ సమయంలోను మాత్రమే ప్రకటనలు ఇస్తారు. టెస్ట్ పేపర్ సినిమాలో జగదీష్, నందు, మున్నా, మహాలక్ష్మి లాంటి ప్రముఖ నటులున్నారు.