
వంద బ్యాంకుల నుంచి రూ. 1862 కోట్ల దోపిడీ!
ప్రపంచంలోని 30 దేశాల్లో గల 100 బ్యాంకులు అత్యాధునికమైన సైబర్ దాడికి గురయ్యాయి! ఈ దాడిలో రూ. 1862 కోట్లు దోచుకున్నారు.
ప్రపంచంలోని 30 దేశాల్లో గల 100 బ్యాంకులు అత్యాధునికమైన సైబర్ దాడికి గురయ్యాయి! ఈ దాడిలో రూ. 1862 కోట్లు దోచుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్స్కీ ల్యాబ్ ఈ విషయాన్ని గుర్తించి చెప్పింది. అనుమానాస్పద సాఫ్ట్వేర్ ద్వారా హ్యాకర్లు సుదీర్ఘ కాలం పాటు బ్యాంకింగ్ సిస్టంలలోకి చొరబడ్డారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరించింది.
రష్యన్లు, చైనీయులు, యూరోపియన్లతో కూడిన గ్యాంగు దాదాపు రూ. 1862 కోట్లను దోచుకున్నారట! ఈ సొమ్మును చిన్న చిన్న మొత్తాలుగా మార్చేసి, ప్రపంచంలోని అనేక బ్యాంకులకు పంపేశారు. వీటిలో ఎక్కువ మొత్తం జపాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లండ్, అమెరికాలోని బ్యాంకులకు వెళ్లింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. కావల్సిన సమయాల్లో కావల్సిన ఏటీఎం మిషన్ల నుంచి డబ్బులు వాటంతట అవే బయటకు వచ్చేలా చేసి, ఆ సొమ్మును నొక్కేశారట!