
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఆర్ఆర్ఆర్ ఘనవిజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళితో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.
కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment