ఫోన్‌ కాల్‌తో రూ.1.95 కోట్లు కొట్టేశారు.. డబ్బుల్ని డ్రా చేయడం మరిచిపోయారు | Cyber Fraudsters Duped A Woman To The Tune Of Rs 1 Crore | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కాల్‌తో రూ.1.95 కోట్లు కొట్టేశారు.. డబ్బుల్ని డ్రా చేయడం మరిచిపోయారు

Published Fri, Mar 14 2025 9:24 PM | Last Updated on Fri, Mar 14 2025 9:30 PM

Cyber Fraudsters Duped A Woman To The Tune Of Rs 1 Crore

సాక్షి,హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రంగా ఓ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, ఆ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రమేష్‌ (పేరు మార్చాం) ఫోన్‌కు సంస్థ ఛైర్మన్‌, ఎండీ సురేష్‌ ఓ ప్రాజెక్ట్‌ నిమిత్తం ముందస్తు చెల్లింపులు చేయాలి. అర్జంట్‌గా నా అకౌంట్‌కు రూ.1.95కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరడమే ఆ మెసేజ్‌ సారాశం. మెసేజ్‌తో పాటు వాట్సప్‌ డిస్‌ప్లేలో ఉన్న ఫొటో తన ఎండీ సురేష్‌దేనని నిర్ధారించుకున్నాక ఆయన అకౌంట్‌కు అడిగిన మొత్తం పంపాడు.

పంపిన కొద్ది సేపటికి అసలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ తన బ్యాంక్‌ అకౌంట్స్‌ నుంచి రూ.1.95కోట్లు ట్రాన్స్‌ఫరయినట్లు వచ్చింది. కంగుతిన్న ఎండీ సురేష్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సురేష్‌ను సంప్రదించాడు.  

సురేష్‌ తన వాట్సప్‌కు మీరు పంపిస్తే నేను డబ్బులు పంపారని చెప్పడంతో పాటు ఆధారాల్నిచూపించాడు. దీంతో మోసపోయామని గుర్తించారు. సదరు సంస్థ ప్రతినిధులు వెంటనే తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేసింది.

సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్‌సీఆర్‌పీ డబ్బులు ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయో ట్రాక్‌ చేసింది. ప్రారంభంలో వివరాలు లేకపోవడంతో డబ్బులు ఎవరికి? ఎక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయో నిర్ధారించడం కష్టంగా మారింది.

ఎన్‌సీఆర్‌పీ సంస్థ ఎండీతో కలిసి బ్యాంక్‌ నోడల్‌ అధికారుల్ని సంప్రదించారు. డబ్బులు ఏ బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారో గుర్తించారు. అదృష్టం కొద్దీ సైబర్‌ నేరస్తులు డబ్బుల్ని దొంగిలించారు. కానీ వాటిని బ్యాంక్‌ అకౌంట్‌ను డబ్బుల్ని డ్రా చేసుకోలేకపోయారు. దీంతో సైబర్‌ నేరస్తులు బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి తిరిగి బాధిత సంస్థ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో కథ సుఖాంతమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement