‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్‌ వాంగ్మూలం! | Saif Ali Khan Shared Statement About Details Of January 16 Home Incident With Bandra Police, Check Out For More Info | Sakshi
Sakshi News home page

‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్‌ వాంగ్మూలం!

Published Fri, Jan 24 2025 9:39 AM | Last Updated on Fri, Jan 24 2025 10:52 AM

Saif Ali Khan Shares Details of January 16 Home Incident with Bandra Police

ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ పోలీసులకు వాంగ్మూలం ‌ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్‌ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్‌ వివరించినట్లు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య  కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్‌ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్‌ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్‌ చేశాడు. 

దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్‌ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్‌ను రక్షించేందుకు ఫిలిప్‌ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.

ఫిలిప్‌ కేకలు విన్న నేను జెహ్‌ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్‌ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే  దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్‌ను రక్షించిన సహాయకులు  మరో రూంలోకి  తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.

ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు  సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్‌ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు.  మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు.  

సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్‌ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్‌ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్‌తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్‌పై వేలిముద్రల్ని గుర్తించారు.  

అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్‌లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్‌ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement