documentary
-
కోలో కోలోయన్న కోలో..
జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి వింజమూరి అనసూయాదేవి జీవితం ఎంతటి స్ఫూర్తిమంతమైనదో డాక్యుమెంటరీగా తీసి, ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో ప్రదర్శించారు ఆమె కుమార్తె సీతారత్నాకర్. ‘అసమాన అనసూయ’ ను తెరపై చూసిన నాటి తరమే కాదు, నేటి నవతరమూ కళ్లప్పగించి చూస్తూనే ఉంది. ఈ సందర్భంగా తల్లి తన జీవితంలో నింపిన స్ఫూర్తిని సీతారత్నాకర్ పంచుకున్నారు.మారుమూల పల్లెల్లో దాగి ఉన్న జానపద గేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నతస్థానాన్ని కలిగించిన తొలి గాయని వింజమూరి అనసూయాదేవి. జానపద గేయాలకు కర్నాటక బాణీలో స్వర రచన చేసిన తొలి స్వరకర్త. విశ్వ విద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ఆమె ఒక అద్భుతం. ఆమెను తలుచుకుంటున్నారు కుమార్తె సీతారత్నాకర్.పాట పాడింది... బాధ్యతలూ నెరవేర్చిందిఅమ్మానాన్నలకు మేం ఐదుగురం సంతానం. అమ్మకు సంగీతం అంటేప్రాణం. స్కూల్ లేని రోజుల్లో అమ్మ తనతోపాటు మమ్మల్నీ కచేరీలకు తీసుకెళ్లేది. ఎక్కడకు వెళ్లినా తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే కళను కూడా సాకారం చేసుకున్నారు. నేనూ, మా అక్క భరతనాట్యం నేర్చుకొని దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాం. అక్కకు పెళ్లయ్యి అమెరికా వెళ్లడం, నాకు పెళ్లవడంతో నృత్యం ఆగిపోయింది. దూరదర్శన్‌లో ఉద్యోగం వచ్చింది. మేం మొదటి నుంచి చెన్నైలో ఉండేవాళ్లం. అలా చెన్నై, ఢిల్లీ దూరదర్శన్‌లో 37 ఏళ్లు వర్క్ చేశాను. ఎంతో మంది కళాకారులను, యాక్టివిస్ట్‌లను దూరదర్శన్‌కి పరిచయం చేశాను. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు నలుగురూ అమెరికాలో స్థిరపడ్డారు. అమ్మ ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం తనతో గడిపే అవకాశం లభించేంది. అమ్మకు జానపద గేయాల గురించి తెలుసు కాబట్టి కాకినాడకు తీసుకెళ్లి, అక్కడి పల్లె పాటల మీద ఓ కార్యక్రమాన్ని చేశాం. అదొక మధురానుభూతి నాకు. నేను చేసిన ప్రోగ్రామ్స్ చూసేది. సూచనలు ఇచ్చేది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అంటూ గాయనిగా స్వరాలను కూర్చుతూనే ఉండేది. రచనలు చేస్తూనే ఉండేది. భావగీతాలు, జానపద గేయాలు ఈ రెండు పుస్తకాలు ఆమె 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా విడుదలయ్యాయి. ఆ తర్వాత జానపద సంగీతంపై ఏడు పుస్తకాలను విడుదల చేశారు. ఇవి కాకుండా నేనూ–నా రచనలు, గతానికి స్వాగతం అనే పుస్తకాలు, 95వ పుట్టిన రోజు సందర్భంగా ‘అసమాన అనసూయ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.యజ్ఞంలా అనిపించింది...నిరంతర కృషియే అమ్మను అసమానంగా ఈ రోజు నిలబెట్టింది. అమ్మ మరణించాక ఆమెకు సంబంధించిన ఫుటేజీ అంతా ఒకసారి చూడటం మొదలుపెట్టాను. మరికొంత మా వాళ్ల నుంచి సేకరించాను. అదంతా చూడటానికే నాకు రోజుల సమయం పట్టింది. ఆవిడ వీడియోలు చూస్తున్నప్పుడు ‘నా పాటలు ఆగిపోకూడదు...’ వంటి మాటలు విన్నాను. దీంతో అమ్మకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నించాను. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి.. అని చాలా ఆలోచించేదాన్ని. ఫుటేజీలో ఆమె దినచర్యతోపాటు, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ చేర్చుకుంటూ, ప్రముఖుల సభా విశేషాలు, పుస్తకప్రారంభోత్సవాలు, కుటుంబ సభ్యుల నుంచి కామెంట్స్ జత చేసి ఒక రూపం తీసుకువచ్చాను. ఈ సమయంలో అమ్మ నా వెంటే ఉంటూ నాకు సూచనలు చేస్తున్నట్టు అనిపించేది. డాక్యుమెంటరీ పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. అమ్మ ఘనత అలనాటి వారికే తెలుసు అనుకున్నాను. కానీ, నేటి తరం కూడా అమ్మ డాక్యుమెంటరీ చూడటం, ఆమె గొప్పతనం గురించి ప్రస్తావిస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’ అంటూ తన తల్లితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు సీతా రత్నాకర్. – నిర్మలారెడ్డి -
రీచింగ్ ది అన్రీచ్డ్..!
వాళ్లంతా ఆదివాసులు.. కొండకోనల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉండే వారికి జీవించటానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. రోడ్లు, కరెంటు మాటే తెలియదు. జన బాహుళ్యంలోకి రావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఇక వారి పిల్లలకు చదువు అంటే ఏమిటో తెలియదనే చెప్పాలి. తరతరాలు ఆదివాసుల జీవితాలు ఇలాగే తెల్లారిపోతున్నాయని కలత చెందిన కొందరు యువకులు.. వారికి అక్షర జ్ఞానం అందించాలని సంకల్పించారు. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ (బీసీహెచ్‌సీ) పేరిట చిన్న సంస్థను నెలకొల్పి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. దీనిని గుర్తించిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరావు.. ఆ సంస్థ సేవలపై డాక్యుమెంటరీ నిర్మించారు. దీనికి యూజీసీ ఆధ్వర్యంలో జోధ్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి లభించింది. - సాక్షి, హైదరాబాద్అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవుల్లో జీవించే ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా ఉండదు. రాళ్లు రప్పల దారుల్లో కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. వారి భాష, వేషం, నమ్మకాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిల్లలను స్కూల్‌కు పంపడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. బయటి వ్యక్తులను కనీసం నమ్మరు కూడా. అలాంటివారికి విద్యాబుద్ధులు నేర్పుతోంది బీసీహెచ్‌సీ. సంతోష్ ఈస్రం అనే యువకుడి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సంస్థ. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన.. తమ ఉద్దేశాన్ని ఆ గిరిజనులకు వివరించి ఒప్పించడానికే రెండున్నర నెలల పాటు కష్టపడ్డారు. వారి భాష కూడా నేర్చుకున్నారు. పిల్లలను బడికి రప్పించేందుకు రోజూ కోడిగుడ్లు ఇచ్చారు. అలా వారితో కలిసిపోయి నెమ్మదిగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. చివరికి 2020 జూన్ 23న బీసీహెచ్‌సీ పేరుతో సంస్థను స్థాపించారు. తాడ్వాయి మండలంలోని నీలంగోతు అనే చిన్న పల్లెలో గుడిసె కట్టి అందులో 10 ఏళ్ల లోపు ఉన్న 45 మంది చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.కొండ కోనల్లో నడిచి.. నీలంగోతులో పాఠశాల విజయవంతం కావడంతో భూపాలపల్లి జిల్లాల్లోని బండ్లపహాడ్, సారలమ్మగుంపు, తక్కెళ్లగూడెం, ఐలాపురం, ప్రాజెక్ట్ నగర్, కల్వపల్లి, దండుపల్లి, ముసలమ్మ పెంటలో గుడిసె బడులు తెరిచి ఒక్కో టీచర్‌ను నియమించారు. వాళ్లు రోజూ ఏకంగా 10 నుంచి 18 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వీరితో పాటు అనేకమంది వలంటీర్లు ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకుంటున్నారు. వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. పిల్లలకు చదువు చెప్పేందుకు వీలుగా ఒకచోట పక్కా భవనం నిర్మించింది. డాక్యుమెంటరీకి అవార్డు.. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ కార్యకలాపాల గురించి తెలుసుకున్న ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రఘుపతి.. ఆయా ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉండి, పిల్లల స్థితిగతులు.. టీచర్ల కృషిని చూసి ముగ్ధుడయ్యారు. ‘రీచింగ్ ది అన్రీచ్డ్’పేరిట డాక్యుమెంటరీ తీశారు. తాజాగా రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెవలప్మెంట్ కేటగిరీలో దీనికి బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ అవార్డు లభించింది. అలాగే మానవ హక్కుల కేటగిరీలో కూడా స్క్రీనింగ్‌కు ఎంపికైంది. దీనికి వచి్చన రూ.50 వేల నగదు బహుమతిని ఆయన బీసీహెచ్సీకే అందజేశారు.ఎంతో కష్టపడాల్సి వచ్చిoది..ఆదివాసుల కష్టాలు కళ్లారా చూశాను. నేను కూడా దాదాపు అదే నేపథ్యం నుంచి వచ్చాను. వాళ్ల గూడేల్లోకి వెళ్లాలంటే కనీసం రోడ్డు కూడా లేదు. అలాంటి వారికి చదువుకోవటం అనేది చాలా పెద్ద విషయం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు నేర్పించేందుకు సుముఖత చూపించరు. ఎంతో కష్టపడి వారిని ఒప్పించి బడి వరకు రప్పించాం. మా సంస్థపై తీసిన డాక్యుమెంటరీకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. –సంతోష్ ఈస్రం, భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ వ్యవస్థాపకుడు -
తెర వెనక 'ఆర్ఆర్ఆర్' ఇన్నాళ్లకు.. అటు తారక్ ఇటు చరణ్! (ఫొటోలు)
-
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఆస్కార్ అవార్డ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Hear and watch out… From the first clap on the sets to the standing ovation at the Oscars stage, #RRRBehindAndBeyond brings it all to you. 🔥🌊❤️#RRRMovie In select cinemas, 20th Dec. pic.twitter.com/EfJLwFixFx— RRR Movie (@RRRMovie) December 17, 2024 -
రాజమౌళి మూవీపై డాక్యుమెంటరీ.. విడుదలపై అధికారిక ప్రకటన!
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.ఆర్ఆర్ఆర్ ఘనవిజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళితో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
ధనుష్‌తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్‌ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్‌గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్‌నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్‌కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్‌తో డేటింగ్లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్‌లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్‌ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్‌కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్‌లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్. -
పింక్ బెల్ట్ గురించి తెలుసా? మీకుందా? కరాటేలో కాదు!
కరాటేలో పింక్ బెల్ట్ లేదు. కాని నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అమ్మాయి, మహిళపింక్ బెల్ట్ కలిగి ఉండాలని అంటుంది అపర్ణ రజావత్.ఆగ్రాతో మొదలుపెట్టి దేశంలో లక్షలాది మందికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న ఈ మార్షల్ ఆర్టిస్ట్ అమెరికన్ డాక్యుమెంటరీ మేకర్ జాన్మెక్రిటెను ఆమెపై డాక్యుమెంటరీ చేసేలా స్ఫూర్తినిచ్చింది.‘పింక్ బెల్ట్’ ఇప్పుడు వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందుతోంది. మీకుందా పింక్ బెల్ట్?కరాటేలో పింక్ బెల్ట్ లేదు. వైట్, ఆరంజ్, బ్లూ, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ బెల్ట్‌లు ఉంటాయి. తర్వాతి రోజుల్లో కొన్ని కరాటే స్కూల్స్‌లో పింక్ బెల్ట్‌ను కూడా మొదలు పెట్టారు. ఇది వైట్ నుంచి ఎల్లో మధ్య స్థాయిలో ఉంటుంది. ‘ఏ స్థాయిలోదైనా ప్రతి స్త్రీకి ఆత్మరక్షణ విద్య తెలిసి ఉండాలి’ అంటుంది అపర్ణ రజావత్. ‘మన దేశంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదని చిన్నప్పటి నుంచి మెదడులో వేస్తారు. ఇప్పటికీ కూడా ‘బేటీ బచావో బేటీ పఢావో’ అంటున్నాం. ఎవరైనా కాపాడే వస్తువా స్త్రీ అంటే? ఇది కాదు నేర్పాల్సింది... కొడుకుకు సంస్కారం నేర్పండి... నేర్వకపోతే దండించండి... ఇది కదా నేర్పాలి’ అని ప్రశ్నిస్తుందామె.అన్నయ్యల మీద తిరగబడి...అపర్ణ అవడానికి రాజస్థాన్ క్షత్రియ పుత్రిక అయినా తండ్రి ఉద్యోగరీత్యా ఆగ్రాలో పెరిగింది. నలుగురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నయ్యలు. చిన్నప్పటి నుంచి తల ఒంచుకుని ఉండటం అపర్ణకు ఇష్టం లేదు. ఎదురు చెప్పేది. దాంతో అన్నయ్యలు ఆమెను దారిలో పెట్టాలని తరచూ గద్దించేవారు. అప్పుడు అపర్ణకు ఈ అన్నయ్యలను ఎదిరించాలంటే నేను ఏదో ఒక యుద్ధవిద్య నేర్వాలి అనుకుంది. అలా ఎనిమిది పదేళ్ల వయసులోనే కరాటేలో చేరింది. రాజ్‌పుత్‌ల ఇళ్లల్లో ఆడపిల్లల్ని అలా కరాటే నేర్పించడానికి పంపడం మర్యాద తక్కువ. అందుకని డ్రాయింగ్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి వెళ్లేది. తల్లి ఇందుకు సహకరించింది. అలా నేర్చుకున్న కరాటేతో 12వ ఏట తన కంటే సీనియర్ బెల్ట్ ఉన్న అమ్మాయిని ఓడించడంతో పేపర్లో వార్త వచ్చింది. దాంతో ఇంట్లో తెలిసి గగ్గోలు రేగింది. ఆ తర్వాత తండ్రి ఆమె సామర్థ్యాన్ని గ్రహించి కరాటేలో ప్రోత్సహించాడు. ‘కరాటేలో తొలి ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చిన భారతీయ మహిళను నేనే’ అంటుంది అపర్ణ.నిర్భయ ఘటన తర్వాత...చదువుకున్నాక అమెరికాలో ఉంటూ ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్న అపర్ణను 2012లో నిర్భయ ఘటన కలచి వేసింది. ఆ సమయంలో అమెరికాలో ఆమె సహోద్యోగులు ‘మీ ఇండియాలో ఇలాగే ఉంటుందా?’ అని అడగడం మరీ అన్యాయంగా అనిపించింది. ‘నా వంతుగా ఏం చేయగలను’ అనుకున్నప్పుడు ఆమెకు తట్టిన సమాధానం స్వీయ రక్షణలో వీలైనంతమందికి శిక్షణ ఇవ్వడం. ఆ ఆలోచనతోనే 2016లో ఇండియా వచ్చి ఆగ్రాలో ‘పింక్‌బెల్ట్ మిషన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం రెండుమూడు రోజుల వర్క్‌షాప్‌ల ద్వారా స్త్రీలకు కనీస ప్రతిఘటన విద్యలు నేర్పి పింక్ బెల్ట్‌ను బహూకరించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెంచడమే పింక్‌బెల్ట్ మిషన్ లక్ష్యం.ఆత్మరక్షణ ఈ స్త్రీలకు అక్కర్లేదా?‘ఆత్మరక్షణ గురించి స్త్రీలకు చాలా అ΄ోహలు ఉన్నాయి. ఆ అ΄ోహలను తీర్చాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ.అపోహ: వయసు నలభై దాటేసింది. బలహీన పడి΄ోయాను. కరాటే నేర్చుకోవాలా?వాస్తవం: కరాటే ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. తాయ్చిలాంటి విద్యనైతే 80 ఏళ్ల తర్వాత కూడా నేర్చుకోవచ్చు.అపోహ: నేను ఇంటి బయటకే వెళ్లను. నాకు ఆత్మరక్షణ విద్య ఎందుకు?వాస్తవం: స్త్రీలపై దాడులు జరిగేది ఇళ్లలోనే. అదీ అయినవాళ్ల చేతుల్లోనే. ఇంట్లో ఉన్నత మాత్రాన రక్షణ ఉన్నట్టు కాదు.అపోహ: నేను మంచి ఆఫీస్‌లో పని చేస్తాను. నా కొలిగ్స్ మర్యాదస్తులు.వాస్తవం: మీరు ఎక్కడ పని చేసినా మీకు ప్రమాదం ΄÷ంచే ఉంటుంది. ΄ార్కింగ్ ఏరియాలో మీ మీద దాడి జరిగితే?అపోహ: నేను రెచ్చగొట్టే దుస్తులు వేసుకోను. నా జోలికి ఎవరూ రారు.వాస్తవం మీరు ఎలాంటి దుస్తులు ధరించినా దాడి జరిగే అవకాశం ఉంది. అత్యాచారం లైంగిక చర్య మాత్రమే కాదు... ఆధిపత్య నిరూపణ కోసం చేసే చర్య కూడా.అపోహ: ఆడవాళ్లు ఎంత నేర్చినా మగవారితో సమానం అవుతారా?వాస్తవం ఆత్మరక్షణ విద్య నేర్చుకునేది మగవారి బలంతో సమానం అని చెప్పడానికి కాదు. ప్రమాదం జరిగినప్పుడు మెదడు మొద్దుబారి లొంగి΄ోకుండా ఫైట్‌బ్యాక్ చేసే సన్నద్ధత కోసం.ఆ లక్ష్యంతో ఇప్పటికి అపర్ణ ఇండియాలోని నాలుగైదు రాష్ట్రాల్లో ఇప్పటికి 2 లక్షల మంది అమ్మాయిలు, మహిళలకు వర్క్‌షాప్‌ల ద్వారా ఆత్మరక్షణ నేర్పింది. దీని కోసం ఫుల్‌టైమ్ మాస్టర్స్‌ను తీర్చిదిద్దింది. అమెరికాలోని భారతీయుల కోసం కూడా ఈ శిక్షణ కొనసాగిస్తోంది.డాక్యుమెంటరీ నిర్మాణంఅపర్ణ రజావత్ కృషి గురించి దేశ విదేశాల పత్రికలు రాశాయి. అలా ఆమె కథ హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు మెక్క్రయిట్ ఆమెను పిలిచి ఏకంగా సినిమాయే తీస్తానని చె΄్పాడు. కాని వాస్తవిక స్ఫూర్తి అందరికీ అందాలంటే డాక్యుమెంటరీ చాలని కోరింది అపర్ణ. అలా ‘పింక్ బెల్ట్’ పేరుతో 79 నిమిషాల డాక్యుమెంటరీ తయారయ్యి ప్రస్తుతం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతోంది. షికాగో, న్యూబరీ పోర్ట్, జైపూర్ ఫెస్టివల్స్‌లో పింక్ బెల్ట్ హర్షధ్వానాలు అందుకుంది. యూట్యూబ్‌లో దీని ట్రైలర్ తాజాగా విడుదలైంది. -
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక డాక్యుమెంటరీ, అక్టోబర్ 20న
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ బృందం హైదరాబాద్ హెరిటేజ్ గురించి సరికొత్త డాక్యుమెంటరీని ఆవిష్కరించనుంది. అక్టోబర్ 20న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగే గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా దీన్ని లాంచ్ చేయనుంది. హైదరాబాద్ పట్టణ విస్తరణతో కనుమరుగవుతున్న రాళ్లకు (అదర్ కోహినూర్స్) నివాళిగా దీన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.ఉమా మగల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ 48 నిమిషాల డాక్యుమెంటరీ, హైదరాబాద్‌లోని ప్రత్యేకమైన ప్రకృతిలో అద్భుతమైన రాళ్లను, వాటి వైభవాన్ని పరిచయం చేయనుంది. నగర గొప్ప సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది. అక్టోబరు 20న సాయంత్రం 6 గంటలకు ప్రసిద్ధ "సాంగ్ ఆఫ్ ది కోహినూర్స్"ని ర్యాప్ సాంగ్ ఈ కార్యక్రమం మొదలు కానుంది. డీజే ముర్థోవిక్ స్వరపరిచిన అనుజ్ గుర్వారా అందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనేంది. ఈ పాటను హైదరాబాద్ ప్రేమ గీతం అని పిలుస్తారు. ఈ చిత్రం కేవలం హైదరాబాద్ రాళ్ల డాక్యుమెంటేషన్ కాదు; ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం. నగర ప్రత్యేకమైన సహజ వారసత్వాన్ని జరుపుకోవడానికి ,రక్షించడానికి విభిన్న నేపథ్యాల నుండి ప్రజలను ఒకచోట చేర్చడం. నగర ప్రకృతి దృశ్యాన్ని గౌరవించే స్థిరమైన పట్టణ అభివృద్ధిపై చర్చ జరగాలని టీం భావిస్తోంది.మరిన్ని వివరాల కోసం, సందర్శించండి: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అదర్స్కొహినూర్.కామ్ -
మా అమ్మ పాట జానపదాల పూదోట
‘అసమాన అనసూయ’... ఇదీ తెలుగు జానపద సంగీత సామ్రాజ్ఞి వింజమూరి అనసూయాదేవి పై ఆమె కుమార్తె సీతా రత్నాకర్ రూపొందించిన డాక్యుమెంటరీ పేరు. గంటన్నర నిడివి గల ఈ డాక్యుమెంటరీ వింజమూరి అనసూయాదేవి గాత్రాన్ని, ఘనతను, అనుభవాలను ్ర΄ోది చేసింది. దేశ విదేశాలఫెస్టివల్స్లో ప్రశంసలు పొందుతోంది. ఆగస్టు 11న కాకినాడలో, ఆగస్టు 17న హైదరాబాద్‌లో ప్రదర్శితం కానున్న ఈ డాక్యుమెంటరీ గురించి సీతా రత్నాకర్ తెలిపిన వివరాలు.‘దూరదర్శన్‌లో పని చేస్తున్న సమయంలో నేను కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. అయితే జానపద సంగీత విభాగంలో గొప్ప కృషి చేసిన మా అమ్మ మీద డాక్యుమెంటరీ తీసే ఉద్దేశం నాకు అప్పట్లో ఉండేది కాదు. మా అమ్మ 1990 తర్వాత అమెరికా లో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. ఒకసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు అందరి మీద డాక్యుమెంటరీలు‡ తీస్తున్నావ్ మరి నా మీద ఎప్పుడు తీస్తావు అని అడిగింది. అవును కదా అనుకున్నాను. అయినా సరే ఆ పనికి శ్రీకారం చుట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది’ అని గుర్తు చేసుకున్నారు సీతా రత్నాకర్. ఆమె తన తల్లి వింజమూరి అనసూయ పై తీసిన డాక్యుమెంటరీ ‘అసమాన అనసూయ’ ఇప్పుడు వివిధ దేశాలలో జరుగుతున్న ఫెస్టివల్స్‌లో పాల్గొంటోంది. కోల్‌కతా చలన చిత్ర ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 2024 సంవత్సరానికి ప్రథమ బహుమతి పొందింది. తాజాగా ఈ డాక్యుమెంటరీని ఆగస్టు 11న కాకినాడ సూర్యకళామందిరంలో, ఆగస్టు 17న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సప్తపర్ణిలో ప్రదర్శించనున్నారు.డాక్యుమెంటరీ విలువ తెలిసింది‘మా అమ్మ అమెరికాలో ఉన్నప్పుడు మా అక్క భర్త ఆమె అనుభవాలను నమోదు చేసిన టేప్ ఫుటేజ్ ఉంది. నేను డాక్యుమెంటరీ కోసం ప్రత్యేకంగా అమ్మతో మాట్లాడాలనుకునేలోపు ఆమె 2019లో స్వర్గస్తురాలయింది. ఆమెపై డాక్యుమెంటరీ అవసరం ఆమె ΄ోయాక గానీ పూర్తిగా నాకు తెలియరాలేదు. వెంటనే రంగంలో దిగాను. కరోనా మొదటి రెండేళ్ల సమయంలో ఫుటేజ్ మొత్తం గేదర్ చేసుకుని పని ్రపారంభించాను. పాత టేప్ ఫుటేజ్ అంతా డిజిటలైజ్ చేయించాను. ఆ తర్వాత దాన్ని అంతటినీ గుదిగుచ్చి 94 నిమిషాల డాక్యుమెంటరీ తయారు చేశాను. మా అమ్మ జీవితాన్ని తెలుసుకోడం అంటే స్వాతంత్య్రానికి 20 ఏళ్ల పూర్వం నుంచి ఆ తర్వాత సినిమా, రేడియో, ఇతర మాధ్యమాల తెలుగు సంగీత చరిత్రను తెలుసుకోవడమే’ అని తెలిపారు సీతా రత్నాకర్.జానపదం అమ్మపాట... బాట‘మా అమ్మ వింజమూరి అనసూయాదేవి 1920 మే 12 తేదీన కాకినాడలో జన్మించింది. మా అమ్మకు బాల్యం నుండే సంగీతం పట్ల మక్కువ కలిగింది. ఎనిమిదేళ్ల వయసులోనే గ్రాంఫోన్ రికార్డు పాడిన ఘనత ఆమెది. అప్పటినుంచి ఆమె తన మేనమామ, ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రితో పాటల ప్రయాణం చేస్తూ ఎన్నో పాటలకు ్రపాణం ΄ోసింది. అయితే ‘జానపదం’ అంటేనే ఆమెకు మక్కువ. ‘బండీర ΄÷గ బండీర’, ‘గోలకొండోయి గొరుగాకు పుల్ల’, ‘రామనా సందనాలో’, ‘గోదారోరి సిన్నది’, ‘కొండండోరి సెరువుల కింద’, ‘హోలీ హోలీయరంగ హోలీ’, ‘గోదావరి ్రపాంత పెళ్లి పాటలు’– మొదలైన వందలాది తెలుగు జానపదాలను రేడియో ద్వారా ప్రజలకు చేరువ చేయడంలోనూ, కచేరీల స్థాయికి తీసుకువెళ్లడంలో ఆమెది పెద్ద పాత్ర’ అంటారు సీతా రత్నాకర్.మొక్కజొన్న తోటలో...‘మా అమ్మ తన చెల్లి సీతతో కలిసి వింజమూరి సిస్టర్స్‌గా ఎన్నో కచేరీలు చేసింది. దేవులపల్లి రాసిన ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ’కి బాణీ ఏర్పరచి కాకినాడ పి.ఆర్. కళాశాల స్వర్ణోత్సవ సభలో(1935) పిల్లలతో పాడించింది. కొనకళ్ళ‘మొక్కజొన్న తోటలో’ పాటకి ్రపాణం ΄ోసింది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ పాల్గొన్న కాకినాడ టౌన్ హాల్ సభలో ఆయన పక్కన కూర్చుని దేశభక్తి గీతాలు పాడటం ఆమె ఎప్పుడూ మర్చి΄ోలేదు’ అని గుర్తు చేసుకున్నారామె.నేను రెండో కుమార్తెను‘నేను అమ్మకు రెండో కుమార్తెను. చెన్నైలో స్థిరపడ్డాను. మా అక్క రత్నపాపతో కలిసి అమ్మ కచేరీలలో కోరస్ పాడేదాన్ని. ఆ తర్వాత దూరదర్శన్ లో ్ర΄ోగ్రాం ప్రొడ్యుసర్‌గా నాలుగు దశాబ్దాలు పనిచేసి 2012లో పదవీ విరమణ చేశాను. 2014లో నుంచి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ మొదలుపెట్టాను. నేను తీసిన ‘కాస్మిక్ కనెక్షన్’ డాక్యుమెంటరీకి దేశ విదేశ పురస్కారాలు వచ్చాయి. ‘అసమాన అనసూయ’ డాక్యుమెంటరీకి దేశ విదేశాలలో గుర్తింపు వస్తోంది. అయితే తెలుగువారే దానిని ఎక్కువ చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారామె.– సాక్షి ఫ్యామిలీ డెస్క్ఇన్పుట్స్: డా.కె.రామచంద్రారెడ్డి -
‘రామ కథా యాత్ర’పై డాక్యుమెంటరీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాత ఆధ్యాతి్మక వేత్త మొరారి బాపు ఇటీవల తాను చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ రామకథా యాత్రపై ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు. రెండు రైళ్లలో ఒకదానిలో ప్రయాణించిన బాపు, ఆయన బృందం దీనిని చిత్రీకరించిందనీ, మంచు కప్పేసిన హిమాలయ శిఖరాల మీదుగా పచ్చని లోయలు విశాలమైన సముద్ర తీరాల వరకూ సాగిన ఈ యాత్రలో అనేక ఆధ్యాతి్మక విశేషాలను వీక్షించవచ్చని రూపకర్తలు తెలిపారు. అదే విధంగా బాపు రచించిన జర్నీ విత్ యాన్ ఇని్వజబుల్ పవర్, సాక్ర్డ్ స్టోరీస్ ఫ్రమ్ ది 12 జ్యోతిర్లింగాస్ పుస్తకాలు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ... స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
-
Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ..
‘సారూ’ అని మాత్రమే సంబోధిస్తున్నారు.. మా సంగతేమిటి అని ఎదురుప్రశ్న వేయకండి.. మేడమ్‌గారు!! ఇది అందరికీ వర్తించే విషయమే. ఈ రోజు, ఈ కాలమ్‌లో.. ఎవరు ఏ ఫారంలో ఆదాయపు పన్ను రిటర్నులను సబ్మిట్ చేయాలనేది ప్రస్తుతపు ప్రశ్న. అసెస్సీలు వారి వారి ఆదాయాన్ని ఒక నిర్దేశించిన ఫారంలోనే తెలియజేయాలి. ఈ ఫారంలో అన్ని కాలమ్‌లు సంపూర్ణంగా నింపి, రిటర్నుని లేదా ఫారంని ఫైల్ చేయాలి. ఫారం చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. మీ ఆదాయాన్ని బట్టి, ఏ ఫారం ఎవరు ఫైల్ చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ క్యాటగిరీని బట్టి.. అంటే స్టేటస్ .. అంటే మీరు వ్యక్తులా, కంపెనీయా, ఉమ్మడి కుటుంబమా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఏడు రకాల ఫారమ్‌లు అమల్లో ఉన్నాయి. ఫారం 1 లేదా సహజ్ని వ్యక్తులు, రెసిడెంట్లు, కేవలం జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం మాత్రమే ఉంటేనే వేయాలి. ఈ రూపంలో వచ్చే ఆదాయం రూ. 50,00,000 దాటని వారు వేయొచ్చు. ఫారం 2 ని వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం కూడా వేయొచ్చు. జీతం, పెన్షన్, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉండి, మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితేనే వెయ్యాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ఈ ఫారం వేయకూడదు. ఇక ఫారం 3. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం.. వ్యాపారం, వృత్తి మీద ఆదాయం/లాభం ఉన్న వారు, ఇతరత్రా అన్ని ఆదాయాలతో పాటు ఈ ఫారం వేయొచ్చు. నాలుగో ఫారం తీసుకుంటే.. దీన్నే సుగమ్ అని కూడా అంటారు. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, వ్యాపారం.. వృత్తిపరమైన ఆదాయాలు, ఇతరత్రా ఆదాయాలు ఉన్నవారు దీన్ని వేయాలి. లెక్కలతో నిమిత్తం లేకుండా కేవలం టర్నోవరు మీద నిర్దేశించిన శాతం కన్నా ఎక్కువ లాభం చూపించే వారు ఈ ఫారం వేయొచ్చు. ఇక ఐటీఆర్ 5. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ట్రస్టులు, వ్యక్తుల కలయిక అంటే గ్రూప్ లేదా అసోసియేషన్, ఎల్ఎల్పీలు, కంపెనీలు మొదలైన వారు వేయొచ్చు. మరొకటి ఫారం 6. కంపెనీలు మొదలైనవి, కంపెనీల చట్ట ప్రకారం నమోదు అయినవి వేయాలి. విదేశీ కంపెనీలు కూడా వేయొచ్చు. కొన్ని సంస్థలను కంపెనీగా పరిగణిస్తారు. అటువంటివి కూడా ఈ ఫారం వేయాలి. చివరగా ఫారం 7. మతపరమైన ధారి్మక సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ సంస్థలు, ఎన్జీవోలు మొదలైన సంస్థలు ఈ ఫారం వేయాలి. ఈ ఫారాల సంగతి ఇది.. స్థూలంగా చెప్పాలంటే వేతన జీవులకు ఫారం 1 లేదా ఫారం రెండు వర్తిస్తుంది. అయితే, వీరికి వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉంటే ఫారం 3 లేదా ఫారం 4 వేయాలి. జీతమే ఉంటే ఫారం 1 లేదా 2, వ్యాపారమే ఉంటే ఫారం 3 లేదా 4 వేయాలి. వెనకటికి కుప్పుస్వామీ మేడ్ ఇట్ డిఫికల్ట్ (kuppuswamy made it difficult) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే ఉన్నాయి ఈ ఫారాలు కూడా. ఏ కేటగిరిలో ఎవరు వేశారు, ఎంత ఆదాయం డిక్లేర్ చేశారు మొదలైన సమాచారం కోసం వెసులుబాటుగా ఉండాలని ఇన్ని ఫారాలు. ఈ కాలమ్ ద్వారా ప్రతి వారం మీకు మీ సంశయాలు తీరుస్తాం. ఓపిగ్గా వెయిట్ చేయండి. ఇవి చదవండి: మార్చిలో ఎంఎఫ్‌లు డీలా -
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్‌తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్‌కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్‌కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే!
ఒకప్పుడు రాజుల కాలంలో ఐదు రోజులు ఆడంబరంగా పెళ్లి చేసుకునే వారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొంత మంది ధనవంతులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్ళికి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక కార్ డీలర్షిప్ తన కూతురు 'మడేలైన్ బ్రాక్వే' పెళ్లి ఐదు రోజులు ఘనంగా చేసాడు. దీనికైన ఖర్చు 59 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు కంటే ఎక్కువ. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. 26 ఏళ్ల మడేలైన్ బ్రాక్వే.. తన ప్రియుడు 'జాకబ్ లాగ్రోన్'తో జరిగిన ఐదు రోజుల పెళ్ళికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలైస్ గార్నియర్‌లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నారు. వివాహ వేదిక ఎక్కడో స్పష్టంగా వెల్లడించలేదు, కానీ ఈఫిల్ టవర్ ఉద్యానవనంలో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్లు, బహుశా అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ జంట 2020 మార్చిలో డేటింగ్ ప్రారంభించారు. లాగ్రోన్ లింక్డ్ఇన్ అకౌంట్ ప్రకారం, అతను కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్‌లో టాలెంట్ కోఆర్డినేటర్‌గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్కు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ జంట, వారి స్నేహితులు పారిస్‌కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్ గదుల ఖరీదు రోజుకి 2400 డాలర్లని సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి తన కూతురు పెళ్ళికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. పెళ్ళిలో వధువు ధరించిన చీర ఖరీదే రూ. 17 కోట్లు కాగా, ఆమె వేసుకున్న బంగారు ఆభరణాల ఖరీదు రూ. 90 కోట్లు, మేకప్ కోసం మాత్రమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Lake Como Wedding Planner (@lakecomoweddings) -
అడ్డంకులను దూరంగా తన్ని,30 ఏళ్లుగా ఆడపిల్లల కోసం కష్టపడుతూ..
మణిపూర్ ఒక మంచి వార్తను వినిపించింది. ఆ రాష్ట్రానికి చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్ తీసిన ‘ఆండ్రో డ్రీమ్స్’ ముంబైలో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీగా ఎంపికైంది. మణిపూర్‌లోని మారుమూల గ్రామం ‘ఆండ్రో’లో ఆడపిల్లల ఫుట్‌బాల్ క్లబ్‌ను 30 ఏళ్లుగా పరిస్థితులకు ఎదురీది నడుపుతున్న ‘లైబి’ అనే మహిళ పోరాటాన్ని ఈ డాక్యుమెంటరీ రికార్డు చేసింది. ఆడపిల్లల క్రీడా స్వేచ్ఛను ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగనివ్వాలనే సందేశం ఇచ్చే ఈ డాక్యుమెంటరీ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతోంది. అంతా చేసి ఎనిమిది వేల మంది జనాభా మించని ఊరు ఆండ్రో. మణిపూర్ తూర్పు ఇంఫాల్ జిల్లాలో మారుమూల ఉంటుంది అది. అక్కడి ఆడపిల్లలు ఫుట్‌బాల్ ఆడితే ఏంటి... ఆడకపోతే ఏంటి? కాని 60 ఏళ్ల లైబి మాత్రం– ఆడాల్సిందే అంటోంది. ఆమె గత ముప్పై ఏళ్లుగా ‘ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్– ఫుట్‌బాల్ క్లబ్’ (అమ్మ– ఎఫ్‌సీ) నడుపుతోంది. ఈ క్లబ్‌కు నిధులు లేవు. బిల్డింగ్ లేదు. ఊళ్లో ప్రోత్సాహం లేదూ, ఏమీ లేదు. కాని లైబి మాత్రం అంతా తానై క్లబ్‌ను నడుపుతోంది. ఈ మధ్యే ఆమె ఒక పూరి పాక నిర్మించి దానినే క్లబ్ బిల్డింగ్‌గా ప్రారంభించుకుంది. ‘అమ్మాయిలు కేవలం వంటకు, ఇంటి పనికి అంకితమై పోకూడదు. చదువుకోవాలి. ఆడాలి. ధైర్యంగా భవిష్యత్తును నిర్మించుకోవాలి. మా ప్రాంతంలో పురుషులదే సర్వాధికారం. ఇంటి పెద్ద, తెగ పెద్ద ఎంత చెప్తే అంత. వారి దృష్టిలో ఆడవాళ్ల గురించి చింతించాల్సింది ఏమీ ఉండదు. అమ్మాయిలు ఆడతామన్నా ఒప్పుకోరు. నా పోరాటం వల్లే ఇవాళ మా ఊరి నుంచి జాతీయ స్థాయిలో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు’ అంటుంది లైబి. ఈమె పోరాటం ప్రపంచానికి చెప్పదగ్గది అనిపించింది మణిపూర్‌కే చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్కు. అలా తయారైన డాక్యుమెంటరీనే ‘ఆండ్రో డ్రీమ్స్’. ఇద్దరి కథ ప్రస్తుతం ముంబైలో ‘జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో ‘ఆండ్రో డ్రీమ్స్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఇప్పటికే కేరళ, కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ డాక్యుమెంటరీ ముంబైలో విమర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘దీనికి కారణం ఆండ్రోలో అమ్మ క్లబ్‌ను నడుపుతున్న లైబి పోరాటాన్ని, ఆ క్లబ్లో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉంటూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనుకునే నిర్మల అనే అమ్మాయి ఆకాంక్షలని నేను చూపించడమే. ఒక రకంగా చాదస్త వ్యవస్థతో రెండు తరాల స్త్రీల పోరాటం ఈ డాక్యుమెంటరీ’ అని తెలిపింది మీనా లాంగ్జామ్. మణిపూర్ వెలుతురు నిజానికి మే 3వ తేదీ నుంచి మణిపూర్ వేరే కారణాల రీత్యా వార్తల్లో ఉంది. కాని మణిపూర్‌ను అభిమానించేవారికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ సాధిస్తున్న విజయాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘నా డాక్యుమెంటరీ విజయం మా ప్రాంతంలో గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టే ఉత్సాహాన్ని ఇస్తే అంతే చాలు’ అంది మీనా లాంగ్జామ్. మణిపూర్ యూనివర్సిటీలో కల్చరల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న మీనా పాఠాలు చెప్పడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీస్తుంది. 2015లో ఆమె మణిపూర్‌లో ఫస్ట్ మహిళా ఆటోడ్రైవర్‌గా ఉన్న లైబీ ఓయినమ్ మీద డాక్యుమెంటరీ తీస్తే దానికి చాలా పేరొచ్చింది. ఆ తర్వాత ‘అచౌబీ ఇన్ లవ్’ పేరుతో పోలో ఆటకు అనువైన స్థానిక జాతి అశ్వాలపై డాక్యుమెంటరీ తీస్తే దానికీ పేరొచ్చింది. ఇప్పుడు ‘ఆండ్రో డ్రీమ్స్’ మణిపూర్ ఘనతను చాటుతోంది. బాలికలు, యువతులు క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనే ఉంటాయి. అలాంటి ప్రతి చోట అమ్మాయిలను ప్రోత్సహించే లైబి లాంటి యోధురాళ్లు, వారి గెలుపు గాధలను లోకానికి తెలిపే మీనా లాంటి వాళ్లు ఉండాలని కోరుకుందాం. -
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !
ఆర్ఆర్ఆర్తో పాటు ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులను సంరక్షించే గిరిజన దంపతుల జీవనం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే దీన్ని తెరకెక్కించిన కార్తికి గోంజాల్వెస్ తీరు పట్ల ఇటీవలే ఈ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తే ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు కలెక్షన్స్‌లోనూ వాటా ఇస్తామని కార్తికి చెప్పిందని బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన దంపతులు తమకు డబ్బులు ఇవ్వకుండా దర్శకురాలు మోసం చేసిందని వాపోయారు. అంతే కాకుండా తాము ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. (ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!) ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఇప్పటికే గిరిజన దంపతులు దర్శకురాలికి రూ.2 కోట్ల చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు తెలిసింది. ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారని.. తమకు మాత్రం మొండిచేయి చూపించారంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో బొమ్మన్, బెల్లీ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.2 కోట్ల లీగల్ నోటీసు గురించి తమకు తెలియదని బొమ్మన్ చెప్పినట్లు వెల్లడిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణలపై పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఓ మీడియా ప్రతినిధితో బొమ్మన్ మాట్లాడుతూ..' మా డిమాండ్లు నెరవేరితే కేసును వెనక్కి తీసుకుంటానని నేను చెప్పలేదు. అక్కడ ఏమి జరిగిందో నాకు ఏమి తెలియదు. లీగల్ నోటీసులు పంపినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కార్తీకి నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా సహాయం చేస్తానని కూడా చెప్పారు. కేసు విషయంలో నేనేం చేస్తా. ఆమె మాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు." అని అన్నారు. ఇప్పటికే దీనిపై వివాదం తలెత్తగా.. బొమ్మన్ కామెంట్స్‌తో సీన్ కాస్తా రివర్స్ అయింది. (ఇది చదవండి: మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. -
గోయింగ్ సోలో! ఇద్దరు విజేతల అరుదైన కథ
‘ఆడపిల్లలు సైకిల్ తొక్కడమేమిటి!’ అని ఆశ్చర్యపోయే కుటుంబాల్లో పుట్టారు గరీమ శంకర్, రేణు సింఘీలు చిన్నప్పుడు సైకిల్‌ను చూడడం తప్ప నడిపింది లేదు. సైకిల్‌పై జెట్ స్పీడ్‌తో దూసుకుపోయేవాళ్లను చూసి ఆశ్చర్యపడేవారు. అలాంటి వారు సైకిలింగ్‌లో అద్భుతాల సృష్టిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గోయింగ్ సోలో’ డాక్యుమెంటరీలో వారి అంతర్. బహిర్ ప్రయాణం ఉంటుంది. నాలుగు గోడల మధ్య ఇంటికి పరిమితమైన రోజుల నుంచి లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్)లాంటి ప్రతిష్ఠాత్మకమైన సైకిలింగ్ ఈవెంట్స్ వరకు చేసిన ప్రయాణం కళ్లకు కడుతుంది. ‘వారి జీవితాల్లో సైకిలింగ్‌కు మించి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. వారి జీవితాల్లోని అద్భుతాలను ఆవిష్కరించడానికి సైకిల్ అనేది ఒక సాధనం మాత్రమే’ అంటాడు ‘గోయింగ్ సోలో’ డైరెక్టర్ అమీ గోర్. ఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన గరీమకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తప్ప ఏ లోటూ లేదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అందరిలాగా తాను కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కాలనుకునేది. సైకిల్ తొక్కడం మాట ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి రావడమే గగనంగా ఉండేది. తల్లిదండ్రులు ఆమెను పొరపాటున కూడా బయటికి పంపేవారు కాదు. గరీమకు పెళ్లి అయింది. ఆ తరువాత ఒక బిడ్డకు తల్లి అయింది. బాగా బరువు పెరిగింది. అది తనకు చాలా ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడానికి మార్గాల గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన సైకిలింగ్ గుర్తుకు వచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తమ్ముడి ద్వారా సైకిల్ తొక్కడం నేర్చుకుంది. అయితే ఆమె సైకిల్ యాత్ర ఇంటిపరిసరాలకే పరిమితం. బరువు తగ్గడం మాట ఎలా ఉన్నా సైకిలింగ్ ద్వారా తాను ఒంటరిగా రోడ్డు మీదికి వచ్చింది. నగరంలో ప్రతి వీధిని చూసే అవకాశం వచ్చింది. అంతా కొత్తగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది! ఇక అప్పటి నుంచి రెగ్యులర్ రైడర్‌గా మారింది. సైకిల్ లేకుండా ఆమెను చూడడం అరుదైపోయింది. సైకిలింగ్‌పై గరీమ ఆసక్తిని గమనించిన సన్నిహితులు ‘లక్ష్యం ఏర్పాటు చేసుకో. విజయం సాధించు’ అని చెప్పేవారు. దీంతో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త అడుగులు వేసింది. సైకిల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఆ రేసులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చేది. తెలిసినవాళ్లు లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్) సైకిల్ ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో షెడ్యూల్‌కు మూడు నెలల ముందు తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ‘నిజానికి అదొక అసాధ్యమైన లక్ష్యం. కాని ఏదో ధైర్యం నన్ను ముందుకు నడిపించింది’ అంటున్న గరీమ ఎల్ఈఎల్లో 125 గంటలలో 1,540 కిలోమీటర్లు దూరం సైకిలింగ్ చేసింది. గరీమ ఉత్సాహం, సాహసానికి ముచ్చటపడిన ఎల్‌ఈఎల్ కమ్యూనిటీ ఆమెను మెడల్‌తో సత్కరించింది. ఇక రాజస్థాన్‌కు చెందిన రేణు సింఘీ విషయానికి వస్తే పెళ్లికి ముందు అంతంత మాత్రంగా ఉన్న స్వేచ్ఛ ఆ తరువాత పూర్తిగా పోయింది. వంట నుంచి పిల్లల పెంపకం వరకు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. తన కుమారుడికి సైకిల్ కొనడానికి ఒకరోజు బైక్షాప్కు వెళ్లింది. తన కోసం కూడా ఒక సైకిల్ కొన్నది. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్లు. ‘ఈ వయసులో సైకిల్ తొక్కడమేమిటి’ అనేవారు కుటుంబసభ్యులు. అయితే అవేమీ పట్టించుకోకుండా లాంగ్–డిస్టెన్స్ సైకిలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆ తరువాత ఇంటర్నేషనఃల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టింది. ‘మనకు నచ్చింది చేయాలి. వయసు అనేది అడ్డు కాదు’ అంటున్న సింఘీ ఎల్‌ఈఎల్–ఈవెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అమ్మీ మీడియా (న్యూయార్క్), ఖాన్ అండ్ కుమార్ మీడియా (ఇండియా) నిర్మించిన ‘గోయింగ్ సోలో’ను దిల్లీ, ఊటీ, జైపుర్, జోద్పూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్లో చిత్రీకరించారు. 70 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి అమీ గోర్ దర్శకుడు. టీవి, షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీలలో పదిసంవత్సరాల అనుభవం ఉంది. ‘వారి అనుభవాలు, ప్రయాణం నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేశాయి. రకరకాల పరిస్థితులు లేదా వయసును కారణంగా చూపి తమకు తాము రకరకాల పరిమితులు విధించుకునే ఎంతోమందికి ఈ డాక్యుమెంటరీ స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు డైరెక్టర్ అమీ గోర్. (చదవండి: చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!) -
బీబీసీపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంట్ రూపొందించిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఓ ప్రభుత్వేతర సంస్థ ఢిల్లీ హైకోర్టులో రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ డాక్యుమెంట్లో ప్రధాని మోదీ, భారత న్యాయవ్యవస్థపై తప్పుడు ఆరోపణలతో బీబీసీ భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది. గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ (యూకే)తోపాటు బీబీసీ(ఇండియా)కు సమన్లు ఇచ్చింది. సెప్టెంబర్ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. నష్ట పరిహారంతోపాటు తమ సంస్థకు ఇతర ఆదాయ మార్గాలు లేనందున కోర్టు ఫీజులు తదితరాల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించాలని కోరారు. -
అవునూ.. మన అడవుల్లో ఏనుగెందుకు లేదు?
మీరు ఓ విషయాన్ని గమనించారా? మన రాష్ట్రంలో జూలో తప్ప అడవుల్లో ఏనుగులు లేవు. చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉన్నాయి. దక్షిణాదిలో అయితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మందలు మందలుగా కనిపిస్తే.. ఇటు ఏపీలోనూ పదుల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఇటీవలే ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఏనుగుల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అసలు గజరాజు తెలంగాణలో ఎందుకు లేడు? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రాడు? అన్న విషయంపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి, హైదరాబాద్ ఎందుకు లేవు.. ఎందుకు రావు.. ♦తెలంగాణలో ఏనుగులు కనిపించకపోవడానికి ప్రధానంగా భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాలు భౌగోళికంగా దక్కన్ పీఠభూమిపై ఉండటంతోపాటు అడవుల మధ్య ‘డ్రై ఏరియా’ కారణంగా చారిత్రకంగానే ఇక్కడ ఏనుగులు లేవు. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జిల్లాలన్నీ (పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లోని) పొడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలే. రాయచూర్, గుల్బర్గా, అకోలా, బీదర్, నాందేడ్ తదితర చోట్లా ఏనుగులు లేకపోవడంతో తెలంగాణలో ఏనుగుల ప్రవేశానికి అవకాశాలు లేకుండా పోయాయి. ♦ఏనుగులు స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే దట్టమైన అడవులు, పచ్చదనం అవసరం. కనీసం 1,000–1,500 మిల్లీమీటర్ల వర్షపాతముండే ప్రాంతాలు కావాలి. తేమ వాతావరణం ఉండాలి. కనీసం 7, 8 నెలల పాటైనా అడవుల్లోని చెట్లు ఆకులు కలిగి ఉండాలి. గడ్డి ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఒక్కో ఏనుగుకు సగటున రోజుకు 150 నుంచి 200 కేజీల మేత అవసరం. ఒక గుంపులో ఐదు ఏనుగులుంటే రోజూ టన్ను మేత కావాలి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి దట్టమైన అడవులు లేకపోవడం వల్ల.. పెద్ద పులులు, ఇతర జంతువులు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నా ఏనుగులు మాత్రం రావడం లేదు. ♦ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులున్న చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అడవుల కనెక్షన్ లేదు. మధ్యలో మైదాన ప్రాంతాలను దాటి ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశాల్లేవు. ఏపీ సరిహద్దుల్లో ఖమ్మంకు ఆనుకుని పశ్చి మగోదావరి, మహబూబ్‌నగర్‌కు ఆనుకుని కర్నూలు, నల్లగొండ వైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏనుగులు లేవు. దీనితో తెలంగాణలోకి వచ్చే పరిస్థితి లేదు. ♦ గతంలో ఉమ్మడి ఏపీలోకి రెండు మార్గాల్లో ఏనుగులు వచ్చాయి. ఒకటి.. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల నుంచి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాలు కూడా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఆయా చోట్ల ఏనుగుల సంతతి పెరగడంతో పొరుగునే ఉన్న ఏపీలోకి ప్రవేశించాయి. స్థిరనివాసం ఏర్పరుచుకునే వాతావరణం, పరిస్థితులు ఉండడంతో ఇక్కడే ఉండిపోయాయి. ♦ ఇక రెండోది.. ఒడిశాకు పలుమార్లు భారీ వరదలు రావడంతో సరిహద్దుల్లోని విజయనగరం జిల్లాకు కొన్ని ఏనుగులు వలస వచ్చాయి. తిరిగి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా ఏనుగులు వలస వచ్చాయి. చారిత్రకంగా, భౌగోళికంగా, ఇతర ప్రధాన కారణాలతో తెలంగాణలో ఏనుగులు లేవు. ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఏనుగులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగును నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెద్దపులులు అసలు లేకపోవడం, ఇటు తెలంగాణలో ఏనుగులు లేకపోవడంతో.. రెండు ప్రాంతాల్లో పరస్పరం పులులు, ఏనుగులను మార్పిడి చేస్తే బావుంటుందని అంచనా వేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పుష్కలంగా వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్యంతో కూడిన మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. – ఎ.శంకరన్, ఓఎస్డీ, తెలంగాణ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ విభాగం -
బంగారంలాంటి ఆలోచన
బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారుల జీవితాలు బంగారమయంగా ఉన్నాయా.. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడమే కాదు వారికి సాయం చేయాలనే ఆలోచనతో పాతికేళ్ల లోపు యంగ్‌స్టర్స్ స్వచ్ఛందంగా వారిని కలిసి, ఆభరణాలను తయారుచేయించి హైదరాబాద్ తెల్లాపూర్‌లో ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గ్లోబలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు, కంప్యూటర్ డిజైన్స్ వచ్చాక స్వర్ణకారుల ప్రాభవం మసకబారిపోతోందని, వారి కళను బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నమిదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వీరిలో శ్రీహర్షిత, ప్రద్యుమ్న, రిత్విక్, ప్రకృతి, సంస్కృతి, సర్వనా, సాత్విక్, భరణ్య, అజయ్, భగీరథ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి వీరితో మాట్లాడినప్పుడు స్వర్ణకారుల కళ, వారి శ్రమకు తగిన ఫలం రాబోయే రోజుల్లో మరింతగా పెరగాలని కోరుకున్నారు. స్వర్ణకారులు తయారుచేసిన ఆభరణాల ప్రదర్శనకు ముందుండి నడిచిన చాడా శ్రీహర్షిత లా పూర్తి చేసి, తెలంగాణలోని ‘బచ్పన్ బచావో ఆందోళన్’కి లీగల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తోంది. భరణ్య లా చదువుతోంది. రుత్విక్ డాక్టర్ కాగా స్వాతిక్ లా చేస్తున్నాడు. ప్రకృతి పన్నెండవ తరగతి పూర్తిచేసి సైకాలజీ పట్టా పొందడానికి కృషి చేస్తోంది. ప్రద్యుమ్న, భగీరథ్లు బీటెక్ చేస్తున్నారు. ఇక సర్వనా, సంస్కృతి లు స్కూల్ ఏజ్‌లోనే ఉన్నారు. నేరుగా కలిసి.. తాము చేస్తున్న కార్యక్రమాల గురించి శ్రీహర్షిత మాట్లాడుతూ ‘ఎడిస్టీస్ ఎన్జీవోని కిందటేడాది ప్రారంభించాం. దీని ద్వారా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మంచి మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తుంటాం. ఇందుకు కర్నూలు వాసి అయిన నర్మదా టీచర్ ప్రెసిడెంట్‌గా ఉండి సరైన సూచనలు ఇస్తుంటారు. స్కూల్ కార్యక్రమాల తక్వాత హస్తకళలకు సాయం చేయాలనే ఆలోచన చేసినప్పుడు స్వర్ణకారుల జీవితాలను చూశాం. మూడు నెలల క్రితం అనుకున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాం’ అని వివరిస్తే.. ‘దాదాపు పాతికమంది స్వర్ణకారుల కుటుంబాలను నేరుగా కలిసి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులను కలిసి, స్వర్ణకారుల జీవితాల గురించి తెలియజేశాం. మేం ఏ కార్యక్రమం చేసినా, అందులో ప్రతీసారి కొత్తవారు సభ్యులు అవుతూ ఉంటారు. దీంతో మరికొందరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా పెరుగుతోంది’ అని వివరించింది భరణ్య. శ్రమ ఎక్కువ.. ఆదాయం తక్కువ ‘హైదరాబాద్‌లోని కళాకారులనే కలుసుకున్నాం. వీరిలో స్థానిక కళాకారులే కాదు కలకత్తా, గుజరాత్.. వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారున్నారు. స్వర్ణకారుల షాప్‌లో ఒకరు మాస్టర్‌గా ఉంటారు. వారికి తప్ప మిగతా అందరికీ చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. దీంతో కుటుంబాలు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని చూశాం. జ్యువెలరీ అంటే లగ్జరీ గూడ్ అని మనకు తెలుసు. వీటిని తయారుచేసేవారి దగ్గర కూడా బాగా డబ్బు ఉంటుంది అనుకుంటాం. కానీ, వాళ్ల దగ్గర ఏమీ ఉండటం లేదు. ఈ కారణంగా వారి పిల్లలు కనీస చదువులు కూడా కొనసాగించలేకపోతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 25 మంది కళాకారులు పాల్గొన్నారు. సందర్శకులు వారి ఆభరణాలు కొనుగోలు చేసి, స్వర్ణకారులకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కుటుంబాలకు మేం ఇలా సాయంగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు ఈ యంగ్‌స్టర్స్. మన హస్తకళలన్నీ ముందు తరాలలోనూ సుసంపన్నంగా వెలగాలి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జనంలోకి వెళుతూ ఉంటే స్వర్ణకళాకారుల భవిత కూడా బంగారమే అవుతుంది. కళను గుర్తించండి... ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంత కష్టపడినా ఒక్కోరోజు నాలుగైదు వందలు కూడా రావు. బంగారాన్ని కాల్చి, తీగ తీసి, అత్యంత శ్రద్ధతో ఒక ఆభరణాన్ని తయారు చేయాలంటే ఎంతో టైమ్ పడుతుంది. ఇప్పుడంతా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకే వెళుతున్నారు. మా దగ్గర ఆభరణాలు చేయించుకునేవారు బాగా తగ్గిపోయారు. ప్రస్తుతం మేం ఆర్థికంగానే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. రాబోయే తరాలకు ఈ పని అందించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా పిల్లలను వేరే పనులు చూసుకోమని చెబతున్నాం. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రముఖులు మా పనిని గుర్తిస్తే ఈ కళ బతుకుతుంది. – గోవింద్, స్వర్ణకారుడు ప్రత్యేకమైనది ఏ పని అయినా ఒకసారి చేసి వదిలేయడం వల్ల సరైన ఫలితాలు రావు. ఈ విషయం స్వర్ణకారులను కలిసినప్పుడు మరింతగా అర్ధమైంది. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎంచుకున్న కార్యక్రమం ఇది. దీనికి చాలా మంది ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ ఆలోచన ప్రత్యేకంగా ఉందని అభినందించారు. – శ్రీహర్షిత సాయపడదాం జ్యువెలరీ షాపులు వచ్చాక స్వర్ణకారుల కళానైపుణ్యం ప్రశ్నార్ధకంగానే మారింది. కోవిడ్ తర్వాత వీరి ఇబ్బందులు మరీ పెరిగాయి. కంటిచూపు, గంటలు గంటలు కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఈ విధంగా వారికి సాయం పడటం సంతోషాన్నిచ్చింది. – ప్రకృతి – నిర్మలారెడ్డి -
ఓటీటీలో రిలీజవుతున్న ఆహా 'గోదారి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుత సినీరంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా మరో కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తోంది. గోదారి పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు వివరించేలా స్వాతి దివాకర్ దర్శకత్వంలో డాక్యుమెంటరీని రూపొందించారు. దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. 'ఆహా ఓటీటీ ద్వారా ఈ గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించాం. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నాం.' అని అన్నారు. ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీలో మైలురాయిగా నిలవనుంది. ఇలాంటి డాక్యుమెంటరీలతో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది. త్రింబకేశ్వర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తోందని -
విశ్వవేదికపై ఏనుగుఘీంకారం.. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?
ఏనుగుకి, మనిషికి మధ్య ఉండే భావోద్వేగ బంధం ప్రపంచాన్ని కదిలించింది. విశ్వవేదికపై ఏనుగుఘీంకారం ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టింది.డాక్యుమెంటరీలు తీసే వారికి ఎలిఫెంట్ విస్పరర్స్వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మనిషికి, జంతువుకి, ప్రకృతికి మధ్య ఉండే గాఢానుబంధం మరోసారి చర్చకు వచ్చింది. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?ఏనుగుల సంరక్షణ ఏ విధంగా ఉంది ? ఏనుగంటే మనకి ఒక జంతువు కాదు. అంతకంటే ఎక్కువే. గణనాథుడి మారురూపంగా గజరాజుల్ని పూజిస్తాం.. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు మంచినీళ్లు తాగింది ఏనుగూ అంటూ ఏనుగు మనకెంత ముఖ్యమైనదో చిన్నప్పట్నుంచి ఉగ్గుపాలతో నేర్పిస్తాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏనుగుని చూడడమంటే అదొక సంభ్రమం. కానీ ఏనుగుల్ని కాపాడుకోవడంలో మనం అంతగా శ్రద్ధ కనబరచడం లేదనే చెప్పాలి. ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడడం, ఏనుగుల ఆవాసాలైనా కారిడార్లను ఆక్రమించుకోవడం, ఏనుగుల కారిడార్లలోనే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వంటి చర్యలతో ఏనుగుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సంరక్షణకి ఏం చేస్తున్నాం ? జీవవైవిధ్యానికి అత్యంత కీలకమైన ఏనుగుల్ని కాపాడుకోవడానికి 1992లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ రిజర్వ్ ప్రాజెక్టు 30 ఏళ్లవుతున్నప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. ఏనుగుల్ని కాపాడుకోవడానికి మనకి ప్రత్యేకంగా చట్టాలేమీ లేవు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకే ఏనుగులూ వస్తాయి. దీంతో ఏనుగులు ఆవాసం ఉండే కారిడార్లు, వాటి సంరక్షణకు ఏర్పాటు చేసిన రిజర్వ్‌ల నిర్వహణలన్నీ తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఏనుగులెంత కీలకమో గ్రహించిన కేంద్రం 2010లో ఏనుగుని జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. ఏనుగుల సంరక్షణ విధానాలను సమీక్షించడానికి ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ (ఈటీఎఫ్)ని ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని మార్చాలని, ఏనుగుల సంరక్షణ కోసం జాతీయ ఏనుగుల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అయితే నిధుల కొరతతో ఆ చర్యలేవీ కేంద్రం తీసుకోలేదు. ప్రతీ ఏడాది ఏనుగుల సంరక్షణ కోసం రూ.30–35 కోట్ల నిధుల్ని మాత్రమే కేటాయిస్తున్నారు. 2020లో వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఏనుగుల రిజర్వ్‌లను చేరుస్తూ సవరణలు చేశారు. 2022, ఆగస్టు 2న సవరణ బిల్లుని లోక్‌సభ ఆమోదించింది. అంతకు మించి ఏనుగుల రక్షణకు ప్రత్యేకంగా చర్యలేవీ తీసుకోలేదు.. ఏనుగులు, మనుషులకి మధ్య ఘర్షణ ఏనుగులకి, మనుషులకి మధ్య నిత్యం ఒక ఘర్షణ నెలకొని ఉంటుంది. మనిషి ఎప్పుడైతే అడవుల్ని కూడా ఆక్రమించడం మొదలుపెట్టాడో ఏనుగులు గుంపులు గుంపులుగా పంట పొలాలపైకి పడడం, రైతుల్ని తమ కాళ్ల కింద పడి తొక్కేసి ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నాయి. దీంతో రైతులు ఏనుగుల బారి నుంచి పంటల్ని కాపాడడానికి విద్యుత్ కంచెలు , కందకాలు ఏర్పాటు వంటివి చేయడంతో అవి చనిపోతున్నాయి. ఇక ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో వాటిని అక్రమంగా వేటాడుతున్న వారూ ఉన్నారు. ఏనుగుల కారిడార్లలో రైల్వే ట్రాక్‌లు ఉండడంతో అవి బలైపోతున్నాయి. 1987–2017 మధ్య కాలంలో రైల్వే ట్రాక్‌ల కింద పడి 265 ఏనుగులు మరణించాయి. ఏనుగులు జరిపే దాడుల్లో ఏడాదికి సగటున 500మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ప్రజల చేతుల్లో ఏడాదికి సగటున 100 గజరాజులు మరణిస్తున్నాయి. ఏనుగుల్ని మరింత సంరక్షించాలంటే, అవి ప్రజలు, పంట పొలాల జోలికి రాకుండా ఉండాలంటే ఏనుగులుండే కారిడార్లను పటిష్ట పరచాల్సి ఉంది. దేశంలో 110 ఏనుగు కారిడార్లు ఉన్నప్పటికీ 70% మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 29% కారిడార్లు ఆక్రమణకి లోనయ్యాయి. 66% కారిడార్లలో జాతీయ రహదారుల వెంబడి వెళుతున్నాయి. 22 కారిడార్లలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఏనుగుల తినే తిండి ఎక్కువ కావడంతో అవి ప్రతీ రోజూ చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. అవి సంచరించే మార్గాల్లో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు, మైనింగ్ తవ్వకాలు, కాలువలు, ఫెన్సింగ్‌లు ఉండడం వాటికి దుర్భరంగా మారింది. రైళ్లు, వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ మరణిస్తున్నాయి. అందుకే ఏనుగులు సంచరించే కారిడార్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఏనుగుల సంచారం కోసమే ప్రత్యేకంగా వంతెనలు నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి - సాక్షి, నేషనల్ డెస్క్ -
లోకం మెచ్చిన దర్శకుడు
ఫిల్మ్ మేకర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు కోల్‌కతాకు చెందిన శౌనక్ సేన్.అతడి ఫీచర్–లెంగ్త్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ మన ఫ్యూచర్ గురించి మౌనంగానే ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.జీవజాలంపై కాస్త కరుణ చూపమని చెప్పకనే చెబుతోంది... దిల్లీలోని ఏజెకె మాస్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సెంటర్ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న శౌనక్సేన్ జెఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్థెటిక్స్లో పీహెచ్డీ చేశాడు. ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంటరీ ఫెలోషిప్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా ఫెలోషిప్‌కు ఎంపిక కావడం, కేంబ్రిడ్జి యూనివర్శిటీ అర్బన్ ఎకోలజీస్ ప్రాజెక్ట్‌లో విజిటింగ్ స్కాలర్‌గా భాగం కావడం తన ప్రపంచాన్ని విస్తృతం చేసింది. సేన్‌లోని కళకు సామాజిక స్పృహ తోడైంది.తొలి డాక్యుమెంటరీ ‘సిటీస్ ఆఫ్ స్లీప్’కు పెద్ద పేరే వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేసింది. ఇది న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్‌ఫెస్టివల్, తైవాన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇరవై చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రత్యేక ప్రశంసలు పొందింది. ఆరు అవార్డ్లు అందుకుంది. సేన్ రెండో ఫీచర్ లెంగ్త్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూనే ఉంది.వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్(సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, యూఎస్) గెలుచుకుంది. ‘హాస్యం, వ్యంగ్యం మేళవించి పర్యావరణ విధ్వంసాన్ని కళ్లకు కట్టిన చిత్రం’ అని జ్యూరీ సభ్యులు ప్రశంసించారు. ఈ డాక్యుమెంటరీ మరో ప్రసిద్ధ అవార్డ్ గోల్డెన్ ఐ (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్) గెలుచుకుంది. ‘ఆల్ దట్ బ్రీత్స్’కు సంబంధించిన ప్రపంచవ్యాప్త హక్కులను అమెరికన్ టెలివిజన్ నెట్వర్క్ హెచ్‌బీవో తీసుకుంది.ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మరో ఘనత ఆస్కార్ ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’కు నామినేట్ కావడం.మనుషుల కార్యకలాపాల వల్ల జీవజాలం స్థితిగతుల్లో వస్తున్న మార్పుకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ‘ఎక్కడ పడితే అక్కడ పక్షులు చచ్చిపోయి కనిపిస్తుంటాయి. అయ్యో! అని మనకు అనిపించదు. మన దారిన మనం వెళుతూనే ఉంటాం. రోజువారి పనుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే ఉంటాం. క్షణం కూడా వాటి గురించి ఆలోచించం. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విషాదం!’ అంటుంది ఈ చిత్రంలో ఒక పాత్ర. జీవజాలానికి సంబంధించి మనుషులలోని స్పందనారాహిత్యాన్ని, మొద్దుబారినతనాన్ని దుమ్ము దులుపుతుంది ఆల్ దట్ బ్రీత్స్. మనుషులలోని స్పందనారాహిత్యం గురించి ‘చీమ కుట్టినట్లైనా లేదు’ అంటారు. ‘ఆల్ దట్ బ్రీత్స్’ చీమ నుంచి పిచ్చుక వరకు సమస్త జీవజాలం గురించి ఆలోచించమని చెబుతుంది.‘నేను మాత్రమే..అనే స్వార్థం ఉంటే నువ్వు కూడా మిగలవు’ అనే మార్మిక సందేశాన్ని ఇస్తుంది. ‘యాంత్రికంగా నేచర్–వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు ఎన్ని మంచి పనులు చేస్తున్నారో తెలుసా!లాంటి స్వీట్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. మనం వేగంగా పరుగులు తీస్తున్నాం. ఆ పరుగు కొన్ని నిమిషాల పాటు అయినా ఆపి చుట్టు ఏం జరుగుతుందో అలోచించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ విధానాలకు సంబంధించిన విషయం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటున్నాడు సేన్. సేన్ ఇష్టాల గురించి చెప్పాలంటే...సామాజిక పరిస్థితుల గురించి లోతుగా తెలుసుకోవడం అంటే ఇష్టం. సృజనాత్మకత నిండిన సినిమాలు చూడడం అంటే ఇష్టం. సామాజిక అంశాలకు, సృజనాత్మకత జోడించి తనదైన శైలిలో సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరించడం అంటే మహా ఇష్టం. -
న్యాయం కోసం రణం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాధితుల న్యాయపోరాటం, పోరాటం చేసే క్రమంలో పడుతున్న కష్టాలు... అయినప్పటికీ వెనకడుగు వేయని పట్టుదలకు ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ అద్దం పడుతుంది. ఝార్ఖండ్‌లోని ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా నిషా పహుజా తీసిన ఈ చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచిపామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) వరకు ‘బెస్ట్ డాక్యుమెంటరీ’గా ప్రశంసలు అందుకుంటూనే ఉంది... పదమూడు సంవత్సరాల తన కూతురిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు రంజిత్ అనే రైతు. పోలీసుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక చుట్టాలు, పక్కాలు, గ్రామస్థుల విషయానికి వస్తే...‘జరిగిందేదో జరిగింది. పోయేది మీ కుటుంబ పరువే. కేసు వెనక్కి తీసుకోండి’‘మీ సంగతి ఏమిటోగానీ మన కులం పరువు పోయేట్లు ఉంది. కేసు వెనక్కి తీసుకోండి’‘మన జాగ్రత్తలో మనం ఉండకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతాయి. వారిని మనం ఏం చేయలేము. కేసు వెనక్కి తీసుకోండి’ఎవరు ఎలా స్పందించినా, ఆ స్పందనలో చివర గట్టిగా వినిపించే మాట... కేసు వెనక్కి తీసుకోండి. అయితే రంజిత్ వీరి ఉచిత సలహాలను పట్టించుకోలేదు. పోరాటదారిని వదలలేదు. ఈలోపు బెదిరింపులు పెరిగాయి. ‘కేసు ఉపసంహరించుకుంటావా లేదా?’ అని గ్రామస్థులనుంచి ఒత్తిడి పెరిగింది. రంజిత్ చేస్తున్న న్యాయపోరాటానికి శ్రీజన ఫౌండేషన్ అండగా నిలిచింది. మహిళల హక్కుల గురించి పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ ఇది. స్థూలంగా చెప్పాలంటే ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీ కథ ఇది.అయితే ఇది కాల్పనిక కథ కాదు.ఝార్ఖండ్‌లోని బెరో జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల సమాహారం.డైరెక్టర్, రైటర్ నిషా పహుజా ‘టు కిల్ ఏ టైగర్’ రూపకర్త.కెనడియన్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపుపొందిన నిషా దిల్లీలో పుట్టింది. కెనడాలోని టోరంటోలో పెరిగింది. చిన్నవయసులోనే తల్లిదండ్రులతోపాటు కెనడాకు వెళ్లిన నిషా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. బాలీవుడ్ సినిమాలు చూస్తూనే పెరిగింది.‘యూనివర్శిటీ ఆఫ్ టోరంటో’లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్న నిషా రకరకాల సామాజిక ఉద్యమాల్లోపాల్గొంటోంది. డాక్యుమెంటరీ రీసెర్చర్‌గా పేరు తెచ్చుకుంది.కాలేజీ రోజుల నుంచే నిషాకు రచన, దర్శకత్వం అనేవి ఇష్టమైన సబ్జెక్ట్‌లు. కెరీర్ ప్రారంభంలో రీసెర్చర్‌గా కెనడియన్ ఫిల్మ్‌మేకర్స్ జాన్ వాకర్, అల్ కజిమ్లతో కలిసి పనిచేసిన నిషా చిత్ర నిర్మాణంపై కొంత అవగాహన, అనుభవం వచ్చాక డైరెక్టర్‌గా అడుగులు వేసింది. తక్కువ కాలంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమర్షియల్ డైరెక్టర్‌గా రాణించాలనేది ఆమె కల కాదు. వాస్తవ సంఘటనలనే చిత్రాలుగా తీయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ‘చిత్రం ఎంత వాస్తవికంగా ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవుతారు’ అంటుంది నిషా. 2012లో వచ్చిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ ఆమెలో రచన, దర్శకప్రతిభను ప్రపంచం దృష్టికి వచ్చేలా చేసింది. భారతీయ సమాజానికి చెందిన అమ్మాయిల జీవితంలో సంక్లిష్టతలు, వైరుధ్యాలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడంతోపాటు ఎంతో చర్చను రేకెత్తించింది. ఇక ‘టు కిల్ ఏ టైగర్’ విషయానికి వస్తే మొదట ఈ చిత్రాన్ని తీయాలనుకోలేదు నిషా. ఝార్ఖండ్‌లోని ఒక స్వచ్ఛందసంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి చిత్రం చేయాలని రంగంలోకి దిగినప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన గురించి విన్నది. బాధితురాలు, ఆమె తండ్రితో మాట్లాడింది. మొదట తాను తీస్తున్న చిత్రంలో భాగంగానే బాధితురాలి గురించి చెప్పా లనుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ఈ సంఘటననే చిత్రంగా తీయాలని నిర్ణయించుకుంది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ నుంచి (హాట్ డాక్స్) కెనడియన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్ వరకు ఎక్కడో ఒకచోట ‘టు కిల్ ఏ టైగర్’ గురించి ప్రస్తావన, ప్రశంస వినిపిస్తూనే ఉంది. ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉంది. -
పాలనా రథానికి ప్రజలే రక్ష!
భారతీయులు 140 కోట్ల మంది తనకు రక్షా కవచంగా ఉన్నారని ప్రధాని అన్నారు. మరి అలాంటప్పుడు ఒక డాక్యుమెంటరీని ఎందుకు అంతగా ప్రభుత్వం వ్యతిరేకించింది? భారత సమాజ పరిస్థితులు, ప్రభుత్వ చర్యల గురించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని ఇది కాలరాయడం కాదా? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమని నమ్మిన నాయకులున్నారు. కానీ జాతీయోద్యమ నాయకుడైన మహావీర్ త్యాగి ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని వాదించారు. ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే హక్కును ప్రజలకు దఖలు పరచాలన్నారు. ‘‘నా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను దేశ ప్రజలు నమ్మ బోరు. 140 కోట్లమంది భారతీయులూ నాకు రక్షణగా, సురక్షితమైన కవచంగా ఉన్నారు.’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (8 ఫిబ్రవరి 2023) గుజరాత్లో 2002లో మైనారిటీలపై జరిగిన మూకుమ్మడి హత్యా కాండ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన చేస్తూ– గుజరాత్ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, ఆ తర్వాత వారాల తరబడి సాగిన హింసాకాండను అదుపు చేయలేక పోయిందనీ నిశితంగా విమర్శించింది. అంతేగాదు, గత 20 సంవత్సరాలుగానూ దేశవ్యాప్తంగా వివిధ బాధ్యతాయుత సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల నాయకులు ఈ విపరిణామాన్ని ఖండిస్తూ వచ్చారు. అయినా 2002 నాటి గుజరాత్ హింసాకాండను ప్రోత్సహించిన బాధ్యు లెవరిపైనా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు. గుజరాత్ ఊచ కోతలపై ‘ఇండియా – ది మోదీ క్వశ్చన్’ మకుటం కింద ఒక డాక్యు మెంటరీని ‘బీబీసీ’ విడుదల చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ ‘భారతదేశ సార్వభౌమాధికారాన్ని, నిజాయితీని అవమాన పరుస్తోం’దన్న పేరిట సామాజిక మాధ్యమాలన్నిటి నుంచి ప్రభుత్వం తొలగించింది. భారత సమాజ పరిస్థితుల గురించి, ప్రభుత్వ చర్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని కాలరాయడం పట్ల శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తదితర విద్వత్ సంపన్నులు 500 మందికి పైగా విస్మయం వ్యక్తం చేశారు. పరిణామాలకు అద్దం నిజానికి ‘బీబీసీ’ డాక్యుమెంటరీ వచ్చింది గుజరాత్ మారణకాండ అనంతరం 20 సంవత్సరాలకు. అంతకుముందే 2010 నాటికే రాణా అయూబ్ ‘గుజరాత్ ఫైల్స్’ పేరిట గుజరాత్ బీజేపీ పాలకవర్గ ‘మాలోకా’న్ని ప్రత్యక్షరబద్ధంగా నమోదు చేసింది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రాసింది మరెవరో కాదు, సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ. ‘ఈశావాప్యోపనిషత్’లో కళ్లు తెరిపించే ఒక సూక్తి ఉంది: ‘‘నిజం అనే ముఖాన్ని కనపడనివ్వకుండా ఓ బంగారు కుండీలో దాచి ఉంచుతారు. అసలా జలతారు కుండీలో దాగిన నిజమేమిటి?’’ అలాగే నిజమనేది కట్టుకథకు అందని వాస్తవం! అలాంటి ‘గుజరాత్ వాస్తవాల’ను రాణా అయూబ్ సాహసంతో బహిర్గతం చేసిందని శ్రీకృష్ణ కితాబిచ్చారు. ‘అయూబ్ రచన పరి శోధనాత్మక పాత్రికేయ విధి నిర్వహణలో ఒక సాహస యాత్ర. పాలనా రంగంలో నానాటికీ పెరిగిపోతున్న నిజాయితీకి పాతరేసి, దొంగచాటు రాజకీయ కుట్రలకు మార్గం తీస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని పేర్కొన్నారు. రాజ్యాంగ రచనా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అంబేడ్కర్, భారత ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైనందున అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అభిప్రాయంతో జాతీయోద్యమ నాయకుల్లో ఒకరైన మహావీర్ త్యాగి(1899–1980) విభేదిస్తూ, అంబేడ్కర్ లాగా ఇలాంటి అభిప్రాయాలు కల నాయకులెవరైనా ఉంటే వారు అలాంటి ప్రకటనలు చేయబోయేముందు కొన్నాళ్లు జైలులో ఉండొస్తే మంచిదని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు! ఆ పిమ్మట త్యాగి, రాజ్యాంగ రచన ముసాయిదా సంఘానికి సవాలుగా ఒక ప్రతిపాదన చేస్తూ, ప్రజలకు ఆమోదించిన ప్రాథమిక హక్కుల్ని ముందుముందు ఏర్పడబోయే ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే లేదా మార్చేసే హక్కును ప్రజలకు దఖలు పరిచే అంశాన్ని చర్చించారా లేదా అని ప్రశ్నించారు. ప్రజలకున్న అలాంటి సహజమైన హక్కుకు మీరు గ్యారంటీ ఇవ్వలేదని త్యాగి విమర్శిస్తూ ప్రభుత్వ హక్కులతోపాటు ప్రజల హక్కుల్ని గురించి కూడా ఆలోచించా లన్నారు. ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని త్యాగి వాదించారు. అందుకు పూర్తిగా సమ్మ తిస్తూ డాక్టర్ అంబేడ్కర్, ఉత్తరోత్తరా ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు ఊహపై ఆధారపడి) పైన వ్యక్తుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టే స్వేచ్ఛను భావిప్రభుత్వాలకు అనుమతించే ప్రసక్తి ఉండరాదని పలుమార్లు స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ప్రజాస్వామ్యం, ఎన్నికల మాటున ‘ఓటు’ ఎరలోనూ షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా ఎన్నికల పేరిట సంపన్న వర్గాలు, కుల, మత, రాజకీయ పక్షాలూ చేసిందీ, చేస్తున్నదీ – అన్ని కులా లలోని పేదలు, అణగారిన ప్రజలు చైతన్యం పొందకుండా జాగ్రత్త పడటం మాత్రమే. అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగ ప్రతిని వెలుగు చూడకుండా రాజ్యాంగ రచనా సంఘంలోని కొందరు సభ్యులు విశ్వ ప్రయత్నం చేశారు. అడ్డదారులలో ఎన్నికల పేరిట కుల, మత సంపన్న వర్గాల సభ్యులు హెచ్చుమంది ఎలా అనతికాలంలోనే ‘కుబేర సంతానం’గా మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే, తారుమారు చేయడానికి వెనుదీయడం లేదో ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. రాజ్యం కార్పొరేట్ ఎస్టేట్ వ్యాపారంగా ఎలా మారిపోయిందో రుజువై పోయింది. స్వతంత్రంగా వ్యవహరించాలి 1951 మేలోనే కేంద్ర, రాష్ట్ర శాసన వేదికల్లోకి ప్రవేశించడానికి ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలో ‘ప్రజా ప్రాతినిధ్య బిల్లు’ను అంబేడ్కర్ ప్రవేశపెడుతూ అవసరమైన సవరణలను కూడా ప్రతి పాదించారు. వాటిలో ప్రధానమైనవి – పార్లమెంట్, ఎన్నికల చట్టం పార్లమెంట్ సభ్యుల స్వేచ్ఛను ప్రభుత్వ స్వేచ్ఛను భిన్నమైనవిగా భావించాలి. మొత్తం పార్లమెంట్‌ను అవినీతికి ‘పెద్ద బిడ్డ’గా మార్చ కుండా ఉండే విధంగా సభనూ, ఎన్నికల చట్టాన్నీ రూపొందించాలి. పార్లమెంట్ సభ్యులకు రాజకీయ పదవులను కట్టబెట్టడం ద్వారా లేదా ఇతర ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మొత్తం పార్లమెంట్‌ను లేదా శాసన వేదికలను అవినీతిపాలు చేసేలా ప్రభుత్వానికి అవకాశం కల్పించకూడదు. దానికి తగిన విధంగా మన శాసన వేదికలు, పార్ల మెంట్, ఎన్నికల చట్టమూ ఉండాలని అంబేడ్కర్ అభిలషించారు. పార్లమెంట్ లేదా శాసన వేదిక అనేది నిర్భీతిగా, ప్రభుత్వం నుంచి ఏ ప్రలోభాన్ని ఆశించకుండా స్వతంత్రంగా వ్యవహరించలేని నాడు అలాంటి శాసన వేదికలు నిష్ప్రయోజనకరం. శాసన వేదికలు ప్రభు త్వాలు చెప్పే మాటలకు డూడూ బసనన్నలుగా, నట, గాయక వందిమాగధులుగా వ్యవహరించరాదని కూడా అంబేడ్కర్ (1951 మే 9) నిర్మొహమాటంగా పేర్కొన్నారని మరచి పోరాదు. పార్లమెంట్ ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా (వ్యాపార లావాదేవీల కేంద్రం) ఇప్పటికే (1951 నాటికే) మారిపోయిందని పండిట్ లక్ష్మీకాంత మైత్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంప్రదాయానికి 75 ఏళ్లకు కూడా ‘కళ్లెం’ వేయడానికి పాలకులకు ఇష్టం లేదు. దీనివల్ల పాలకులు ప్రయోజనం పొందడం సహజం. కనుకనే న్యాయ వ్యవస్థ తన జడత్వాన్ని క్రమంగా వదిలించుకుని చైతన్యావస్థలోకి వచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోగల సత్తాను సంతరించుకుంటోంది. అందుకే కవి కుమారుడు ఎంతటి కమ్మని సూక్తిని విడిచి వెళ్లాడో గదా – ‘‘బలవంతపు రాజ్యకాంక్షా ఒక పాపము జూచునే ఈశ్వరా?’’! తన ‘బీదతనం’ దేశ దారిద్య్రమనీ, తన మరణం లోక ప్రళయమనీ భావించి సంచరించే అహంకారుల గురించి సుమతీ శతకకారుడు హెచ్చరించలేదూ?! abkprasad2006@yahoo.co.in -
డాక్యుమెంటరీపై మాటల సెల్ఫ్ గోల్
గుజరాత్లో 2002లో జరిగిన హింసపై ‘బీబీసీ’ నిర్మించిన తాజా డాక్యుమెంటరీని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఖండించారు. తాను దాన్ని చూడలేదని పేర్కొంటూనే, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, తప్పుడు వాదనతో, ప్రచార యావతో తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు... బీబీసీ తాజా డాక్యుమెంటరీపై కనీసపాటి ఆలోచన కూడా లేకుండా తీవ్ర ధోరణిలో మాట్లాడారు. భారతదేశ సార్వభౌమత్వాన్నీ, సమగ్రతనూ ఆ డాక్యుమెంటరీతో కించపర్చారంటూ వారు ఆరోపించారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? వారు వ్యక్తం చేసిన ఆందోళన బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశ మనుగడ పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టుగా తయారైంది. తప్పుగా మాట్లాడటం ద్వారా వారు తమ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించేకొద్దీ, నిజానికి సమస్య మనలోనే ఉందని చెబు తాను. సాధారణంగా రాజకీయ నాయకుల వద్ద ప్రతి సమస్యకూ పరిష్కారం ఉండాలనీ, ప్రతి సమ స్యపై వారు వ్యాఖ్యానించాలనీ, ప్రతి వ్యక్తికి సంబంధించి అర్థవంతమైన, కచ్చితమైన అభిప్రా యాన్ని కూడా కలిగి ఉండాలనీ, అన్ని పరిస్థితు లనూ వారు అర్థం చేసుకోవాలనీ మనం భావిస్తుంటాం. కాని వారు అలా చేయలేరు. అది వారికి సాధ్యం కూడా కాదు. అలాగని తాము దేన్నయినా సరే... చేయగలమని వారు నటించినట్లయితే దానిని మనం వారిని అగౌరవించాల్సిన పని లేదు. సూటిగా చెప్పాలంటే, రాజకీయ నాయకులు వారి పట్ల మనకు ఉందనుకుంటున్న గౌరవాన్ని కోల్పో వలసిన అవసరం లేదు. అయితే వారు గుర్తించనిది ఏమిటంటే, మన అంచనాలు వారికి ఒక ఉచ్చు లాంటివి. ఆ సంగతి వారు స్పష్టంగా గ్రహిస్తూనే, గర్విస్తూనే మనం ఏర్పరచిన ఉచ్చులో చిక్కుకుంటూ ఉంటారు. ఇవాళ ఆలోచనాత్మకమైన, మేధాసహితమైన స్పందనల కంటే ఆకట్టుకునేలా అభిప్రాయాలు వెల్లడించడమే ఎక్కువ అవసరమని రాజకీయ నాయకులు భావించే దశకు మనం చేరుకున్నాం. ఎందుకంటే, వీటిలో ఆకర్షణీయమైన స్పందనే పతాక శీర్షికలకు ఎక్కుతుంది. అది వారికి ప్రచా రాన్ని కల్పిస్తుంది. మరోవైపున ఆలోచనతో కూడిన స్పందన మరింత అర్థవంతంగానూ, సహాయకారి గానూ ఉండవచ్చు కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి కాస్త ఏకాగ్రత అవసరమవుతుంది. కాబట్టి పునః పరిశీలనకు అది పిలుపునిస్తుంది. పైగా ఆకర్షణీయ మైన స్పందనకు సరిసమానమైన ప్రభావాన్ని మేధాసహితమైన స్పందన కలిగించనే కలిగించదు. ‘షారుఖ్ ఖాన్ ఎవరు? అతడి గురించి నాకేమీ తెలీదు’ అని అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇటీవల చేసిన ప్రకటన దీనికి అత్యుత్తమ మైన ఉదాహరణ అని నేను చెబుతాను. గౌహతిలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్య అత్యంత వివాదాస్పద మైంది. అంతేకాదు. ఆయన మాటల్లో అసలు నిజం లేదు. ఒకవేళ ఆయన వ్యాఖ్య గనక నిజమే అయితే... మన దేశంలోని ప్రజల గురించి ఏ మాత్రం తెలియని స్థితిలో సదరు అస్సామ్ ముఖ్య మంత్రి ఉన్నారని చెప్పక తప్పదు. నిజానికి ఆయన చేసిన ఆ ప్రకటన అమితాబ్ బచ్చన్ స్వయంగా ‘నరేంద్ర మోదీ ఎవరు? ఆయన గురించి నాకేమీ తెలీదు’ అని చెప్పినట్టు ఉంది. ప్రముఖ హిందీ సినీ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఎవరో తెలియని భారతీయులు ఎవరైనా ఉంటారా అని నాకు సందేహం. అలాగే, భారతీయ జనతా పార్టీ నేత – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కూడా తెలియనివారు ఉన్నారంటే కూడా సందేహించాల్సి ఉంటుంది. అందుకనే అస్సామ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యను జనం దృష్టిని ఆకర్షించడానికి, జనం తమను ఏదో ఒకలా గుర్తుంచుకునేలా చేసే తప్పుడు ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో అన్నీ తప్పుడు అంశాలే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. విషాదం ఏమిటంటే, కనీసపాటి ఆలోచన కూడా లేకుండా షారుఖ్ ఖాన్ గురించి అలా మాట్లాడటం వల్ల అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ దేశవ్యాప్తంగా మూర్ఖుడిగా మారిపోయారు. 2002 నాటి గుజరాత్ హింసపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీని విమర్శించి, ఖండించాలన్న ఉద్దేశంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి కూడా దాదాపు ఇలాంటి పనే చేశారు. ఆ డాక్యుమెంటరీని తాను చూడలేదని ఒప్పుకుంటూనే, నిర్దిష్టంగా ఒక తప్పుడు వాదనను జనంలోకి తీసుకుపోవడానికి, ప్రచారమే పరమావధిగా తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. పైగా అది పక్షపాతంతో కూడుకున్నదనీ, దాంట్లో నిష్పా క్షికత లోపించిందనీ నిందించారు. అయితే బీబీసీ తాజా డాక్యుమెంటరీని చూడ నప్పుడు దాంట్లోని విషయాలను ఆయన ఎలా ప్రస్తావించారు? అది కూడా తానొక అధికారిక ప్రతి నిధి అయ్యుండి, తాను చూడని విషయంపై ఎలా వ్యాఖ్యానించారు అనే ప్రశ్న వస్తుంది. అయితే తాను దేని గురించి మాట్లాడుతున్నదీ తనకు స్పష్టంగా తెలుసన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వర్ణనలు ఉన్నాయి. అధికారిక ప్రతినిధి చేసే ప్రక టన సాధికారికంగా ఉంటుందనీ, విశ్వసించదగిన దనీ ఎవరైనా భావిస్తారు. వాళ్ళూ వీళ్ళూ చెబుతుంటే విని చెబుతున్నట్టుగా, వేరెవరి అభిప్రాయాలో మళ్లీ ప్రస్తావించినట్టుగా ఉంటాయనీ, ఉండాలనీ ఎవరూ అనుకోరు. కానీ ఆయన తాజా వ్యాఖ్య లన్నీ అచ్చంగా అలాగే ఉన్నాయని గ్రహించాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలకూ, సంస్థలకూ చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారులు దాదాపుగా దేశంలోని అన్ని పత్రికలతో మాట్లాడారు. బీబీసీ తాజా డాక్యుమెంటరీపై తమ వాదనను బలంగా వినిపించడం కోసం కనీసపాటి ఆలోచన అయినా కూడా లేకుండా వారు తీవ్ర ధోరణితో మాట్లాడారు. ఆ తొందరలో చివరకు భారతదేశం గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలు పొడసూపేలా చేశారు. ఆ డాక్యుమెంటరీలో భారత సార్వభౌమత్వాన్నీ, సమ గ్రతనూ కించపర్చారంటూ వారు ఆరోపించారు. నిజమా? నిజంగానే అలా జరిగిందా? ఇంతకూ వారు గుర్తించని విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే – తాము ఏం మాట్లాడు తున్నాం అనే విషయం గురించి వారు కనీసం ఒక్కసారి కూడా ఆగి, నింపాదిగా ఆలోచించలే పోయారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? పైగా యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్రచార, ప్రసార వేదికలను వాడేవారు మన జనాభాలో అతి తక్కువమంది అని తప్పక గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ కొద్దిమంది ఆ డాక్యుమెంటరీ చూసినంత మాత్రాన మన జాతీయ చట్రమే కదిలి పోతుందా? విచ్ఛిన్నమవుతుందా? చివరకు వచ్చేసరికి వారు వ్యక్తం చేసిన ఆందోళన అంతా బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశంలోని పరిస్థితి పైనా, దేశ మనుగడకు సంబంధించిన అంశం పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టు అయింది. అలా వారు దాన్ని గురించి తప్పుగా మాట్లాడటం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు మన ప్రియమైన ముఖ్యమంత్రి, మన అధికార ప్రతినిధి, అలాగే నిగూఢమైన మన ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ విషయంపై భయకంపిత స్వరంతో మాట్లాడి ఉన్నట్లయితే నేను దానికి ఏమాత్రం భయపడను. బదులుగా ముసి ముసిగా నవ్వుకునేవాడిని. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది!
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది! -
‘జామియా’లో డాక్యుమెంటరీ కలకలం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థి సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటలో కలకలం రేపింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు ప్రకటించారు. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంటరీ ఎందుకొచ్చింది? తిరువనంతపురం: బీబీసీ డాక్యుమెంటరీని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తప్పుబట్టారు. ‘జీ20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇదే సమయానికి బీబీసీ డాక్యుమెంటరీ తేవడం ఏంటి?’ అని ప్రశ్నించారు. -
డాక్యుమెంటరీ అంతా డొల్లతనమే!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ గతవారం ప్రసారం చేసిన డాక్యుమెంటరీ.. ‘ఇండియా : ది మోదీ క్వశ్చన్’ ప్రపంచవ్యాప్తంగా పెను వివాదాన్ని రాజేసింది. డాక్యుమెంటరీపై ఇండియా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ లింకులను తక్షణం బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ డాక్యుమెంటరీలోని అంశాలను తాను పూర్తిగా అంగీకరించడం లేదని ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అమెరికా స్పందించింది. ‘భారత్–అమెరికా’ భాగస్వామ్య విలువలే తమకు ముఖ్యం అంటూ.. వివాదానికి దూరంగా జరిగింది! కాగా, 2002 నాటి గుజరాత్ అల్లర్లు కేంద్ర బిందువుగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సమయంలోనే భారత్‌లోని ఆ సంస్థ రిపోర్టర్ ఒకరు గత 20 ఏళ్లలో దేశంలో భారీస్థాయి హింసాత్మక సంఘటనలు తగ్గిపోయాయని ఒక కథనం ప్రసారం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డాక్యుమెంటరీ వ్యవహారం చూస్తూంటే... మిగతా విపరిణామాలతో పాటూ భారత్‌తో యూకే సంబంధాలూ దెబ్బతినే ప్రమాదం ఉందేమో అనిపిస్తోంది. ‘ద బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ) యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ అధికార ప్రజా ప్రసార సంస్థ. రాయల్ ఛార్టర్ కింద ఏర్పాటైంది. బీబీసీకి ఆర్థిక నిధులు ప్రధానంగా యూకే ప్రజల నుంచి వసూలు చేసే లైసెన్స్ ఫీజు ద్వారా అందుతాయి. ఇలా ప్రజల సొమ్ము బీబీసీకి ఇవ్వడంపై ఇటీవల విమర్శలూ వచ్చాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రేక్షకులు, వీక్షకులు.. ఓటీటీలతో పాటు, ఇతర డిజిటల్ మాధ్యమాల వైపు మళ్లుతూండటం, బీబీసీ సంపాదకీయ వర్గ పోకడలపై తీవ్రమైన ప్రశ్నలు వస్తూండటం, రాజకీయ వివక్ష వంటివి ఆ కారణాల్లో కొన్ని. తాము స్వతంత్రంగానే ఉన్నామని, నిష్పాక్షికంగానే వ్యవహరిస్తున్నామని బీబీసీ చెబు తున్నా దేశపు వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు అది బ్రిటిష్ నిఘా వర్గాలకు సాయంగా నిలవడం దశాబ్దాలుగా జరుగుతున్న విషయంబహిరంగ రహస్యం కూడా. వివక్షాపూరితం భారత్‌లో ఇటీవలి కాలంలోనూ బీబీసీ సంపాదకీయ వర్గం పోకడలు వివక్షాపూరితంగా ఉన్న ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ‘సిటిజన్ షిప్ ఎమెండ్మెంట్ యాక్’్టపై ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో బీబీసీ రెచ్చగొట్టేలా వ్యవహరించిందని, కోవిడ్ మరణాలపై కూడా సున్నితంగా వ్యవహరించలేదని ఆరోపణలున్నాయి. అందుకే.. బీబీసీ ప్రధాని నరేంద్రమోదీ, ముస్లిం సమాజాలను కేంద్రంగా చేసు కుని రెండు భాగాల డాక్యుమెంటరీ ప్రసారం చేయాలని నిర్ణయించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఈ డాక్యుమెంటరీల్లో తొలి భాగం జనవరి 17వ తేదీ ప్రసారమైంది. ఆ డాక్యుమెంటరీని చూస్తే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. యూకే ప్రజల సొమ్ముతో నడిచే బీబీసీ... భారత్ లాంటి దేశాల్లో వాణిజ్య అవసరాల కోసమే పనిచేస్తూండవచ్చునని అనుకోవచ్చు. మరిన్ని ఎక్కువ క్లిక్‌లు వచ్చేలా శీర్షికలు పెట్టడం కూడా అందుకే. అయితే 2002 నాటి గుజరాత్ అల్లర్లు కేంద్ర బిందువుగా బీబీసీ ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సమయంలోనే భారత్ లోని ఆ సంస్థ రిపోర్టర్ ఒకరు గత 20 ఏళ్లలో దేశంలో భారీస్థాయి హింసాత్మక సంఘటనలు తగ్గిపోయా యని ఒక కథనం ప్రసారం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత్‌లో మతాల మధ్య అంతరాన్ని ఉపయోగించుకోవాలని బీబీసీ ఎందుకు అను కుంటోందన్నది పెద్ద ప్రశ్న. అది కూడా పెద్దపెద్ద ఘర్షణలనేవి దాదాపుగా లేని ఈ పరిస్థితుల్లో? ఈ విషయాలను కాసేపు పక్కనబెట్టినా ఈ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్ల విషయాన్ని చూపిన విధానంపై మాత్రం నిశిత పరిశీలన జరపాల్సిందే. ఎందుకంటే.. ఈ దేశపు అత్యున్నత న్యాయ స్థానం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసిన అంశంపై ఈ డాక్యుమెంటరీ మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంతేకాదు.. భారత్, యూకేల మధ్య దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీసేలా ఉందీ డాక్యుమెంటరీ. తొలి భాగం మొత్తం 2002 నాటి గుజరాత్ మతఘర్షణలు తరువాతి పరిణామాలపై తీశారు. బీబీసీ ఆ కాలంలో తీసిన వీడియో ఫుటేజ్‌లు, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో జరిపిన ఇంట ర్వ్యూలను ఈ డాక్యుమెంటరీలో వాడుకున్నారు. ఇది ఓ తప్పుడు వాదన తాలూకూ పునరుక్తి మినహా మరోటి కాదు. ఈ రకమైన వాదనతోనే అల్లర్లపై ఇరవై ఏళ్లపాటు కోర్టు కేసులు నడిచాయి. ఆ తరువాత సుప్రీంకోర్టు వాటిని చెత్తబుట్టలో వేసేసింది. గుర్తు తెలియని మోదీ వ్యతిరేకులపై ఆధారపడుతూ చేసిన ఈ డాక్యుమెంటరీ కొత్తగా చెప్పేదేమీ లేదు... పాతగాయాలను మళ్లీ రెచ్చగొట్టి కోపం, విద్వేషా లను పెంపొందించడం మినహా! ఘటనల క్రమాన్ని మార్చింది ఈ డాక్యుమెంటరీలోని మొత్తం విషయంలో ఐదు అంశాల గురించి వివరణ అవసరమవుతుంది. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది ఘటనల క్రమాన్ని మార్చిన విధం. 2002 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా ఘటన తరువాత డిసెంబరులో గుజరాత్ ఎన్నికలు జరిగినట్లు చూపించారు. వర్గాలుగా చీల్చే ప్రయత్నం అన్నమాట. ఈ క్రమంలో సెప్టెంబరులో అక్షరధామ్‌పై జరిగిన ఉగ్రదాడి గురించి అస్సలు ప్రస్తావనే లేదు. అలాగే అక్షరధామ్ దాడి తరువాత పరిస్థితిని అత్యద్భుతంగా చక్కదిద్దిన వైనమూ లేకుండా పోయింది. ఇక రెండో విషయానికి వద్దాం. అది.. హింసకు సంబంధించిన లెక్కల్లోని డొల్లతనం. కొన్ని ఘటనలను పెద్దవిగా చూపేందుకు గ్రాఫిక్‌లు కూడా వేశారు కానీ.. 2002 అల్లర్లను పోలీసులు ఎలా అదుపు చేశారన్న విషయంలో వాస్త వాలను విస్మరించారు. మొత్తం 4,247 కేసులు నమోదయ్యాయనీ, 26,974 మందిని అరెస్ట్ చేశారనీ, గుంపులను చెదరగొట్టేందుకుఏకంగా 15,369 భాష్పవాయు గోళాలు వాడారనీ, తొలి 72 గంట ల్లోనే పోలీసులు 5450 రౌండ్ల బుల్లెట్లు ప్రయోగించిన ఫలితంగా 101 మంది ఆందోళనకారులు మరణించారనీ బీబీసీకి తెలియకుండా ఏమీ ఉండదు. బీబీసీ డాక్యుమెంటరీతో వచ్చిన మూడో చిక్కే మిటంటే.. వాళ్లూ వీళ్లూ చెప్పిన విషయాలపై ఎక్కువగా ఆధార పడటం. సాక్షులు, సాక్ష్యాలు ఏవీ కొత్తగా లేకపోవడం. నిజానికి రెండు దశాబ్దాలపాటు నరేంద్ర మోదీని ఏదో ఒకరకంగా వ్యక్తిగతంగానైనా 2002 అల్లర్లలో ఇరికించాలని బోలెడన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు,సందేహాస్పద వ్యక్తుల మాటలపై ఆధారపడి చేసినవే. న్యాయ స్థానాలు వీటి డొల్లతనాన్ని ఎప్పుడో తేల్చేశాయి. ఊరూపేరూ లేని వారి మాటలను వ్యాప్తి చేయడం.. అపవాదులు మోపడం మాత్రమే నని స్పష్టం చేశాయి. నాలుగవ సమస్య గురించి చూద్దాం. ఇందులో వ్యక్తు లను ఉదాహరించిన పద్ధతి ప్రశ్నార్థకమైంది. సుప్రీంకోర్టు సమగ్రతను ప్రశ్నించేలా ఉన్నాయి ఇవి. చివరదైన ఐదవ సమస్య... బ్రిటిష్ దౌత్య కార్యాలయం నిర్వహించిందని చెబుతున్న రహస్య విచారణ. ఇందులో సత్యమెంతో, అవాస్తవాలెన్నో ఎవరికీ తెలియదు. చిచ్చు పెట్టేందుకే... అయితే.. ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి రహస్య విచారణపై అధికారికంగా ప్రకటన చేయడం వివాదా స్పద పోకడకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. బీబీసీ తనదైన విదేశీ విధానాన్ని అమలు చేయాలని.. దౌత్యపరమైన ఇబ్బందులతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్‌లో మరోసారి మత ఘర్షణల చిచ్చు పెట్టేందుకు బీబీసీ చేసిన ఈ ప్రయత్నం.. తుది శ్వాస తీసుకుంటున్న తరుణంలో మనుగడ కోసం చేసిన నిష్ఫల ప్రయత్నంగా తోస్తోంది. బీబీసీ అధ్యక్షుడు ఇటీవల బీబీసీ ఏర్పాటు ఉద్దేశాల్లో పబ్లిక్ సర్వీస్ అన్నది తొలిగి పోయేలా ఉందని వ్యాఖ్యానించడం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ డాక్యు మెంటరీ వ్యవ హారం చూస్తూంటే... భారతీయ ప్రజాస్వామ్య సుస్థిరతను, అత్యు న్నత ప్రభుత్వ సంస్థల సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ.... బీబీసీ పబ్లిక్ సర్వీసును పూర్తిగా వదులుకోవడమే కాకుండా.. భారత్‌తో యూకే సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. వెంపటి శశి శేఖర్ వ్యాసకర్త ప్రసార భారతి మాజీ ఛైర్మన్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
Barefoot Empress: పోరాడే వాళ్లకో ప్రేమలేఖ
‘ఏదైనా సాధించాలనుకుని పోరాడే వాళ్లకు ఈ డాక్యుమెంటరీ ఒక ప్రేమలేఖ’ అంటాడు అంతర్జాతీయ చెఫ్ వికాస్ ఖన్నా. 94 ఏళ్ల వయసులో పట్టుబట్టి కేరళ సాక్షరతా మిషన్‌లో నాలుగో క్లాసు పాసైన కార్తాయని అమ్మ మీద అతడు ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఆ డాక్యుమెంటరీ త్వరలో భారతప్రేక్షకుల కోసం రిలీజ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ ఆడపిల్లలందరినీ చదివించక తప్పని స్ఫూర్తినిస్తుంది అంటున్నాడు వికాస్. అంతర్జాతీయ వంటగాడిగా ఖ్యాతి పొందిన వికాస్ ఖన్నాకు నానమ్మ వయసు ఉన్న వారు ఇచ్చే స్ఫూర్తి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే అతడు జన్మతః కాళ్లలో ఇబ్బందితో పుట్టాడు. అంటే 13 ఏళ్ల వరకు పరిగెత్తడం అతనికి సాధ్యం కాలేదు. దాంతో ఆడుకోవడానికి వెళ్లేవాడు కాదు. అందువల్ల అతడి నానమ్మ అతణ్ణి తన వంటగదిలో కూచోబెట్టుకుని వంటలు చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పేది. ఆమె వల్ల అతను స్ఫూర్తి పొందాడు. అంతే కాదు గొప్ప వంటవాడు అయ్యాడు. ఇప్పుడు బహుశా కేరళ కార్తాయని అమ్మను చూసినప్పుడు అతనికి తన నానమ్మ గుర్తుకు వచ్చి ఉంటుంది. కార్తాయని అమ్మ 96 ఏళ్ల వయసులో చదువుకోవాలని సంకల్పించింది. పల్లెల్లో వయోజనులు చదువుకోవడం గురించి ఆలోచనే ఉండదు. ఇక 90 దాటిన వారిని ‘ఇంకా పిలుపు రాలేదా’ అన్నట్టు చూస్తూ ఉంటారు కొందరు. అలాంటిది కేరళలోని అలెప్పి జిల్లా ‘చెప్పడ్’ అనే చిన్న ఊళ్లోని కార్తాయని అమ్మ అందరి అంచనాలు తారుమారు చేసింది. కేరళ ప్రభుత్వం వయోజనుల కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్యతా కార్యక్రమం కింద ఇంట్లో ఉండి చదువుకుని నాలుగో తరగతిని వందకు 98 మార్కులతో పాసయ్యింది. 15 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారికి కనీస చదువు నేర్పాలనుకున్న ఈ కార్యక్రమంలో కార్తాయని అమ్మ ఉత్సాహంగా దూకింది. చదవడం (30 మార్కులకు పరీక్ష), రాయడం (40 మార్కులకు), లెక్కలు (30 మార్కులకు) ఈ మూడు అంశాల్లో ఉమ్మడిగా 100కు 30 మార్కులు వస్తే పాస్ చేస్తారు. కాని కార్తాయని అమ్మకు 98 మార్కులు వచ్చాయి. దాంతో ఆమెకు రాష్ట్రం మొత్తం సలామ్ చేసింది. ప్రతిష్ఠా్టత్మక కేంద్ర స్త్రీ శక్తి అవార్డు వరించింది. ‘ఏదైనా పట్టుబట్టి సాధించాలనుకునేవారికి ఆమెను మించిన స్ఫూర్తి లేదు’ అంటాకు వికాస్ ఖన్నా. ఇంతకు ముందు వికాస్ ఖన్నా ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ అతడి రెండో ప్రయత్నం. ఉత్త కాళ్లతో ఆమె ఒక యోధురాలిగా పరీక్ష రాయడానికి స్థానిక స్కూలుకు వెళుతున్న ఫొటో ఎవరినైనా కట్టి పడేస్తుంది. ఆ పరీక్షలో పాసయ్యి గెలిచి ఆమె పట్టుదలకు సామ్రాజ్ఞి అయ్యింది. అందుకే వికాస్ ఖన్నా ఈ డాక్యుమెంటరీకి ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ (ఉత్తకాళ్ల సామ్రాజ్ఞి) అని పెట్టాడు. నూరేళ్ల ఆయుష్షుకు చేరినా కార్తాయని అమ్మ ఇంకా చదువుకోవాలనే అభిలషిస్తోంది. ‘మరి అలాంటిది మన దేశంలో చిన్నారి ఆడపిల్లలు ఎంతమంది చదువుకోవాలని కోరుకుంటారో కదా. వారందరూ చదువుకోవాల్సిన అవసరాన్ని ఈ డాక్యుమెంటరీ చెప్తుంది’ అంటాడు వికాస్. ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఈ డాక్యుమెంటరీ త్వరలో మన దేశంలో బహుశా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. -
సునీల్ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం
ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. ఫుట్‌బాల్ క్రీడలో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది. రొనాల్డో, మెస్సీల లాగా సునీల్ ఛెత్రి ఫిఫా వరల్డ్‌కప్‌లు ఆడింది లేదు.. ప్రధాన ఫుట్‌బాల్ క్లబ్స్‌కు కూడా పెద్దగా ప్రాతినిధ్యం వహించింది లేదు. మరి ఫిఫా ఎందుకు సునీల్ ఛెత్రి డాక్యుమెంటరీ రూపొందించాలనుకుంది. పాపులారిటీ విషయంలో ఈ భారత కెప్టెన్ మెస్సీ, రొనాల్డోలతో సరితూగకపోవచ్చు కానీ.. గోల్స్ విషయంలో మాత్రం వారి వెనకాలే ఉన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉంది. రొనాల్డో 117 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్ మెస్సీ 90 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఉన్నాడు. సునీల్ 131 మ్యాచ్‌ల్లో 84 గోల్స్ చేశాడు. సునీల్ ఛెత్రి రొనాల్డో, మెస్సీలాగా ప్రపంచకప్‌లు ఆడకపోవచ్చు.. కానీ అతని ఆటతీరుతో ఒక స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఒక్క కారణంతోనే ఫిఫా సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ తీయాలని అనుకుంది. ఎవరికి తెలియని సునీల్ ఛెత్రి పేరును డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను స్వయంగా ఫిఫా తీసుకుంది. భారతదేశం నుంచి ఫుట్‌బాల్‌లో హీరోగా వెలుగొందుతున్న సునీల్ ఛెత్రి లాంటి స్ట్రైకర్ ఎలా ఉద్భవించాడు.. అతని ఆటతీరును పరిచయం చేస్తూ డాక్యుమెంటరీ కొనసాగుతుంది. ఈ డాక్యుమెంటరీకి కెప్టెన్ ఫెంటాస్టిక్(Captain Fantastic Series) అని పేరు పెట్టిన ఫిఫా ఇటీవలే మొదటి సీజన్ విడుదల చేసింది. అంతా ఊహించినట్లుగానే 'కెప్టెన్ ఫెంటాస్టిక్ సిరీస్' డాక్యుమెంటరీ సూపర్‌హిట్ అయింది. అయితే కొన్నాళ్ల క్రితం సునీల్ ఛెత్రిపై ఫిఫా ఒక డాక్యుమెంటరీ రూపొందించనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే మొదట ఛెత్రి, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఫిఫా ఒక ఆటగాడిపై డాక్యుమెంటరీ రూపొందింస్తుందంటే కచ్చితంగా గొప్ప ఆటగాడు అయి ఉండాలి. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లు లేదా ఫుట్‌బాల్‌లో గొప్ప ఆట ఆడిన ఆటగాళ్లపై మాత్రమే ఫిఫా డాక్యుమెంటరీలు రూపొందిస్తుంది. ఈ విషయంలో సునీల్ ఛెత్రి చాలా దూరంలో ఉన్నాడు. ప్రతి నాలుగేళ్లకోసారి ఉపఖండంలో జరిగే ఆసియా కప్‌లో మాత్రమే సునీల్ ఛెత్రి ఆడేవాడు. ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గోల్స్ చేస్తూ ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ల జాబితాలోకి అడుగుపెట్టిన సునీల్ ఎదుగుదల కథను ఫిఫా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ మొదలుపెట్టింది. You know all about Ronaldo and Messi, now get the definitive story of the third highest scoring active men's international. Sunil Chhetri | Captain Fantastic is available on FIFA+ now 🇮🇳 — FIFA World Cup (@FIFAWorldCup) September 27, 2022 -
‘కాళీ’ పోస్టర్ వివాదం.. డైరెక్టర్ పోస్ట్ డిలిట్ చేసిన ట్విటర్
దర్శకురాలు లీనా మణిమేగలై ఇటీవల విడుదల చేసిన కాళీ పోస్టర్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కాళీ అనే పేరుతో ఆమె తీస్తున్న డ్యాక్యుమెంటరీకి సంబంధించిన ఈ పోస్టర్ జూలై 2న కెనడాలోని టోరంటోలో ఉన్న అగాయాన్ మ్యూజీయంలో రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా దూమారం రేపుతోంది. దేవత మూర్తి కాళిక అమ్మావారి వస్త్రధారణలో ఉన్న ఈపోస్టర్లో సిగరేట్ తాగుతున్నట్లుగా ఉండటంతో పలు సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. అంతేకాదు ఈ పోస్టర్ అమ్మవారిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. డైరెక్టర్ లీనా చేసిన పోస్ట్ మత విశ్వాసాలను, హిందువుల మనోభవాలను దెబ్బతీసేల ఉందంటూ పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు కెనడాలోని భారత హైకమిషన్ కూడా దీనిపై వ్యతిరేకత తెలుపుతూ తీవ్రంగా పరిగణించింది. దీంతో స్పందించిన అగాఖాన్ మ్యూజియం కాళీ డాక్యూమెంటరీని తమ ప్రదర్శన నుంచి తొలగించింది. అంతేకాదు ట్విటర్ కూడా డైరెక్టర్ చేసిన పోస్ట్‌ను తొలిగించింది. చదవండి: అందుకే ఇంతకాలం నటనకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి ఇక దీనిపై డైరెక్టర్ లీనా స్పందిస్తూ అభ్యంతరక వ్యాఖ్యలతో మరో ట్వీట్ చేసింది. ఇప్పటికే తన పోస్టర్‌తో ఎంతోమంది ఆగ్రహనికి కారణమైన ఆమె తన తాజా ట్వీట్‌తో మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించింది. మరి దీనిపై ఆమె ఎలాంటి పరిణామాలు ఎదర్కొంటుంది చూడాలి. తమిళనాడులోని మధురైకి చెందిన లీనా మణిమేగలై.. రిథమ్స్ ఆఫ్ కెనడాలో భాగంగా కాళీ పేరుతో డాక్యుమెంటరీని చిత్రీకరించింది. ఇప్పుడు ఈ డాక్యెమెంటరీకి చెందిన పోస్టరే వివాదస్పదమైంది. -
క్లిక్ ట్రెండ్: యోగా ఫొటో
జ్ఞాపకాల పదిలానికి ఫొటోని మించిన సాధనం లేదన్నది మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ, న్యూ బోర్న్.. అంటూ ఫొటోగ్రఫీలో రకరకాల ట్రెండ్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. వీటితోపాటు యోగా, ఫిట్నెస్ పోజెస్ ఫొటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండ్ అయ్యింది. దీనికి సామాజిక మాధ్యమం కూడా ఓ కారణం. ఈ వేడుకకు ఆ ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకు అందమైన, అద్భుతం అనిపించే ఫొటోలు కావాలని కోరుకోని వారుండరు. యోగా సాధనలో తాము సాధించిన విజయాలను నలుగురితో పంచుకోవడానికి ఇప్పుడు యోగా ఫొటోగ్రఫీ కళ తప్పనిసరి అవసరంగా మారిందంటున్నారు నిపుణులు. యోగా క్లాసులు ఇవ్వడానికి, యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఫొటోలే ఆధారం. అలాగే, కొత్తగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి యోగా ఫొటోలు తీయడం అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఫిట్నెస్ మీద ఆసక్తి కనబరుస్తున్నవారు తమ శరీరాకృతిని యోగా భంగిమల్లో చూపడానికి ఈ ఫొటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది. గతంలో యోగా, వ్యాయామం వంటివి చేసి ఆ తర్వాత వదిలేసినవారు ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఫొటోలు చూసుకున్నప్పుడు ఒక ప్రేరణగా ఉపయోగపడతాయి. మొట్టమొదటి డాక్యుమెంటరీ యోగా సాధన చేయడానికి యోగా క్లాసుల్లో చేరచ్చు. యూట్యూబ్‌లో వీడియోలు చూడచ్చు. ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలు చదివి కూడా ప్రయత్నించవచ్చు. అయితే, యోగా ఫొటోగ్రఫీలో పర్ఫెక్ట్ అవ్వాలంటే యోగా మీద తీసిన ‘ఆన్ యోగా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. దీనికి ఫొటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన ‘మైఖేల్ ఓ నీల్’ అద్భుతమైన చిత్రణను అందించాడు. పదేళ్లపాటు ఇండియా, టిబెట్, న్యూయార్క్‌లలోని గొప్ప గొప్ప యోగా గురువులతో మాట్లాడి, తీసిన డాక్యుమెంటరీ ఇది. యోగా ఫొటోలు తీయడానికి, తీయించుకోవడానికి ఈ డాక్యుమెంటరీ మంచి పుస్తకంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో క్లిక్స్... యోగా ఫొటోషూట్ కోసం అందమైన ప్రకృతిని మించిన వేదిక మరొకటి లేదు. మనసు, శరీరం ఆహ్లాదంగా ఉండటానికి చేసే యోగా, ఆ ఆనందాన్ని ఒక్క క్లిక్‌తో బంధించడానికి ప్రకృతి దృశ్యాలు అనువైన స్థలాలు. అడవి, బీచ్, పార్క్ ఫొటో సెషన్‌కు మంచి వేదికలు. అనువైన సంధ్యాసమయాలు... సూర్యోదయ, అస్తమయ సమయాలను బేస్ చేసుకుంటూ తీసే యోగా ఫొటోలు ఒక కళాత్మకమైన అందాన్ని కళ్లకు కడతాయి. ఈ సమయంలో సాధారణ ఆసనాలను వేస్తూ కూడా ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాట్ నీట్... మిగతా వాటితో పోల్చితే యోగా ఫొటో సెషనల్లో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ధరించే డ్రెస్ అయినా, యోగా మ్యాట్ అయినా శుభ్రంగా ఉండాలి. యోగా ఫొటోలా కాకుండా ఓ కథ చెప్పే విధంగా ఉండాలి. యోగా ఫొటోలు తీయడమంటే ముఖాన్ని షూట్ చేయడం కాదు... మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, వంపులుగా తిరిగిన చేతులు, శరీరం.. ఇలా యోగా అని తెలిసే విధంగా ఫొటో తీయాల్సి ఉంటుంది. యోగా ఫొటోలు తీయాలని ఆ ఒక్కరికే క్లిక్ మనిపించ కూడదు. చుట్టూ నేపథ్యాన్ని కూడా కెమెరా కన్నుతో బంధించాల్సి ఉంటుంది. యోగా ఫొటోగ్రఫీ అనేది ఒక ఆధ్యాత్మికానుభవాన్ని దగ్గర చేస్తుంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేస్తుంది. యోగా చిత్రకళా విభాగం మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది. యోగా మెటర్నిటీ మెటర్నిటీ ఫొటోస్ కోసం వచ్చినవారు యోగా ఫొటోస్ కూడా తీసుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఔట్లొకేషన్స్ని ఇష్టపడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సెలబ్రిటీలు తీయించుకున్న యోగా ఫొటోలు మా వద్దకు తీసుకువచ్చి, అలాంటి పోజులతో ఫొటోలు తీయమని అడుగుతుంటారు. ఫిట్నెస్ ట్రెయినర్స్లోనూ ఇలాంటి ఆసక్తి ఎక్కువ. – మనోజ్ఞ, న్యూ బోర్న్ బేబీ ఫొటో గ్రాఫర్ – నిర్మలారెడ్డి -
బిగ్స్క్రీన్పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్
భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు దాగున్నాయి. ఐసీసీ ట్రోపీలు గెలవడంతో పాటు పలు చారిత్రక సిరీస్‌ల్లో విజయాలు సాధించిన కోట్ల మంది అభిమానుల గుండెలు ఉప్పొంగేలా చేసింది. 1983లో ఐసీసీ టోర్నీ అయిన వరల్డ్‌కప్ గెలవడం ఒక చరిత్ర. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ లార్డ్స్ బాల్కనీలో నుంచొని వరల్డ్‌కప్ అందుకుంటే మన నరాల్లో దేశభక్తి పొంగిపోయింది. అప్పటి వరల్డ్‌కప్ విజయాన్ని దేశంలో ప్రజలు పెద్ద పండుగగా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్లో ఒక పెను సంచలనం. అతన్ని భారతీయులు ఒక క్రికెట్‌గాడ్‌గా అభివర్ణించారు. ఇక 2007 టి20 ప్రపంచకప్‌ను యువ రక్తంతో నిండిన జట్టు సొంతం చేసుకోవడం.. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ధోని ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశానికి రెండోసారి వరల్డ్‌కప్ అందించిన సంఘటన భారత్ క్రికెట్ బతికున్నంతవరకు నిలిచిపోతుంది. ఆ తర్వాత 2013లో చాంపియన్స్ ట్రోపీ, 2019లో వరల్డ్‌కప్ సెమీఫైనల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఐసీసీ మేజర్ టోర్నమెంట్లు. వీటికున్న క్రేజ్ వేరుగా ఉంటుంది. సాధారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను ప్రజలు పట్టించుకోరు. కానీ 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోపీని 2-1తో కైవసం చేసుకోవడం భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. భారత్ క్రికెట్ గురించి ఇకపై ఎప్పుడు మాట్లాడినా ఈ సిరీస్‌కు గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే.. కాదు చర్చించుకునేలా చేసింది. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ నిరూపించింది. 2018-19లోనూ టీమిండియా ఆసీస్ గడ్డపై ట్రోపీ గెలిచినప్పటికి.. దానిని దీనితో పోల్చలేం. ఎందుకంటే ఈ సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై అవమానకర రీతిలో ఓడిపోయింది. కోహ్లి కెప్టెన్సీలో ఆడిన తొలి టెస్టు టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ సెలవుపై స్వదేశం వెళ్లడం.. బుమ్రా, షమీలు గాయాలతో ఇబ్బంది పడడంతో ఒక్కసారిగా టీమిండియాకు కష్టాలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితులో రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఓటమితో దెబ్బతిన్న జట్టును తన నాయకత్వ పటిమతో రహానే తిరిగి నిలబెట్టాడు. అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి అనంతరం, రహానే సారధ్యంలో టీమిండియా మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసింది. అనంతరం సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రా కాగా, సిరీస్ డిసైడర్ అయిన కీలక నాలుగో టెస్ట్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 4 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన టీమిండియా అద్భుత విజయంతో సిరీస్‌ను ముగించింది. వాస్తవానికి ఓటమి దెబ్బలు తిని మళ్లీ గెలుపు ఎలా దక్కించుకోవాలో టీమిండియాను చూస్తే అర్థమవుతుంది. అందుకే ఈ చారిత్రక సిరీస్‌ను బిగ్స్క్రీన్పై డాకుమెంట్ రూపంలో చూపించాలనుకున్నాడు దర్శకుడు నీరజ్ పాండే. నీరజ్ పాండే.. స్పెషల్ 26, బేబీ, ఎంఎస్ ధోని లాంటి మంచి అభిరుచి ఉన్న సినిమాలకు దర్శకత్వం వహించాడు. మాములుగానే తన సినిమాలో భావోద్వేగాలను తారాస్థాయిలో చూపించే ఈ దర్శకుడు.. ఇలాంటి దానిని మాములుగా వదలిపెడతాడా.. సందేహం లేదు. తాజాగా డాక్యమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను జూన్ 1న(బుధవారం) ఆ సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన అజింక్యా రహానే, సిరాజ్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారాలు విడుదల చేశారు. నీరజ్ పాండే 'బంధన్ మే తా ధమ్' పేరుతో సిరీస్‌ను నిర్మించాడు. సిరీస్‌లో జరిగిన సంఘటనలను ఒక అంశాలుగా తీసుకొచ్చి.. మధ్యమధ్యలో రహానే,సిరాజ్‌లు తమ అనుభవాలను పంచుకునేలా ఆసక్తికరంగా ట్రైలర్‌ను కట్‌చేశారు. మొత్తానికి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ట్రైలర్‌ను మించి డాక్యుమెంట్ ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా జూన్ 16 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ప్లామ్ అయిన వూట్ సెలెక్ట్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! Happy Birthday Dinesh Karthik: దినేశ్ కార్తిక్.. ఫెయిల్యూర్ మ్యారేజ్ టూ సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ When everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination. Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum - The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgH — Voot Select (@VootSelect) June 1, 2022 -
Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు
‘మనుషులే కాదు కెమెరా కూడా కథలు చెబుతుంది...వినే మనసు ఉంటే!’ అంటుంది చీనాకపూర్. దిల్లీలో ఇంజనీరింగ్ చేసిన చీనా లండన్‌లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసింది. అయితే ‘జీవితంలో ఉద్యోగం’ కాదు ‘ఉద్యోగమే జీవితం’లాంటి పరిస్థితి ఎదురైంది. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే కెమెరా చెప్పే కథలు. అయితే ఇవి ప్రకృతి అందాలను కళ్లకు కట్టే కథలు కాదు. కాల్పనిక కథలు అంతకంటే కాదు. కదిలించే నిజజీవిత కథలు. మానసిక సమస్య బాధితుల ఆశ్రమం నుంచి రెడ్‌లైట్ ఏరియాల వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది చీనా. వారి జీవితాన్ని, దైన్యాన్ని ఫొటోల్లోకి తీసుకువచ్చింది. ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ చీనాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... చీనా వాళ్ల బంధువుల కుర్రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఒక ఆశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నారు. 35 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంటోంది. వచ్చి చూసే వారు లేరు. పలకరించేవారు లేరు. ఆమెను చూడడానికి ఒకసారి ఆశ్రమానికి వెళ్లింది చీనా. అక్కడ తన బంధువులాంటి ఎంతో మందిని చూసి చలించిపోయింది. ఆ సమయంలోనే ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటారు. ఆర్థిక విషయాలే కాదు ఆరోగ్య విషయాలు కూడా మానవసంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ‘ఫర్గాటెన్ డాటర్స్’ చెప్పకనే చెబుతుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే అయిన వారు కూడా కాని వారవుతారా! అలాంటి ఎంతోమంది బాధిత మహిళల దీనస్థితికి చిత్రరూపం ఇచ్చింది చీనా. రెడ్‌లైట్ ప్రాంతాలకు వెళ్లేముందు వద్దని వారించారు చాలామంది. అయితే చీనాకపూర్ వారి మాటలు వినలేదు. అక్కడ ఎన్నో దృశ్యాలు. కనిపించే దృశ్యం ఒకటి... కనిపించని దృశ్యం ఒకటి. వీటిని ఆమె కెమెరా పట్టుకోగలిగింది. ఎప్పుడూ ఎవరో వచ్చే ఆ ప్రాంతంలో ‘భద్రత’ లేదనే విషయం అర్థమైంది. అక్కడ ఉన్న ఎంతోమందితో తాను మాట్లాడింది. వారి కన్నీటికథలను డాక్యుమెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా చీనా నిర్వహించే ‘మై షాట్ స్టోరీస్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాను చేస్తున్న పనికి ‘యూనిసెఫ్’లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు లభించాయి. డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా చీనా కపూర్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే తన గుర్తింపు కంటే గుర్తింపుకు నోచుకోని బాధిత సమూహాల పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది చీనా కపూర్. -
చేనేత మహిళ.. కలల నేతకు అద్దిన కళ
‘‘ఎన్నో చీరలు మగ్గం మీద నేస్తుంటాం. కానీ, ఒక్క చీర కూడా మేం కట్టుకోలేం. బయట దొరికే వందా, రెండు వందల రూపాయల సిల్క్ చీరలు కొనుక్కుంటాం. మా చేతుల్లో రూపుదిద్దుకున్న చీరల డిజైన్లు ఎంత అందంగా ఉన్నాయో కదా, అని ఒకటికి పదిసార్లు చూసుకుంటాం. కానీ, మేం కట్టుకునే చీరల అందం గురించి ఎన్నడూ పట్టించుకోం. అలాంటిది సిరి మేడమ్ మా చీర మాకే కొనిచ్చారు, మేం కట్టుకునేదాకా ఊరుకోలేదు’’ అంటూ విప్పారిన ముఖాలతో తెలిపారు నారాయణపేట్ చేనేత మహిళలు. ‘‘నెల రోజుల క్రితం తెలంగాణలోని నారాయణ్‌పేట్ చేనేత మహిళలను కలిసి, వారి చీరలు వారే కట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఫొటోలుగా తీయాలనిపించింది. అలా తీసుకున్నాను కూడా. వీరికే ఇంకాస్త కట్టూ బొట్టూ మార్చితే మోడల్స్‌కి ఏ మాత్రం తీసిపోరు అనిపించింది. దాంతో ఈ ఆలోచనను సినిమాటోగ్రాఫర్ రఘు మందాటిని కలిసి, ఈ షూట్ ప్లాన్ చేశాను’’ అని వివరించారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిన్న హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘తాశ్రిక’ పేరుతో చేనేత మహిళల ఫొటో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేతల పట్ల తనకున్న మక్కువను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘పుట్టి పెరిగింది అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్‌లో. కళల లేపాక్షి మాకు దగ్గరే. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. పదహారు ఏళ్లుగా హ్యాండ్లూమ్స్‌తో డిజైన్స్ చేస్తున్నాను. చేనేతలతో యువతరం మెచ్చేలా మోడ్రన్ డ్రెస్సులను రూపొందించి, షోస్ కూడా ఏర్పాటు చేశాను. ఎప్పుడూ చేనేతలతో మమేకమై ఉంటాను కాబట్టి, వారి జీవితాలు నాకు బాగా పరిచయమే. ఆనందమే ముఖ్యం రోజుల తరబడి దారం పోగులను పేర్చుతూ ఒక్కో చీరను మగ్గం మీద నేస్తారు. ఒక్కో చీర 1200 రూపాయల నుంచి ధర ఉంటుంది. కానీ, అవి అంత సులువుగా అమ్ముడుపోవు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వారి చేతి వృత్తే ఆధారం. చీర ఖరీదైనదని, వారెన్నడూ వాటిని కలలో కూడా కట్టుకోవాలనుకోరు. సాధారణ రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితులు ఎంత గడ్డుగా ఉంటాయో కళ్లారా చూశాను. అలాంటిది కరోనా సమయంలో చేనేత కుటుంబాల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి లేక వారంతా ఎలా ఉన్నారో, వారి నేత చీరలన్నీ అలాగే మిగిలిపోయి ఉంటాయనుకొని ఒకసారి కలిసి వద్దామని వెళ్లాను. అక్కడి వారి పరిస్థితులన్నీ స్వయంగా చూశాక, ఆ మహిళల ముఖాల్లో కొంచెమైనా ఆనందం చూడాలనిపించింది. అలాగే, నాదైన కంటితో వారిని ఇంకాస్త కళగా చూపాలనుకున్నాను. నా స్నేహితుల్లో ఉన్న మేకప్, హెయిర్ స్టైలిస్ట్‌లతో మాట్లాడాను. ఈ క్రమంలో వారానికి ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లడం, అక్కడి మహిళలతో మాట్లాడటం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో నేనూ ఒకదాన్నయిపోయాను. ఫొటో షూట్‌కి అనువైన ప్లేస్ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. ఒక ప్రాచీన దేవాలయం కనిపించింది. అక్కడే ఫొటో షూట్‌కి ప్లాన్ చేసుకున్నాం. పదిమంది చేనేత మహిళలను తీసుకొని ఉదయం 5 గంటలకే ఆ దేవాలయానికి చేరుకున్నాం. ముందే అనుకున్నట్టు డిజైనర్ బ్లౌజులు, ఆభరణాలు, మేకప్ సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం. రెండు కళ్లూ సరిపోలేదు ముస్తాబు పూర్తయ్యాక ఆ చేనేత మహిళల ‘కళ’ చూస్తుంటే నాకే రెండు కళ్లు సరిపోలేదు. వారు చూపించిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అనిపించింది. జాతీయస్థాయి మోడల్స్‌కి వీరేమాత్రం తీసిపోరు అనిపించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫొటో, వీడియో షూట్ చేశాం. వారి అనుభవాలతో కలిపి డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ గ్యాలరీలో ప్రదర్శించిన ఈ మహిళల ఫొటోలతో ఉన్న ఫ్రేమ్‌లు వారి వారి ఇళ్లలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ ఫొటోషూట్, డాక్యుమెంటరీ అంతా స్వచ్ఛందంగా పూర్తిచేశాం. నా స్నేహితులు కూడా ఈ పనిలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ రంగంలో ఉన్నందుకు చేనేతకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనిపించింది. ఈ మహిళల ముఖాల్లో కనిపించిన కళ వీరి జీవితాల్లోనూ కనిపించాలి. చేనేతలను ఈ తరం మరింతగా తమ జీవనంలో భాగం చేసుకోవాలన్నదే నా ప్రయ త్నం’’ అని వివరించారు డిజైనర్ హేమంత్ సిరి. గ్యాలరీకి వచ్చినవారంతా అబ్బురంగా చేనేత మహిళల ఫొటోలు, డాక్యుమెంటరీని తిలకించడం, అక్కడే ఉన్న చేనేత మహిళలను ఆప్యాయంగా పలకరించడం, కొందరు చీరలు కొనుక్కోవడం, మరికొందరు మీ నుంచి మేమూ చీరల ఆర్డర్స్ తీసుకుంటాం అంటూ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని వెళ్లడం.. అక్కడ ఉన్నంతసేపూ కళ్లకు కట్టింది. లేపాక్షి దేవాలయ కళను నారాయణ్‌పేట్ కాటన్ చీరల మీద డిజిటల్ ప్రింట్ చేయించి, డిజైన్ చేసిన ప్రత్యేకమైన చీరలు ఇవి. వీటితోనే డాక్యుమెంటరీ, ఫొటో షూట్ చేశాం. ఇందులో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొన్నారు. వచ్చిన ఆలోచనలను వెంటనే అమల్లో పెట్టడం, అందుకు తగినట్టుగా నారాయణ్‌పేట్ మహిళలు ఆనందంగా సహకరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మలాలాపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్
ఇస్లామాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్పై పాకిస్తాన్‌లోని ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఇందుకోసం ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం సోమవారం విద్యా కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ను లక్ష్యంగా చేసుకుని యువతలో ఆమె పట్ల వ్యతిరేకత కలగడానికి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. కాగా, మలాలా సోమవారం 24వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఇక సోమవారం పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్ పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దీని అధ్యక్షుడు కసీఫ్ మిర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్ నాట్ మలాలా డాక్యుమెంటరీ చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించారు. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు. మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తోంది మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని కసీఫ్ మిర్జా ఆరోపించారు. దేశంలోని వివాహ వ్యవస్థపై ఆమె దాడి చేస్తోందని పేర్కొన్నారు. మలాలా రాసిన ‘ఐ యామ్ మలాలా’ పుస్తకంలోని పలు అంశాలను ఆయన తప్పుపట్టారు. పాక్ పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించడం, అలీ జిన్నా గురించి చెప్పడంపై ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని పశ్చిమ దేశాల అజెండా అమలు కోసం రాసినట్లు ఉందన్నారు. ఇక "మలాలా తండ్రి జియావుద్దీన్ ఒక టీవీ కార్యక్రమంలో తన బ్లాగును బీబీసీ కరస్పాండెంట్ అబ్దుల్ హై కాకర్ రాశారని, 'ఐ యామ్ మలాలా' పుస్తకం క్రిస్టినా లాంబ్ రాసినట్లు ఒప్పుకున్నారు." అని ఆయన అన్నారు. -
కాళేశ్వరం అద్భుత సృష్టి.. ఈనెల 25న డిస్కవరీ చానల్లో
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఓ అద్భుతం. ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఘనత, ప్రాముఖ్యత మరోమారు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగనుంది. ఇప్పటికే కాళేశ్వరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ ప్రాజెక్టుపై ప్రఖ్యాత డిస్కవరీ చానల్ ఓ డాక్యుమెంటరీని ప్రపంచ ప్రజల ముందుంచనుంది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలో మరెక్కడా లేని అతి భారీ పంపులు, మోటార్లు, ఇంజనీర్లు, కార్మికుల శ్రమ, అన్నిటికీ మించి తమ కలల ప్రాజెక్టు సాకారానికి ప్రభుత్వం చేసిన కృషిని వివరించనుంది. గంట డాక్యుమెంటరీ గోదావరి జలాలను ఎత్తిపోస్తున్న వైనంపై ‘లిఫ్టింగ్ ఎ రివర్’పేరిట డిస్కవరీ కథనాన్ని ప్రసారం చేయనుంది. ఈ నెల 25న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దీనిపై ప్రచారాన్ని మొదలు పెట్టిన డిస్కవరీ చానల్.. అన్ని దేశాల్లో తన మీడియా వ్యవస్థల ద్వారా ప్రోమోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. మనుషులు, మెషీన్లు కలిసి అసాధ్యమనుకున్న కార్యాన్ని ఏ విధంగా సుసాధ్యం చేశాయో తెలుసుకోవాలంటే దీన్ని వీక్షించాలని చెబుతోంది. అన్ని అంశాలూ కవర్ చేస్తూ.. 2017లో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి చేసిన నిర్మాణాలను చూపుతూనే.. నీటిని ఆయకట్టు ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీలో చూపనుంది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకం కింద 20 పంపుహౌస్‌లలోని 104 భారీ పంపులు, మోటార్లను ఏర్పాటు చేయడంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేసిన కృషిని వివరించనుంది. ముఖ్యంగా గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం లోని 139 మెగావాట్ల భారీ పంపులు, మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. డిస్కవరీ వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. రూ.80 వేల కోట్లకు పైగా వ్యయంతో 40 లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, పారిశ్రామిక రంగాల వారికి ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు తదితర అంశాలను చానెల్ విశ్లేషించనుంది. రెండ్రోజుల కిందట కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ డాక్యుమెంటరీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన అద్భుతాన్ని అంతర్జాతీయ సమాజం తెలుసుకుంటుందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం, ఆర్ధిక సం ఘం, నీతిఆయోగ్, వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణులు, విదేశీ ప్రముఖులు కొనియాడటం గమనార్హం. -
25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత భారీ స్థాయిలో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఈ నెల 25న డిస్కవరీ చానల్లో ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’పేరుతో గంటపాటు సాగనున్న ఈ డాక్యుమెంటరీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2017లో ఈ బృహత్తర పథకం మొదలుపెట్టింది మొదలు ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, బృహత్తర యజ్ఞాన్ని పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు. ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో దీన్ని ప్రసారం చేయనున్నారు. Save The Date! "Lifting A River" A @Discovery Channel exclusive documentary on #KaleshwaramProject on June 25, at 8 PM. Don't miss! @KTRTRS pic.twitter.com/kZwZUp755C — Telangana Digital Media Wing (@DigitalMediaTS) June 19, 2021 చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’
దుబాయ్: సుమారు మూడేళ్ల క్రితం ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరుతో ప్రముఖ టీవీ చానల్ ‘అల్ జజీరా’ ప్రసారం చేసిన రెండు డాక్యుమెంటరీలలోని ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో రెండు టెస్టు మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పిన చానల్... రెండో భాగంలో 2011–12 మధ్య కాలంలో 15 మ్యాచ్‌లలో ఫిక్సింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. 2016లో భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు (ఇందులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగులతో గెలిచింది)...2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు (మ్యాచ్ డ్రాగా ముగిసింది)లలో ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్ చేసినట్లు అల్ జజీరా వెల్లడించింది. అయితే సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఐసీసీ వీటన్నింటిని తప్పుగా తేల్చింది. అసలు చానల్ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ‘చానల్ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్‌ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులోనూ కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవీ నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న నలుగురు నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది’ అని ఐసీసీ ప్రకటించింది. మొత్తంగా ఈ వివాదంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురికి కూడా క్లీన్చిట్ ఇచ్చింది. -
సముద్ర సదస్సుకు నైన్త్ క్లాస్ యష్మి..
యష్మి తొమ్మిదో తరగతి విద్యార్థిని. ఐక్యరాజ్యసమితి ‘సముద్ర సదస్సు’ కు ఎంపికైంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే అంశంపై కావేరీ నది మీద యష్మి తీసిన చిన్న డాక్యుమెంటరీ ఆమెకు ఈ అర్హతను కల్పించింది. త్వరలోనే హవాయిలో జరిగే సముద్ర సదస్సులో ప్రపంచంలోని ఆలోచనాపరులతో కలిసి యష్మి కూర్చోబోతోంది! కరోనా కారణంగా ఒకవేళ ఆ సదస్సు ఆన్లైన్లో జరిగినా తనేమీ నిరుత్సాహపడబోనని, యువతకు తన సందేశం వెళ్లింది అంతే చాలునని యష్మి సంతోషంగా చెబుతోంది. సముద్ర సదస్సుకు కావేరీ నదిని తీసుకెళుతున్న నావిక.. యష్మి. లాక్డౌన్లో తాగడానికి నీళ్లు లేక, ఊరికి బారెడు దూరంలో ఎక్కడో కొన్ని స్వచ్ఛమైన నీటి చుక్కలున్నా బయటికి వెళ్లే దారి లేక ఇంట్లోనే బావులు తవ్వుకున్నవాళ్లున్నారు! లాక్డౌన్ పర్యవసానాల విశ్వరూపానికి ఇదొక్క ఉదాహరణ చాలు. జీవికి గొంతు తడుపుకోడానికి నీళ్లు లేకపోవడం ఏమిటి! భూగోళమేమీ ఒట్టిపోలేదే?! నదులున్నాయి, చెరువులున్నాయి, ఊటలు, నీటి కుంటలూ ఉన్నాయి. ఉన్నాయి కానీ తాగేందుకు వీల్లేనంతగా కలుషితం అవుతున్నాయి! జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సమీప భవిష్యత్తులో? ‘భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి’ అని ఐక్యరాజ్య సమితి స్కూల్ పిల్లలకు పోటీ పెట్టింది. ఆ ఊహ.. కథ చెప్పినట్లుగా ఉండాలి. ఊహ ‘వీడియో’ రూపంలో ఉండాలి. అదీ నిబంధన. 13–17 మధ్య వయసు గల పిల్లల కోసం జరిగిన ఈ పోటీలో అనేక కేటగిరీలు ఉన్నాయి. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనేది వాటిల్లో ఒకటి. నీరు పవిత్రమైనదని అర్థం. ఆ కేటగిరీలో కొడగు విద్యార్థిని యష్మి విజేతగా నిలిచింది. యష్మి మైసూరులోని ఆచార్య విద్యాకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొడగులోని నెలజి ఆమె స్వగ్రామం. లాక్డౌన్లో తన ఊరు ఎలా ఉందో కళ్లారా చూసింది యష్మి. నీరు ఎంత విలువైందో కూడా అప్పుడే ఆమెకు తెలిసింది. తమ ఊరొక్కటే కాదు, రాష్ట్రంలోని అన్ని ఊళ్లూ అలానే ఉన్నాయని పత్రికల్లో చూసింది. నీటి చుక్కకు కరువేమీ లేదు. కలుషితం కాని నీరే.. ఎక్కడా లేదు! అసలే కరోనా. కలుషితమైన నీరు తాగడం వల్ల, గాలిలోని కాలుష్యాలను పీల్చడం వల్ల జబ్బున పడితే, అది కరోనా ఏమోనన్న భయం. ఈ పరిస్థితిని మార్చేందుకు తనేమీ చేయలేదు. ఏం చేయాలో కొంత చెప్పగలదు. కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. రోజులు గడిచాయి. లాక్డౌన్ ముగిసింది. యష్మి ఎనిమిది నుంచి తొమ్మిదికి వచ్చింది. ఈ సమయంలో క్లాస్ టీచర్ ఓరోజు యు.ఎన్. హెచ్2ఒ 21 వాటర్ సమ్మిట్ గురించి చెప్పారు. హెచ్2ఒ 21 సమ్మిట్ పేరుతో ఐక్యరాజ్య సమితి టీనేజ్ విద్యార్థులకు భవిష్యత్తులో నీరు అనే టాపిక్ మీద ‘స్టోరీ టెల్లింగ్’ పోటీ పెడుతోంది. అందులో విజేతగా నిలిస్తే, ఆ తర్వాత యూఎస్‌లోని హవాయి రాష్ట్రంలో జరిగే ‘యు.ఎస్. ఓషన్ డికేడ్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఆహ్వానం లభిస్తుంది. అదేమీ మామూలు సంగతి కాదు. స్టోరీ టెల్లింగ్‌లో జల సంరక్షణ కోసం విజేతలు ఇచ్చిన సూచనలపై మేధావులు, ఆలోచన పరులు ఓషన్ సమ్మిట్ (సముద్ర సదస్సు)లో చర్చలు జరుపుతారు. అది చాలదా! ‘‘ఇదిగో ఈ అద్భుతమైన ఆలోచనను ఇచ్చింది ఈ అమ్మాయే’’ అని అంతా చప్పట్లు చరుస్తూ అభినందిస్తూ ఉంటే!! క్యాష్ ప్రైజ్, ప్రశంసాపత్రం ఎలాగూ ఉంటాయి. యష్మి వెంటనే ఆ పోటీలో పాల్గొంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే కేటగిరీని ఎంపిక చేసుకుంది. లాక్డౌన్లో తన అనుభవాలను పాయింట్లుగా రాసుకుంది. వాతావరణ మార్పులపై ప్రసిద్ధుల ప్రసంగాల నుంచి కొంత నోట్స్ సిద్ధం చేసుకుంది. పోటీలో పాల్గొనడానికి ముందు హెచ్2ఓ 21 నియమ నిబంధనల కోసం ఐక్యరాజ్య సమితి వరుసగా నాలుగు శని, ఆదివారాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులకు హాజరు అయింది. అక్కడే కేటగిరీల కేటాయింపు జరుగుతుంది. యష్మి ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ కేటగిరీని ఎంపిక చేసుకోడానికి తగిన కారణమే ఉంది. కొడగులోని వాళ్లంతా కావేరీ నదిని దైవంలా పూజిస్తారు. అన్లైన్ తరగతులకు హాజరవుతున్నప్పుడే వాళ్లు చెబుతున్న విషయాలను బట్టి.. తల్లి కావేరి తమను కాపాడుతున్నంతగా, కావేరిని తాము కాపాడుకోవడం లేదని ఆమె గ్రహించింది. పైగా యష్మి కావేరి నదిని పూజించే కొడవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలోని అమ్మాయి. వెంటనే ఆమె కొడగు వెళ్లిపోయి, కావేరీ నది అందాలను అనేక కోణాలలో షూట్ చేసింది. వాటిని కథానుగుణంగా ఎడిట్ చేసింది. నేపథ్య గీతంగా కొడవలకు ప్రత్యేకమైన భక్తి పాటను ఉంచింది. అంత అందమైన కావేరి నది.. కాలుష్యం కారణంగా ఎలా అంద విహీనం అయిపోతున్నదో చూపించింది. వీడియో చివర్లో ‘లెటజ్ హీల్ హర్. నాట్ ఫిక్స్ హర్’ అనే సందేశంతో.. యువతీ యువకులు కావేరి నది స్వచ్ఛత ను పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దృశ్యరూపకంగా జత చేసింది. ఇంత అద్భుతం గా చేశాక యష్మి విజేత కాకుండా ఉంటుందా! అయింది. త్వరలో హవాయి వెళ్లబోతోంది. ‘‘నా చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది. అమ్మ చిన్నప్పుడు కొడగు ప్రాంతం ఎంతో అందంగా ఉండేదట. ‘భారీగా వర్షాలు పడేవి. చెరువులు స్వచ్ఛంగా ఉండేవి. నేను పెరిగి పెద్దయ్యేనాటికి వాతావరణంలో కాలుష్యాలు పెరిగినా వర్షాలేమీ తగ్గలేదు కానీ, నీటి స్వచ్ఛత తగ్గింది. నువ్వు పెద్దయి, నీ తర్వాతి తరం వచ్చాక నువ్వూ.. మా చిన్నప్పుడు ఇలా ఉండేది.. అని చెప్పకూడదని నా ఆశ. అందుకు మీ తరం వారే ఏదైనా చేయాలి. ఏదైనా కాదు. రెండు చేయాలి. కాలుష్యం తగ్గించాలి. పచ్చదనం పెంచాలి’’ అని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పిన మాటలనే నేను హవాయిలో నా వీడియో ప్రెజెంటేషన్‌లో చెబుతాను’’ అంటోంది యష్మి. వీడియో తయారు చేయడానికి తన కజిన్ భువన, ఆమె తండ్రి తనకు సహాయపడ్డారట. యష్మి తల్లి నళిని, తండ్రి కుశలప్ప తమ కూతురి కి యూఎస్ వెళ్లే అవకాశం రావడంతో సంతోషం గా ఉన్నారు. కరోనా కారణంగా ఆమె వెళ్లబోయే ‘ఓషన్ డికేడ్ సమ్మిట్’ అన్లైన్లో జరిగే అవకాశాలున్నా.. ‘నా సందేశం వెళ్లింది. అంతే చాలు’ అని అంటోంది యష్మి. -
షుమాకర్ అరుదైన వీడియోలతో... త్వరలో డాక్యుమెంటరీ విడుదల
జెనీవా: ఫార్ములావన్ (ఎఫ్1)కు చిరునామాగా నిలిచిన దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) జీవితానికి సంబంధించి అరుదైన అంశాలతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందుతోంది. ఏడుసార్లు ఎఫ్1 విశ్వవిజేతగా నిలిచిన ఈ జర్మన్ స్టార్ 2013లో ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ తీవ్ర ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను బయటి ప్రపంచానికి కనపడలేదు. ఒకవైపు అతనికి చికిత్స కొనసాగిస్తూనే... మరోవైపు 52 ఏళ్ల షుమాకర్ తాజా ఆరోగ్య స్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతని కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొత్త డాక్యుమెంటరీలో పలు ఆసక్తికర అంశాలు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు అతని ఆరోగ్యం గురించి కూడా స్పష్టత రావచ్చు. ముఖ్యంగా 2013 ప్రమాదం తర్వాత అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇందులో ఉండవచ్చని, షుమాకర్ భార్య ఈ ప్రైవేట్ రికార్డింగ్‌లను స్వయంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే రానున్న డాక్యుమెంటరీలోని అరుదైన వీడియోలు అభిమానులను అలరిస్తాయని రూపకర్తలు మైకేల్ వెక్–బ్రూనో కమర్టన్స్ భావిస్తున్నారు. డాక్యుమెంటరీ నిర్మాణం పూర్తయిందని, గత డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉన్నా... కరోనా కారణంగా ఆలస్యమైందని వారు చెప్పారు. -
ప్రాణం ఉన్న కథ చెబుతా
‘‘మనదేశంలోని ఓ అందమైన మహారణ్యంలో ఉంటున్న జంతుజీవాల గురించి ఎవరూ చెప్పని, ఎక్కడా వినని ప్రాణం ఉన్న కథను చెబుతాను’’ అంటున్నారు ప్రకాష్‌రాజ్. వచ్చే నెల 5న ప్రపంచపర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఓ ప్రముఖ చానెల్లో జూన్ 5న ‘వైల్డ్ కర్ణాటక’ అనే ఓ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీకి తెలుగు, తమిళ భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు ప్రకాష్‌రాజ్. ‘‘ప్రకృతికి గొంతుగా మారిన నా ఈ కొత్త ప్రయాణం అర్థవంతమైనది. వైల్డ్‌లైఫ్‌కి సంబంధించిన ఈ డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు ప్రకాష్‌రాజ్. ఈ ‘వైల్డ్ కర్ణాటక’ కన్నడ వెర్షన్‌కు రిషబ్‌శెట్టి, హిందీ వెర్షన్‌కు రాజ్‌కుమార్ రావ్ వాయిస్ ఓవర్ అందించారు. -
వలస కార్మికులపై కాంగ్రెస్ డాక్యుమెంటరీ
న్యూఢిల్లీ: ‘వలస కార్మిక సోదరీసోదరులారా.. దేశ బలం మీరే. దేశ భారాన్ని మీ భుజాల మీద మోస్తున్నారు. మీకు న్యాయం జరగాలని దేశం మొత్తం కోరుకుంటోంది. దేశ బలాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత’ అంటూ వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన డాక్యుమెంటరీలో దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధైర్యం నూరిపోశారు. (‘చిన్నమ్మ’కు ఇక నో ఎంట్రీ) వలస కార్మికుల కష్టాలను తెలుసుకొనేందుకు గత వారంలో రాహుల్ వారి వద్దకు వెళ్లి మాట్లాడిన వీడియో ఫుటేజీల నుంచి ఈ డాక్యుమెంటరీని తయారు చేశారు. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని శనివారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది వలస కార్మికుల ఖాతాలకు రూ. 7500 జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలస కార్మికులు పడుతున్న కష్టాలను ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపారు. Watch this short film in which I speak with India’s real nation builders, our migrant brothers & sisters. https://t.co/As99mjVvyt — Rahul Gandhi (@RahulGandhi) May 23, 2020 -
డాక్యుమెంటరీ ‘హీరో’ దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : అది రంజాన్ మాసం రోజులు. పాత ఢిల్లీలోని ఓ రోడ్డు మీద ఇల్లూ వాకిలి లేని ఓ యాభై ఏళ్ల అనాథ పడుకొని ఉన్నాడు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అతని మీదుగా దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అల్లంత దూరాన ఎగిరిపడ్డ ఆ అనాథ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు గుర్తు తెలియని వ్యకిగా పేర్కొంటూ శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి పంపించారు. పోస్టు మార్టమ్ అనంతరం 15 రోజులు అయినాగానీ ఆయన శవం మార్చురీలోనే ఉండిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి మరణించినప్పుడు స్థానిక పత్రికల్లో ఆయన ఫొటోగానీ, వార్తగానీ రావాలట. అప్పటి వరకు శవాన్ని శ్మశానికి పంపించమని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కనో, రోడ్డు డివైడర్ మీద గూడులేని పేదలు, అనాథలు పడుకుంటూనే ఉంటారు. నిర్లక్ష్యంగానో, తాగిన మైకంలోనో ట్రక్కులనో, బస్సులనో నడుపుకుంటూ రావడం, అవి రోడ్డు డివైడర్‌కో, ఫుట్పాత్లనో ఢీకొనడం, అనాథలు, అభాగ్యులు మరణించడం సర్వసాధారణం. అలాంటప్పుడు ‘రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి’ అనే శీర్షికన వార్త రావాలంటే కష్టమే. గుర్తు తెలిసిన వ్యక్తుల మరణిస్తేనే స్థలాభావం వల్ల వార్త రాదు. ఇక గుర్తు తెలియని వ్యక్తి గురించి ఎవరు పట్టించుకుంటారు? అలాంటి వారు ఎక్కడి నుంచి వచ్చారో! ఎలా బతికారో ఎవరికి ఎరుక! వారికి దహన సంస్కారాలుగానీ, నివాళులుగానీ ఉండవు. అసలు అలాంటి వారికి జీవించిన దాఖలాలు కూడా ఉండవు. ఆ రోజు ఆ రోడ్డు డివైడర్ మీద పడుకొని దుర్మరణం చెందిన వ్యక్తి మాత్రం గుర్తు తెలియని వ్యక్తి కాదు. ఆయన పేరు మొహమ్మద్ అబ్దుల్ కాసిం అలీ షేక్. రిక్షా కార్మికుడు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిదవ ఏట బతుకు తెరువు కోసం ఢిల్లీకి వచ్చాడు. బెంగాల్ నుంచి అయినవాళ్లెవరో బలవంతంగా పంపిస్తే ఢిల్లీకి వచ్చినట్లు ఆయనకు గుర్తు. పంపించిన వారు ఎవరో, ఏమిటో కూడా ఆయనకు గుర్తు లేదు. అప్పటి నుంచి చిన్న చితకా పనులు చేస్తూ దానితో దొరికిన కాడికి తింటూ రోడ్లపై పడుకుంటూ పెరిగాడు. లైంగిక వేధింపులు కాస్త యుక్త వయస్సు రాగానే షేక్‌కు లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో పని ఇప్పిస్తానంటూ, భోజనం పెట్టిస్తానంటూ మగవాళ్లే ఆ కుర్రవాణ్ని తీసుకెళ్లి వారి లైంగిక వాంఛలు తీర్చుకునేవారట. పూర్తి యవ్వనంలోకి అడుగుపెట్టాక అలాంటి వారిని దూరం పెట్టేందుకు నెలలకొద్ది స్నానం చేసేవాడు కాదట షేక్. అలా వారి పీడను వదిలించుకున్న అలీ షేక్, తాను కూడ బెట్టుకున్న డబ్బులతో సొంతంగా రిక్షా కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఆమన్ బిరాదరిలో తనలాంటి నిరాశ్రీయులు నడుపుతున్న అనాథాశ్రయంలో చేరాడు. ఓ రోజు ఆరోగ్యం బాగా లేక వైద్యుడిని దగ్గరికెళ్లి పరీక్షలు చేయించుకుంటే ‘ఎయిడ్స్’ వ్యాధి ముదిరిందని తెల్సింది. ఆయనపై డాక్యుమెంటరీ చిత్రం ఈ మధ్యన ‘కారవాన్ ఏ మొహమ్మద్’ అనే బృందం ఆయనకు తారసపడింది. సామాజిక సమస్యలపై పోరాడే ఆ బృందం అలీ షేక్ మీద చిన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసింది. అందులో ఆయన తన ఆత్మకథను చెబుతూ వలసవచ్చిన వారు ఎప్పుడూ నిరాశ్రీయులేనని, కష్టపడి డబ్బు సంపాదించి సొంతంగా ఇల్లు కట్లుకున్నాక కూడా ఈ నేల నీది కాదంటూ తరిమేస్తారంటూ ఓ బెంగాలీ కవితను ఉదహరిస్తాడు. అలీ షేక్ చనిపోయిన రోజున అనాథాశ్రమంలో దోమల బెడద తట్టుకోలేక రోడ్డు డివైడర్ మీదకు వచ్చి పడుకున్నాడు. ఆయన లాగా ఎంతోమంది అనాథలు. అభాగ్యులు ప్రాణాలను పణంగా పెట్టి డివైడర్లమీదనో, ఫుట్‌పాత్‌లపైనే పడుకోవడానికి అసలు కారణం దోమలేనట. వాహనాలు తిరేగే చోట వాహన కాలుష్యానికి దోమలు అస్సలు ఉండవట. రోడ్లపై వీచే గాలిలో వాహనాల శబ్దాలను తట్టుకొని నాలుగైదు గంటలు పడుకునేందుకు వారు అంతటి సాహసం చేస్తారు. రోజు చస్తూ బతికే జీవితాల్లో అదే అత్యంత సుఖం కాబోలు. పోలీసుల సహకారంలో ఆస్పత్రి మార్చురీ నుంచి అలీ షేక్ శవాన్ని స్వాధీనం చేసుకున్న ‘కారవాన్ ఏ మొహమ్మద్’ బృందం సభ్యులు ఆయనకు దహన సంస్కారాలు చేసి ఘనంగా నివాళులర్పించింది. -
నిర్మాతగా సోనమ్
భూతాపం ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. దీనిపై ప్రపంచ దేశాలు సదస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఎంటర్టైన్మెంట్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. అందుకే ఓ డాక్యుమెంటరీని తీయాలని నిర్ణయించుకుని, నిర్మాతగా మారారు. ఈ డాక్యుమెంటరీలో సోనమ్ కూడా నటిస్తారట. ఇంకో విశేషం ఏంటంటే.. ఐదుగురు డైరెక్టర్స్ ఈ డాక్యుమెంటరీ కోసం వర్క్ చేస్తారట. దీనికోసం ఇండియా, యూరప్, ఆస్ట్రేలియా, యూఎస్ దర్శకులను వెతికే పనిలో పడ్డారట సోనమ్ అండ్ టీమ్. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. సింగపూర్ బేస్డ్ రచయిత కృష్ణ ఉదయశంకర్ రాసిన ‘ఆర్యావర్తా క్రానికల్స్’ బుక్ రైట్స్‌ని కూడా సోనమ్ దక్కించుకున్న సంగతి తెలిసందే. -
నాప్కిన్స్కి నామినేషన్
కథిఖేరా... ఢిల్లీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. హాపూర్ జిల్లా. కొన్నాళ్ల కిందట అక్కడ మహిళల పరిస్థితి దారుణం. దేశంలోని చాలా ఊళ్లలాగే ఇక్కడ రుతుచక్రం గురించి చాలా అపోహలు, అంధ విశ్వాసాలూనూ. రుతు సమయం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లోని ఆడవాళ్లు ఎవరికంటా పడకుండా ఊరవతలకు వెళ్లి ఉండేవారు. ఇక అమ్మాయిలు పెద్దమనిషి అయ్యారు అంటే పెళ్లికి, సంసారానికి ఇంకా చెప్పాలంటే రేప్‌కి లైసెన్స్ వచ్చినట్టుగా భావించేవారట ఆ ఊళ్లో మగవాళ్లు. ఇలాంటి సామాజిక పరిస్థితులు, నెలసరి పట్ల అవగాహన లేమి ఉండేదక్కడ. సిగ్గుతో ఆడపిల్లలు చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యేవారు. అందుకే ఆ ఊళ్లో మొన్నమొన్నటి వరకు కూడా హైస్కూల్ పూర్తి చేసిన అమ్మాయి లేదు. రుతుసమయంలో శుభ్రత పాటించడం తెలియక ఎంతో మంది మహిళలు అనారోగ్యం పాలయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే రుతుచక్రం మొదలైన ఆడవాళ్లను అస్పృశ్యులుగా పరిగణించే సంప్రదాయం నెలకొందన్నమాట. అక్కడే విప్లవమూ మొదలైంది. అదీ మహిళల నుంచి! శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మెషీన్ వచ్చింది. రుతుచక్రం, రుతు సమయం పట్ల ఉన్న అపోహలు పోయాయి. ఆడవాళ్లే నాప్కిన్స్ తయారు చేస్తూ మార్కెట్ కూడా వాళ్లే చేసుకుంటూ వాళ్ల ఆర్థిక పరిస్థితినీ మెరుగుపర్చుకున్నారు. ఆ నాప్కిన్స్కి ‘‘ఫ్లై’’ అనే పేరు పెట్టుకున్నారు. దాంతో ఆ ఊరి చిత్రమే మారిపోయింది. ఓ షార్ట్ డాక్యు మెంటరీగానూ రూపుదిద్దుకుంది.. అదే... ‘‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్’. ఆస్కార్ అవార్డ్స్ బరిలో డాక్యుమెంటరీ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది. ఈ డాక్యుమెంటరీకి లాస్ఏంజెల్స్లోని ఓక్వుడ్ స్కూల్, ఫెమినిస్ట్ ఫౌండేషన్ రెండూ కలిసి ఫండింగ్ చేశాయి. దర్శకత్వం.. రేయ్‌కా జెహ్తాబ్చీ. రేయ్‌కా జెహ్తాబ్చీ.. అమెరికాలో పుట్టిన ఇరానీ వనిత. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ డిగ్రీ చేశారు. మొదటి నుంచీ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ అంటే ఆసక్తి ఉన్న రేయ్కాకు ఫిల్మ్ మేకర్స్ అస్ఘర్ ఫర్హాది, పాల్ గ్రీన్గ్రాస్లే స్ఫూర్తి. ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’. డాక్యుమెంటరీ తీయడానికి నిర్మాతలు ఒక యంగ్ ఫిల్మ్‌మేకర్ గురించి వెదుకుతుంటే వాళ్లకు రేయ్‌కా గురించి తెలిసింది. అలా ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ‘‘ఓక్వుడ్ స్కూల్లోని పదిహేను నుంచి పదహారేళ్ల మధ్య వయసున్న అమ్మాయిలంతా ఇండియాలోని కథిఖేరా విలేజ్ మహిళల కోసం శానిటరీ నాప్కిన్ మెషీన్ కోసం ఆర్థిక సహాయం అందించడం, ఈ మెషీన్‌తో అక్కడి మహిళలు ఆరోగ్యంతోపాటు ఆర్థిక స్వావలంబననే సాధించడం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాకు అవార్డ్ వస్తుందా రాదా.. అన్నది సెకండ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్.. ఇది ఆస్కార్ డాక్యుమెంటరీ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నందుకే చాలా గర్వంగా ఉంది’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు రేయ్‌కా జెహ్తాబ్చీ. ఈ సినిమా షూటింగ్ అంతా కథిఖేరాలోనే తీశారు. అందుకోసం రేయ్‌కా రెండుసార్లు ఇండియాను సందర్శించారు. శానిటరీ వెండింగ్ మెషీన్ రాకముందు ఊళ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ ఊరివాళ్లను ఇంటర్వ్యూ చేయడానికి, తర్వాత షూటింగ్ కోసం. ఊళ్లోని చాలా మంది దీనిమీద మాట్లాడ్డానికి ఇష్టపడలేదట. ప్యాడ్స్ తయారు చేసే మెషీన్ నెలకొల్పడానికి, దాన్ని ఆడవాళ్లే నడుపుకునేలా చేయడానికి స్నేహా అనే అమ్మాయి చేసిన ప్రయత్నాన్ని తెలుసుకుని చలించి పోయిందట రేయ్‌కా. ఆ సంఘటననూ ఉన్నదున్నట్లే ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’లో పొందుపర్చారు రేయ్‌కా జెహ్తాబ్చీ. – శరాది -
ఎవరికో.. ఈ–నామ్!
నారాయణపేట / జడ్చర్ల : మార్కెట్ యార్డుల్లో ఇష్టారాజ్యంగా కొనసాగే జీరో దందాను నివారించడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ (జాతీయ వ్యవసాయ మార్కెటింగ్) విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 2016 సెప్టెంబర్ 8న నుంచి ఈ విధానం అమల్లో ఉంది. అందులో భాగంగానే జిల్లాలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, బాదేపల్లి (జడ్చర్ల) మార్కెట్ యార్డుల్లో ఈ విధానం కొనసాగుతోంది. అయితే, ఈ–నామ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న మార్కెట్లకు ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని నాలుగు మార్కెట్ల నుంచి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, బాదేపల్లి మార్కెట్ల నుంచి డాక్యుమెంటరీ సమర్పించగా.. నారాయణపేట, దేవరకద్ర మార్కెట్ యార్డు అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. వాటిని ఈనెల 15వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని యార్డుల వివరాలను పరిశీలించి 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తుంది. అమలు ఇలా... ఈ నామ్ పరిధిలోకి వచ్చిన మార్కెట్‌యార్డుల్లో కందులు, వేరుశనగ, గుర్రం శనగలు, పెసర, జొన్నలు, ఆముదాలు, వరిధాన్యం, పత్తి, చింతపండు, చింతగింజలు, తెల్ల, నల్ల కుసుమలు తదితర ధాన్యాన్ని ఆన్లైన్ విధానంలోనే కొనుగోలు చేస్తున్నారు. రైతు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని ఎంట్రెన్స్‌లోనే గేట్పాస్ తీసుకోవడం, విక్రయానికి పెట్టడం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయడం, తూకాలు, ధరలు ప్రకటించడం, విక్రయాలు పూర్తికాగానే వ్యాపారులు రైతులకు బ్యాంకు ద్వారా లేక నేరుగా డబ్బులు చెల్లించడం, ఈ పాస్‌ను రైతు కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. ఈ ధాన్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇంటర్నేట్లో చూసుకోని ఆన్లైన్ టెండర్లు వేసుకొని కొనుగోలు చేసుకోచ్చు. ధర ఎక్కువగా కోడ్ చేసిన వ్యాపారులకు ధాన్యం విక్రయించి రైతు లాభసాటి ధర పొందవచ్చు. పక్కగా అమలైతేనే.. మార్కెట్‌యార్డుకు వచ్చే సరుకు లెక్కల్లో తప్పుడు గీతలు, సిండికెట్లతో ధరలను నియంత్రించడం లాంటి వాటికి తెరపడుతుంది. బుక్కచిట్టీలపై కొనుగోళ్లకు, అధిక కమిషన్లు వసూళ్లకు అవకాశం చెక్‌పడుతుంది. డబ్బుల కోసం రైతులు నెలల కొద్ది వేచి ఉండాల్సిన పనిలేదు. తక్‌పట్టీలు ఆన్లైన్ ద్వారానే రైతులకు అందుతాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే జీరో దందాకు చెక్ పెట్టినట్లే. డాక్యుమెంటరీ తయారీ ప్రధాన మంంత్రి ‘ఇనామ్’కు డక్యూమెంటరీని తయారు చేసేందుకు పలు ఆంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్1, 2017 నుంచి 31 డిసెంబర్, 2018 వరకు ఈ నామ్ ద్వారా కోనుగోలు జరిగిన వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నామ్ ద్వారా ఇంత వరకు రైతులు ఎంత మంది తమ సరులకు విక్రయించారు. ఏయే ధాన్యాలను ఎంత మొత్తంలో విక్రయించారు. లాట్ నంబర్లు, వ్యాపారస్థులు వేసిన టెండర్లు, ధరల కోడ్లు, రైతులకు చెల్లింపులు, ధాన్యం తూకాలు తదితర వాటిని డక్యూమెంటరీగా తయారీ చేసి పంపించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అవార్డుల కోసం ప్రతిపాదనలు జిల్లా నుంచి రెండు వ్యవసాయ మార్కెట్ యార్డులను ఈ–నామ్ ఎక్స్లెంట్ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులను ఈ–నామ్ ఎక్స్లెంట్ అవార్డుల కోసం నివేదికలను తయారు చేసి పంపారు. ఈ రెండు మార్కెట్లో ఈ–నామ్ విధానం అమలు, పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ఆదాయం, మౌళిక వసతులు, తదితర వనరులకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తదితర వాటిని నివేదించారు. 2017–18 సంవత్సరానికి సంబంధించి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రూ.2.34 కోట్లు, మహబూబ్‌నగర్ యార్డుకు రూ.1.70 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆయా వివరాలను ఈనామ్ ఎక్స్లెంట్ అవార్డుల కోసం కేంద్రానికి నివేదించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి భాస్కరయ్య తెలిపారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ–నామ్ అవార్డులను ప్రకటించనుందని ఆయన పేర్కొన్నారు. -
తీశాక చూస్తే మీటూ అయింది!
వైష్ణవి సుందర్. వయసు 32. ఫిల్మ్ మేకర్. చెన్నైలో ఉంటారు. యాక్టివిస్టు, రచయిత్రి కూడా. ఇప్పటికే నాలుగు చిత్రాలు తీశారు వైష్ణవి. ఇప్పుడొక డాక్యుమెంటరీ తీశారు. అదే.. ‘బట్ వాట్ వజ్ షి వేరింగ్’. ఎక్కువ నిడివి గల డాక్యుమెంటరీ. దీర్ఘచిత్రం అనొచ్చు. ఇందులో.. ఉద్యోగం చేసే చోట లైంగిక వేధింపులకు గురైన 32 మంది మహిళల గురించి చెప్పారు. నవంబరు 3 న చెన్నైలోని మాక్స్ ముల్లర్ భవన్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మీ టూ ఉద్యమం మొదలవడానికి వైష్ణవి చిత్రీకరించిన మీ టూ కథలు, వ్యథలే ఇవన్నీ! ‘బట్ వాట్ వజ్ షి వేరింగ్’.. డాక్యుమెంటరీనే అయినప్పటికీ చిత్రం అనే అనాలి. 2013 లో వచ్చిన లైంగిక వేధింపుల (వర్క్‌ప్లేస్‌లో) నిరోధక చట్టాన్ని ఆధారంగా ఈ దీర్ఘచిత్రం నడుస్తుంది. అప్పట్లో ఉద్యోగాల్లో పురుషుల వల్ల ఇబ్బందులకు గురైన మహిళలు ఆ విషయాన్ని బయటకు చెప్పాలంటే భయపడేవారు. అవమానంగా భావించేవారు. మీ టూ వచ్చాక ఇప్పుడు కొంత నయం అయింది. ఇందులో వైష్ణవి సుందర్ ప్రధానంగా న్యాయపరమైన అంశాలను చూపారు. సుప్రీంకోర్టు 1997లో ఇచ్చిన విశాఖ గైడ్ లైన్స్‌ని కూడా ప్రస్తావించారు. లైంగిక వేధింపుల కేసులను విచారించడంలోని మార్గదర్శకాలవి. 110 నిమిషాల నిడివిలో ఉన్న ఈ చిత్రాన్ని 17 సెగ్మెంట్లుగా విడగొట్టారు వైష్ణవి. చట్టానికి సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి చర్చించారు. లైంగిక వేధింపుల కారణంగా మహిళల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బ తింటోందో కూడా తెలియచెప్పారు. చట్టం ఏం సాధించింది? డాక్యుమెంటరీ కోసం వైష్ణవి ముప్పై రెండు మందిని ఇంటర్వ్యూ చేశారు. సమాజంలో రకరకాల సామాజిక, ఆర్థిక, వృత్తుల విభాగాలకు చెందిన వారిని ఇందులో ప్రశ్నించారు. కొందరు ఈ సమస్యను ఎదుర్కొన్నవారు, కొందరు ఈ సమస్యను ఎదుర్కొన్నవారికి చేరువగా ఉన్నవారు సంభాషించారు. వీరంతా ^è ట్టానికీ, చట్టాన్ని అమలు చేయడానికి ఉన్న తేడా గురించి మాట్లాడారు. చట్టం ఏం సాధించింది అని ముందుగా ప్రశ్నించారు డాక్యుమెంటరీలో. ఇందులో ఒక విభాగానికి ‘‘దేర్ ఈజ్ యాక్ట్ నౌ, బట్ ఈజ్ దేర్ ఎ సొల్యూషన్’ అని పెట్టారు. ‘మీ టూ’ కథలే ఇవన్నీ!! ‘‘డాక్యుమెంటరీ తీయాలనుకున్నప్పుడు నాకు ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు. నాలో పరిశోధనాత్మక లక్షణం ఉండటంతో ఈ విధంగా రూపొందించాను’’ అంటారు వైష్ణవి. చిత్రీకరణ కోసం సుందర్ 2016లో పరిశోధన ప్రారంభించిన ప్పుడు తన పరిశోధన ఇప్పటి ‘మీ టూ’తో యాదృచ్ఛింగా కలుస్తుందని ఆమెకెలా తెలుస్తుంది? ‘‘నా డాక్యుమెంటరీ చూసి... ఇది టైమ్లీగా ఉంది అంటున్నారు. పది సంవత్సరాల క్రితమే ఉద్యోగ ప్రదేశంలో లైంగిక వేధింపుల గురించి చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ విడుదల కావడం అంతా కో ఇన్సైడ్’’ అంటారు వైష్ణవి. డాక్యుమెంటరీ తీయడానికి ఫండింగ్ పెద్ద సమస్య అయ్యింది వైష్ణవికి. ఫండింగ్ రాని థీమ్! ‘నేను గతంలో తీసిన సినిమాలకు ఫండింగ్ బాగా వచ్చింది. చాలామందిని స్వయంగా కలిసి అడిగాను. కాని ఈ దీర్ఘచిత్రం లైంగిక వేధింపుల అంశం కావడంతో అడగడానికి కొంచెం మొహమాటపడ్డాను. అదొక్కటే కాదు, మహిళలకి సంబంధించిన అంశాలకు ఫండింగ్ రావడం కూడా కష్టమే. దీని నిర్మాణానికి విరాళాలు అడిగినప్పుడు నాకు 100 రూ. 50 రూ. 10 రూ. వచ్చాయి. ప్రతి రూపాయినీ బ్యాంకులో జమ చేశాను. పది వేలు కాని, ఐదు వేలుకాని వస్తే డాక్యుమెంటరీ తీయడం సులభం అయ్యేది కాని, పది రూపాయల చొప్పున పోగు చేయడం వల్ల కాస్త ఇబ్బంది అనిపించింది’’ అంటారు వైష్ణవి. ఇందులో వైష్ణవి చేసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ బ్యాక్‌గ్రౌండ్ నలుపు రంగు వేశారు. ఇలా వేయడం వలన అందరినీ సమానంగా చూపినట్టు అవుతుందని ఆమె భావించారు. మనసు విప్పి మాట్లాడారు ‘‘ఒక సీఈవో మాట్లాడుతున్నప్పుడు ఆమె పని చేసే చోటును చూపలేదు. ఇక్కడ అది ప్రధానం కాదు. వారి సమస్యను ఫోకస్ చేయాలే కాని, వారి ఉద్యోగ ప్రదేశం కాదని భావించాను’’ అని వైష్ణవి సమాధానం. బాధితులు సామాన్యులైతేనేం, కోటీశ్వరులైతేనేం అనే భావనతోనే ఈ విధంగా చూపారు ఆమె. అలాగే బాధితులను టైట్ ఫ్రేమ్స్‌లో చూపారు. ‘‘వారు చెప్పే మాటలు వినాలనిపిస్తుంది. ఎందుకంటే వారు మనతో మాట్లాడుతున్నంత చక్కగా వివరాలు చెప్పారు’’ అంటారామె. ఈ డాక్యుమెంటరీలో అందరూ మహిళలే పనిచేయడం విశేషం. – జయంతి -
హడావుడిగా ప్రపంచ బ్యాంకు డాక్యుమెంటరీ చిత్రీకరణ
తుళ్లూరు: రైతుల భూములను చూపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన తుళ్లూరులోని స్థానిక సీఆర్డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఏపీసీఆర్డీఏ, ఏడీసీ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు డాక్యుమెంటరీ షూటింగ్ జరిగింది. అయితే ప్రపంచ బ్యాంకుకు రైతుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ రూపంలో అందజేసేటప్పుడు రాజధాని ప్రాంత రైతులకు ముందస్తు సమాచారం ఇవాల్సి ఉంటుంది. రైతులందరూ ఎక్కడ తమ సమస్యలు చెప్పుకుంటారోననే ఆందోళనతో గుట్టుచప్పుడుగా, తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు రైతులతో మాట్లాడించి హడావుడిగా ముగించేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని రైతులు తమకు సమాచారం ఇవ్వకుండా డాక్యుమెంటరీకి అభిప్రాయాలు ఎలా సేకరిస్తారని మండిపడుతున్నారు. తొలుత తమ భూములకు çసంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో తమ భూములతో ప్రభుత్వం రుణాలు పొందాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. -
‘థాయ్ గుహ’పై డిస్కవరీలో డాక్యుమెంటరీ
న్యూఢిల్లీ: వరదనీటితో నిండిన థాయిలాండ్ గుహ నుంచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సాహసోపేతమైన ఘటనను డిస్కవరీ చానెల్ డాక్యుమెంటరీగా ప్రసారంచేయనుంది. 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను కాపాడేందుకు అంతర్జాతీయ డైవింగ్ నిపుణుల బృందాలు చేసిన అవిశ్రాంత కృషిని ఆద్యంతం ఆసక్తికరంగా డాక్యుమెంటరీలో చూపనున్నారు. డిస్కవరీ చానెళ్లలో ఈ డాక్యుమెంటరీ గంటపాటు ఈనెల 20 (శుక్రవారం)న రాత్రి 9గంటలకు ప్రసారంకానుంది. -
సన్నీలియోన్ కన్నీరుమున్నీరు..
ముంబై : బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కన్నీరుమున్నీరయ్యారట. ఈ రాత్రి నా హృదయం వెయ్యి ముక్కలైందంటూ బుధవారం రాత్రి ఆమె ట్వీట్ చేశారు. సన్నీ ట్వీట్ వెనుక ఆమె జీవిత పయనం ఉంది. అవును తన జీవిత గాథను చిత్ర రూపంలో వీక్షించిన అనంతరం సన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘కరణ్ జీత్ కౌర్-ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’అనే డాక్యుమెంటరీని సన్నీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. My heart broke a thousand times tonight...probably cried a thousand tears tonight wanting, longing, missing, regreting, and wishing I could have you close to me once more. That day will never come but in my heart you will always remain! #karenjitkaur guilty of doing it my way!!! pic.twitter.com/lOJfmBt1li — Sunny Leone (@SunnyLeone) 23 May 2018 కరణ్ జీత్ కౌర్ సన్నీ అసలు పేరు. పోర్న్‌స్టార్‌గా సన్నీ ఎలా మారారు. ఏ పరిస్థితుల్లో ఆమె అటువైపు అడుగేశారనే విషయాలను డాక్యుమెంటరీలో చూపించినట్లు తెలుస్తోంది. కాగా, తనపై రూపొందిన డాక్యుమెంటరీని ప్రత్యేక ప్రదర్శనతో వీక్షించిన సన్నీ భావోద్వేగానికి గురయ్యారు. ‘నీలి చిత్రాల ప్రపంచంలోకి రాకముందు తాను ఎలా ఉండేదాన్నో.. అలా మళ్లీ కావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు ఎప్పటికీ రాదని నాకు తెలుసు. నా పాత వ్యక్తిత్వం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. డాక్యుమెంటరీ చూసిన తర్వాత తప్పు చేశానన్న భావన కలిగింది.’అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. -
‘మహానటి’కి కౌంటర్
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహానటి సినిమాతో ఈ ట్రెండ్ దక్షిణాదిలోనూ ఊపందుకుంది. తాజాగా మరో బయోపిక్ తెరమీదకు రానుంది. అయితే ఆ బయోపిక్ మహానటి కి కౌంటర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రి వేదించినట్టుగా తాగుబోతుగా చూపించారని అది నిజం కాదని ఆమో వాదిస్తున్నారు. అంతేకాదు త్వరలో జెమినీ గణేషన్ కథతో ఓ డాక్యుమెంటరినీ రూపొందిస్తున్నట్టుగా కమల వెల్లడించారు. మహానటి వివాదం తెర మీదకు వచ్చిన తరువాత జర్నలిస్ట్ అనుపమా సుబ్రమణియంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒక వైపు నుంచి మాత్రమే చూపించారని అందుకే తన తండ్రి అసలు ఎలాంటి వారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు. గంటా నలబై నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరబాద్‌లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని వెల్లడించారు. -
శ్రీదేవి ఎవరు?
నాలుగేళ్ల వయసులో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి జీవితంలో ఎక్కువ భాగం నటిగానే కొనసాగారు శ్రీదేవి. భౌతికంగా లేకపోయినా.. నటించిన చిత్రాలు, విభిన్నమైన పాత్రల రూపంలో ప్రేక్షకుల హృదయాల్లో ఆమె నిలిచే ఉంటారు. ఇలాంటి గొప్ప నటి జీవిత చరిత్ర ఆదర్శనీయమైంది. రాబోయే కథానాయికలకు మార్గనిర్దేశం లాంటిది. అందుకే శ్రీదేవి లైఫ్‌స్టోరీతో ఆమె భర్త బోనీకపూర్ ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నారని బీటౌన్‌లో స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. అందుకోసం ఈయన ‘శ్రీ, శ్రీదేవి, శ్రీ మ్యామ్’ అనే టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీదేవి పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించగల నటి ఎవరు? అన్న ఆసక్తి హట్‌టాపిక్‌గా మారింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి కూమార్తెలు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే శ్రీదేవి లేరనే బాధ నుంచి తేరుకున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా జరిగిన ఓ వేడుకలో పక్కనున్న ఫొటోలోలా ఫన్నీగా కనిపించారు జాన్వీ అండ్ ఖుషీ. -
కొలవలేని శబ్దాలు
నిస్పృహకూ ఒక ధ్వని ఉంటుంది. అది మన లోపలి నుంచి వచ్చే శబ్దం. ఆ శబ్దాన్ని మన ముఖంపై కనిపించే భావాలతో ఈ లోకాన్ని కొలవనివ్వకూడదు. క్వీన్ ఎలిజబెత్ చెట్లను ప్రేమిస్తారు. రాణిగారికి ఉన్న ఈ చెట్ల ప్రేమపై ప్రకృతివేత్త (నేచురలిస్ట్) డేవిడ్ ఎటెన్‌బరో ‘ది క్వీన్స్ గ్రీన్ ప్లానెట్’ అనే డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఆ పని మీదే మంగళవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని పూలవనంలో ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. రాణిగారు అతడికి ఏదో చెప్పబోతుంటే పైన వెళుతున్న హెలికాప్టర్ చెప్పనివ్వడం లేదు! అట్నుంచటు, ఇట్నుంచటు మాటలకు అసౌకర్యం కలిగించే పెద్ద ధ్వనితో తిరుగుతూనే ఉంది. రాణిగారికి చికాకు వేసింది. పైగా ఈ తొంభై రెండేళ్ల వయసులో చెప్పిందే చెప్పడం ఎవరివల్ల మాత్రం అవుతుంది? ‘‘ఏదైనా మాట్లాడుతున్నప్పుడే ఈ హెలికాప్టర్లు ట్రంప్లాగో, ఒబామాలాగో రొదపెడతాయెందుకో?’’ అని ఆమె నిస్పృహ చెందారు. రాణిగారిలోని ఈ ‘సెన్సాఫ్ హ్యూమర్’ను ఉత్తర, దక్షిణార్థ గోళాలు రెండూ ఉదయపు వేళ తేనీటి కప్పులతో చక్కగా ఆస్వాదించాయి. రొద పెట్టేవారు నిత్య జీవితంలో మన చుట్టూ ఉంటారు. వారు మనల్ని మాట్లాడనివ్వరు, ఆలోచించనివ్వరు. నేరుగా వచ్చి ఏమీ వారు మన ధ్యాసను మరల్చరు కానీ వారి ధోరణిలో వారు డబడబమని ‘శబ్దాలు’ చేస్తూనే ఉంటారు. శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారు. అయితే వీళ్లు చేసే శబ్దాలను దేనితోనూ కొలవలేం.. మన నిస్పృహతో తప్ప! సదస్సులు, సమావేశాలు, సంభాషణలు, ఆఖరికి.. కుటుంబంలో కూడా నిత్యం ఈ కొలవలేని శబ్దాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. చెప్పేది వినరు. వినకపోవడం శబ్దం. చెబుతున్నది చెప్పనివ్వరు. చెప్పనివ్వకపోవడం శబ్దం. నొసలు విరుపు, పెదవి బిగింపు.. ఇవీ శబ్దాలే. మన కోసమని లోకం చప్పుడు చెయ్యకుండా ఉండదు. తన లోకంలో తను ఉంటుంది. తనకు తెలీకుండానే మన లోకంలోకి వచ్చి వెళుతుంది.. రాణిగారి తలపై తిరిగిన హెలికాప్టర్లా! అప్పుడు రాణిగారైనా, సాధారణ మనుషులైనా నిస్పృహ చెందడం సహజమే. అయితే నిస్పృహకూ ఒక ధ్వని ఉంటుంది. అది మన లోపలి నుంచి వచ్చే శబ్దం. ఆ శబ్దాన్ని మన ముఖంపై కనిపించే భావాలతో ఈ లోకాన్ని కొలవనివ్వకూడదు. అమెరికా అధ్యక్షులపై బ్రిటన్ రాజమాత వేసిన సున్నితమైన సెటైర్లో కనిపిస్తున్న అందమైన జీవిత సత్యం ఇది. చికాకులపై ఇంత సాల్ట్ వేసుకుంటే అవీ రుచిగానే ఉంటాయి. – మాధవ్ శింగరాజు -
ఆ పదాలకు కూడా కట్ లేకుండా సెన్సార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, కోల్‌కతా : ఎట్టకేలకు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ డాక్యుమెంటరీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలో నిషేధించిన ఆ నాలుగు పదాలకు కూడా సీబీఎఫ్సీ (కేంద్ర చిత్ర సెన్సార్ బోర్డు) ఓకే చెప్పింది. అమర్త్యసేన్ జీవితం-సేవలపై 'ది ఆర్గుమెంటేటివ్ ఇండియన్' పేరిట జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ డైరెక్టర్ సుమన్ ఘోష్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. దాదాపు గంటపాటు ఉండే ఈ డాక్యుమెంటరీ గత ఏడాది వివాదంలో చిక్కుకుంది. ఇందులో నాలుగు పదాలు (ఆవు, గుజరాత్, హిందుత్వ, హిందూ) అనే పదాలు తొలగించాలని, లేదంటే సర్టిఫికెట్ ఇవ్వబోమంటూ కోల్‌కతా సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. దీంతో గత ఏడాది నుంచి ఇది విడులకు నోచుకోలేదు. అయితే, 'ఇటీవలె సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి ఈ డాక్యుమెంటరీ ముంబయిలో ఇతర బోర్డు సభ్యులతో చూశారు. అనంతరం ఎలాంటి కట్లు చెప్పకుండా డాక్యుమెంటరీ విడుదల చేసుకోవచ్చని అన్నారు' అని ఘోష్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి తనకు వ్రాత పూర్వక అనుమతి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ రెండు పార్టులుగా తీశారు. -
భారత్–రష్యా దౌత్యసంబంధాలపై లఘుచిత్రం
న్యూఢిల్లీ: భారత్–రష్యా మధ్య ఉన్న 70 ఏళ్ల దౌత్య సంబంధాలపై లఘుచిత్రం నిర్మించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి గాను పాత ఛాయాచిత్రాలు, వీడియో క్లిపింగ్‌లు పంపాలని రష్యాను ఆ శాఖ సీనియర్ అధికారి సోమవారం కోరారు. రెండు దేశాల మధ్య 1947లో దౌత్యసంబంధాలు మొదలయ్యాయని తెలిపారు. ఇరుదేశాల 70వ దౌత్యసంబంధాల వార్షికోత్సవం సందర్భంగా ఈ లఘుచిత్రాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రదర్శిస్తామన్నారు. -
అఘోరాలపై చిత్రం.. ఇండో అమెరికన్ల వ్యతిరేకత
వాషింగ్టన్: హిందూధర్మ సిద్ధాంతాన్ని వేలెత్తిచూపుతూ అంతర్జాతీయ చానెల్ సీఎన్ఎన్ అమెరికాలో అఘోరాలపై ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారతీయ అమెరికన్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు 600 మందికి పైగా ఇండియన్ అమెరికన్స్ చికాగోలోని సీఎన్ఎన్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రేజా అస్లాన్ అనే దర్శకుడు చిత్రించిన 'బిలీవర్' డాక్యుమెంటరీలో హిందు ధర్మశాస్త్ర గౌరవానికి భంగం కలిగేలా సన్నివేశాలు ఉన్నాయని నిరసనకారులు చెప్పారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికాలో ప్రశాంతంగా జీవిస్తున్నారని, అస్లాన్ అనే దర్శకుడు హిందూఇజాన్ని తప్పుగా చూపుతూ ఓ డాక్యుమెంటరీ చేశారని విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా(వీహెచ్‌పీఏ) అధ్యక్షుడు శాంకాంత్ సేత్ అన్నారు. బిలీవర్ను ప్రసారం చేయెద్దని గతంలోనే సీఎన్ఎన్ను కోరినట్లు వెల్లడించారు. తమ మాటలు ఖాతరు చేయకుండా డాక్యుమెంటరీని ప్రసారం చేసి సీఎన్ఎన్ ఘోరమైన పొరబాటు చేసిందని చెప్పారు. అస్లాన్ వారణాసిలోని అఘోరాలను కలిసిన తర్వాతే ఈ డాక్యుమెంటరీని చిత్రించామని చెబుతున్నారని అన్నారు. కానీ ఆయన కలిసింది అతి కొద్దిమందినేనని చెప్పారు. యోగా, స్పిరిచ్యూవాలిటీ లాంటి గొప్ప విద్యలను ప్రపంచానికి అందించిన హిందూఇజంపై అస్లాన్ ఇలాంటి షో ఎందుకు చేశారో తనకు అర్ధంకావడం లేదని అన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని కరపత్రాలను నిరసనకారులకు అందజేశారు. కాగా, భారతీయ అమెరికన్ల నిరసనలపై స్పందించిన దర్శకుడు అస్లాన్.. తాను చిత్రించిన డాక్యుమెంటరీ హిందూఇజంపై కాదని, అఘోరాలు వాళ్లు చేసే దారుణమైన ఆచారాల గురించని చెప్పారు. అయితే, డాక్యుమెంటరీలో కులవివక్షపై చూపిన కొన్ని దృశ్యాలు కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చని అన్నారు. -
డీఎన్ఏలో లఘుచిత్రం!
న్యూయార్క్: డీఎన్ఏలో ఓ లఘుచిత్రం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తోపాటు వేరే డేటాను పరిశోధకులు విజయవంతంగా పొందుపరిచారు. స్పెయిన్ లోని గుహల్లో 4.3 లక్షల ఏళ్ల పూర్వీకుడికి సంబంధించిన ఎముకల నుంచి సేకరించిన డీఎన్ ఏలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ జినోమీ సెంటర్(ఎన్ వైజీసీ)కి చెందిన పరిశోధకులు ఈ మేరకు డేటాను పొందుపరిచారు. క్యాసెట్ టేపులు, సీడీల మాదిరిగా డీఎన్ ఏ పాడైపోదని కొలంబియా వర్సిటీకి చెందిన యానివ్ ఎర్లిచ్ పేర్కొన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ‘అరీవల్ ఆఫ్ ఏ ట్రైన్ ఎట్ లా సియోటట్’ అనే 1895 సంవత్సరపు ఫ్రెంచ్ సినిమా, 50 డాలర్ల అమెజాన్ గిఫ్ట్ కార్డు, కంప్యూటర్ వైరస్, పయోనీర్ చిహ్నం కొన్ని ఫైళ్లను క్రోఢీకరించి డీఎన్ ఏలో పొందుపరిచారు. మొత్తం ఆరు ఫైళ్లకు సంబంధించిన 215 పెటాబైట్స్ను ఒక గ్రామ్ డీఎన్ఏలో నిక్షిప్తం చేసినట్లు ఎర్లిచ్ చెప్పారు. -
‘స్వచ్ఛసంకల్పం’పై డాక్యుమెంటరీ
రంపయర్రంపాలెం (గోకవరం) : మండలంలోని రంపయర్రంపాలెం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం స్వచ్ఛసంకల్పంపై డాక్యుమెంటరీ చిత్రీకరించారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పాఠశాలతో పాటు గ్రామంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛసంకల్పానికి సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారావు పర్యవేక్షించారు. బృందం సభ్యలకు ఆయన పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గతేడాది డిసెంబర్ 31న జిల్లాలో ప్రతి మండలంలోని ఒక పాఠశాలను స్వచ్ఛ సంకల్పం పాఠశాలగా ఎంపిక చేసి, ఆయా పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికీ పది మంది చొప్పున విద్యార్థులను బృందాలుగా ఎంపిక చేశామన్నారు. వీరితో పాఠశాలలు పని చేయని సమయంలో గ్రామంలో తిరుగుతూ స్వచ్ఛభారత్ గూర్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ యేడాది జిల్లాలో 500 పాఠశాలలకు దీనిని విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన రంపయర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడంతో ప్రభుత్వం ఈ పాఠశాలలో డాక్యుమెంటరీ తీసేందుకు నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో గ్రామ దత్తత పార్ట్నర్ బి.సువర్ణకుమార్, డీవైఈఓ ఎస్.అబ్రహాం, ఎంపీడీఓ కె.రత్నకుమారి, ఎంఈఓ కె.ఉదయభాస్కర్చౌదరి, సర్పంచ్ కర్?ర అరుణకుమారి, స్థానిక నాయకులు దొడ్డా విజయ్, రాయవరపు శ్రీనివాసరావు, హెచ్ఎం కోలా సత్యనారాయణ, కార్యదర్శి హనుమంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆ హీరోయిన్‌పై సొంతూరిలోనే వెలివేత!
బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత సన్నీ లియోన్ ఇమేజ్ మారిపోయింది. నటిగా విజయం సాధించిన ఆమె మోస్ట్ ఫేమస్ ఇండియన్-కెనడియన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇటు భారత్‌లో, అటు కెనడాలో ఆమెను అంగీకరిస్తున్నప్పటికీ.. సొంతూరిలో మాత్రం ఆమె పట్ల విముఖత వ్యక్తమవుతోంది. ఆమె గురించి మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకురావడం లేదు. ఆమెపై ఒక రకమైన సాంఘిక బహిష్కరణ భావం అక్కడ వ్యక్తమవుతుండటం గమనార్హం. తాజాగా సన్నీ లియోన్ జీవితంపై 'మోస్ట్లీ సన్నీ' పేరిట ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ఈ డాక్యుమెంటరీలో ఆమె గురించి మాట్లాడేందుకు సొంతూరు వాసులు ఒక్కరూ ముందుకురాలేదు. కెనడియన్ ఒంటారియో ప్రావిన్స్‌లోని సార్నియా పట్టణంలో సన్నీ 35 ఏళ్ల కిందట జన్మించింది. ఆమె అసలు పేరు కెరెన్జిత్ కౌర్ వోహ్రా. సంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టిన ఆమె పెంట్‌హౌస్ పెట్గా కనిపించి పేరు సాధించింది. ఆ తర్వాత పోర్న్‌స్టార్‌గా మారిన ఆమె గురించి ప్రముఖ ఫిల్మ్ మేకర్ దిలీప్ మెహతా రూపొందించిన ఈ డాక్యుమెంటరీని తాజాగా టోరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. సన్నీ లియోన్‌ను బాలీవుడ్ నటిగా ఇప్పుడు చాలామంది అంగీకరిస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకలు వంటి వాటికి పిలిచి ఆమెతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. కానీ ఆమె సొంతూరైన సార్నియాలోని భారత సంతతి కెనడియన్లు మాత్రం ఆమె పేరు ఎత్తితే చిరాకు పడుతున్నారు. ఈ డాక్యుమెంటరీలో ఆమె గురించి మాట్లాడటానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదని, ఆమెను వారు ఏమాత్రం అంగీకరించడం లేదని ఫిల్మ్ మేకర్ దిలీప్ మెహతా తెలిపారు. -
పుష్కరాలపై ఎన్జీసీ డాక్యుమెంటరీ
విజయవాడ(గుణదల) : కృష్ణా పుష్కరాలు–2016పై నేషనల్ జాగ్రఫీ చానల్ డాక్యుమెంటరీ తీస్తోంది. జిల్లాలోని వివిధ ఘాట్‌ల్లో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించే విధానం, పిండ ప్రదానం చేసే పద్ధతి, దానాలు ఇచ్చే అంశాలపై గంట నిడివి ఉండే డాక్కుమెంటరీ తీయనుంది. ఈ చానల్లో ప్రసారమయ్యే ఇన్సైడ్ ఇండియా అనే కార్యక్రమంలో కృష్ణాపుష్కరాల ప్రాశస్త్యాన్ని, నదీ పరీవాహక ప్రాంతాల విశిష్టతలను, పుణ్యక్షేత్రాలను, ఇక్కడి ఆచార వ్యవహారాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నారు. అందుకోసం చానల్ బృదం పద్మావతి ఘాట్‌లో శుక్రవారం ఉదయం గంటపాటు వీడియో షూటింగ్ తీశారని అధికారులు తెలిపారు. -
'ఇండియాస్ డాటర్' పై జోక్యానికి నిరాకరణ..!
న్యూఢిల్లీః 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ నిషేధంపై జోక్యానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 2012 లో డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మహిళలపై అకృత్యాలకు మాయని మచ్చగా నిలిచింది. అయితే నిర్భయ గ్యాంగ్ రేప్ స్టోరీని బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడంతో వివాదం తలెత్తింది. డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో కింది కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా.. అదే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ ఢిల్లీ హైకోర్టు వివరించింది. నిర్భయ గ్యాంగ్ రేప్ పై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ప్రసారాల అనుమతిపై ఇప్పటికే ట్రయల్ కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉండగా.. తాము దీనిపై కల్పించుకునేది లేదని జస్టిస్ జి రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ ల తో కూడిన ధర్మాసనం తెలిపింది. -
ప్రేమకు ప్రతిరూపం.. చింపూ
పాతికేళ్లయినా మరువని వానరాలు... మానవత్వం, ప్రేమ, అనురాగాలు మనుషుల్లో ఉండే సహజ గుణాలు. కానీ ఇవి అందరికీ ఉండవు. ఉన్నా.. ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే. ఎవరైన మనకు సహాయం చేస్తే వాళ్లను కొంతకాలం గుర్తుంచుకుంటాం. ఎదుటి వ్యక్తులు చేసిన సహాయాన్ని ఏళ్ల తరబడి గుర్తుంచుకోవాలంటే వారు మనల్ని తరచూ కలుస్తూ ఉండాలి. వరుసగా ఓ పదేళ్లు కనబడకుంటే దాదాపు మరచిపోతాం. మానవులను మించి తమకు ప్రేమానురాగాలు ఉన్నాయంటూ నిరూపించాయి ఫ్లోరిడాలోని చింపాంజీలు. ఏకంగా 25 ఏళ్ల తర్వాత తమకు శిక్షణ ఇచ్చిన ట్రెయినీని మాత్రం మర్చిపోలేదు. తల్లిలా పెంచి పోషించిన ఆ శిక్షకురాలిని చూడగానే తమలో ప్రేమానురాగాలను ఆనంద భాష్పాల రూపంలో చూపిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాయి. మూగ సైగలతో తమ ప్రేమను చాటుకున్నాయి. ప్రయోగాల కోసం... సాధారణంగా శాస్త్రవేత్తలు మానవులకు వచ్చే పలు రోగాలకు సంబంధించి ఏ ఒక్క మందును కనిపెట్టినా మొదటగా చింపాంజీలపై ప్రయోగిస్తారు. ఇప్పటివరకు కనుగొన్న మందుల్లో 95 శాతం వీటిపై ప్రయోగించినవే. దీనికి కారణం చింపాంజీల డీఎన్ఏ 98.8 శాతం మానవుల డీఎన్ఏను పోలి ఉండడం. 1974 వచ్చిన హెపటైటిస్ వ్యాధికి పరిశోధకులు మందు కనిపెట్టారు. దీన్ని చింపాంజీలపై ప్రయోగించేందుకు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఓ ల్యాబరేటరీని ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని చింపాంజీలను బంధించి వాటికి ఆవాసం కల్పించారు. వీటిపై పరిశోధన చేస్తున్న సమయంలోనే వాటిని బయటి ప్రపంచంలో ఎలా బతకాలో నేర్చించేందుకు కొంత మంది శిక్షకులను నియమించారు. వీరిలో దక్షిణ ఫ్లోరిడాకు చెందిన‘ లిండా కోబనార్’ కూడా ఉన్నారు. అప్పటికే కోబనార్ జంతువుల ప్రవర్తన విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చింపాంజీలపై పరిశోధనతో పాటు శిక్షణ కూడా ఆరేళ్ల పాటు కొనసాగింది. ఈ సమయంలో కోబనార్ చింపాంజీలను ఎంతో ప్రేమగా చూసేవారు. వాటికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలను సమయానుసారంగా అందించేది. ఆప్యాయతగా వాటికి పాలు పట్టించేది. ఆరేళ్ల అనంతరం హెపటైటిస్పై చేసిన ప్రయోగం విజయవంతమవడంతో వాటికి లాబరేటరి నుంచి విముక్తి లభించింది. అనంతరం ఫ్లోరిడాలోని అటవీ ప్రాంతంలో చింపాజీలు ఉండేందుకు ఓ విశాలమైన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. లూసియానాకు పయనం చింపాజీలకు శిక్షణ అనంతరం కోబనార్ అక్కడి నుంచి అమెరికాకు దక్షిణాగ్రంలో ఉన్న లూసియానా రాష్ట్రానికి వెళ్లిపోయింది. జంతువులపై తనకు ఉన్న ప్రేమానురాగాలతో అక్కడ కూడా ఓ చింపాంజీ అభయారణ్యం పేరుతో మరికొన్ని చింపాజీలను పెంచింది. అలా నాలుగేళ్లపాటు వాటి ఆలనాపాలనా చూసింది. అనంతరం చింపాజీలపై 1998లో కోబనార్ ఓ చిత్రాన్ని నిర్మించింది. విస్డమ్ వరల్డ్ పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రంలో సమాజంతో ఎలా మెలగాలి అనే విషయం మానవులు చింపాజీల నుంచి తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ జంతువులు మనుషుల్లాగానే ప్రేమానురాగాలను పంచుకుంటాయని ఈ చిత్రంలో చూపించారు. గుర్తున్నానా? దాదాపు 25 ఏళ్ల అనంతరం కోబనార్ ఫ్లోరిడాలోని చింపాజీల ఆవాసానికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో ఆమె శిక్షణ ఇచ్చిన చింపాంజీల్లో కొన్ని అక్కడ ఉన్నాయి. చాలా ఏళ్లు గడవడంతో కోబనార్ వాటిని దూరం నుంచే చూడాలనుకుంది. మీకు నేను గుర్తున్నానా? అంటూ వాటిని పలకరించింది. వెంటనే అక్కడ ఉన్న స్వింగ్ అనే చింపాజీ కోబనార్ వైపుకు దూసుకువచ్చింది. దాని ముఖంలో నవ్వులు విరజిమ్ముతూ కోబనార్ దగ్గరకు వచ్చి ఆమె రెండు చేతులను పట్టుకుంది. నన్ను గుర్తుపట్టావా? అని కోబనార్ మళ్లీ అనడంతో ఒక్క సారిగా తన రెండు చేతులతో ఆమెను కౌగిలించుకొని తన మనసులోని ప్రేమను వెలుబుచ్చింది. కోబనార్ ఎంతో ఆనందంతో ఆ చింపూని బిగ్గరగా ఆలింగనం చేసుకుంది. స్వింగ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన ‘డాల్’ అనే మరో చింపాజీ కూడా కౌగిలించుకొని ఆనంద భాష్పాలు కురిపించింది. 25 ఏళ్ల తర్వాత తనను గుర్తు పెట్టుకుని ప్రేమగా కురిపించడంతో కోబనార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. (25 ఏళ్ల క్రితం ఫోటో) -
జీహాదీలుగా ఎలా మారుతున్నారు..?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్ధ. ప్రపంచంలోని ముస్లిం యువతను ఆకర్షిస్తూ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోతున్న ఈ సంస్థ వైపు యువతరం ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఈ అంశంపై ఆసక్తితో రామ్ జీ అనే ఫ్రెంచ్ జర్నలిస్టు ఫ్రాన్సులోని ఇస్లామిక్ సపోర్టర్లతో అనుబంధాన్ని పెంచుకుని 'అల్లా సోల్జర్స్' అనే పేరుతో ఓ డాక్యుమెంటరీని తయారు చేశాడు. ఈ చిత్రం సోమవారం ఫ్రాన్స్ దేశంలో విడుదల కానుంది. ఇస్లామిక్ స్టేట్ గురించి తెలుసుకోవాలంటే.. ఏం చేయాలి? అనే ప్రశ్న మొదట రామ్ జీ కి ఎదురయింది. అందుకు ఐఎస్ఐఎస్ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా సాధనాన్ని రామ్ కూడా ఉపయోగించి స్థానిక ఇస్లామిక్ సానుభూతిపరులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వారిని మొదట ఫ్రాన్స్ లోని చాటె ఆరెక్స్ అనే పట్టణంలో ఆ గ్రూప్ ( మొత్తం ఒక పెద్ద, 12 మంది యువకులు) కలిశారు. కలిసిన మరుక్షణంలోనే అబుహమ్జా అనే ప్రదేశంలో మానవబాంబు దాడి చేయాలని జర్నలిస్టును వాళ్లు కోరడం గమనార్హం. అప్పుడు వాళ్లలో రామ్ కు కనిపించింది ఒకటే.. ఈ ప్రపంచాన్ని ఎలాగైనా నాశనం చేయాలి. ఇది ఇస్లాంకు విరుద్ధం. సాధారణంగా ఇస్లాంను పాటించే వ్యక్తి ఇలా ఆలోచించడు. ఆ తర్వాతి సమావేశం ఒక మసీదు వద్ద ఏర్పాటు చేయగా.. పక్కనే ఉన్న ఎయిర్ పోర్టులో విమానాలను చిన్న రాకెట్ లాంచర్‌తో కూల్చివేయచ్చని చెప్పారు. ఆ గ్రూప్ పెద్ద గతంలో ఐఎస్ఐఎస్ లో చేరాలని ప్రయత్నించగా టర్కీ పోలీసులు అరెస్టు చేసి ఐదు నెలలపాటు జైలులో పెట్టారు. విడుదలయ్యే రోజు ఎన్క్రిప్టెడ్ టెలిగ్రామ్ మెసేజ్ లను ఉపయోగించి దాడులు ఎక్కడెక్కడ చేయాలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జనవరిలో వీరి గ్రూప్ లోని ఇద్దరే చార్లీ హెబ్డో మ్యాగజైన్ మీద దాడి చేసి 12 మందిని చంపారు. ఈ అంశాలన్నింటినీ హిడెన్ కెమెరాతో చిత్రీకరించిన రామ్ ఈ సోమవారం డాక్యుమెంటరీని పారిస్ లో ప్రదర్శించనున్నారు. -
తెల్ల దొంగలు
-
రిజిస్ట్రేషన్లపై లఘుచిత్రాలు
♦ అందుబాటులోకి తెచ్చిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ♦ వివిధ రకాల రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించే యత్నం ♦ సలహాలు, సూచనలతో నాలుగు డాక్యుమెంటరీలకు రూపకల్పన సాక్షి, హైదరాబాద్: ఇళ్లు, స్థలాలు, ఆపార్ట్మెంట్ల కొనుగోళ్ల సమయంలో అన్నీ నేనే చూసుకుంటాననే బ్రోకర్ల మాయలో పడి అనసరమైన పాట్లు పడవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హెచ్చరిస్తోంది. ఆస్తుల కొనుగోళ్ల విషయంలోనే కాదు.. విద్యా సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన సొసైటీల రిజిస్ట్రేషన్, బిజినెస్, కంపెనీలు ప్రారంభించేందుకు అవసరమైన ఫర్మ్ రిజిస్ట్రేషన్లపైనా అవగాహన కలిగుంటే మేలని సూచిస్తోంది. వివాహం రిజిస్ట్రేషన్ జరగకుంటే భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఇబ్బందులను కూడా తెలియజేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కొత్త పంథా ఎంచుకున్నారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం, రిజిస్ట్రేషన్‌పై కల్పించేందుకు 4 లఘుచిత్రాలు రూపొందించింది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రతిచోటా ఈ లఘు చిత్రాలను వీక్షించేలా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ registration.telangana.gov.in/videogallery.jsp ద్వారా అందుబాటులోకి తెచ్చారు. లఘు చిత్రాలు ఇవీ.. సమస్యల్లేని ఆస్తినే ఎంచుకోండి ఆస్తుల కొనుగోలు సమయంలో వాటి గత చరిత్ర తెలుసుకోకుంటే వచ్చే చిక్కులపై ‘జాగ్రత్త’ లఘుచిత్రంలో కళ్లకుకట్టారు. తక్కువ రేటుకు వస్తుందని సమస్యలున్న ప్రాపర్టీ కొనుక్కోవడం కంటే ప్రాబ్లమ్ లేని ఆస్తిని ఎంచుకోవడమే మేలని ఇందులో చూపారు. కొనబోయే ఆస్తి గత చరిత్రను లింక్ డాక్యుమెంట్, ఈసీ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చని, ఆపార్ట్మెంట్ల విషయంలో మున్సిపల్ అప్రూవల్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అలాగే కార్ పార్కింగ్, అన్డివెడైడ్ స్పేస్ వివరాలను కూడా డాక్యుమెంట్లలో పొందుపరిచా రో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని చెబుతోందీ చిత్రం. సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. స్కూల్, స్వచ్ఛంద సంస్థలు స్థాపించాలన్నా సొసైటీల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని మరో లఘుచిత్రంలో తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ వల్ల ఆదాయపు పన్ను మినహాయింపు, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, బ్యాంకుల నుంచి సాయం పొందే వీలుంటుందని వివరించారు. స్వచ్ఛంద సంస్థ లు నిర్వహించే సామాజిక సేవలు, క్రీడలు, కళలకు ప్రోత్సాహం, సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్ వివరాలివీ.. ఏదైనా వ్యాపారం లేదా కంపెనీ ప్రారంభించాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చే యించుకోవాలంటూ మరో లఘచిత్రంలో తెలిపారు. సంబంధిత వివరాలను వినియోగదారుల దృష్టికి తెచ్చారు. భవిష్యత్తులో ఇన్‌కంట్యాక్స్ ఇబ్బందులు, సివిల్ కేసుల సమస్య తలెత్తకుండాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉత్తమమని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందాలన్నా ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవసరమని పేర్కొన్నారు. వ్యాపారానికి సంబంధించి పార్టనర్షిప్ డీడ్, కార్యాలయ లీజు డీడ్.. తదితర పత్రాలతో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే రిజిస్ట్రేషన్ ఎంతో సులభ మని ఈ చిత్రంలో చూపించారు. పెళ్లిని నమోదు చేయించుకోండి వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ఇంకో లఘుచిత్రంలో చూపించారు. విదేశాల్లో పని చేస్తున్న యువకులు స్వదేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి అక్కడికి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ అయ్యే సమయంలో అయినా వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే జరిగిన వివాహాలను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చే సుకోవచ్చు. కుల, మతాంత ర వివాహాలను స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కింద నమోదు చేసుకోవచ్చని లఘు చిత్రంలో చూపారు. -
ఆస్కార్‌కు 'నిర్భయ' డాక్యుమెంటరీ!
'ఇండియాస్ డాటర్' పేరిట నిర్భయ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు పొందే అర్హత ఉందని ప్రముఖ హాలీవుడ్ కథానాయిక మెరిల్ స్ట్రీప్ పేర్కొన్నారు. అమెరికాలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన సందర్భంగా ఆమె శుక్రవారం వీక్షించారు. డాక్యుమెంటరీ రూపకర్తలను ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో దీనికి నామినేషన్ దక్కాలని జరుగుతున్న కాంపెయిన్లో తాను కూడా పాలుపంచుకోనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా ప్రతిఘటించి.. అమానుష హింస ఎదుర్కొని.. 13 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ధైర్యానికి ప్రతీకగా 'నిర్భయ' పేరుతో ఈ ఉదంతం నిలిచిపోయింది. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై బ్రిటిష్ చిత్ర రూపకర్త లెస్లీ ఉడ్విన్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, రేపిస్టులను ఈ డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ చేశారు. దీనిలో నిందితుల వాదనలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు గ్రహిత అయిన మెరిల్ స్ట్రీప్ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ డాక్యుమెంటరీని మొదట చూసినప్పుడు నోటమాట రాకుండా అలా కాసేపు ఉండిపోయానని ఆమె పేర్కొన్నారు. -
రెహమాన్ జీవితకథతో 'జయహో'
భారతీయ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ఏఆర్ రెహమాన్ జీవితకథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. 90 నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ 26న డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది. తన జీవితకథను తెరకెక్కించడానికి రెహమాన్ ఒప్పుకోకపోయినా ప్రముఖ ఫిలిం మేకర్ ఉమేష్ అగర్వాల్ ఒత్తిడితో అంగీకరించాడు. అంతర్జాతీ స్ధాయిలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఫిలింలో రెహమాన్ ఇంటర్వ్యూతో పాటు, అమీర్ ఖాన్, డానీ బోయల్, మణిరత్నం, గుల్జార్, అశుతోష్ గోవరీకర్, శేఖర్ కపూర్ లాంటి సెలబ్రిటీలు రెహమాన్ గురించి చెప్పిన మాటలను టెలికాస్ట్ చేయనున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో రెహమాన్ ఎదుర్కొన్న కష్టాలు, ఆ తరువాత దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అతి కొద్ది కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకోవటం, బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్, అంతర్జాతీయ సినిమాలకు సంగీతం అందించటం లాంటి అంశాలతో పాటు ఆస్కార్ వేదికపై రెహమాన్ చెప్పిన మాటలను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. -
వెనిస్ చిత్రోత్సవాల్లో రజనీ డాక్యుమెంటరీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రాచుర్యం మనదేశంలోనే కాదు పొరుగు దేశాలకు ఎప్పుడో పాకింది. జపాన్, కెనడా, మలేషియా దేశాల్లో రజనీకాంత్ అభిమాన దళం ఉంది. ఆయన చిత్రాలకు అక్కడ విశేష ఆదరణ ఉంటుంది. ఇక తమిళనాడులో అయితే రజనీకాంత్ చిత్రాలు విడుదల సమయాల్లో ఆయన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ పుట్టినరోజు కంటే రజనీకాంత్ పుట్టినరోజే వారికి పండుగ రోజు అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే మన సూపర్‌స్టార్ ఖ్యాతిని, ఆయన అభిమానగణం హంగామా, ఆర్భాటాల దృశ్యాలను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి వెనిస్లో జరుగుతున్న 72వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. విదేశానికి చెందిన రింకు గాల్సి ఆయన మిత్రుడు జోయోజిత్పాల్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. వారు ఒక టెలివిజన్ చానల్లో చేస్తున్న పనికి రాజీనామా చేసి నాలుగేళ్లుగా ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించడం విశేషం. -
వెండితెరకు సన్నీ లియోన్ జీవితం
గతం గతః అంటాం కానీ.. గతం ఎప్పుడూ వెంటాడుతుంటుంది. అలా, సన్నీ లియోన్ గతం ఆమెను ఇప్పటికీ వదిలిపెట్టలేదు. విదేశాల్లో ఉన్నప్పుడు నీలి చిత్రాల్లో నటించారామె. అప్పట్నుంచీ ఆమె పై ‘నీలి చిత్రాల తార’ అనే ముద్ర పడింది. ఆ సినిమాలు మానుకున్నా ఆ ముద్ర మాత్రం అలానే ఉండిపోయింది. ప్రస్తుతం దక్షిణ, ఉత్తరాది భాషల్లో గ్లామరస్ రోల్స్ చేస్తున్న సన్నీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందింది. సన్నీ అంటే.. కేవలం నీలి చిత్రాల తార మాత్రమే కాదు.. ఆమె జీవితంలో అంతకు మించిన విషయాలు బోల్డన్ని ఉన్నాయట. వాటి సమాహారంతో ప్రముఖ దర్శకురాలు దీపా మెహతా సోదరుడు దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా సన్నీ భర్త డానియెల్ పేర్కొన్నారు. సన్నీ జీవితంలోకి డానియెల్ రాకముందు.. అతనొచ్చిన తర్వాత సంఘటనల సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. సన్నీ, డానియెల్ పాల్గొనగా 18 నెలల పాటు చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ‘సన్డాన్స్ ఫిలిం ఫెస్టివల్’లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
‘డాక్యుమెంటరీ’పై నేడు విచారణ
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటనపై తీసిన వివాదాస్పద ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. ఈ వీడియోకు సంబంధించిన సీడీలు, పత్రాలను పిటిషనర్ ఇంతకు ముందే కోర్టులో సమర్పించారు. జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంటరీ ప్రసారం చేయడాన్ని సవాల్ చేస్తూ లా విద్యార్థి విభోర్ ఆనంద్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్‌లతో కూడిన బెంచ్ విచారించనుంది. అసలు విషయం నేరుగా తెలుసుకోకుండా మీడియా ప్రసారాలతో న్యాయవాదులు ప్రభావితం అయ్యే ఆస్కారం ఉందని మార్చి 12న జరిగిన విచారణలో కోర్టు పేర్కొంది. అలాగే ప్రసారంపై వ్యతిరేకత లేదని, నిందితుల విన్నపాలను విన్న తర్వాత సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు ప్రసార విషయం తేలుతుందని హైకోర్టు పేర్కొంది. -
తోట వైకుంఠంపై డాక్యుమెంటరీ
బోయినపల్లి : అంతర్జాతీయంగా పేరొందిన చిత్రకారుడు కరీంనగర్ జిల్లా బోరుునపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన తోట వైకుంఠంపై కోల్‌కతాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు పార్థూరాయ్ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. వైకుంఠంతో కలిసి ఆయన స్వగ్రామమైన బూరుగుపల్లి వచ్చిన పార్థూరాయ్ శుక్రవారం వరకు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. వైకుంఠం చిత్రకారుడిగా రాణించడం వెనుక గ్రామీణ నేపథ్యం, కులవృత్తుల వారితో అనుబంధమే కీలకమైందని ఆయన చెబుతుంటారు. తన చిన్నతనంలో కమ్మరి కొలిమి, కుమ్మరి సార, నేతన్నల మగ్గం, గీతవృత్తి వంటి వాటితో స్ఫూర్తి పొంది పల్లె ప్రజల శ్రమైక జీవనమే నేపథ్యంగా ఎన్నో చిత్రాలు గీశారు. అలాగే చిన్నప్పుడు వైకుంఠం చిందుయక్షగానాన్ని అమితంగా ఇష్టపడేవారు. దీంతో గ్రామంలో చిందుకళాకారులు విరాటపర్వం నాటకాన్ని ప్రదర్శించారు. వీటన్నింటిని డాక్యుమెంటరీ రూపకల్పనలో భాగంగా చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీని నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయనున్నట్టు పార్థూరాయ్ తెలిపారు. మొదటి షెడ్యూల్ వైకుంఠం ప్రస్తుతం నివాసముంటున్న హైదరాబాద్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. రెండవ షెడ్యూల్‌ను బూరుగుపల్లిలో చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడవ షెడ్యూల్‌ను వైకుంఠం చిత్రకళ నేర్చుకున్న మహారాజ సయాజీరావు, యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో తీయనున్నట్లు చెప్పారు. నాలుగవ షెడ్యూల్‌ను కోల్‌కతాలో మాభూమి చిత్ర దర్శకుడు గౌతంఘోష్తో వైకుంఠంకు ఉన్న అనుబంధంపై చిత్రీకరించనున్నట్లు ఆయన వివరించారు. మాభూమి చిత్రానికి ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేసిన వైకుంఠంకు జాతీయ ఉత్తమ ఆర్ట్ డెరైక్టర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. 1942లో జన్మించిన వైకుంఠం 1960లో హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. తాజాగా స్వగ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు డప్పుచప్పుళ్లు, మేళతాళాలతో స్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు. హోలీ సందర్భంగా రంగులు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
ఆ డాక్యుమెంటరీని ప్రసారం కానివ్వం!
న్యూఢిల్లీ: నిర్భయపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన ముకేశ్ సింగ్ ఇంటర్వ్యూ ఉన్న డాక్యుమెంటరీని విదేశాల్లో సహా ఎక్కడా, ఏ విధంగానూ.. ప్రసారం కానీ, ప్రచురణ కానీ కాకుండా చూస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా సహా ఎక్కడ, ఏ విధంగా కూడా ఆ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీబీసీ, భారతీయ విదేశాంగ శాఖ, సమాచార సాంకేతిక విభాగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంటరీ ప్రసారం, ప్రచురణ కాకుండా చూస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేశారు. దీనిపై దేశమంతా సిగ్గుపడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూకు అనుమతి ఎలా లభించిందనే విషయంపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీహార్ జైలు డెరైక్టర్ జనరల్ అలోక్ కుమార్ వర్మను రాజ్‌నాథ్ పిలిపించి వివరణ తీసుకున్నారు. కాగా, ఈ లఘుచిత్రాన్ని ఈ నెల 8వ తేదీన మహిళాదినోత్సవం సందర్భంగా ప్రసారం చేయాలనుకున్న బీబీసీ.. అంతకన్నా ముందుగానే బుధవారం రాత్రి 10 గంటలకు బ్రిటన్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తమపై చర్య తీసుకునే ముందు ప్రధాని మోదీ ఆ లఘు చిత్రాన్ని ఒకసారి చూడాలని కోరింది. మహిళాసభ్యుల వాకౌట్ ఈ ఉదంతంపై బుధవారం పార్లమెంటు అట్టుడికింది. ముఖ్యంగా మహిళా సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహార్ జైళ్లో ఉన్న గ్యాంగ్ రేప్ దోషిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి లభించడానికి కారణమైన వారిపైచర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఆ డాక్యుమెంటరీలో అశ్లీల పదజాలం వాడటాన్ని బార్‌కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన మహ ళా సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. -
ఈ ప్రశ్నలకు బదులేది..?
మతసామరస్యాన్ని చాటుతూ బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ‘కమ్యూనల్ హార్మోనీ పేరుతో శని, ఆదివారాల్లో పలు డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. గోద్రా దుస్సంఘటన జరిగి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ బాధితుల స్మృత్యర్థం విజ్జీయార్, విమోచన్, లామకాన్‌లు /ా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రదర్శనలో తొలిరోజు ఆనంద్ పట్వర్ధన్, శుభ్రదీప్ చక్రవర్తి, రాకేశ్ శర్మ రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. రెండో రోజైన ఆదివారం ఫైనల్ సొల్యూషన్, ఫాదర్.. సన్ హోలీ వార్ చిత్రం 2 భాగాలు, ఎన్కౌంటర్డ్ ఆన్ సాఫ్రాన్ చిత్రాలను స్క్రీనింగ్ చేశారు. ఫాదర్-సన్ హోలీవార్.. 2 భాగాలు ఆనంద్ పట్వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో.. దేశంలో బలహీనుల మీద దాడులకు కారణమవుతున్న అనేక భావజాలాలకు మూలమైన అంశాలను అర్థవంతంగా చూపించారు. నాటి సతి సహగమనం నుంచి తలాక్ వరకు అన్ని చోట్ల బాధితులు మహిళలే. పురుషాధిక్యతకు బలం చేకూరుస్తున్న మత విధానాలు, సంప్రదాయాలు, చారిత్రక కథలు.. నేటి టీవీ కార్యక్రమాలను చిత్ర దర్శకుడు వేలెత్తి చూపించారు. ఈ డాక్యుమెంటరీ 90వ దశకంలో తీసిందైనా.. చిత్రాల్లో ప్రస్తావించిన అంశాలు నేటికీ ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అహింసను నపుంసకత్వానికి చిహ్నంగా భావించడం భవిష్యత్తును మరింత అంధకారంలోకి తోసే విధానమనే ఆలోచనను రేకెత్తిస్తూ ఫాదర్-సన్ హోలీవార్ ముగుస్తుంది. ఎన్కౌంటర్డ్ ఆన్ సాఫ్రాన్ ఎజెండా గుజరాత్లో జరిగిన ఎన్కౌంటర్ల గురించి తీసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ ఇది. ట్యూషన్లు చెప్పుకునే అమ్మాయి, బంధువులను చూడటానికి వెళ్లిన భార్యభర్తలు, మోటరు బైక్ మీద అహ్మదాబాద్‌కు బయలుదేరిన యువకుడు హఠాత్తుగా ఎన్కౌంటర్ అయినట్లు వార్తా కథనాలు. పోలీసుల వివరణలు ప్రసారమవుతాయి. పేపర్లో వార్తలు వస్తాయి. కొన్ని ఫిర్యాదులు, కొంత విచారణ తర్వాత జనం వాటిని మరచిపోతారు. ఎన్కౌంటర్లో చనిపోయింది టైస్టులా, సామాన్యులా, పోలీసు కథనాలలో ఉన్న నిజానిజాలు నిగ్గుతేల్చిన డాక్యుమెంటరీ ఇది. నిపుణులు, అధికారుల కన్నా సామాన్యులు, కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలు సమస్య మూలాలను కదిలించేవిగా ఉన్నాయి! ఈ డాక్యుమెంటరీ రూపొందించింది శుభ్రదీప్ చక్రవర్తి. ఫైనల్ సొల్యూషన్ ‘మా తాతను, నాన్నను వాళ్లు పొడిచి చంపేశారు. మా ఊరి నుంచి పంపించేశారు. అప్పటి నుంచి ఈ ఊళ్లో ఉంటున్నాం. మా పిన్ని ఇంకా మిగతా ఆడవాళ్ల బట్టలు ఊడదీసి, చంపేశారు. వాళ్లని నేను చూశాను’ అని నాలుగేళ్ల పిల్లవాడి మాటలతో మొదలయ్యే ఈ డాక్యుమెంటరీ గుజరాత్ అల్లర్ల మీద లోతైన విషయాలను మన ముందుకు తెస్తుంది. అల్లర్లలో నష్టపోయిన ఇరు వర్గాల వాళ్ల ఇళ్లు, వాడలను కళ్లముందుంచారు డెరైక్టర్. దాడులలో బతికి బయటపడ్డ వారు, ముఖ్యంగా స్త్రీలు పడిన వేదనను గుండె కదిలించేలా చూపించారు. రాకేశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చాలా చోట్ల స్క్రీనింగ్ చేయడానికి అనుమతులు నిరాకరించారు. ఓ మధు -
‘హిగ్గిన్స్’ నేర్వాల్సిన పరిమళపు భాష!
మంచి పుస్తకం ‘మెహదీపట్నం దగ్గర గుడిమల్కాపూర్ మార్కెట్‌కి వెళ్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది కాబోలు’ అంటాడు ప్రసాదమూర్తి, పూలండోయ్‌పూలు కవిత పూర్తి చేసి. ‘ఈ పదాన్ని ఇలాగే పలకాలి. ఈ వాక్యాన్ని అనేపుడు బాడీలాంగ్వేజ్ ఇలాగే ఉండాలి’ అనే ప్రొఫెసర్ హిగ్గిన్స్‌కు మాత్రం పూలమార్కెట్ అలా ఉండదు. హిగ్గిన్స్ ఎవరు? బెర్నార్డ్ షా నాటకం ‘పిగ్మేలియన్’ (1938) ఆధారంగా 1964లో ‘మై ఫెయిర్ లేడీ’ అనే క్లాసిక్ ఫిలిం వచ్చింది. అందులో ఎలిజా అనే పూలమ్మిని హైసొసైటీ లేడీగా మార్చేందుకు శపథం పూనిన ఆచార్యుడు. ‘హిగ్గిన్స్’ తెలుగు కవుల్లోనూ ఉన్నారు. నియమం లేని వాక్యం గ్రామ్యం అన్నారు గ్రాంథికులు. చంపకమాల (సంపెంగ దండ) ఉత్పలమాల (కలువపూల దండ) అని పేర్లు పెట్టారు కాని పూల తాలూకూ వాసనలే సోకని ఛందస్సులతో పద్యాల ఇటుకలు పేర్చేశారు. కొందరు ఆధునికుల్లో ఛందస్సూ కవిత్వమూ రెండూ మృగ్యమే. ‘పూలండోయ్ పూలు’ కవితా సంకలనంలోని ప్రసాదమూర్తి కవితలు ఏ భాషలోని ‘హిగ్గిన్స్’కు అయినా పరిమళపు భాష నేర్పుతాయి. గుడిమల్కాపూర్ పూలమార్కెట్‌ను డాక్యుమెంటరీగా తీస్తే ఏ భాషలోని కవి అయినా తమ భాషల్లో ప్రసాదమూర్తి కవిత్వాన్నే పలుకుతాడు. ఈ సంకలనంలో కేవలం ‘పాటల పారిజాతాలు ... ఆశల సంపెంగలు’ మాత్రమే లేవు. అత్తిచెట్టు తనలోకే పుష్పిస్తూ ఫలంగా రూపొందిన విధంగా ప్రసాదమూర్తి తనలోనే దుఃఖించి పాఠకులకు కానుకగా అందించిన కవితలూ ఉన్నాయి. ‘పగలంతా సూర్యుడు రాల్చిన/ వెలుగు కలల్ని/ రాత్రిచంద్రుడు ఏరుకునే/ సన్నివేశం గుర్తొచ్చింది’ అన్న కవి ‘కొంపలు కొల్లేరైపోయాక/ఇంక ఇక్కడేముందని/ఓ పెద్ద చేప పెకైగిరి/నా కాళ్లమీద తోకతో కొట్టిపోయింది’ అలాంటి వ్యక్తీకరణే! ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధిగా పద్యంతో మొదలై, అష్టావధానాలూ చేసి, ప్రేయసీ అనే అలభ్యశతకం రాసి శ్రీశ్రీ ప్రభావంతో ఛందస్సుల నుంచి బయటపడ్డాననే ప్రసాదమూర్తి ఛందోస్ఫూర్తిని వీడలేదు. ప్రసాదమూర్తి వామపక్షభావాల నుంచి, దళిత ఉద్యమ మమేకత్వాన్నుంచి, భిన్న భావాల సంఘర్షణల నుంచి ఏ మంచినీ వదులుకోకుండా కవిగా ప్రయాణిస్తున్నాడు అనేందుకు అతడి గత పుస్తకాలు ‘నాన్నచెట్టు’, ‘కలనేత’, ‘మాట్లాడుకోవాలి’కి కొనసాగింపైన ‘పూలండోయ్ పూలు’ ఉదాహరణ! లోహపురుషుడి కోసం లోహాన్ని సమకూర్చండి అన్న నాయకుడి పిలుపు నేపథ్యంలో ‘ప్రియమైన భారతీయులారా/మీరు లోహాన్ని సమకూచ్చండి/విగ్రహం కోసం కాదు/ సంగ్రామం కోసం’ అంటాడు! ప్రపంచంలోని అన్ని సంఘర్షణసీమల్లోకి కలల విహారం చేస్తూ ‘ఇండోపాక్ బార్డర్లో / నా రెండు కనుపాపల్నీ /అటూ ఇటూ దీపాలుగా పెట్టి/ క్రాస్ బార్డర్ హ్యూమనిజానికి/హారతులు పట్టమని ఆనతిచ్చాను’ తొలికవిత ‘అమ్మ పుట్టిన రోజు’లో ‘బతుకు నొప్పినంతా భరించీ భరించీ/పురిటి నొప్పుల్ని మాత్రం/నా కోసమే తియ్యగా మార్చుకున్నావు/ అక్షరాల ప్రసవంలో/ నేనూ అదే నేర్చుకున్నాను’ అంటాడు. నిజమే సుమీ అని 38 కవితలూ బోసిగా నవ్వుతాయి! - పున్నా కృష్ణమూర్తి పూలండోయ్ పూలు: ప్రసాదమూర్తి; వినూత్న ప్రచురణలు: ప్రతులు అన్ని ముఖ్యమైన చోట్లా; వేల: 100/- -
సాగులో సాంకేతిక పద్ధతులు అవలంబించాలి
శాస్త్రవేత్తలందరూ 5 బృందాలుగా విడిపోయి, గ్రామ పరిధిలోని పొలాలకు వెళ్లారు. ఎక్కడ ఏ భూములున్నాయి, ఏ పంటలు వేశారు, అక్కడ ఎలాంటి వనరులున్నాయి వంటి అంశాలను జీపీఎస్ ద్వారా గుర్తించారు. పనికిరాని మొక్కలనుకునేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, సంప్రదాయ పంటసాగు విధానం నుంచి ఆధునిక సాంకేతిక సాగుపై డాక్యుమెంటరీకి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. మట్టి నమూనాలను సేకరించి, అందులో అధికంగా ఉన్న పోషక లోపాలను గుర్తించారు. పత్తి పంట సాగుపై ఆరా పత్తిపంటను ఎందుకు సాగు చేస్తున్నారని, ఎలాంటి విత్తనాల ఎంపిక చేసుకుంటున్నారు, ఆశించే రోగాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం రైతులతో కలిసి శాస్త్రవేత్తలు సమావేశం నిర్వహించారు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంపై రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు. ఆముదం, కంది, పెసర, కుసుమ పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచించగా, ఆ పంటలు లాభసాటిగా లేవని, పత్తి పంట లాభసాటిగా ఉందని వివరించారు. సాగు నీరు, కరెంటు అందిస్తే ప్రభుత్వం ఏ రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదని నెల్లికంటి బాబు అనే రైతు శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లాడు. విద్యాశేఖర్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ పత్తి విత్తనాలు 50మి.మీ.లకు పైగా వర్షం కురిసినప్పుడే విత్తాలన్నారు. లేకపోతే పత్తి పంట తొందరగా బెట్టకొస్తుందన్నారు. మరికొంత మంది శాస్త్రవేత్తలు కందులు నాటే విధానం, వరిసాగు వెదజల్లే విధానం, మెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకునే విధానాన్ని వివరించారు. 69 వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలకు శిక్షణ సీనియర్ శాస్త్రవేత్త కె.హనుమంతరావు మాట్లాడుతూ దేశంలోనే 69 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలకు నార్మ్ శిక్షణ ఇస్తుందన్నారు. యువ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసేందుకు దేశంలో 12 గ్రామీణ ప్రాంతాలను గుర్తించామన్నారు. వారు అక్కడి గ్రామాల్లో 3 వారాల పాటు పరిశోధనలు చేస్తారన్నారు. దీని ద్వారా వ్యవసాయంపై నూతన ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగపడుతు ందన్నారు. శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చేది దేశంలో నార్మ్ మాత్రమేనన్నారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బృందం హెడ్ డాక్టర్ సంధ్యాషైనా, సీనియర్ శాస్త్రవేత్తలు వీకే.జయరావు, పద్మయ్య, సతీష్, షేక్మీరా, కో-ఆర్డినేటర్ సొట్టంకె, తమ్మరాజా, వెంకటేశం, వెంకట్‌కుమార్, సూర్య రాథోడ్ ,గ్రామా సర్పంచ్ ఎర్ర మల్లేష్, ఏఓ శ్రీనివాస్‌లు, ఏఈఓ నర్సింహ తదితరులున్నారు.