సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో సంచలనాలకు చిరునామా నటి త్రిష(Trisha Krishnan) అంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమెకు సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. 41 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ భారీ హిట్లు కొడుతుంది. నటిగా 22 ఏళ్ల కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ మొదలగు ఐదు భాషల్లో కథానాయకిగా సత్తా చాటుతుంది. ఇప్పటికీ అజిత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయకిగానే కొనసాగుతుంది.
ఇన్ని అర్హతలు కలిగిన ఈ చైన్నె సుందరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈమె గురించి వదంతులు చాలా కాలంగానే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల నటుడు విజయ్‌తో (Vijay) కలుపుతూ రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఈమె మాత్రం విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పలు వేదికల మీద తెలిపింది. అయితే, త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం(Political Entry) చేయబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఈమె చాలా కాలం క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
అదే విధంగా నటుడు విజయ్ పార్టీలో చేరనున్నారు అనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష తన అభిమానులకు త్వరలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతుందని వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా నటిస్తూ బిజీగా ఉన్న త్రిష నటనకు స్వస్తి చెబుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే నటుడు విజయ్ కూడా కెరీర్ పరంగా మంచి పీక్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెబుతూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
కాగా త్రిష ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, త్రిష పాలిటిక్స్‌లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తుందని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment