నిందితుడు మహ్మద్ షిరౌద్దీన్ (పచ్చ చొక్కా వ్యక్తి)
ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కలకలం చోటుచేసుకుంది. సల్మాన్ ఇంట్లోకి చొరబడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపింది. బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లోకి ఒక యువకుడు చొరబడ్డాడు. సెక్యురిటీ గార్డు లేకపోవడంతో అతడు లోపలికి వెళ్లిపోయాడు. స్థానికులు అప్రమత్తం చేయడంతో సెక్యురిటీగార్డు.. పోలీసులకు సమాచారం అందించాడు. బాంద్రా పోలీసులు వచ్చి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని మహ్మద్ షిరౌద్దీన్(25)గా గుర్తించారు. అతడిని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. తర్వాత అతడిని విడిచిపెట్టారు. నిందితుడిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘ట్యూబ్‌లైట్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 25న విడుదల కానుంది.