బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల సంపాదనెంత? | Bigg Boss Season 12: How Much Money Are The Contestants Earning? | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల సంపాదనెంత?

Published Wed, Sep 26 2018 10:50 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

Bigg Boss Season 12: How Much Money Are The Contestants Earning? - Sakshi

ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలతో బిగ్‌ బాస్‌ షో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హిందీలో బిగ్‌ బాస్‌ 12వ సీజన్‌ కూడా ప్రారంభమైంది. ఈ షోతో కొంతమంది కంటెస్టెంట్లకు తమ కెరీర్‌ను సెట్‌ చేసుకోవడానికి సహకరిస్తుంది. 

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ చేస్తున్న ఈ షోలో కొంతమంది కంటెస్టెంట్ల  సంపాదన ఎంత ఉందో ఓ సారి తెలుసుకుందాం.. 
సల్మాన్‌ ఖాన్‌ : హోస్ట్‌గా పనిచేస్తున్న కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు భారీ మొత్తంలో ఆఫర్‌ చేస్తున్నారు. ముందస్తు సీజన్లలో ఖాన్‌కు రూ.2.5 కోట్లు చెల్లించగా.. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ సీజన్‌ 12లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14కోట్లను పొందుతున్నాడు ఖాన్‌. అంటే సల్మాన్‌ సంపాదన బిగ్‌ బాస్‌ షోతో మరింత పెరిగింది.

అనూప్‌ జలోటా :  అధ్యాత్మిక గీతాలు, భజనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనూప్‌ జలోటా. తన కంటే దాదాపు 35 ఏళ్ల చిన్న అమ్మాయి జస్లీన్‌తో గత కొంత కాలంగా డేటింగ్‌ చేస్తూ.. బిగ్‌ బాస్‌ షోలోకి ఇద్దరూ కలిసి అడుగుపెట్టారు. హిందీ బిగ్‌ బాస్‌ షోలో అ‍త్యధికంగా సంపాదించే కంటెస్టెంట్‌గా అనూప్‌ చరిత్ర సృష్టించాడు. ఆయనకున్న పాపులారిటీకి, పాత ప్రేక్షకులను ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకోవడం కోసం, అనూప్‌కు వారానికి రూ.45 లక్షలను చెల్లిస్తున్నారు.  

కరణ్‌వీర్‌ బోహ్రా : ఇతను పాపులర్‌ టెలివిజన్‌ నటుడు. నాగిన్‌ సీరియల్‌తో ఫేమస్‌ అయి, బిగ్‌ బాస్‌ సీజన్‌ 12లోకి అడుగుపెట్టిన కరణ్‌వీర్‌ వారానికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నాడు. సౌభాగ్యవతి భవ, కసౌటి జిందగి క్యా, కుబూల్‌ హై వంటి రోజువారీ ధారావాహికలు, పలు రియాల్టీ షోలలో నటించారు. కరణ్‌వీర్‌, మోడల్‌ వీజే టీజే సిద్ధును వివాహమాడారు. ఈ కపుల్‌కు ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. 

దీపిక కకార్‌ : ససురాల్‌ సిమర్‌ కా స్టార్‌ దీపికా.. వారానికి రూ.15 లక్షలను తన ఇంటికి పంపిస్తున్నారు. ససురాల్‌ సిమర్‌ కా తోనే ఎక్కువగా పాపులారిటీ పొందిన ఈమె, బిగ్‌ బాస్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నారు. ముస్లిం యువకుడైన తన ప్రియడు షోయబ్‌ ఇబ్రహింను మనువాడటం కోసం దీపికా తన మతం మార్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

శ్రీశాంత్‌ : వచ్చిన రెండు రోజుల్లోనే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో వివాదాలు సృష్టించిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, వారానికి రూ.5 లక్షలను సంపాదిస్తున్నాడు.

నేహా పెండ్సే : బిగ్‌ బాస్‌ 12వ సీజన్‌లో ఎక్కువగా సంపాదన ఆర్జించే కంటెస్టెంట్లో నేహా కూడా ఒకరు. హౌజ్‌లో ఉన్నంత కాలం ఈమె వారానికి 20 లక్షల రూపాయలను సంపాదించనున్నారు. ప్రజల్లో ఈమెకు చాలా పాపులారిటీ ఉంది.

గతేడాది కంటే ఈ ఏడాది కంటెస్టెంట్లకు ఎక్కువగా చెల్లిస్తున్నారు. గతేడాది ఎక్కువగా చెల్లించిన కంటెస్టెంట్‌ హీనా ఖాన్‌. ఆమెకు వారానికి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు చెల్లించారు. విన్నర్‌ శిల్పా షిండే కూడా వారానికి రూ.6 లక్షల నుంచి రూ.6.5 లక్షలు మాత్రమే ఆర్జించే వారు. చివరిలో గెలిచిన తర్వాత వచ్చే నగదు బహుమతి, సంపాదించే వాటి కంటే ఎక్కువగా ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement