fruads
-
తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు
నల్లగొండ జిల్లా :సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది.ఈసారి సైబర్ నేరగాళ్ల అమాయకుల్ని మోసం చేసేందుకు ప్రజా ప్రతినిధుల్ని ఎంచుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యుల పేరుతో సైబర్ నేరగాళ్ల వాట్సాప్ కాల్స్ చేశారు.ఎమ్మెల్యే వేముల వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు మెసేజ్, వాట్సాప్ కాల్స్ చేశారు. సైబర్ కేటుగాళ్ల గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వీరేశం తన పేరుతో మెసేజ్‌లు,కాల్స్ వస్తున్నాయని,అలాంటి వాటికి స్పందించొద్దని కోరారు. -
HYD: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకుని మాదాపూర్‌లోని మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో, మోసపోయామని భావించిన దాదాపు 200 మంది నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. ఉద్యోగం ఆశ చూపించి దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసింది సదరు కంపెనీ. ఇలా.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది.ఈ క్రమంలో శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ ఇప్పించినట్టు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. అనంతరం.. కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో బాధితులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. దీంతో, మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీకి బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
TG: ఫౌండేషన్ పేరుతో భారీ మోసం.. ప్లాట్స్ ఇస్తామని 540 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో తెలంగాణలో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. తాజాగా ఇది మోసమని తేలడంతో బాధితులకు పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం..‘ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమలాకర్ శర్మ బాధితులను కోరారు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని వారిని మభ్యపెట్టారు. ఈ క్రమంలోనే పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్స్ ఇస్తామని ఆశ చూపించారు. ఇలా దాదాపు నాలుగు వేల మంది దగ్గర సుమారు రూ.540 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇక, బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం.ఇక, తాజాగా బాధితులందరూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్దులను సీసీఎస్‌కు అటాచ్ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. -
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
సైబర్ నేరస్తులు బెంగళూరులోని ఆర్బీఐ ఉద్యోగిని నిండా ముంచారు. అందిన కాడికి రూ.24.5లక్షలు దోచుకున్నారు. నగరంలోని కన్నింగ్‌హామ్ రోడ్ ప్రాంతంలో నివసించే ఆర్బీఐ ఉద్యోగికి లాజిస్టిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ పేరుతో ఓ అగంతకుడు ఆమెకు కాల్ చేశాడు. మేడం.. మీ పేరుతో ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్లో ముంబైలో ఐదు పాస్‌పోర్ట్‌లు, 5 కిలోల బట్టలు, మూడు క్రెడిట్ కార్డ్‌లతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. ముంబై పోలీసులు మీ పార్శిల్‌పై ఆరా తీశారు. ఈ కాల్‌ను ఇప్పుడే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం..అంటూ ప్లాన్ ప్రకారం.. కాన్ఫిరెన్స్ కాల్లో మరో సైబర్ నేరస్తుడు లైన్లోకి వచ్చాడు. తనిను తాను ముంబై సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పార్శిల్ విదేశానికి సంబంధించింది. అది మీ పేరుమీద ఉంది. మీ ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్‌గా ఉపయోగించారని అన్నాడు. మీ బ్యాంక్ అకౌంట్‌ను మనీ ల్యాండరింగ్‌కు ఉపయోగించారని మరింత బయపెట్టించాడు.ఈ కేసు సున్నిమైంది ఎవరికి చెప్పొద్దు. మీ బ్యాంక్ అకౌంట్‌ను పరిశీలిస్తున్నాం. ఆ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని మేం చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు పంపించండి. విచారణ పూర్తయిన వెంటనే మీ డబ్బుల్ని మీకు పంపిస్తామని హామీ ఇచ్చాడు. సైబర్ నేరస్తుడి మాటల్ని నమ్మని బాధితురాలు తొలిసారి రూ.14.2 లక్షలు, రెండో సారి మరో అకౌంట్‌కు రూ.5.5 లక్షలు, మూడో అకౌంట్‌కు రూ.4.8 లక్షలు పంపింది. మొత్తంగా రూ.24.5లక్షల ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే మరుసటి రోజు తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అదే రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్ని రోజులు ఆన్లైన్లో సైబర్ నేరస్తులు.. దొంగచాటుగా ఓటీపీ సాయంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్లలో సొమ్మును కాజేయడం రివాజుగా మారింది.కానీ రాను రాను సైబర్ మోసగాళ్లు తెలివి మీరుతున్నారు. తాజాగా, చెల్లెమ్మా.. మేం మీకు దేవుడిచ్చిన అన్నయ్యలం అంటూ అందిన కాడికి సొమ్మును దోచేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్నోకు చెందిన ఓ మహిళను రవికుమార్, రాణా ప్రతాప్ సింగ్, మనోజ్ కుమార్‌లు పరిచయం చేసుకున్నారు. ఆ మహిళ తమపై నమ్మకం పెరిగేలా మెసిలారు. రోజులు గడుస్తున్నాయి. మాటలు కోటలు దాటాయి.ఆన్ లైన్ స్నేహాలు కాస్తా.. ఆఫ్ లైన్లోనే ఇరువురి ఫోన్‌నెంబర్లు ఇచ్చు పుచ్చుకునే వరకు వెళ్లింది. గుడ్ మార్నింగ్‌లు, గుడ్నైట్లు..ఫెస్టివల్ విషెస్‌తో ఆమెపై అన్న ప్రేమను ఒలకబోసేవారు. వారిపై ఆమెకు నమ్మకం కలగడంతో వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండేది. అయితే ఓ రోజు త్వరలో తన పెళ్లి రోజు అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఆ ముగ్గురికి చెప్పింది. అంతే ఆమె డబ్బును కాజేయాలని కేటుగాళ్లు ప్లాన్ చేశారు.ప్లాన్‌లో భాగంగా మనోజ్‌కుమార్ బాధితురాలికి ఫోన్ చేసి పెళ్లి రోజు సందర్భంగా ఖరీదైన పెళ్లి కానుక ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు షిప్పింగ్ అవసరాల కోసం తన ఆధార్ కార్డు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లను షేర్ చేసింది.కట్ చేస్తే విమానాశ్రయంలో తాను కొన్న ఖరీదైన గిఫ్ట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకున్నారని, దానిని విడిపించేందుకు కొంత మొత్తం చెల్లించాలని మనోజ్ ఆమెకు ఫోన్ చేశాడు. డబ్బులు చెల్లించేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఫలితంగా బెదిరింపులు ఎక్కువయ్యాయి. నేను చెప్పినట్టు చేయకుంటే సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని ప్రమేయం చేసి నన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించాడు. బెదిరింపుల కారణంగా, ఒత్తిడికి గురైన ఆమె క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో రూ.1.94 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మోసపోయామంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అభిజిత్ శంకర్ తెలిపారు. ఆన్లైన్లో దొరికే ప్రేమల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇలాగే నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. -
నగరవాసికి 'జపాన్' జాబ్ కలకలం! బెంగళూరు జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో ఉద్యోగం ఉందంటూ నగరవాసిని నట్టేట ముంచారు సైబర్ నేరస్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.29.27 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూసాపేటకు చెందిన యువతి గత జులైలో ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతకగా.. ఓ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఈ–మెయిల్ వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థలో సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం ఉందని మెయిల్ సారాంశం. ఆగస్టు నెలలో కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న కోజిన్ నాకాకిత బాధితురాలిని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశాడు. ఆ మర్నాడు ఉదయం ఆమె మెయిల్‌కు కంపెనీ నుంచి జాబ్‌కు సెలెక్ట్ అయ్యావంటూ జీతభత్యాలు, బెనిఫిట్స్‌తో కూడిన ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే డాక్యుమెంటేషన్, జీఎస్టీ ఇతరత్రా చార్జీల కోసం రూ.33,780 డిపాజిట్ చేయాలని ప్రతినిధులు సూచించడంతో.. నిజమేనని నమ్మిన ఆమె సొమ్మును బదిలీ చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికి పెట్టుబడుల మీద 40 శాతం బోనస్‌తో కలిపి వస్తాయని ఆశ చూపించడంతో రూ.29,27,780 పెట్టుబడులు పెట్టింది. జీ–20 సదస్సుతో క్యాన్సిల్ అంటూ.. ఢిల్లీలో జపాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని బాధితురాలిని నమ్మించారు. రోజులు గడుస్తున్నా మీటింగ్ ఖరారు కాకపోవడంతో ఆరా తీయగా.. ఢిల్లీలో జీ–20 సమావేశాల నేపథ్యంలో మీటింగ్ వాయిదా పడిందని మాయమాటలు చెప్పారు. ఈసారి సమావేశం బెంగళూరులో అక్టోబర్ నెలలో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశం కూడా జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు బెంగళూరులోని జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి ఖంగుతింది. అసలు సదరు జపాన్ కంపెనీ ఎలాంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టలేదని తెలిసింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. ఇవి చదవండి: సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే? -
సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు
ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రచయిత్రి సుధా మూర్తి బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించారు.రెండు వేర్వేరు ఘటనల్లో తన పేరును ఉపయోగించి లావణ్య, శ్రుతి అనే పేరుతో ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడ్డారంటూ ఆమె తరఫున తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమత సంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మమత సంజయ్ ఫిర్యాదు మేరకు .. 2023 ఏప్రిల్ 5న సుధా మూర్తికి ఓ ఈమెయిల్ వచ్చింది. కన్నడ కూట ఆఫ్ నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్సీ) సంఘం 50వ వార్షికోత్సవానికి అధితులుగా రావాలనేది ఆ మెయిల్ సారాంశం. అయితే అదే నెల ఏప్రిల్ 26న ఆ మెయిల్‌కు సుధా మూర్తి ఆఫీస్ ప్రతినిధులు స్పందిస్తూ.. బిజీ షెడ్యూల్ వల్ల కేకేఎన్సీ ఈవెంట్‌కు రాలేరని సమాధానం ఇచ్చారు. సుధా మూర్తి పర్సనల్ అసిస్టెంట్‌గా కానీ ఆగస్టు 30న మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారంటూ ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుధా మూర్తి కేకేఎన్సీ నిర్వాహకుల నుంచి వివరాల్ని సేకరించారు. ఈ సందర్భంగా తాను సుధామూర్తి పర్సనల్ అసిస్టెంట్‌గా పరిచయం చేసుకున్న లావణ్య అనే మహిళ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తేలింది. అంతేకాదు ఆమె పలువురిని నుంచి నగదు వసూలు చేసినట్లు తేలింది. ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు అమెరికాలో ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి సుధా మూర్తి హాజరవుతున్నారంటూ శ్రుతి అనే మరో మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లావణ్య, శ్రుతి పేరుతో మోసం చేసిన వారిపై సుధా మూర్తి వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ మోసానికి పాల్పడిన మహిళలు ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఆ ఇద్దరు మహిళలపై ఐపీసీ-419 (మోసం), 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-66(సి), 66(డి) సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఘరానా మోసం.. పెట్రోల్ బంకుల్లో కొన్నేళ్లుగా చిప్ దందా.. లీటర్‌కు బదులు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెట్రోల్ బంక్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు బంక్ యజమానులు ఎలక్ట్రానిక్ చిప్‌లతో తక్కువ పెట్రోల్ పోస్తూ వాహనదారుల జేబులకు గండికొడుతున్నారు. తాజాగా, నగరంలోని పలు బంకుల్లో ఎస్వోటీ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కొందరు బంక్ యజమానులు చిప్ అమర్చి లీటర్‌కు రూ.10 గండి కొడుతున్నట్టు గుర్తించారు. వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నట్టు కనుగొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చీకటి దందా జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని గట్టిగా విచారించడంతో నగరవ్యాప్తంగా పలు బంకుల్లో చిప్‌లు అమర్చినట్టు నిందితులు వెల్లడించారు. -
సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!
ఫిన్‌టెక్ రంగంలో భారత్‌పే సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్, ఆయన సతీమణి మాధురీ మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అష్నీర్‌ను సెలవుల మీద పంపించి.. అంతర్గత విచారణ ద్వారా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అష్నీర్‌కు తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత్‌పే. ఆయన భార్య మాధురీ జైన్‌ను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాదు ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కంట్రోలర్ హోదాలో ఆర్థికపరమైన అవకతవకలకు మాధురి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మాధురీ జైన్.. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు, దుస్తులు, ఎలక్ట్రిక్ సామాన్లు, అమెరికా.. దుబాయ్‌కి ఫ్యామిలీ ట్రిప్స్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అల్వరెజ్ అండ్ మార్షల్ కంపెనీ నిర్వహించిన దర్యాప్తులో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యాయి. ఫేక్ ఇన్వాయిస్లతో కంపెనీని ఆమె మోసం చేయాలని ప్రయత్నించినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. అష్నీర్ గ్రోవర్ ఆరోపణలన్నింటిని ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను కంపెనీని వీడాలంటే.. తన వాటాగా ఉన్న 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తన నాయకత్వంలోనే కంపెనీ ముందుకెళ్లాలని చెప్తున్నాడు. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుండడం విశేషం. సంబంధిత వార్తలు: భర్తతో కలిసి బండబూతులు తిట్టిన మాధురీ! -
ఆన్లైన్ లోన్ తీసుకుంటే తప్పవు తిప్పలు
-
టీడీపీ ప్రభుత్వ హయాంలో CMRF నిధుల గోల్మాల్
-
చిట్టీల పేరుతో రూ.4కోట్లకు టోకరా!
సాక్షి, విజయవాడ సెంట్రల్: ఇంటి చుట్టుపక్కల వారితో ఎంతో నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో సుమారు రూ. 4కోట్ల వరకు వసూళ్లు చేసిన ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఉడాయించిన ఘటన సత్యనారాయణపురం శ్రీనగర్‌కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. శనగల బాలాజీరావు అనే వ్యక్తి చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులతో కలసి శ్రీనగర్‌కాలనీ మొదటి లైన్లో సొంత ఇంట్లో ఉంటున్నారు. గత పదిహేనేళ్లుగా ఇంటి చుట్టుపక్కల వారితో నమ్మకంగా చిట్టీలు కట్టించుకోవడం, వడ్డీకి అప్పులు తీసుకుంటూ సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండేవాడు. దీంతో అతనిపై నమ్మకం కలగటంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అతని వద్ద చిట్టీలు వేయడంతో పాటు పెద్ద మొత్తంలో వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. ఈ క్రమంలో గత లాక్డౌన్ నుంచి చిట్టీలు పూర్తయిన వారికి, అప్పులు ఇచ్చిన వారికి చెల్లింపులు చేయకుండా.. రేపు, మాపు అంటు కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో బాధితులు అతనిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బాలాజీరావు గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటిని అమ్మివేసి ఈ నెల 16వ తేదీ రాత్రి కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. బాధితుల ఆందోళన.. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు సుమారు 20 మంది మంగళవారం బాలాజీరావు ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎన్‌పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు హామీ ఇవ్వడంతో వారంతా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది ఫిర్యాదు చేయగా.. ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 30 లక్షల వరకు నగదు తీసుకోవడంతో పాటు చిట్టీలు పూర్తయిన వారికి రావాల్సిన బకాయిలు మొత్తం సుమారు రూ. 4కోట్ల వరకు ఉంటుందని బాధితులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. -
ఆన్ లైన్ రుణాల కేసులో చార్జిషీట్ దాఖలు
-
కేటుగాళ్ల చేతిలో మోసపోయిన సీఎం కూతురు
ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ ఓ కేటుగాడి చేతిలో మోసపోయింది. వివరాల ప్రకారం.. ఓ ప్రముఖ ఆన్లైన్ స్టోర్‌లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మలనుకున్న హర్షితకు కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. మొదట కొద్ది మొత్తంలో డబ్బును హర్షితా అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసి ఆమెను నమ్మించాడు. తర్వాత హర్షిత పంపిన క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఆమె అకౌంట్లోని 34వేల రూపాయలను దోచేశాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ రూ.15లక్షల టోకరా
అతనో ఉపాధ్యాయుడు, తన కొడుకు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థితిలో ఉండాలని కోరుకున్న ఓ తండ్రి కూడా. అయితే ఆ తండ్రి ఆశను ఓ మోసగాడు అడ్డంగా వాడుకున్నాడు. నీ కొడుక్కి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించి లక్షల్లో సొమ్ము కాజేశాడు. భవిష్యత్తులో కొడుకు డాక్టర్ అవుతాడన్న ఆనందంలో అసలు మోసాన్ని గ్రహించలేని ఆ తండ్రి మాయగాడి ఉచ్చులో పడి దశలవారీగా లక్షలకు లక్షలు అతని ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత అసలు మోసం తెలిసి ఆవేదనతో అక్కడే కుప్పకూలాడు. మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకుని దర్యాప్తుకు రంగం సిద్ధం చేశారు. వివరాలిలా ఉన్నాయి. సాక్షి కోనేరుసెంటర్ (విజయవాడ) : పెడనకు చెందిన కట్టా నాగమోహనరావు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు ఇంటర్ పూర్తి చేసి ఇటీవల ‘నీట్’ రాశాడు. 406 మార్కులు సాధించాడు. ఊహించిన స్థాయిలో మార్కులు రాకపోవటంతో ఎంబీబీఎస్ సీటు రాలేదు. అయితే కలకత్తా నేషనల్ మెడికల్ కళాశాల నుంచి పంకజ్‌కుమార్‌శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను మెడికల్ కళాశాలలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నానని నాగమోహన్‌రావుకు చెప్పాడు. రూ.15 లక్షలు ఫీజు చెల్లిస్తే సీటు కేటాయిస్తామంటూ నమ్మించాడు. దీంతో నాగమోహనరావు దశలవారీగా అతను చెప్పిన 062422010028920 బ్యాంక్ అకౌంట్లోకి సొమ్ము జమ చేశారు. మొదటిగా గత నెల 17వ తేదీన రూ.45 వేలు, 21న రూ.4.50 లక్షలు, 27న మరో రూ.4.50 లక్షలు, 30వ తేదీన మరో రూ.5 లక్షలు జమ చేశాడు. దీంతో పంకజ్‌కుమార్‌శర్మ తన కుమారుడికి సీటు కేటాయించినట్లు చెప్పాడు. ఈ నెల 6వ తేదీన కళాశాలలో ప్రారంభమయ్యే తరగతులకు పంపాలని చెప్పాడు. నాగమోహనరావు తన కుమారుడిని వెంటబెట్టుకుని కలకత్తాలోని నేషనల్ మెడికల్ కళాశాలకు వెళ్లి సీటు కోరగా పంకజ్‌కుమార్‌శర్మ అనే వ్యక్తి అక్కడ ఎవరూ లేరని తేలింది. గతంలో ఇలానే కొంత మంది అతని చేతిలో మోసపోయినట్లు యాజమాన్యం నాగమోహనరావుకు చెప్పారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న నాగమోహనరావు తిరిగి మచిలీపట్నం వచ్చేశాడు. దర్యాప్తు చేపట్టిన చిలకలపూడి పోలీసులు జరిగిన మోసంపై నాగమోహనరావు బుధవారం రాత్రి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంకజ్‌కుమార్‌శర్మ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు చూపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. -
ముంచేసే స్కీమ్
అక్రమ సంపాదనకు కొందరు పక్కా స్కెచ్ వేశారు.. బహుమతుల పేరిట అమాయకులను మోసం చేసే ‘స్కీం’కు తెర లేపారు.. అందమైన బ్రోచర్లు ముద్రించి బుట్టలో దింపుతున్నారు. కొద్ది మొత్తం కడితే చాలు, పెద్ద బహుమతులు సొంతం చేసుకోవచ్చని వందలాది మందికి ఆశ చూపి, మాయలో పడేస్తున్నారు. ఇలా నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి, ఒకరిద్దరికి బహుమతులు కట్టబెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా వారికి ఏదో నామమాత్రపు వస్తువు అంటగట్టి, పెద్ద మొత్తంలో వెనుకేసుకుంటున్నారు. ప్రజలను ముంచే ఈ ‘స్కీం’ల దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎంటర్ప్రైజెస్ల పేరిట అక్రమ స్కీంలు జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి.. ప్రజలను నిండా ముంచే ఇలాంటి ‘పథకాలు’ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. స్కీంలు, లక్కీ డ్రా పేరుతో ప్రజల డబ్బును కొందరు అక్రమంగా వెనుకేసుకుంటున్నారు. ‘‘నెలకు కేవలం రూ.1,100 చొప్పున పది నెలలు చెల్లించండి.. కారు గెలుచుకోండి.. ఒక్క కారే కాదు, రూ.80 వేల విలువ చేసే బైక్, బంగారం, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలను కూడా పొందవచ్చు..’’ అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అందమైన బ్రోచర్లను ముద్రించి బుట్టలో వేసుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్, వర్నిల కేంద్రంగా ఇలాంటి దందాలు నడుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కూడా ఈ అక్రమ స్కీంలు గుట్టుగా నడుస్తున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లలో టర్నోవర్ నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని వందలాది మందిని సభ్యులుగా చేర్చుకుంటున్నారు. రూ.కోట్లల్లో దందా.. స్కీంలు, లక్కీ డ్రాల పేరుతో ప్రతి నెలా రూ.కోట్లల్లో దందా కొనసాగుతోంది. ఒక్కో స్కీంలో సుమారు 500 నుంచి వెయ్యి మందిని చేర్చుకుంటున్నారు. పది నెలలు, 15 నెలలు, 20 నెలలు, 25 నెలలు.. ఇలా వివిధ కాల పరిమితితో స్కీంలు నడుపుతున్నారు. ఈ స్కీంలలో సభ్యులుగా చేరిన వారు ప్రతి నెల రూ.వెయ్యి నుంచి రూ.నాలుగు వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.వెయ్యి చొప్పున వెయ్యి మంది సభ్యులు కలిగిన స్కీంలో ప్రతి నెలా రూ.10 లక్షలు పోగేస్తున్నారు. స్కీం కాల పరిమితి పది నెలల్లో రూ.కోటి వరకు టర్నోవర్ చేస్తున్నారు. ఇలా ఒక్క స్కీంలోనే రూ.కోటి టర్నోవర్ జరుగుతోందంటే.. అన్ని స్కీంలలో కలిసి ఏ స్థాయిలో అక్రమ దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. భారీ బహుమతులను ఆశ చూపి.. వందల సంఖ్యలో సభ్యులను చేర్చుకుంటున్న స్కీం నిర్వాహకులు.. లక్కీ డ్రా నిర్వహించి ఒకరిద్దరికి కారు, బైక్‌లు అందజేస్తున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గృహోపకరణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. స్కీంలో చేరిన ప్రతి సభ్యుడికి బహుమతి వస్తుందని ఆశ చూపి, కన్సోలేషన్ బహుమతుల పేరుతో నామమాత్రపు విలువ కలిగిన బహుమతులను అంటగడుతున్నారు. ఇలా సభ్యుల వద్ద వసూలు చేసిన మొత్తంలో కనీసం సగం విలువ చేసే బహుమతులను కూడా ఇవ్వడం లేదు. అదృష్టం ఉంటే కారు, బైక్, గృహోపకరణాలు గెలుచుకోవచ్చనే ఆశతో అమాయక ప్రజలు ఈ స్కీంల్లో చేరుతున్నారు. వీరి ఆశను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.లక్షలు దండుకుంటున్నారు. గతంలో కేసులు నమోదు.. నిబంధనల ప్రకారం ఇలాంటి స్కీంలు నిర్వహించడానికి అనుమతులు లేవు. ఇలాంటి స్కీంల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతున్న వారిపై నిఘా ఉంచి సుమోటోగా కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ తమకు ఫిర్యాదులు అందలేదంటూ సంబంధిత పోలీసులు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇలాగే స్కీంల పేరుతో అక్రమ దందా కొనసాగించిన వారిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అలాగే, మోర్తాడ్, కమ్మర్పల్లి ఠాణాల పరిధిలోనూ గతంలో కొందరు స్కీం నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలాంటి స్కీం నిర్వాహకుల వైపు చూడడమే మానేశారు. స్కీంలు చట్ట విరుద్ధం.. స్కీంలు, లక్కీ డ్రాలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇలాంటివి నడుస్తున్నట్లు మా దృష్టిలో లేదు. స్కీముల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మంత్రి సుదర్శన్, ఏసీపీ -
ఒక్కడే... మూడు పేర్లు
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు పేర్లతో ఆధార్ కార్డు, ఓట రు కార్డు, పాన్ కార్డులు తీసుకుని వాటి ద్వారా ఓ వ్యాపారిని మోసం చేసిన సంఘటనలో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేర కు వివరాలిలా ఉన్నాయి... విజయవాడ పాయకాపురం ప్రాంతానికి చెందిన అమృతపూడి రవి అలియాస్ షేక్ రియాజ్ అలియాస్ శంకర్‌రెడ్డి హర్షా ఫార్మా పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేసి తాను మందులు సరఫరా చేస్తానంటూ రామంతపూర్ ఇందిరానగర్‌లో నివసించే వ్యాపారి మేకల సతీష్‌ను నమ్మించాడు. కొద్ది రోజులు మందులు బాగానే సరఫరా చేసిన రవి ముందస్తు పథకం ప్రకారం తాన్వి మెడికల్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా షేక్ రియాజ్ బాబు, శంకర్‌రెడ్డిలను పేర్కొంటూ వారు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తారని రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తే బల్క్‌ఆర్డర్లు బుక్ చేయవచ్చని చెప్పడంతో నమ్మిన సతీష్ ఆ మేరకు డబ్బులు పంపించాడు. అయితే రోజులు గడిచినా డ్రగ్స్ సరఫరా కాకపోవడంతో ఇదేమిటని నిలదీస్తే రవి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ప్రదీప్ బంజారా అపార్ట్మెంట్లో ఉంటున్న అతని సోదరుడి వద్దకు వెళ్లి ఆరా తీయగా రవి ఒక్కడేనని షేక్‌రియాజ్, శంకర్‌రెడ్డి పేర్లతో ఆధార్ కార్డు తయారు చేశాడని తేలింది. తరచూ పేర్లు మారుస్తూ ఎంతో మందిని మోసం చేశాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆ ఊళ్లో అందరూ ఒకే రోజు పుట్టారట!
డెహ్రడూన్: ఆ గ్రామంలో ఎవరిని కదిలించినా తమ పుట్టిన రోజు జనవరి 1 అనే చెబుతారు.. కావాలాంటే ఆధార్ కార్డునూ ఆధారంగా చూపుతారు. ప్రతి వ్యక్తికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇచ్చే ఆధార్ ప్రాజెక్టు అధికారుల అలసత్వంతో ఇలా తయారైందని ఆ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హరిద్వార్‌కు కూతవేటు దూరంలో ఉండే గైండి ఖత గ్రామంలో 800 కుటుంబాల వారికి ఆధార్ కార్డుల్లో జనవరి 1న జన్మించినట్టు పొందుపరిచారు. ఆధార్ కార్డులు అందించే ప్రైవేటు ఏజెన్సీతోనే తమకు ఓటర్ ఐడీ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించారని స్థానికులు చెప్పారు. తమ పుట్టిన రోజులన్నీ ఒకే రకంగా ఉండటంతో ఇంకేం విశిష్టత ఉందని ఆధార్ తీరును తప్పుపడుతూ గ్రామస్తుడు అల్ఫదీన్ వాపోయారు. అధికారుల అలక్ష్యం ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాలేదని దేశవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగిందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆగ్రా జిల్లాలోని మూడు గ్రామాల్లోనూ పలువురి పుట్టిన తేదీలు జనవరి 1గా అధికారులు నమోదు చేశారు. అలహాబాద్ సమీపంలోని కంజస గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఆధార్ కార్డులు అందగానే వాటిపై ప్రతి ఒక్కరి పుట్టిన తేదీ జనవరి 1గా ఉండటం చూసి విస్తుపోయామని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఇక పుట్టిన సంవత్సరం కూడా రేషన్ కార్డులు, ఓటర్ కార్డులతో సరిపోలడం లేదని వాపోయారు. -
'కేసీఆర్ మోసాలపై సినిమా తీస్తా'
వరంగల్: 'కచ్చితంగా దళితుడినే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తా. ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదు. అవసరమైతే తల నరుక్కుంటానని వేల సార్లు మాట ఇచ్చిన కేసీఆర్.. అధికారం చేతికి రాగానే మాట మార్చారు' అని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. కేసీఆర్ దళితులకు.. ప్రధానంగా మాదిగలకు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావని, వాటన్నింటినీ సినిమాగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారాయన. వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన మంద కృష్ణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయుత చండీయాగం లాంటి వెయ్యి యాగాలు చేసినా దళితులకు చేసిన మోసాలను కేసీఆర్ కప్పిపుచ్చలేరని విమర్శించారు. కేసీఆర్ మోసాలపై రూపొందించే సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రజల నుంచే సేకరిస్తామని, ఇంటికి రూపాయి చొప్పున విరాళం అడుగుతామని, చరిత్రలో నిలిచిపోయేలా సినిమా తీస్తామని మంద కృష్ణ చెప్పారు.