MRPS Leader
-
దళిత ద్రోహి చంద్రబాబు
తాడేపల్లి రూరల్: చంద్రబాబు దళిత, పేద ప్రజల ద్రోహి అని మరోసారి స్పష్టమైందని రాజధాని అమరావతి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య ధ్వజమెత్తారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలకు అడ్డుపడొద్దంటూ సోమవారం రాయపూడి నుంచి హైకోర్టు వరకూ భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే ముందస్తుగా పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టు చేసి, గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ సందర్భంగా నాగయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ దళితులు, పేదలను పూచికపుల్లతో సమానంగా చూశారని మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కోర్టులో పిటిషన్లు వేయిస్తూ చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎమ్మార్పీఎస్ నేతలు జాన్‌బాబుమాదిగ, కట్టెపోగు బాబూరావు, మిట్టా నిర్మలమాదిగ, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు దేవరాజు తదితరులున్నారు. -
అనంత’లో పట్టపగలు దారుణ హత్య
అనంతపురం సెంట్రల్: ‘అనంత’లో పట్టపగలు హత్య జరిగింది. శనివారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జగ్గుల ప్రకాష్ (45)ను.. కత్తెరతో పొడిచి రమణ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కపట్నం మండలం రామసాగరం గ్రామానికి చెందిన రమణ.. అనంతపురంలోని ఓ దుకాణంలో టైలర్. అతనికి ఐదేళ్ల కిందట శింగనమల మండలం కల్లుమడికి చెందిన సరళతో వివాహమైంది. పెళ్లయిన ఏడాదికే దంపతుల మధ్య మనస్పర్థలొచ్చాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా దంపతుల మధ్య పంచాయితీ నడుస్తోంది. కోర్టుకు కూడా వెళ్లారు. ఇటీవల ఈ విషయమై తమకు న్యాయం చేయాలని మహిళ కుటుంబ సభ్యులు ప్రకాష్‌ను కోరారు. దీంతో సదరు మహిళకు న్యాయం చేయాలనే భావనతో పెద్దమనిషిగా ఇద్దరినీ పిలిపించి ఇటీవల పంచాయితీ చేశారు. భార్యాభర్తలు సర్దుకుని కాపురం చేయాలని రమణ, సరళకు ప్రకాష్ సూచించారు. అయితే వారు ససేమిరా అన్నారు. దీంతో మహిళకు న్యాయం చేయాలనే తలంపుతో కొంత డబ్బు చెల్లించాలని, లేకుంటే కేసు నడుస్తుందని రమణకు తేల్చి చెప్పాడు. అయితే తన భార్య తప్పు చేస్తే తాను పరిహారం చెల్లించాలా.. అనుకుంటూ ప్రకాష్‌పై రమణ కక్ష పెంచుకున్నాడు. కాపుకాచి కత్తెరలతో పొడిచాడు ప్రకాష్ రోజూ పల్లవి టవర్స్ సమీపంలోని ఓ టీస్టాల్ వద్దకు వస్తాడని తెలుసుకున్న రమణ.. శనివారం మధ్యాహ్నం టైలరింగ్ షాపులో కత్తెర తీసుకుని నేరుగా అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ప్రకాష్‌తో వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తెరతో గుండెలపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే ప్రకాష్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య
సాక్షి, చేబ్రోలు: దళిత నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఎమ్మార్పీఎస్ మాజీ నేత, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పమిడిపాటి కోటయ్య హత్యకు ప్రధాన కారణమని చేబ్రోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ శ్రీనివాసరావు తెలిపారు. మండలకేంద్రలోని సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూలై 5వ తేదీ రాత్రి చేబ్రోలు మండల పరిధిలోని వేజండ్ల పల్లె అడ్డరోడ్డు దగ్గర అమృతలూరు ప్రాంతానికి చెందిన పమిడిపాటి కోటయ్య హత్యకు గురయ్యాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు, తెనాలి ఐతానగర్‌కు చెందిన కొత్తపల్లి నాగరాజు, కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి రాజేంద్ర, కూచిపూడి మోహన్, సుద్దపల్లి కిషోర్‌లు కోటయ్య హత్యకు కారకులని వెల్లడించారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు పమిడిపాటి కోటయ్య, తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు గతంలో ఎమ్మార్పీఎస్‌లో పనిచేశారు. కోటయ్యను ఎమ్మార్పీఎస్ నుంచి తొలగించిన తరువాత వీరిద్దరికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోటయ్య ఫేస్బుక్, వాట్సప్‌లలో పీక కోస్తానని, చంపుతానని పోస్టులు పెట్టడంతో ఎక్కడ తనను చంపుతాడోనని భావించి ముందుగానే నాగరాజు కోటయ్యను చంపాలని నిర్ణయించుకొని మరి కొంత మంది సహకారంతో పథకం ప్రకారం హత్య చేశాడు. కోటయ్య కదలికలను గమనించి స్కార్పియాతో ఢీ కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. సీఐతో పాటు స్థానిక ఎస్ఐ సీహెచ్ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈనెల 30న విశ్వరూప మహాసభ: మంద కృష్ణ
సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30న అమరావతిలోని ఉంగుటూరు మండలం వెల్దిపాడులో నిర్వహించనున్న విశ్వరూప మహాసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణతో సీఎం చంద్రబాబు మాదిగలను మోసం చేశాడని ఆరోపించారు. 2014లో ఎస్సీ వర్గీకరణ చేసి చంద్రబాబు పెద్ద మాదిగగా రుణం తీర్చుకుంటానని నమ్మించాడు చేశాడని విమర్శించాడు. చంద్రబాబు మాటలు నమ్మి గత ఎన్నికల్లో మాదిగలు మద్దుతు పలికారని తెలిపారు. ఈనెల 30న తలపెట్టిన విశ్వరూప మహా సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు హెచ్చరించారు. -
‘అట్రాసిటీ’పై దేశవ్యాప్త ఉద్యమం : మందకృష్ణ
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పరిరక్షణ సమితి చైర్మన్ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓయూ అతిథి గృహంలో జరిగిన మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతమున్న చట్టంలో ఎటువంటి మార్పులు చేసినా సహించేది లేదన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా వచ్చేనెల 17న ఢిల్లీలో సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు మందకృష్ణ వెల్లడించారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యాన్ని సహించం
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, సుప్రీంకోర్టు తీర్పులను తిప్పి కొడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మే 27న వరంగల్‌లో తలపెట్టనున్న సింహగర్జన బహిరంగసభను పురస్కరించుకొని శనివారం రాత్రి ఇక్కడ జల్పల్లిలోని మరాఠా భవన్లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. దళిత, గిరిజనులపై బీజేపీ మొసలి కన్నీరు కార్చడం మానుకొని ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, లేనట్లయితే బీజేపీ భరతం పడతామని హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీ, ఎస్టీ నేతలందరినీ సంఘటితం చేస్తామన్నారు. వీరిని ఏకం చేసేందుకు సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు ప్రమాదం తీసుకురావాలని కేంద్రంతోపాటు మరెవరు కుట్ర చేసినా తగిన మూల్యం చెల్లించుకుంటారన్న విషయాన్ని సింహగర్జన ద్వారా తెలియజేస్తామన్నారు. సభకు ప్రజాస్వామ్యవాదులంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మే 6న హైదరాబాద్‌లో దళిత, గిరిజన మేధావులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సభకు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్‌ను ఆహ్వానిస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు జేబీ రాజు, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారు
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేవిధంగా కేంద్రం, న్యాయస్థానం వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సుప్రీంకోర్టు తీర్పు ఉండటం బాధాకరమన్నారు. దేశంలో 25 శాతమున్న దళితులు తలెత్తుకోకుండా చెయ్యడంలో భాగంగానే కేంద్రం, సుప్రీంకోర్టు నిర్ణయాలున్నాయని అన్నారు. నమోదవుతున్న కేసుల్లో 90% వీగిపోతున్నాయని, అలాంటప్పుడు చట్టాలు రద్దు చెయ్యడమే పరిష్కారమా అని ప్రశ్నించారు. 302, 307 కేసులు వీగిపోతున్నాయని, వరకట్న వేధింపుల కేసుల్లో 97%, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 75% వీగిపోతున్నాయని, కేవలం అట్రాసిటీ చట్టంపైనే చర్యలు తీసుకోవడమెందుకని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించే దిశగా దక్షిణాది రాష్ట్రాలను కలుపుకుని మే 20న వరంగల్, హైదరాబాద్, అమరావతిలలో ఏదో ఒకచోట సింహగర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం దళిత సంఘాల నేతలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు చేస్తామని తెలిపారు. -
టీడీపీలోని మాదిగలు బయటికి రావాలి
నెహ్రూనగర్ (గుంటూరు) : తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగలు వెంటనే బయటికి రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. వచ్చే మార్చి 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం గుంటూరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన బీజేపీ.. నాలుగేళ్లు గడుస్తున్నా నాలుగు అడుగులు కూడా వేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా హామీని నెరవేర్చకుండా వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టిందని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఏ పార్టీ అయితే తమకు మద్దతు తెలుపుతుందో ఆ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. వర్గీకరణ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే విషయంపై ఆదివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అ«ధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు. -
వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
మహబూబ్‌నగర్ రూరల్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో ఎమ్మార్పీఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని అన్నారు. వర్గీకరణ సాధనలో భాగంగా ఈ నెల 7న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, తిరుమలయ్య, లక్ష్మయ్య, ప్రభుదాస్, హన్మంతు, గోపి, వెంకటయ్య, నగేష్, కర్రెప్ప, శ్రీనివాస్, శివరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతిపై అసెంబ్లీ విచారం..
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్... హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో భారతి అనే కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సోమవారం సభలో మాట్లాడుతూ... ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతి దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అర్హులుంటే భారతి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఒకవేళ పిల్లలుంటే ప్రభుత్వ ఖర్చుతో చదివిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో భారతి భౌతిక కాయంపై ఎమ్మార్పీఎస్ పతాకాన్ని కప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు ఉస్మానియా ఆస్పత్రిలోని ఆమె భౌతిక కాయాన్ని చూసి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. భారతి మృతి బాధాకరమని, ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. -
'చంద్రబాబు పచ్చి మోసగాడు'
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని అభివర్ణించారు. బాబు నమ్మక ద్రోహి అని విమర్శించారు. గురువారం విశాఖపట్నంలోని ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరపకుండా నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుపై మందకృష్ణ మండిపడ్డారు. మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. మాదిగలపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మార్చి10వ తేదీ నుంచి మాదిగల మహా విశ్వరూప యాత్ర తలపెట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఊరు చిత్తూరు జిల్లా నారావారి పల్లెల నుంచి ప్రారంభమవుతుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. -
నమ్మకద్రోహి బాబు
భామిని: మాదిగలకు ఇచ్చిన హామీని విస్మరించిన నమ్మకద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందా కృష్ణమాదిగ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మాదిగల జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వస్తే మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిన బాబు గద్దెనెక్కిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. మాదిగలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన చంద్రబాబు స్వస్థలం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మాదిగ గర్జన చేయనున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 10న విజయవాడలో మహా సంగ్రామం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మాదిగలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాదిగలకు న్యాయం కోసం టీడీపీ వెంట తిరిగి తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, బత్తిలి సర్పంచ్ టింగ అన్నాజీరావు, వైఎస్ఆర్ సీపీ మండల అధ్యక్షుడు తోట సింహాచలం, జిల్లా నాయకులు సాసుపిల్లి ప్రకాశరావు, భామిని సర్పంచ్ పొట్నూరు దేవి, జిల్లా ఉపాధ్యక్షులు కానుకుర్తి శంకరరావు, మండల నాయకులు లోపింటి జయరాజు, కవిటి కృష్ణమూర్తి, డీసీసీబీ డెరైక్టర్ బైరి గోపీనాథ్, మాజీ సర్పంచ్ లోపింటి అప్పారావు పాల్గొన్నారు. -
'కేసీఆర్ మోసాలపై సినిమా తీస్తా'
వరంగల్: 'కచ్చితంగా దళితుడినే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తా. ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదు. అవసరమైతే తల నరుక్కుంటానని వేల సార్లు మాట ఇచ్చిన కేసీఆర్.. అధికారం చేతికి రాగానే మాట మార్చారు' అని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. కేసీఆర్ దళితులకు.. ప్రధానంగా మాదిగలకు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావని, వాటన్నింటినీ సినిమాగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారాయన. వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన మంద కృష్ణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయుత చండీయాగం లాంటి వెయ్యి యాగాలు చేసినా దళితులకు చేసిన మోసాలను కేసీఆర్ కప్పిపుచ్చలేరని విమర్శించారు. కేసీఆర్ మోసాలపై రూపొందించే సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రజల నుంచే సేకరిస్తామని, ఇంటికి రూపాయి చొప్పున విరాళం అడుగుతామని, చరిత్రలో నిలిచిపోయేలా సినిమా తీస్తామని మంద కృష్ణ చెప్పారు. -
'బాబు పచ్చి మోసగాడు'
నెల్లూరు (వింజమూరు) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాల రావు విమర్శించారు. వింజమూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు తన కపట బుద్ధితో ఎన్టీఆర్, మంద కృష్ణ మాదిగలను మోసం చేశాడని అన్నారు. బాబు అంత మోసగాడు భారతదేశంలో ఎవరూ లేని అన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌కు ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆంధ్రులహక్కని, హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు.