వారం రోజుల్లోనే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీ | RRR Behind And Beyond Streaming On This Ott Platform | Sakshi
Sakshi News home page

RRR Behind And Beyond: ఆర్ఆర్ఆర్‌పై డాక్యుమెంటరీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published Mon, Dec 23 2024 4:50 PM | Last Updated on Mon, Dec 23 2024 5:07 PM

RRR Behind And Beyond Streaming On This Ott Platform

దర్శకధీరుడు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం ఈనెల 20న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఈ మూవీలో చూపించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని రివీల్ చేసింది చిత్రబృందం. ఈనెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్‌ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్‌ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్‌ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement