బైకును ఢీకొన్న హీరోయిన్‌ కారు.. వ్యక్తి మృతి | Biker Dies After Colliding With Zareen Khan Car in Goa | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 13 2018 9:58 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Biker Dies After Colliding With Zareen Khan Car in Goa - Sakshi

హిందీతో పాటు తమిళ, పంజాబీ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జరీన్‌ ఖాన్‌. గోవాలో ఈ నటి ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడంతో ఓ యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. బైక్‌ పై వెళుతున్న వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోకపోవటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన జరీన్‌ ఆ యువకుడిని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.

జరీన్‌ కారు డ్రైవర్‌పై యాక్సిడెంట్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్ హీరోగా 2010లో తెరకెక్కిన ‘వీర్’ సినిమాతో జరీన్ ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ ఏడాది మొదట్లో విక్రమ్‌భట్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన 1921 సినిమాలో జరీన్‌ నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement