
బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్.. నమ్రతతో గొడవపడింది.. కానీ ఇప్పుడు కాదు! హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లడానికి రెండువారాలముందు సోదరితో పేచీ పెట్టుకుంది.

బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లే రోజు కూడా నమ్రతతో మాట్లాడనేలేదు.

కానీ రియాలిటీ షోకి వెళ్లాక నమ్రత గుర్తొచ్చి ఏడ్చేసింది. మూడు నెలలపాటు సోదరికి దూరంగా ఉన్న శిల్ప ఎట్టకేలకు అక్క దగ్గర వాలిపోయింది.

ఎంత మిస్ అయ్యానో అంటూ సోదరిని గట్టిగా హత్తుకుంది. జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా తనను కలిసినట్లు తెలుస్తోంది.

నువ్వు ఎప్పటికీ నా సోదరివే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బర్త్‌డే విషెస్ తెలిపింది.

ఇదిలా ఉంటే నమ్రత పుట్టినరోజు పురస్కరించుకుని మహేశ్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో అమ్మాయిలకు హెచ్‌పీ వ్యాక్సిన్ వేశారు.

