డీఎన్ఏలో లఘుచిత్రం!
న్యూయార్క్: డీఎన్ఏలో ఓ లఘుచిత్రం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తోపాటు వేరే డేటాను పరిశోధకులు విజయవంతంగా పొందుపరిచారు. స్పెయిన్ లోని గుహల్లో 4.3 లక్షల ఏళ్ల పూర్వీకుడికి సంబంధించిన ఎముకల నుంచి సేకరించిన డీఎన్ ఏలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ జినోమీ సెంటర్(ఎన్ వైజీసీ)కి చెందిన పరిశోధకులు ఈ మేరకు డేటాను పొందుపరిచారు.
క్యాసెట్ టేపులు, సీడీల మాదిరిగా డీఎన్ ఏ పాడైపోదని కొలంబియా వర్సిటీకి చెందిన యానివ్ ఎర్లిచ్ పేర్కొన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ‘అరీవల్ ఆఫ్ ఏ ట్రైన్ ఎట్ లా సియోటట్’ అనే 1895 సంవత్సరపు ఫ్రెంచ్ సినిమా, 50 డాలర్ల అమెజాన్ గిఫ్ట్ కార్డు, కంప్యూటర్ వైరస్, పయోనీర్ చిహ్నం కొన్ని ఫైళ్లను క్రోఢీకరించి డీఎన్ ఏలో పొందుపరిచారు. మొత్తం ఆరు ఫైళ్లకు సంబంధించిన 215 పెటాబైట్స్‌ను ఒక గ్రామ్ డీఎన్ఏలో నిక్షిప్తం చేసినట్లు ఎర్లిచ్ చెప్పారు.