shweta basu prasad
-
నా ఈ జీవితం మొదలవడానికి కారణం దిల్ రాజు..!
-
టాలీవుడ్ వాళ్ళు ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తారు
-
కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేతా బసు ప్రసాద్. అమాయకపు చూపు, నిష్కల్మషమైన నవ్వుతో తొలి చిత్రంతోనే ఎంతోమంది గుండెలు కొల్లగొట్టిందీ హీరోయిన్. టాలీవుడ్లో ఫస్ట్ సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీ వచ్చినా దాన్ని కాపాడుకోలేకపోయింది. సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొనితెచ్చుకుంది. తర్వాత జీనియస్ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. ఏడేళ్లపాటు తెలుగు తెరకు దూరమైన ఆమె 2018లో విజేతతో పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌ను వదిలి హిందీలోనే సినిమాలు, సిరీస్‌లు, సీరియళ్లు చేసుకుంటోంది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూసిందీ హీరోయిన్. 2018లో డైరెక్టర్ రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడగా విభేదాల కారణంగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది. కాగా బుధవారం (జనవరి 11న) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు.. కొన్నింటిలో శ్వేతను అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నామని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) చదవండి: ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి: దిల్ రాజు క్యాన్సర్‌తో చచ్చిపోయినా సరే కానీ ట్రీట్మెంట్ వద్దన్నా: సంజయ్ దత్ -
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ని గుర్తుపట్టారా? ఎంతలా మారిపోయిందో
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ని గుర్తుపట్టారా? ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు జీరో సైజ్‌తో ఆకట్టుకుంటుంది. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులో క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన హిట్స్ లేక తమిళ, హిందీ పరిశ్రమలకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించినా ఆశించినంత సక్సెస్ కాలేదు. ఇక పర్సనల్ లైఫ్‌లోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శ్వేత బసు ప్రసాద్ 2018 లో ప్రియుడు 2018 లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడింది. అయితే ఏడాది తిరగకుండానే అతడితో విడాకులు తీసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న శ్వేత బసు చివరగా తెలుగులో విజేత సినిమాలో తళుక్కుమంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్చేస్తూ రచ్చ చేస్తుంది. -
భర్తతో విడాకులు..అది బ్రేకప్‌లా ఉంది : నటి
బాల నటిగా కెరియర్ ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్.. కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించినా శ్వేతాకు పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు. అదే సమయంలో ఆమెను పలు వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018 డిసెంబర్ 13న ఆమె బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైయినా ఏడాదిలోపే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందించిన శ్వేతా పరస్పర అంగీకారంతో విడిపోయామని, అది ఒక బ్రేకప్‌లా జరిగిందన్నారు. (డిప్రెషన్లో నటి శ్వేతా బసు..! ) 'పెళ్లయిన పదేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా చాలా మంది దంపతులు విడిపోవడం చేస్తుంటాం. కానీ తామిద్దరం మాత్రం ఏడాదిలోనే మా బంధానికి ముగింపు పలకాలనుకున్నాం. కాబట్టి దీన్ని విడాకులు అని పెద్ద పదంతో పోల్చడం కంటే, బ్రేకప్ అనడం కరెక్ట్ అనిపిస్తుంది. ఆ సమయంలో నాకు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. ఇప్పడు నాకు నేనే ఓ మంచి స్నేహితురాలిగా మరాను..ఇప్పుడు అంతా బాగానే ఉంది' అని వివరించింది. కాగా 2019లో తన భర్త రోహిత్ నుంచి విడిపోతున్నట్లు శ్వేతా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా 2002లో మక్దే అనే ఓ హిందీ సినిమాలో బాల నటిగా జాతీయ అవార్డును అందుకుంది. అయితే 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. తర్వాత ఆమె ఆ కేసులో నిర్దోషి అని తేలింది. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం పాటు ఆమె సినిమాలకు దూరం అయ్యింది. (హీరోయిన్ నగ్న ఫోటో అడిగిన ఫ్యాన్.. ) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) -
కొత్త బంగారు లోకం హీరోయిన్.. గ్రాండ్ బర్త్ డే పార్టీ
-
శ్వేతా గురించి ఈ విషయాలు తెలుసా?
బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్.. ‘కొత్తబంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘ఏకడా..’ అంటూ శ్వేత చెప్పిన డైలాగ్ ఎప్పటికీ గుర్తిండి పోతుంది. అయితే ఈ సినిమా తర్వాత శ్వేతాకు పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు. కాస్కో, రైడ్, ‘కళావర్ కింగ్’ వంటి సినిమాల్లో నటించినా అవి అంతగా విజయం సాధించలేదు. అనంతరం బాలీవుడ్‌కి వెళ్లిపోయి అక్కడ చిన్న చిన్న సినిమాలు చేశారు. ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ అనే సినిమాలో వదిన పాత్రగా మెప్పించిన శ్వేతా చివరగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ది తాష్కెంట్ ఫైల్స్ లో కనిపించింది. ఆమె ఇప్పటివరకు తమిళం, తెలుగు, బెంగాలీ భాషలలో ఎనిమిది సినిమాలు చేసింది. చదవండి: డిప్రెషన్లో నటి శ్వేతా బసు..! ఇదిలా ఉండగా శ్వేతా బసు ఈరోజు తన 29వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 1991 జనవరి 11న జమ్ షెడ్ పూర్’లో శ్వేతా జన్మించింది. తన చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ముంబైలో స్థిరపడిన శ్వేతా మాస్ మీడియా, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె మొదటి హిందీ సినిమా ఫిర్ బి హిందూస్తానీ. ఆ సినిమా తర్వాత 2002లో మక్దే అనే ఓ హిందీ సినిమాలో బాల నటిగా నటించింది. ఈ సినిమాకు శ్వేతా ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకుంది. అయితే 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. తర్వాత ఆమె ఆ కేసులో నిర్దోషి అని తేలింది. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం పాటు ఆమె సినిమాలకు దూరం అయ్యింది. కాగా ప్రముఖ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్లో ఉన్న వీరు 2018 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోతున్నట్లు శ్వేత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
ఆందోళనగా ఉంది: శ్వేతా బసు
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కొందరు మానసిక ఆందోళనకు గురవుతున్నట్టుగా నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి శ్వేతా బసు ప్రసాద్ ఇటీవల డిప్రెషన్‌లోని వెళ్లినట్టుగా తెలుస్తోంది. తన మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్టు శ్వేతా వెల్లడించారు.ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నందుఉన్న వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్‌తో మాట్లాడుతూ సలహాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు వారి మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధన్యత ఇవ్వాలని శ్వేతా పేర్కొన్నారు. ‘నా జీవితంలో ఎప్పుడు ఇతరులతో కలిసే ఉన్నాను. తొలుత నా తల్లిదండ్రులు.. ఆ తర్వాత నాకు పెళ్లయింది. ఆ తర్వాత భర్త నుంచి విడపోయాక తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాను. నేను గతేడాది డిసెంబర్లో డిప్రెషన్‌కు లోనుకావడంతో.. ఇందుకు సంబంధించి చికిత్స తీసుకున్నాను. మొత్తం రెండు సెషన్స్‌లో ఇది పూర్తయింది. నేను బాగానే ఉన్నాను. కానీ ఈ సమయంలో మరోసారి అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే మరోసారి నా థెరపిస్ట్‌తో మాట్లాడాను. వీడియో కాల్లో థెరపిస్ట్‌తో మాట్లాడి సూచనలు తీసుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఇలాగే ఇబ్బంది పడతారని నా థెరపిస్ట్ నాకు చెప్పారు. నా మానసిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాను.. కానీ ఈ సమయంలో నా విజ్ఞానాన్ని కోల్పోదలచుకోలేదు. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.. అందుకే ఇలాంటి సమయాల్లో దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నా తల్లిదండ్రులను చాలా మిస్సవుతున్నాను. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో నా తల్లిదండ్రులను చూడటానికి ఓ ప్లాన్ చేశాం. నా తల్లి, సోదరుడు నేను ఉంటున్న బిల్డింగ్ వద్దకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు పైకి రావడానికి వీలుపడలేదు. దీంతో నేను కిందికి వెళ్లి వాళ్లను కలిశాను. ఐదు ఫీట్ల దూరంలో నిల్చుని వారితో 10 నిమిషాల సేపు మాట్లాడాను. కనీసం నా తల్లి హగ్ చేసుకోకపోవడం చాలా బాధ అనిపించింది. ఇది చాలా కష్ట సమయం.. త్వరలోనే ఇది వెళ్లిపోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. అయితే ఇతర పనులు మీద దృష్టి సారించడం ద్వారా దీని నుంచి బయటపడేందుకు కృషి చేస్తున్నట్టు’ శ్వేతా చెప్పారు. కాగా, తెలుగులో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించారు నటి శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి మంచి ఫలితాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో శ్వేతాను పలు వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018 డిసెంబర్ 13న ఆమె బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైయినా ఏడాదికే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. -
మా స్నేహం కొనసాగుతూనే ఉంటుంది
నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2018 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు నటి శ్వేతా బసు ప్రసాద్, బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్. అయితే తొలి వివాహ వార్షికోత్సవం పూర్తికాక ముందే గత ఏడాది డిసెంబర్ 10న విడిపోతున్నట్లు ప్రకటించారు ఈ ఇద్దరూ. ఈ విషయం గురించి శ్వేత మాట్లాడుతూ – ‘‘విడిపోవాలనే నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం. ప్రస్తుతం నేను, రోహిత్ మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నాం. నా యాక్టింగ్ కెరీర్‌కి ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నాడు. తను మంచి దర్శకుడు. భవిష్యత్తులో మేమిద్దరం కలసి సినిమా కూడా చేయొచ్చేమో. మేం కేవలం పెళ్లిని మాత్రమే ముగించాం. మా స్నేహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు. మళ్లీ ప్రేమలో పడతారా? అనే ప్రశ్నకు – ‘‘మళ్లీ ప్రేమలో పడకూడదు లాంటి నిర్ణయాలేం తీసుకోలేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్ మీదే ఉంది. ప్రేమ అనేది అనూహ్యంగా జరగాలి. అలా జరుగుతుందో లేదో చూద్దాం’’ అని బదులిచ్చారు. -
పెళ్లి అయిన ఏడాదికే..
గతేడాది వివాహం చేసుకున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. గతేడాది డిసెంబర్లో తన బాయ్‌ఫ్రెండ్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ‘రోహిత్ మిట్టల్, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు మా ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన.. అది చెడ్డది కాదు. అలాగే కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం బాగుంటుంది. నేను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలించినందుకు థ్యాంక్యూ రోహిత్’ అని శ్వేతా పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 13న శ్వేతా, రోహిత్‌ల వివాహం పుణెలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. కాగా, మక్డీ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. -
ఘనంగా శ్వేతా బసు వివాహం
పుణె: ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్, ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌ల వివాహం గురువారం రాత్రి పుణెలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో పింక్ కలర్ సిల్క్ సారీలో శ్వేతా బసు మెరిసిపోయారు. అంతకు ముందు జరిగిన పెళ్లి వేడుకల్లో శ్వేతా బసు, రోహిత్ మిట్టల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్సులతో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోహిత్ కూడా ‘హో గయి’ అంటూ పెళ్లి ఫొటోను ఫెస్‌బుక్‌లో ఉంచారు. మక్డీ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Dec 13, 2018 at 8:32am PST -
శ్వేత కల్యాణం
మొత్తానికి పెళ్లయింది!శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి కాదు. ప్రియాంక, నిక్‌ల పెళ్లి.అంతకు ముందు కూడా..మొత్తానికి పెళ్లైంది. రణవీర్, దీపికల పెళ్లి.అంతకన్నా ముందూ..మొత్తానికి పెళ్లయింది. అనుష్క, కొహ్లీల పెళ్లి.బాలీవుడ్ తారల పెళ్లి డేట్లు ఒక పట్టాన కదిలి రావు. అందుకే..‘మొత్తానికి పెళ్లైంది’ అనిపిస్తుంది. శ్వేతాబసు మరీ అంత సాగతీయడం లేదు. డేట్ చెప్పారు. డేటింగ్ గురించీ చెప్పారు. నచ్చిన వరుడు. మెచ్చిన వధువు. పెళ్లి పనుల్లో ఉండి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. చూతము రారండి.. శ్వేతా కల్యాణం. త్వరలో ‘మిసెస్’ కాబోతున్నందుకు ముందుగా కంగ్రాట్స్... శ్వేత: థ్యాంక్స్. ఈ నెల 13న రోహిత్‌తో నా పెళ్లి. అందుకే పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాం. అసలు మీ ఇద్దరూ ఫస్ట్ టైమ్ ఎక్కడ కలిశారు? దాదాపు ఐదేళ్ల క్రితం కలిశాం. ఫ్యాంథమ్ ఫిలిమ్స్‌లో నేను స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడు రోహిత్ కూడా వేరే పని మీద అక్కడ ఉన్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్లు తను అక్కడ పని చేయడం లేదు. అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేయడం లేదు. తనకు డైరెక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. ప్రొడ్యూసర్‌గా కూడా చేయాలనే ఎయిమ్‌తో ఉండేవాడు. మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందట కదా? లేదు. పెళ్లికి ముందు రోజు మెహందీ, ఎంగేజ్మెంట్ ఉంటాయి. ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓ మంచి భర్తకు కావాల్సిన లక్షణాలు రోహిత్లో ఏం ఉన్నాయి? ఓపికకు మారు పేరు రోహిత్. అలాగే చేసే పని మీద శ్రద్ధ ఎక్కువ. చాలా వినయంగా ఉంటాడు. స్త్రీల దగ్గర తను నడుచుకునే తీరు చాలా బాగుంటుంది. ఆ తీరే నా మనసుని గెలుచుకుంది. రోహిత్‌ది చాలా మంచి పెంపకం. బాలీలో బ్యాచిలరెట్ పార్టీ చేసుకున్నట్లున్నారు. ఆ ప్లేస్‌నే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? పార్టీకి అద్భుతమైన ప్లేస్ అది. అందుకే వెళ్లాం. గత నెల 25 నుంచి 30 వరకూ అక్కడే ఉన్నాం. శుక్రవారం రాత్రి ముంబై చేరుకున్నాం. బాలీలో ఓ ప్రైవేట్ విల్లాని బుక్ చేసుకున్నాం. మా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో వెళ్లాం. ముఖ్యంగా నన్ను బాగా ప్రేమించేవాళ్లతో ఈ పార్టీ చేసుకున్నాను. ఫుల్‌గా రిలాక్స్ అవ్వాలనే ఆలోచనతోనే ఈ పార్టీ ప్లాన్ చేశాను. బాలీ పొలాల్లో ఫార్మింగ్ చేశాం. అలాగే పొలాల్లో వంటలు చేసుకున్నాం. ఒకట్రెండు రోజులైతే విల్లా నుంచి బయటికి రాలేదు కూడా. బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాం. నా బ్రదర్ రాహుల్ ప్లే చేసిన మ్యూజిక్‌కి డ్యాన్స్ చేశాం. ఫుల్‌గా రిలాక్స్ అయ్యాను. మీ ఇద్దరూ పేరెంట్స్‌ని ఒప్పించడానికి కష్టపడ్డారా? నా కుటుంబ సభ్యులకు రోహిత్ మూడేళ్లుగా తెలుసు. నాక్కూడా తన ఫ్యామిలీతో అన్నేళ్ల అనుబంధం ఉంది. మేమంతా ఒకే కుటుంబం అన్నట్లుగా ఉండటం మొదలుపెట్టాం. ఏ బంధంలో అయినా గౌరవం ఉంటే ఆ బంధం బలంగా ఉంటుంది. మాకు ఒకరి కుటుంబం అంటే మరొకరికి గౌరవం ఉంది. మా పెద్దలు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. అందుకే మా ప్రేమ గురించి చెప్పగానే కాదనలేదు. మరి.. సహజీవనం చేశారు కదా.. అప్పుడు కూడా ఏమీ అనలేదా? లేదు. దాదాపు రెండేళ్లు సహజీవనం చేశాం. మా నిర్ణయాల మీద మావాళ్లకు నమ్మకం ఉంది. అందుకే ఏమీ అనలేదు. పెళ్లి తర్వాత కెరీర్ కంటిన్యూ చేస్తారా? డెఫినెట్‌గా. రోహిత్‌కి అభ్యంతరం లేదు. పెళ్లయితే కెరీర్‌ని వదిలేసుకోవాలన్న మైండ్‌సైట్ నాకూ లేదు. నా మనవళ్లు, మనవరాళ్లు పుట్టేటప్పటికి కూడా నేను నటిస్తూనే ఉంటా (నవ్వుతూ). ప్రస్తుతం ఏం చేస్తున్నారు? హిందీ చిత్రం ‘తాష్కెంట్ ఫైల్స్’లో నటించాను. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి, నేను, ఇంకొంతమంది ప్రముఖ స్టార్స్ నటించాం. మన రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి డెత్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ‘జామున్’ అని మరో సినిమా చేశాను. తండ్రీ కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నా తండ్రిగా రఘుబీర్ యాదవ్ నటించారు. ఈ రెండూ వచ్చే ఏడాది విడుదలవుతాయి. ఫైనల్లీ... విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్? థ్యాంక్యూ వెరీ మచ్. నన్ను కథానాయికను చేసిన తెలుగు పరిశ్రమ అన్నా, తెలుగు ప్రేక్షకులన్నా నాకు చాలా అభిమానం. ఎవరీ రోహిత్? పూణేకు చెందిన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు రోహిత్ మిట్టల్. వాళ్ల నాన్నగారు బిల్డర్. రోహిత్ లా పూర్తి చేసినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ మీద శ్రద్ధతో లాస్ ఏంజెల్స్‌లో న్యూయార్క్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం బాలీవుడ్లో దర్శక–నిర్మాతగా కొనసాగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం ‘ఆటోహెడ్’ అనే ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకు కో–ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు రోహిత్. బాలీవుడ్లో చేయబోయే నెక్ట్స్ ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఎ... క్క...డ...?? ఎ..క్క..డ?? ఎ..క్క..డ..? అంటూ ఓ కొత్త డైలాగ్ మాడ్యులేషన్‌తో ‘కొత్త బంగారు లోకం’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు శ్వేతా బసు. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయింది. అక్టోబర్ 9, 2008లో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా గురించి శ్వేతా మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. సెన్సేషనల్ రొమాంటిక్ హిట్. పాటలు, సంభాషణలు అన్నీ కూడా యూత్‌కి ఇట్టే కనెక్ట్ అయిపోయాయి. కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. తెలుగులో నా ఫస్ట్ స్టెప్ ఓ స్వీట్ మెమరీ’’ అని పేర్కొన్నారు. పెళ్లి ఎక్కడ? రోహిత్‌ది పుణె. శ్వేత ఫ్యామిలీ ముంబైలో ఉంటుంది. పెళ్లి వేడుక పుణేలో జరుగుతుంది. రిసెప్షన్ మాత్రం పుణె, ముంబైలలో జరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, రిసెప్షన్‌కి సినిమా పరిశ్రమలోని వారిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. శ్వేత ఇంట్లో పూజలు బాగా చేస్తారు. రోహిత్ ఫ్యామిలీకి కూడా దైవభక్తి ఎక్కువే అట. ఈ ఏడాది వినాయక చవితిని ఎప్పటిలానే గ్రాండ్‌గా చేసుకున్నారు శ్వేత. తన ప్రేయసి ఇంట్లో జరిగిన గణేశ్ పూజలో రోహిత్ పాల్గొన్నారు. అప్పుడు ఇద్దరూ వినాయకుడికి హారతి ఇచ్చిన సందర్భంగా దిగిన ఫొటో ఇది. ఈ కాబోయే దంపతులు అప్పట్లో ఇచ్చిన ఫస్ట్ హారతి. – డి.జి. భవాని -
పెళ్లి పీటలెక్కనున్న శ్వేతా బసు ప్రసాద్
మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు నటి శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ తర్వాత పూర్తిగా ముంబైకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్వేతా బసు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌ను శ్వేతా వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత అదే వారంలో ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్వేత తన కాబోయే భర్త, స్నేహితులతో కలిసి ఇండోనేషియా, బాలీలో బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram Let. The. Bachelorette. Begin! A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Nov 25, 2018 at 4:26pm PST ఈ విషయం గురించి శ్వేతా స్నేహితురాలు మాట్లాడుతూ.. శ్వేతా, రోహిత్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వారు రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ బెస్ట్ కపూల్స్ మారబోతున్నారు. ఈ క్షణాల కోసం మేమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అబ్బాయిలే ముందు ప్రపోజ్ చేయాలనేది పాత మాట. ఇద్దరి మధ్య ఒకే రకమైన భావాలు ఉన్నప్పుడు ఎవరు ముందు ప్రపోజ్ చేశారనేది ముఖ్యం కాదు. శ్వేతానే ముందుగా ప్రపోజ్ చేసింది. గోవా వెళ్లినప్పుడు శ్వేత, రోహిత్‌కు ప్రపోజ్ చేసింది. తర్వాత రోహిత్ పూణెలో ఎస్ చెప్పాడు అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram I love cheap thrills! @rahul_prasad3 #bachelorette #bali 💃🏻 A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Nov 27, 2018 at 6:54pm PST -
ఆయన తో డేటింగ్ నిజమే : శ్వేతాబసు
‘ఎ.. క్క.. డా..’ అంటూ ‘కొత్త బంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బెంగాలీ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్. మొదటి సినిమాతోనే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే పేరొచ్చింది. కానీ, ఆ తర్వాత శ్వేతా జీవితంలో పలు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఆ ఘటనల నుంచి బయట పడిన తర్వాత ముంబై వెళ్లారీమె. ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్, తన నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో ఉద్యోగం ఇచ్చారు. అప్పుడే అప్ కమింగ్ ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతాకు పరిచయమైందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. సదరు వార్తలపై స్పందించకుండా ఇన్నాళ్లూ మౌనం వహించిన ఈ బ్యూటీ ఇప్పుడు పెదవి విప్పారు. ‘‘యస్.. డేటింగ్ వార్త నిజమే. రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. వియ్ ఆర్ హ్యాపీ. ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ, చాలా స్మూత్‌గా మా పెళ్లి జరుగుతుందనే నమ్మకముంది. ఫాంటమ్ ఫిల్మ్స్‌లో రోహిత్‌ని కలిశాను. అప్పట్నుంచి మా ప్రయాణం మొదలైంది’’ అని శ్వేతాబసు ప్రసాద్ చెప్పారు. వీళ్లిద్దరి ప్రేమకథలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారట. ప్రస్తుతం వరుణ్ ధావన్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ‘బద్రినాథ్ కి దుల్హనియా’తో పాటు శ్వేత ఓ హిందీ సీరియల్లోనూ నటిస్తున్నారు. -
చాన్నాళ్ల తర్వాత మళ్లీ శ్వేతబసు..!
2014లో సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయి.. జీవితంలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న నటి శ్వేతబస్సు ప్రసాద్.. 'కొత్త బంగారు లోకం' సినిమాలో ఎక్కడ అంటూ ముద్దుముద్దు మాటలతో అలరించిన ఈ హీరోయిన్ వ్యభిచారం కేసులో అరెస్టు కావడంతో ఆమె కెరీర్ దెబ్బతిన్నది. ఈ క్రమంలో చాలారోజుల తర్వాత శ్వేతబస్సు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంది. ఓ చిట్టి సినిమాతో (షార్ట్ ఫిలిం) ప్రేక్షకులను పలుకరించింది. అధీరాజ్ బోస్ తెరకెక్కించిన 'ఇంటీరియర్ కెఫె.. నైట్' అనే షార్ట్ ఫిలింలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఈ షార్ట్ ఫిలింలో బాలీవుడ్ నట దిగ్గజాలు నసీరుద్దీన్ షా, షెర్నాజ్ పటేల్ కూడా నటించడం గమనార్హం. షెర్నాజ్ పటేల్ యువతిగా ఉన్నప్పటి పాత్రను శ్వేత పోషించింది. చాలా ఏళ్ల ఎడబాటు తర్వాత ఓ రాత్రి కోల్‌కతాలోని నైట్ కెఫెలో మాజీ ప్రేమికులు మళ్లీ కలుసుకుంటే అనే ఫీల్ గుడ్ సబ్జెక్ట్ తో, మంచి థీమ్‌తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింకు శ్వేతబసు సహా నిర్మాతగా ఉన్నారు. -
సినీనటి శ్వేతాబసు ప్రసాద్‌కు క్లీన్ చిట్
హైదరాబాద్ : సినీనటి శ్వేతాబసు ప్రసాద్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్వేతాబసు ప్రసాద్‌పై అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని శ్వేతాబసు ప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కావాలనే పోలీసులు తనను ఇరికించారని ఆమె కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ హోటల్‌కు వెళ్లినట్లు శ్వేతాబసు ప్రసాద్ న్యాయస్థానం ముందు విన్నవించారు. దాంతో ఆమె వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు, కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కోర్టు తీర్పుపై శ్వేతాబసు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే ఇన్నిరోజులుగా వేచి చూస్తున్నానని..ఆమె తెలిపారు. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యుల మొహాల్లో నవ్వు కనిపిస్తుందని పేర్కొన్నారు. వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై, కోర్టు ఆదేశాలపై ఇటీవలే రెస్క్యూ హోం నుంచి శ్వేతాబసు ప్రసాద్ విడుదలైన విషయం తెలిసిందే. -
శ్వేతా బసు.. మళ్లీ వస్తోంది!
సంచలనాల హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ సినీ పరిశ్రమలోకి వచ్చేశారు. ఓ హోటల్లో దొరికిన ఆమెపై పోలీసులు వ్యభిచారం కేసు పెట్టి రెస్క్యూహోంకు పంపడం, కోర్టు జోక్యం చేసుకుని ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పట్లోనే శ్వేతాబసు చెప్పింది. మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని ఓ డాక్యుమెంటరీతో కెమెరా ముందుకు వెళ్తోంది. జాతీయ అవార్డు విజేత హన్సల్ మెహతా తన స్వీయ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇందులో శ్వేతాబసుకు చాలా కీలకపాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే దాన్ని అంగీకరించిన ఆమె.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారని సమాచారం. రెస్క్యూహోం నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడే, తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని శ్వేతాబసు తెలిపింది. మెహతా సినిమాతో ఇప్పుడది నిజమైంది. -
శ్వేతాబసుకు ఊహించని ఆఫర్!
ముంబై: కొత్త బంగారులోకం సినిమా నటి, వ్యభిచారం కేసులో అరెస్టయి కష్టాల్లో ఉన్నశ్వేతాబసు ప్రసాద్‌కు ఊహించని అవకాశం రానుంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా తన తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. హన్సల్ ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. 'నా తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇవ్వాలని భావిస్తున్నాను. మక్దీ చిత్రంలో ఆమె బాగా నటించారు' అని మెహతా ట్వీట్ చేశారు. వ్యభిచారం కేసుకు సంబంధించి ఆమెను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సూచించారు. ఆమె ఫొటోలను ప్రచురించడం ఆపాలని ట్వీట్ చేశారు. సహచర నటులు అదితి రావు, ఉపేన్ పటేల్ శ్వేతాబసుకు మద్దతుగా ట్వీట్లు చేశారు. హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో శ్వేతాబసు వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెస్య్కూ హోంలో ఉంటోంది. తనకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, మరో మార్గం లేక డబ్బుల కోసం వ్యభిచార వృత్తిలోకి దిగానని శ్వేతాబసు పోలీసులకు చెప్పింది. -
రెస్క్యూహోంలో శ్వేతా బసు ఏం చేస్తోంది?
ఒక్క సినిమా.. 'కొత్త బంగారు లోకం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. వ్యభిచారం కేసులో పట్టుబడిన ఆమె మూడు నెలల పాటు రెస్క్యూ హోంలోనే గడపాల్సి ఉంటుంది. గతంలో కొంతమందిని ఇలాగే రెస్క్యూ హోంకు పోలీసులు తరలించినా.. కొన్నాళ్లు అక్కడ ఉండి అక్కడినుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే శ్వేతా బసు మాత్రం అలా కాకుండా.. ఏమాత్రం దిగులు పడకుండా బాగానే ఉందని సమాచారం. సాధారణంగా అక్కడకు వెళ్లినవాళ్లు.. అందులోనూ కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లయితే విపరీతమైన డిప్రెషన్లో పడిపోతారు. కానీ శ్వేతా బసు మాత్రం అలా లేదట. గత ఆదివారం నాడు పట్టుబడిన ఆమెను సోమవారం పోలీసులు ఎర్రమంజిల్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించడంతో అక్కడికి తరలించారు. రెస్క్యూ హోంలో ఉన్న శ్వేతా బసు.. ఎంచక్కా తన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి విషయాలు తెలుసుకుంటూ మామూలుగానే ఉందని తెలుస్తోంది. అక్కడ ఉన్నవాళ్లను కూడా పలకరిస్తూ.. వాళ్ల విశేషాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. -
డబ్బుల్లేకే.. ఈ మార్గం పట్టా!
వ్యభిచారంలోకి దిగడంపై సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను వ్యభిచారంలోకి దిగానని సినీ నటి, ‘కొత్త బంగారు లోకం’ సినిమా ఫేం శ్వేతాబసు ప్రసాద్ చెప్పినట్లు సమాచారం. కొన్ని పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలతో తన కెరీర్ ఇబ్బందుల్లో కూరుకుపోయినందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ శ్వేతాబసు పోలీసుల రైడింగ్‌లో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంకు తరలించిన పోలీసులు... సెక్స్ రాకెట్ నిర్వాహకుడు ఆంజనేయులు అలియాస్ బాలును, విటులను జైలుకు తరలించారు. అయితే తాను వ్యభిచారం చేయడానికి ఆర్థిక పరిస్థితులే కారణమని శ్వేతాబసు చెప్పినట్లు పోలీసువర్గాల సమాచారం. ‘‘నేను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాను. నా కుటుంబానికి, కొన్ని మంచి పనుల కోసం డబ్బు అవసరమైంది. కానీ నాకు డబ్బు వచ్చే అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. అలాంటి సమయంలో వ్యభిచారం చేయాలంటూ కొందరు నన్ను ప్రోత్సహించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు మరో మార్గం కనిపించక.. అందులోకి దిగాల్సి వచ్చింది...’’ అని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.