'కేసీఆర్ మోసాలపై సినిమా తీస్తా' | mrps leader plans for movie over kcr fruads to madiga's | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ మోసాలపై సినిమా తీస్తా'

Published Fri, Jan 1 2016 9:11 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

'కేసీఆర్ మోసాలపై సినిమా తీస్తా' - Sakshi

'కేసీఆర్ మోసాలపై సినిమా తీస్తా'

వరంగల్: 'కచ్చితంగా దళితుడినే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తా. ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదు. అవసరమైతే తల నరుక్కుంటానని వేల సార్లు మాట ఇచ్చిన కేసీఆర్.. అధికారం చేతికి రాగానే మాట మార్చారు' అని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. కేసీఆర్ దళితులకు.. ప్రధానంగా మాదిగలకు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావని, వాటన్నింటినీ సినిమాగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారాయన.

వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన మంద కృష్ణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయుత చండీయాగం లాంటి వెయ్యి యాగాలు చేసినా దళితులకు చేసిన మోసాలను కేసీఆర్ కప్పిపుచ్చలేరని విమర్శించారు. కేసీఆర్ మోసాలపై రూపొందించే సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రజల నుంచే సేకరిస్తామని, ఇంటికి రూపాయి చొప్పున విరాళం అడుగుతామని, చరిత్రలో నిలిచిపోయేలా సినిమా తీస్తామని మంద కృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement