M
-
అప్పుడు సెంచరీ మిస్: టెస్టుల్లో కీలక మైలురాయి అందుకున్న గిల్
South Africa vs India, 2nd Test - Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్లో మరో కీలక మైలురాయి చేరుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత పేసర్లు కేప్‌టౌన్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పేసర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్ మీద నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో తొలిసారిగా ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఆదిలోనే జైస్వాల్ అవుట్ అయితే, ప్రొటిస్ పేసర్ కగిసో రబడ.. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరగగా.. అతడి స్థానంలో వచ్చిన శుబ్‌మన్ గిల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జతయ్యాడు. ఇక గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన హిట్‌మ్యాన్ కేప్‌టౌన్‌లో మాత్రం బౌండరీలు బాదుతూ దూకుడుగా ఆడుతున్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి 37 బంతుల్లో 38 పరుగులతో జోరుమీదున్నాడు. #RohitSharma is up & about! Three 4️⃣s to get going in this #TeamIndia innings. Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/kuZAOIHJJH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 1000 పరుగులు పూర్తి చేసుకున్న గిల్ మరోవైపు.. అతడి తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న వన్‌డౌన్ బ్యాటర్ గిల్.. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో నండ్రే బర్గర్ వేసిన నాలుగో బంతికి రెండు పరుగులు తీసి వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా తన టెస్టు కెరీర్లో 36వ ఇన్నింగ్స్‌లో ఘనత ఈ మైలురాయిని అందుకున్నాడు. మెల్బోర్న్లో 2020 నాటి ఆస్ట్రేలియా మ్యాచ్‌తో శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 45, 35 (నాటౌట్) పరుగులు చేశాడు గిల్. అప్పుడు సెంచరీ మిస్ అదే విధంగా మరో మ్యాచ్‌లో గాబా స్టేడియంలో 91 పరుగులు సాధించి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. గిల్ కెరీర్లో ఇప్పటి వరకు టెస్టుల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు సాధించాడు. అయితే, విదేశీ గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంద పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్‌మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పది ఓవర్లు ముగిసే సరికి ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు: అందుకే అనామక జట్టును పంపుతున్నాం! -
మంచు విష్ణు సినిమాలో ప్రభాస్.. కారణం అదా?
ప్రభాస్ పేరు చెప్పగానే 'బాహుబలి', 'సాహో', 'సలార్' లాంటి పాన్ ఇండియా సినిమాలే గుర్తొస్తాయి. అలాంటిది మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త మూవీలో నటిస్తాడనే విషయం బయటకు రాగానే అందరూ షాకయ్యారు. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్.. ఓ రీజనల్ హీరో సినిమాలోనా? అని మీరు అనుకోవచ్చు. కానీ దీని వెనక చాలా కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) మంచు విష్ణు హీరోగా.. భక్త కన్నప్ప స్టోరీతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఉన్నట్టుండి సడన్‌గా ఈ మూవీలోని శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారనే టాక్ బయటకొచ్చింది. ఇది నిజమేనని విష్ణు కూడా ఓ ట్వీట్ కి సమధానమిచ్చాడు. ఇప్పటికే రాముడు, విశ్వామిత్రుడు పాత్రల్లో యాక్ట్ చేసిన ప్రభాస్.. ఇందులో శివుడిగా ఎలా ఉండబోతున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే తెగ ఆలోచిస్తున్నారు. ఇకపోతే 'బుజ్జిగాడు' మూవీ చేస్తున్న టైంలోనే ప్రభాస్‌కి మోహన్‌బాబుతో మంచి బాండింగ్ ఏర్పడింది. మరోవైపు మంచు విష్ణు, ప్రభాస్ చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. గతంలో విష్ణు 'దూసుకెళ్తా' ఓ సీన్ కోసం ప్రభాస్ గొంతు అరువిచ్చాడు. అలానే ఇప్పుడు తీస్తున్న సినిమాకు డైరెక్టర్ ముఖేశ్ కుమార్. 'మహాభారతం' సీరియల్‌ని తీసింది ఈయనే. ఈ డైరెక్టర్ అంటే కచ్చితంగా తనని బాగా చూపిస్తారనే ప్రభాస్ అనుకున్నాడు. ఇలా చాలా కారణాలు.. మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ నటించడానికి కారణాలు అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: రైతుబిడ్డ సెంటిమెంట్ వాడొద్దు.. ప్రశాంత్ కి కంటెస్టెంట్ల వార్నింగ్) -
Mehndi: గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇందులోని లాసోన్ అనే రసాయనం వల్ల..
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆనవాయితీ ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. లాసోన్ అనే సహజమైన రసాయనం వల్లే! ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి. చదవండి: Magnesium Deficiency: ఇది లోపిస్తే కిడ్నీలు పాడవుతాయి.. ఇంకా! ఇవి తింటే మేలు! కానీ ఎక్కువైతే.. -
జైలర్‌గా రజనీ, ఖైదీగా చిరు.. కేరాఫ్ చెరసాల
జైలర్ డ్యూటీ చేయనున్నారు రజనీకాంత్.. ఖైదీగా జైలుకి వెళ్లారు చిరంజీవి.. కార్తీ కూడా ఖైదీగా జైలులో ఉంటారు... రణ్‌దీప్ హుడా కూడా ఖైదీయే.. ఇవన్నీ సినిమా జైళ్లు. ఈ సినిమాల్లోని కథలు కేరాఫ్ చెరసాల అంటూ జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ఇక ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. రజనీకాంత్ ఈ మధ్య చేసిన చిత్రాల్లో ‘దర్బార్’ ఒకటి. ఇందులో కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా చెలరేగిపోయిన రజనీ తాజాగా జైలర్‌గా మారారు. రజనీ హీరోగా రూపొందనున్న 169 చిత్రానికి ‘జైలర్’ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. కాగా.. ఖైదీలుగా ఉన్న గ్యాంగ్స్టర్స్ జైలు నుంచి తప్పించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్‌ని జైలర్ ఎలా అడ్డుకున్నాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. జైలర్ పాత్రలో రజనీని ఫుల్ మాస్‌గా చూపించనున్నారట నెల్సన్. ఇక రజనీ జైలర్ అయితే చిరంజీవి ఖైదీగా కనిపించనున్నారు. అయితే కాసేపు మాత్రమే. మోహన్‌లాల్ మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్‌గా చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’లోనే ఈ జైలు సీన్స్ ఉన్నాయి. ప్రత్యర్థులు వేసిన నిందలతో ఖైదీగా చిరంజీవి జైలుకి వెళతారు. ఆ మధ్య ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లొకేషన్‌కి పవన్ కల్యాణ్ వెళ్లిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అందులో చిరంజీవి వేసుకున్న ఖైదీ దుస్తుల్లో చొక్కా పై 786 అని కనిపిస్తుంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. అటు కోలీవుడ్వైపు వెళితే... తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. ఇందులో కార్తీ తండ్రీ కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. తండ్రి పాత్రధారి ఖైదీగా కనిపిస్తారని సమాచారం. కొడుకు పోలీసాఫీసర్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. కార్తీ నటించిన గత తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలైనట్లే ‘సర్దార్’ కూడా తెలుగులోనూ విడుదలవుతుంది. ఇక హిందీ పరిశ్రమకు వెళ్తే... ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ చిత్రం గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక్ దామోదర వీర్ సావర్కర్ బయోపిక్‌గా రూపొందుతున్న చిత్రం ఇది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకుడు. వీర్ సావర్కర్ అండమాన్ జైలులో 20 ఏళ్లు గడిపారు. ఈ బయోపిక్‌లో జైలు జీవితానికి సంబంధించిన సీన్లు ఉంటాయి. ఇవే కాదు.. జైలు బ్యాక్‌డ్రాప్‌లో మరి కొన్ని చిత్రాలున్నాయి. కథ ఏదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటే కాసుల వర్షం షురూనే. -
నానికి కౌంటర్‌గా తమన్ వరుస ట్వీట్లు! నెట్టింట వైరల్
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ హిట్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా కనిపించే తమన్ తాజాగా చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ట్వీట్స్ నానిని ఉద్దేశించే చేసినవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా నాని మాట్లాడుతూ.. 'తన సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ లాగానే మ్యూజిక్‌కి సమానంగా ప్రాధాన్యత ఉంటుందని.. సంగీతం లేదా బీజీఎం సినిమాను ఎలివేట్ చేయాలే తప్పా.. డామినేట్ చేయకూడదని, లేదంటే శృతి తప్పుతుంది' అని పేర్కొన్నాడు. దీనికి కౌంటర్‌గా తమన్.. అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్ దేనిని డామినేట్ చేయదని వరుస ట్వీట్లు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు నానిని ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నార. కాగా అఖండ సినిమాకు బీజీఎం మెయిన్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. We call it a Complete FILM when all the crafts Together Excel in all formats 🥁It’s never so called Dominated Crafts .. lol it’s the Deeper UNDERSTANDING of a Film Knowing it’s depth in dialogues it’s Narration & making It dive in Smooth to the Next Sequences 🎥🎵🥁 1/2 — thaman S (@MusicThaman) December 29, 2021 -
'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు'
ఘంటసాల సంగీతం సమకూర్చిన సినిమాల టైటిల్స్‌లో.. ‘సంగీతం – ఘంటసాల, సహాయకులు – పట్రాయని సంగీతరావు’ అని కనిపించేవి.అలా సంగీతరావు పేరు సినీ ప్రేక్షకులకు సుపరిచితం. ఘంటసాల గురువులు పట్రాయని సీతారామశాస్త్రి. వారి కుమారుడే సంగీతరావు.గురువుగారి మీద భక్తి మాత్రమే కాదు, తన ఆలోచలకు తగినవానిగా భావించి ఘంటసాల, సంగీతరావును తనకు సహాయకుడిని చేసుకున్నారు. జూన్ 2, 2021 రాత్రి 7 గం. 50 ని.లకు 101 సంవత్సరాల వయసులో సంగీతరావు కన్నుమూశారు.ఈ సందర్భంగా..సంగీతరావు సుమారు నాలుగు మాసాల క్రితం సాక్షికి ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ వివరాలు. నేను రౌద్రి నామ సంవత్సరంలో పుట్టాను. నా తరవాత ఇద్దరు తమ్ముళ్లు. నారాయణమూర్తి, ప్రభాకరరావు. ఆ తరవాత ఆడపిల్ల పుట్టినప్పుడు అమ్మ నిర్యాణం చెందింది. ఆడపిల్ల కూడా కన్నుమూసింది. ఆ తరవాత మా జీవితం కష్టసాధనం అయింది. మా నాన్నగారికి మమ్మలి పెంచడం కష్టమైంది. నాన్నగారు సాలూరు వచ్చేశారు. అక్కడ మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడ మా ముగ్గురు అన్నదమ్ముల్ని మా దొడ్డమ్మ ఓలేటి లక్ష్మినరసమ్మ పెంచింది. ఆవిడ మంచి సమర్థురాలు. ఆవిడకు సాహిత్య జ్ఞానం ఉండేది. ఆవిడ పోయేవరకు మా ఇంట్లోనే ఉంది. అక్కడ చాలామంది సంగీత విద్యార్థులు సంగీతం నేర్చుకోవటానికి నాన్న దగ్గర వచ్చేవారు. రొంబ నరసింహరెడ్డి అనే విద్యార్థి కూడా వచ్చేవాడు. అతను మంచి వ్యాయామ విశారద. నా చేత కూడా చేయించేవాడు. బాగా పాడేవాడు. హరికథలు కూడా చెప్పేవారు. మా తాతగారిది కిండ్లాం అగ్రహారం. అది ఆరామద్రావిడ గ్రామం అది. మాదిసంగీత కుటుంబం కావటం చేత బాల్యంలోనే సరళీ స్వరాల దగ్గర నుంచి అన్ని రకాల పాటలు పాడుతూ ఉండటం అలవాటైంది నాకు. మా కుటుంబంలో మా తాతయ్యగారి దగ్గర నుంచి అందరూ ఒక రకమైన భక్తిప్రపత్తులతో ఉండేవారు. విశిష్టంగా పూజలు చేయటం వంటివి ఉండేది కాదు. సహజంగా భగవంతుని మీద భక్తి ఉండేది. తాతగారి శిక్షణలో తాత్విక రచనలు కంఠస్థం అయ్యేవి. నాగావళి ఒడ్డున... ఐదో ఏట అక్షారాభ్యాసం చేసినప్పటి నుంచి స్కూల్‌కి వెళ్లడం, ఇంటికి రావడం అలవాటు. నేను చదువుకునే రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నాను. అందులో ముఖ్యంగా గుర్తున్నది ఆక్స్‌ఫర్ట్ డిక్షనరీ. స్పోర్ట్స్‌లో కూడా బహుమతులు వచ్చాయి. నాగావళి నది బ్రిడ్జి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో 1926లో ఒకటో తరగతి శివరావుపంతులు గారి దగ్గర చదివాను. చదువుకున్నాను. ఆ స్కూల్‌ని ఒక పురోహితుల కుటుంబం నడిపేది. ఆ పక్కనే కొబ్బరి ఉండలు అమ్మే దుకాణం ఉండేది. అక్కడ కానీకి మూడు ఉండలు ఇచ్చేవారు. గ్రామఫోను వింటూ సాధన.. శివరావు పంతులు గారు ఆ గ్రామంలో సంగీతాభిలాష ఉన్నవారికి నాన్నతో సంగీతం చెప్పించడానికి పిలిపించారు. అప్పుడు మేం శ్రీపాద సుబ్బారావు పంతులు గారు అనే పండితుడి ఇంట్లో ఒక భాగంలో ఉండేవాళ్లం. వాళ్లమ్మాయికి నాకు అప్పట్లో నాన్న సరిగమలు చెప్పటం గుర్తుంది. ప్రతి రోజూ నేను స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఒక గ్రామఫోను రికార్డు వినేవాడిని. అది విన్నప్పుడు నాకు అత్యాశ్చర్యం వేసింది. ఇంటికి వచ్చి, అమ్మతో, ‘డబ్బాలో నుంచి పాటలు వస్తున్నాయి’ అని చెప్పాను. అప్పుడే గ్రామఫోను రికార్డులు కొత్తగా వచ్చాయి. బిడాలం రాసప్ప అనే ఆయన పెద్ద గొంతుకతో పాడిన పాటలు ఆ రికార్డులో విన్నాను. రాసప్పగారి గ్రామఫోను రికార్డులు వింటూ పాటలు పాడటం అలవాటైంది. చిన్నతనం నుంచి నేర్చుకోవటం కంటె విని గ్రహించిందే ఎక్కువ. అలా పాడటం అలవాటైంది. ఏ మాత్రం మొహమాటం లేకుండా, ఎవరు పాడమన్నా గట్టిగా పాడేసేవాడిని. అప్పట్లోనే అక్కడ నాన్నకి కొత్తకొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని కుటుంబాల వారు నాన్న చేత సంగీతం చెప్పించుకునేవారు. ఇవి కాకుండా, ఆర్థికంగా శ్రీమంతులు కూడా కొందరు నాన్న దగ్గర సంగీత సాధన చేసేవారు. గరిమెళ్ల గోదావరి శర్మ అనే ఆయన మా నాన్న దగ్గరే సంగీత కృషి చేశారు. ఆయన నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించేవారు. ముఖ్యంగా రోషనారా నాటకంలో ఆయన హార్మోనియం ప్రత్యేకం. చిర్రావూరు నరసింహారావు అనే కళాకారుడు రోషనారా వేషం వేసేవారు. బొబ్బిలి కోటలో... బొబ్బిలి రాజు గారికి పట్టాభిషేకం జరిగే సమయంలో ఆయన పట్టాభిషేకం మీద నారాయణశాస్త్రిగారు అనే పండితుడు రాగమాలికలో కృతి రచించి నాతో పాడించారు. బొబ్బిలి రాజావారికి పూజామహల్ అని ఒక పూజా గృహం ఉండేది. అక్కడ పూజ సందర్భంలో సంగీతం పాడేవారు మా గురువు గారు. నన్ను కూడా రోజూ తీసుకువెళ్తుండేవారు. ఆ కార్యక్రమానికి వచ్చినవారికి బొబ్బిలి రాజదాసీలు తాంబూలాలు ఇచ్చేవారు. సంభావన కూడా అందించేవారు. ఆరోజుల్లో బొబ్బిలి వైభవోపేతంగా ఉండేది. బొబ్బిలికి దగ్గరలోనే ఆయనకు పట్టాభిషేకం జరిగింది. అక్కడ తాజ్‌మహల్‌లాంటి మహల్ ఉండేది. అది ఇప్పటికీ ఉంది. దానిని గెస్ట్ హౌస్ అనేవారు. బొబ్బిలి రాజా చీఫ్ మినిస్టర్‌గా ఉండేవారు. అలా బొబ్బిలిలో ఐదు వరకు చదువుకున్నాను. రెండు మూడు తరాల పేర్లు... నాన్నకి ఏదో ఒకటి రాసుకోవటం బాగా అలవాటు. ఆయనను అనుకరించటం చేత మాకూ అదే అలవాటైంది. చిన్నతనం నుంచి పుస్తక పఠనం ఉండేది. మొగలాయి దర్బారు వంటి సంప్రదాయ రచనలు, భయంకర నారీ పిశాచి వంటి డిటెక్టివ్ నవలలు అన్నీ చదివేవాడిని. నా పదేళ్ల నుంచి చదివిన జ్ఞాపకం ఉంది. మా మాతామహులు పురాణ శ్రవణం చేసేవారు. అలా భాగవతం పద్యాలన్నీ కంఠస్థం వచ్చాయి. చిన్నప్పటి నుంచి కవీశ్వరుల గురించి వినటం అలవాటు. తిరుపతి వేంకట కవుల గురించి నాన్నగారు చెప్పేవారు. ఇంజరం, యానాము, పల్లెపాలెము అంటూ చెప్పిన పద్యాలు వినేవాడిని. మా తాతయ్య అతి బాల్యం నుంచి భారతరామాయణ భారతాలు చెప్పేవారు. పౌరాణిక గాథలన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయన సహజంగా ఒక అమాయకమైన భక్తుడు కూడాను. అప్పట్లోనే వెంకటపార్వతీశ కవులు, తిరుపతి వెంకట కవులు, వీరేశలింగం,... తెలుగు సాహిత్యంలో ఉండే రెండు మూడు తరాల కవుల పేర్లు తెలుసు. వివాహం... మా తల్లి నా చిన్నతనంలోనే గతించారు. నాకు తొమ్మిదో ఏట వివాహం అయిపోయింది. అప్పుడే శారదా బిల్లు అమలులోకి వస్తోంది. ఆ బిల్లు ప్రకారం బాల్య వివాహాలు చేసుకోకూడదు. అందువల్ల ఆ బిల్లు ఇంకా అమలులోకి రాకముందే కిళ్లా అగ్రహారం వాస్తవ్యులు ఆకొండి లింగమూర్తి గారి అమ్మాయితో వివాహం జరిగిపోయింది. నా వివాహ సమయానికి నా భార్య వయసు మూడేళ్లు. పేరు శ్రీలక్ష్మి. స్వరపల్లవి గ్రంథం... అప్పట్లో నాన్నగారు సంచారంలో సంగీత కచేరీలకు తిరుగుతుండేవారు. అక్కడ ఆకొండి నారాయణ శాస్త్రి అనే సంగీత పండితుడు ఉండేవారు. నన్ను ఆయన దగ్గరకు సంగీతానికి పంపించారు. ఆయన వీణ, వయొలిన్ వాయించేవారు. బొబ్బిలి గరల్స్ స్కూల్లో సంగీతం మాస్టారుగా ఉండేవారు. అక్కడ పని చేసే వారికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌కి ఉన్నంత గౌరవం ఉండేది. నేను అక్కడ ‘స్వర పల్లవి’ అనే గ్రంథం గురించి తెలుసుకున్నాను. స్వర పల్లవులు నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ఈ స్వర పల్లవులు మిగతా వారు చెప్పేవారు కాదు. ఈ గ్రంథం బొబ్బిలిలో ఉండే ‘వాసా’ వారు రచించారు. ఆ రచనల్నీ వీణ మీద వాయించడానికి వీలుగా ఉండేవి. కల్యాణి రాగం, హిందోళ రాగం కలిపి మొత్తం పది స్వర పల్లవులు చెప్పుకున్నాను. అక్కడే నవరాగ మాలిక వర్ణం కూడా చెప్పుకున్నాను. సంగీత నిర్వహణ.. నా చిన్నతనం నుంచే సంగీత నృత్య రూపకాలకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం, శ్రీనివాస కల్యాణం, హరవిలాసం, కల్యాణ రుక్మిణి వంటి నృత్యరూపకాలకు సంగీతం అందించాను. కూచిపూడి నాటకాలకు బాలాంత్రపు రజనీకాంతరావు, ద్వారం భావనారాయణ, మల్లిక్ వంటివారు సంగీతం అందించేవారు. ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకానికి సంగీతం సమకూర్చటం గురించి చర్చ జరిగినప్పుడు బిఎన్ రెడ్డిగారు డైరెక్టరుగా ఉన్నారు. ఆయన క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం వంటి సంగీత రూపకాలకు నన్ను సంగీతం సమకూర్చమన్నారు. శ్రీనివాస కల్యాణం తరవాత హరవిలాసం, కల్యాణ రుక్మిణి చేశాను. నాన్నకు శిష్యుడయ్యారు.. 1936లో మ్యూజిక్ కాలేజీకి ఆదిభొట్ల నారాయణదాసు ఆ తరవాత ద్వారం వెంకటస్వామినాయుడుగారు ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆయన తరవాత ప్రిన్సిపాల్‌గా అపాయింట్ చేయటానికి... ద్వారం నాయుడుగారు ఎనమండుగురిని సెలక్ట్ చేశారు. అందులో నాన్నగారు ఉన్నారు. అక్కడ అప్పటికే నాన్నగారు గానకచేరీలు చేస్తుండేవారు. స్థానిక విద్వాంసులంతా నాన్న మీద అభిమానంతో ఉన్నారు. విజయనగరంలో ఉండే వారిని సెలక్ట్ చేసుకోవటం మంచిదనే సూచనతో, నాన్న ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ సమయంలోనే ఘంటసాల గారు నాన్నకు శిష్యుడయ్యారు. మద్రాసుకి... 1952లో మద్రాసు వచ్చాను. అప్పుడు ఘంటసాల ‘పరోపకారం’ సినిమా తీస్తున్నారు. నేను ఆయన దగ్గరే ఉన్నాను. ఆయనకు కొన్ని పాటలు పాడి, మళ్లీ విజయనగరం వెళ్లిపోయాను. ఆ తరవాత మళ్లీ 1954లో తిరుపతి వెళ్లాను. అప్పుడు ఘంటసాల గారు నన్ను పిలిపించి, నన్ను ఆయన దగ్గరే ఉండిపోమన్నారు. ఆయన మాట ప్రకారం ఘంటసాలగారితో అక్కడే ఉండిపోయాను. 1971 వరకు కూడా ఘంటసాల గారితో వాళ్లింటోనే ఒక భాగంలో ఉండేవాడిని. 1971 నాటికి ఆయన ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఉత్సాహంగా ఉండే వారు కాదు. కూచిపూడి ఆర్ట్ అకాడెమీ... కూచిపూడి ఆర్డ్ అకాడెమీని వెంపటి చిన సత్యం గారు నిర్వహించేవారు. అక్కడ నన్ను సంగీతం క్లాసులు నిర్వహించమన్నారు. ఘంటసాల గారిని అడిగితే ఆయన ‘ప్రస్తుతం పనులు లేవు కదా! వెళ్లు’ అన్నారు. అలా కూచిపూడి ఆర్డ్ అకాడెమీలో చేరి, గాయకుడిగా, వాద్య కారుడిగా వారి దగ్గరే ఉండిపోయాను. 1974లో ప్రవేశించి 2012లో వెంపటి చిన సత్యం గారు పోయేవరకు అక్కడే ఉండిపోయాను. నా జీవితమంతా అక్కడే గడిచిపోయింది. ఘంటసాలగారితో అప్పట్లో జర్మనీ, ఇంగ్లండ్ వెళ్లాను. ఆ తరవాత అమెరికా వెళ్లాను. కూచిపూడి ఆర్ట్ అకాడెమీలో ప్రవేశించాక యూరప్, హవాయ్ ద్వీపాలు, అమెరికాలోని అన్ని ప్రదేశాలు తిరిగాను. అమెరికా, రష్యాలకు ఇండియా ఫెస్టివల్స్ జరిగినప్పుడు వెళ్లాను. ఆహారపు అలవాట్లు... సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల నా ఆహారపు అలవాట్లు కూడా అవే ఉండేవి. పప్పు, కూర, పచ్చడి, పులుసు, ఊరగాయలు తినేవాడిని. ఆవకాయ, అప్పడాలు, వడియాలతో పాటు,.ఆవకాయలు, నిమ్మకాయ, దబ్బకాయ వంటి సంవత్సరమంతా నిల్వ ఉండే పదార్థాలన్నీ తినేవాడిని. నా వయసు వాళ్లందరికీ ఇప్పుడు ఉండే స్వీట్ల కంటె...మినప సున్ని, పాకం చలిమిడి వంటి వాటి మీదే మక్కువ ఉండేది. అన్నిరకాల స్వీట్లు తెలిసినా, నేను దేనికోసమూ తాపత్రయ పడినట్లు జ్ఞాపకం లేదు.మా కుటుంబంలో సంగీత సాధన చేసిన మొట్టమొదటి మనిషి మా తాతగారు వెంకటనరసింహశాస్త్రి పట్రాయని. మా ఇంటి పేరు గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. మా ముందు తర ం వారు ‘పట్రాయుడు’ అని చెప్పేవారట. మా నాన్న దగ్గర నుంచి ‘పట్రాయని’ గా మారింది. ఒకాయన చేత శతావధానం చేయించారు మా నాన్న. ఆయన మా ఇంటి పేరు విని, ఇంటి పేర్లు ద్వితీయా విభక్తిలో ఉండాలి అన్నారట. దానితో మా ఇంటి పేరు పట్రాయుడు నుంచి పట్రాయనిగా మారింది. ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు అరవయ్యేళ్ల తరవాత కూడా నేను వార్ధక్యం వచ్చిందనుకోలేదు. తొంభయ్యేళ్లు వచ్చిన తరవాత కూడా వార్ధక్యం వచ్చిందన్న అనుభూతి లేదు. ఈ మధ్యనే అంటే వందేళ్లు నిండిన తరవాత క్రమేపీ దృష్టి అవి తగ్గుతుంటే, ‘ఏమిటీ ఇలా ఉన్నాను’ అనే భావన కలుగుతోంది.మా చిన్నతనంలో సాలూరులో ప్రతి సంవత్సరం కలరా వచ్చేది. ఆ వ్యాధితో పోయిన వారిని సన్నాయి మేళంతో తీసుకువెళ్లేవారు. నేను రెండు మూడు క్లాసులు చదువుత్ను రోజుల్లో ఆ ప్రాంతంలో మలేరియా ఎక్కువ ఉండేది. నేను మద్రాసు వచ్చేదాకా కూడా ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తు. మీజిల్స్ వ్యాధి చాలా సార్లు వచ్చింది. ఆ రోజుఎల్లో ఎక్కువగా ఆయుర్వేద వైద్యులుండేవారు. సాలూరులో రాజకుంటుంబాలకు సంబంధించిన ఒక వైద్యుడు ఉండేవారు. చాలా మంచి మనిషి. ఆయనకు ఒక ఆశ్రమం కట్టిచ్చారు. అందులోనే ఒక కొట్లో ఉండేవారు. ఆయన ఏదో మందు ఇస్తూ ఉండేవారు. ఎవ్వరినీ కానీ కూడా అడిగేవారు కాదు. కాని అక్కడకు వచ్చినవారు ఒక కానీ ఇచ్చేవారు. ఆయన చనిపోయిన తరవాత చూస్తే రెండు బస్తాల కాన్లు వచ్చాయి. సాలూరు ప్రాంతంలో అడ్డసరం చెట్లు ఎక్కువగా ఉండేవి. అవి వైద్యానికి బాగా ఉపయోగపడేవి. వాటి ఆకులను పుటం పెట్టి, ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు. ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు నా చిన్నతనంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు తెల్లదొరలే ఉండేవారు. స్వాతంత్రం వచ్చేనాటికి నేను సంసారంలో ప్రవేశించాను. అప్పుడు కలివెరలో ఐదేళ్లున్నాను. తమ్మినేని పాపారావు అన్నాయన ఆ గ్రామానికి ఎంఎల్ఏగా ఉండేవారు. స్వతంత్ర సాధన గురించి రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. చాలామంది అరెస్టులు అవుతుండేవారు. అల్లర్లు జరిగాయి. రాజకీయ పోరాటాలు జరిగాయి. ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు. అప్పట్లో ఆయన రోడ్డు మీదకు వెళ్లి అల్లర్లకు సంబంధించి పాటలు పాడేవారు.1936లో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పోటీ చేసింది. సాలూరు నుంచి పోటీ చేసిన వి. వి. గిరి గారు పోటీ చేశారు. ఆయనకు పోటీగా బొబ్బిలిరాజు నిలబడ్డారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వి. వి. గిరిగారు, అక్కడ ఉన్న పేరయ్య హోటల్లో భోజనం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనే గెలిచారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
అత్యాచార బాధితురాలిని కొట్టి ఊరేగించారు
భోపాల్: మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధిరాలితోపాటు, నిందితుడిని ఊరేగించిన వైనం కలకలం రేపింది. 16 ఏళ్ల బాధిత మైనర్ బాలికతోపాటు, నిందితుడిని తాళ్లతో కట్టేసి దాడిచేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. దాడి చేసిన వారిలో బాలిక కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. (హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం) మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని గ్రామంలోఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులతో పాటు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. రెండు కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల వ్యక్తిపైన ఒకటి, ఈ దారుణానికి సహకరించిన బాలిక కుటుంబ సభ్యులు, సహా, ఇతరులపై మరో ఎఫ్ఐఆర్ నమెదు చేశామన్నారు. -
‘అట్రాసిటీ’పై దేశవ్యాప్త ఉద్యమం : మందకృష్ణ
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పరిరక్షణ సమితి చైర్మన్ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓయూ అతిథి గృహంలో జరిగిన మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతమున్న చట్టంలో ఎటువంటి మార్పులు చేసినా సహించేది లేదన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా వచ్చేనెల 17న ఢిల్లీలో సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు మందకృష్ణ వెల్లడించారు. -
విక్రమ్ డాటర్ వెడ్స్...
విక్రమ్‌కు పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉందా?... చాలామంది ప్రేక్షకులకు సోమవారం చిన్నపాటి స్వీట్ షాక్ తగిలింది! కానీ, నమ్మక తప్పదు. ఎప్పుడూ యంగ్‌గా కనిపించే విక్రమ్.. నిన్నే తన కూమార్తె అక్షిత పెళ్లి చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మునిమనవడు మనోరంజిత్, అక్షిత కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్నారట! ఇరువురి కుటుంబ సభ్యులు ప్రేమకు పచ్చ జెండా ఊపడంతో నిన్న పెళ్లి పీటలు ఎక్కారు. చెన్నైలోని గోపాలపురంలో గల కరుణానిధి నివాసంలో తమిళ సాంప్రదాయం ప్రకారం చాలా నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి కరుణానిధి, విక్రమ్‌ల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. -
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శుక్రవారం యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి హబీబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ వికార్, భాను బేగంలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు మేస్త్రీ పనిచేస్తూ మరొక చోట భార్య పిల్లలతో ఉంటుండగా, మహమ్మద్ వాసీల్(17) స్థానికంగా ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఇతని తండ్రి వికార్ గతంలోనే మృతి చెందగా, తల్లి భానుబేగం చిన్నకొడుకు వాసీల్ వద్ద ఉంటోంది. వాసీల్‌కు జ్వరం రావటంతో గత సోమవారం హ బీబ్‌నగర్‌లో ఆర్ఎంపీ బషీర్‌బాబా వద్దకు తీసుకెళ్లారు. అతను ఆర్ఎంపీ వాసీల్ నడుముకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయితే, ఇంజెక్షన్లు ఇచ్చిన చోట పుండ్లు అయ్యాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపగా గత గురువారం రాత్రి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న వాసీల్ సాయంత్రం ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా.. వాసీల్‌కు చికిత్స చేసిన ఆర్ఎంపీపై బంధువులు, స్థానికులు దాడిచేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'మిస్ హైదరాబాద్' 2014 ఎవరు!