South Africa vs India, 2nd Test - Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయి చేరుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఈ ఘనత సాధించాడు.
సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత పేసర్లు
కేప్‌టౌన్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పేసర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్ మీద నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేశారు.
మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో తొలిసారిగా ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.
ఆదిలోనే జైస్వాల్ అవుట్
అయితే, ప్రొటిస్ పేసర్ కగిసో రబడ.. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరగగా.. అతడి స్థానంలో వచ్చిన శుబ్‌మన్ గిల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జతయ్యాడు.
ఇక గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన హిట్‌మ్యాన్ కేప్‌టౌన్‌లో మాత్రం బౌండరీలు బాదుతూ దూకుడుగా ఆడుతున్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి 37 బంతుల్లో 38 పరుగులతో జోరుమీదున్నాడు.
#RohitSharma is up & about!
— Star Sports (@StarSportsIndia) January 3, 2024
Three 4️⃣s to get going in this #TeamIndia innings.
Tune in to #SAvIND 2nd Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/kuZAOIHJJH
1000 పరుగులు పూర్తి చేసుకున్న గిల్
మరోవైపు.. అతడి తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న వన్‌డౌన్ బ్యాటర్ గిల్.. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో నండ్రే బర్గర్ వేసిన నాలుగో బంతికి రెండు పరుగులు తీసి వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
కాగా తన టెస్టు కెరీర్లో 36వ ఇన్నింగ్స్‌లో ఘనత ఈ మైలురాయిని అందుకున్నాడు. మెల్‌బోర్న్‌లో 2020 నాటి ఆస్ట్రేలియా మ్యాచ్‌తో శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 45, 35 (నాటౌట్) పరుగులు చేశాడు గిల్.
అప్పుడు సెంచరీ మిస్
అదే విధంగా మరో మ్యాచ్‌లో గాబా స్టేడియంలో 91 పరుగులు సాధించి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. గిల్ కెరీర్‌లో ఇప్పటి వరకు టెస్టుల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు సాధించాడు. అయితే, విదేశీ గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంద పరుగుల మార్కు అందుకోలేకపోయాడు.
ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్‌మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పది ఓవర్లు ముగిసే సరికి ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు.
చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు: అందుకే అనామక జట్టును పంపుతున్నాం!
Comments
Please login to add a commentAdd a comment