కెమేరా వెనుక కొత్త అవతారం | Behind the camera, the new incarnation | Sakshi
Sakshi News home page

కెమేరా వెనుక కొత్త అవతారం

Published Wed, Aug 6 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

కెమేరా వెనుక కొత్త అవతారం

కెమేరా వెనుక కొత్త అవతారం

కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందిగా!

కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందిగా! తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించిన ఈ యువ నటి ఆ తరువాత ఆశించిన మేరకు విజయాలు అందుకోక బాగా వెనుకబడ్డారు. ప్రత్యేక నృత్య గీతాల్లోనూ నర్తించారు. అయితే, ఇప్పుడీ నవతరం అమ్మాయి ఓ డాక్యుమెంటరీని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘రూట్స్’ అని పేరు పెట్టిన ఈ డాక్యుమెంటరీ చిత్రం భారతీయ శాస్త్రీయ సంగీతంపై తీసినది కావడం విశేషం. మూడేళ్ళు పట్టిన ఈ డాక్యుమెంటరీ కోసం చిత్రీకరణకు ముందు విస్తృతంగా పరిశోధన చేసినట్లు శ్వేతాబసు చెబుతున్నారు.

‘‘2011 మే నెలలో నాకు 20 ఏళ్ళ వయసులో ఈ డాక్యుమెంటరీ చిత్ర రూపకల్పన మొదలుపెట్టాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మొత్తం ప్రయాణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని ఆమె అన్నారు. ఇటు కర్ణాటక సంగీతం, అటు హిందుస్థానీ సంగీతం - రెండూ ఇవాళ భారతీయ యువతరంలో ఏ మేరకు నిలిచాయన్న అంశం ఆధారంగా ఈ ‘రూట్స్’ తీశారు. ఇందులో విశాల్ భరద్వాజ్, ఏ.ఆర్. రెహమాన్, శుభా ముద్గల్, ఇమ్తియాజ్ అలీ, పండిట్ హరిప్రసాద్ చౌరసియా లాంటి సుప్రసిద్ధుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని దేశవిదేశాల్లోని చలనచిత్రోత్సవాల్లోనే కాక, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో సైతం ప్రదర్శించాలని భావిస్తున్నారు. మరి, ఈ ప్రయత్నంలోనైనా శ్వేతాబసు సక్సెస్ అవుతారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement