kotha bangaru lokam movie
-
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘కొత్తబంగారు లోకం’ హీరోయిన్(ఫోటోలు)
-
కొత్త బంగారులోకంలో అలా ఛాన్స్ వచ్చింది
-
కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేతా బసు ప్రసాద్. అమాయకపు చూపు, నిష్కల్మషమైన నవ్వుతో తొలి చిత్రంతోనే ఎంతోమంది గుండెలు కొల్లగొట్టిందీ హీరోయిన్. టాలీవుడ్లో ఫస్ట్ సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీ వచ్చినా దాన్ని కాపాడుకోలేకపోయింది. సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొనితెచ్చుకుంది. తర్వాత జీనియస్ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. ఏడేళ్లపాటు తెలుగు తెరకు దూరమైన ఆమె 2018లో విజేతతో పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌ను వదిలి హిందీలోనే సినిమాలు, సిరీస్‌లు, సీరియళ్లు చేసుకుంటోంది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూసిందీ హీరోయిన్. 2018లో డైరెక్టర్ రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడగా విభేదాల కారణంగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది. కాగా బుధవారం (జనవరి 11న) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు.. కొన్నింటిలో శ్వేతను అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నామని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) చదవండి: ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి: దిల్ రాజు క్యాన్సర్‌తో చచ్చిపోయినా సరే కానీ ట్రీట్మెంట్ వద్దన్నా: సంజయ్ దత్ -
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ని గుర్తుపట్టారా? ఎంతలా మారిపోయిందో
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ని గుర్తుపట్టారా? ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు జీరో సైజ్‌తో ఆకట్టుకుంటుంది. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులో క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన హిట్స్ లేక తమిళ, హిందీ పరిశ్రమలకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించినా ఆశించినంత సక్సెస్ కాలేదు. ఇక పర్సనల్ లైఫ్‌లోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శ్వేత బసు ప్రసాద్ 2018 లో ప్రియుడు 2018 లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడింది. అయితే ఏడాది తిరగకుండానే అతడితో విడాకులు తీసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న శ్వేత బసు చివరగా తెలుగులో విజేత సినిమాలో తళుక్కుమంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్చేస్తూ రచ్చ చేస్తుంది. -
శ్రీకాంత్ అడ్డాలతో నాని?
నాని మంచి జోరు మీదున్నారు. సినిమాలతో పెద్ద తెర, ‘బిగ్ బాస్ 2’తో చిన్ని తెర ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. నాగార్జునతో కలిసి నాని నటించిన ‘దేవదాస్’ ఈ 27న రిలీజవుతుంది. ఇలా ఈ చిత్రం రిలీజవుతుందో లేదో మరో కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేశార ట నాని. ఆల్రెడీ ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటించను న్నారు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారట. ‘కొత్త బంగారులోకం’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో బ్రహ్మాండమైన కథ తయారు చేశారట. ఆ కథకు నాని హీరో అని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. -
కెమేరా వెనుక కొత్త అవతారం
కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందిగా! తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించిన ఈ యువ నటి ఆ తరువాత ఆశించిన మేరకు విజయాలు అందుకోక బాగా వెనుకబడ్డారు. ప్రత్యేక నృత్య గీతాల్లోనూ నర్తించారు. అయితే, ఇప్పుడీ నవతరం అమ్మాయి ఓ డాక్యుమెంటరీని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘రూట్స్’ అని పేరు పెట్టిన ఈ డాక్యుమెంటరీ చిత్రం భారతీయ శాస్త్రీయ సంగీతంపై తీసినది కావడం విశేషం. మూడేళ్ళు పట్టిన ఈ డాక్యుమెంటరీ కోసం చిత్రీకరణకు ముందు విస్తృతంగా పరిశోధన చేసినట్లు శ్వేతాబసు చెబుతున్నారు. ‘‘2011 మే నెలలో నాకు 20 ఏళ్ళ వయసులో ఈ డాక్యుమెంటరీ చిత్ర రూపకల్పన మొదలుపెట్టాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మొత్తం ప్రయాణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని ఆమె అన్నారు. ఇటు కర్ణాటక సంగీతం, అటు హిందుస్థానీ సంగీతం - రెండూ ఇవాళ భారతీయ యువతరంలో ఏ మేరకు నిలిచాయన్న అంశం ఆధారంగా ఈ ‘రూట్స్’ తీశారు. ఇందులో విశాల్ భరద్వాజ్, ఏ.ఆర్. రెహమాన్, శుభా ముద్గల్, ఇమ్తియాజ్ అలీ, పండిట్ హరిప్రసాద్ చౌరసియా లాంటి సుప్రసిద్ధుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని దేశవిదేశాల్లోని చలనచిత్రోత్సవాల్లోనే కాక, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో సైతం ప్రదర్శించాలని భావిస్తున్నారు. మరి, ఈ ప్రయత్నంలోనైనా శ్వేతాబసు సక్సెస్ అవుతారా?