అత్యాచార బాధితురాలిని కొట్టి ఊరేగించారు | Rape Survivor Tied Paraded With Her Attacker In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

అత్యాచార బాధితురాలిని కొట్టి ఊరేగించారు

Published Mon, Mar 29 2021 12:59 PM | Last Updated on Mon, Mar 29 2021 2:31 PM

 Rape Survivor Tied Paraded With Her Attacker In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధిరాలితోపాటు, నిందితుడిని ఊరేగించిన వైనం కలకలం రేపింది. 16 ఏళ్ల బాధిత మైనర్‌ బాలికతోపాటు, నిందితుడిని తాళ్లతో కట్టేసి దాడిచేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. దాడి చేసిన వారిలో బాలిక కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం​. ఈ ఘోరానికి  సంబంధించిన వీడియో  వైరల్‌ అయింది.  (హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం)

మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పూర్ జిల్లాలోని గ్రామంలోఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులతో పాటు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. రెండు కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల వ్యక్తిపైన ఒకటి, ఈ దారుణానికి సహకరించిన బాలిక కుటుంబ సభ్యులు, సహా, ఇతరులపై మరో ఎఫ్ఐఆర్ నమెదు చేశామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement