జార్ఖండ్ బ్యూటీ 'శ్వేతా బసు ప్రసాద్'(Shweta Basu Prasad) నటించిన బోల్డ్ మూవీ 'ఊప్స్ అబ్ క్యా' (Oops Ab Kya) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు తాజాగా అడల్ట్ రేటెడ్ డైలాగ్స్‌తో ఒక టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. పెళ్లికాని ఒక యువతి అనారోగ్యంగా కారణంగా ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్స్ చేసిన చిన్న పొరపాటుతో ఆమె ప్రెగ్నెట్ అవుతుంది. ఇంతకూ ఆస్పత్రిలో జరిగిన సంఘటన ఏంటి..? అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఊప్స్ అబ్ క్యా చిత్రం రానుంది. అయితే, ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది.
కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు వారికి దగ్గరైన శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఊప్స్ అబ్ క్యా చిత్రం డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో(Disney+ Hotstar) స్ట్రీమింగ్ కానుంది. సినిమా చాన్స్‌లు తగ్గిన తర్వాత శ్వేతా పలు బోల్డ్ వెబ్ సిరీస్‌లలో నటించింది. ఈ క్రమంలో ఆమె నుంచి వస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ప్రస్తుతం హిందీ వర్షన్‌లో మాత్రమే రిలీజ్ కానుంది. అయితే, తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
( ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)
యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే పరిస్థితి ఏంటి..? అనే బోల్డ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే కాస్త ఆసక్తిగా, సరికొత్త కథతో మేకర్స్ తెరకెక్కించారని తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలోనే ఒక పెద్దావిడ తన మనవరాలికి శీలం గురించి చెబుతుంది. పిగ్గీ బ్యాంక్‌లా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని తేలుతుంది. అయితే, ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉండటం వల్ల ఇదంతా జరిగింది ఏమో అనుకుంటారు. కానీ, తమ మధ్య ఎలాంటి పొరపాటు జరగలేదని ఆ యువతి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
అయితే, అసలు తప్పు డాక్టర్ దగ్గర జరిగిందని తర్వాత ఆమె తెలుస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఆ అమ్మాయికి డాక్టర్ పొరపాటును మరొకరి స్పెర్మ్ ఇన్సర్ట్ చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న మరో అమ్మాయికి అందించాల్సిన చికిత్స పొరపాటున తనకు చేసినట్లు డాక్టర్ చెప్పడంతో ఖంగుతింటుంది. అయితే, ఆ ప్రెగ్నెన్సీని ఆమె కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. అందుకు కారణాలు ఎంటి..? ఆ తర్వాత కథలో అనేక మలుపులు. చివరకు ఏం జరిగిందన్నది తెలియాలంటే ఫిబ్రవరి 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment