ప్రభాస్ పేరు చెప్పగానే 'బాహుబలి', 'సాహో', 'సలార్' లాంటి పాన్ ఇండియా సినిమాలే గుర్తొస్తాయి. అలాంటిది మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త మూవీలో నటిస్తాడనే విషయం బయటకు రాగానే అందరూ షాకయ్యారు. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్.. ఓ రీజనల్ హీరో సినిమాలోనా? అని మీరు అనుకోవచ్చు. కానీ దీని వెనక చాలా కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
మంచు విష్ణు హీరోగా.. భక్త కన్నప్ప స్టోరీతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఉన్నట్టుండి సడన్‌గా ఈ మూవీలోని శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారనే టాక్ బయటకొచ్చింది. ఇది నిజమేనని విష్ణు కూడా ఓ ట్వీట్ కి సమధానమిచ్చాడు. ఇప్పటికే రాముడు, విశ్వామిత్రుడు పాత్రల్లో యాక్ట్ చేసిన ప్రభాస్.. ఇందులో శివుడిగా ఎలా ఉండబోతున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే తెగ ఆలోచిస్తున్నారు.
ఇకపోతే 'బుజ్జిగాడు' మూవీ చేస్తున్న టైంలోనే ప్రభాస్‌కి మోహన్‌బాబుతో మంచి బాండింగ్ ఏర్పడింది. మరోవైపు మంచు విష్ణు, ప్రభాస్ చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. గతంలో విష్ణు 'దూసుకెళ్తా' ఓ సీన్ కోసం ప్రభాస్ గొంతు అరువిచ్చాడు. అలానే ఇప్పుడు తీస్తున్న సినిమాకు డైరెక్టర్ ముఖేశ్ కుమార్. 'మహాభారతం' సీరియల్‌ని తీసింది ఈయనే. ఈ డైరెక్టర్ అంటే కచ్చితంగా తనని బాగా చూపిస్తారనే ప్రభాస్ అనుకున్నాడు. ఇలా చాలా కారణాలు.. మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ నటించడానికి కారణాలు అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రైతుబిడ్డ సెంటిమెంట్ వాడొద్దు.. ప్రశాంత్ కి కంటెస్టెంట్ల వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment