cyber attack
-
నిఘా నేత్రాలనూ వదలట్లేదు
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్న సీసీటీవీ కెమెరాలను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. అందులోని ఫుటేజీని వాడుకొని మోసగించేందుకు..సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారని సైబర్‌భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పాయల్ మెటర్నటీ ఆస్పత్రి సీసీటీవీ కెమెరాలను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఇళ్లు, కార్యాలయాల్లోని సీసీటీవీ కెమెరాలు సైతం హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదముందని, కొద్దిపాటి జాగ్రత్తలతో ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చనిసైబర్ నిపుణులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని ఎలా హ్యాక్ చేస్తారు? సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి ఫీడ్‌ను చూసేందుకు మనం ఏర్పాటు చేసుకునే ఖాతాకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలకు డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను చాలామంది మార్చరు. దీంతో హ్యాకర్లు సులభంగా కెమెరాల్లోకి చొరబడుతున్నారు. కొన్ని సీసీటీవీ కెమెరాల సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉండటం కూడా హ్యాకర్లకు కలిసొస్తుంది. బలహీనమైన వైఫై నెట్‌వర్క్‌లు కూడా హ్యాకర్లకు సులభమైన లక్ష్యాలుగా మారుతాయి. ఫిషింగ్ ఈ–మెయిల్లతో హ్యాకర్లు యూజర్ల పాస్వర్డ్లు, ఇతర సమాచారాన్ని సేకరించి హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. హ్యాక్ చేయడం వల్ల కలిగే నష్టాలు ⇒ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది. ⇒ ఇళ్లు, కార్యాలయాల్లోని ముఖ్యమైన సమాచారం దొంగిలిస్తారు. ⇒ బెదిరింపులు, బ్లాక్మెయిల్లకు గురయ్యే ప్రమాదముంది. ⇒ ఆర్థికంగా నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ⇒ సీసీటీవీ కెమెరాలకు తప్పకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోవాలి. అవి సులువుగా ఇతరులు గుర్తించలేనట్టుగా ఉండాలి. ⇒ సీసీటీవీల సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ⇒ వైఫై నెట్‌వర్క్‌ను సురక్షితంగా పెట్టుకోవాలి. ⇒ అనుమానాస్పద లింక్‌లు, ఈ–మెయిల్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. ⇒ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సైబర్ పోలీసులు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ 1930లో ఫిర్యాదు చేయాలి. -
ఫోన్ కాల్‌తో రూ.1.95 కోట్లు కొట్టేశారు.. డబ్బుల్ని డ్రా చేయడం మరిచిపోయారు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ఓ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, ఆ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రమేష్ (పేరు మార్చాం) ఫోన్‌కు సంస్థ ఛైర్మన్, ఎండీ సురేష్ ఓ ప్రాజెక్ట్ నిమిత్తం ముందస్తు చెల్లింపులు చేయాలి. అర్జంట్‌గా నా అకౌంట్‌కు రూ.1.95కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని కోరడమే ఆ మెసేజ్ సారాశం. మెసేజ్‌తో పాటు వాట్సప్ డిస్ప్లేలో ఉన్న ఫొటో తన ఎండీ సురేష్‌దేనని నిర్ధారించుకున్నాక ఆయన అకౌంట్‌కు అడిగిన మొత్తం పంపాడు.పంపిన కొద్ది సేపటికి అసలు మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మేనేజింగ్ డైరెక్టర్ తన బ్యాంక్ అకౌంట్స్ నుంచి రూ.1.95కోట్లు ట్రాన్స్‌ఫరయినట్లు వచ్చింది. కంగుతిన్న ఎండీ సురేష్ అకౌంట్స్ ఆఫీసర్ సురేష్‌ను సంప్రదించాడు. సురేష్ తన వాట్సప్‌కు మీరు పంపిస్తే నేను డబ్బులు పంపారని చెప్పడంతో పాటు ఆధారాల్నిచూపించాడు. దీంతో మోసపోయామని గుర్తించారు. సదరు సంస్థ ప్రతినిధులు వెంటనే తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేసింది.సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్సీఆర్పీ డబ్బులు ఏ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయ్యాయో ట్రాక్ చేసింది. ప్రారంభంలో వివరాలు లేకపోవడంతో డబ్బులు ఎవరికి? ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయో నిర్ధారించడం కష్టంగా మారింది.ఎన్సీఆర్పీ సంస్థ ఎండీతో కలిసి బ్యాంక్ నోడల్ అధికారుల్ని సంప్రదించారు. డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశారో గుర్తించారు. అదృష్టం కొద్దీ సైబర్ నేరస్తులు డబ్బుల్ని దొంగిలించారు. కానీ వాటిని బ్యాంక్ అకౌంట్‌ను డబ్బుల్ని డ్రా చేసుకోలేకపోయారు. దీంతో సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్ నుంచి తిరిగి బాధిత సంస్థ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయడంతో కథ సుఖాంతమైంది. -
ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!
ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని ఎక్స్(ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు డౌన్ అయింది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఎక్స్ సైబర్ దాడిని ఎదుర్కొంటోందని.. హ్యాకర్లను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేశారు. దీని వెనుక ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చు అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలోని ఐపీ చిరునామాల నుంచి సైబర్ దాడి జరిగిందని అన్నారు. ఈ కారణంగానే రోజంతా అంతరాయం ఏర్పడిందని అన్నారు.డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ రోజంతా మూడు అంతరాయాలను ఎదుర్కొంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ అంతరాయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. రాత్రి 9 గంటలకు కూడా ఈ అంతరాయాలు కొనసాగాయి.ట్రాకింగ్ వెబ్సైట్ దాదాపు 52 శాతం సమస్యలు వెబ్‌సైట్‌కు సంబంధించినవని, 41 శాతం యాప్‌కు సంబంధించినవని, 8 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని చూపించింది. ఇప్పుడు కూడా అంతరాయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎలాన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు (రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) Xని కొనుగోలు చేశారు. 2023లో అతని ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్స్ దాటేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. -
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..
ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల పాట్నాకు చెందిన ఒక మహిళ.. కాల్ చేసి వేలాది రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఇదెలా జరిగిందో తెలుసుకుందాం.పాట్నాలోని యారాపూర్ నివాసి అయిన ఒక మహిళ.. ఫిబ్రవరి 6న ఆన్లైన్లో మిక్సర్ మెషీన్‌ను ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ ఫిబ్రవరి 12 నాటికి కావాల్సి ఉంది. కానీ డెలివరీ అవ్వలేదు. దీంతో ఆమె కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుని.. సెర్చ్ ఇంజిన్‌లో కంపెనీ కాంటాక్ట్ నంబర్ కోసం వెతికి, ఒక నెంబర్ సంపాదించింది.తెలియని నెంబర్‌కు కాల్ చేసి, స్కామర్ల ఉచ్చులో పడింది. ఇంకేముంది.. నిమిషాల్లో రూ. 52,000 పోగొట్టుకుంది. చేసేదేమీ లేక.. ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే?➤కస్టమర్ కేర్ నెంబర్ల కోసం.. ఎల్లప్పుడూ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మోసగాళ్ళు తరచుగా సెర్చ్ ఇంజన్లలో నకిలీ నంబర్లను జాబితా చేస్తారు. కాబట్టి ఆన్లైన్లో వెతకడం మానుకోవాలి. ➤తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ పట్ల జాగ్రత్త అవసరం. మోసగాళ్ళు ప్రజలను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.➤ఎవరైనా మిమ్మల్ని చెల్లింపు వివరాలను లేదా లావాదేవీ వివరాలను చెప్పమని, లింక్‌పై క్లిక్ చేయమని అడిగితే.. అధికారిక మార్గాల ద్వారా కంపెనీతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.➤మోసపోతున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి సైబర్ పోలీసులకు నివేదించండి.ఇదీ చదవండి: కొత్త ఐఫోన్ 16ఈ.. ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్ -
నివా బూపా హెల్త్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్‌ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం అందించింది. డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్‌ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే. -
సడన్ ఫేమ్.. డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek)పై సైబర్‌దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్(AI Chat Bot) సేవలందించే డీప్‌సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్‌సీక్‌కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్‌లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్‌సీక్‌కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్‌సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్‌సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్‌లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. -
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్‌లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు. -
సెన్స్ చూపితేనే.. సీన్ మారేది!
రూ.20 లక్షలు.. ఓ పేద కుటుంబానికి అసాధ్యమైన మొత్తం. దిగువ మధ్య తరగతికి జీవితం. మధ్య తరగతికి కొన్ని దశాబ్దాల కష్టం. ఉన్నత వర్గాలకు సైతం పెద్ద లెక్కే. ఇంతటి నగదుని నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌లో పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరగాళ్ల మాటకు భయపడిపోతున్న సామాన్యులు సాధారణ పోలీసులు శాంతిభద్రతలు, నేరాలకు సంబంధించిన వ్యవహారాలు, సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ఫ్రాడ్స్, కస్టమ్స్ అధికారులు సుంకం ఎగవేత, అక్రమ రవాణా వ్యవహారాలు పర్యవేక్షిస్తారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రూ.20 లక్షలకు సంబంధించిన కేసు పూర్వాపరాలను ఒకసారి పరిశీలిస్తే.. 1. బాధితుడికి సైబర్ నేరగాళ్లు తాము ఇంటర్నేషనల్ డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పారు. మీ ఆధార్ కార్డుతో బ్యాంకాక్‌కు బుక్ అయిన పార్శిల్లో పాస్‌పోర్టులు, ఏటీఎం కార్డులు, బ్యాంకు పత్రాలు, 140 గ్రాముల డ్రగ్ కూడా ఉందన్నారు. ఆ పార్శిల్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బాధితుడు చెప్పడంతో... తాము ఫోన్‌కు ఢిల్లీ సైబర్ సెల్‌కు బదిలీ చేస్తున్నామన్నారు. విదేశాలకు పంపే నిషేధిత, నియంత్రిత వస్తువులకు సంబంధించిన కేసు కస్టమ్స్ పరిధిలోకి వస్తుంది. మాదక ద్రవ్యాలతో కూడిన డ్రగ్ పార్శిల్‌కు సంబంధించిన కేసులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ నాబ్), ఎక్సైజ్, టాస్‌్కఫోర్స్ లేదా సాధారణ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఢిల్లీ సైబర్ సెల్ వంటి ఏజెన్సీలకు ఈ తరహా కేసులతో ఏ మాత్రం సంబంధం ఉండదు. కొరియర్ ఆఫీసులకు, పోలీసులకు మధ్య ఎలాంటి లింకులు ఉండవు. అలాంటప్పుడు కొరియర్ సంస్థ తాము చేసిన కాల్ని పోలీసులు బదిలీ చేయడం అసాధ్యం. 2. బాధితుడితో సైబర్ సెల్ అధికారిగా మాట్లాడిన సైబర్ నేరగాడు మీ ఆధార్ దురి్వనియోగంపై ఫిర్యాదు చేయాలంటూనే అదే ఆధార్‌తో తెరిచిన నాలుగు బ్యాంకు ఖాతాలు మనీలాండరింగ్‌కు వాడారని చెప్పాడు. మనీలాండరింగ్ సంబంధిత అంశాలన్నీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) పర్యవేక్షించే అంశం. ఈ తరహా కేసుల్ని వీళ్లే నమోదు చేసి, దర్యా ప్తు చేస్తుంటారు. ఆ వివరాలు సైబర్ సెల్‌కు తెలిసే అవకాశమే ఉండదు. ఆధార్ కార్డు దురి్వనియోగం పైనా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఉండే ఆస్కారం లేదు. 3.అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బాధితుడితో మాట్లాడి ‘డిజిటల్ అరెస్టు’ చేశారు. మీపై నిఘా ఉందంటూ బాధితుడికి చెప్పి ప్రతి గంటకూ తమను సంప్రదించాలని స్పష్టం చేశాడు. స్థానిక పోలీసుల నుంచి సీబీఐ వరకు ఏ ఏజెన్సీ కూడా డిజిటల్ అరెస్టు అనేది చేయదు. కేసు నమోదు తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు, ఇతర వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయడమో, నోటీసులు ఇవ్వడమో చేస్తారు. ఆపై దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. నిఘా ఉంచాల్సి వస్తే దానికి వారి మార్గాలు వారికి ఉంటాయి తప్ప వీడియో కాల్ ద్వారా మాత్రం కాదు. 4.బాధితుడిని భయపెట్టడంలో భాగంగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు విషయం ఎవరికీ చెప్పొద్దని, దీన్ని రహస్యంగా ఉంచకపోతే మీతో పాటు కుటుంబీకుల కిడ్నాప్ లేదా హత్య చేస్తామని బెదిరించారు. ∙రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏజెన్సీ కూడా ఇలాంటి షరతు పెట్టదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పోలీసులు, సీఐడీ, సీబీఐ సహా ఏ విభాగమైనా ఓ వ్యక్తిని అరెస్టు చేస్తే... దానిపై వారి సంబం«దీకులకు కచి్చతంగా సమాచారం ఇవ్వాలి. ఎవరికి సమాచారం ఇచ్చామనే విషయాన్నీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలనే నిబంధన ఉంది. అలాంటిది ఇక కిడ్నాప్‌లు, హత్యలు చేసే ఆస్కారం పోలీసులకు, ఏజెన్సీలకు ఎలా ఉంటుందనేది విస్మరించకూడదు. 5.ఇది జరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు బాధితుడికి సీబీఐ, ఆర్బీఐ పేర్లతో ఉన్న రెండు నకిలీ లేఖల్ని వాట్సాప్ ద్వారా పంపారు. వాటిలో బాధితుడికి మనీలాండరింగ్‌తో పాటు ఫోర్జరీ కేసులతో సంబంధం ఉన్నట్లు ఉంది. ∙ఆర్బీఐ, సీబీఐలతో సైబర్ క్రైమ్ పోలీసులు అవసరమైనప్పుడు మాత్రమే సంప్రదింపులు జరుపుతారు. ఏదైనా కేసుకు సంబంధించి వాళ్లు ఇచి్చన ఆధారాలు, సమాచారాన్ని కేవలం కోర్టుకు మాత్రమే సమరి్పస్తారు. ఇలా బాధితుడికి వాట్సాప్ చేసి, డబ్బు డిమాండ్ చేయడం జరగని పని. 6.ఈ కేసుల నుంచి విముక్తి పొందాలంటే తాము చెప్పినట్లు చేయాలని బాధితుడిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలు పంపారు. వాటిలో విడదల వారీగా రూ.20 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ∙కేసుల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటి రకం వాటిలో శిక్షలు పడితే.. రెండో రకం వాటిలో కేవలం జరిమానాలే విధిస్తారు. అనధికారికంగా ఇతరుల పాస్‌పోర్టులు కలిగి ఉండటం, వీటిని విదేశాలకు పంపే ప్రయత్నం చేయడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా... ఇవన్నీ తీవ్రమైన నేరాలు. వీటికి కాంపౌండబుల్ అఫెన్సుల మాదిరిగా జరిమానాలు విధించరు. 7.ఈ బాధితుడు సైబర్ నేరగాళ్లు డబ్బు డిపాజిట్ చేయమంటూ హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇచ్చారు. వీటిలోకి నగదు బదిలీ చేసిన బాధితుడు దాని కోసం తన ఫిక్సిడ్ డిపాజిట్లనూ క్యాన్సిల్ చేశాడు. ∙పోలీసులు లేదా ఏదైనా ఏజెన్సీకి నగదు చెల్లించాల్సి వస్తే సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలకు చెల్లింపులు ఉండదు. కేవలం డీడీలు, చెక్కులు, చలాన్ల రూపంలోనే ఈ చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకు ఖాతాలోకి జమ చేయాల్సి వచ్చినా అది ప్రభుత్వానికో, పోలీసు అధిపతి పేరుతో ఉన్న దానికో మాత్రమే జమ చేయాలి. -
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్‌గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్‌లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్‌ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్‌తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్‌లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్‌లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్‌గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్‌కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్‌ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
అమెరికా ఖజానాపై సైబర్ దాడి..!
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్‌పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్‌కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్‌వర్డ్‌ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్‌లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్‌పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్‌ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. -
హలో అన్నాడు.. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు
బెంగళూరు : హలో సార్..! మేం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఆధార్ కార్డ్‌తో మనీ లాండరింగ్, ఆధార్ కార్డ్‌కు జత చేసిన సిమ్‌ను తప్పుడు ప్రకటనల కోసం వినియోగిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ అగంతకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఓ ఐటీ ఉద్యోగి రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల టెక్కీ డిజిటల్ అరెస్ట్ అయ్యారు. నవంబర్ 11న బాధితుడికి తాను ట్రాయ్ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన సిమ్ కార్డుతో అక్రమ ప్రకటనలు, మహిళల్ని వేదించేలా వారికి మెసేజ్‌లు పంపేందుకు ఉపయోగిస్తున్నారని, దీనిపై ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు చెప్పాడు. దీంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. మేం మీకు ఫోన్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచండి. కేసును ఆన్లైన్లో విచారిస్తాం. సహకరించండి. వర్చువల్‌గా విచారించేందుకు మీరు ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి అని కోరాడు. ఆ తర్వాత బాధితుడికి నకిలీ ముంబై పోలీసు యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఓ వ్యాపార వేత్త మీ ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి రూ.6 కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. దీనిపై కేసు నమోదైందని మరింత భయపెట్టించాడు. అయితే, నవంబర్ 25న, పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి బాధితుడికి ఓ యాప్ నుంచి కాల్ చేశాడు. మీ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం, మీరు మా విచారణకు సహకరించాలి. లేదంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. ముందుగా వెరిఫికేషన్ నిమిత్తం చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించాడు. బాధితుడు అరెస్టుకు భయపడి నిందితులు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.11.8కోట్లను ట్రాన్స్ ఫర్ చేశాడు. అది సరిపోదని ఇంకా కావాలని డిమాండ్ చేయడం తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే తాను మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఇచ్చింది రూ.720 ..పోయింది రూ.4.49 లక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళను టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో ఎర వేశారు. ఆమెకు రూ.720 లాభం ఇవ్వడం ద్వారా నమ్మకం కలిగించి ఏకంగా రూ.4.49 లక్షలు టోకరా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ వివాహితకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ట్రేడ్ మార్కెటింగ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఎర వేశారు. దానికి ముందు కొన్ని టాస్్కలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో ఆయా వీడియోలు, ఫొటోలను షేర్ చేయడం, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని నమ్మబలికారు. మొదటి టాస్క్ పూర్తి చేసిన ఆమెకు రూ.120, రెండో టాస్క్ పూర్తి చేయడంతో రూ.300 చెల్లించారు. దీంతో వారిపై పూర్తిగా నమ్మకం కలిగిన గృహిణి తాను పెట్టుబడులు పెడతానంటూ వాట్సాప్ ద్వారా సందేశం ఇచ్చారు. దీంతో ఆమెకు ఓ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు అందులో ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడులు పెట్టాలన్నారు. తొలుత రూ.వెయ్యి పెట్టుబడి పెట్టిన ఆమెకు రూ.300 లాభంతో రూ.1300 చెల్లించారు. ఆపై పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయిస్తూ, త్వరలోనే లాభాలు వస్తాయని కాలయాపన చేశారు. మొత్తమ్మీద రూ.4.49 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత రిఫండ్ కోరితే మరికొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుందని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే... తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ ఉద్యోగికి పెళ్లి కూతురి పేరుతో ప్రొఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.05 లక్షలు కాజేశారు. దీనికోసం వాళ్లు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కథ చెప్పారు. నగర యువకుడు తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోగా... మలేíÙయాలో ఉంటున్న విశాఖపట్నం యువతిగా ఓ యువతి తన ప్రొఫైల్ పంపింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. ఆపై తన తండ్రి క్రిప్టో కరెన్సీ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి, లాభాలు పొందటంతో నిష్ణాతుడని చెప్పింది. తొలుత నిజమైన క్రిప్టో కరెన్సీ యాప్‌లోనే పెట్టుబడి పెట్టి, లాభాలు పొందేలా చేశారు. ఆపై నకిలీ యాప్ లింక్‌ను పంపి, అందులో రూ.2.05 లక్షలు ఇన్వెస్ట్ చేయించి కాజేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తెలుగు మ్యాట్రిమోనీ నుంచి వాట్సాప్ ద్వారా బాధితుడికి ఓ మెసేజ్ వచి్చంది. అందులో సైబర్ నేరగాళ్లు పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలుగా పరిచయమై ఎర వేస్తున్నారని, ఆపై వివిధ అంశాల్లో తమ అంకుల్, తండ్రి నిష్ణాతులని చెప్పి మోసం చేస్తున్నారని ఉంది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తక్షణం ఫిర్యాదు చేయండిఅపరిచితులతో ఎలాంటి లావాదేవీలు వద్దు. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అంటూ వచ్చే ప్రకటనలు నమ్మవద్దు. ఎవరైనా సైబర్ నేరాల బారినపడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి లేదా 8712665171 నెంబర్‌ను వాట్సాప్ ద్వారా,(cybercrimespshyd@gmail.com) మెయిల్‌కు ఐడీకి ఈ–మెయిల్ ద్వారా సంప్రదించి లేదా (www.cybercrime.gov.in) వెబ్సైట్లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. – సైబర్ క్రైమ్ పోలీసులు -
క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ
చౌటుప్పల్ రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ రోజువారి కార్యకలాపాల్లో అమలు చేస్తుండగా.. సైబర్ నేరగాళ్లు అంతకుమించిన టెక్నాలజీని వినియోగిస్తూ అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశంగా మారింది. విద్యావంతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం యాప్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది.ఏపీకే ఫైళ్లతో ప్రమాదం..సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(ఏపీకే) ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే.. సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఫలితంగా మనకు సంబంధ లేకుండానే మన ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. తమ ఫోన్ హ్యాక్ అయ్యిందని తెలియని వారు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్యారా సొమ్ము పంపితే వెంటనే హ్యాక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా పిన్ నంబర్ తెలుసుకుని నిమిషాల్లో ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్ చేసిన మొబైల్ డివైస్ డిస్ప్లే సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీని ప్రకారం ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లకు ఫోన్ హ్యాకింగ్‌కు గురైన వ్యక్తి పంపినట్లు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. నిజంగానే మనకు తెలిసిన వ్యక్తి నుంచే ఈ మెసేజ్ వచ్చిందని భావించి ఏపీకే ఫైళ్ల లింక్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో బ్యాంకు ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం పేరిట లింక్ పంపుతున్నారు. ఈ లింక్‌ను ఓపెన్ చేసినా కూడా ఫోన్ హ్యాక్ అయ్యి మనకు సంబంధం లేకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులను సైబర్ నేరగాళ్లు లాగేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసర లింక్‌లను ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అవ్వడం ఖాయం.నకిలీ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలిసైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో లింక్‌లు పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కినట్లే అవుతుంది. ఎవరైనా సైబర్ మోసానికి గురైనా, ఫోన్ హ్యాక్ అయ్యి తమ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ నంబర్ 1930కి డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.– మన్మథకుమార్, చౌటుప్పల్ సీఐ -
మీషోపై పడ్డ సైబర్ నేరగాళ్లు: ఎన్ని కోట్లు దోచేశారంటే..
సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే మోసం చేశారని గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏకంగా మీషో కంపెనీని మోసం చేసి ఏకంగా రూ. 5.5 కోట్లు నష్టాన్ని కలిగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సైబర్ నేరగాళ్లు మీషో ఈ-కామర్స్ కంపెనీలో ఫేక్ సెల్లర్‌గా నటిస్తూ.. అదే ప్లాట్ఫామ్లో నకిలీ ఖాతాల ద్వారా ఆర్డర్లు చేసేవారు. ఆర్డర్ డెలివరీ చేసుకున్న తరువాత వాటి స్థానంలో విరిగిపోయిన లేదా పాడైపోయిన పాత వస్తువులను పెట్టి మళ్ళీ రిటర్న్ చేసేవారు. దీనిని నిజమని నమ్మించడానికి వీడియోలు కూడా క్రియేట్ చేసేవారు. ఆ తరువాత డబ్బు వెనక్కి తీసుకునేవారు.మోసగాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య ఇదే వరుసలో మోసాలు చేస్తూ.. మీషో నుంచి రూ. 5.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు జమచేసుకోవడానికి వీరు వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారు. ఈ మోసాన్ని కంపెనీ గుర్తించిన తరువాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మీషో కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత.. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.హ్యాకర్లు.. మీ అనుమతి లేకుండానే మొబైల్ హ్యాక్ చేసే అవకాశం ఉంది. మొబైల్ హ్యాక్ చేస్తే.. డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఉత్పత్తులను (మొబైల్స్, ట్యాబ్స్, మ్యాక్స్) ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.CERT-In యాపిల్ ఉత్పత్తులను ప్రభావితం చేసే రెండు బలహీనతలను గుర్తించింది. అవి ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ (CVE-2024-44308), క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS). వీటిని వాడుకొని సైబర్ నేరగాళ్లు మీ మొబైల్స్ హ్యక్స్ చేస్తారు.ఇదీ చదవండి: దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..18.1.1కి ముందున్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. అలాగే 17.7.2కి ముందు యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. 15.1.1కి ముందు వెర్షన్స్ అయిన యాపిల్ మ్యాక్ఓఎస్ సుక్వోయా, 2.1.1కి ముందున్న యాపిల్ విజన్ఓఎస్, 18.1.1కి ముందు ఉన్న యాపిల్ సఫారీ ఉత్పత్తులను హ్యాకర్స్ సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, సరికొత్త సాఫ్ట్వేర్ వెర్షన్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. -
జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. జాబ్స్ అంటూ, స్టాక్ మార్కెట్స్ అంటూ, బంధువులు అంటూ.. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మహిళను మోసం చేసి రూ. 1.94 లక్షలు కాజేశారు.కర్ణాటకలోని ఉడుపికి చెందిన అర్చన అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం వెతుకుతుండగా.. అమెజాన్ జాబ్‌లను ఆఫర్ చేస్తున్నట్లు ఒక ప్రకటన చూసింది. ఇది చూసి ఆ ప్రకటన మీద క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్ చాట్‌కు తీసుకెళ్లింది. స్కామర్లు.. రిక్రూటర్లుగా నటిస్తూ, ఆమెకు ఉత్సాహం కలిగించే ఆఫర్‌ను అందించారు.అధిక మొత్తంలో లాభాలను పొందాలంటే.. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు సూచించారు. ఇది నిజమని నమ్మి.. అక్టోబర్ 18 నుంచి 24 మధ్య సుమారు రూ. 1.94 లక్షలను వివిధ యూపీఐ ఐడీలకు బదిలీ చేసింది. అయితే చివరకు రిటర్న్‌లు రాకపోవడంతో.. మోసపోయామని గ్రహించింది. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుస్కామర్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవానికి ఎప్పుడూ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్, లింక్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకుండా ఉండాలి. అవతలి వ్యక్తి అనుమానంగా అనిపిస్తే తప్పకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!
యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్ అలర్ట్‌లు పంపుతోంది. అవుట్‌డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.పాత సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్‌ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్డేట్లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్‌ల్లో తాజా సాఫ్ట్వేర్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!ఐఓఎస్ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్వేర్ వెర్షన్లను వినియోగిస్తున్న యాపిల్ కస్టమర్లు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. వాచ్ఓఎస్, టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారి బ్రౌజర్ వంటి పాత వెర్షన్లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. -
కొంప ముంచిన వాట్సాప్ గ్రూప్: రూ.50 లక్షలు మాయం
భారతదేశంలో ఆన్లైన్ మోసాల కారణంగా భారీగా మోసపోతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్దులు, యువకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో కేసు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం.హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి స్టాక్ డిస్కషన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరడంతో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, కునాల్ సింగ్ తన మార్గదర్శకత్వంతో కొంతమంది క్లయింట్స్ ఎక్కువ లాభలను పొందినట్లు, తనను తాను ప్రఖ్యాత ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకున్నాడు.స్టాక్ మార్కెట్లో గొప్ప లాభాలను పొందాలంటే ఆన్లైన్ క్లాసులకు చేరాలని వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించాడు. క్లాసులకు జాయిన్ అవ్వాలంటే.. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేయాలని పేర్కొనడంతో.. బాధితుడు ఇదంతా నిజమని నమ్మేశాడు. అంతే కాకుండా స్కైరిమ్ క్యాపిటల్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టమని స్కామర్లు ఆదేశించడంతో బాధితుడు అలాగే చేసాడు.ప్రారంభంలో బాధితుని పెట్టుబడికి.. స్కామర్లు మంచి లాభాలను అందించారు. అయితే ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే.. ఎక్కువ పెట్టుబడి పెట్టాలని స్కామర్లు పేర్కొన్నారు. అప్పటికే లాభాల రుచి చూసిన బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత స్కామర్లు చెప్పిన వెబ్సైట్ నుంచి లాభాలను తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే..టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపే సోషల్ మీడియా గ్రూపులతో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకూడదు. అంతగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే.. నిపుణులు నిర్వహించే తరగతులకు హాజరవ్వొచ్చు, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర నెర్కకోవచ్చు. -
కెనడా ‘సైబర్ ముప్పు’ జాబితాలో భారత్
ఒట్టావా/న్యూఢిల్లీ: ఇండియా విషయంలో కెనడా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇండియా నుంచి తమకు సైబర్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఏయే దేశాల నుంచి సైబర్ ముప్పు ఉందన్నదానిపై గత నెల 30న కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ(సైబర్ సెంటర్) ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఇండియాను సైతం చేర్చింది. నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్మెంట్(ఎన్సీటీఏ) 2025–26లో చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తర్వాత ఇండియా పేరును చేర్చడం గమనార్హం. భారత ప్రభుత్వం నియమించిన వ్యక్తులు గూఢచర్యం కోసం తమ ప్రభుత్వ నెట్‌వర్క్‌పై సైబర్ ముప్పు కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఎన్సీటీఏ జాబితాను ప్రతి రెండేళ్లకోసారి విడుదల చేస్తుంటారు. 2018, 2020, 2023–24 నాటి జాబితాలో ఇండియా పేరులేదు. తొలిసారిగా 2025–26 జాబితాలో ఇండియా పేరు చేర్చారు. ఇదిలా ఉండగా, భారత్ నుంచి సైబర్ ముప్పు పొంచి ఉందంటూ కెనడా విడుదల చేసిన జాబితాపై భారత విదేశాంగ శాఖ అధికారి రణ«దీర్ జైస్వాల్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని భారత్‌కు వ్యతిరేకంగా మా ర్చాలన్నదే కెనడా కుట్ర అని ఆరోపించారు. -
గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సైబర్ దాడులు
మోసాలకు ఫుల్స్టాప్ అనేదే ఉండదు. రోజుకో కొత్తరకం మోసం, వంచన వెలుగుచూస్తూనే ఉంటాయి. దొంగతనాలు, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసం, సైబర్ నేరాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజల నుంచి బడా అధిపతుల వరకు అందరిని మోసగాళ్లు దోచుకుంటూనే ఉన్నారు.తాజాగా దేశంలో సైబర్ దాడులు కూడా పెచ్చుమీరుతున్నాయి. నెట్వర్క్ సాధనాలు, కంప్యూటర్ సిస్టమ్, సర్వర్లు వంటి డిజిటల్ పరికారలకు చెందిన డేటాను దొంగిలించమే సైబర్ అటాక్. తమ తమ ప్రయోజనాల కోసం డేటాను దొంగిలించి, నాశనం చేయడం, మార్చడం వంటివి చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.అయితే రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ దాడుల కారణంగా దేశ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలుగుతోంది. దేశంలో 2033 నాటికి సైబర్‌టాక్‌లు 1 ట్రిలియన్కు పెరుగుతాయని PRAHAR అనే ఎన్జీవో అంచనా వేసింది. అదే 2047 నాటికి 17 ట్రిలియన్లకు చేరుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న హోదా, ఖ్యాతి కారణంగా దాడులు కూడా పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ మేరకు ప్రహార్ ‘ది ఇన్విజిబుల్ హ్యాండ్’ పేరుతో నివేదికను న్యూఢిల్లీలో నేడు ఆవిష్కరించింది.దీని ప్రకారం.. సైబర్‌టాక్‌లు లేదా సైబర్‌వార్‌ఫేర్ వంటివి భారత్‌కు వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పుగా తయారయ్యింది. సోషల్ మీడియా వాడకం, గేమింగ్, బెట్టింగ్ వంటివి ఆధునాతన సబైర్ మానిప్యులేషన్‌కు దారి తీస్తుంది., దేశంపై దాడులకు సాధనాలుగా మారుతున్నాయిసైబర్టాక్లు లేదా సైబర్‌వార్‌ఫేర్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పు. సైబర్‌స్పేస్ అనేది కొత్త యుద్దభూమి. దీనిపై భారత్ దాడికి దిగాల్సిందే. అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం మెరుగుదల, డిజిటల్ యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లను వైట్‌లిస్ట్ చేయడం, పౌరులకు అవగాహన కల్పించడం వంటివి ఎంతో అవసరం. పెరుగుతున్న సైబర్ దాడులు దేశంలో బలమైన సమగ్ర సైబర్ రక్షణ విధానం రూపొందించి, దాని అమలు చేసే ఆవశ్యకతను తెలియజేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా సైబర్‌టాక్‌లు 2024 మొదటి నెలలో 76% పెరిగాయి. బర్నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. దిని సైబర్ భద్రతా చర్యల అవసరాన్ని నొక్కి చెబుతుంది. గతేదాడి దేశం 79 మిలియన్లకు పైగా సైబర్ అటాక్‌లను ఎదుర్కొంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే మూడో స్థానంలో ఉంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 15% పెరుగుదలను గుర్తించింది. 2024 500 మిలియన్లకు పైగా అటాక్‌కు కనిపించాయి. 2024 రెండవ త్రైమాసికంలో సైబర్‌టాక్‌లు 46% పెరిగాయి.2024 మొదటి నాలుగు నెలల్లో, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు రూ. 1,750 కోట్లకు పైగా కోల్పోయారు. ఈ విషయం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 740,000 ఫిర్యాదుల ద్వారా వెల్లడైంది. బంగ్లాదేశ్ శ్రీలంక వంటి పొరుగు దేశాలలో ఇటీవలి రాజకీయ తిరుగుబాట్లు పరిణాల్లోనూ సైబర్ నేరస్థుల పాత్ర ఉండవచ్చనే సందేహాలను లేవనెత్తుతున్నాయి. సైబర్టాక్లపై నేషనల్ కన్వీనర్ & ప్రహార్ ప్రెసిడెంట్ అభయ్ మిశ్రా తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. ‘“సైబర్‌టాక్‌లు రెండు రకాలు. మొదటిది ఆర్థిక లాభం సిస్టమ్‌లలోని దుర్బలత్వాన్ని ఉపయోగించుకునే సాంప్రదాయ హ్యాకర్లు. రెండవది పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. బలవంతం, బెదిరింపుల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడానికి వారిని రిక్రూట్ చేస్తుంది. అక్రమ బెట్టింగ్ యాప్‌లలో ఇటువంటి వ్యూహాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వ్యూహం బంగ్లాదేశ్‌లో మోహరించిన విధానాలను కూడా పోలి ఉంటుంది, ఇక్కడ సాధారణ పౌరులను అస్థిరపరిచే సాధనాలుగా మార్చుతారు. ప్రభుత్వ సంస్థలను లోపల నుంిచి అణగదొక్కారు. భారత భద్రతా సంస్థలు అటువంటి అవకాశాల ప్రాబల్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలి’ అని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో అక్రమ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ ఉంది. ఈ విదేశీ యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌లు, భారతదేశ నిబంధనలకు వెలుపల ప్రత్యేకంగా యువతను డబ్బు కోసం లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తున్నాయి మరియు అదే డబ్బును తిరిగి దేశంలోకి మళ్లించి ఇబ్బందులను రేకెత్తిస్తాయి. అక్రమ ఆన్లైన్ జూదం, జూదగాళ్ల వల్ల కలిగే నష్టాలు రూ.1 లక్ష కోట్లుదాటవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ అప్లికేషన్ల ద్వారా జరిగే లావాదేవీలు సంవత్సరానికి రూ2 లక్షల కోట్ల (సుమారు USD 24 బిలియన్లు) వరకు చేరుకుంటాయని తెలిపింది.అయితే జాతీయ భద్రత పేరుతో గేమింగ్, ఆన్లైన్ జూదం ప్లాట్‌ఫామ్స్‌ను మూసివేయాలి. అలాగే దేశంలో ఆన్లైన్ సంస్థలను పరిమితులు విధించాలనిసూచించింది. చట్టవిరుద్ధమైన ప్లాట్‌ఫారమ్‌ల బారిన పడకుండా యువతను నిరోధించాలని తెలిపింది . -
Cybercrime: ఫేస్బుక్ టు వాట్సాప్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చేసే సైబర్ నేరగాళ్లు నానాటికీ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఫేస్బుక్, ఆపై డీపీ ఫ్రాడ్స్ చేసే ‘ఈ– నేరగాళ్లు’ ఇప్పుడు ఈ రెండిటినీ ‘కలిపేశారు’. ఫేస్బుక్ ద్వారా ఎంటరైన తర్వాత వాట్సాప్ డీపీ వరకు వెళ్తున్నారు. లాక్ చేయని ప్రొఫైల్స్‌లోని వివరాల ఆధారంగా చాటింగ్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కామ్స్‌లో ఆర్థిక నష్టం అంతగా లేకున్నా.. న్యూసెన్స్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఈ తరహా స్కామ్స్ పెరిగాయని చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రొఫైల్ లాక్ చేసినప్పటికీ ‘రిక్వెస్ట్’తో.. ఫేస్బుక్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై కొంత వరకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనే క మంది తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ని కచ్చితంగా లాక్ చేసి ఉంచుతున్నారు. అలా ఉన్న వాటిని కేవలం ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లు మాత్రమే చూడగలరు. దీనికి విరుగుడుగా సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎత్తు వేస్తు న్నారు. ఎక్కువగా యువతులు, కొన్ని సందర్భాల్లో సదరు ఫేస్బుక్ యూజర్‌కు పరియచం ఉన్న వారి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఆధారంగా తాము టార్గెట్ చేసిన వారికి రిక్వెస్ట్ పంపుతున్నా రు. దీన్ని యాక్సెప్ట్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లకు ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసే అవకాశం దక్కుతోంది. నకిలీ ప్రొఫైల్‌తో డబ్బు డిమాండ్.. ఇలా ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలోకి ఎంటర్ అవుతున్న సైబర్ నేరగాడు అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. దీని ఆధారంగా మెసెంజర్లో చాటింగ్ చేస్తూ డబ్బు అడగటంతో పాటు ఫ్రెండ్స్ లిస్టులోని వారికే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. వీటిని అందుకున్న వాళ్లల్లో అనేక మంది తమ స్నేహితుడే మరో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆపై వారితోనే ఇదే పంథా అవలంబిస్తున్నారు. మరోపక్క సదరు వ్యక్తి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారిలో ఎవరైతే తమ ప్రొఫైల్‌లో ఫోన్ నంబర్ ఉంచుతున్నారో వారిని మరో విధంగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న మొత్తాలే కావడంతో నో కంప్లైంట్.. సైబర్ నేరాల్లో ఎవరి పేరుతో అయితే నకిలీ ప్రొఫైల్, డీపీ క్రియేట్ అయ్యాయో... వారితో పాటు నగదు బదిలీ చేసిన వాళ్లు సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే.. సైబర్ క్రిమినల్స్ కొల్లగొడుతున్నది చిన్న మొత్తాలే కావడంతో అత్యధికులు పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది నేరగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. మరోపక్క ఫిర్యాదు, కేసు నమోదు జరిగినా.. ఉత్తరాదిలో ఉండే ఈ నేరగాళ్ల కోసం ఇక్కడ నుంచి పోలీసు బృందాలు పంపడం కష్టసాధ్యంగా మారింది. దీంతో చిన్న మొత్తాలతో ముడిపడి ఉన్న కేసుల్లో దాదాపు అన్నీ మూతపడటం కూడా నేరగాళ్లకు అనుకూలంగా మారుతోంది.ఆ ఫొటోలే వినియోగించి వాట్సాప్ డీపీ..సైబర్ నేరగాళ్లు తాము రూపొందించిన నకిలీ ప్రొఫైల్‌లోని ఫొటోలు, వర్చువల్ నంబర్లు వాడి వాట్సాప్ ఖాతాలు తెరుస్తున్నారు. వీటికి డీపీలుగా అసలు యజమానులవి పెడుతున్నారు. ఈ వాట్సాప్ ఖాతాల ఆధారంగా ఫ్రెండ్స్ లిస్టులోని వ్యక్తుల ఫోన్ నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో అడిగినట్లే వీటి ద్వారానూ అత్యవసరమని, గూగుల్ పే లిమిట్ అయిపోయిందని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందేశాలు అందుకునే ఎదుటి వ్యక్తుల్లో కేవలం డీపీలు మాత్రమే వాళ్లు తన స్నేహితుడు, బంధువు డబ్బు అడుగుతున్నాడని భావించి బదిలీ చేస్తున్నారు. -
దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్: దీని గురించి తెలుసా?
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే.. డిజిటల్ అరెస్ట్. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ అరెస్ట్మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.ఇప్పటికే సైబర్ మోసగాళ్ల భారిన పది ఎంతోమంది లెక్కకు మించిన డబ్బును కోల్పోయారు. ఈ జాబితాలో నోయిడాకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూజా గోయెల్ (రూ.60 లక్షలు మోసపోయారు), దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్‌కి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు (రూ. 93 లక్షలు), వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్ మొదలైనవారు ఉన్నారు.ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి?మీకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి భయపెడితే.. ఏ మాత్రం భయపడకుండా మీరే వారిని క్రాస్ క్వశ్చన్ చేయకండి. ఏదైనా డబ్బు అడిగినా.. లేదా భయపెట్టినా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా సంబంధిత అధికారులను కలిసి జరిగిన విషయాన్ని గురించి వివరించండి.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే.. హర్ష్ గోయెంకాఇటీవల పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో తెలియచేయడానికి ఒక ఆడియో క్లిప్ కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Beware of Scam Calls! Received a call from a 'CBI Officer' or any government official asking for sensitive details? It's a scam! Don't fall for it.Report any cybercrime at 1930 or https://t.co/pVyjABtwyF#I4C #CyberSafety #DigitalArrest #ReportScams #AapkaCyberDost pic.twitter.com/XBEJjKr6u0— Cyber Dost (@Cyberdost) October 5, 2024 -
సైబర్ వలలో ప్రముఖ పారిశ్రామికవేత్త: రూ.7 కోట్లు మాయం
వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్‌ను.. సైబర్ మోసగాళ్ల ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 7 కోట్లు మోసగించింది. దీనిని ఛేదిస్తూ పంజాబ్ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.ఎస్పీ ఓస్వాల్‌ను మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. ముఠాలోని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు, వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని ఆయన తెలిపారు.సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి డిజిటల్ అరెస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్దేశంలో ఇలాంటి సైబర్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియనివారు ఫోన్ చేసి బెదిరించినా? డబ్బు డిమాండ్ చేసినా? సంబంధిత అధికారులకు వెంటనే వెల్లడించడం ఉత్తమం. లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
Vizag: అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్ నగర్ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్‌లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. భారత్‌లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశాలకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఎఫ్‌బీఐ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.తొలుత థానేలోని కాల్ సెంటర్ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్‌కు సంబంధించిన సర్వర్‌ను అహ్మదాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరదరాబాద్, కోల్‌కతా, విశాఖలలోనూ ఈ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.దీంతో నగరంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సాగర్‌నగర్ ప్రాంతంలోని దేవీ ప్యారౖడెజ్లో నివాసం ఏర్పరచుకున్న అక్షయ్ పాత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్‌బాలి, ప్రితేష్ నవీన్ చంద్రపటేల్‌లను మురళీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయం
సైబర్ మోసానికి సంబందించిన మరో కేసు తెరమీదకు వచ్చింది. ముంబైకి చెందిన 59 ఏళ్ల రైల్వే అధికారి ఏకంగా రూ. 9 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఇదెలా జరిగింది? ఇలాంటి సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్)గా పని చేస్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు సెప్టెంబర్ 16న వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో జీరో ప్రెస్ చేయకుంటే మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుందని ఉండటంతో.. అతడు జీరో ప్రెస్ చేశారు.జీరో ప్రెస్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయింది. అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నారు. తనపైన (బాధితుడి మీద) మనీ ల్యాండరింగ్ కేసు నమోదైనట్లు, ఒక నకిలీ జడ్జి ద్వారా చెప్పించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ. 9 లక్షలు పంపించకుంటే చర్య తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించారు.కేసు నిజమేనేమో అని భయపడిన బాధితుడు తన ఖాతా నుంచి రూ. 9 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత పూర్తిగా మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటేటెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి మేము అధికారులము అని చెప్పినా.. మీకు సంబంధించిన వివరాలను అడిగినా.. నిర్థారించుకోకుండా వెల్లడించకూడదు. అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినట్లయితే.. పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు వెల్లడించాలి. తెలియని లేదా అనుమానాస్పద వాయిస్ మెసేజస్ లేదా టెక్స్ట్ మెసేజస్ వంటి వాటికి స్పందించకూడదు. -
సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
ఇప్పటివరకు మనుషులకు, జంతువులకు, వ్యాపారాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఏకంగా సైబర్ మోసాలకు కూడా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. దీనికోసం రోజుకు కేవలం మూడు రూపాయలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. సైబర్ మోసాల భారీగా పడి నష్టపోయిన ప్రజలు చాలామందే ఉన్నట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఈ నష్టాలను భర్తీ చేయడానికి చిన్న ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొన్ని సంస్థలు తీసుకురావడం జరిగింది.ఐడెంటిటీ చోరీ, డబ్బు పోగొట్టుకోవడం, ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూపింగ్, సైబర్ స్టాకింగ్ మొదలం వాటికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న మొత్తంలో కవరేజికి పనికొస్తాయి. ఈ రిస్క్ కవరేజీలు రోజుకు మూడు రూపాయల వద్ద లభిస్తున్నాయి. భారీ మొత్తంలో జీవిత భీమా, వెహికల్స్ ఇన్సూరెన్స్ మాదిరిగా లభించదు.ఇదీ చదవండి: ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఇందులో నకిలీ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్ మెసేజస్, ఫ్రాడ్ కాల్స్, పేస్ మార్పింగ్, ఓటీపీ వంటివి ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. నేరగాళ్లు ప్రజలను దోచుకోవాడానికి అన్ని విధాలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయలో పడితే.. భారీ నష్టాలను చవి చూడాలి ఉంటుంది. కాబట్టి ఈ భారీ నుంచు కొంత ఉపసమయం పొందటానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగోపడుతుంది. -
భారత్, యూఎస్ కంపెనీల సర్వర్లపై చైనా దాడి?
చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ ఇండియాతోపాటు అమెరికాలోని కొన్ని కంపెనీల సర్వర్లపై దాడికి పాల్పడినట్లు లుమెన్ టెక్నాలజీస్‌కు చెందిన బ్లాక్ లోటస్ ల్యాబ్స్‌లోని భద్రతా పరిశోధకులు తెలిపారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం వోల్ట్ టైఫూన్ అని పిలువబడే చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ అమెరికా, ఇండియాలోని ఇంటర్నెట్ కంపెనీలపై దాడికి పాల్పడింది. అందుకోసం కాలిఫోర్నియాకు చెందిన వెర్సా నెట్వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.చైనీస్ గ్రూప్ చేసిన ఈ సైబర్ దాడివల్ల అమెరికాకు చెందిన నాలుగు ఇంటర్నెట్ కంపెనీలు, భారత్‌లోకి ఒక కంపెనీ ప్రభావితం చెందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీలు నెట్వర్క్ కాన్ఫిగరేషన్ల నిర్వహణకు సహాయపడే వెర్సా నెట్‌వర్క్‌ల సాఫ్ట్‌వేర్‌లో లోపం కనుగొన్నారు. గతంలో వెర్సా బగ్‌ను గుర్తించి జూన్ 2023లో పరిష్కారాన్ని విడుదల చేసినప్పటికీ, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల తిరిగి దాడికి గురయ్యాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ సర్వర్లు యూఎస్‌లోని నీటి వసతి, పవర్ గ్రిడ్ వంటి కీలక సేవలందించే సాఫ్ట్వేర్లలో చొరబడ్డాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వోల్ట్ టైఫూన్ నిజానికి ‘డార్క్ పవర్’ అని పిలువబడే ఒక క్రిమినల్ గ్రూప్ అని, దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సైబర్అటాక్ల పేరుతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. -
Washington: ఎయిర్‌పోర్టుపై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు
ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంపై సైబర్ దాడి జరిగింది. దీంతో ఇంటర్నెట్, ఫోన్, ఈ- మెయిల్ ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రస్తుతం అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు 24 గంటలూ పనిచేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ), కస్టమ్స్ అండ్ సెక్యూరిటీతో సహా ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయన్నారు.డెల్టా, అలాస్కా ఎయిర్‌లైన్స్‌తో సహా కొన్ని విమానయాన సంస్థలు సైబర్ఎటాక్ కారణంగా సేవలను నిలిపివేశాయి. కాగా విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలని, బోర్డింగ్ పాస్‌లు, బ్యాగ్ ట్యాగ్లు' పొందేందుకు విమానయాన సంస్థల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించాలని కోరారు. -
బ్యాంక్ లింక్ పంపి.. రూ.11లక్షలు దోచేశారు
జనగామ: ఇంటి నిర్మాణానికి మూడేళ్లుగా బ్యాంకులో పొదుపు చేసుకుంటున్న సొమ్మును సైబర్ మాయగాళ్లు ఏపీకే లింక్ పంపి దాన్ని డౌన్లోడ్ చేయగానే క్షణాల్లో నగదును మాయం చేశారు. ఫోన్ ఔట్ గోయింగ్ పని చేయడం లేదని.. అనుమానం వచ్చి బ్యాంకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో సొమ్ము లేదని చెప్పడంతో ఖంగుతిన్నాడు సదరు ఖాతాదారుడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణం హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన పోలోజు రామేశ్వర్ ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. సొంతింటి కళను సాకారం చేసుకునేందుకు మూడేళ్ల క్రితం పునాది వేశాడు. అప్పటి నుంచి ఇంటి నిర్మాణానికి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేస్తూ స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.11లక్షల వరకు జమ చేశాడు. ఇంటి నిర్మాణ పనులకు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి కొంత నగదును డ్రా చేసుకుంటున్నాడు. కాగా ఈ నెల 8వ తేదీన వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన రామేశ్వర్.. తిరుగు ప్రయాణంలో తన ఫోన్‌కు యూనియన్ బ్యాంకుకు సంబంధించిన ఏపీకే యాప్ లింక్‌తో ఫేక్ మెసేజ్ వచ్చింది. బ్యాంకు ఖాతా సేఫ్టీ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ మోసగాడు పంపించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. సైబర్ నేరస్తుడు సదరు వ్యక్తికి ఎటువంటి అనుమానం కలుగకుండా తన ఫోన్ ఔట్ గోయింగ్ కాల్ వెళ్లకుండా చేశాడు. అదే రోజు రాత్రి రామేశ్వర్ యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.7 లక్షలు, శుక్రవారం రూ.4.21 లక్షలు, మొత్తంగా 16 లావాదేవీల ద్వారా రూ.11.21 లక్షల నగదును డ్రా చేసుకుని, రూ.142 మాత్రమే మి గిల్చారు. ఫోన్ కలవడం లేదని అనుమానం వచ్చిన బాధితుడు రి పేరు సెంటర్‌కు వెళ్లి సరి చేయగా, డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రా వడంతో అక్కడ నుంచి హుటాహుటిన బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అ ధికారులు ఖాతా నంబర్‌ను పరిశీలించిన తర్వాత పెద్ద మొత్తంలో డ బ్బులు డ్రా అయినట్లు తెలిపారు. ఇందులో రూ.9.21 లక్షల నగదు అ నుమానం కలుగకుండా డ్రా చేయగా, రూ.2లక్షలు మాత్రం చెన్నైలో ని సిద్దపుడూర్ సెంట్రల్ బ్యాంకు నుంచి రాహుల్ అనే వ్యక్తికి నెఫ్ట్ చేసిన ట్లు గుర్తించినట్లు బాధితుడు రామేశ్వర్ తెలిపారు. బాధితుడు పో లీ సులను ఆశ్రయించగా 1930కు ఫోన్ చేసి సైబర్ క్రైంలో ఫిర్యాదు చే యించారు. వెంటనే కేసును విచారించిన పోలీసులు, రూ.1.37 లక్షల ను హోల్డ్ చేసినట్లు మెసేజ్ వచ్చినట్లు రామేశ్వర్ తెలిపారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. -
అమీర్‌పేట కంపెనీపై సైబర్ అటాక్: రూ.10 కోట్లు..
టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే కాకుండా కొన్ని కంపెనీలను కూడా దోచేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ.. ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన ఓ ఎక్స్పోర్ట్ కంపెనీ సైబర్ దాడికి గురైంది. నేరస్థులు ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేయడానికి కంపెనీ ఈమెయిల్ సిస్టమ్ హ్యాక్ చేశారు. దుబాయ్ కంపెనీ నుంచి అమీర్‌పేట కంపెనీకి రూ. 10 కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం సంస్థ దుబాయ్ కంపెనీకి మెయిల్ పంపింది.దుబాయ్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అందులో అమీర్‌పేట సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ కాకూండా.. సిడ్నీలో ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంకు అకౌంట్‌కు డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్లో ఉండటం గమనించి వెంటనే స్పందించారు.వెంటనే గమనించిన అప్రమత్తమవ్వడంతో లావాదేవీలు జరగకుండా ఆపగలిగారు. ఈ సంఘటన జరిగిన తరువాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి అమీర్‌పేట కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 318, 319 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టం
టెక్నాలజీ పెరుగుతోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు అధిమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్/ క్రెడిట్‌కార్డు - ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో జరిగిన సైబర్ మోసాల వల్ల ప్రజలు రూ.177 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.69.68 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22లో ఇది రూ.80.33 కోట్లు, 2020-21లో రూ.50.10 కోట్లు, 2019-20లో రూ.44.22 కోట్లుగా ఉందని చెప్పారు. అనధికార లావాదేవీలు జరిగినపుడు బ్యాంకులు స్పందించి చర్యలు తీసుకునేంత వరకు కస్లమర్లే దీనికి బాధ్యత వహించాలి. ఈ లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగిన మూడు పనిదినాల్లోగా సంఘటనను రిపోర్ట్ చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్‌కు సాంకేతికలోపం కారణమని రుజువైతే దానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. ఏదేమైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు దృష్టికి తేవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు -
పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ
సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్ క్లిక్ చేస్తే చాలు అంటూ నెట్‌ఫ్లిక్స్ ఫాలో అనే యాప్ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్మెంట్ సైబర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరుకు చెందిన రవి ఫోన్ నంబర్‌ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసినట్టు నోటిఫికేషన్ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్ అడ్మిన్ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్ పెట్టింది. గ్రూప్ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్‌షాట్స్ షేర్ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్ సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు. ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్ పనిచేయకుండా పోయింది. మెసేజ్‌లకు అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నమ్మించిమోసం చేస్తారు.. అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గ్రూప్‌లు క్రియేట్ చేసి ఫలానా స్కీమ్ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్‌లు, వెబ్సైట్లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్‌సైట్‌ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు చేయండిలా దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది. https://www. cybercrime.gov.in./ వెబ్సైట్ ద్వారా, 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్/సాధారణ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్లైన్ బ్యాంకింగ్‌ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు ఇలా..» ఢిల్లీ 58,748» బిహార్ 42,029» ఛత్తీస్‌గఢ్ 18,147» తెలంగాణ 71,426» ఆంధ్రప్రదేశ్ 33,507» కర్ణాటక 64,301 » కేరళ 23,757 -
విండోస్‌లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్‌స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్‌స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్‌లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్‌లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్‌అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్‌లను బ్యాకప్ చేశాం. విండోస్‌లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్‌సైట్‌ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు.. మెసేజ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావటంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు.. బ్యాంకు అధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్‌ని సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు (ఏపీకే ఫైల్స్) పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.బ్యాంకుల పేరిట వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, వాటిని డౌన్లోడ్ చేస్తే మన మొబైల్‌ఫోన్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు. అదేవిధంగా మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన లింకులు వెళతాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్ లింకులను గానీ, ఏపీకే ఫైళ్లనుకానీ డౌన్లోడ్ చేసుకుంటే, సైబర్ నేరగాళ్లు మీ గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోసానికి గురయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
హ్యాకింగ్.. ‘పోలీస్’ షేకింగ్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీస్‌కు చెందిన హాక్ ఐ యాప్‌తోపాటు పోలీస్ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్‌కాప్ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్‌లు హ్యాక్ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్ ఐ యాప్ హ్యాకింగ్ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అయిందని.. రెండింటి హ్యాకింగ్ ఒకే హ్యాకర్ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. హాక్ ఐ యాప్ హ్యాకింగ్‌కు గురవడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌శాఖకు సంబంధించిన కీలక యాప్‌ల హ్యాకింగ్ నిజమేనని.. రెండింటిని హ్యాక్ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్‌కాప్ యా ప్ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్‌లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్‌కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్ వివరాలు, క్రైం సీన్ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్‌కాప్ యాప్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్ హ్యాక అవడంపై పోలీస్‌శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో డేటా అమ్మకం? టీఎస్‌కాప్ యాప్‌లోని యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి.. తన డిజిటల్దత్తా పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో ‘టీఎస్‌కాప్ సహా మొత్తం తెలంగాణ కాప్‌ల నెట్‌వర్క్‌ను ఎవరో హ్యాక్ చేశారు.ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీ.. యాప్‌లో పాస్‌వర్డ్‌లను ప్లెయిన్ టెక్ట్స్‌గా పొందుపర్చడం, యాప్ సీసీటీఎన్ఎస్కు కనెక్ట్ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ ఫోరమ్‌లలో నమూనా డేటాను పోస్ట్ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. హ్యాకింగ్ క్రైం ఫోరం అయిన బ్రీచ్ ఫోరమ్స్‌లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్‌కాప్, హాక్ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు , అడ్రస్‌లు 1,30,000 ౖ రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక విభాగాలు, పోలీస్ అధికారుల వివరాలు కూడా..? హాక్ ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడంతో.. సైబర్ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, సీసీఆర్బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్ రూమ్‌లు, సీపీ ఆఫీస్‌లు, డీసీఆర్బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్‌లు, స్పెషల్ యూనిట్లు, టాస్‌్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్‌కాప్ యాప్‌కు గతంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోవడంతో హ్యాకింగ్ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్‌పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
Apple Security Alert: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ కీలక సూచన చేసింది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్‌బుక్స్,ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లు వినియోగిస్తున్న యూజర్లకు హై-రిస్క్‌లో ఉన్నారని హెచ్చరించింది. నేరస్తులు సైబర్ దాడులు చేసేందుకు వినియోగించే ఆర్బిటరీ కోడ్ యాపిల్ ఉత్పత్తుల్లో గుర్తించినట్లు సీఈఆర్టీ తెలిపింది. సైబర్ నేరస్తులు వినియోగించే ఈ ఆర్బిటరీ కోడ్ కారణంగా యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌లకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా యాపిల్ సఫారీ వెర్షన్ ప్రైయర్ టూ 17.4.1, యాపిల్ మాక్ఓఎస్ వెంచురా వెర్షన్ ప్రైవర్ టూ 13.6.6, యాపిల్ మాక్ ఓస్ సోనోమా వెర్షన్ ప్రైవర్ టూ 14.4.1, యాపిల్ ఓఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 1.1.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఓస్ వెర్షన్ ప్రైయర్ టూ17.4.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 16.7.7లపై ప్రతి కూల ప్రభావం ఎక్కువ ఉందని సూచించింది. టెక్ నిపుణుల అభిప్రాయం మేరకు ఐఫోన్ ఎక్స్ఎస్, ఐపాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐపాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐపాడ్ ప్రో 11 అంగుళాలు, ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ మినీ వినియోగదారులు 17.4కి ముందు ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లను వినియోగిస్తుంటే వాటిపై సైబర్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. అదనంగా, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫాడ్ 5, ఐపాడ్ ప్రో 9.7-అంగుళాల,12.9-అంగుళాల 1వ తరం ఐపాడ్ ప్రోలను వినియోగిస్తున్న యూజర్లు తమ పరికరాలను ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లు 16.7.7 లేదా తర్వాతి వెర్షన్లకు అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. -
అదంతా ఇన్ఫోసిస్ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్ నిందలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys )డేటా లీకేజీ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా ( Bank of America ) తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ ( Infosys McCamish Systems )కారణమని ఆరోపించింది. ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్కామిష్ సిస్టమ్స్, గత ఏడాది నవంబర్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సంఘటనతో ప్రభావితమైంది. దాని ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్లు, సిస్టమ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్కామిష్ అనేది ప్లాట్‌ఫారమ్-ఆధారిత బీపీవో సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్కామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ బీపీఎం (గతంలో ఇన్ఫోసిస్ బీపీవో) కొనుగోలు చేసింది. "2023 నవంబర్ 3 సమయంలో ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ (IMS)లో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్‌లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్ అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండవచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్‌లపై ఎటువంట ప్రభావం లేదు" అని కస్టమర్లకు అందించిన నోటీసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! -
వాట్సప్‌లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. దానికితోడు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. సామాన్యులు, చదువురానివారు, బాగా చదువుకున్నవారు, పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు సైబర్‌దాడికి బలవుతున్నవారే. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం వాట్సప్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాక దాదాపు గరిష్ఠకాలం వాట్సప్‌లోనే గడుపుతుంటాం. అందులో వివిధ వ్యక్తులతో అన్ని వివరాలు చర్చించుకుంటాం. గోప్యంగా ఉండాల్సిన చాలా వివరాలు స్కామర్లు తెలుసుకుని ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మనల్ని వేదిస్తే చాల ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సప్‌కాల్స్‌తో జాగ్రత్త.. తెలియని నంబర్ల నుంచి సైబర్ నేరస్థులు నేరుగా కాకుండా వాట్సప్‌లో మిస్డ్ కాల్ చేస్తుంటారు. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేసేంతవరకు రింగ్ అవుతుంది కదా. ఈ స్పామ్ కాల్స్ రెండు మూడు రింగ్‌ల తరువాత కాల్ కట్ అవుతుంది. అన్నోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఈ విషయాన్ని గ్రహించాలని చెబుతున్నారు. హ్యాకర్స్ యాక్టివ్ వినియోగదారులను గుర్తించేందుకు ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రిసెర్చ్(బీపీఆర్డీ) పేర్కొంది. నిరుద్యోగులకు ఎర.. ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఒక సమస్య అయితే. వారిని సైబర్ నేరస్థులు ట్రాప్ చేసి వేదింపులకు గురిచేయడం మరో సమస్యగా మారుతుంది. నిరుద్యోగులకు గుర్తించి స్కామర్లు వారికి వాట్సప్‌లో మెసేజ్‌లు పంపుతారు. అప్పటికే ఎన్నో ఒత్తిడులతో ఉన్న నిరుద్యోగులు వాటిని నమ్మి వాటికి రిప్లై ఇస్తున్నారు. దాంతో మన ఫోన్లోని వివరాలు వారికి చేరుతున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరిట విభిన్ని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరమై వివరాలు పంపించాల్సి వస్తే క్రెడబిలిటీ ఉన్న ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే వీలైతే నేరుగా వెళ్లి కలిసి సదరు కంపెనీలతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు చోరీ.. వాట్సప్‌లో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్‌ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్లో భాగంగా తమ స్క్రీన్‌ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం ఖాతాలోని డబ్బు కొల్లగొడుతున్నారు. ఇదీ చదవండి: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ట్రేడింగ్ సలహాలతో.. కరోనా తర్వాత మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో ఆ లాభాలు చూపించి సామాన్యులకు ఎరవేస్తున్నారు. ట్రేడింగ్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లో లేని అనధికారిక అప్లికేషన్ లింక్‌లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు కొట్టేస్తున్నారు. -
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపీఐ యాప్స్ వినియోగం బాగా పెరిగింది. దీంతో చాలా మంది జేబులో డబ్బు పెట్టుకోవాలన్న సంగతే మరచిపోయారు. ఎక్కడికెళ్లినా స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. కిరాణా కొట్టులో వస్తువులు కొనే దగ్గర నుంచి షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసే వరకు అన్నీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్ల ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగలిస్తున్నారు. ఇది ఆ తరువాత రోజుల్లో ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది. యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే అది యూజర్లను ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ చెల్లించాల్సిన పేమెంట్ ఎంటర్ చేసి చెల్లిస్తారు. కానీ సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన తరువాత అది కూడా వేరొక వెబ్‌సైట్‌కి కనెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ సాధారణంగా నిజమైన వెబ్సైట్ మాదిరిగానే కనిపిస్తుంది. అందులో యూజర్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని చెబుతుంది. దీనిని నమ్మి వినియోగదారుడు సమాచారం ఎంటర్ చేస్తే.. వివరాలన్నీ కూడా స్కామర్‌కు వెళ్ళిపోతుంది. యూజర్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్కామర్ అకౌంట్ నుంచి డబ్బు కాజేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చెబుతారు.. ఇదేగానీ జరిగితే యూజర్ పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ ఇలాంటి స్కామ్ నుంచి తప్పించుకునే మార్గాలు! బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లో స్కాన్ చేయకూడదు. క్యూఆర్ కోడ్లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఇమెయిల్ రూపంలో వస్తే వాటిని స్కాన్ చేయకూడదు. సోషల్ మీడియాలో కనిపించే క్యూఆర్ కోడ్ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. లింక్‌ను కలిగి ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేముందు, యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెబ్సైట్లోకి తీసుకెళ్తే.. అలాంటి వాటిని విస్మరించడం మంచిది. ఇలాంటి మోసాలను నివారించడానికి బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. మీ డిజిటల్ అకౌంట్స్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. -
‘డిజిటల్ అరెస్ట్’ గురించి తెలుసా..?
పదేళ్ల కిందట క్రైమ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా.. క్రైమ్ జరిగేతీరు, దాని విధానం, రూపం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి షాపింగ్ చేయటం తెలిసిందే. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగడం మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం..డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. అయితే తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే.. సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఇలాంటిదే. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్ అరెస్ట్’. డిజిటల్ అరెస్ట్ కొత్త సైబర్ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం. నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్‌ను ట్రాన్స్ఫర్ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్ కాల్ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక గానీ కాల్ కట్ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. మరేం చేయాలంటే.. భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్‌ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు. -
రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
సైబర్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేస్తున్నారు. రుణయాప్‌ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్‌లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే.. వస్తువులు విక్రయిస్తామంటూ.. ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటూ.. మోసగాళ్లు పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్‌లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్‌ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. పార్సిళ్ల పేరుతో.. సైబర్ నేరస్థులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. అప్‌గ్రేడ్ చేస్తామంటూ.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు. -
ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే..
సైబర్ నేరస్థులు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అదే కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఆసక్తి. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. కానీ ప్రస్తుతం అధికారికంగా విడుదలైన తర్వాతే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే భావనతో ఇతర ప్లాట్ఫామ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. అలా జనాలు చేస్తున్న ప్రయత్నాలే సైబర్ నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్ ఛానల్‌ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇదీ చదవండి: ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..! సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్ లోడ్ అనే లింక్‌లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే పాప్అప్ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. -
ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్‌లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు.. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి. 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది. దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి. 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి. టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్‌లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది. ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ.. రిస్క్ మేనేజ్మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది. -
డార్క్‌వెబ్‌లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్‌వెబ్‌లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్‌వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్‌గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం!
ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు కొత్త అవతారాల్లో పుట్టుకొస్తున్నాయి. గతంలో బ్యాంక్ నుంచి కాల్ చేసినట్లు ప్రజలను మోసం చేసి ఓటీపీ వంటి వివరాలను తెలుసుకుని అకౌంట్లలో ఉండే డబ్బు మాయం చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు అవసరం లేకుండానే డబ్బు కాజేయడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టేసారు. దీంతో మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ము మాయమైపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల బెంగళూరులో 'చెన్నకేశవ' అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దెబ్బకు రూ.38,000 పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ మోసం స్విగ్గీ ఖాతా ద్వారా జరిగినట్లు తెలిసింది. ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్న చెన్నకేశవకు స్విగ్గీ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న చెన్నకేశవ ఆర్డర్ నిర్దారించాడని ఒకటి నొక్కండి, లేకుంటే రెండు నొక్కండి అంటూ వచ్చింది. దీంతో అతడు ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి ఒకటి నొక్కాడు. ఈ క్రమంలోనే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెసేల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు ఎంటర్ చేసాడు. కానీ మళ్ళీ ఓటీపీలు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తానికి అతని ఖాతా నుంచి ఏకంగా సైబర్ నేరగాళ్లు రూ. 38,720 ఖర్చు చేసినట్లు తెలుసుకున్నాడు. ఇదీ చదవండి: ఇలా ఎలా అనిపించిన ఓలా.. జరిగిన మోసాన్ని గ్రహించిన చెన్నకేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని Swiggy ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, హిస్టరీ వివరాలు మొత్తం డిలీట్ చేసినట్లు కనిపించింది. ఈ సంఘటనపై స్విగ్గీని కూడా సంప్రదించారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని, అప్పటి వరకు చెన్నకేశవ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా లేజీపే ముందస్తు చర్యలు చేపట్టి తదుపరి అనధికార మినహాయింపులను నిరోధించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్విగ్గీ యూజర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తాను ఉపయోగించిన బెడ్‌ను విక్రయించడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 68 లక్షల నష్టాన్ని చవిచూశాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసం ఉంటూ నగరంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ మోసానికి బలైపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన 36 సంవత్సరాల ఇంజినీర్ రూ. 15000లకు బెడ్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్ యాప్‌లో ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఇది చూసి కొనుగోలు చేయాలనుకున్న ఓ వ్యక్తి (మోసగాడు), బెడ్ అమ్మాలనుకున్న ఇంజినీర్‌కు ఫోన్ చేసాడు. ఇంజినీర్ వెల్లడించిన ధరకే కొనుగోలు చేస్తానని చెప్పిన మోసగాడు UPI లావాదేవీకి సంబంధించిన సాంకేతిక సమస్యలున్నట్లు, పరిష్కరించుకోవడంలో భాగంగా తనకు రూ. 5000 పంపాలని వెంటనే తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మోసగాని మాటలు విన్న టెకీ రూ. 5వేలు పంపించాడు. మోసగాడు మొదట్లో రూ. 10వేలు పంపించాడు. ఇలాగే మళ్ళీ రూ. 5వేలు, రూ. 10వేలు, రూ. 15వేలు డిమాండ్ చేస్తూ మొత్తానికి భారీగానే సబ్బు గుంజేసాడు. ఇదీ చదవండి: ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ డబ్బు పంపించే క్రమంలో మోసగాడు టెకీకి రూ. 30000 షేర్ చేసాడు. మోసగాడు టెక్కీని లింక్‌ను ఉపయోగించి డబ్బును తిరిగి ఇవ్వమని, OTPని షేర్ చేయమని కోరాడు. ఇంజనీర్ OTP ట్రాప్‌లో పడిపోగానే, అతను ఏకంగా 68 లక్షల రూపాయల కోల్పోయాడు. రూ. 68 లక్షలు పోగొట్టుకున్న టెకీ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సైబర్ లేదా ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా మోసాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. -
సైబర్ వల నుంచి తప్పించుకోవాలంటే ఇలా చెయ్యండి చాలు!
విజయవాడ: విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువకుడు పీజీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతగా వ్యాపారం చేయాలన్నది అతని కల. ‘ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసి నెలనెలా రూ.లక్షల్లో సంపాదించొచ్చు’ అంటూ వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ అతడిని ఆకట్టుకుంది. మెసేజ్ పంపిన వారితో చాటింగ్‌లో పరిచయం పెంచుకున్నాడు. ‘కొన్ని వెబ్ లింక్‌లు ఓపెన్ చేసి టాస్క్‌లు పూర్తి చేస్తే వెంటనే నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని’ సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. రిజిస్ట్రేషన్‌కు కొంత నగదు చెల్లించి తొలి రెండు టాస్క్‌లు పూర్తి చేయగానే నగదు చెల్లించారు. ఆ తరువాత ఆ యువకుడు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్‌లు కొని పూర్తిచేశాక అతని వ్యాలెట్‌లో డబ్బు కనిపించినా విత్‌డ్రా కాకపోవడంతో సదరు వ్యక్తులను వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్‌తో సంప్రదించాడు. ‘ఏదో ఎర్రర్ వస్తుంది.. మీరు టాస్క్‌లు పూర్తి చేయండి.. నగదు ఎక్కడికీ పోదు’ అని నేరగాళ్లు అతడిని భరోసా ఇచ్చారు. వారిని నమ్మి విడతల వారీగా రూ.80 లక్షలు చెల్లించాక మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ నేరస్తుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. మోసం చేసేది ఇలా.. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీతో మోసాలకు తోడు టెలిగ్రాం, వాట్సాప్‌ల సాయంతో ఉద్యోగ, వ్యాపార ప్రకటనతో నిరుద్యోగులు, చిరుద్యోగులు, మధ్యతరహా వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. పలు మార్గాల ద్వారా ప్రజల ఫోన్ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ముందుగా వాట్సాప్/ టెలిగ్రాంలో ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. ఇంట్లో కూర్చుని, ఖాళీ సమయంలో పని చేస్తే కుటుంబ ఖర్చులౖకైనా వస్తాయన్న ఆశతో ఉన్న వారిని సైబర్‌నేరగాళ్లు చాటింగ్‌తో ముగ్గులోకి దింపుతారు. చాటింగ్‌కు నంబర్లు కనిపించని టెలిగ్రాం యాప్‌నే నేరగాళ్లు ఉపయోగిస్తారు. వర్క్ ఎలా చెయ్యాలి, ఇన్‌స్టా, ఫేస్బుక్, యూ ట్యూబ్ వీడియోలకు ఎలా లైక్‌లు కొట్టాలి, ఎలా షేర్ చేయాలి, ఎంత డబ్బు వస్తుంది.. అనే విషయాలను చాటింగ్‌లోనే వివరిస్తారు. మచ్చుకు కొన్ని వీడియోలను వాళ్లే పంపించి టాస్క్‌లు ఇస్తారు. నమ్మించేందుకు తొలి రోజే కొంత నగదును వారి బ్యాంక్ ఖాతాలో వేస్తారు. రెండో రోజూ కొన్ని టాస్క్‌లు ఇచ్చి నగదు చెల్లిస్తారు. ఆ తరువాత నుంచి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే పేరున్న కంపెనీలు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు రేటింగ్ ఇవ్వాలని, ఈ పని రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. వెబ్సైట్ వాలెట్లో డిపాజిట్ సొమ్ము, ప్రాఫిట్, విత్‌డ్రా వివరాలు నిత్యం స్క్రీన్‌పై కనపడుతూనే ఉంటాయని నమ్మబలుకుతారు. సొమ్ము డిపాజిట్ చేసి టాస్క్‌లో దిగిన తరువాత.. చెల్లించిన సొమ్ముకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కలిపి ప్రాఫిట్ బాక్స్‌లో చూపిస్తారు. అయితే ఆ డబ్బు విత్‌డ్రా అవ్వదు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరి కొంత నగదు చెల్లించి రెండో టాస్క్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ప్రాఫిట్ బాక్స్‌లో ఉన్న నగదు కంటే డిపాజిట్ చేయాల్సిన నగదును తక్కువగానే చెబుతారు. ప్రాఫిట్ బాక్స్‌లో ఎక్కువగా ఉన్న నగదును చూసి ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లకు బాధితులు నగదు చెల్లిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి మాయగాడని తెలుసుకునే లోపు రూ.లక్షల్లో మోసపోతారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న మోసాలు.. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 కేసులు నమోదు చేస్తున్నాం. ఇటీవల ఓ యువతి రూ.10 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేసింది. సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతోనే ప్రజలు మోస పోతున్నారు. 'ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నెలకు జీతం ఇస్తాడే కానీ మన నుంచి ముందుగా డబ్బులు తీసుకోడనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.' ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్, విజయవాడ ఇవి చదవండి: కడపలో తల్లీతనయుల అదృశ్యం! -
మహిళను ముంచిన ‘మ్యాట్రిమోని’ ప్రేమ!
హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లో పరిచయం చేసుకొని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో రిజిస్టార్ చేసుకుంది. ఈ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తాను అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తినని, అమెరికా నుంచి ఇండియా వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో ఉన్న తమ బంధువులకు సీరియస్‌గా ఉందని, వైద్యం చేయించాలని చెప్పి ఆ ఖర్చులకు గాను డబ్బులు కావాలని అడిగాడు. తాను ఇండియా వచ్చాక మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని, తర్వాత పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించాడు. దీంతో ఆ మహిళ విడతల వారిగా రూ. 30 లక్షలు చీటర్స్ చేప్పిన విధంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ తరహా మ్యాట్రిమోని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వారితో ఆన్లైన్లో ప్రేమ, పెళ్లి అని చెబితే నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
'పార్ట్ టైం జాబ్' కోసం ఈ లింక్ క్లిక్ చేస్తున్నారా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, సంగారెడ్డి: పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన మెసేజ్ కు స్పందించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఒకరు రూ.3 లక్షల 55 వేలు, మరొకరు రూ.7 లక్షల 48 వేలు మోసపోయిన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్పూర్ పరిధిలోని బంధన్ కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్‌టైం జాబ్ పేరుతో నవంబర్ 2న మెసేజ్‌కు వచ్చింది. దీనికి స్పందించిన అతను తన వివరాలను నమోదు చేసి నగదు పెడుతూ అపరిచిత వ్యక్తి ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేశాడు. మొత్తం మూడు లక్షల 55 వేలు పెట్టాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్‌టైం ఉద్యోగం పేరిట నవంబర్ 4వ తేదీన మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ముందుగా రూ.2000 చెల్లించి, టాస్కులు చేస్తూ వచ్చాడు. అయితే అపరిచిత వ్యక్తి పెట్టిన నగదును, వచ్చిన కమిషన్లు క్రియేట్ చేసిన వాలెట్లో చూపిస్తూ వచ్చాడు. చివరికి దీంతో తాను పెట్టిన రూ.ఏడు లక్షల 48 వేలతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం! -
ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు, కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు మోసగాళ్లు ఫోన్ చేసి మీ సిమ్ కార్డు సర్వీస్ నిలివేస్తున్నట్లు, ఆలా జరగకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చేయాలని చెబుతున్నారు. ఇలాంటి మోసాలపైన 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DOT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వినియోగదారులకు ఫోన్ చేసి మరి కొన్ని గంటల్లో సిమ్ డీయాక్టివేట్ అవుతుందని, సర్వీస్ నిలిపివేయనున్నట్లు భయపెడుతూ.. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని వివరాలు కావాలని అడుగుతారు. ఇది నిజమే అని నమ్మి వివరాలు వెల్లడిస్తే మోసాలు జరుగుతాయని DOT వెల్లడిస్తూ.. ఎవరూ ఇలాంటి వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఇలాంటి కాల్స్ తరచూ వస్తే, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కి ఫిర్యాదు చేయవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ పేర్కొంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ అరికట్టడానికి కొన్ని సంస్థలతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్ అటాక్
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీరంగం దూసుకుపోతోంది. దానికితోడు మోసాలూ అదే మాదిరి పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి దిగ్గజ సంస్థల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్‌పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన చైనాకు చెందిన ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ)పై సైబర్‌దాడి జరిగినట్లు సమాచారం. ఆ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న అమెరికాలోని ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే సైబర్ దాడిని వెంటనే గుర్తించినట్లు ఐసీబీసీ తెలిపింది. ఈ దాడి ఎవరు చేశారనే విషయాలను వెల్లడించలేదు. దీనిపై పూర్తి విచారణ జరగాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సైట్లను పునరుద్ధరించేందుకు తమ భద్రతా నిపుణుల బృందం పనిచేస్తుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన యూఎస్ ట్రెజరీ ట్రేడ్లు, గురువారం నాటి స్వల్పకాల రుణాలైన రెపో ఫైనాన్సింగ్ ట్రేడ్లను విజయవంతంగా క్లియర్ చేసినట్లు ఐసీబీసీ చెప్పింది. అయితే ఈసైబర్‌దాడికి సంబంధించి ఫెడరల్ రెగ్యులేటర్లతో పాటు ఆర్థిక రంగ నిపుణులతో నిత్యం పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం వివరించింది. చైనాతో సంబంధం లేకుండా యూఎస్ కార్యకలాపాలు స్వతంత్రంగా జరుగుతాయని ఐసీబీసీ వెల్లడించింది. మార్కెట్‌పై ఈ ఘటన పరిమిత ప్రభావాన్ని చూపినట్లు బ్రోకర్ డీలర్ కర్వేచర్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్క్రిమ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ సైబర్‌దాడి తర్వాత ఐసీబీసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం సైబర్‌దాడికి ఉపయోగించిన సాఫ్ట్వేర్ వివరాలు లభించినట్లు సమాచారం. స్వీడిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రూసెక్ వ్యవస్థాపకుడు మార్కస్ ముర్రే మాట్లాడుతూ ఈ దాడికి లాక్‌బిట్ 3.0 అనే రాన్సమ్వేర్ను ఉపయోగించారని చెప్పారు. ఈ రకమైన రాన్సమ్వేర్ అనేక మార్గాల్లో సంస్థలోని సాఫ్ట్‌వేర్‌లో ప్రవేశించే అవకాశం ఉందని ముర్రే అన్నారు. ఉదాహరణకు ఎవరైనా ఈమెయిల్‌లోని స్పామ్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఇది సాఫ్ట్‌వేర్‌లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడం దీని లక్ష్యమన్నారు. ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి లాక్‌బిట్ 3.0 ప్రతిదశలో మాల్వేర్కు ప్రత్యేకమైన పాస్వర్డ్ అవసరం ఉంటుంది. అది చేధించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ లాక్‌బిట్ 3.0ని ‘రూపాలు మారుస్తూ తప్పించుకునేది’గా భావిస్తారు. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన అన్ని రాన్సమ్వేర్ దాడుల్లో 28శాతం లాక్‌బిట్ ద్వారా జరిగినవేనని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫ్లాష్‌పాయింట్ నివేదిక చెబుతుంది. -
ఆస్పత్రులపై సైబర్ నీడ..వెలుగులోకి షాకింగ్ విషయాలు!
సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్‌మెయిల్‌తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్‌వేగస్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..లాస్‌వేగస్‌లోని ప్లాస్టిక్‌సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్‌కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్‌కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్‌కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్‌కేర్ సెక్టార్‌కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్‌కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్‌లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్‌వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' (Resecurity) వెల్లడించింది. లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే.. డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్‌లో కొవిన్ వెబ్సైట్ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. ఆధార్ వివరాలతో హ్యాకర్స్ ఏం చేస్తారు! భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్ దోపిడీలు, ట్యాక్స్ రిఫండ్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. -
వారానికి జరిగే సైబర్ అటాక్‌లు ఎన్నంటే..
భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్‌పుర్‌కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్‌ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ షాపింగ్‌లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్‌లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్‌తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్‌నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
ఏంటి.. ఈ యాప్ డౌన్లోడ్ చేశారా !? అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే!
భద్రాద్రి: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. లక్కీ డ్రా వచ్చిందని, విలువైన వాహనాలు, వస్తువులు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ పెట్టి ఓటీపీ నంబరు తెలుసుకుని, అకౌంట్లలో నగదు జమ చేయించుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా యాప్‌లో పెట్టుబడి పెడితే రోజూ కొంత మొత్తం చొప్పున నిరంతరం తిరిగి డబ్బు జమచేస్తామని నమ్మించారు. సుమారు రూ. 2.5 కోట్లు కాజేశారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పలువురు పాక్స్కాన్ యాప్‌లో పెట్టి ఆర్థికంగా నష్టపోయారు. బుధవారం ఈ యాప్ అకస్మాత్తుగా క్లోజ్ అవడంతో లబోదిబోమంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని దమ్మపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా మూడు నెలల క్రితం పాక్స్కాన్ అనే యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. కేవలం లింక్ ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి పంపుకున్నారు. లింక్ ద్వారా యాప్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న పలువురు యువకులు పెట్టుబడి పెట్టారు. రూ.500 నుంచి ప్రారంభమై రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టవచ్చని, రూ.500 పెట్టుబడి పెడితే రోజూ రూ.12.50 చొప్పన తిరిగి వస్తాయని, యాప్ లింక్‌ను వేరొకరికి పంపి పెట్టుబడి పెట్టిస్తే, అందులో 10 శాతం కమీషన్ వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మించారు. మొదటిలో పెట్టుబడిన పెట్టిన వారికి రోజూ డబ్బులు తిరిగి పంపించారు. దీంతో నమ్మకం కుదిరి వారు మళ్లీ ఎక్కువ పెట్టుబడి పెట్టారు. వారిని చూసి మరికొందరు యువత కూడా యాప్‌లో పెట్టుబడి పెట్టారు. ఇలా 250 మంది వరకు పెట్టుబడి పెట్టి, ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు కూడా క్రియేట్ చేసుకున్నారు. కాగా రెండు వారాల క్రితం పెట్టిన పెట్టుబడి మొత్తం 10 రోజుల్లో తిరిగి ఇస్తామని యాప్ ద్వారా ప్రచారం చేయాగా చాలామంది రూ.5 వేల నుంచి రూ. లక్ష చొప్పున రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. పది రోజుల గడిచినా ఎవరికీ తిరిగి రూపాయి ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు గురయ్యారు. ఇంకా తిరిగి వస్తాయనే ఆశతో ఎదురుచూస్తుండగా మంగళవారం రాత్రి పాక్స్కాన్ యాప్‌ను ఆన్లైన్లో పూర్తిగా క్లోజ్ చేశారు. టెక్నికల్ సమస్యగా భావించిన పెట్టుబడి దారులు, వేచిచూసి బుధవారం యాప్‌ను ఒపెన్ చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాలేదు. దీంతో తాము తీవ్రంగా మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. -
ఈ ఒక్క క్లిక్ చేశారో.. మీ ఖాతా ఖాళీ..!
జగిత్యాల: సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరు కోసం వచ్చిన కొత్త యాప్‌ను క్లిక్ చేయగా.. ఓ వ్యక్తి రూ.1.67 లక్షలు మోసపోయిన సంఘటన పెగ్గెర్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడి సెల్‌ఫోన్ సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరుకు సంబంధించి ఓ యాప్ క్లిక్ చేయాలని సందేశం వచ్చింది. ఆ యువకుడు యాప్‌ను క్లిక్ చేశారు. మొదటగా రూ.1,250 చెల్లించాలని బ్యాంక్ ఖాతా నంబరు పంపించారు. ఆ యువకుడు రూ.1,250 చెల్లించారు. ఇలా రూ.1.67 లక్షలు చెల్లించాక రుణం మంజూరు కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
వ్యక్తిగత డేటా సేఫ్‌గానే ఉందా?.. తెలియాలంటే..
వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్‌మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత డిజటల్ హక్కులలో... యాక్సెస్ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే... ఆన్లైన్ షాపింగ్: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్ నెంబర్, క్రెడిట్‌కార్డ్ వివరాలు, ప్రొడక్ట్ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. డేటింగ్ యాప్‌లు... పేరు, జెండర్, వయసు, సెక్కువల్ ఓరియెంటేషన్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ చాట్, పొలిటికల్ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్ డివైజ్ సమాచారం, ఐపీ అడ్రస్.. ఈ యాప్ ద్వారా బహిర్గతం అవుతాయి. సెర్చ్ ఇంజిన్లు.. ఆన్లైన్ సెర్చింగ్, బ్రౌజింగ్ హిస్టరీ, ఆన్లైన్ ఆసక్తులు, షాపింగ్ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, పరికర సమాచారం, డౌన్లోడ్ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్ యాడ్–ఆన్లు.. ద్వారా జరుగుతుంటుంది. సోషల్ మీడియా.. పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, ఫైల్స్, ఫోన్ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్ గ్రూప్, గ్రూప్ చాట్స్, పోస్టులు, ట్యాగ్ చేసిన ఫొటోలు అండ్ వీడియోలు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతుంటాయి. గుర్తించదగిన సమాచారం.. మీ పుట్టిన రోజు లేదా ఫోన్ నెంబర్ వంటివి పబ్లిక్ రికార్డ్‌లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సురక్షిత చర్యలు.. చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి. భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్ 69 బి) సెక్షన్ 69ఎ సి) సెక్షన్ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్ వర్డ్స్ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఫిషింగ్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయరాదు. డేటా కేర్ సాఫ్ట్వేర్/యాప్స్‌ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ∙ మీ బ్రౌజర్‌ని అప్డేట్ మోడ్‌లో ఉంచాలి. https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయాలి https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్ పూర్తి హెడర్‌ను చెక్ చేయాలి మీ యాప్‌లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్ చేయాలంటే.. మీ ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ల్లో సెర్చ్ చేయచ్చు. (a) https://amibeingpwned.com (b) https://snusbase.com (c) https://leakcheck.net (d) https://leaked.site (e) https://leakcorp.com/login (f) https://haveibeensold.app. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..) -
ఓ సైబర్ అపరిచితుడు.. సర్వేయర్లే టార్గెట్‌గా..!
మహబూబాబాద్: సైబర్ నేరస్తులు కొత్త కొత్త రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులకు జాబ్స్ పేరిట.. లంచాలు తీసుకున్న వారిని ఏసీబీ కేసు నుంచి తప్పిస్తామంటూ టోకరా వేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసానికి ఓ వ్యక్తి పాల్పడగా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకుంటూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోని సర్వేయర్‌గా పని చేస్తున్న కొందరు ఉద్యోగులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. మోసానికి పాల్పడుతున్న తీరు ఇలా.. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న సర్వేయర్లతో తనకు తాను ఏసీబీ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీరు లంచాలు తీసుకున్నారని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐకేపీ సర్వేయర్‌గా పని చేస్తున్న మల్లయ్యకు ఈ నెల 16న ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘నువ్వు లంచం తీసున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ కేసు నుంచి నిన్ను తప్పించేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. అదే రోజు పర్వతగిరి మండలంలో పని చేస్తున్న సర్వేయర్ శ్యామూల్‌కు అదే వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కేసు నమోదు చేస్తామని ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని సర్వేయర్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇంతటితో ఆగకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోని పలువురు సర్వేయర్లకు ఫోన్లు చేసి ఏసీబీ కేసుల నుంచి మిమ్మలను తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఇందుకోసం గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. సందేహం వచ్చిన సదరు ఉద్యోగులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిందితుడితో జరిగిన సంభాషణ, ఫోన్ నంబర్ వివరాలు అందించారు. దీంతో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారుల ముసుగులో సర్వేయర్లను నమ్మించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. సదరు నిందితుడికి డబ్బులు పంపించవద్దని సర్వేయర్లకు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు సమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
టెలిగ్రామ్ లింక్ పేరుతో.. సైబర్ మోసం!
రాజన్న: అత్యాశకు పోయి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లికి చెందిన యువకుడు రూ.7.67లక్షలు పోగొట్టుకున్నాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు. స్తంభంపల్లికి చెందిన అక్కెనపెల్లి హరీశ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ బయోటెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్లైన్లో వచ్చిన మెస్సేజ్‌తో టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేశాడు. మొదట యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోలు పంపితే నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పడంతో అలా చేశాడు. కొద్ది రోజులకు యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతాయని నమ్మబలకడంతో ఈనెల 9, 10, 11 తేదీలలో ఫోన్‌పే, గూగూల్‌పే ద్వారా వారు చెప్పిన నంబర్లకు రూ.7.67లక్షలు పంపించాడు. చివరికి యాప్ ఫేక్ అని తెలుసుకొని 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. -
9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు
హైదరాబాద్: 91తో కలిపి 9 అంకెల నంబర్‌తో మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. ఆ ఫోన్ కాల్స్ సమాధానం ఇస్తున్నారా.. అయితే మీ ఖాతాలు ఖాళీ. కేవలం మహిళలను కలవర పెట్టి, భయం సృష్టించి సైబర్ మోసగాళ్లు లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. నగరంలో నమోదైన 30 ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. నేర ప్రక్రియ ఇలా సాగుతోంది.. ► సైబర్ మోసగాళ్లు తాజాగా voip (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) ద్వారా 91 తో కలిపి 9 అంకెల నంబర్లతో ఫోన్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎత్తగానే మేం ముంబై సీబీఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్, మీ పేరు ఇదేనా అని అడుగుతారు. మీరు ముంబై నుంచి తైవాన్‌కు ఫెడ్ఎక్స్ కొరియర్ ద్వారా పార్శిల్ పంపిస్తున్నారని అందులో డ్రగ్స్ ఉన్నాయని, ఇంకా అనుమానాస్పద పత్రాలు ఇతర దేశాలకు పంపిస్తున్నారని, మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని కొరియర్ ప్రతినిధి చెప్పాడు. మీ మీద ముంబై సీబీఐ కేసు నమోదు చేసిందని.. ఈ సమాచారాన్ని మీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని వారు 20 నిమిషాల్లో మిమ్మల్ని అరెస్టు చేసి మాకు అప్పగిస్తారని వివరిస్తాడు. ఈ మాటలకు భయపడి మా తప్పు లేదు మమ్మల్ని రక్షిచండి అని ప్రాధేయపడగానే లూటీ మొదలు పెడతారు. స్క్రీన్ షేరింగ్ యాప్స్‌తో అకౌంట్ ఖాళీ అవుతుంది. ► మీరు నిర్దోషి అని తెలియాలంటే మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాలి. మీకు మొత్తం ఎన్ని ఖాతాలు ఉన్నాయి చెప్పండి అని బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తారు. దీంతో మీ ఫోన్ మొత్తం వారి కంట్రోల్‌కి వెళ్లిపోతుంది. వెంటనే మీ ఖాతా నుంచి మా సీబీఐ ఖాతాకు కొంత డబ్బు పంపమని చెబుతారు. ఈ సమయంలో సైబర్ మోసగాళ్లు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నంబర్, పాస్వర్డ్, యూజర్ నేమ్, పిన్ నంబర్లను తెలుసుకుంటారు. దాదాపు అలా 3 గంటల పాటు మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. ► ఇలా హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసానికి గురైన వారి సంఖ్య 30 వరకు చేరింది. ఇందులో 23 మంది మహిళలు బాధితులుగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. అత్యధికంగా ఓ మహిళ రూ.40 లక్షలు పోగుట్టుకుంది. మొత్తం సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.1.5 కోట్లు కాజేశారని నమోదైన ఫిర్యాదులతో వెల్లడైంది. మోసాలకు చెక్ పెట్టాలంటే.. ► మనకు వచ్చే ఫోన్ కాల్స్ 91 తో కలిపి 10 అంకెలు ఉంటాయని గ్రహించాలి. ‘ముంబై టూ తైవాన్ ఫెడ్ ఎక్స్ కొరియర్’ పేరు చెప్పగానే సైబర్ మోసానికి సంబంధించిన కాల్‌గా అనుమానించాలి. ► సీబీఐ పేరు చెప్పి పోలీసులు వస్తున్నారని మాట్లాడితే సరే పోలీసులు వచ్చిన తర్వాత మాట్లాడుతామని ఫోన్ కట్ చేయాలి. ► స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోమంటే అసలు చేయొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు రెస్పాండ్ అవొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తులు సుదీర్ఘంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది సైబర్ మోసగాళ్ల ఫోన్ కాల్‌గా భావించాలి. ► ఈ 9 అంకెల ఫోన్ కాల్స్ voip ద్వారా వస్తుందడంతో వీటి ఐపీ అడ్రస్‌లు విదేశాల్లో ఉంటున్నాయి. కొట్టేసిన నగదు కూడా వర్చువల్ కరెన్సీ రూపంలో విదేశాలకు పంపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నయా మోసం నుంచి అప్రమతంగా ఉండాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.డార్క్ వెబ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ పలు కొరియర్ సంస్థల నుంచి డేటా కొట్టేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
యాప్ డౌన్లోడ్ చేయగానే.. తగిలిన బిగ్‌షాక్..!
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు వైద్యురాలికి 95 వేల రూపాయలు టోకరా వేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 శ్రీనికేతన కాలనీలో నివసించే లక్ష్మి వైద్యురాలు. గత నెల 15న ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. ఏదైనా ఫిర్యాదు ఉందా అని అడిగాడు. తాను చేసిన 41,955 రూపాయలకు సంబంధించి ఆన్లైన్ షాపింగ్‌పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి కొన్ని వివరాలు అడగగా ఫోన్లో ఇవ్వలేనని నిరాకరించారు. అయితే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలు పొందుపరిస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు. ఈ మేరకు లక్ష్మి యాప్ డౌన్లోడ్ చేసి సమాచారం నమోదు చేసిన వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.95వేలు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ మోసాలకు గురైతే..ఇలా రిపోర్ట్ చేయండి..!
డబ్బు పోగొట్టుకోవడం, బెదిరింపులు ఎదుర్కోవడం, వీడియో–ఆడియో సంభాషణల ద్వారా ఇబ్బందులకు లోను అవడం.. ఇవన్నీ ఇటీవల ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా అధికంగా జరుగుతున్న నేరాలు. ఈ–మోసాలకు గురైతే ఏం చేయాలి? ఇంటర్నెట్లో భద్రంగా ఎలా ఉండాలి..? వివరంగా తెలుసుకుని ఆచరిస్తే సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. మన దేశంలో సైబర్ నేరాలను అధికారులకు రిపోర్ట్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీలైనంత ఎక్కువ సాక్ష్యాలను సేకరించాలి. ఇందులో స్క్రీన్ షాట్లు, ఇ–మెయిల్స్, చాట్లాగ్లు, బ్యాంక్లావాదేవీల రికార్డులు, వీడియో అండ్ ఆడియో సంభాషణలు లేదా మీ ఫిర్యాదుకు మద్దతునిచ్చే ఏవైనా ఇతర సంబంధిత సమాచారం అంతా మీ దగ్గర ఉండాలి. 1. సంఘటన ఆధారంగా.. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మొదలైనవాటిలో మీరు అవతలి వ్యక్తులతో కమ్యూనికేట్ చేసిన విధానం. తేదీ, సమయం, ఏ ప్లాట్ ఫారమ్ (ఇంటర్నెట్, సోషల్ మీడియా... మొదలైనవి) అనే అంశాల్ని చూసుకోవాలి. అలాగే సాక్ష్యాలను అప్లోడ్ చేయాలి (నగదు చెల్లింపులు /బ్యాంక్ స్క్రీన్షాట్లు ఆర్థిక మోసాలకు సంబంధించిన స్టేట్మెంట్లు. వేధింపులకు లేదా ఇతర వాటికి సంబంధించిన స్క్రీన్షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి ఏమైనా ఉంటే జత చేయాలి). 2. అనుమానితుడి వివరాలు ఏవైనా ఉంటే.. అనుమానితుడి పేరు, గుర్తింపు (మొబైల్, ఇ–మెయిల్, సోషల్ మీడియా యుఆర్ఎల్ మొదలైనవి), ప్లేస్ (ఆఫీస్... మొదలైనవి). 3. కంప్లైంట్స్ వివరాలు బాధితుడి పూర్తి పేరుతో పాటు తండ్రి/జీవిత భాగస్వామి/ సంరక్షకుడు మొదలైనవి నోట్ చేయాలి. ఇ–మెయిల్ ఐడీ /ఫోన్ నెంబర్, చిరునామా, ఐడీ గుర్తింపు (ఆధార్.. మొదలైనవి)తో మీ దగ్గరలోని స్థానిక పోలీస్‌స్టేషన్ లేదా సంబంధిత పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి. నేరం గురించి, సంఘటన జరిగిన తేదీ, సమయం, మీరు సేకరించిన సాక్ష్యాలతో సహా అన్ని వివరాలతో కూడిన రాతపూర్వక ఫిర్యాదుతో వారికి అందించాలి. మీ ఫిర్యాదుకు ఏవైనా సంబంధిత పత్రాలు లేదా సాక్ష్యాధారాల కాపీలను జత చేయాలి. మీ పట్ల జరిగిన నేరం వరుస పద్ధతిలో సాక్ష్యాలను జాబితా చేయడం మంచిది. మీ కంప్లైంట్ /ఎఫ్ఐఆర్/ పిటిషన్ ఫాలోఅప్ గురించి విచారించాలి. మీ కేసుకు కేటాయించిన దర్యాప్తు అధికారిని క్రమం తప్పకుండా వివరాలను కనుక్కుంటూ ఉండాలి. అధికారి పేరు, సంప్రదింపు వివరాలు, మీకు అందించిన ఏవైనా రిఫరెన్స్ నంబర్ల రికార్డును మెయిన్‌టెయిన్ చేయాలి. ఇ–మెయిల్, సందేశాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ కంటెంట్‌తో సహా సైబర్ నేరానికి సంబంధించిన అన్ని సంబంధిత సాక్ష్యాలను భద్రపరిచారని నిర్ధారించుకోవాలి. విచారణ ప్రయోజనాల కోసం సాక్ష్యాలను తారుమారు చేయద్దు. సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ సంబంధిత పోర్టల్స్: దేశంలో వివిధ రకాల సైబర్ నేరాలను నివేదించడానికి ఉన్న పోర్టల్స్.. పరువు నష్టం, సైబర్ బెదిరింపు, సైబర్ స్టాకింగ్, అశ్లీల కంటెంట్, అశ్లీలత, లైంగిక వేధింపులు, ఫిషింగ్ మోసాలు.. వంటి సైబర్ మోసాలను నివేదించడానికి మీరు https://www. cybercrime.gov.in/ పెట్టుబడి మోసాలు, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు, ఇ–కామర్స్ మోసాలు, వర్క్ ఫ్రమ్ హోమ్స్కామ్లు, ఫిషింగ్ మోసాలతో సహా ఆర్థిక సైబర్ మోసాలకు గురైనట్లైతే.. 1930కి కాల్ చేయవచ్చు. సిటిజన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్కామర్ల నిధులను స్తంభింపజేయడానికి ఈ వ్యవస్థ సహాయం చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ టెర్రరిజానికి సంబంధించిన సంఘటలను రిపోర్ట్ చేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ((CERT-In)) వెబ్సైట్ ద్వారా https://cert-in.org.in లో రిపోర్ట్ చేయవచ్చు. పోగొట్టుకున్న ఫోన్ల గురించి https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jspలో రిపోర్ట్ చేయచ్చు. మీ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ మీకు అనుమతిస్తుంది. సరైన సూచనల కోసం పోలీస్‌స్టేషన్‌ను కూడా సంప్రదించవచ్చు. ఎవరైనా మీ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ సేవల కోసం మీ ఆధారాలను ఉపయోగిస్తున్నారని అనుమానం వస్తే.. దానిని https://tafcop. sancharsaathi.gov.in/ telecomUser/ లో రిపోర్ట్ చేయవచ్చు. వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అనేది మీరు యుపీఐని ఉపయోగించి అనుకోకుండా ఇతరులకు డబ్బును బదిలీ చేస్తే, ఫిర్యాదు చేయడానికి అనుమతించే పథకం. సంబంధిత యుపీఐ సర్వీస్ప్రొవైడ్ (పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే మొదలైనవాటిపై ఫిర్యాదు), టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jsp పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. ప్రత్యామ్నాయంగా CRPC@rbi.org.inకు మెయిల్ చేయవచ్చు. యుపీఐ లావాదేవీకి సంబంధించి https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanismలో రిపోర్ట్ చేయచ్చు. సైబర్ సెక్యూరిటీకి చిట్కాలు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, ప్రత్యేక అక్షరాలు, సంఖ్యా కలయికతో బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించాలి. మీ ఆన్లైన్, సోషల్ మీడియా, ఇ–మెయిల్ ఖాతాల కోసం .. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ని ప్రారంభించాలి. ఎసెమ్మెస్ ద్వారా మీ మొబైల్ పరికరానికి పంపిన ప్రత్యేక కోడ్‌ని లేదా ప్రత్యేక ప్రమాణీకరణ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. సురక్షిత డేటా ట్రాన్స్మిషన్ కోసం గ్కిఅ2 లేదా గ్కిఅ3 ఎన్క్రిప్షన్తో మీ వైఫై రూటర్‌ని సెట్ చేయాలి. చట్టబద్ధ్దమైనదని మీకు కచ్చితంగా తెలిస్తే తప్ప పబ్లిక్ ౖÐð ఫైని ఎప్పటికీ ఉపయోగించవద్దు. మీ సోషల్ మీడియా ఖాతాల్లోని సీక్రెట్ సెట్టింగ్‌లను చెక్ చేస్తూ ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలను నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవాలి. సాఫ్ట్వేర్ యాప్‌లు, ఫైల్స్‌ను రిప్యుటేషన్ ఉన్నవాటి నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయాలి. మీ ముఖ్యమైన డేటా, ఫైల్స్ డేటా, క్లౌడ్ స్టోరేజీ మొత్తాన్ని క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవడం మంచిది. డిజిటల్ భద్రత పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. లోతైన పరిష్కారానికి.. సోషల్ మీడియా మోసాలకు సంబంధించి సరైన, సంతృప్తికరమైన పరిష్కారం దొరకలేదు అనుకుంటే జ్టి్టpట://జ్చఛి.జౌఠి.జీn/లో రిపోర్ట్ చేయవచ్చు. ఈ ఎఅఇ కమిటీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ బాధితుల కంప్లైంట్స్‌ను అప్పీళ్లతో పరిష్కరిస్తుంది. (చదవండి: పీ ఫర్ పాడ్‌కాస్ట్.. బీ ఫర్ భార్గవి) -
సైబర్ వార్ఫేర్ను ఎదుర్కొనేలా మన ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం. అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది. సైబర్ దాడులు దేశ విద్యుత్ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎస్ఐఆర్ టీమ్ ఏర్పాటు సైబర్ సెక్యూరిటీలో భాగంగా పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కింద సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. -
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీపై సైబర్ అటాక్ - నిలిచిపోయిన ఉత్పత్తి
Cyber Attack: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' గత కొంత కాలంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేసింది. సైబర్ దాడుల కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిలిచిపోయిన ఉత్పత్తి.. నివేదికల ప్రకారం, 2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కాలంలో దాదాపు 20,000 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. అంతే కాకుండా వచ్చే వారం జరగాల్సిన వార్షిక సరఫరాదారుల సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది. దీని గురించి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగానికి నివేదించామని, ప్రస్తుతం దీనిపైనా విచారణ జరుగుతోంది, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించలేమని అన్నారు. అయితే మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం కూడా ప్రస్తావించలేదు. కానీ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!) భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కీర్తి పొందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిలియన్ యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతే కాకుండా కంపెనీకి భారత్ మాత్రమే కాకుండా జపాన్ కూడా అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అవుట్‌పుట్‌లో భారతదేశం 50% వాటాను కలిగి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరం కూడా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
చాట్‌జీపీటీతో సైబర్ దాడులు.. ఒక్కో కంపెనీపై వారంలో 2,108 సార్లు..
న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీలపై సైబర్ దాడులు మరింత పెరిగాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రతీ వారం సగటున ఒక్కో కంపెనీపై 2,108 దాడులు జరిగినట్టు చెక్ పాయింట్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. సైబర్ నేరస్థులు తమ దాడుల కోసం చాట్ జీపీటీ వంటి టూల్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, కోడ్ జనరేషన్‌కు వినియోగిస్తున్నారని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే మార్చి త్రైమాసికంలో కంపెనీలపై సైబర్ దాడులు 7 శాతం పెరిగాయి. ఒక్కో వారం సగటున ఒక్కో సంస్థ 1,248 దాడులను ఎదుర్కొన్నది. అంతర్జాతీయంగా విద్య, పరిశోధన రంగాల్లోని కంపెనీలపై ఎక్కువ సైబర్ దాడులు నమోదయ్యాయి. ఒక్కో వారం సగుటన ఒక్కోసంస్థపై 2,507 దాడులు జరిగినట్టు, 15 శాతం పెరిగినట్టు చెక్ పాయింట్ వెల్లడించింది. -
దేశంలో సెకనుకో సైబర్ దాడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి సెకనుకో సైబర్ దాడి జరుగుతోందని సైబర్ క్రైమ్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి 11 సెకన్లకు ఓ సంస్థ లేదా వ్యక్తిపై ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తగా నిర్వహించిన హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమిట్ (హాక్)–2023లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమిట్‌కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి ప్రసంగిస్తూ... ‘అనునిత్యం ఇంటర్నెట్లోకి 9 లక్షల కొత్త మాల్వేర్ వచ్చిపడుతోంది. వీటిలో ఏ రెండింటికీ సారూప్యత ఉండట్లేదు. కోవిడ్‌కు ముందు చిన్న, మధ్య తరహా సంస్థల్లో 53 శాతం ఈ ఎటాక్స్ బారినపడితే.. కోవిడ్ తర్వాత ఇది 68 శాతానికి చేరింది. ఈ నేరాల్లో ఐడెంటిటీ థెఫ్ట్‌తోపాటు ఉద్యోగులు చేసే డేటా చోరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల రాజకీయ కారణాలతోనూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో 65 నుంచి 70 శాతం కంప్యూటర్లను వాళ్లకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకుంటున్నారు. వీటిని క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం వాడుతున్నారు. ఈ తరహా సంస్థలు నిర్వహించే వారికి సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చాలా ఖరీదైన అంశంగా మారింది. ఈ ధోరణి మా రడంతోపాటు డేటా లీక్ ప్రివెన్షన్ పాలసీలు అమల్లోకి రావాలి. సాధారణ హైజీన్తో (శుభ్రత) పాటు సైబర్ హైజీన్ అన్నది కీలకంగా మారాలి. బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఉన్నట్లు చిన్న, మధ్య తరహా సంస్థల పర్యవేక్షణకు ఏ వ్యవస్థా లేకపోవడమూ ఓ లోపమే. వీటికి పోలీసులే రెగ్యులేటింగ్ అథారిటీ కావాలి. ఏదేనీ సంస్థ లేదా వ్యక్తికి చెందిన కంప్యూటర్లోకి చొరబడి, డేటాను తమ అధీనంలోకి తీసుకుని ఎన్‌క్రిప్ట్ చేయడం, డీ–క్రిప్షన్‌కు డబ్బు డిమాండ్ చేయడం... ర్యాన్సమ్వేర్ దాడుల్లో పైకి కనిపించే సైబర్‌నేరాలు. అయితే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకున్న డేటా ను తస్కరిస్తుంటారు. యూరోపియన్ హ్యాకర్లు ఆయా సంస్థలకు చెందిన కస్టమర్ డేటా తీసుకుంటారు. ఈ డేటా సేకరించడం అక్కడి చట్టాల ప్రకా రం తీవ్రమైన నేరం కావడంతో ఇలా చేస్తారు. భార త్‌కు చెందిన హ్యాకర్లను ఈ డేటా డార్క్ నెట్ సహా ఎక్కడైనా పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ర్యాన్సమ్వేర్ ఎటాకర్స్ ఆయా కంపెనీల సోర్స్ కోడ్‌ను తస్కరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త కాల్స్‌కు స్పందించవద్దు ఈ సమిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హెచ్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి భరణి మధ్య ప్యానల్ డిస్కషన్ జరిగింది. తన యూనిట్లో పని చేసే కొండలు సైబర్ నేరంలో ఎలా మోసపోయాడు, తన స్క్రిప్‌్టలు భద్రంగా ఉంచుకోవడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను తదితర అంశాలను జక్కన్న వివరించారు. వివిధ సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వీరు చర్చించారు. ‘80 శాతం సైబర్ నేరాలు బాధితుల అవగాహనరాహిత్యం వల్ల, 20 శాతం దురాశ వల్ల జరుగుతుంటాయి. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశం... వీటిలో దేనికైనా స్పందించే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించాలి. కొత్త వారి ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు’ అని సూచించారు. -
UPI Fraud: దెబ్బకు రూ. 35 లక్షలు గోవింద: ఎక్కడంటే?
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. యుపిఐ వినియోగంలోకి వచ్చిన తరువాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ UPIలో కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. నివేదికల ప్రకారం, ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన పారావియమ్ టెక్నాలజీస్ ఇలాంటి యుపిఐ మోసానికి గురైనట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ పేమెంట్ గేట్‌వే సిస్టమ్‌ను తారుమారు చేసి ఏకంగా రూ. 35 లక్షలు దోచేశారు. కంపెనీ ఉపయోగించుకుంటున్న క్యాష్‌ఫ్రీ పేమెంట్ గేట్‌వేని తారుమారు చేసి డబ్బు దోచుకున్నట్లు సంస్థ ఆపరేషన్స్ హెడ్ అంకిత్ రావత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. నిజానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు 95,000 యుపిఐ మోసాలకు పాల్పడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కావున తప్పకుండా యుపిఐ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. యుపిఐ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా? మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటిపి, పిన్ వంటి సమాచారాలను ఎప్పుడు, ఎవరితోనూ పంచుకోకూడదు. అమౌంట్ తీసుకోవడానికి మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రమే పిన్ అవసరం. డబ్బు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు వారి వివరాలను తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోవాలి. యుపిఐ ఉపయోగిస్తున్నప్పుడు పబ్లిక్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం మానుకోవాలి. -
సెల్‌ఫోన్ యూజర్స్‌కు అలర్ట్.. పొంచి ఉన్న ‘బ్లూబగ్గింగ్’
సాక్షి, విజయవాడ: ఫోన్లో బ్లూటూత్.. వైఫై, హాట్ స్పాట్ ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉంటున్నారా.. అయితే జాగ్రత్త పడండి. సైబర్ నేరగాళ్లు మాటు వేసి ఉంటున్నారు. ఫోన్లోని వ్యక్తిగత సమాచారమంతా దోచేస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, బెదిరింపులతో మానసిక క్షోభకు గురి చేసి.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి బ్లూబగ్గింగ్ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే బ్లూ బగ్గింగ్ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పది మీటర్ల దూరం నుంచే బ్లూటూత్, హాట్‌స్పాట్ ద్వారా ‘పెయిర్’ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఏదో పనిలో ఉండి చూసుకోకుండా ‘ఓకే’ బటన్ క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్ల ఫోన్‌తో మన ఫోన్ కనెక్టవుతుంది. వెంటనే మాల్వేర్తో పాటు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్‌ను ఫోన్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మన ఫోన్ ఆపరేటింగ్ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్లో బ్లూటూత్ ఆపేసినా.. వారు అప్పటికే పంపించిన ప్రోగ్రామింగ్, మాల్వేర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. సాధారణంగా వైఫై వినియోగించే వారికి తప్పనిసరిగా పాస్వర్డ్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వైఫై ఫ్రీగా లభ్యమవుతోంది. ఫోన్లో వైఫై ఆప్షన్ ఆన్ చేసుకున్న వారికి ఆటోమేటిక్‌గా వైఫై కనెక్ట్ అవుతోంది. ఫ్రీగా వైఫై ఇచ్చే ప్రాంతాల్లో తరచూ బ్లూబగ్గింగ్ సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. క్విక్ సపోర్ట్, టీం వ్యూయర్, ఎనీడెస్క్ తదితర యాప్స్ సాయంతో ఫోన్ ఆపరేటింగ్ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు పసిగడుతుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ముందుగా సొమ్మును దోచేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను పూర్తిగా కాపీ చేసుకుని.. వాటిని మారి్ఫంగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి దొరికినంత లాగేస్తున్నారు. మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను సైబర్ నేరగాళ్లు పూర్తిగా వారి మొబైల్‌కు మళ్లించుకుంటున్న ఘటనలు కూడా జరిగాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా కేసులు ఇప్పటివరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 15 వెలుగు చూశాయని పోలీసులు చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి బ్లూ బగ్గింగ్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్లను అవసరమైనప్పుడే ఆన్ చేసుకోవాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచింది. స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే పెయిర్ రిక్వెస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దు. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ పోలీస్‌స్టేషన్ -
సైబర్ దాడుల సన్నద్ధతపై ‘అరెటే’ ఫోకస్
హైదరాబాద్: సైబర్ రిస్క్ నిర్వహణ కంపెనీ ‘అరెటే’.. సైబర్ దాడుల నిరోధానికి, ఒకవేళ సైబర్ దాడులు తలెత్తితే ఆ సమయంలో సన్నద్ధతకు సంబంధించి కొత్తగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం దీన్ని రూపొందించామని, సహజంగా ఈ సంస్థలే ఎక్కువగా దాడులకు గురవుతుంటాయని, పూర్తి స్థాయిలో వ్యవస్థల పునరుద్ధరణకు 6–8 రోజుల సమయం తీసుకుంటున్నట్టు అరెటే తెలిపింది. చిన్న, మధ్య తరహా సంస్థల సిస్టమ్స్‌లో అప్పటికే హానికాక సాఫ్ట్వేర్లు ఏవైనా ఉన్నాయా? కస్టమర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం లీక్ అయిందా గుర్తించడంతోపాటు.. పరిశ్రమలోనే అత్యుత్తమ విధానాలు, రిస్క్ నిర్వహణతో ఇది ఉంటుందని వివరించింది. సంస్థలకు మరింత రక్షణ కలి్పంచి, సైబర్ దాడుల రిస్క్‌ను తగ్గించడమే తమ లక్ష్యమని అరెటే ప్రకటించింది. -
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడి.. చైనా హ్యాకర్ల పనే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన దాడి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌పై సైబర్ దాడి చైనా హ్యకర్ల పనేనని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. హ్యకింగ్‌కు గురైన లక్షల మంది రోగుల వివరాలను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందాయని పేర్కొంది. ‘ఎయిమ్స్ సర్వర్లపై దాడి చేసింది చైనీయులే. హ్యకింగ్ చైనా నుంచే జరిగినట్లు విచారణలో తేలింది. మొత్తం 100 సర్వర్లున్న ఢిల్లీ ఎయిమ్స్‌లో 40 ఫిజికల్‌గా 60 వర్చువల్‌గా పనిచేస్తున్నాయి.ఇందులో ఐదు ఫిజికల్ సర్వర్లలో హ్యకింగ్ జరిగింది. ఇది చాలా నష్టాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు హ్యకింగ్‌కు గురైన అయిదు సర్వర్లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందాం’ అని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. మొదట నవంబరు 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సిస్టమ్స్ పనిచేయకపోవడాన్ని గుర్తించారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ ఎయిమ్స్‌లోని సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు గుర్తించింది. అయితే సిస్టమ్‌ను పునరుద్ధరించేందుకు హ్యాకర్లు రూ. 200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఖండించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్లపై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
రెచ్చిపోతున్న హ్యాకర్స్.. ‘ఐసీఎంఆర్’పై 6వేల సార్లు సైబర్ దాడి!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్‌పై సైబర్ దాడి జరిగి సర్వర్లు డౌన్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు హ్యాకర్స్. ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో ట్రేస్ చేయగా.. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న హాంకాంగ్‌కు చెందిన ఐపీగా తేలిందన్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్ ఫైర్‌వాల్, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు. మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్ ముందు ఉన్న సఫ్దార్‌గంజ్ ఆసుపత్రిపై డిసెంబర్ 4న సైబర్ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్‌తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్ శెర్వాల్ తెలిపారు. ఎన్ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం! -
మన నిర్లక్ష్యానికి మూల్యమెంత?
కొన్ని సంఘటనలు అంతే... పెనునిద్దర నుంచి పెద్ద మేలుకొలుపుగా పనిచేస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన సైబర్‌దాడి అలాంటిదే. నవంబర్ 23న ఆగంతకులు భారీమొత్తం డిమాండ్ చేస్తూ జరిపిన రాన్సమ్వేర్ దాడితో కుప్పకూలిన సర్వర్లు పన్నెండు రోజులైనా ఇప్పటికీ బాగు కాలేదు. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఆరోగ్యరక్షణ సంస్థలోని ఈ ఘటన మన దేశ సైబర్ భద్రతా మార్గదర్శకాలను సమగ్రంగా పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. డిజిటల్ ఇండియా పేరిట అన్ని రకాల ప్రభుత్వ విధులనూ, ప్రజా సేవలనూ, నగదు చెల్లింపులనూ ఆన్లైన్లో జరపాలని ప్రోత్సహిస్తున్నవేళ అత్యవసరం వచ్చిపడింది. సైబర్ దాడులు అంటువ్యాధిలా వ్యాపించి, ఎయిమ్స్ ఘటన లాంటివి మరిన్ని జరగక ముందే సురక్షిత వ్యవస్థనూ, ఆపత్సమయంలో సమాచారాన్ని వెనక్కి రప్పించే పద్ధతులనూ సృష్టించుకోవడం తక్షణ కర్తవ్యమని తెలిసివచ్చింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. డిసెంబర్ 1న జలశక్తి శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఇటీవల ఓ ప్రభుత్వ శాఖపై జరిగిన రెండో పెద్ద సైబర్ దాడి ఇది. నవంబర్‌లో ఢిల్లీలోనే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌పైనా సైబర్ దాడి జరిగింది. నిజానికి, ఆరోగ్య రంగంపై సైబర్ దాడుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉందని సైబర్ భద్రతా నిఘా సంస్థ క్లౌడ్‌సెక్ లెక్క. ఒక్క 2021లోనే దేశంలోని సైబర్ దాడుల్లో 7.7 శాతం ఆరోగ్య రంగంపై జరిగినవే. గత మూడేళ్ళలో భారత్‌లో సైబర్ దాడులు 3 రెట్లు పెరిగాయి. సైబర్ ముప్పును ఎదుర్కోవడా నికి ఉద్దేశించిన ప్రధాన సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్టీ–ఇన్) డేటా ప్రకారం 2019లో జరిగిన ఉల్లంఘనలు 3.94 లక్షల చిల్లర. 2020లో అది 11.58 లక్షల పైకి, 2021లో 14.02 లక్షలకూ ఎగబాకింది. ఈ ఏడాదిలో జూన్ నాటికే 6.74 లక్షలయ్యాయి. వెరసి మూడున్నరేళ్ళలో 30 లక్షలకు పైగా కేసులొచ్చాయి. కానీ, సైబర్ భద్రతా నిధుల వినియోగం అర కొరగా సాగింది. రూ. 213 కోట్లు మంజూరైతే, రూ. 98.31 కోట్లే ఖర్చు పెట్టడం నిర్లక్ష్యానికి నిలువు టద్దం. అంతకన్నా దారుణం ఎయిమ్స్‌లో 30–40 ఏళ్ళుగా కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లను మార్చక పోవడం. ఈ ఇక్ష్వాకుల కాలపు సామగ్రి పట్ల ఆందోళన వ్యక్తమైనా పట్టించుకున్న నాధుడు లేడు. పైగా ఐటీ ఓనమాలు తెలీని డాక్టర్ గారే ఇప్పటికీ అక్కడ కంప్యూటర్ విభాగాధిపతి అంటే ఏమనాలి! 2004లో తొలి డిజిటల్ దాడి రికార్డయిన నాటి నుంచి ఇప్పటి దాకా సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. విస్తరించిన ఇంటర్నెట్కు విపరిణామం – ప్రపంచవ్యాప్త సైబర్ భద్రతా ఉల్లంఘనలు. నిజానికి, ప్రపంచంలో అత్యధికంగా డేటా చౌర్యం జరుగుతున్న దేశాల్లో భారత్‌ది 6వ స్థానం. ప్రతి వంద మంది భారతీయుల్లో 18 మంది డేటా చోరీ అయిందని నెదర్లాండ్స్ సంస్థ సర్ఫ్‌షార్క్ మాట. మన పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం ఈ ఏటి నివేదికలో పొంచివున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి మన దేశ సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి అంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రశ్న. సైబర్ ముప్పుపై తగిన నియంత్రణ వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్–ఐటీ శాఖ కింద ‘సైబర్ భద్రతా విభాగా’న్ని కేంద్రం నెలకొల్పింది. అది ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలీదు. ఎయిమ్స్ సంక్షోభ పరిష్కారానికి కేంద్రం ఎన్ఐఏ, డీఆర్డీఓ, గూఢచారి విభాగం, సీబీఐ నిపుణులను బరిలోకి దింపాల్సి వచ్చింది. రక్తం చిందని ఈ అభౌతిక, ఆధునిక యుద్ధంతో ఉక్రెయిన్ – ఆస్ట్రేలియాల్లో పవర్ గ్రిడ్లు, నిరుడు మన దేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇరాన్లో అణు సదుపాయాలు, జార్జియాలో టెలికామ్ సేవలు, వివిధ దేశాల్లో ఎయిర్‌లైన్స్, ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. అవన్నీ వాటి పొరుగు శత్రుదేశాల పనే. ఇక, మేధాసంపత్తి హక్కులు, వ్యక్తిగత డేటా చౌర్యాలు లెక్కలేనన్ని. ఐటీ సిస్టమ్స్‌పై దాడితో డేటాను ఎన్‌క్రిప్ట్ చేసేసి, సమాచారాన్ని తిరిగి అందుబాటులో ఉంచాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేసే రాన్సమ్వేర్ దాడులు ప్రధానంగా మున్సిపిల్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకులు సహా ఆర్థిక సేవలపై విరుచుకుపడుతున్నాయి. ఇవాళ మన బ్యాంక్ సేవల నుంచి టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్‌లు, పాస్‌పోర్ట్ సమాచారం, పౌర విమాన యానం దాకా అంతా డిజటలే! స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటున్న పాలకులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే సైబర్ ముప్పుపై దృష్టి పెట్టకుంటే ప్రాథమిక వసతులకూ పెను ప్రమాదమే! వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే సమగ్ర సైబర్ భద్రతా విధానం కావాలి. ఘటన జరిగాక హడావిడి కాక ముందుగానే వాటిని నివారించేందుకు సీఈఆర్టీ–ఇన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను సంసిద్ధం చేయాలి. డిజిటల్ సేవలు కావాల్సిందే గనక సమాచార నిల్వ, ఆపత్కాలంలో తిరిగి తీసుకొనేలా సమర్థ విధానాలు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలి. సైబర్ రక్షణ రంగా నికి నిధులిచ్చి, అత్యాధునిక కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్) పరిష్కారాలతో సత్తా సమ కూర్చుకోవాలి. అప్పుడే డిజిటల్ ప్రపంచం సురక్షితమవుతుంది. ఈ కృషిలో నూతన ఆవిష్కరణలం దేలా ఉత్ప్రేరణ కలిగించాల్సింది విధాన రూపకర్తలే. అప్పుడే డిజిటల్ ఇండియా విజయం సాధ్యం! -
‘ఎయిమ్స్’ తరహాలో మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా!
చెన్నై: దేశ రాజధానిలోని ఢిల్లీ ఎయిమ్స్‌పై సైబర్ దాడితో గత 10 రోజులుగా సర్వర్లు పనిచేయడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ విషయం తేలకముందే మరో ఆసుపత్రిపై పంజా విసిరారు హ్యాకర్లు. సుమారు 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత వివరాలను ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్ సర్వర్లను హ్యాక్ చేసి రోగుల డేటాను పాపులర్ సైబర్ క్రైమ్ ఫోరమ్స్, టెలిగ్రామ్ ఛానళ్లలో అమ్మకానికి పెట్టినట్లు సైబర్ ముప్పుపై విశ్లేషించే సంస్థ ‘క్లౌడ్‌సెక్’ వెల్లడించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. క్లౌడ్‌సెక్ వివరాల ప్రకారం.. ‘థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్’ అనే థర్డ్ పార్టీ వెండర్ ద్వారా 2007 నుంచి 2011 మధ్య నమోదైన రోగుల వివరాలను దొంగిలించినట్లు తేలింది. అయితే, శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌కు థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ విధులు నిర్వర్తించటంపై సమాచారం లేదని పేర్కొంది. కొనుగోలుదారులు నమ్మేందుకు నమూనా జాబితాను ఆన్లైన్ ఉంచారు. లీక్ అయిన డేటాలో రోగుల పేర్లు, జన్మదినం, అడ్రస్, సంరక్షకుల పేర్లు, డాక్టర్ల వివరాలు ఉన్నాయి. డాక్టర్ల వివరాలతో ఏ ఆసుపత్రి డేటా హ్యాకింక్‌గు గురైందనే విషయాన్ని క్లౌడ్‌సెక్ గుర్తించింది. ఆన్లైన్ అమ్మకానికి ఉంచిన డేటాలోని డాక్లర్లు తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్లో పని చేశారని తెలిపింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు సమాచారం. ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన మరుసటి రోజునే తమిళనాడు శ్రీ శరణ్ ఆసుపత్రి డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: 8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు -
సైబరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్
-
సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు సొంత కంపెనీకి చెందిన ఉద్యోగులే దారుణానికి ఒడిగట్టారు. కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్ దాడులు చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిగాయి. కంపెనీపై సైబర్ దాడి చేసి కేటుగాళ్లు డేటాను చేజిక్కించుకున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులే సైబర్ అటాక్ చేసినట్టు సమాచారం. హాంగర్ కంపెనీ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం, కంపెనీ ఉద్యోగులు విజయ్‌కుమార్, కరణ్‌కుమార్, అశ్వంత్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. కాగా, నిందితుల నుంచి రివాల్వర్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక, అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. -
గతం కంటే తగ్గాయి.. అయినా సైబర్ క్రైం నేరాల్లో ఆ నగరమే టాప్!
అత్యధిక సైబర్ నేరాల కేసులతో దేశంలోని మహానగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. 2021లో రోజుకు సరాసరి 18 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరపు నేరాలపై జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో ఈ చేదు వాస్తవం వెల్లడైంది. 20 లక్షలకంటే ఎక్కువ జనాభా కలిగిన 19 మహానగరాల్లో నమోదైన సైబర్ నేరాలను పరిశీలించగా బెంగళూరు టాప్‌లో నిలిచింది. బెంగళూరు ఐటీ, బీటీ, ఇతర ప్రముఖ ప్రైవేటు కంపెనీలకు నిలయం. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు నగరంపై గురిపెట్టి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. వరుసగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై సిలికాన్ సిటీ 6,423 కేసులతో దేశంలో మొదటిస్థానం, 3,303 కేసులతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండవ స్థానం, ఇక 2,883 సైబర్ నేరాలతో ముంబయి నగరం మూడవ స్థానంలో నిలిచింది. గతం కంటే తగ్గాయి అయితే గతం కంటే బెంగళూరు నగరంలో 2021లో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టడం శుభసూచకమనే చెప్పాలి. 2019లో 10,555 కేసులు, 2020లో 8,982 కేసులు నమోదైనట్లు నివేదికలో ప్రస్తావించారు. సైబర్‌నేరాల్లో బాధితులకు న్యాయం దొరికేది చాలా తక్కువ. ఇలా ఉండగా మెజారిటీ కేసుల్లో వంచకులను అరెస్ట్ చేయడం పోలీసులకు సాధ్యం కావడం లేదని బెంగళూరువాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు -
వర్క్ ఫ్రమ్‌హోంలో ఉద్యోగులు..పెరిగిన సైబర్ దాడులు!
గతేడాది కరోనా కారణంగా ఎక్కువ శాతం కంపెనీల కార్యకలాపాలన్నీ రిమోట్‌గానే నడిచాయి. దీంతో దేశంలో 45 శాతం సైబర్ క్రైం పెరిగాయని, ఈ ఏడాది 22శాతానికి పెరిగినట్లు వెరిజోన్ మొబైల్ సెక్యూరిటీ ఇండెక్స్-2022 నివేదిచింది. సైబర్ దాడుల కారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువ ప్రభావితం అయ్యాయని తెలుస్తోంది. మూడు నుంచి ఐదు కంపెనీల వరకు 61 శాతం దెబ్బతిన్నాయని, 43 శాతం దేశీయ సంస్థలపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేరాలు ముఖ్యంగా ఆర్థిక సేవల్లో 93 శాతం, రిటైల్ 88 శాతం, ఆరోగ్య సంరక్షణ 87 శాతం, ప్రభుత్వ రంగం, విద్య 87 శాతం, తయారీ, నిర్మాణం, రవాణా రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ సందర్భంగా వెరిజోన్ బిజినెస్ సీఈఓ సంపత్ సౌమ్యనారాయణన్ మాట్లాడుతూ..రిమోట్ వర్క్ కారణంగా సంస్థలు సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా లేవని అన్నారు. కాబట్టే సైబర్ దాడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రష్యా-ఉక్రెయిన్ డిజిటల్ వార్
మాస్కో/కీవ్: రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. సైబర్ యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. డిజిటల్ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. ‘‘మాది ఒక రకంగా సైన్యమే, స్వీయ నియంత్రణలో ఉన్న సైన్యం’’ అని డిజిటిల్ ఆర్మీ సభ్యుడైన 37 ఏళ్ల వయసున్న రోమన్ జఖరోవ్ చెప్పారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్సైట్లను బ్లాక్ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రష్యా దాడి చేస్తున్న ప్రాంతాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడానికి కావాల్సినన్నీ పంపడం వంటివన్నీ ఈ డిజిటల్ ఆర్మీ దగ్గరుండి చూస్తోంది. స్టాండ్ఫర్ఉక్రెయిన్ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో అందరి మద్దతు కూడదీస్తోంది. డిజిటల్ ఆర్మీలో చేరడానికి ముందు జఖరోవ్ ఆటోమేషన్ స్టార్టప్‌ను నడిపేవారు. ఆయన కింద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్లైన్ యాడ్ బయ్యర్లు పని చేస్తుంటారు. ఇప్పుడు వీరంతా సైబర్ యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాదు రష్యా చేసే సైబర్ దాడుల నుంచి ఆత్మ రక్షణగా తమ ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా నుంచి రైల్వేల వరకు... డిజిటల్ ఆర్మీలోని రోమన్ జఖరోవ్ బృందం ‘‘లిబరేటర్’’ అనే టూల్‌ని రూపొందించింది. ఈ టూల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా రష్యా వెబ్సైట్లపై దాడులు చేయవచ్చు. సైబర్ దాడులకు లోనుకాకుండా రష్యా దగ్గర పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మీడియా, బ్యాంకులు, టెలిఫోన్లు, రైల్వేలు చాలా రంగాలకు చెందిన వెబ్సైట్లలో మాల్వేర్ జొప్పించి కొద్ది సేపైనా నిలువరించడంలో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ విజయం సాధిస్తోందని సైబర్ సెక్యూరిటీ అధికారి విక్టర్ జోరా చెప్పారు. మరికొందరు ఐటీ నిపుణులు ఐటీ ఆర్మీ అన్న పేరుతో గ్రూప్‌గా ఏర్పడి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్‌లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్న ఈ గ్రూపు ఐటీ రంగంలో నిపుణులైన ఉక్రెయిన్లు ఎక్కడ ఉన్నా తమకు సహకారం అందించాలని పిలుపునిస్తోంది. ఇది సరైన పనేనా? ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో ఇలా ప్రతీ వ్యక్తి సైబర్ యుద్ధానికి దిగడంపై సొంతదేశంలోనే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక ఉక్రెయిన్ సైబర్ సంస్థ రష్యా ఉపగ్రహాలను కూడా అడ్డుకున్నామని ప్రచారం చేస్తోంది. ఉపగ్రహాలపై కూడా కన్నేశామని చెప్పుకోవడం వల్ల ఉక్రెయిన్‌కి మరింత నష్టం జరుగుతుందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాలనే టార్గెట్ చేస్తే అంతరిక్ష యుద్ధానికి దారి తీస్తుందని, అదే అసలు సిసలు యుద్ధంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే అంతరిక్ష రంగంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను తాము ప్రోత్సహించడం లేదని ఉక్రెయిన్ ప్రత్యేక కమ్యూనికేషన్ల సర్వీసులకు చెందిన డిప్యూటీ చైర్మన్ జోరా స్పష్టం చేశారు. యూరప్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్ ఉక్రెయిన్ సైబర్ దాడులతో రైల్వే టికెట్ల బుకింగ్, బ్యాంకింగ్, టెలిఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతూ ఉండడంతో రష్యా కూడా తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్ ద్వారా మాల్వేర్లు పంపించి ఇంటర్నెట్ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. దీంతో శుక్రవారం నాడు యూరప్ వ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, హంగేరి, గ్రీస్, ఇటలీ, పోలండ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో యూరప్ దేశాలు కూడా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. మానవీయ కోణంలో.. రెండు దేశాల మధ్య ఈ పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలు విలన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రష్యా నెటిజన్లు చాలా మంది సామాజిక మాధ్యమాల వేదికగా ఉక్రెయిన్‌కి మద్దతు ప్రకటిస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్‌కు మతి పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ రష్యన్ల నుంచి మద్దతు రావడంతో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ వారి పట్ల మానవీయ కోణంతో స్పందిస్తోంది. ఉక్రెయిన్ వీధుల్లో తిరుగుతున్న సైనికులు క్షేమ సమాచారాల్ని రష్యాలో వారి తల్లిదండ్రులకు తెలిసేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించారు. వారి వీడియోలు తీసి ఉంచడం, మరణించిన సైనికులు ఫొటోలు అప్లోడ్ చేయడం, యుద్ధం వద్దంటూ గ్రాఫికల్ డిజైన్స్ సందేశాలు రూపొందించి ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. క్లిక్ చేస్తే డేంజర్లో పడ్డట్టే!
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. కరోనా సంక్షోభంలో సైబర్ నేరస్తులు మీకు చెప్పి మరి కష్టపడ్డ సొమ్మును కాజేస్తున్నారని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఇటీవల కాలంలో కేవైసీ పేరుతో సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో నుంచి డబ్బుల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తూ బ్యాంక్ ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పింది. కేవైసీ అప్డేట్ చేయండి.. లేదంటే టెక్నాలజీ పెరిగిపోయే కొద్ది ఏది నిజమో, ఏది డూఫ్లికేటో తెలుసుకునేలోపే అనర్ధాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఎక్కువగా జరుగుతుందని ఎస్బీఐ తెలిపింది. టెక్నాలజీపై ప్రజల్లో అవగాహాన పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అన్వేస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్లో పేర్కొంది. అచ్చం ఎస్బీఐ ఎస్ఎంఎస్ను పోలి ఉండే ఓ కేవైసీ డూబ్లికేట్ మెసేజ్‌ను బ్యాంక్ అకౌంట్ల వినియోగదారులకు సెండ్ చేస్తున్నారు. అందులో మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తారు. Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq — State Bank of India (@TheOfficialSBI) March 4, 2022 పొరపాటున ఎవరైనా ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేస్తే బ్యాంక్‌లో ఉన్న మనీ మాయమవుతుందని ఎస్బీఐ సూచించింది. కేవైసీ అంశంలో ఇలాంటి మెసేజ్‌ల పట్ల అవగాహన లేని ఖాతాదారులు డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ మీ ఫోన్‌కి మెసేజ్ లేదంటే మెయిల్స్ వచ్చినా వాటిని క్లిక్ చేయకుండా వదిలేయాలని. అలాంటి ఎస్ఎంఎస్లు మళ్లీ మళ్లీ వస్తుంటే.. సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపాలని సలహా ఇచ్చింది. చదవండి: బంగారం కొనేవారికి షాక్ !! ఆగమన్నా ఆగడం లేదు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయ్ -
సైబర్ దాడుల కలకలం.. ఇంటర్నెట్ ఉన్నా ఉన్నట్లుండి ఆఫ్‌లైన్!
ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో సైబర్ దాడుల కలకలం కొనసాగుతోంది. భారీగా బ్యాంకింగ్, ప్రభుత్వ ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన వెబ్సైట్లపై పడుతున్నారు హ్యాకర్లు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం యూరప్ వ్యాప్తంగా వేలమంది ఇంటర్నెట్ యూజర్లకు ఒక్కసారిగా ఆఫ్‌లైన్ షాక్ తగిలింది. యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, గ్రీస్, ఇటలీ, పోలాండ్ దేశాల్లోని తమ క్లయింట్లకు ఇంటర్నెట్ సేవలకు విఘాతం ఏర్పడిందని, ఈ మేరకు 40వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, ఇదేం సాంకేతిక సమస్యకాదని ఒక ప్రకటన విడుదల చేసింది శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీ బిగ్‌బ్లూ. మరోవైపు ఆరెంజ్ కంపెనీ(నోర్‌డెంట్) కూడా 9వేల మంది ఫ్రాన్స్ సబ్స్క్రయిబర్లు ఇబ్బంది పడినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. వీటితో పాటు మరో ఆరు ప్రధానమైన ఇంటర్నెట్ సేవల కంపెనీలు సైతం సేవలకు విఘాతం కలిగినట్లు ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు బుధవారం కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇది కచ్చితంగా సైబర్ దాడులేనని యూఎస్‌కు చెందిన వయాశాట్ ప్రకటించింది. ప్రధానంగా హ్యాకర్లు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపైనే దృష్టి సారిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా.. యుద్ధ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో కొత్త డేటా-నాశన వైరస్‌ని సైబర్ సెక్యూరిటీ కంపెనీలు గుర్తించాయి. అయితే దీని వాస్తవ ప్రభావాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఉక్రెయిన్‌పై రష్యా సైబర్ ఎటాక్
-
సైబర్ నేరం జరిగితే వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బెంగళూరులో ఐబీఎం ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్ దాడుల ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఇండియా సీఈఆర్టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్ దాడుల పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సైబర్ దాడులు జరిగితే బయటకు వెల్లడించకుండా దాచడం కుదరదు. వీటిని వెల్లడించాల్సిన బాధ్యతను సంస్థలపై పెట్టనున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లో నూతన చట్టం గురించి ప్రకటన వింటారు’’అని మంత్రి ప్రకటించారు. ముప్పు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సైబర్ విభాగం సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తు చేశారు. ‘‘మనం పెద్ద ఎత్తున సామర్థ్యాల విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇంటర్నెట్ అన్నది సురక్షితంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా, విశ్వసనీయమైనదిగా ఉండాలి. ఇంటర్నెట్కు సంబంధించిన మధ్యవర్తులు వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని మంత్రి చెప్పారు. ఆసియా పసిఫిక్‌లో మొదటిది బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటిదిగా ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. సైబర్ భద్రత విషయంలో టెక్నిక్‌లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు. -
ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతల ట్విట్టర్ అకౌంట్లు పదే పదే హ్యాకింగ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతుండగా, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ హ్యాకర్స్ ట్వీట్ చేశారు. 500బిట్ కాయిన్లను పంచుతున్నామని ట్వీట్లో తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ట్విటర్‌కు తెలిపినట్లు పీఎంవో వెల్లడించడమే కాకుండా, ప్రధాని ట్విటర్అకౌంట్కు భద్రత కల్పించింది. అయితే గతంలో మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైన సంగతి విదితమే. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ.. -
మహిళా ఐపీఎస్‌లకు సైబర్ స్టార్స్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలకుగాను సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ (సీఆర్‌సీఐడీఎఫ్)సంస్థ ప్రతీఏటా ప్రకటించే సైబర్ స్టార్స్ అవార్డులు రాష్ట్ర పోలీస్‌శాఖకు చెందిన ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారు లకు లభించాయి. రెండు కీలక కేసుల్లో సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ద్వారా నిందితుల గుర్తింపునకు తీసుకున్న చర్యలకుగాను సీఐడీలో సీనియర్ ఎస్పీ (ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం) పరిమళ హనానూతన్కు అవార్డు లభించింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టడం, నిందితులను అరెస్ట్ చేయడం, వినూ త్న పద్ధతుల ద్వారా నిందితులను ట్రాక్ చేయడం, కేసుల పర్యవేక్షణకుగాను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డీసీపీ (నేర విభాగం) రోహిణి ప్రియదర్శినికి అవార్డు దక్కింది. -
సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..
KL Deemed University Student: ఇటీవలకాలంలో చాలా సైబర్ మోసాలను చూసే ఉంటాం. ఆఖరికి బ్యాంక్ ఉద్యోగులను సైతం బురిడీ కొట్టంచే కేటుగాళ్లను సైతం చూస్తూనే ఉన్నాం. పైగా ఫిర్యాదు చేద్దాం అంటే ఈ సైబర్ కేసులను సంబంధించిన ఫిర్యాదులు ఎలా చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక అటువంటి సమస్య ఉండదంటా. ఎవ్వరూ సైబర్ మోసానికి గురకాకుండా ఉండేలానే కాకుండా సైబర్ చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన సరికొత్త యూప్ వచ్చింది. (చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్) అసలు విషయంలోకెళ్లితే...కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో లా ఫైనలియర్ చదువుతున్న డీ శశాంక్ డిజిట్ భద్రతకు సంబంధించిన సైబర్ అలర్ట్ అనే మొబైల్ అప్లికేషన్ని అభివృద్ధి చేశారు. అయితే ఈ సరికొత్త యాప్ వినియోగదారులను సైబర్ మోసానికి గురికాకముందే హెచ్చరించడమే కాక సైబర్ ఫిర్యాదులను ఫైల్ చేసేలా అనుమతి ఇస్తుంది. పైగా ఫిర్యాదులను ట్రాక్ చేయడమే కాక సైబర్ భద్రత, చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు జీపీఎస్‌తో కూడిన స్టేషన్ల జాబితాను కూడా తెలియజేస్తుంది. అంతేకాదు వినయోగదారులు సత్వరమే న్యాయ సహాయం పొందేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ మేరకు సైబర్ అలర్ట్ వ్యసస్థాపకుడు డీ రాహుల్ శశాంక్ మాట్లాడుతూ..."కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన సైబర్-దాడుల సంఖ్య మమ్మల్ని ఈ యాప్‌ను ప్రారంభించేలా చేసింది. మా యూనివర్సిటీ ప్రోఫెసర్లు నేను తయారు చేసిన యాప్ పై చాలా విశ్వాసం ఉంచడమే కాక మా ప్రయత్నానికి పూర్తి సహాయసహకారాలను అందించారు." అని అన్నారు. అంతేకాదు యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్ధ సారధి వర్మ ప్రిన్సిపాల్ ఎన్ రంగయ్య శశాంక్ని అభినందించారు. (చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...) -
ఎస్బీఐ వినియోగదారులకు అలర్ట్!
SBI Warns of KYC Fraud: దేశంలో ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఎస్బీఐ తన వినియోగదారులను హెచ్చరించింది. దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలకు గురి అవుతున్న వారిలో ఎస్బీఐ ఖాతాదారులు ఉండటంతో కేవైసీ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసగాళ్లు ఎస్బీఐ కస్టమర్లకు వల వేస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. "బ్యాంకు పేరుతో ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా వచ్చే కేవైసీ అప్డేట్ లింక్స్‌ని క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ఇటువంటి మోసాల గురుంచి http://cybercrime.gov.inకు నివేదించండి" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని ఎస్బీఐ చెబుతోంది. మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి సున్నితమైన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని హెచ్చరిస్తోంది. ఇలాంటి ఎస్ఎంఎస్ మోసాలకు బలైపోవద్దని వినియోగదారులను హెచ్చరించింది. The reality of #KYCFraud has proliferated across the country. The target is sent a text message asking to update their KYC by clicking on a link by someone acting as a bank/company representative. Report such scams at https://t.co/3Dh42ifaDJ#StateBankOfIndia #CyberCrimeAlert pic.twitter.com/cRydhDQ39H — State Bank of India (@TheOfficialSBI) November 10, 2021 ఆన్లైన్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి ఇలా..? కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవు. తెలియని వనరుల నుంచి ఎస్ఎమ్ఎస్/ఈ-మెయిల్స్ ద్వారా వచ్చిన అటాచ్ మెంట్/లింక్స్‌పై క్లిక్ చేయవద్దు. తెలియని వ్యక్తుల నుంచి టెలిఫోన్ కాల్స్/ఈ-మెయిల్స్ ఆధారంగా ఎలాంటి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, డెబిట్ కార్డు నంబర్, పీన్, సీవీవీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ/పాస్వర్డ్, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలను ఎవరితో పంచుకోవద్దు. (చదవండి: ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి) -
అమెరికా సంచలన నిర్ణయం.. వారిని పట్టిస్తే రూ. 74 కోట్లు మీవే!
రష్యా కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సంస్థ డార్క్ సైడ్‌లో కీలక నాయకత్వం వహిస్తున్న వారిని పట్టిస్తే 10 మిలియన్ డాలర్ల(సుమారు రూ.74 కోట్లు) రివార్డును ఇవ్వనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అక్టోబర్ 4న ప్రకటించింది. గత జూలైలో కలోనియల్ పైప్ లైన్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి చేసినట్లు ఎఫ్బిఐ తెలిపింది. ఈ కంపెనీ మీద సైబర్ దాడి చేయడం వల్ల గ్యాస్ ధరలు పెరగడం భారీగా పెరిగాయి. కొద్ది రోజుల పాటు యుఎస్ ఆగ్నేయంలో ఇంధన కొరత ఏర్పడటంతో బంకులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డార్క్ సైడ్ రాన్సమ్ వేర్ సంఘటనలో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారం తెలిపితే 5 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 37.18 కోట్లు) వరకు రివార్డును అందిస్తున్నట్లు గతంలో విదేశాంగ శాఖ తెలిపింది. "సైబర్ నేరస్థుల దోపిడీ నుంచి ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్ వేర్ బాధితులను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ తన చిత్తశుద్దిని ప్రదర్శిస్తుంది" అని డిపార్ట్ మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్ దాడి నుంచి బయటపడటానికి హ్యాకర్లకు బిట్ కాయిన్ రూపంలో దాదాపు $5 మిలియన్లను చెల్లించినట్లు కలోనియల్ పైప్ లైన్ తెలిపింది. అమెరికా న్యాయ శాఖ జూన్ నెలలో సుమారు 2.3 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 17.10 కోట్లు) సైబర్ నేరగాళ్ల నుంచి స్వాధీనం చేసుకుంది. అమెరికా ప్రభుత్వానికి, ప్రజలకు, సంస్థలకు నష్ట కలిగించే సైబర్ నేరగాళ్ల సమాచారాన్ని తెలిపితే $10 మిలియన్ల వరకు రివార్డును ఇవ్వనున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. (చదవండి: లండన్‌లో ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..!) -
ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగానే ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీపై పెరుగుతున్న ఆదరణను కొంతమంది సైబర్ నేరస్తులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లపై హ్యకర్లు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాడికి గురవుతున్న వారిలో ఎక్కువగా ఐఫోన్ యూజర్లే ఉండడం గమనార్హం. తాజాగా బ్రిటన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ ఐఫోన్ యూజర్లను హెచ్చరించింది. చదవండి: ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా పెంచిన వివో...! డేటింగ్ యాప్స్‌తో దాడులు..! బంబుల్, టిండర్ వంటి డేటింగ్ యాప్స్‌తో క్రిప్టో స్కామర్లు ఐఫోన్ యూజర్లపై విరుచుకపడుతున్నట్లు సోఫోస్ పేర్కొంది. ఐఫోన్ యూజర్ల క్రిప్టోకరెన్సీలను దొంగలించడంతో పాటుగా, ఆయా వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారని సోఫోస్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు సుమారు రూ. 10 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీలను సైబర్ నేరస్తులు దొంగిలించారని సోఫోస్ వెల్లడించింది. క్రిప్టో స్కామర్లు ఎక్కువగా ఆసియాలోని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ స్కామర్లు యూరప్, యూఎస్ నుంచి తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సోఫోస్ పేర్కొంది. క్రిప్టో ఇన్వెస్టర్లు సురక్షిత క్రిప్టో లావాదేవీలను సులభతరం చేయడానికి ఆపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ధృవీకరించబడిన ఎక్స్ఛేంజ్, ట్రేడింగ్ సైట్లను మాత్రమే ఉపయోగించాలని సోఫోస్ సూచించింది. ఒక నివేదిక ప్రకారం.. 2020 ఏప్రిల్‌లో సుమారు 10.52 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 79,194 కోట్లు) మేర క్రిప్టోకరెన్సీ దొంగిలించబడిందని తెలుస్తోంది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! -
Pegasus: కాస్ట్లీ గూఢచారి.. పెగాసస్!
పెగాసస్ స్పైవేర్ రహస్యాల పుట్ట పగులుతోంది.. ఒక్కటొక్కటిగా వివరాలు వెల్లడవుతూంటే.. ముక్కున వేలేసుకోవడం.. సామాన్యుల వంతు అవుతోంది! నేతలు, విలేకరులు, హక్కుల కార్యకర్తలు..బోలెడంత మందిపై నిఘానేత్రానికి అయిన ఖర్చెంత? వ్యాప్తి ఏ మేరకు? ఏం చేయగలదు? ఎలా చేస్తుంది? పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం సామాన్యుల వల్ల అయ్యే పని కానే కాదు. ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ స్వయంగా చెప్పినట్లు, ప్రభుత్వాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఉపయోగించగలవు. ఖరీదు కోట్లలోనే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం మొదలుకొని నిఘా వేయాల్సిన ఫోన్లు, డెస్క్‌టాప్‌ల సంఖ్య, ఏ రకమైన వివరాలు కావాలి? వంటి అనేక అంశాలకు వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేస్తుంది ఎన్ఎస్ఓ టెక్నాలజీస్. 2016లో న్యూయార్క్ టైమ్స్ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే.. పెగాసస్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చార్జీనే దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుంది. ఐఫోన్/ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు పదింటిపై నిఘా పెట్టేందుకు అయ్యే ఖర్చు ఇంకో రూ.నాలుగు కోట్లు ఖరీదు చేస్తుంది. అప్పట్లో విస్తృత వాడకంలో ఉన్న బ్లాక్‌బెర్రీ ఫోన్లు ఐదింటిపై నిఘా పెట్టేందుకు రూ.3.5 కోట్లు, ఇన్నే సింబియాన్ ఫోన్లకు రూ.కోటి వరకూ అవుతుందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇది బేసిక్ ప్యాకేజీ.. నిఘా వేయాల్సిన స్మార్ట్ఫోన్ల సంఖ్య ఇంకో వంద పెరిగితే రూ.5.5 కోట్లు వదిలించుకోవాలి. ఇంకో యాభై మందిపై నిఘాకు రూ.3.5 కోట్లు, సంఖ్య 20 అయితే కోటి రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా.. మెయింటెన్స్ ఛార్జీలు మొత్తం ఛార్జీల్లో 17 శాతం వరకూ ఉండగా.. నిర్దిష్ట సమయం తరువాత రెన్యువల్ ఛార్జీలు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో పెగాసస్ సాఫ్ట్వేర్ బారిన పడ్డ వారి సంఖ్య దాదాపు 300 అన్నది నిజమైతే.. మొత్తం ఖర్చు సుమారు 40 లక్షల డాలర్లు లేదా రూ.28 కోట్లు అవుతుందన్నమాట. మెయింటెనెన్స్ చార్జీలు, ఇతర ఖర్చులు కూడా కలుపుకుంటే.. మొత్తం ఖర్చు రూ.యాభై కోట్ల వరకూ అయి ఉండవచ్చునని అంచనా. 2016 నాటి లెక్కలకు ద్రవ్యోల్బణం తదితర అంశాలను జోడించి చూస్తే.. ప్రస్తుతం పెగాసస్ సాఫ్ట్వేర్ కోసం కనీసం రూ.వెయ్యికోట్ల కంటే ఎక్కువే ఖర్చుఅయి ఉండాలి. అన్నింటిలోకీ చొరబడిందా? భారత్‌లో పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా 300 మందిపై నిఘా వేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వార్తలొచ్చాయి. అయితే వీరందరి స్మార్ట్ఫోన్లలోనూ ఆ స్పైవేర్ జొరబడిందా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాచారం లేదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్ 67 స్మార్ట్ఫోన్లను పరిశీలించగా ఇరవై మూడింటిలో స్పైవేర్ ఉందని, ఇంకో 14 వాటిలో లోనికి జొరబడే ప్రయత్నం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని ‘ద వైర్’ ఒక కథనంలో తెలిపింది. మిగిలిన 30 మంది స్మార్ట్ఫోన్ల పరీక్షలు ఏ రకమైన ఫలితమూ ఇవ్వలేదని, ఫోన్లను వదిలించుకోవడం ఇందుకు కారణం కావచ్చునని తెలిపింది. రెండేళ్ల క్రితం పార్లమెంటరీ కమిటీ విచారణ ఈ అంశంపై 2019లో ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణ జరిపింది. అప్పట్లో ఈ సాఫ్ట్వేర్ 121 మందిపై ప్రభావం చూపినట్లు సమాచారం. తమిళనాడులోని కుడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై, అణుశక్తి విభాగాలపై సైబర్ దాడి జరిగిందని తెలిసింది. కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం పరిపాలన విభాగంపై ఈ సాఫ్ట్వేర్ దాడి చేసినట్లుగా సమాచారం. అయితే కేంద్ర హోంశాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన విచారణలో భాగంగా 17 మందిని విచారించినట్లు, ఇందులో మానవహక్కుల కార్యకర్తలతోపాటు జగదల్పూర్ లీగల్ ఎయిడ్ సభ్యులు ఉన్నారు. మొత్తం విచారణపై కమిటీ ఏ రకమైన నివేదిక ప్రభుత్వానికి సమర్పించకపోవడం కొసమెరుపు! చొరబడేది ఇలా... ► ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ సిద్ధం చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ఫోన్లలోకే చొరబడుతుంది. తాజా వెర్షన్లు ఫోన్‌కు వచ్చిన లింకులు, మెసేజ్‌ను క్లిక్ చేయకుండానే సాఫ్ట్‌వేర్‌ను జొప్పించగలదని చెప్తున్నారు. ► స్పైవేర్, స్టాకర్వేర్లు యాంటీ థెఫ్ట్ (ఫోన్ చోరీకి గురికాకుండా చూసేవి) అప్లికేషన్ల రూపంలో వస్తూంటుంది. యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు స్మార్ట్ఫోన్లలోకి జొరబడే వైరస్, మాల్వేర్లను గుర్తించగలదు. స్పైవేర్, స్టాకర్వేర్లు వీటి కంటపడకుండా మనకు ఏదో ఉపయోగాన్ని ఇచ్చేవన్న ముసుగులో మన స్మార్ట్ఫోన్లలోని సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు పంపుతూ ఉంటుంది. ► ఒక్కసారి లోనికి జొరబడితే పెగాసస్ లాంటి స్పైవేర్లు బ్యాక్‌గ్రౌండ్‌లోనే పనిచేస్తూంటాయి. వాట్సాప్, ఎస్ఎంఎస్ వంటి అప్లికేషన్ల సాఫ్ట్వేర్లలో ఉండే లొసుగులను ఆసరాగా చేసుకుని పనిచేస్తుంది ఇది. అంతేకాదు.. పెగాసస్ స్మార్ట్‌ఫోన్ ‘రూట్ ప్రివిలైజెస్’ను పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రూట్ ప్రివిలైజెస్తో పెగాసస్ తనకు అవసరమైన వివరాలు సేకరించేందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేయగలదు. ఈ క్రమంలో ఫోన్ అడ్మినిస్ట్రేటర్‌గానూ ఈ పెగాసస్ మారిపోతుంది. సోకిన తరువాత...? రిమోట్ సర్వర్ ద్వారా అందే సూచనతో మన ఫోన్ పనిచేస్తూంటుంది. అవసరమనుకుంటే.. మన కెమెరా ఆటోమెటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఫొటోలు తీసేస్తుంది కూడా. అంతేకాకుండా.. మైక్రోఫోన్ ఆన్ చేసి మన మాటలు రికార్డ్ చేయడం, లేదా ఎస్ఎంఎస్, వాట్సప్ సందేశాల్లోని సమాచారాన్ని సర్వర్‌కు చేరవేడం చేయగలదు. కేలండర్‌లోకి జొరబడి మన అపాయింట్మెంట్లను గుర్తిస్తుంది. గుర్తించేంత వరకూ రిమోట్ సర్వర్‌కు సంకేతాలు పంపుతూనే ఉంటుంది. పెగాసస్ సాఫ్ట్వేర్ ప్రభుత్వాల వద్ద మాత్రమే ఉంటుంది. జాతీయ భద్రత, ఉగ్రవాదం మినహా మిగిలిన అంశాల కోసం భారత ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఉంటే అది కచ్చితంగా అక్రమమే. ఒకవేళ ప్రభుత్వం వాడకపోయి ఉంటే మరీ ప్రమాదం. జాతీయ భద్రతకు భంగం కలిగినట్లే. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌పై న్యాయ విచారణ జరగాల్సిందే – శశి థరూర్, ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Pegasus: ఏంటీ పెగాసస్.. భారీ డేటా హ్యాక్‌లో వాస్తవమెంత?
ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్ ‘పెగాసస్’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా డేటా హ్యాక్ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘ది వైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్ పేర్కొంది. యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list. — Subramanian Swamy (@Swamy39) July 18, 2021 దావా వేస్తాం 2018-19 నడుమ ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. గతంలో కూడా.. పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్వో గ్రూప్ మీద ఫేస్బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి. -
ప్రపంచ చరిత్రలో భారీ సైబర్ దాడి.. వందల కోట్లు డిమాండ్!
అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద సైబర్/రాన్సమ్వేర్ దాడి చోటు చేసుకుంది. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై హ్యాకర్లు దాడి చేశారు. ఈ దాడి తర్వాత 70 మిలియన్ డాలర్లను వారు డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీలో దీని విలువ 520 కోట్ల రూపాయలు. డార్క్ వెబ్సైట్ హ్యాపీ బ్లాగ్ ద్వారా ఈ దాడికి పాల్పడినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తుంది. సాఫ్ట్వేర్ ప్రొవైడర్ కెసయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఇతర కార్పొరేట్ కంపెనీలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించింది. ఈ సైబర్ దాడి వెనుక రష్యాతో సంబంధాలున్న ఆర్ఈవిల్ రేన్సమ్‌వేర్ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి నుంచి వెనక్కి తగ్గాలంటే 70 మిలియన్ డాలర్ల చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డీల్ కనుక ఒకే అయితే, సైబర్ ప్రపంచంలో ఇదే అతిపెద్ద సైబర్ దాడి అవుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూకే సహా అనే దేశాలలో ఉన్న 200 కంపెనీల డేటాను రాన్సమ్వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై వారు దర్యాప్తు ప్రారంభించారు. గత నెలలో జెనీవాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైబర్ దాడుల విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రస్తావించారు. ఇలాంటి దాడులకు కళ్లెం వేయాల్సిన బాధ్యత రష్యా అధ్యక్షుడిపై ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ గ్యాంగ్స్ దూకుడుకు అమెరికా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో తాజాగా దాడి సంభవించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ గ్యాంగ్ ఇది వరకు కూడా కొన్ని మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ.. ఈ సారి తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. -
Joker Malware Android: జోకర్ మళ్లొచ్చాడు.. తస్మాత్ జాగ్రత్త!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ఖతర్నాక్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. ముంబై: జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో దర్శనమిచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించుకుంది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇక ఇప్పుడు జోకర్ మాల్వేర్ గురించి ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ జారీ చేయడం విశేషం. ఏం చేయాలంటే.. యాప్‌లకు(అవసరం లేనివాటికి) ఎస్సెమ్మెస్ యాక్సెస్ పర్మిషన్ను తొలగించాలి. అవసరం లేని సర్వీసులు, సబ్స్క్రిప్షన్ల నుంచి బయటకు వచ్చేయాలి. ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌బ్యాంకింగ్ సమాచారాన్ని ఫోన్లో దాచిపెట్టుకోకపోవడం మంచిది. క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం.. తెలియకుండా జరిగిన కొనుగోళ్లపై దృష్టి సారించడం. అనవసరమైన యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోకపోవడం. రివ్యూల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ అయినా సరే.. అనుమానంగా అనిపిస్తే తొలగించడం. యాంటీ వైరస్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవడం. 2020లో 11 ‘జోకర్’ అనుమానిత యాప్స్‌ను ప్లే స్టోర్‌లో గుర్తించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 22కి పైనే ఉంది. మొండి జోకర్ జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
భారీ సంఖ్యలో లీకైన లింక్డ్ఇన్ యూజర్ల డేటా!
కొద్ది రోజుల క్రితం 53.3 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీక్ అయింది. సైబర్‌న్యూస్ ప్రకారం.. 50 కోట్లకు పైగా లింక్డ్ఇన్ వినియోగదారుల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు పేర్కొంది. లీక్ అయిన సమాచారంలో లింక్డ్ఇన్ ఐడి, పూర్తి పేర్లు, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, లింగాలు, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, ఇతర కీలక వివరాలు ఉన్నాయి. ఈ మేరకు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు దాన్ని ఓ వెబ్సైట్లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌న్యూస్ అనే వార్తా సంస్థ పేర్కొంది. ఈ సమాచారాన్ని సదరు హ్యాకర్ కొన్ని వేల డాలర్లు విలువ చేసే బిట్కాయిన్లకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. లీకైన డేటా లింక్డ్ఇన్ యూజర్ల ఫొఫైళ్ల నుంచి హ్యాక్ చేసినవి కాదని లింక్డ్ఇన్ తెలిపింది. కొన్ని ఇతర వెబ్సైట్లు, కంపెనీల నుంచి సేకరించిన వివరాల సమాహారమని పేర్కొంది. దాదాపు 50 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో కనిపించడం ఇటీవల కలకలంరేపిన విషయం తెలిసిందే. 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు అమ్మకానికి ఉంచారు ఇటాలియన్ గోప్యతా వాచ్డాగ్ లింక్డ్ఇన్ మిలియన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఏవిదంగా బహిర్గతం అయ్యింది అనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ డేటా ద్వారా స్పామ్ కాల్స్, స్పామ్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొన్నారు. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోవాలని, అలాగే మీ లింక్డ్ఇన్ ఖాతా పాస్వర్డ్, లింక్డ్ఇన్ ఖాతాతో అనుబంధించబడిన ఈమెయిల్ చిరునామా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: గుప్త నిధులు దొరికితే.. అది ఎవరికి చెందుతుంది? -
తెలంగాణ గ్రిడ్‌పై డ్రా‘గన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై చైనా నుంచి సైబర్ దాడులకు ప్రయత్నాలు జరుగు తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. చైనాకు చెందిన ‘కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ)తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్ సిస్టంలతో ‘కమ్యూనికేట్’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని, విద్యుత్ వ్యవస్థ భద్రత దృష్ట్యా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశ సైబర్ భద్రత అవసరాల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2004లో ‘సీఈఆర్టీ–ఇన్’ను ఏర్పాటు చేసింది. సీఈఆర్టీ–ఇన్ తాజా హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ట్రాన్స్కోఅప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకుంది. సీఈఆర్టీ–ఇన్ గుర్తించి పంపిన ‘చైనీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ల ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) అడ్రస్‌లను ట్రాన్స్‌కో బ్లాక్ చేసింది. దీంతో చైనీస్ సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న ఈ సర్వర్లు.. ట్రాన్స్‌కో, ఎస్ఎల్డీసీకు చెందిన కంప్యూటర్ సిస్టంలతో కమ్యూనికేట్ కావడానికి దారులు మూసేసినట్టు అయింది. - హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ఉన్న లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచి రిమోట్ ఆపరేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సబ్ స్టేషన్లలోని సర్క్యూట్ బ్రేకర్లను నియంత్రించే వ్యవస్థ పనిచేయకుండా తాత్కాలికంగా డిజేబుల్ చేసింది. దీంతో హాకర్లు రిమోట్ ఆపరేషన్ ద్వారా గ్రిడ్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి, కుప్పకూల్చడానికి అవకాశం లేకుండా పోయింది. - దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వెబ్‌సైట్‌కు సంబంధించి లాగిన్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను మార్చివేసింది. - గ్రిడ్ భద్రతను కట్టుదిట్టం చేయడానికి .. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ (స్కాడా) కంట్రోల్ సెంటర్ పరిధి నుంచి అనుమాస్పద పరికరాలను దూరంగా తరలించి ఐసోలేట్ చేశారు. ప్రధానంగా చైనా నుంచి కొనుగోలు చేసిన పరికరాలను గుర్తించి స్కాడా పరిధి నుంచి దూరంగా తరలించారు. రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ప్రమాదం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. నష్టమేంటి! సైబర్ నేరగాళ్లు మన విద్యుత్ సంస్థల కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడితే... మొత్తం సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలుగుతారు. గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కుప్పకూలితే విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అవుతుంది. కొన్ని గంటల పాటు కరెంటు ఉండదు. పరిస్థితి తీవ్రతను బట్టి ఈ సమయం పెరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. థర్మల్ పవర్స్టేషన్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. పునరుద్ధరించాలంటే ఒకట్రెండు రోజుల సమయం పడుతుంది. ఒకేసారి అన్ని యూనిట్లలో ఉత్పత్తిని పునరుద్ధరించడం సాధ్యం కాదు. క్రమేపీ ఒక్కో యూనిట్‌ను స్టార్ట్ చేస్తూ... పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు అంటే? హాకింగ్, సైబర్ దాడుల కోసం సైబర్ నేరస్థులు వినియోగించే కంప్యూటర్లను ‘కమాండ్ అండ్ కంట్రోల్ (సీ అండ్ సీ) సర్వర్లు’అంటారు. ఈ సర్వర్ల నుంచి దాడులు చేయాల్సిన కంప్యూటర్లకు కమాండ్స్ (సాంకేతిక ఆదేశాలు) పంపించి డేటాను చోరీ చేయడం లేదా మొత్తం కంప్యూటర్ నెట్‌వర్క్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవడం చేస్తుంటారు. సిస్టమ్స్‌లో మాల్వేర్ చొప్పించి ఈ దాడులకు పాల్పడుతారు. ఈ ప్రక్రియ అంతటికీ కమ్యూనికేట్ కావడమే కీలకం. ఒకసారి గనక సైబర్ నేరగాళ్లు మన వ్యవస్థలో ఒక సిస్టంతో సంబంధాలు నెలకొల్పుకోగలిగితే చాలు. ఆపై మొత్తం నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. ముంబై తర్వాత టార్గెట్ హైదరాబాద్? చైనా నుంచి సైబర్ దాడుల ఫలితంగానే గతేడాది అక్టోబర్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలి ముంబై నగరం అంధకారమైందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సోమవారం సంచలన కథనం రాసింది. గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత భారత దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్న ఉద్దేశంతో చైనా ఈ సైబర్ దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. మరుసటి రోజే సీఈఆర్టీ–ఇన్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చైనా నుంచి సైబర్ దాడులకు పొంచి ఉన్న ముప్పుపై హెచ్చరికలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని ఎన్నో వ్యూహాత్మక సంస్థలకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని సైతం లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్ దాడులకు ప్రయత్నాలు చేసినట్టు తాజా హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి. అంతటా ఆటోమేషన్.. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ నుంచి విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) నిర్వహణ వరకు ప్రస్తుతం అంతటా ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కంప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో మన అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుంటారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ముందే మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలను సైబర్ నేరస్థులు హైజాక్ చేసి గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ముంబైలో గ్రిడ్ కూలిపోవడం వెనక ఇదే కారణమని చర్చ జరుగుతోంది. గతేడాది కేంద్రం హెచ్చరికలు విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వ్యూహాత్మకమైన విద్యుత్ రంగాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. చైనా నుంచే అత్యధిక దిగుమతులు చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. -
చైనా సైబర్ పడగ!
సైబర్ దాడుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అపకీర్తి మూటగట్టుకున్న చైనా నిరుడు అక్టోబర్‌లో మన విద్యుత్ గ్రిడ్లపై తన ప్రతాపం చూపిందన్న కథనం సహజంగానే అందరినీ కలవరపెట్టింది. అమెరికాలోని ‘న్యూయార్క్ టైమ్స్’ వెలువరించిన కథనంపై చైనా ఆగ్రహోదగ్రం కావటం, ఆ దాడిలో మనకు ఎలాంటి నష్టమూ కలగలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం ఈ కథనంపై కొంత అయోమయాన్ని సృష్టించాయి. అయితే దాడి జరిగిన మాట వాస్తవం. దాని పర్యవసానంగా నిరుడు అక్టోబర్ 12న ముంబై విద్యుత్ గ్రిడ్ దాదాపు రెండు గంటలపాటు విఫలం కావటం, విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, రైళ్లు ఆగిపోవటం, ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సలో వున్న వేలాదిమంది రోగులు ఇబ్బందులెదుర్కొనటం వగైరాలు నిజం. ఇది చైనా సైబర్ దుండగుల పని కాకపోతే ఎవరు చేసివుంటారన్నది మున్ముందు వెల్లడయ్యే అవకాశం వుంది. అయితే ఈ దాడి జరిగిన సమయం చూస్తే సహజంగానే చైనాపై అనుమానాలు తలెత్తుతాయి. అప్పటికి లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలున్నాయి. నిరుడు మే నెలలో కల్నల్ సంతోష్‌బాబుతోసహా మన జవాన్లు 21మందిని చైనా సైనికులు కొట్టి చంపారు. ఆ తర్వాత మన ప్రభుత్వం భద్రతా కార ణాలరీత్యా దాదాపు వంద చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వీటన్నిటికీ ప్రతీ కారంగానే చైనాకు చెందిన దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారని, భారత్‌ను బెదిరించటమే ఈ దాడుల లక్ష్యమని ‘రికార్డెడ్ ఫ్యూచర్’ అనే అమెరికన్ సంస్థను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం చెబుతోంది. భూగోళంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కన్నుమూసి తెరిచేంతలో ఏ సమాచారాన్నయినా చేర్చగల సామర్థ్యం, దేన్నయినా నియంత్రించగల శక్తి సైబర్ ప్రపంచంలో వుంది. కానీ ఇంత వెసులుబాటులోనూ నిత్యం పెను ప్రమాదాలు పొంచివుంటాయి. దాన్ని దుర్వినియోగం చేసే చిల్లర నేరగాళ్ల సంగతలావుంచి పకడ్బందీ భద్రత వుందనుకునే కీలక వ్యవస్థల్లోకి చొరబడగల హ్యాకర్లు కూడా వుంటారు. దాదాపు నాలుగేళ్లక్రితం ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని లక్షలాదిమంది వ్యక్తుల, సంస్థల కంప్యూటర్లు హ్యాక్ చేసిన సైబర్ దుండగులు వాటిల్లోని విలువైన సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకుని దాన్ని వెనక్కివ్వాలంటే బిట్ కాయిన్ల రూపంలో 300 డాలర్ల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత దాదాపు 50,000 డాలర్లు వారికి ముట్టాయి కూడా. ఆ హ్యాకింగ్ వల్ల మన దేశంతోపాటు బ్రిటన్, జర్మనీ, అమెరికా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, చైనా తదితర దేశాల్లో ఐటీ, కమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్ పంపిణీ సహా భిన్న రంగాలు స్తంభించిపోయాయి. బ్రిటన్‌లో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. సాధారణ రోగులకు వైద్య సలహాలివ్వటం కూడా డాక్టర్లకు అసాధ్యమైంది. నిరుడు మన వ్యవస్థలపై ఈ మాదిరి దాడే జరిగింది. డేటాలోకి దుండగులు చొరబడటంగానీ, దాన్ని దొంగిలించటం గానీ జరగలేదని కేంద్రం చెబుతోంది. అయితే ముంబై మహానగరంలో నిరుడు జరిగిన విద్యుత్ అంతరాయానికీ, దీనికీ సంబంధం వున్నదో లేదో చెప్పలేదు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాత్రం సైబర్ విద్రోహం కారణంగానే ఈ అంతరాయం కలిగివుండొచ్చని అంటున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం చైనా మాల్వేర్ మన దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థల్లోకి చొరబడింది. అందులో హైవోల్టేజ్ విద్యుత్ పంపిణీ సబ్ స్టేషన్లతోపాటు, బొగ్గు ఆథారిత విద్యుదుత్పాదన కేంద్రం కూడా వుంది. ఇలా మొత్తం 12 భారతీయ సంస్థలకు చెందిన 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడిచేసి వాటికి సంబంధించిన కంప్యూటర్లలోకి మాల్వేర్ను చొప్పించారంటున్నది. చైనా అధికార వ్యవస్థకు చెందిన ‘రెడ్ ఇకో’ ఈ నేరానికి పాల్పడిందని ఆ కథనం సారాంశం. మన దేశంలో కీలకమైన వ్యవస్థలకు సైబర్ దుండగులనుంచి మప్పు వాటిల్లకుండా నిరంతరం నిఘావుంచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీం (సెర్ట్–ఇన్)కు తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను అందజేశామని ‘రికార్డెడ్ ఫ్యూచర్’ సంస్థ చెబుతున్నది కనుక దీనిపై మున్ముందు నిజాలు వెల్లడవుతాయని భావించాలి. హ్యాకర్లు చేసిన ప్రయత్నాలు చిన్నవేమీ కాదు. కేవలం అయిదు రోజుల వ్యవధిలో 40,300 సార్లు ఐటీ, బ్యాంకింగ్ వ్యవస్థలపై ఈ ప్రయత్నాలు జరిగాయంటున్నారు. ఆఖరికి కరోనా టీకాలు రూపొందించిన సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్‌లపై కూడా దుండగులు కన్నేశారని సమాచారం. ఈ దాడులకు మూలమైన డొమైన్లు చైనాలోని గాంగ్డంగ్, హెనాన్ ప్రావిన్స్‌లలో వున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ చెబుతోంది. గతంలో దేశాల మధ్య ఘర్షణలు నివారించకపోతే అణుయుద్ధం సంభవిస్తుందన్న భయాందోళనలుండేవి. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రత్యర్థి దేశాన్ని స్తంభింపజేసి, ఊపిరాడకుండా చేయటానికి సైబర్ దాడికి పాల్పడితే చాలు. ఇందులో చైనా మాత్రమే కాదు...అమెరికా, రష్యాలు కూడా ఆరితేరాయి. భిన్న సందర్భాల్లో ఆ దేశాలపైనా ఆరో పణలొచ్చాయి. ఇవాళ ఐటీతో ముడిపడని రంగమంటూ దేశంలో లేదు. కనుక అందులో అడు గడుగునా ఎదురయ్యే ఉపద్రవాలను ఎదుర్కొనడానికి అనువైన రీతిలో మన నిఘా సంస్థలు న్నప్పుడే ఆ వ్యవస్థలన్నిటినీ కాపాడుకోగలం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టకతప్పదు. -
భారత టీకాపై చైనా హ్యాకర్ల దృష్టి
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బీజింగ్: కోవిడ్–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది. ‘ఏపీటీ 10’, ‘స్టోన్ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని పేర్కొంది. ‘భారత్ బయోటెక్’, ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్‌లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలున్న సైఫర్మా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కోవిడ్–19 టీకాల్లో దాదాపు 60% భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ –19 వ్యాక్సిన్ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్‌కు పాల్పడుతోందని సైఫర్మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రితేశ్ తెలిపారు. వారి ప్రధాన లక్ష్యం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలు పంచుకుంటున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానేనన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ పబ్లిక్ సర్వర్లు బలహీనమైన వెబ్ సర్వర్లపై ఆధారపడి ఉన్నాయని వారు గుర్తించారని రితేశ్ తెలిపారు. సైఫర్మా వెల్లడించిన ఈ విషయాలపై సీరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, భారత్ బయోటెక్ కానీ స్పందించలేదు. చైనా విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. పవర్ గ్రిడ్ వ్యవస్థపై దాడి కూడా చైనా పనే భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్‌లో కీలకమైన పవర్ గ్రిడ్ వ్యవస్థను మాల్వేర్తో చైనా హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన మరో సంస్థ తాజాగా వెల్లడించింది. దాంతో, గత సంవత్సరం ముంబైలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో భారీ ఆటంకానికి హ్యాకింగే కారణమనే అనుమానాలు తాజాగా తలెత్తాయి. చైనా ప్రభుత్వంతో సంబంధమున్న ‘రెడ్ఎకో’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను పలుమార్లు లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైబర్ నిఘా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ తాజాగా వెల్లడించింది. 2020 జూన్ నుంచి పలుమార్లు 10 ముఖ్యమైన భారతీయ విద్యుత్ సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారంది. రెండు నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ‘ప్లగ్ ఎక్స్ మాల్వేర్ సీ2’ ద్వారా రక్షణ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. కాగా, భారత ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’ పనితీరుపై ఎలాంటి మాల్వేర్ దాడి ప్రభావం చూపలేదని, సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని విద్యుత్ శాఖ ప్రకటించింది. మాల్వేర్ కారణంగా ఎలాంటి డేటాను కోల్పోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, ‘రికార్డెడ్ ఫ్యూచర్’ ఆరోపణలను చైనా ఖండించింది. భారత పవర్ గ్రిడ్‌ను ఆటంకపరిచే హ్యాకింగ్ చర్యల్లో తమ పాత్ర ఉందన్న ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తోసిపుచ్చారు. అక్టోబర్ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్కెట్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ బిగ్‌బాస్కెట్ డేటాబేస్ చోరీకి గురైందని సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబల్ వెల్లడించింది. సంస్థ నుంచి తస్కరించిన 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు రూ. 30 లక్షలకు అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ‘విధుల్లో భాగంగా డార్క్ వెబ్‌ను పరిశీలిస్తుండగా సైబర్ క్రైమ్ మార్కెట్లో బిగ్ బాస్కెట్ డేటాబేస్‌ను 40,000 డాలర్లకు హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు మా రీసెర్చి విభాగం గుర్తించింది. సుమారు 15 జీబీ పరిమాణం ఉన్న ఎస్‌క్యూఎల్ ఫైల్లో దాదాపు 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటా ఉంది. ఇందులో పేర్లు, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీ, ఐపీ అడ్రస్‌లు మొదలైన వివరాలు ఈ డేటాలో ఉన్నాయి‘ అని సైబల్ తెలిపింది. అక్టోబర్ 30న సైబర్ దాడి జరిగినట్లు తాము గుర్తించామని, అదే విషయం బిగ్‌బాస్కెట్‌కు సత్వరం తెలియజేశామని సైబల్ తెలిపింది. మరోవైపు, డేటా చౌర్యం అవకాశాలపై వార్తలొచ్చిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశామని బిగ్‌బాస్కెట్ తెలిపింది. యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు నంబర్లు తదితర వివరాలేమీ తమ దగ్గర ఉండవని, అలాంటి డేటాకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని పేర్కొంది. -
జాతీయ భద్రతకు సంబంధించిన డేటా హ్యాక్..!
న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సంబంధించిన డేటాను కలిగి ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. చైనా సంస్థ జెన్హూవా డేటా ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంతి, ఆర్మీ చీఫ్‌తో సహా వేలాదిమంది భారతీయులపై రహస్య నిఘా నిర్వహిస్తోందనే ఆరోపణల మధ్య ఈ ఉల్లంఘన జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన డేటాతో పాటు, ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ) ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన మెయిల్ ఒకటి బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్కు చెందిన సంస్థ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్ఐసీ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ వ్యవస్థలు అన్నీ ప్రభావితమై సమాచారం హ్యాక్ అయినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని (నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో) ఏర్పాటు చేసిందని ఎన్ఐసీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ 30 రోజుల్లోగా నివేదికను సమర్పించనుంది. -
భారీ సైబర్ దాడి.. వేలాది ప్రభుత్వ ఖాతాలు హ్యాక్
టొరంటో: కెనాడాలో భారీ సైబరీ దాడి జరిగింది. ఆన్లైన్ ప్రభుత్వ సేవాలకు సంబంధించిన వేలాది ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 30 సమాఖ్య విభాగాలు, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలు ఉపయోగించే జీసీకీ(GCKey)సేవను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని ట్రెజరీ బోర్డ్ ఆఫ్ కెనడా సెక్రటేరియట్ ఒక పత్రికా ప్రకటనలో వివరించింది. 9,401 మంది జీసీకీ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు దొంగిలించారని గుర్తించామని, అన్నింటిని వెంటనే తొలగించామని కెనడా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అలాగే 5,500 రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని మరో దాడి చేశారని, హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లను వెంటనే గుర్తించి తొలగించామని చెప్పారు. (చదవండి : టిక్‌టాక్.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి) పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హాకింగ్‌కు గురికావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోప్యత ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. కాగా, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలతో సంబంధం ఉన్న బ్యాంకింగ్ సమాచారం మార్చబడిందని ఆగస్ట్ మొదటి వారంలోనే చాలా మంది కెనెడియన్లు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం పట్టించుకోనేట్లు తెలుస్తోంది. ఫలితంగా కరోనావైరస్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అందిచిన ఆర్థిక సాయం అర్హులకు అందకుండా పోయిందని ఆ దేశ మీడియా పేర్కొంది. -
హోండాకు మరో షాక్ : ఉత్పత్తి నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనావైరస్, లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్న జపాన్ కార్ల తయారీ సంస్థ హోండాకు తాజాగా సైబర్ ఎటాక్ షాక్ తగిలింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక కర్మాగారాలను ప్రభావితం చేసింది. దీంతో ఈ దాడి నుంచి కోలుకునేందుకు ఇండియా, బ్రెజిల్ హోండా ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఎటాక్ జరిగిందని, కంపెనీ సిస్టంల ద్వారా వైరస్ వ్యాపించిందని కంపెనీ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. దీంతో భారతదేశం, బ్రెజిల్‌లోని మోటార్‌సైకిల్ ప్లాంట్లను మూసి వేశామన్నారు. అయితే టర్కీలోని కార్ల తయారీ ప్లాంట్ వద్ద బుధవారం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. అయితే దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా హోండా వ్యాపారంపై పరిమితంగానే ఉంటుందన్నారు. (ఎట్టకేలకు ఆనంద్ మహీంద్రా సాధించారు) సైబర్ దాడి కారణంగా యుఎస్ లో ఐదు సహా, మొత్తం11 హోండా ప్లాంట్లను ప్రభావితం చేసినట్టు సమాచారం. అయితే యుఎస్ ప్లాంట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హోండాతో సహా గ్లోబల్ వాహన తయారీదారులు ఇప్పటికే సంక్షోభంలో పడ్డాయి. గత నెలలో హోండా నికర లాభంలో 25.3 శాతం క్షీణతను నమోదు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు ఆరు శాతం తగ్గాయి. (పీఎన్బీ : మూడు ఆడి కార్లు, విమర్శలు) -
డబ్ల్యూహెచ్‌వోపై ‘సైబర్ అటాక్’!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల కన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)పై పడింది. కరోనా నుంచి మానవాళిని కాపాడేం దుకు వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థల భాగ స్వామ్యంతో కృషి చేస్తున్న ఆ ఆరోగ్యప్రదాయిని పేరుతో అక్రమంగా సొమ్ము సంపాదించాలన్న ఆశతో సైబర్ నేరగాళ్లు డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక పరిజ్ఞానాన్ని హైజాక్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒక్క వారంలోనే ఆ సంస్థకు చెందిన 450 ఈ మెయిళ్లు, పాస్ వర్డ్లు దొంగిలించి విరాళాలు ఇవ్వాలంటూ మోసపూరిత విజ్ఞాపనలను ఆన్లైన్లో పెట్టారు. కానీ సైబర్ నేరగాళ్లు దొంగిలించిన ఈ మెయిల్స్ లోని డాటాను డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడు ఉపయోగించకపోవడంతో అక్రమార్కుల పాచిక పారలేదు. వారి స్కెచ్‌ను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ అధికారిక వెబ్సైట్లను మరింత కట్టుదిట్టం చేసుకుంది. మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. ‘కోవిడ్’ సాలిడారిటీ ఫండ్ పేరుతో వాస్తవానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్–19పై అలుపెరగని యుద్ధం చేస్తోంది. ప్రతీ క్షణం ఈ వైరస్ పట్ల ప్రపంచంలోని అన్ని దేశాలను అప్రమత్తం చేస్తూనే, ఆర్థిక చేయూతనిస్తున్న దేశాలు, పలు స్వచ్ఛంద సంస్థల సాయంతో వైద్య పరంగా సహకారం అందిస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ వెబ్ సైట్ లో ‘కోవిడ్ సాలిడారిటీ ఫండ్’పేరుతో విరాళాలు సేకరిస్తోంది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి డబ్ల్యూహెచ్‌వో పేరుతో నకిలీ ప్రకటనలను ఆన్లైన్ లో పంపుతున్నారు. ఇందుకోసం ఆ సంస్థ ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించేందుకు విఫల యత్నాలు చేశారు. అందులో భాగంగానే వారం రోజుల్లోనే ఆ సంస్థ సిబ్బంది, భాగస్వాములు గతంలో ఉపయోగించే 450 ఈ మెయిల్స్, వాటి పాస్ వర్డ్‌లను లీక్ చేసి వాటి నుంచి విరాళాలు ఇవ్వాలంటూ ప్రపంచ వ్యాప్తంగా సందేశాలు పంపారు. ఆ ఈ మెయిల్స్, వాటిలోని డాటాను డబ్ల్యూహెచ్‌వో సిబ్బంది, కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, కొన్ని భాగస్వామ్య సంస్థలు ప్రస్తుతం వినియోగిస్తున్నప్పటికీ, అది పాతది కావడం, విరాళాల సేకరణకు కొత్త డాటా ఉపయోగిస్తుండటంతో డబ్ల్యూహెచ్‌వో దాన్ని గుర్తించగలిగింది. వెంటనే అప్రమత్తమై తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు,తమ మెయిల్స్‌కు కట్టుదిట్టమైన సైబర్ భద్రత ఏర్పాటు చేసుకుంది.ఈ విషయాన్ని తన అధికారిక వెబ్సైట్ లో వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో, గత ఏడాది కన్నా తమ సాంకేతిక పరిజ్ఞానంపై సైబర్ నేరగాళ్ల దాడి 5 రెట్లు పెరిగిందని ధ్రువీకరించింది.అదే విధంగా విరాళాల అభ్యర్థన ప్రకటనల పట్ల మెలకువతో ఉండాలని ప్రపంచ దేశాలను కోరింది. కలిసికట్టుగా పోరాడుదాం ’ప్రపంచ మానవాళికి ఆరోగ్య సమాచారం అందించడమే మా ఏకైక లక్ష్యం. సైబర్ నేరాల విషయంలో ఎప్పటికప్పుడు మా సూచనలు తెలుసుకుంటూ, మాకు సలహాలు ఇస్తున్న అందరికీ కృతజ్ఞతలు. కోవిడ్ తో పాటు ఈ నేరాలపై అందరం కలిసికట్టుగా పోరాడుదాం.’ – బెర్నార్డో మారియానో, ముఖ్య సమాచార అధికారి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) -
భారీ చోరీ : 3.80 లక్షల లావాదేవీలపై ప్రభావం
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరగడమే కాని, తగ్గడం కనిపించడం లేదు. బడా బడా కంపెనీలు, దిగ్గజ సంస్థలు, పెద్ద బ్యాంక్‌లు సైతం వీటి బారిన పడుతున్నాయి. తాజాగా దిగ్గజ ఎయిర్‌లైన్ సంస్థ బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా సైబర్ నేరగాళ్లు బారిన పడింది. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేసి, కస్టమర్ల డేటాను దొంగలించారు. ఈ విషయాన్ని ఆ విమానయాన సంస్థనే ట్విటర్ ద్వారా వెల్లడించింది. యూకేలో బ్రిటిష్ ఎయిర్వేస్ అతిపెద్ద విమానయాన సంస్థ. కస్టమర్ల వ్యక్తిగత డేటా, ఆర్థిక సమాచారం దొంగతనం పాలైన విషయంపై ఈ సంస్థ తమ కస్టమర్లకు క్షమాపణ కూడా చెప్పింది. ఈ డేటా చోరిపై విచారణ చేపట్టినట్టు పేర్కొంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దొంగతనానికి గురైందని, దాదాపు 3,80,000 లావాదేవీలు దీని బారిన పడినట్టు బ్రిటీష్ ఎయిర్వేస్ వెల్లడించింది. అయితే పాస్‌పోర్టు లేదా ప్రయాణ వివరాలు మాత్రం దొంగతనానికి గురికాలేదని పేర్కొంది. ‘ 21 ఆగస్టు 2018, 22:58 బీఎస్టీ(బ్రిటీష్ స్టాండర్డ్ టైమ్) నుంచి 5 సెప్టెంబర్ 2018, 21:45 బీఎస్టీ వరకు ఏ కస్టమర్లైతే, మా వెబ్సైట్, యాప్‌లో బుకింగ్స్‌ను, షెడ్యూల్ మార్పులను చేపట్టారో, వారి వ్యక్తిగత, ఆర్థిక వివరాలన్నీ చోరికి గురయ్యాయి’ అని బ్రిటీష్ ఎయిర్వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారిన పడినట్టు అనిపిస్తే, వెంటనే బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డు ప్రొవైడర్ల సూచనలు తీసుకోవాలని కస్టమర్లను ఎయిర్‌లైన్స్ ఆదేశించింది. తదుపరి సమాచారం కోసం ఓ లింక్‌ను అప్డేట్ చేయనున్నట్టు పేర్కొంది. కస్టమర్లను వ్యక్తిగతంగా సంప్రదించి, తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. ప్రభావితమైన కస్టమర్ల నగదును పూర్తిగా రియంబర్స్ చేస్తామని, క్రెడిట్ చెకింగ్ సర్వీసుకు చెల్లించనున్నట్టు పేర్కొంది. తాజా సమాచారంపై ఎప్పడికప్పుడు కస్టమర్లకు అప్డేట్ చేస్తామని తెలిపింది. ప్రస్తుతం దీన్ని పరిష్కరించామని, తదుపరి బుకింగ్స్‌పై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని చెప్పింది. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. -
కాస్మోస్ బ్యాంక్‌పై సైబర్ దాడి
పుణే: కాస్మోస్ బ్యాంక్ సర్వర్లపై హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడ్డారు. వేల కొద్దీ డెబిట్ కార్డులను క్లోనింగ్ చేయడం ద్వారా రెండు రోజుల్లో రూ.94 కోట్లు చోరీ చేశారు. బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 11–13 మధ్య మోసపూరిత లావాదేవీల ద్వారా భారత్‌తో పాటు కెనడా, హాంకాంగ్లలోని 25 ఏటీఎంల నుంచి ఈ మొత్తాన్ని హ్యాకర్లు చోరీ చేసినట్లు పేర్కొన్నారు. వీసా, రూపే డెబిట్ కార్డుల ద్వారా ఇది జరిగినట్లు తెలియజేశారు. ‘‘మాల్వేర్ దాడి గురించి పుణే పోలీసులకు ఫిర్యాదు చేశాం. అంతర్గతంగా ఆడిట్ కూడా జరుపుతున్నాం. అయితే ఈ మాల్వేర్ దాడి వీసా, రూపే డెబిట్ కార్డుల పేమెంట్ గేట్‌వేలకు సంబంధించిన స్విచ్ వరకే పరిమితమయింది. ప్రధానమైన కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ (సీబీఎస్) సురక్షితంగానే ఉంది. ఖాతాదారుల అకౌంట్లకేమీ ముప్పు వాటిల్లలేదు. బ్యాంకుకే నష్టం కలిగించేలా హ్యాకర్లు ఈ చోరీకి పాల్పడ్డారు’’ అని సదరు అధికారి వివరించారు. వీసా, రూపే సంస్థలు ఈ మోసపూరిత లావాదేవీల గురించి రిజర్వ్ బ్యాంకుకు తెలియజేశాయని ఆయన చెప్పారు. కార్డుల వివరాలను సేకరించిన హ్యాకర్లు ఆగస్టు 11న విదేశాల్లో సుమారు 12,000 పైచిలుకు లావాదేవీల్లో రూ.78 కోట్ల నగదును మళ్లించారు. అలాగే మరో సందర్భంలో 2,849 లావాదేవీల ద్వారా రూ. 2.5 కోట్ల నగదు బదిలీ భారత్‌లో జరిగింది. ఆగస్టు 13న హ్యాకర్లు.. హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే బ్యాంకు ద్వారా రూ. 13.92 కోట్లు బదలాయించారు. -
ప్రధాని సహా 15 లక్షల మంది ఇన్ఫర్మేషన్ చోరీ
సింగపూర్: హ్యాకర్ల దాడితో సింగపూర్ వణికిపోయింది. ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన డాటాబేస్ నుంచి ఏకంగా 15 లక్షల మంది సింగపూర్ వాసుల ఆరోగ్య వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ప్రధాని లీ హీన్ లూంగ్ ఆరోగ్య రహస్యాలను కాజేయడానికే ఈ హ్యాకింగ్ జరిగినట్లు భావిస్తున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆకతాయి చర్య కాదనీ, చాలా తెలివిగా, పథకం ప్రకారం జరిగిన దాడి అని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆరోగ్యానికి సంబంధించిన కీలక వివరాలను దొంగిలించడానికి ఆరోగ్య శాఖ డాటాబేస్‌పై సైబర్ దాడి జరిగిందని హెల్త్ మినిస్టర్ గన్ కిమ్ యోంగ్ మీడియాకు తెలిపారు. కాగా, ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అలాంటిది ప్రభుత్వ డాటాబేస్‌పైనే సైబర్‌దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిటీ నడిబొడ్డున్న రక్షణ శాఖకు చెందిన అధునాతన ఆయుధాలు ఉన్నందున సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు గతంలో పలుమార్లు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా.. 2017లో రక్షణ శాఖ డాటాబేస్‌లోకి చొరబడిన దుండగులు 850 మంది ఆర్మీ అధికారుల వివరాలను హ్యాక్ చేశారు. -
రష్యాపై అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. వింటర్ ఒలంపిక్స్‌లో అధికారులు ఉపయోగించే కంప్యూటర్లను రష్యా హ్యాక్ చేసిందని చెబుతోంది. వందలాది కంప్యూటర్ల నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించిందని అంటోంది. దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ వేదికగా వింటర్ ఒలంపిక్స్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ క్రీడా సమరం నేటితో (ఫిబ్రవరి 25) ముగియనుంది. అయితే రష్యన్ మిలిటరీ గూఢాచారులు ఒలంపిక్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించారంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 9న ప్రారంభ వేడుకల సందర్భంగా సైబర్ దాడులు జరిగినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కానీ, అది రష్యా పనేనా అన్న విషయం మాత్రం వాళ్లు ధృవీకరించలేదు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. డోపింగ్ ఆరోపణల కారణంగా రష్యన్ బృందంలోని సభ్యులపై అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(ఐవోసీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంతో రష్యా నుంచి ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఐవోసీపై ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా ఈ దాడులకు పాల్పడిందని అమెరికా చెబుతోంది. ముగింపు వేడుకలకు కూడా రష్యా అంతరాయం కలిగించే ఆస్కారం ఉందన్న ఆరోపణలతో దగ్గరుండి పర్యవేక్షించబోతున్నట్లు అమెరికా ప్రకటించగా.. అందుకు దక్షిణ కొరియా అంగీకరించింది. మరోవైపు రష్యా మాత్రం అమెరికా ప్రకటనను ఖండించింది. -
ఆ వార్తతో మాకు సంబంధం లేదు’
హైదరాబాద్: ఆధార్ సమాచారానికి సరైన భద్రత లేదనీ, సైబర్ దాడి జరిగితే ఊహించని నష్టం జరుగుతుందంటూ బుధవారం మీడియాలో వచ్చిన వార్తకు, తమకు ఏ సంబంధం లేదని ఆర్బీఐ అనుబంధ ఐడీఆర్‌బీటీ (ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నీలజీ) చెప్పింది. కొన్ని మీడియా సంస్థలు ఆ వార్తలోని అంశాలను ఆర్బీఐ పరిశోధకులకు అపాదించాయనీ, సదరు నివేదికతో ఆర్‌బీఐకిగానీ, తమకుగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నివేదిక తయారుచేసిన అధ్యాపకుడు ఎస్ అనంత్ తమ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా మాత్రమే పనిచేస్తున్నారని ఐడీఆర్‌బీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
వాన్నాక్రై.. పక్కా కిమ్ పనే!
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మరో సంచలన ఆరోపణకు దిగింది. ప్రపంచాన్ని కుదిపేసిన వాన్నక్రై ర్యాన్సమ్వేర్ వెనుక ఉత్తర కొరియా హస్తం ఉందని చెబుతోంది. గతంలో పరోక్షంగా సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసినప్పటికీ.. ఈసారి మాత్రం అందుకు బలమైన సాక్ష్యాలే ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్ భద్రతా సలహాదారు టామ్ బాసొర్టే వ్యాఖ్యలను ఊటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఉత్తర కొరియాకు చెందిన లాజారస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ దాడి జరిగింది. దాడి వెనుక సూత్రధారుల వివరాలను దర్యాప్తులో కనుగొన్నాం. ఈ విషయంలో మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడితేనే బావుంటుంది అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ‘‘గత దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి ఏ మాత్రం బాగోలేదు. కవ్వింపు చర్యలతో తోటి దేశాలను ఉల్లంఘిస్తోంది. అంతేకాదు అణు పరీక్షలతో అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తోంది. అందులో భాగంగానే వాన్నాక్రై దాడికి పూనుకుంది. ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు బలమైన ఆధారాలు అమెరికా సంపాదించింది’’ అని ఆయన తెలిపారు. కాగా, 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కీలక డేటాను, కార్పొరేట్ సమాచారాన్ని నాశనం చేసినట్లు లాజారస్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం వైట్‌హౌస్ నుంచి ఈ ఆరోపణలపై మరింత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కిమ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేకపోవటం విశేషం. ర్యాన్సమ్వేర్ అనేది మాల్ వేర్లలో ఒకరకం. ర్యాన్సమ్ అంటే డబ్బులిచ్చి చెరనుంచి విడిపించుకోవడం. అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్ టూల్‌ను తస్కరించిన సైబర్ దొంగలు దాని సహాయంతో ఈ 'వాన్నాక్రై' ర్యాన్సమ్ వేర్ వైరస్‌ను రూపొందించారు. మొట్టమొదటగా ఈ ర్యాన్సమ్వేర్ సైబర్ దాడి స్వీడన్లో వెలుగులోకి వచ్చింది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్‌లకు పాకింది. 'వాన్నాక్రై' అనే ర్యాన్సమ్వేర్ వైరస్ దాడితో ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కంప్యూటర్లు స్థంబించిపోయాయి. ఇంతకీ ఈ వాన్నాక్రై అసలు పేరు వాన్నా క్రిప్ట్. -
హ్యాకర్లకే హ్యాకర్.. భలే ట్విస్టిచ్చాడు!
శాన్ఫ్రాన్సిస్కో : ఓ హ్యాకర్ ఏకంగా హ్యాకర్స్ ఫోరం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. 50వేల డాలర్లు ఇస్తే సరి.. లేకుంటే ఫోరం వద్ద ఉన్న దొంగ సమాచారం అంతా అమెరికా ప్రభుత్వానికి అమ్మేస్తానని బెదిరింపులకు దిగాడు. బేస్టూల్స్.డబ్ల్యూఎస్ అనే అండర్‌గ్రౌండ్ హ్యాకింగ్ ఫోరం తాము తస్కరించిన క్రెడిట్ కార్డుల సమాచారాన్ని, స్పామింగ్ టూల్స్‌ను, ప్రొఫైల్ డేటాను ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ఈ ఫోరంనకు 1.50 లక్షల సభ్యత్వం ఉందని బ్లీపింగ్‌కంప్యూటర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ పేర్కొంది. ఓ గుర్తు తెలియని హ్యాకర్ బేస్టూల్స్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి.. దానిలోని డాటాబేస్ కొంతభాగాన్ని ఆన్లైన్లో పెట్టాడు. తను డిమాండ్ చేసిన 50వేల డాలర్లు ఇవ్వకుంటే మిగతా సమాచారాన్ని అమెరికా ప్రభుత్వానికి చెందిన వివిధ కీలక శాఖలకు అమ్మకానికి పెడతానని బెదిరించాడు. హ్యాక్ అయినట్లు ధ్రువీకరించేందుకు గాను బేస్టూల్ వెబ్సైట్ లోగోను లాగిన్ వివరాలను, ఐపీ అడ్రస్‌ను ఆన్లైన్లో ఉంచాడు ఆ అజ్ఞాత హ్యాకర్. బేస్టూల్స్ వినియోగదారులు విక్రయానికి పెట్టే కొన్ని టూల్స్‌ను కూడా ఆన్లైన్లో ఉంచాడు. -
చైనా సైబర్ దాడులను తిప్పికొట్టలేమా..?
భారత కంపెనీలు, ప్రభుత్వ సంస్థలపై చైనా హ్యాకర్లు విరుచుకుపడితే దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా లేదని సైబర్ భద్రతా నిపుణులు రాహుల్ త్యాగి హెచ్చరించారు. ఈ తరహా దాడులకు ప్రభుత్వ సంస్థలు సులభంగా టార్గెట్ అవుతాయని, దురదృష్టవశాత్తూ ఈ దాడులను మనం గుర్తించగలిగే పరిస్థితిలో కూడా లేమని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో మనకు సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో అక్కడి నుంచి సైబర్ దాడులు జరగుతున్నాయని భ్రమింపచేసేలా చైనా హ్యాకర్లు ఐపీలతో మాయాజాలం చేస్తారని అన్నారు. ఐపీ అడ్రస్ ద్వారా ప్రతి కంప్యూటర్ను అది ఉపయోగించే ఇంటర్నెట్, దాని లొకేషన్‌ను గుర్తించవచ్చని, ఈ తరహా దాడులను పసిగట్టే సామర్ధ్యం మన ప్రభుత్వానికి లేదని ఎథికల్ హ్యాకర్ కూడా అయిన త్యాగి పేర్కొన్నారు. ఈ తరహా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు కొంత సమయం, నిధులను ప్రభుత్వం వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ దాడులను పసిగట్టి, నిరోధించేలా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. మరోవైపు యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ గుర్తించకుండా ఉండేలా హార్డ్‌వేర్‌లో మాల్వేర్(వైరస్)ను చైనా కంపెనీలు ప్రవేశపెట్టాయని గతంలో వార్తలు వచ్చాయి. భారత్ హార్డ్‌వేర్ కోసం అధికంగా చైనా దిగుమతులపైనే ఆధారపడటం కూడా ఆందోళన కలిగిస్తున్నది. -
విండోస్ లోపాలతోనే!
⇔ ఉక్రెయిన్ ప్రాథమిక లక్ష్యం ⇔ ‘పెట్యా’కు కారణాలు విశ్లేషించిన అంతర్జాతీయ సైబర్ నిపుణులు ⇔ ముంబై చేరుకున్న జాతీయ సైబర్ భద్రతా సలహాదారు శాన్ఫ్రాన్సిస్కో: విండోస్ సాఫ్ట్‌వేర్‌లో గతంలో వెలుగుచూసిన లోపాల కారణంగానే తాజా సైబర్ దాడి జరిగినట్లు అంతర్జాతీయ కంప్యూటర్ భద్రతా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉక్రెయిన్ను ప్రాథమిక లక్ష్యంగా ఎంచుకున్నట్లు చెప్పా రు. ‘పెట్యా’ రాన్సమ్వేర్ కారణంగా ఉక్రెయిన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైరస్ ప్రభావం భారత్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలను తాకింది. పెట్యా ప్రభావానికి గురైన తమ టర్మినల్ నుంచి సరకు రవాణాను దారి మళ్లించాలని జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎన్పీటీ) నిర్వహణ సంస్థ ఏపీ మొల్లర్–మాయిరెస్క్(ఏపీఎం)ను కోరింది. మూలం ఉక్రెయిన్‌లోనే: పెట్యా వైరస్ కంప్యూటర్లలోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై స్పష్టత రాలేదు. అందుకు ఈమెయిల్‌ను ఉపయోగించారని నిరూపించలేమని సిస్కో టాలోస్ నిఘా సంస్థ పేర్కొంది. సైబర్ దాడి జరగడానికి లొసుగులు, వాటి నుంచి ప్రయోజనం పొందడానికి ఉన్న మార్గాల గురించి గతంలోనే యూఎస్ జాతీయ భద్రతా ఏజెన్సీ సైబర్ ఆయుధాల పైరసీ పత్రాల్లో వెల్లడైంది. తాజా దాడి ఆ విధంగానే జరిగినట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ పన్ను అకౌంటింగ్ ప్యాకేజీ ‘మిడాక్’ సాఫ్ట్వేర్ అప్డేట్ సిస్టంల వల్లే వైరస్ విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దిద్దుబాటు చర్యలకు... దాడి ప్రభావాన్ని తగ్గించేందుకు జేఎన్పీటీ దిద్దుబాటు చర్యలకు దిగింది. జీటీఐ టర్మినల్లో కార్యకలాపాలు నెమ్మదించాయని, కాబట్టి ఆపరేషన్లను తాత్కాలికంగా మిగతా రెండు టర్మినళ్ల గుండా కొనసాగించాలని నిర్వహణ సంస్థ ఏపీఎంను కోరినట్లు అధికారి ఒకరు తెలిపారు. జీటీఐ టర్మినల్లో తలెత్తిన అంతరాయాలను పరిష్కరించడానికి, రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా నౌకరవాణా శాఖ, జేఎన్పీటీ చర్యలు తీసుకుంటున్నాయని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జేఎన్పీటీ పోర్టులో సమస్య పరిష్కారానికి జాతీయ సైబర్ జాతీయ భద్రతా సలహాదారుడు గుల్షాన్ రాయ్‌ను కేంద్రం హుటాహుటిన ముంబై పంపింది. సైబర్ దాడులు తమ దేశంలోఆగిపోయాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. చౌర్యానికి గురైన సమాచారాన్ని తిరిగి పొందడానికి సైబర్ నిపుణులు కృషిచేస్తున్నారని తెలిపింది. డబ్బులిస్తేనే...సమాచారం తిరిగిస్తామంటూ హ్యాకర్ల బేరసారాలు కీవ్: ‘వాన్నాక్రై’ రాన్సమ్వేర్ తరువాత ప్రపంచం మరో సైబర్ ముప్పును ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ లక్ష్యంగా ‘పెట్యా’ పేరుతో ప్రారంభమైన వైరస్ ఆ దేశంలో పలు ప్రైవేట్, ప్రభుత్వ బ్యాం కింగ్, ఇతర కంపెనీలపై ప్రభావం చూపిం ది. ఆ తరువాత క్రమంగా బ్రిటన్, యూరప్‌లోని ఇతర దేశాలతో పాటు, భారత్‌లోకి ప్రవేశించింది. ‘పెట్యా’ మాల్వేర్ అత్యంత శక్తిమంతమైనదని, నెట్‌వర్క్‌లోని ఒక సిస్టంలోకి ప్రవేశించిన తరువాత అత్యంత వేగంగా ఇతర సిస్టంలలోకి వ్యాపిస్తుందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరించా రు. పలు టెక్నిక్‌లతో ఆటోమేటిక్‌గా వ్యాప్తిచెందుతుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమని తెలిపా రు. మరోవైపు, యూరప్ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టిన పెట్యా ప్రభావం భారత్‌లో అంతంత మాత్రమే అని సాంకేతిక, సమాచార మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచంలోని 150 దేశాలపై సైబ ర్ దాడి ప్రభావం పడినట్లు సమాచారం. ముంబైలోని ‘జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎస్‌పీటీ)’ కూడా ఈ వైరస్ ప్రభావానికి లోనైంది. పెట్యా అంటే..? రష్యన్ భాషలో ‘పెట్యా’ అంటే రాయి అని అర్థం. వాస్తవానికి వైరస్ దాడి జరిగిన కొద్ది గంటల తర్వాత నిపుణులు గతంలో దాడిచేసిన రాన్సమ్‌వేర్‌కు తాజా వైరస్‌కు కొద్దిపాటి పోలిక మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాన్సమ్వేర్... మన కంప్యూటర్ను ఆధీనంలోకి తీసుకుని మనల్ని పని చేయకుండా నిరోధించడంతో పాటు.. డబ్బు డిమాండ్ చేస్తుంది. తాజా ‘పెట్యా’ దాడి నుంచి విముక్తి లభించాలంటే 300 డాలర్లు క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్) రూపంలో చెల్లించాలంటూ హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వ్యాపార సంస్థలపైనే గురి... తాజా సైబర్‌దాడికి యూరప్ దేశాల్లోని పెద్దపెద్ద సంస్థలు, బ్యాంకులు విలవిల్లాడిపోయాయి. దీని కారణంగా విద్యుత్తు వ్యవస్థ సైతం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రభుత్వ విభాగా లు, విద్యుత్తు సరఫరా సంస్థలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థలు, నౌకాయాన సంస్థలు, చమురు, సహజవాయు సంస్థలు, ఆహార సరఫరా సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పరిహారం డిమాండ్ చేస్తూ వచ్చిన హ్యాకర్ల సంక్షిప్త సందేశాలకు బదులుగా ఎన్ని సందేశాలు పంపినా తిరిగి సమాధానాలు రాలేదు. ముందు జాగ్రత్తలు కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడినట్లు గుర్తిస్తే వెంటనే ఇంటర్నెట్ తొలగించాలి. బయాస్ క్లాక్‌ని సవరించడంతో కొంత వరకు వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. అనుమానాస్పద మెయిల్స్‌ను తెరిచినా అటాచ్మెంట్లను క్లిక్ చేయొద్దు. కంప్యూటర్లోని ముఖ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవాలి. -
మరో భారీ సైబర్ దాడి..
► భారత్ సహా పలు దేశాల్లో ప్రభావం ► బాధిత జాబితాలో ప్రముఖ విదేశీ కంపెనీలు న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికించిన రాన్సమ్వేర్ ‘వాన్నాక్రై’ని మరవక ముందే మరో సైబర్‌దాడి మంగళవారం వెలుగుచూసింది. ఈసారి రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్,అమెరికా బ్రిటన్లతో పాటు భారత్‌లోనూ దాని ప్రభావం కనిపించింది. ఉక్రెయిన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించగా, బ్రిటన్‌లో పలు కంపెనీలు కూడా వీటి బారినపడ్డాయి. రష్యాలో అతిపెద్ద ఇంధన కంపెనీ రాస్‌నెఫ్ట్, ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సముద్ర రవాణా సంస్థ ఏపీ మోలర్–మయిరెస్క్ల(ఏపీఎం), అమెరికాలోని డ్రగ్ దిగ్గజం మెర్క్పై సైబర్ దాడులు జరిగినట్లు తెలిసింది. ముంబైలోని జేఎన్పీటీ పోర్టులో మూడు టర్మినళ్లలో ఒకదానిలో కూడా కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇవి కూడా రాన్సమ్వేర్ వాన్నాక్రై లాంటివే అని, కంప్యూటర్లపై పూర్తి ఆధిపత్యం చేజిక్కించుకొని, పరిహారం ఇచ్చిన తరువాతే సమాచారాన్ని విడుదల చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌లో బ్యాంకులే లక్ష్యంగా.. తమ దేశంలోని పలు బ్యాంకుల వెబ్సైట్లపై సైబర్ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ కేంద్ర బ్యాంకు ప్రకటించింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయాలు కలిగాయని పేర్కొంది. బాహ్య హ్యాకర్లు తమ దేశంలోని బ్యాంకు వెబ్సైట్లపై సైబర్ దాడులకు పాల్పడ్డారని తెలిపింది. ఫలితంగా వినియోగదారులకు సేవలందించడంలో బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. సైబర్ దాడులను ఎదుర్కొనేలా అన్ని బ్యాంకులు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయని వెల్లడించింది. జేఎన్పీటీ టర్మినల్‌పై దాడి భారత్‌లో ప్రభావానికి గురైన జేఎన్‌పీటీలోని జీటీఐ టర్మినల్‌ని ఏపీ మోలర్ నిర్వహిస్తోంది. మాల్వేర్ దాడితో ఏపీ మోలార్‌లో కంప్యూటర్లు స్తంభించడంతోనే జీటీఐ ప్రభావితమైందని జేఎన్పీటీ అధికారి తెలిపారు. హేగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఎం గుజరాత్‌లోని పిపావావ్ టర్మిన్‌ల్‌ను ఆపరేట్ చేస్తోంది. ‘పెట్యా’గా గుర్తింపు అంతకు ముందు కీవ్ విద్యుత్ కంపెనీ క్యీవెనెర్గోలో కూడా సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. తమ కంప్యూటర్లను తాకిన వైరస్‌ను ‘పెట్యా’గా గుర్తించినట్లు ఉక్రెయిన్ డెలివరీ సేవల కంపెనీ నోవా పోష్టా పేర్కొంది. సైబర్ దాడులు తమనే లక్ష్యంగా చేసుకున్నాయని పారిస్‌లోని పలు బహుళ జాతీయ కంపెనీలు పేర్కొన్నాయి. బ్రిటిష్ అడ్వర్టైజింగ్ దిగ్గజం డబ్ల్యూపీపీ, ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్లు తమపై దాడులు జరిగాయని, డేటా చౌర్యాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి. -
భారీ సైబర్ దాడి
- మళ్లీ పడగవిప్పిన ర్యాన్సమ్వేర్.. - రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్ సహా ఈయూ దేశాలు అతలాకుతలం - ఎయిర్‌పోర్టు, కార్యాలయాల్లో ఎక్కడిక్కడే నిలిచిన పనులు మాస్కో/లండన్: సైబర్ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ర్యాన్సమ్వేర్ వైరస్‌తో మంగళవారం మరోమారు యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దీంతో రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్, స్పెయిన్ తదితర దేశాల్లో కార్యకలాపాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. మొదటిగా రష్యాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ సైబర్‌దాడికి గురైనట్లు గుర్తించారు. కొద్దిసేపటికే ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని కంప్యూటర్లు వైరస్ దాడికి గురయ్యాయి. ఈ రెండు దేశాల్లోని ఫార్మా, మీడియా, బయోటెక్నాలజీ తదితర కంపెనీలన్నీ వైరస్ బారిన పడటంతో గందరగోళం నెలకొంది. భారత్ సహా ఆసియాదేశాలు, అమెరికాలపై సైబర్‌దాడి ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సిఉంది. అటు యూరప్‌లోని బ్రిటన్, స్పెయిన్‌లలోని పలు కంపెనీల ఆఫీసులు ర్యాన్సమ్ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. నెల రోజుల కిందటే ప్రపంచమంతా ర్యాన్సమ్వేర్ వాన్నాక్రై వైరస్ ధాటికి విలవిలలాడిన పరిస్థితి తెలిసిందే. ఇది చూశారంటే మీ ఫైల్స్ గోవిందా.. సైబర్‌దాడికి గురైన కంప్యూటర్ల స్క్రీన్లపై "If you see this text, then your files are no longer accessible, because they have been encrypted. Perhaps you are busy looking for a way to recover your files, but don't waste your time. Nobody can recover your files without our decryption service" అనే సందేశం ప్రత్యక్షమైంది. ఉక్రెయిన్‌కు భారీ దెబ్బ నేటి సైబర్ దాడితో అన్ని దేశాలకంటే ఎక్కువగా నష్టపోయింది ఉక్రెయినే అని ఆ దేశ ప్రధాని అన్నారు. ఎయిర్‌పోర్టు, కంపెనీల కార్యాలయాలన్నీ దాడికి గురయ్యాయని, గతంలో ఎప్పుడూ ఇంత నష్టాన్ని చవిచూడలేదని పేర్కొన్నారు. -
బ్రిటన్ పార్లమెంటుపై సైబర్ దాడి
లండన్: బ్రిటన్ పార్లమెంటుకు సంబంధించిన కంప్యూటర్ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి జరిగింది. శుక్రవారం రాత్రి తమ అధికారిక పార్లమెంటు ఈమెయిల్ ఖాతాలను తెరవలేకపోయామని పలువురు ఎంపీలు తెలిపారు. యూజర్ల ఖతాల్లో ప్రవేశించడానికి హ్యాకర్లు యత్నించినట్లు గుర్తించామని దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు. నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్‌తో కలసి తమ కంప్యూటర్ నెట్వర్క్ భద్రతను పెంచుతున్నామని చెప్పారు. బలహీనమైన పాస్‌వర్డ్‌లను గుర్తించేందుకు హ్యాకర్లు అన్ని ఖాతాలపైనా దాడికి దిగినట్లు పార్లమెంట్ డిజిటల్ సర్వీసుల బృందం సమాచారం అందజేసింది. బ్రిటన్ ఎంపీలు, అధికారుల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఆన్లైన్లో అమ్ముతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సైబర్ దాడి జరిగింది. -
కంపెనీలకు సైబర్ దాడుల ముప్పు
60 % సాఫ్ట్వేర్లు భద్రత లేనివే: ఈవై ముంబై: దేశంలో చాలా కంపెనీ లకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ (ఈవై) హెచ్చరించింది. కంపె నీలు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్లలో 60 శాతానికి పైగా నియంత్రణలకు అనువైనవి కావని (లైసెన్స్డ్ కానివి), వీటితో దాడులకు అవకాశం ఉందని తెలిపింది. ‘‘చాలా సంస్థలు హార్డ్‌వేర్ పరంగా భద్రతా చర్యలు తీసుకున్నాయి. కానీ, వాడే సాఫ్ట్వేర్ పట్ల అంత శ్రద్ధ చూపించలేదు. ఈ సాఫ్ట్వేర్లు నియంత్రణలకు అనువైనవి కావు’’అని ఈవై పార్ట్నర్ మాయ రామచంద్రన్ తెలిపారు. ఈవై ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో 49 శాతం మంది భద్రతా అధికారులు లైసెన్స్ లేని సాఫ్ట్వేర్ల వల్ల మాల్వేర్ల దాడి పొంచి ఉందని తెలిపారు. 26 శాతం ఉద్యోగులు తమ కార్యాలయ కంప్యూటర్లలో లైసెన్స్‌లేని బయటి సాఫ్ట్వేర్లను వినియోగించినట్టు చెప్పడం గమనార్హం. -
‘వాన్నక్రై’కి వచ్చింది రూ. 53 లక్షలేనా!
-
‘వాన్నక్రై’కి వచ్చింది రూ. 53 లక్షలేనా!
ప్రపంచంలో గత వారం రోజులుగా ‘వాన్నక్రై రాన్సమ్వేర్’ వైరస్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అయితే ఈ దాడిలో సైబర్ నేరస్థులు లాభపడింది మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటివరకు 82 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 52.85 లక్షలు) మాత్రమే నేరస్థులకు చేరినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు. ఈ సైబర్ దాడికి బాధ్యులైన వారిని కూడా త్వరలో పట్టుకోగలమని చెబుతున్నారు. గతంలో జరిగిన ‘కిప్టోవాల్’ సైబర్ దాడిలో నేరస్థులు 32.5 కోట్ల డాలర్లు ఆర్జించారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినంత వరకు ‘వాన్నక్రై’ కచ్చితంగా నేరమే. వైరస్ ద్వారా ఫైళ్లను తమ నియంత్రణలో ఉంచుకొని అడిగినంత డబ్బు చెల్లిస్తేనే రహస్య ఎన్క్రిప్షన్ కీ ద్వారా విడుదల చేస్తున్నందున ఇది నేరమేనని అంతర్జాతీయ సైబర్ నిఘా ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి. బ్యాకప్ ఫైళ్లకు అవకాశం లేని వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులనే ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల వాన్నక్రై నేరస్థులకు వాళ్లు ఆశించినంత ఎక్కువ డబ్బు ముట్టలేదట. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య స్కీమ్‌కు సంబంధించిన అతిపెద్ద నెట్‌వర్క్‌ను టార్గెట్ చేసినా, బ్యాకప్ ఫైళ్లు తమకు అవసరం లేదని నిర్వాహకులు వదిలేయడం వల్ల కూడా నేరస్థులు పెద్దగా లాభపడలేదు. డబ్బులు ఎక్కడి నుంచి ఎలా బదిలీ అవుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అంతిమంగా ఎక్కడికి చేరుతాయో గుర్తించడం ద్వారా నేరస్థులను అరెస్ట్ చేయగలమని అంతర్జాతీయ సైబర్ నేరాల పరిశోధన సంస్థలు తెలియజేస్తున్నాయి. -
అడల్‌కజ్‌తో మరో సైబర్ ముప్పు?
సాక్షి, హైదరాబాద్: సైబర్ ప్రపంచంపై మరో దాడికి రంగం సిద్ధమైందా.. వాన్నక్రై ర్యాన్సమ్ వేర్ తాకిడి నుంచి కోలుకోకముందే హ్యాకర్లు అడల్‌కజ్ పేరుతో మరో మాల్వేర్తో దాడి చేయనున్నారా.. వాన్నక్రై కంటే తీవ్రమైన నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందా..అంటే అవునంటోంది ప్రూఫ్ పాయింట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ. కంప్యూటర్లలోని ఫైళ్లన్నింటినీ కోడ్ భాషలోకి మార్చేసి సరిచేసేందుకు బిట్‌కాయిన్ కరెన్సీ ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం వాన్నక్రై ర్యాన్సమ్వేర్ తీరైతే.. అడల్‌కజ్ ఇలాంటివేవీ చేయదు. కానీ.. మీ కంప్యూటర్ల వేగాన్ని గణనీయంగా తగ్గించేస్తుంది. అదే సమయంలో ఇతర కంప్యూటర్లకు విస్తరిస్తూ... వర్చువల్ ప్రపంచపు బిట్‌కాయిన్ తరహా కరెన్సీ ‘మనెరో’కోసం వెతుకుతూంటుంది. అందిన మొత్తాన్ని వైరస్‌ను సృష్టించిన వారి అకౌంట్లలోకి జమచేస్తుంది. మాల్వేర్ల ద్వారా వర్చువల్ కరెన్సీని వెతకడం కొత్త కాకపోయినప్పటికీ ఇటీవలి కాలంలో భారీ ఎత్తున డబ్బు హ్యాకర్ల ఖాతాల్లోకి చేరుతున్నట్లు ప్రూఫ్‌పాయింట్ ఉపాధ్యక్షుడు రాబర్ట్ హోమ్స్ తెలిపారు. ఈ మాల్వేర్ రహస్యంగా పనిచేస్తూండటం వల్ల ఇది ఎప్పుడు, ఎలా విస్తరిస్తోందో మనెరో కరెన్సీ ఎంత సేకరిస్తోందో తెలియడం లేదని హోమ్స్ అంటున్నారు. బహుశా ఈ నెల 2న లేదంటే అంతకంటే ముందు ఏప్రిల్ 24 నుంచే ఇది వ్యాప్తి చెందుతూ ఉండవచ్చునని ప్రూఫ్‌పాయింట్ అంచనా వేస్తోంది. -
సచివాలయ కంప్యూటర్లపై వాన్నా క్రై దాడి!
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లను స్తంభింపజేసిన వాన్నా క్రై ర్యాన్సమ్వేర్.. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని పలు కంప్యూటర్లనూ తాకినట్లు అనుమానిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డిప్యూటీ కార్యదర్శి ఒకరు బుధవారం తన కంప్యూటర్ను ఓపెన్ చేసిన సమయంలో ఈ వైరస్ దాడి వెలుగుచూసింది. తన కంప్యూటర్ ఓపెన్ కాకపోవడంతో వెంటనే ఐటీ అధికారులను పిలిచానని, వైరస్ దాడి జరిగినట్లు ఈ సందర్భంగా గుర్తించామని ఆ అధికారి వివరించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని మరో 9 కంప్యూటర్లలోనూ ఇదే సమస్య తలెత్తినట్లు గుర్తించారు. అయితే సచివాలయంలో ఏ ఒక్క కంప్యూటరూ ర్యాన్సమ్వేర్ బారిన పడలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ 9 కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లను తొలగించినట్లు చెప్పారు. -
వైరస్ భయం.. బెంగళూరులో ఏటీఎంల బంద్
బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘వన్నా క్రై’ కంప్యూటర్ వైరస్ భయం బెంగళూరును కూడా తాకింది. దీంతో ముందుజాగ్రత్తగా పలుచోట్ల ఏటీఎంలను మూసివేశారు. మూడురోజులుగా ప్రపంచవ్యాప్తంగా వన్నా క్రై అనే ర్యాన్సమ్వేర్ కంప్యూటర్లకు వ్యాపిస్తూ ఆన్లైన్లో విధ్వంసం సృష్టిస్తుండడం తెలిసిందే. ఈ వైరస్ సోకిన కంప్యూటర్లు పనిచేయడం మానేస్తాయి. అందులోని సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. హ్యాకర్లు డిమాండ్ చేసినంత డబ్బు చెల్లిస్తేగానీ కంప్యూటర్ మళ్లీ పనిచేయదు. ఈ క్రమంలోనే బెంగళూరులో సోమవారం సాయంత్రం నాటికి కొన్ని ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను అనధికారికంగా మూసివేశారు. ఏటీఎంలలో ప్రస్తుతం విండోస్‌ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టం ఉందని దీనిలో భద్రతా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. దీంతో వన్నా క్రై మాల్వేర్ను తట్టుకునేలా విండోస్ ఎక్స్‌పీని అప్డేట్ చేయడం కోసం ఏటీఎంలను మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. బెంగళూరే కాకుండా మైసూరు, మంగళూరు, హుబ్లి–ధార్వాడ, బళ్లారి తదితర నగరాల్లోనూ అనేకచోట్ల ఏటీఎంలను బ్యాంకులు మూసివేశాయి. -
సంక్షోభంలో సైబర్ ప్రపంచం
సజావుగా, చురుగ్గా సాగిపోయే సైబర్ ప్రపంచం దుండగుల చేజిక్కితే ఎలా అట్టు డుకుతుందో, ఎంతటి నష్టం వాటిల్లుతుందో అందరికీ అర్ధమైంది. ఆ దుండగు లెవరో, వారు ఈ భూగోళంపై ఏమూలనున్నారో 48 గంటలుదాటినా వెల్లడి కాలేదుగానీ... ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లు మాత్రం హ్యాక్ అయ్యాయి. వాటిల్లోని విలువైన సమాచారాన్ని దుండగులు గుప్పిట బంధిం చారు. వెనక్కి ఇవ్వాలంటే 300 డాలర్ల చొప్పున చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్నిబిట్ కాయిన్ల రూపంలో తమకు చేర్చాలంటూ చిరునామాలు కూడా ఇచ్చారు. వారడిగినట్టే ఇప్పటికి దాదాపు 50,000 డాలర్లమేర చెల్లింపులు కూడా అయ్యాయని చెబుతున్నారు. ఈ సంక్షోభం పర్యవసానాలు సామాన్యంగా లేవు. ప్రపంచ దేశాల్లో అనేకచోట్ల మౌలిక సదుపాయాలన్నీ మూలనబడ్డాయి. బ్రిటన్‌లో జాతీయ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నవారికీ, ఇప్పటికే శస్త్రచికిత్సలు పూర్తి చేసుకున్నవారికీ ఏం మందులివ్వాలో, ఎలాంటి సలహాలివ్వాలో తెలియక వైద్యులు తలలు పట్టుకున్నారు. ఆస్పత్రుల్లో ఉన్నవారి పరిస్థితి ఇదైతే కొత్తగా వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చి తిప్పి పంపేశారు. జర్మనీలో రైల్వే వ్యవస్థ, వైమానిక వ్యవస్థ దెబ్బతిన్నాయి. మన దేశంతోపాటు అమెరికా, జపాన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, చైనా, ఈజిప్టు తదితర దేశాల్లో అనేకానేక సమస్యలు తలెత్తాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్ తదితర రంగాలు అస్తవ్యస్థమయ్యాయి. కంప్యూటర్ ఆన్ చేయగానే ఫైళ్లకు బదులు హెచ్చరిక కనబడేసరికి అందరూ అయోమయంలో పడ్డారు. ఆంధ్రప్రదే శ్లో చాలా పోలీస్స్టేషన్లలోని కంప్యూటర్లు స్తంభించాయి. బ్రిటన్‌లోని 22 ఏళ్ల సాఫ్ట్ వేర్ నిపుణుడొకరు యాదృచ్ఛికంగా అడ్డుకోనట్టయితే ‘వనా క్రై’ స్వైర విహారం మరింత నష్టం చేకూర్చేది. కంప్యూటర్లను హ్యాక్ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. దాదాపు 1989 మొదలుకొని ఈ దాడులు అడపా దడపా ప్రపంచంలో ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఫ్లాపీ డిస్కుల ద్వారా మాల్వేర్ను జొప్పించడంతో మొదలై ఇప్పుడు ఈ–మెయిళ్ల వరకూ చేరుకుంది. ఏదో ఒక పేరు చెప్పి కొన్ని లింకులు ఇవ్వడం, వాటిని క్లిక్ చేయగానే ప్రమాదకరమైన వైరస్ చొరబడే ఏర్పాటు చేయడం సర్వసాధారణమైంది. స్మార్ట్ ఫోన్లు సైతం ఈ వైరస్ల బారిన పడి పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పుడు ‘వనా క్రై’ లేదా ‘వనా డిక్రప్టర్’ పేరిట ప్రపంచాన్ని వణికి స్తున్న ర్యాన్సమ్ వేర్ కంప్యూటర్లలో ఉండే మొత్తం సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి నిరుపయోగంగా మారుస్తోంది. ఏళ్ల తరబడి శ్రమకోర్చి ఫొటోలు, వీడియోలు, ఇతర రూపాల్లో సేకరించి పెట్టుకున్న విలువైన సమాచారం కావొచ్చు... సంస్థలు నిర్మించుకున్న వ్యవస్థలు కావొచ్చు ఒక్క దెబ్బతో నిరుపయోగంగా మారడం దిగ్భ్రాంతికలిగిస్తుంది. వ్యక్తుల బ్యాంక్ ఖాతాలు, ఇతర వ్యక్తిగత అంశాలు దుండ గుల పాలబడితే ఎటువంటి పర్యవసానాలు సంభవించవచ్చునో ఊహకందదు. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఈ విద్యలో నిష్ణాతులైతే జరిగే ముప్పు అంతా ఇంతా కాదు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ మాల్ వైరస్ ప్రభావం కనబడినా మొత్తం మీద అంతా సజావుగా ఉన్నదని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెబుతున్నారు. వచ్చే నెల నుంచి సైబర్ సమన్వయ కేంద్రం ప్రారంభం కాబోతున్నది గనుక ఇక భయంలేదంటున్నారు. కానీ సైబర్ ప్రపంచం ఎలా చూసినా సురక్షితం కాదు. ఏ ఏ దేశాల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థలున్నాయో చూసి, వాటిని అధిగమించడమెలాగో లెక్కలేసుకుని ర్యాన్సమ్వేర్ను కనిపెట్టడం దుండగులకు నిత్యకృత్యం. అసలు ఈ వైరస్‌లను ఎవరో గుర్తు తెలియని దుండగులు మాత్రమే ప్రపంచం మీదకు వదులుతారని అనుకోవడం కూడా అమాయకత్వం. సాక్షాత్తూ అమెరికా, రష్యాలాంటి దేశాలే ఈ దుర్మార్గానికి ఒడిగడుతున్నాయి. భవిష్యత్తులో దుండగుల నుంచి ఎలాంటి ముప్పు ఎదు రుకానున్నదో అంచనా వేయడానికి, వాటిని అధిగమించాలంటే ఏంచేయాలో తెలుసుకోవడానికి ఈ వైరస్ల రూపకల్పన అవసరమని అవి చెబుతున్నాయి. ప్రస్తుత ర్యాన్సమ్వేర్ సైతం అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ) సృష్టే. ఈ వైరస్‌ను ఎవరో తస్కరించారని ఎన్ఎస్ఏ చెబుతున్నదాంట్లో నిజమెంతో ఎవరికీ తెలియదు. నష్టం మొదలయ్యాక తస్కరించారని చెప్పడానికి బదులు ముందే అప్రమత్తం ఎందుకు చేయలేదో అర్ధంకాదు. గతంలో ఇరాన్ అణు కార్యక్రమానికి అవరోధం సృష్టించడానికి వారి కంప్యూటర్ పోగ్రాంలను తారుమారు చేయడం మొదలుకొని అందులో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలను హతమార్చడం వరకూ అమెరికా అనేక రకాలైన ఎత్తుగడలను అమలు చేసింది. మొన్నటికి మొన్న ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం విఫలం కావడంలోనూ దాని పాత్ర ఉన్నదని వార్తలొచ్చాయి. కనుక అమెరికా సంజాయిషీని సంపూర్ణంగా విశ్వసించలేం. సైబర్ ప్రపంచం రూపకల్పన జరిగిపోయి మూడు దశాబ్దాలు గడిచిపోయింది. అది ఏ ప్రాతిపదికన పనిచేయాలో, దాన్ని కావాలని లేదా యాదృ చ్ఛికంగా ఉల్లంఘించిన దేశాలు, సంస్థలు ఎలాంటి శిక్షకు పాత్రులు కావాలో నిర్దేశించే అంతర్జాతీయ చట్టాలు లేవు. ఆ నిబంధనలే ఉంటే ప్రపంచ దేశాలకు ప్రస్తుతం జరిగిన నష్టానికి అమెరికా కోట్లాది డాలర్ల పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తలెత్తిన ఈ పరిస్థితులు చూశాకైనా తగిన నిబంధనల రూపకల్పన అవసరమని అన్ని దేశాలూ గుర్తించాలి. సర్వం ఆన్లైన్ చేసేయాలని తహతహ లాడుతున్న ప్రభుత్వాలు తమ ఆలోచనను పునస్సమీక్షించుకోవాలి. భద్రతలేని ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఉంచి దాన్ని గాల్లో దీపంగా మార్చడం, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకూ శ్రేయస్కరమో ఆలోచించాలి. -
‘వన్నాక్రై’ పై సెర్ట్–ఇన్ సూచనలు పాటించండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ నెట్‌వర్క్‌లను అస్తవ్యస్తం చేస్తున్న రాన్సమ్వేర్ ’వన్నాక్రై’ దాడుల బారిన పడకుండా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) సూచనలు పాటించాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అలాగే తమ తమ సిస్టమ్స్‌పై వైరస్ దాడులు జరగకుండా ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్డేట్ చేసి ఉంచాలని సూచించింది. రష్యా, బ్రిటన్ సహా 150 పైగా దేశాల్లోని ఐటీ నెట్‌వర్క్‌లను వన్నాక్రై దెబ్బతీసింది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ఎక్స్పీ వంటి పాత తరం ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తున్న కంప్యూటర్లు దీని బారిన పడ్డాయి. దీంతో.. రాన్సమ్వేర్ దాడుల నుంచి నెట్‌వర్క్‌లను రక్షించుకునేందుకు దేశీయంగా సంస్థలు తీసుకోతగిన చర్యల జాబితాను సెర్ట్–ఇన్ రూపొందించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్‌లో సీఎఫ్‌వో పోస్టు..: ఆర్బీఐ తొలిసారిగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) పోస్టును ఏర్పాటు చేసింది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈడీ హోదా ఉండే సీఎఫ్‌వో.. అకౌంటింగ్ విధానాల రూపకల్పన, ఆర్బీఐ ఆర్థిక సమాచారం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. -
అమెరికా నుంచి తస్కరించి..
ఇతర దేశాలు, సంస్థలు, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచే అగ్రరాజ్యం అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారానే ఈ భారీ సైబర్ దాడికి బీజం పడిందని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఎన్ఎస్ ఏ ఓ మాల్వేర్ను అభివృద్ధి చేసింది. ఎటర్నల్ బ్లూ అని పేరు పెట్టింది. విండోస్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న కొన్ని లోపాల ఆధారంగా దీన్ని తయారు చేశా రు. ‘షాడో బ్రోకర్స్’అనే హ్యాకర్ల బృందం తాము ఎన్ఎస్ఏ నుంచి ‘సైబర్ ఆయుధాల’ను దొంగిలించామని గతేడాదే ప్రకటించింది. కానీ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ బృందం తాము తస్కరించిన ఆయుధాలను ఏప్రిల్ 14న ఇంటర్నెట్లో డంప్ చేసింది. అందులోని ఎటర్నల్ బ్లూ మాల్‌వేర్‌నే ఇప్పుడు సైబర్ దొంగలు వనా క్రై/వనాక్రిప్టర్ పేరుతో తమ దాడులకు ఉపయోగించుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. ‘ప్రమాదమని హెచ్చరించినా పశ్చిమదేశాల సాఫ్ట్వేర్ మీద దాడి చేయగల ప్రమాదకర సైబర్ ఆయుధాలను ఎన్ఎస్ఏ తయారు చేసింది. ఎన్ఎస్ఏ తన ఆయుధాలను పోగొట్టుకున్న తర్వాత కాకుండా.. సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని మొదట గుర్తించినప్పుడే వెల్లడిస్తే ఈ దాడి జరిగేది కాదేమో’అని సైబర్ ఉద్యమకారుడు ఎడ్వర్డ్ స్నోడెన్ తప్పుపట్టారు. రెండు నెలల కింద మైక్రోసాఫ్ట్ ఈ లోపాలను సరిదిద్దుతూ అప్డేట్ ప్యాచ్‌లను విడుదల చేసింది. చాలామంది ఈ అప్డేట్ను తమ పీసీల్లో, నెట్‌వర్క్‌లలో ఇన్స్టాల్ చేసుకోలేదు. ఇలా అప్డేట్ చేసుకోని కంప్యూటర్లు తాజా సైబర్ దాడి బారిన పడ్డాయని చెబుతున్నారు. -
వనా క్రై.. వర్రీ!
- ఇదో కొత్త రకం ర్యాన్సమ్వేర్ - కీలక సమాచారాన్ని బ్లాక్ చేసే సాఫ్ట్వేర్ ఒక్కసారిగా మీ కంప్యూటర్లో ఉన్న ఫైళ్లేవీ తెరుచుకోకపోతే.. ఎర్రటి స్క్రీన్ వచ్చి మూడు రోజుల్లో 300 డాలర్లు కడితేనే మీఫైళ్లు మీరు చూసుకోగలరన్న హెచ్చరిక కనిపిస్తే.. గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లక్షలాది మంది పరిస్థితి ఇదే. ‘వనా క్రై’ అనే ర్యాన్సమ్వేర్ వైరస్ దాడే దీనికి కారణం. దాదాపు వందకుపైగా దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడ్డాయి. అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్ టూల్‌ను తస్కరించిన సైబర్ దొంగలు.. దాని సహాయంతో ఈ ‘వనా క్రై’ ర్యాన్సమ్వేర్ వైరస్‌ను రూపొందించడం గమనార్హం. ఈ వైరస్ కారణంగా కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు స్తంభించిపోవడంతో చాలా దేశాల్లోని ఆస్పత్రులు, టెలీకమ్యూనికేషన్లు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ వ్యవస్థల్లో సేవలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లూ దీని బారినపడ్డాయి. మరి ఏమిటీ ‘వనా క్రై’ ర్యాన్సమ్వేర్ వైరస్? దానితో ప్రమాదం, జరిగే నష్టాలు ఏమిటి? హ్యాకర్లు డిమాండ్ చేసిన డబ్బు చెల్లిస్తే సరిపోతుందా.. వంటి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనా క్రై’ దాడి, కారణాలు, పరిష్కారం తదితర అంశాలపై సాక్షి ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ వ్యాపించేది ఇలా.. ఇంటర్నెట్లో ర్యాన్సమ్వేర్ వ్యాపించేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వచ్చే ఈ–మెయిళ్లు.. వాటిల్లో ఉన్న లింక్‌లను క్లిక్ చేస్తే ముందుగా మీ పీసీలోకి ఆ తర్వాత దశలవారీగా మీ కాంటాక్ట్స్‌లో ఉన్న మెయిల్ అడ్రస్‌లకు విస్తరిస్తుంది. కొన్నిసార్లు మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్, ఇతర సాఫ్ట్వేర్లలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ర్యాన్సమ్వేర్లను పీసీలు, నెట్‌వర్క్‌లలోకి ప్రవేశపెడతారు. స్మార్ట్ఫోన్లలోనైతే ఎస్ఎంఎస్ లింకుల ద్వారా ర్యాన్సమ్వేర్ విస్తరించే అవకాశముంది. ర్యాన్సమ్వేర్ దాడులను యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కూడా గుర్తుపట్టలేవు. ఒకసారి కంప్యూటర్లోకి చొరబడ్డాక వైరస్ల మాదిరి ర్యాన్సమ్వేర్ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకునేలా హ్యాకర్లు వీటిని తీర్చిదిద్దుతారు. 1989లో తొలి అటాక్.. ప్రపంచం మొత్తమ్మీద తొలి ర్యాన్సమ్వేర్ అటాక్ 1989లో జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. జోసెఫ్ పాప్ అనే ఎయిడ్స్ పరిశోధకుడు ఈ దాడికి బాధ్యుడని గుర్తించారు. ఎయిడ్స్ ఎవరికి వచ్చే అవకాశముందో తెలుసుకునే సాఫ్ట్వేర్ ఉందంటూ జోసెఫ్ దాదాపు 90 దేశాల్లోని ఎయిడ్స్ పరిశోధకులకు 20 వేల ఫ్లాపీ డిస్క్‌లను పంపించాడు. దీంట్లోనే రహస్యంగా ఒక మాల్వేర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న ఈ మాల్వేర్.. కంప్యూటర్ను 90 సార్లు ఆన్/ఆఫ్ చేసిన తర్వాత మేల్కొంది. పీసీలన్నీ బ్లాక్ అయిపోయాయి. 189 డాలర్లు కట్టాలని కొన్ని పీసీలపై.. 378 డాలర్లు చెల్లించాలని మరికొన్ని పీసీలపై సందేశాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ర్యాన్సమ్వేర్ అటాక్‌ను ఎయిడ్స్ ట్రోజాన్ లేదా పీసీ సైబోర్గ్ అటాక్‌గా పిలుస్తారు. గత ఏడాది ర్యాన్సమ్వేర్ దాడులివీ.. ► మార్చిలో లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్ ప్రెస్బైటీరియన్ హాస్పిటల్ కంప్యూటర్ నెట్‌వర్క్‌పై ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. సమాచారాన్ని తిరిగి పొందేం దుకు ఆసుపత్రి యాజమాన్యం దాదాపు రూ.10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఇది జరిగిన కొన్ని వారాలకే జర్మనీతో పాటు యూకేలోని 28 నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్‌లు కూడా ఇలాటి దాడులకు గురయ్యాయి. ► ఏప్రిల్‌లో రేస్ కార్ల టీమ్ నాస్కార్ మిలియన్ డాలర్ల విలువైన సమాచారాన్ని టెస్లాక్రిప్ట్ అటాక్ కారణంగా కోల్పోయింది. ► మసాచూసెట్స్‌లోని ఓ చిన్న పోలీస్ స్టేషన్ కేసుల వివరాలు తిరిగి పొందేందుకు 500 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ► సెప్టెంబర్‌లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గెరీ వారం రోజులపాటు ఎన్‌క్రిప్ట్ అయిన తమ ఈ–మెయిళ్లను తిరిగి పొందేందుకు దాదాపు రూ.15 లక్షలు చెల్లించామని అంగీకరించింది. తప్పించుకునే మార్గం... జాగ్రత్తగా ఉండటమే.. మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ► గుర్తు తెలియని ఈ–మెయిళ్లు, వాటిల్లోని అటాచ్మెంట్లను ఓపెన్ చేయొద్దు ► కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా విండోస్‌లో ఎంఎస్17–010ను ఇన్స్టాల్ చేసుకోవాలి.. మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలు ఎప్పటికప్పుడు విడుదల చేసే సెక్యూరిటీ ప్యాచ్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ► ముఖ్యమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు పీసీతోపాటు కొన్ని ఇతర పరికరాల్లో బ్యాకప్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్, లేదా పెన్‌డ్రైవ్‌లలో బ్యాకప్ చేసుకోవడం ద్వారా ర్యాన్సమ్వేర్ అటాక్లలో నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ర్యాన్సమ్వేర్ దాడుల్లో భారత్ ర్యాంకు 5 తొలి మూడు స్థానాల్లో..అమెరికా, జపాన్, ఇటలీ సగటున హ్యాకర్లు డిమాండ్ చేసే మొత్తం 2015లో 294 డాలర్లు సగటున హ్యాకర్లు డిమాండ్ చేసే మొత్తం 2016లో 1077 డాలర్లు అనుకోకుండా అడ్డుకున్నాడు వనా క్రై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత విధ్వంసం సృష్టించినప్పటికీ బ్రిటన్‌కు చెందిన ఓ టెకీ అనుకోకుండా దీని వ్యాప్తిని అడ్డుకున్నాడు. వనా క్రై ర్యాన్సమ్వేర్ ఓ డొమైన్ (వెబ్సైట్)కు కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తోందని గుర్తించిన అతడు ఆ డొమైన్‌ను ఆన్లైన్లో కొనేశాడు. దీంతో వనా క్రైకు ఈ డొమైన్‌కు ఉన్న లింక్ తెగిపోయింది. ఫలితంగా దాని వేగం తగ్గిపోయిందని అతడు రాయిటర్స్ సంస్థకు వెల్ల డించాడు. అయితే హ్యాకర్లు తమ కోడ్‌ను మార్చేసి మళ్లీ దాడి చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. భారత్‌లో వ్యాప్తి తక్కువే.. ‘యూరప్‌లో ఈ ర్యాన్సమ్వేర్ శుక్రవారం వ్యాపించడం మొదలైంది. ఆ సమయానికి ఆసియా దేశాల్లో శనివారం సాయంత్రం అయి ఉంది. కాబట్టి భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాల్లో దీని వ్యాప్తి కొంత పరిమితంగానే ఉంది. అంతేకాకుండా ఈ ర్యాన్సమ్వేర్ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే నెట్‌వర్క్‌ల ద్వారా ఎక్కువ వేగంగా వ్యాపించగలదు. జపాన్‌లో పరిస్థితి ఏమిటన్నది సోమవారం ఉదయానికి గానీ తెలియదు. వారు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముంది’ – విక్రమ్ ఠాకూర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ మేనేజర్,నార్టన్ బై సైమాంటిక్ (యాంటీవైరస్ సాఫ్ట్వేర్సంస్థ) -
ప్రపంచాన్ని ఏడిపిస్తోంది!
► 100 దేశాలపై సైబర్ దాడి ► బ్రిటన్ నుంచి భారత్ వరకూ ‘వనా క్రై’ ప్రభావితం ► పెద్ద సంఖ్యలో కంప్యూటర్లకు వనా క్రై ర్యాన్సమ్వేర్ వైరస్ ► 300 డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామంటూ డిమాండ్ ► బ్రిటన్‌లో కుదేలైన వైద్య వ్యవస్థ.. అత్యవసర ఆపరేషన్లూ రద్దు ► జర్మనీ, స్పెయిన్లలో తీవ్ర నష్టం ► పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు కంప్యూటర్లూ హ్యాక్ ► ఇప్పటివరకూ 20 వేల డాలర్ల వసూళ్లు.. తిప్పికొట్టేందుకు నిపుణుల కృషి (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సైబర్ దొంగలు ప్రపంచంపై పంజా విసిరారు. భారత్ సహా దాదాపు వంద దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లను హ్యాక్ చేశారు. వాటిల్లోని డేటా మొత్తానికీ తాళం (ఎన్‌క్రిప్ట్) వేసేశారు. దానిని తీయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు ఉపయోగించిన ఆయుధం ‘వనా క్రై’ అనే వైరస్. ఈ వైరస్ వాస్తవంగా సృష్టించినది అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ). సైబర్ దొంగలు ఆ వైరస్‌ను తస్కరించి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లపై దాడి చేశారు. వారి బారినపడి బ్రిటన్‌లో చాలా ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చిన రోగులను చేర్చుకోకుండా తిప్పిపంపాల్సి వచ్చింది. ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఆపరేషన్లు, చికిత్సలు నిలిచిపోయాయి. జర్మనీలో రైళ్ల రాకపోకలు తెలియకుండా పోయాయి. స్పెయిన్‌లో టెలికమ్యూనికేషన్లు, గ్యాస్ వ్యవస్థలకు అంతరాయం కలిగింది. రష్యాలో బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వ కంప్యూటర్లు వెయ్యికి పైగా మూగబోయాయి. చైనాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఇబ్బందులపాలయ్యాయి. ఉత్తరకొరియాలోని ఆస్పత్రులూ ఇక్కట్లపాలయ్యాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 18 పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లు స్తంభించిపోయాయి. సైబర్ భద్రత చరిత్రలోనే ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. శుక్రవారం మొదలైన ఈ సైబర్ దాడి కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలకు విస్తరించింది. శనివారం మధ్యాహ్నానికి ఉధృతి కొంచెం నెమ్మదించింది. అయినా ఇంకా ముప్పు తొలగిపోలేదు. ఈ దాడి తమ పనేనని ఇంతవరకూ హ్యాకర్లెవరూ ప్రకటించలేదు. వనా క్రై దాడిని తిప్పికొట్టేందుకు ప్రపంచ దేశాల్లో సైబర్ భద్రతా నిపుణులు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. ‘విండోస్’లోని లోపాల ఆధారంగా.. ‘వనా క్రై’లేదా ‘వనా డిక్రిప్టర్’అనే ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ–మెయిల్ అటాచ్మెంట్లు, ఇతర ఫైళ్లు, డౌన్లోడ్ల ద్వారా కంప్యూటర్లలోకి ప్రవేశిస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న లోపాల ఆధారంగా ఇది కంప్యూటర్ను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కంప్యూటర్లోని సమాచారం (డేటా.. ఫైళ్లు) మొత్తానికి తాళం (ఎన్‌క్రిప్ట్) వేస్తుంది. దానిని తీయాలంటే 300 డాలర్ల విలువైన బిట్‌కాయిన్స్ (డిజిటల్ వర్చువల్ కరెన్సీ) చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఆ మొత్తం చెల్లించినా ఫైళ్ల తాళం తెరుచుకుంటుందన్న (డీక్రిప్ట్ అవుతుందన్న) గ్యారెంటీ లేదు. తొలుత స్వీడన్లో.. శుక్రవారం మొదట స్వీడన్లో ఈ ర్యాన్సమ్వేర్ సైబర్ దాడి వెలుగులోకి వచ్చింది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్‌లకు పాకింది. చాలా వేగంగా శుక్రవారం సాయంత్రానికే 100 దేశాలకు విస్తరించింది. శనివారం ఉదయానికి యూరప్, ఆఫ్రికా దేశాలతో పాటు మధ్య ఆసియా, అరబ్ దేశాలు, రష్యా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాల్లో వైరస్ విస్తృతి పెరిగింది. శనివారం సాయంత్రానికి విస్తృతి తగ్గడంతో పాటు ఆ సమయంలో ఆసియా దేశాలకు రాత్రి సమయం కావడంతో.. భారత్ సహా ఆసియా దేశాల్లో దీని ప్రభావం కొంచెం తక్కువగా ఉంది. వైరస్ దాడిని తొలుత గుర్తించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 75,000 దాడులు నమోదైనట్లు సైబర్ భద్రతా రంగ సంస్థ అవాస్ట్ వెల్లడించింది. గత 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడినట్లు గుర్తించింది. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, చైనా, ఇటలీ, ఈజిప్టు, ఇండియా సహా 99 దేశాల్లో 45,000కుపైగా దాడులను కాస్పర్స్కీ ల్యాబ్ సైబర్ భద్రతా నిపుణులు గుర్తించారు. బ్రిటన్ ఆస్పత్రులు అతలాకుతలం ప్రధానంగా ఈ ‘వనా క్రై’సైబర్ దాడి ప్రభావం బ్రిటన్‌లో చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశ జాతీయ ఆరోగ్య వ్యవస్థ దాదాపు కుప్పకూలినంత పనైంది. వైరస్ కారణంగా కంప్యూటర్లు స్తంభించిపోవడంతో ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నానికి 40 ఎన్హెచ్ఎస్ వ్యవస్థలు వైరస్ బారిన పడ్డాయి. చికిత్స కోసం వస్తున్న రోగుల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడానికి వీలులేకపోవడంతో వారిని వేరే ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వ్యాధులు, చికిత్సల వివరాలు కంప్యూటర్లలోనే ఉండిపోవడంతో చికిత్సలు నిలిచిపోయాయి. పాట్రిక్ వార్డ్ (47) అనే వ్యక్తి లండన్‌లోని సెయింట్ బార్తోలోమ్యూ ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఇటువంటి ఉదంతాలు ఎన్నో నమోదయ్యాయి. అత్యవసర రోగులు, క్షతగాత్రులను తరలించడానికి బయల్దేరిన అంబులెన్సులు మధ్యలోనే వెనుదిరిగాయి. ఆ ఆస్పత్రుల్లో రోగుల వివరాలు, వారి వ్యాధులకు సంబంధించిన సమాచారం హ్యాకర్ల బారిన పడిందేమోనన్న సందేహాలు తలెత్తాయి. దీంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం, నిరసనలు పెల్లుబికాయి. ఆన్లైన్లో వ్యాపారం చేయడానికి బ్రిటన్ అతి సురక్షితమైన దేశంగా మారుస్తామని శుక్రవారం ప్రధాన మంత్రి థెరెసామే ప్రకటించగా.. తర్వాతి 24 గంటల్లోనే భారీ సైబర్ దాడి జరగడం ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది. మరెన్నో దేశాల్లో.. ‘వనా క్రై’సైబర్ దాడికి మూలం జర్మనీ రైల్వే వ్యవస్థ డ్యూషే బాన్‌లో ఉందని ప్రస్తుతానికి నిపుణులు భావిస్తున్నారు. ఆ వ్యవస్థ నిఘా సాంకేతిక పరిజ్ఞానం ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నది. రైల్వేస్టేషన్లలో టికెట్ మెషీన్లు పనిచేయలేదు. రైళ్ల రాకపోకల వివరాలు ప్రదర్శించే బోర్డులు నిలిచిపోయాయి. నేరస్తులను పట్టుకునేందుకు జర్మనీ ఫెడరల్ క్రైమ్ పోలీస్ సంస్థ బీకేఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇక స్పెయిన్‌లో టెలిఫోనికా సహా భారీ టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, గ్యాస్ సంస్థలు ఈ వైరస్ దాడికి గురయ్యాయి. ఫ్రాన్స్‌లో రెనాల్ట్ సంస్థలో ఉత్పత్తి ఆగిపోయింది. అమెరికాలో ప్రఖ్యాత కొరియర్ సంస్థ ఫెడెక్స్ వైరస్ తాకిడితో కుదేలైంది. రష్యాలోనూ వెయ్యికిపైగా కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయని ఆ దేశ హోంశాఖ తెలిపింది. రష్యా ప్రభుత్వ బ్యాంకులపైనా వైరస్ దాడి జరిగినప్పటికి దానిని అడ్డుకున్నామని ప్రకటించింది. ఇక ఉక్రెయిన్, ఇండియాల్లోనూ ‘వనా క్రై’దాడి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ పాత వెర్షన్లు అధికంగా ఉపయోగించే దేశాలు కావడం, వాటిలో తాజా అప్డేట్లు ఇన్స్టాల్ చేసుకునే అవకాశం తక్కువగా ఉండటం వైరస్ దాడికి ఎక్కువ అవకాశమిస్తోందని క్యాస్పర్‌స్కీ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటిదాకా 20 వేల డాలర్లు.. ‘వనా క్రై’దాడికి పాల్పడ్డ సైబర్ నేరగాళ్లు శనివారం సాయంత్రానికి తమ డిమాండ్ల ద్వారా 20,000 డాలర్లు వరకు వసూలు చేసినట్లు ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్న సైబర్ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌తో సంబంధమున్న మూడు బిట్‌కాయిన్ ఖాతాలను, చిరునామాలను గుర్తించామని బిట్‌కాయిన్ అక్రమ లావాదేవీలను గుర్తించే ‘ఎలిప్టిక్’సంస్థ సహ వ్యవస్థాపకుడు టామ్ రాబిన్సన్ వెల్లడించారు. ఆ ఖాతాల నుంచి ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేసుకుంటే ఈ దాడికి పాల్పడ్డ వారిని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. అప్డేట్ చేసుకున్న వాళ్లు భద్రం: మైక్రోసాఫ్ట్ Ransom: Win32. WannaCrypt అనే మాలిసియస్ సాఫ్ట్వేర్ (వైరస్) దాడి నుంచి భద్రత కల్పించే సెక్యూరిటీ అప్డేట్ను తాము మార్చిలోనే అందించామని మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారు, విండోస్ అప్డేట్ చేసుకుంటూ ఉండేవారికి ఈ దాడి నుంచి భద్రత ఉందని స్పష్టం చేసింది. వినియోగదారులకు (ఈ సైబర్ దాడి నుండి) అదనపు భద్రత కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. స్తంభించిన ఏపీ పోలీసు కంప్యూటర్లు ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్స్టేషన్లలో దాదాపు 25 నుంచి 40 శాతం కంప్యూటర్లు కూడా ‘వనా క్రై’వైరస్ బారినపడినట్లు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఏపీలోని పలు జిల్లాల్లో కంప్యూటర్లు మొరాయించి పోలీసు సేవలు స్తంభించాయి. శనివారం కూడా ఆ పరిస్థితి కొనసాగింది. తొలుత సాంకేతిక లోపమని భావించిన పోలీసు వర్గాలు.. హ్యాకింగ్ అంశం తెలియడంతో కంగుతిన్నారు. తొలుత చిత్తూరు జిల్లాలోని ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించారు. హ్యాకర్లు ఈ–మెయిల్ ద్వారా రాన్సమ్వేర్ వైరస్‌ను పంపగా.. దాన్ని డౌన్లోడ్ చేసిన వెంటనే కంప్యూటర్లు పనిచేయడం మానేశాయి. దీనిపై తిరుపతి వెస్ట్‌జోన్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. ఇక చిత్తూరుతో పాటు కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పోలీస్ కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. నా సిస్టమ్ పదిలం: డీజీపీ తన కంప్యూటర్ ఐఓఎస్‌తో వాడుతున్నందున హ్యాకర్ల బారిన పడలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లోని పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని, అయితే కీలక సమాచారమేదీ సైబర్ నేరగాళ్లకు చిక్కలేదని తెలిపారు. హ్యాకైన కంప్యూటర్లను సరిచేసేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని.. ఏ సమాచారం హ్యాక్ అయినదీ త్వరలో గుర్తిస్తామని వెల్లడించారు. హ్యాకింగ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లను షట్‌డౌన్ చేసి పెట్టాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ వాటిని అలాగే ఉంచాలని డీజీపీ ఆదేశించారు. ఇక ఏపీలో హ్యాకింగ్ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఏపీ సీఐడీ డీజీ ద్వారక తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి, సమాచారమేదైనా తస్కరించారా? అన్న వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. కాగా తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఎనిమిది పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. రోజువారీ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని, మ్యాన్యువల్‌గా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని చెప్పారు. -
ప్రపంచ దేశాలను వణికిస్తున్న 'వాన్నక్రై'
లండన్: కంప్యూటర్ హ్యాకర్లు మరో సారి పంజా విసిరారు. ఏకంగా అమెరికా వాడే హ్యాకింగ్ టూల్స్‌నే దొంగిలించారు. తద్వారా వేలాది కంప్యూటర్లలో రాన్సమ్వేర్ వైరస్‌ను ప్రవేశపెట్టి సమాచారాన్ని చోరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే కంప్యూటర్లకు అత్యంత ప్రమాదకరమైన రాన్సమ్వేర్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జరిగిన రాన్సమ్వేర్ దాడుల్లో సుమారు వంద దేశాల కంప్యూటర్లు దీని బారిన పడ్డాయి. 'వాన్న క్రై' అనే పేరుతో కంప్యూటర్లలోకి చొచ్చుకుపోతున్న ఈ వైరస్..క్షణాల్లో కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. వైరస్ ఎంటరైన క్షణాల్లోనే..డబ్బు చెల్లిస్తేగానీ పని నడవదంటూ ఓ సందేశం కన్పిస్తోంది. ఆ వెంటనే మొత్తం ఐటీ వ్యవస్థ సమస్తం మొరాయిస్తుంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 45 వేలకు పైగా సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. సుమారు 60వేల కంప్యూటర్ల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. ప్రపంచంలో అత్యంత భద్రతా విభాగం ఉన్న అమెరికా భద్రతా విభాగం అమెరికా జాతీయ సెక్యూరిటీ సంస్థ ఉపయోగించే హ్యాకింగ్ టూల్స్‌తో ఈ సైబర్‌దాడులు జరిగాయి. ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్, యూకేలో పలు ప్రధాన ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వైరస్ పలు రూపాల్లో మెయిల్స్, ఉద్యోగ అవకాశాలను ఎరగా చూపి మన కంప్యూటర్లలో ప్రవేశిస్తుంది. అనంతరం కంప్యూటర్లోని విషయాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి డీక్రిప్ట్ చేయడానికి డబ్బు ఇవాలని డిమాండ్ చేస్తుంది. స్పెయిన్‌కు చెందిన టెలికం దిగ్గజం టెలిఫోనికా, పోర్చుగల్ టెలికాం, టెలిఫోనికా అర్జెంటీనా సంస్థలు దీని బారిన పడ్డాయి. ఈ సైబర్ దాడికి ప్రధానంగా బ్రిటన్‌లోని అత్యధిక ఆస్పత్రుల ఐటీ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దాంతో అక్కడి జాతీయ ఆరోగ్య సేవలు దాదాపు స్తంభించిపోయాయి. చేసేదిలేక ఆస్పత్రి సిబ్బంది...తమ కంప్యూటర్లను కట్టేసి అత్యవసర సేవలను ఇతర ఆస్పత్రులకు మళ్లించారు. ఐటీ వ్యవస్థ కుప్పకూలిన కారణంగా వైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని, రోగుల క్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని బ్రిటన్ వైద్యాధికారులు చెప్తున్నారు. సైబర్ అటాక్ కారణంగా మరో పెనుముప్పు కూడా ఎదురవుతోందని నిపుణులు భావిస్తున్నారు. 'వాన్నక్రై' వైరస్ ప్రధానంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన 'ఎటర్నల్ బ్లూ' అనే తాజా ప్యాచ్ ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. ఇంకోవైపు డబ్బు డిమాండ్ చేస్తూ కంప్యూటర్ తెరలపై దర్శమిస్తున్న సందేశాలు...ఇప్పుడు వాట్సాప్‌లోనూ ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. ఇది మరింత విస్తరించే ప్రమాదం వుందని, చరిత్రలో ఇదే అతి పెద్ద సైబర్ అటాక్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
హ్యాకింగ్.. షేకింగ్..
హ్యాకింగ్... ప్రపంచ ఆన్లైన్ భద్రతనే ప్రశ్నిస్తున్న పదం. మామూలు దొంగలకు దొంగతనం చేయాలంటే తలుపులు పగలగొట్టాలి. గోడలకు కన్నాలు వేయాలి. మారణాయుధాలతో బెదిరించాలి. కానీ హ్యాకర్లకు అవేమీ అవసరం లేదు. ఓ కంప్యూటర్, దానికి ఇంటర్నెట్, కొన్ని ఇతర పరికరాలు ఉంటే చాలు. ఇంట్లో కూర్చుని కాళ్లు కదలకుండా కోట్లు కొట్టేస్తారు. దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేస్తారు. ఎంత పెద్ద కంపెనీలనైనా కాళ్ల బేరానికి రప్పిస్తారు. ప్రపంచదేశాలన్నిటికీ పెద్దన్న లాంటి అమెరికానే హ్యాకర్లు కొన్ని గంటల పాటు స్తంభింపజేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆన్లైన్ వ్యవస్థ భద్రతపైనే ప్రస్తుతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాకింగ్ అంటే అనుమతి లేకుండా మన ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి ప్రవేశించడం. మన ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన వారిని దొంగలు అని ఎలా అంటామో వీరు కూడా అంతే. హ్యాకర్ అనే పదం 1980ల్లో మొదటిసారి వాడుకలోకి వచ్చింది. ఈ పదానికి వేర్వేరు అర్థాలున్నప్పటికీ ప్రధానంగా ఈ అర్థంతోనే ప్రపంచానికి తెలుసు. ప్రపంచాన్నే కుదిపేసిన హ్యాకింగ్ సంఘటనలివే.... అమెరికాపై సైబర్ దాడి – 2016 ఈ సంఘటన తాజాగా జరిగింది. గత శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ట్వీటర్, అమెజాన్, టంబ్లర్, రెడిట్ వంటి వెబ్సైట్ల సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. నగదు బదిలీకి అవసరమైన పేపాల్ కూడా పనిచేయలేదు. ఇంటర్నెట్కు అనుసంధానమయ్యే వెబ్ కెమెరాలు, రూటర్లు, సెట్‌టాప్ బాక్సులు, డీవీఆర్‌ల సాయంతో హ్యాకర్లు సైబర్‌దాడి చేశారు. అక్కడి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెండు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ హ్యాకర్లు మళ్లీ విరుచుకుపడటంతో మరో మూడు గంటల పాటు సేవలకు అంతరాయం కలిగింది. కేవలం అమెరికాలో కాకుండా యూరోప్‌లో కూడా ఈ తరహా సమస్యలు ఎదురయినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. భారత్‌లో డెబిట్ కార్డుల బ్లాక్ – 2016 ‘యస్ బ్యాంకు’కు సేవలందిస్తున్న ‘హిటాచీ పేమెంట్ సర్వీసెస్’ అనే సంస్థ కంప్యూటర్లలోకి మాల్వేర్(దొంగ సాఫ్ట్వేర్)ను పంపి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించారు. భారతదేశంలో ఏటీయం నెట్వర్క్ అన్ని బ్యాంకులతో అనుసంధానమై ఉండటం వల్ల అన్ని బ్యాంకుల ఖాతాదారుల సమాచారం చైనా దొంగల చేతికి చేరింది. ఈ వ్యవహారం మే, జూన్‌ల్లోనే జరిగినప్పటికీ తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందని వినియోగదారులు సెప్టెంబరులో ఫిర్యాదులు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 641 మంది ఖాతాదారుల నుంచి సొమ్ము పోయిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ లావాదేవీల విలువ రూ. 1.3 కోట్లు. దీంతో ముందస్తు జాగ్రత్తగా భారతదేశంలోని బ్యాంకులన్నీ కలిపి దాదాపు 32 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేశాయి. ఈ వ్యవహారంతో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ భద్రతపైనే సందేహాలు వ్యక్తమయ్యాయి. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్–2014 సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూపు మనందరికీ సుపరిచితమే. హాలీవుడ్ సినిమాలను రూపొందించే ఈ కంపెనీ వార్షిక టర్నోవరు కొన్ని దేశాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. స్పైడర్ మ్యాన్, మెన్ ఇన్ బ్లాక్, రెసిడెంట్ ఈవిల్ లాంటి ప్రఖ్యాత చిత్రాలను ఈ సంస్థే నిర్మించింది. అయితే 2014, నవంబరు 14న ఈ సంస్థకు సంబంధించిన అన్ని కీలక పత్రాలు, ఉద్యోగుల సమాచారం, ఆ సంస్థ నిర్మిస్తున్న ‘ది ఇంటర్వ్యూ’ అనే సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ‘గార్డియన్స్ ఆఫ్ పీస్’ అని తనకు తానే పేరు పెట్టుకున్న కొంతమంది హ్యాకర్లు ఇది తమ పనే అని ప్రకటించారు. ఈ చిత్రం ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ మీద వ్యంగ్యాత్మకంగా ఉంటుందని వార్తలు రావడంతో ఈ పని ఉత్తర కొరియా వారిదే అయి ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి. అప్పటికి నిర్మాణంలో ఉన్న జేమ్స్‌బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ స్క్రిప్టు కూడా లీకయిందని వార్తలు వచ్చినప్పటికీ ఆ స్క్రిప్టుకు వారు పేటెంట్ హక్కులు పొందడంతో ఎటువంటి నష్టం జరగలేదు. 2015–16 స్విఫ్ట్ బ్యాంక్ హ్యాకింగ్ ఈ ఆన్లైన్ దాడికీ, పైన పేర్కొన్న దాడికీ సంబంధాలుండి ఉంటాయని, రెండిటికీ పాల్పడింది ఉత్తర కొరియాకు చెందిన వారేనని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అసలేం జరిగిందంటే బంగ్లాదేశ్ జాతీయ బ్యాంకుకు చెందిన సుమారు రూ. 550 కోట్లను అక్రమంగా న్యూయార్క్‌కు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు తరలించారు. దీన్ని ‘స్విఫ్ట్ అలయన్స్ యాక్సెస్’ అనే సాఫ్ట్వేర్నుపయోగించి తరలించారు. వెంటనే ఇలాంటి సంఘటన ‘వియత్నాం కమర్షియల్ బ్యాంకు’లో కూడా జరిగింది. 2001–02 అమెరికా మిలటరీ కంప్యూటర్ల హ్యాకింగ్ గ్యారీ మెక్కానోన్ అనే ప్రబుద్ధుడు 2001 ఫిబ్రవరి నుంచి 2002 మార్చి మధ్య 13 నెలల కాలంలో అమెరికా మిలటరీ, నాసాకు చెందిన 97 కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. ఇదంతా అతను ఇంగ్లండ్‌లోని తన ప్రియురాలి ఇంట్లో కంప్యూటర్ నుంచి చేయడం విశేషం. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పెద్ద మిలటరీ సైబర్ నేరం. అయితే ఇతను అందులోని డేటాని దొంగిలించలేదు. మొత్తం సమాచారాన్ని డిలీట్ చేసేశాడు. అయితే ఇతనికి శిక్ష విధించే విషయంలో అమెరికా, ఇంగ్లండ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికీ దర్జాగా తిరుగుతున్నాడు. ఇవే కాకుండా ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్వీటర్ పాస్వర్డ్ ‘డాడాడా’ అని ఓ ప్రముఖ హ్యాకింగ్ సంస్థ ప్రకటించడం, అదే విధంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సామాజిక మాధ్యమాల ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలియడంతో సైబర్ భద్రతపై ఉన్న అనుమానాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ట్వీటర్ సీఈవో జాక్‌డోర్సే ట్వీటర్ ఖాతాను అవర్‌మైన్ అనే హ్యాకర్ల గ్రూపు హ్యాక్ చేసి ట్వీట్లు వేసింది. అయితే తాము సైబర్ భద్రతను పరీక్షించడానికే ఈ పని చేశామని వారంటున్నారు. ‘పాస్‌వర్డే’ ప్రాణం... ప్రస్తుతం ఆన్లైన్లో ఏం చేయాలన్నా ‘పాస్వర్డ్’ తప్పని సరి. పాస్వర్డ్ తెలిస్తే నీ వ్యక్తిగత జీవితంలోకైనా, ఆర్థిక జీవితంలోకైనా చాలా సులభంగా ప్రవేశించవచ్చు. కాబట్టి ప్రధానంగా పాస్వర్డ్లు కనుక్కోవడమే వీరి పని. దీనికి వీరు రకరకాల పద్ధతులు అవలంబిస్తారు. పాస్వర్డ్ క్రాకింగ్, స్పూఫింగ్ ఇందులో ప్రధానమైనవి. ► పాస్వర్డ్ క్రాకింగ్లో మన పాస్‌వర్డ్‌ను అంచనా వేయడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తారు. ► ఫిషింగ్ అంటే వివిధ రకాల ఈ–మెయిల్స్ ద్వారా మన పాస్‌వర్డ్‌ను కనుగొనడానికి ప్రయత్నించే విధానం. ఉదాహరణకు ‘మీరు లాటరీలో డబ్బు గెలుచుకున్నారు. డబ్బు మీ బ్యాంకు ఖాతాకు మళ్లించుకోవడానికి లాగిన్ అవ్వండి’ ఇలాంటివి ఫిషింగ్ మెయిల్స్. వీటి ద్వారా పాస్‌వర్డ్‌ను కోల్పోతే స్వయంకృతాపరాధమే అనవచ్చు. కాబట్టి అనవసరమైన మెయిల్స్‌కు స్పందించకుండా ఉండటమే మంచిది. ► డెబిట్ కార్డు పిన్ నంబరు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండటం, ఈ వివరాలను ఎవరికీ తెలియజేయకపోవడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడుకుండా ఉండవచ్చు. ► సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు, ఉంచకపోవడం, అనవసర ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌కు స్పందించకుండా ఉండటం మంచిది. హ్యాకర్లు ప్రధానంగా మూడు రకాలు వైట్ హ్యాకర్లు: వీరు సంస్థల కోసం పని చేస్తారు. తాము పని చేసే సంస్థల ఆన్లైన్ భద్రతను పరీక్షిస్తారు. తమ సంస్థల వెబ్సైట్లను తామే హ్యాక్ చేస్తారు. తద్వారా కంపెనీల ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడమే వీరి పని. బ్లాక్ హ్యాకర్లు: వీరినే మనం నేరగాళ్లు అనవచ్చు. ఎందుకంటే వీరు తమ స్వప్రయోజనాల కోసం ఆయా వ్యక్తులు, సంస్థల కంప్యూటర్లలోకి చొరబడతారు. అనంతరం దాన్ని తస్కరించడమో, నాశనం చేయడమో చేస్తారు. తస్కరించిన సమాచారాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే కేటుగాళ్లు కూడా ఉన్నారు. ఇతరుల బ్యాంక్ సమాచారం కాజేసి వారి ఖాతాల్లోని సొమ్ము కొట్టేయడం కూడా వీరి హస్తలాఘవమే. వీరి నుంచి తమ ఆన్లైన్ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో తెలీక అన్ని దేశాలూ తల పట్టుకుంటున్నాయి. గ్రే హ్యాకర్లు: పేరుకు తగ్గట్టే వీరు వైట్, బ్లాక్ హ్యాకర్లకు మధ్య తరహా అని చెప్పవచ్చు. ఆయా కంపెనీలు, వ్యక్తుల అనుమతి లేకుండా వారి కంప్యూటర్లు హ్యాక్ చేస్తారు. కానీ ఆ విషయం వారికి తెలియజేసి వారి వద్ద నుంచి పారితోషికం తీసుకుంటారు. అవసరమైతే వారి కంప్యూటర్ రక్షణ బాధ్యత కూడా వీరే తీసుకుంటారు. వీరు కాకుండా ‘స్క్రిప్ట్ కిడ్డీస్’ అనే మరో రకం హ్యాకర్లు ఉన్నారు. వీరికి తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా వేరే హ్యాకర్లు రాసిన లేదా తయారు చేసిన ప్రోగ్రాంలను ఉపయోగించి హ్యాకింగ్‌కు పాల్పడతారు. – ఏలేటి సాకేత్ రెడ్డి, సాక్షి, ఏపీ డెస్క్ -
ఎలక్షన్ డేపై అమెరికా ఆందోళన
జాక్సన్విల్లే : రష్యా సైబర్ దాడులతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికా, వచ్చే వారంలో జరుగబోయే ఎన్నికల రోజు మరోసారి ఆ దేశం సైబర్ ఎటాక్స్ చేస్తుందోమోనని భయపడుతోంది. అమెరికా సెక్యురిటీ, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ఈ భయాందోళలను వ్యక్తపరుస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే వివిధ మీడియా సంస్థలు అమెరికాను హెచ్చరించాయి. ఈ ఎటాక్స్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనప్పటికీ, రిజల్ట్స్ చట్టబద్ధతపై సందేహం వ్యక్తమయ్యే అవకాశముందుని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రష్యా సైబర్ ఎటాక్స్ అంచనాలు అమెరికా గూఢచార్య ఏజెన్సీలలో మరింత భయాందోళనలను నెలకొల్పుతున్నాయి. దాడులు జరిగితే అవి రాజకీయ సంక్షోభానికి దారితీస్తాయని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. అయితే అమెరికా ఎన్నికల ఫలితాలనేమీ రష్యా ఖరారు చేయదని హోస్ ఇంటెలిజెన్స్ కమిటీలో టాప్ డెమోక్రాట్ అడమ్ బి స్కిఫ్ మండిపడుతున్నారు. రష్యన్ లేదా ఇతర వ్యక్తులు మంగళవారం జరుగబోయే అధ్యక్ష ఎన్నికలను అణగదొక్కాలని చూస్తున్నారని, ఈ క్రమంలోనే వారు హ్యాకింగ్‌కు ప్లాన్ చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు సైతం అనుమానిస్తున్నట్టు ఎన్బీసీ న్యూస్ రిపోర్టు చేసింది. అసలైన ఓటింగ్‌లో లేదా ఓట్ కౌంటింగ్‌లో ఏమైనా తప్పుదోవలు జరిగినట్టు తెలిస్తే, అది సీరియస్ ఉల్లంఘనగా పరిగణిస్తామని ముందుగానే రష్యాకు వార్నింగ్‌లు వెళ్లాయి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కేవలం టెక్నికల్‌గానే కాక, మెసేజింగ్ వంటి పలువిషయాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సైబర్ దాడులకు అవకాశం ఇవ్వమని అధికారులు పేర్కొంటున్నారు. స్టేట్స్లో ఓటింగ్ మిషన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంచడం లేదని, వివిధ స్థాయిల్లో విస్తృతమైన పర్యవేక్షణను ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. -
తప్పు ఒప్పుకున్న చైనా సంస్థ
అమెరికా,యూరప్ ప్రాంతాలలో కలకలం రేపిన సైబర్ దాడికి తమ టెక్నాలజీనే వాడుకున్నట్టు నిఘా వీడియో కెమెరాల విడిభాగాలు ఉత్పత్తిచేసే చైనా సంస్థ ప్రకటించింది. ట్విట్టర్, అమెజాన్ స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ లాంటి వందల ప్రముఖ వెబ్ సైట్ల హ్యాకింగ్ కు 'మిరాయ్' సాఫ్ట్ వేర్ లోని మాల్వేర్(వైరస్)ను వాడుకున్నట్టు చైనాకు చెందిన ప్రముఖ సీసీ టీవీల తయారు సంస్థ హాంగ్జూ జియాంగ్ మయి అనే టెక్నాలజీ సంస్థ ఒప్పుకుంది. తమ అజాగ్రత్త మూలాంగానే తాము తయారుచేసిన సీసీ టీవీల ద్వారా, ఈ సైబర్ దాడి జరిగినట్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ కు సంబంధించి మిరాయ్ పెద్ద విధ్వంసకారి అని జియాంగ్ ప్రతినిధి కూపర్ వాంగ్ వ్యాఖ్యానించారు. దీన్ని అక్రమంగా వాడుకున్న హ్యాకర్లు తమకూ కష్టాలు తెచ్చిపెట్టారని, తామూ నష్టపోయామని ఒప్పకుంటున్నా మన్నారు. డిఫాల్ట్ పాస్ వర్డ్ ని మార్చుకోని డివైస్ లపై ఈ వైరస్ సహాయంతో హ్యాకర్లు దాడిచేశారని తెలిపింది. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్‌ల (డీడీఓఎస్)లో మిరాయ్ వైరస్ ద్వారా చొరబడ్డట్టు పేర్కొంది. గత ఏడాది తాము ఈ లోపాన్ని గుర్తించామని, అప్పటినుంచి హ్యాకర్లు తమపై దాడి చేస్తూనే ఉన్నారని వెల్లడించింది. సెప్టెంబర్ 2015 తరువాత తయారైన తమ కెమెరాలలో ఈ లోపాన్ని గుర్తించామని, యూజర్లు ఈ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఈవిషయాలను సీఎన్ఎస్ మనీ రిపోర్టు చేసింది. మరోవైపు సమాచారాన్ని దొంగిలించే ఈమెయిల్స్(ఫిషింగ్ మెయిల్స్)లోని కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌లపై దాడి చేస్తారు. అనంతరం డిజిటల్ వీడియో రికార్డర్లు(డీవీఆర్), కేబుల్ సెట్ టాప్ బాక్సులు, రూటర్లు, వెబ్ కెమెరాలకు వైరస్ వ్యాపిస్తుంది. ప్రస్తుత దాడి ఇలానే జరిగిందని నిపుణులు అంచనావేశారు. మిరాయ్ ప్రోగ్రాం కోడ్ నెల క్రితమే ఇంటర్నెట్లో పెట్టారని, హ్యాకర్లు ఆ కోడ్ ద్వారా సైబర్ దాడులకు పాల్పడుతున్నారని ఫ్లాష్ పాయింట్ భద్రతా పరిశోధన డెరైక్టర్ అల్లిసన్ నిక్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అమెరికాపై సైబర్ దాడి
ట్వీటర్, అమెజాన్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్‌తో సహా స్తంభించిన వందల సైట్లు ► ఇంటర్నెట్ రూట్లు, ట్రాఫిక్ నియంత్రణ సంస్థపై హ్యాకర్ల దాడి ► హ్యాకింగ్‌లో కొత్త పుంతలు... వెబ్ కెమెరాలు, రూటర్లు, డీవీఆర్‌ల సాయం ► మిరాయ్ సాఫ్ట్వేర్ కోడ్ సాయంతో వైరస్ అటాక్ ►11 గంటలు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ఇంజనీర్లు ►అమెరికా తూర్పు కోస్తా, కాలిఫోర్నియాతో పాటు యూరప్‌పైనా ప్రభావం వాషింగ్టన్: అమెరికాలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి ప్రముఖ వెబ్సైట్ సేవలు నిలిచిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక కోట్ల మంది వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గుర య్యారు. నగదు బదిలీకి వాడే పేపాల్ పనిచేయకపోవడంతో అయోమయం నెలకొంది. ఇంటర్నెట్కు అనుసంధానమైన వెబ్‌కామ్‌లు, రూటర్లు, సెట్‌టాప్ బాక్సులు, డీవీఆర్‌ల సాయంతో హ్యాకర్లు సైబర్ దాడి చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికాలో ఇంటర్నెట్ రూట్లతో పాటు ట్రాఫిక్‌ను నియంత్రిస్తోన్న న్యూ హ్యాంప్‌షైర్‌కు చెందిన డైన్ కంపెనీ(ఐఎస్పీ)పై దాడితో సమస్య వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో(భారత కాలమానం) దాడి జరగగా.... ఇంజినీర్లు శ్రమించి రెండు గంటల అనంతరం సేవల్ని పునరుద్ధరించారు. రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ దాడి జరగడంతో డైన్ కంపెనీ సర్వర్లు నిలిచిపోయాయి. దీంతో మూడు గంటల పాటు సేవల్ని నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తెచ్చామని, అన్ని సైట్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆ కంపెనీ ప్రకటించింది. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్‌ల (డీడీఓఎస్) ముప్పు ఉందంటూ గతవారమే అమెరికా అంతర్గత భద్రతా విభాగం హెచ్చరించింది. సర్వర్లపై డీడీఓఎస్ల దాడి డైన్ వెల్లడించిన వివరాల మేరకు... ‘వె బ్సైట్ డొమైన్లను హ్యాకర్లు టార్గెట్ చేశారు. డీడీఓఎస్ పేరిట వేలకొద్దీ అభ్యర్థనలు(రిక్వెస్ట్స్) మా సర్వర్లపై దాడి చేశాయి’ అని పేర్కొంది. అమెరికా తూర్పు కోస్తా ప్రాంతంలోని డీఎన్ఎస్(డొమైన్ నేమ్ సిస్టమ్)పై డీడీఓఎస్లు దాడి చేశాయని డైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ హిల్టన్ తెలిపారు. ఇది ఎవరు చేశారనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎన్ఎన్, ద గార్డియన్, వైర్డ్, హెచ్‌బీఓ వంటి సైట్లు కూడా పనిచేయలేదని ప్రముఖ టెక్నాలజీ వెబ్సైట్ గిజ్మోడో తెలిపింది. డౌన్‌డిటెక్టర్.కామ్ సమాచారం ప్రకారం... అమెరికా తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్ రాష్ట్రాల్లో లెవల్ 3 సమాచార వెబ్సైట్ల సేవల్లో అంతరాయం ఏర్పడింది. అనంతరం అమెరికా తూర్పు మధ్య ప్రాంతం, కాలిఫోర్నియాల్లో కూడా అనేక వెబ్సైట్ల సేవలు ఆగిపోయాయి. యూరప్‌లో కూడా నెట్‌ఫ్లిక్స్, ట్విటర్ వంటి వైబ్సైట్లు నిలిచిపోయాయి. తూర్పు యూరప్‌లోని యూజర్లకు కొద్దిసేపు తమ సేవలు నిలిచిపోయినట్లు అమెజాన్ వెబ్ సేవల విభాగం తెలిపింది. శుక్రవారం రాత్రి లండన్‌లో ట్విటర్‌తో పాటు మరికొన్ని సైట్లు పనిచేయలేదు. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే తమ నెట్‌వర్క్‌లు ప్రభావితం కాలేదని పేపాల్ సంస్థ వెల్లడించింది. డైన్ సంస్థ అధికారి కైలే యార్క్ మాట్లాడుతూ... ‘చాలా తెలివిగా దాడి చేశారు. మేం సమస్యను పరిష్కరించగానే... మళ్లీ దాడి మొదలుపెట్టేవారు. ప్రతీసారి అలాగే జరిగింది’ అని తెలిపారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో రంగంలోకి దిగిన అమెరికా అంతర్గత భద్రతా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించారు. హ్యాకర్లకు వరంగా మిరాయ్ ప్రోగ్రాం సులువుగా వాడే మిరాయ్ ప్రోగ్రాం ఆధారంగా హ్యాకర్లు దాడికి పాల్పడ్డట్లు గుర్తించారు. హ్యాకర్లు వినియోగించే డార్క్ వెబ్‌లో మిరాయ్ ప్రోగ్రాం కోడ్ ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా నెట్‌కు అనుసంధానమైన పరికరాల్ని చాలా సులువుగా తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. సమాచారాన్ని దొంగిలించే ఈమెయిల్స్(ఫిషింగ్ మెయిల్స్)లోని మాల్వేర్(వైరస్)ను వాడుకుని మిరాయ్ సా్ఫ్ట్వేర్తో కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌లపై దాడి చేస్తారు. అనంతరం డిజిటల్ వీడియో రికార్డర్లు(డీవీఆర్), కేబుల్ సెట్ టాప్ బాక్సులు, రూటర్లు, వెబ్ కెమెరాలకు వైరస్ వ్యాపిస్తుంది. ప్రస్తుత దాడి ఇలానే జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. మిరాయ్ ప్రోగ్రాం కోడ్ నెల క్రితమే ఇంటర్నెట్లో పెట్టారని, నేర బృందాలు ఆ కోడ్‌ను సైబర్ దాడులకు వినియోగిస్తోందని ఫ్లాష్ పాయింట్ భద్రతా పరిశోధన డెరైక్టర్ అల్లిసన్ నిక్సన్ పేర్కొన్నారు. -
ట్విట్టర్, అమెజాన్ పై గ్లోబల్ సైబర్ ఎటాక్
-
ట్విట్టర్, అమెజాన్ పై గ్లోబల్ సైబర్ ఎటాక్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ ఇంటర్నెట్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారనే వార్త తాజాగా కలకలం రేపుతోంది. ప్రముఖ ట్విట్టర్, అమెజాన్ సహా ఇంటర్నెట్ సేవలు అందించే ఇతర ముఖ్యమైన వెబ్సైట్లు సైబర్ దాడికి గురైనట్టు తెలుస్తోంది. గత రెండురోజులుగా వివిధ వెబ్ సైట్లు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ (డీడీఓఎస్)దాడికి గురవుతున్నట్టు అమెరికాకు చెందిన ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రకటించింది. అలాగే డౌన్ డిటెక్టర్. కామ్ వెబ్ సైట్ అమెరికా, యూరప్ మీదుగా ఈ దాడి జరిగిందంటూ కొన్ని మ్యాప్ లను కూడా పోస్ట్ చేసింది. దీనిపై అమెరికా ఫెడరల్ బ్యూరోఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విచారణ మొదలు పెట్టింది. మేజర్ ఇంటర్నెట్ దిగ్గజాల సేవలకు అంతరాయం ఏర్పడిందని ఇంటర్నెట్ సేవ సంస్థ డిన్ వెల్లడించింది. సుమారు రెండు గంటల్లో ఈ సేవలను పునరుద్ధరించినట్టు పేర్కొంది. అయినా తమ ఇంజనీర్లు ఈ సమస్య పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని చెప్పింది. ఈ దాడిని 'గ్లోబల్ డీడీఓఎస్ ఎటాక్' గా డిన్ కార్యనిర్వాహక ఉప ప్రెసిడెంట్ స్కాట్ హిల్టర్ అభివర్ణించారు. ముందుగా ఇంటర్నెట్ సేవల బ్యాక్ బోన్ గా పిలవబడే అమెరికా తూర్పు తీరంలో చాలా భాగం, టెక్సాస్ లో లెవల్ 3 కమ్యూనికేషన్స్ లో శుక్రవారం దాడి మొదలైందనీ, ఇది శనివారం కూడా కొనసాగి మిడ్వెస్ట్ , కాలిఫోర్నియా ప్రాంతాలకు వ్యాపించిందని వివరించారు. దాడుల సంక్లిష్టత తమకు పెద్ద సవాలుగా మారిందని డిన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ కైల్ యార్క్ చెప్పారు. ఇది అందించిన సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, రెడ్ ఇట్ , ఇతర సాఫ్ట్ వేర్ డెవలపర్ సైట్ గిట్ హబ్ లు ఈ సైబర్ ఎటాక్ ప్రభావానికి లోనయినట్టు తెలుస్తోంది. దీని మూలంగా లక్షలకొద్దీ యూజర్లు ఇంటర్నెట్ సేవలను అందుకోలేక పోవడం, లేదా స్లో అవడం జరిగిందని వెల్లడించింది. ముఖ్యంగా సీఎన్ఎన్ , ది గార్డియన్, వైర్, హెచ్‌బీవో లాంటి మీడియా సంస్థలతో సహా మనీ ట్రాన్స్ ఫర్ సంస్థ పే పాల్ కూడా ఫిర్యాదులు అందాయని గిజమాడో వెబ్ సైట్ తెలిపింది. మరోవైపు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ కూడా స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందనీ, అన్ని హానికరమైన కారణాలు పరిశోధిస్తున్నామని డీహెచ్స్(డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్సెక్యూరిటీ) ప్రతినిధి గిలియన్ క్రిస్టియన్ పేర్కొన్నారు. -
లీకైన ఆ ఫొటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్
తాజాగా మరో హీరోయిన్ సైబర్ దాడుల వలలో పడింది. కన్నడ హీరోయిన్ సోనూ గౌడ (శృతి రామకృష్ణన్) వ్యక్తిగత ఫొటోలు ఆన్లైన్లో లీక్ కావడం దుమారం రేపింది. కొన్ని న్యూస్ చానెళ్లు ఆ ఫొటోలను ప్రసారం చేయడం సోనూ గౌడను ఇబ్బందిపరిచింది. ఓ వ్యక్తితో ఆమె అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న మూడు ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సోను గౌడ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్లైన్లో లీకైన ఫొటోల్లో ఉన్న వ్యక్తి తన భర్త మనోజ్ గౌడ అని ఆమె తెలిపింది. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో సోనుగౌడ సన్నిహితంగా మెలుగుతున్నదని, అతనితో దిగిన ప్రైవేటు ఫొటోలు లీక్ అయ్యాయంటూ కొన్ని చానెళ్లు విపరీత ప్రచారం చేయడం సోనుగౌడను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీంతో చానెళ్లు, తన ఫొటోలు లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 2008లో ’ఇంతి నిన్న ప్రీతియా’ అనే కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సోనూ గౌడ కన్నడంతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఇటీవల పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఆమె పలు కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. -
సైబర్ ఎటాక్ లో 72శాతం భారత కంపెనీలు
ముంబయి: భారత్ లో కంపెనీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సైబర్ ఎటాక్ లకు లోనవుతున్నాయని ఓ సర్వే తేల్చింది. ఇప్పటి వరకు మొత్తం 72శాతం భారత కంపెనీలు సైబర్ ఎటాక్ కు గురయ్యానని, వాటి నుంచి బయటపడేందుకు అవి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఏపీఎంజీ సైబర్ క్రైం సర్వే నివేదిక-2015 తేల్చింది. ప్రతి రోజు ఏదో ఒక కంపెనీ ఈ ఎటాక్ కు గురవుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 'ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం 72శాతం కంపెనీలు సైబర్ దాడులకు గురయ్యాయి. తమ సంస్థలకు అతిపెద్ద ప్రమాదం సైబర్ దాడుల వల్లే వస్తుందని 94శాతం కంపెనీలు తెలియజేశాయి' అని సర్వే తెలిపింది. -
వంద బ్యాంకుల నుంచి రూ. 1862 కోట్ల దోపిడీ!
ప్రపంచంలోని 30 దేశాల్లో గల 100 బ్యాంకులు అత్యాధునికమైన సైబర్ దాడికి గురయ్యాయి! ఈ దాడిలో రూ. 1862 కోట్లు దోచుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కీ ల్యాబ్ ఈ విషయాన్ని గుర్తించి చెప్పింది. అనుమానాస్పద సాఫ్ట్వేర్ ద్వారా హ్యాకర్లు సుదీర్ఘ కాలం పాటు బ్యాంకింగ్ సిస్టంలలోకి చొరబడ్డారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరించింది. రష్యన్లు, చైనీయులు, యూరోపియన్లతో కూడిన గ్యాంగు దాదాపు రూ. 1862 కోట్లను దోచుకున్నారట! ఈ సొమ్మును చిన్న చిన్న మొత్తాలుగా మార్చేసి, ప్రపంచంలోని అనేక బ్యాంకులకు పంపేశారు. వీటిలో ఎక్కువ మొత్తం జపాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లండ్, అమెరికాలోని బ్యాంకులకు వెళ్లింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. కావల్సిన సమయాల్లో కావల్సిన ఏటీఎం మిషన్ల నుంచి డబ్బులు వాటంతట అవే బయటకు వచ్చేలా చేసి, ఆ సొమ్మును నొక్కేశారట!