
మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పరిరక్షణ సమితి చైర్మన్ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓయూ అతిథి గృహంలో జరిగిన మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రస్తుతమున్న చట్టంలో ఎటువంటి మార్పులు చేసినా సహించేది లేదన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా వచ్చేనెల 17న ఢిల్లీలో సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు మందకృష్ణ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment