ఆ సినిమాను థియేటర్‌లో ఫ్రీగా చూడొచ్చంటా? | Free To Watch The IPC Section Bharya Bandhu Movie In Theatres | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 3:05 PM | Last Updated on Thu, Jun 28 2018 3:21 PM

Free To Watch The IPC Section Bharya Bandhu Movie In Theatres - Sakshi

అవును మీరు చదివింది నిజమే. రేపు విడుదల కానున్న ఓ సినిమాను మొదటి ఆటలో ఫ్రీగా చూడొచ్చంటా. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఫ్రీగా చూసి నచ్చితే ఓ పది మందికి చెప్పండని నిర్మాతలు తెలిపారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దాం. 

భార్య భర్తలు, వారి మధ్య తగాదాల నేపథ్యంలో తెరకెక్కిన ‘ఐపీసీ సెక్షన్‌ భార్యా బంధు’ సినిమా రేపు (జూన్‌ 29) విడుదల కానంది. ఐపీసీలోని ఓ సెక్షన్‌ చుట్టూ తిరిగే ఈ సినిమాలో సీనియర్‌ నటి ఆమని ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.  ఆడవాళ్ల నుంచి మగవారిని రక్షించండి అంటూ సరికొత్తగా ప్రచారం చేస్తూ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా మొదటి ఆటను ఉచితంగా చూడండి, మీకు నచ్చితే పది మందికి చెప్పండి.. ప్రేక్షకులే ప్రచారకర్తలు అంటూ నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను ఆలూరి సాంబశివరావు నిర్మించగా, రెట్టడి శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement