సోనుసూద్‌ను అరెస్ట్‌ చేయండి.. కోర్టు ఆదేశాలు | Punjab Court Issues Arrest Warrant To Sonu Sood In Connection With An Alleged Fraud Case, More Details Inside | Sakshi
Sakshi News home page

సోనుసూద్‌ను అరెస్ట్‌ చేయండి.. కోర్టు ఆదేశాలు

Published Fri, Feb 7 2025 7:04 AM | Last Updated on Fri, Feb 7 2025 10:31 AM

Punjab Court Issues Arrest Warrant To Sonu Sood

పాటియాలా: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తాజాగా ఆయనకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది పంజాబ్‌లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది.

వివరాల ప్రకారం.. నటుడు సోనుసూద్‌ (Sonu Sood)కు లూథి​యానా కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. కాగా, లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ ఖన్నా తనకు మోహిత్‌ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్‌ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు.. సోనుసూద్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

పిటిషన్‌పై విచారణ అనంతరం..‘సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఇక, సోనుసూద్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనుసూద్‌ తెలుగు సహా బాలీవుడ్‌లో​ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement