Bandra police
-
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్‌తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్‌పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్‌లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. -
సుశాంత్ మృతి: 14 మంది స్టేట్మెంట్ నమోదు
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) మృతి కేసులో ముంబై పోలీసులు 14 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సుశాంత్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అతని సన్నిహితుల స్టేట్మెంట్లు దోహదపడతాయని పోలీసులు శనివారం చెప్పారు. కాగా, జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణంగా కేసు నమోదు చేసుకున్న బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చనిపోయే ముందు సుశాంత్ ఔదర్యం!) సుశాంత్ తండ్రి, అతని ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఓ స్నేహితుడు, క్రియేటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ పితాని, మేనేజర్ సందీప్ సావంత్, నటుడు మహేష్ శెట్టీ, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా, బిజినెస్ మేనేజర్ శ్రుతీ మోదీ, పీఆర్ఓ అంకితా తెహ్లానీ, నటుడు రియా చక్రవర్తి, తాళాలు తయారు చేసే ఓ వ్యక్తి, ఇంట్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు జోన్ 9 డీసీపీ అభిషేక్ త్రిముఖే తెలిపారు. కాగా, సుశాంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులెవరూ అతని మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తంచేయలేదని సమాచారం. (చదవండి: అమ్మకు తోడు) -
టాప్ హీరో ఇంట్లో కలకలం
ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కలకలం చోటుచేసుకుంది. సల్మాన్ ఇంట్లోకి చొరబడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపింది. బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోకి ఒక యువకుడు చొరబడ్డాడు. సెక్యురిటీ గార్డు లేకపోవడంతో అతడు లోపలికి వెళ్లిపోయాడు. స్థానికులు అప్రమత్తం చేయడంతో సెక్యురిటీగార్డు.. పోలీసులకు సమాచారం అందించాడు. బాంద్రా పోలీసులు వచ్చి అపార్ట్మెంట్లోకి చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మహ్మద్ షిరౌద్దీన్(25)గా గుర్తించారు. అతడిని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. తర్వాత అతడిని విడిచిపెట్టారు. నిందితుడిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘ట్యూబ్‌లైట్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 25న విడుదల కానుంది.