బిగ్‌బాస్‌లోకి మాజీ క్రికెటర్‌.. | Bigg Boss Season 12: List Of Contestants | Sakshi
Sakshi News home page

హౌస్‌లోకి ఎంటరైన మాజీ క్రికెటర్‌, విచిత్ర జోడీస్‌!

Published Mon, Sep 17 2018 1:55 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

Bigg Boss Season 12: List Of Contestants - Sakshi

బిగ్‌ బాస్‌ 12 హిందీ షో

వివాదాస్పదమైన రియాల్టీ షో బిగ్‌బాస్‌ మరో సరికొత్త సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదేంటి? ఇప్పటికే ఒక షో రన్‌ అవుతుంది కదా అనుకుంటున్నారా? అయితే ఈ సరికొత్త సీజన్‌ మన తెలుగులో కాదు.. హిందీలో. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్  హోస్ట్‌గా బిగ్‌బాస్ 12 సీజన్‌ను ప్రారంభమైంది. ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్లతో ప్రోమో కూడా విడుదలైంది. ఇటీవల 12 సీజన్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్‌ను కూడా గోవాలో నిర్వహించారు. ‘విచిత్ర జోడీస్‌’ థీమ్‌తో ఈ సీజన్‌ అలరిస్తోంది. ఈ షోలో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు. మూడు నెలల పాటు బయట ప్రపంచం తెలియకుండా.. కేవలం హౌజే లోకంగా వీరు గడపనున్నారు. కంటెస్టెంట్లను ఎంతో సౌకర్యవంతంగా ఉంచుతున్నామని ఆర్ట్‌ డైరెక్టర్‌ ఓముంగ్‌ కుమార్‌ తెలిపారు. షో ఫార్మాట్‌ పాత సీజన్‌ల మాదిరిగానే ఉండనుందని, అయితే ఈ సారి కొత్త టైమ్‌ స్లాట్‌లో ఇది ప్రసారమవనుంది. వీకెండ్స్‌లో రాత్రి 9 గంటలకు ఇది బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. 

అయితే ఈ సీజన్‌లో పాల్గొంటున్న కంటెస్టెంట్లు ఎవరెవరో తెలుసుకుందామా?
కరణ్‌వీర్‌ బోహ్రా : ఇతను పాపులర్‌ టెలివిజన్‌ నటుడు. నాగిన్‌ సీరియల్‌తో ఈయన చాలా ఫేమస్‌ అయ్యాడు. సౌభాగ్యవతి భవ, కసౌటి జిందగి క్యా, కుబూల్‌ హై వంటి రోజువారీ ధారావాహికలు, రియాల్టీ షోలలో నటించారు. కరణ్‌వీర్‌, మోడల్‌ వీజే టీజే సిద్ధును వివాహమాడారు. ఈ కపుల్‌కు ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. 

శివ్‌శిశ్‌ మిశ్రా, సౌరభ్‌ పటేల్‌ : బిగ్‌బాస్‌ 12లో తొలి విచిత్ర జోడి వీరే. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన వీరిలో శివ్‌శిశ్‌ వ్యాపారవేత్త కాగ, సౌరభ్‌ వ్యవసాయదారుడు. తొలి జోడీగా వీరిని సల్మాన్‌ ఖాన్‌ ప్రేక్షకులకు పరిచయం చేశారు. శివ్‌శిశ్‌ మిశ్రా కేవలం బ్రాండెడ్‌ దుస్తులను మాత్రమే ధరిస్తాడు.

దీపికా కకార్‌ ఇబ్రహిం : పౌరాణిక ప్రదర్శన నీర్‌ భరే తేరే నైనా దేవిలో లక్ష్మిగా తన నటన జీవితాన్ని ప్రారంభించారు దీపికా కకార్‌. కానీ ససురాల్‌ సిమర్‌ కాలో సిమర్‌గా ఎక్కువగా పాపులారిటీ పొందారు. ఆమె, తన మాజీ కో-స్టార్‌, ప్రియుడు షోయబ్‌ ఇబ్రహింను పెళ్లి చేసుకున్నారు. ముస్లిం యువకుడైన షోయబ్‌ను మనువాడటం కోసం దీపికా తన మతం మార్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీపికా కూడా ఇప్పుడు మూడు నెలల పాటు బిగ్‌బాస్‌ ప్రేక్షకులను అలరించనుంది.

రోమిల్‌ చౌదరి, నిర్మల్‌ సింగ్‌ : రోమిల్‌ న్యాయవాది కాగ, నిర్మల్‌ హర్యానాకు చెందిన పోలీస్‌. వీరిద్దరు కూడా బిగ్‌బాస్‌ 12 హౌజ్‌లోకి ప్రవేశించారు. రోమిల్‌, నిర్మల్‌ ఇద్దరూ స్నేహితులు. తన పార్టనర్‌ రోమిల్‌ తనకు పోటీగా పరిగణలోకి తీసుకోవడం లేదని చెబుతూ.. నిర్మల్‌ తమ స్నేహ విలువను చాటిచెప్పారు. భాగస్వామిలో ఒక సగం గెలిస్తే, మరో సగం వేడుకల్లో భాగం పంచుకుంటుందని చెప్పారు. 

అనూప్‌ జలోటా, జస్లీన్‌ మత్తారు : అధ్యాత్మిక గీతాలు, భజనలు ప్రసిద్ధి చెందిన ఆయన అనూప్‌ జలోటా. తన శిష్యురాలు, గర్ల్‌ఫ్రెండ్‌ జస్లీన్‌ మత్తారు. వీరిద్దరికీ దాదాపు 35 ఏళ్ల తేడా. అనూప్‌, జస్లీన్‌ ఇద్దరూ ఎంతో కాలంగా డేటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట బిగ్‌బాస్‌ 12లోకి అడుగుపెట్టింది. ఇంత లేటు వయసులో నీకు గర్ల్‌ఫ్రెండ్‌ అవసరమా? అధ్యాత్మిక వేత్తవై జనాలకు నీవు చెప్పేది ఇదేనా? అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. 

సోమి ఖాన్‌, సబా ఖాన్‌ : వీరిద్దరూ జైపూర్‌ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు. ఈ షోను తప్పకుండా తామే గెలుస్తామని అక్కాచెల్లెళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హౌజ్‌లో ఒక​ టీమ్‌గా పనిచేస్తామని, క్లిష్టమైన సమయాల్లో ఒకరికొకరం సాయం చేసుకుంటామని చెబుతున్నారు.

శ్రిష్టి రోడ్‌ : ఇష్క్‌బాజ్‌, చోటి బహు 2, సరస్వతి చంద్ర వంటి పలు షోల్లో నటించిన శ్రిష్టి రోడ్‌ కూడా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ప్రవేశించారు. ఈ నటి టెలివిజన్‌ నటుడు మనీష్‌ నాగ్‌దేవ్‌ను వివాహమాడారు. 

దీపక్‌ ఠాకూర్‌, ఊర్వశి వాణి : బిహార్‌కు చెందిన గాయకుడు దీపక్‌ ఠాకూర్‌ తన అభిమాని ఊర్వశి వాణితో కలిసి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ప్రవేశించారు. తన అభిమాన గాయకుడిని కలిసేందుకు ఊర్వశి ఇంట్లో నుంచి పారిపోయి మరీ వచ్చింది. 

రోష్మి, కీర్తి : రోష్మి, కీర్తిని ప్రేక్షకులే ఎంపిక చేశారు. వీరు కూడా బిగ్‌బాస్‌ 12 హౌజ్‌లో సందడి చేయనున్నారు. 

శ్రీశాంత్‌ : మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ గత కొన్నేళ్ల క్రితమే టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. క్రికెట్‌లో అతనిపై నిషేధం విధించడంతో, టెలివిజన్‌ రంగంపై దృష్టిసారించాడు. పాపులర్‌ డ్యాన్స్‌ రియాల్టీ షో ఝలక్‌ దిక్లాజా, ఖాత్రోం కి కిలాడి వంటి షోల్లో నటించాడు. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ రియాల్టీ షోతోనూ తాను మరింత ఫేమస్‌ అవ్వాలని చూస్తున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement