
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ని గుర్తుపట్టారా? ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు జీరో సైజ్‌తో ఆకట్టుకుంటుంది. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులో క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన హిట్స్ లేక తమిళ, హిందీ పరిశ్రమలకు షిఫ్ట్ అయ్యింది.
అక్కడ కూడా పలు సినిమాల్లో నటించినా ఆశించినంత సక్సెస్ కాలేదు. ఇక పర్సనల్ లైఫ్‌లోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శ్వేత బసు ప్రసాద్ 2018 లో ప్రియుడు 2018 లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడింది. అయితే ఏడాది తిరగకుండానే అతడితో విడాకులు తీసుకుంది.
ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న శ్వేత బసు చివరగా తెలుగులో విజేత సినిమాలో తళుక్కుమంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్‌చేస్తూ రచ్చ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment