Columbia University
-
Israel-Hamas war: వర్సిటీల్లో 2,300 దాటిన అరెస్టులు
న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో 133 మందిని అరెస్ట్‌చేశారు. -
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
గాజాపై దాడుల ఎఫెక్ట్.. అమెరికాలో బైడెన్‌కు కొత్త టెన్షన్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడుల ఘటన తాజాగా అమెరికాను తాకింది. గాజాపై దాడులకు వ్యతిరేకంగా అగ్ర రాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో, ఉద్రిక్తత నెలకొనడంతో 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు నిరసనలకు దిగారు. రోడ్లకు మీదకు వచ్చి భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనల్లో భాగంగా అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. *BREAKING NEWS* Israel supporters put up pictures of people killed on October 7th outside the pro Palestinian encampment at Columbia University. Meanwhile, over 400 students have been arrested as division continues to grow. pic.twitter.com/YFCU9IU9YN— MorrisNews (@morrisnews12) April 24, 2024 కాగా.. అమెరికాలోని యేల్, ఎంఐటీ, హార్వర్డ్, కొలంబియా తదితర యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇక, విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీలో తరగతి గదులను మూసివేశారు. మిగిలిన సెమిస్టర్‌కు హైబ్రీడ్ పద్దతిని అనుసరించనుంది. ఇక, తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తామని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ తెలిపారు. A view from the Mario Savio steps of Sproul Hall, where I’m standing with Faculty and Staff for Justice in Palestine. Happening now at UC Berkeley! #Divest #BDS #FromTheRiverToSeaPalestineWillBeFree #UCDivest #StudentsForJusticeInPalestine #UCBerkeley pic.twitter.com/zmbyUaryrV— Brooke Lober (@brookespeeking) April 22, 2024 ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు. ఇక, సోమవారం విద్యార్థులతో పాటు. ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అరెస్టులకు నిరసనగా, బోస్టన్, హార్వర్డ్, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. Puluhan Mahasiswa dan Dosen Pengajar New York University ditangkap kepolisian Amerika karena mendukung dan melakukan aksi solidaritas terhadap Gaza dan Palestina. Selasa (23/4)Sumber: QudsN pic.twitter.com/cjN0F93cEl— Lembayung Senja 🐾👣 (@Lembayungsyahdu) April 24, 2024 న్యూయార్క్ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, పలువురు విద్యార్థులను అరెస్టుచేసినట్టు తెలుస్తోంది. ఇక, కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు 15 గుడారాలను ఏర్పాటు చేశారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఆందోళనను వైట్ హౌస్ ఖండించింది. Hundreds of faculty members at Columbia University in New York held a mass walkout on Monday in solidarity with students advocating for Palestine. #WeAreAllGaza pic.twitter.com/2L1UBOWaH1— MuslimWomensCouncil (@MWC_Bradford) April 24, 2024 -
నానో ప్రపంచం దగ్గరయింది
బంగారం ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా? ముదురు పసుపునకు కొంత కాంతి చేరిస్తే ఉండే రంగు. కానీ, ఇదే బంగారాన్ని నానోస్థాయిలో.. అంటే మన వెంట్రుకలో పదివేల వంతు సూక్ష్మస్థాయిలో చూస్తే దాని రంగు ఎరుపు లేదా వంగపూతగా కనిపిస్తుంది! అదెలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నానోస్థాయిలో పదార్థాల ధర్మాల ఆసరాతో అత్యాధునిక ఎల్రక్టానిక్స్ తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కిందని మాత్రం తెలుసుకోవాలి! ఆ విశేషాలేమిటో చూసేద్దాం.. క్వాంటమ్ డాట్స్ తయారీకి బాటలు నానోటెక్నాలజీ మనకేమీ కొత్త కాదు. చాలా కాలంగా వేర్వేరు రంగాల్లో వాడకంలో ఉన్నదే. స్పష్టమైన, పలుచని ఎల్ఈడీ స్క్రీన్ల తయారీ మొదలుకొని శరీరంలోని కేన్సర్ కణితులను కత్తిరించడం వరకూ రకరకాలుగా నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ అత్యద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలకు బీజం వేసిన క్వాంటమ్ డాట్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు కాబట్టే స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ.. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త లూయిస్ బ్రూస్, నానో క్రిస్టల్స్ టెక్నాలజీ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు ప్రకటించింది. సూక్ష్మస్థాయి కణాల ఉత్పత్తి రసాయన శాస్త్రం చదువుకున్న వారు ఎవరికైనా మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని తెలిసే ఉంటుంది. అయితే మూలకం నానోస్థాయికి చేరిందనుకోండి... సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మూలకం సైజును బట్టి ఈ ధర్మాలుంటాయి. ఉదాహరణకు పైన చెప్పుకున్న బంగారం రంగు! అలాగే సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రా్టనిక్, ఆప్టికల్, ఉ్రత్పేరక ధర్మాలు కూడా మారిపోతాయి. సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని పదార్థాలు సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్ కండక్టర్లుగా వ్యవహరించవచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఈ ఏటి రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం తక్కువని అనుకునేవారు. 1980లో అలెక్సీ ఎకిమోవ్ రంగుల గాజులో క్వాంటమ్ ఎఫెక్ట్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. కణం సైజు ఆధారంగా రంగు మారుతుందని ఆయన నిరూపించడంతో క్వాంటమ్ డాట్స్‌పై ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ల తరువాత ఒక ద్రవంలో స్వేచ్ఛగా కదులుతున్న కణాల సైజుకు అనుగుణంగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ మారుతాయని మొట్టమొదటిసారి నిరూపించగలిగారు. భవిష్యత్తులో సురక్షితమైన సమాచార వ్యవస్థ! 1993లో మౌంగి బావెండీ రసాయనికంగా క్వాంటమ్ డాట్స్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టడంతో వీటిని మన ప్రయోజనాలకు వాడుకోవడం సులువు అయ్యింది. ఇప్పుడు మన కంప్యూటర్ మానిటర్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్‌లో విస్తృత స్థాయి రంగులు వెదజల్లడం ఈ క్వాంటమ్ డాట్స్ పుణ్యమే. అలాగే మన ఎల్ఈడీ బల్బుల రంగులు మారడానికి కూడా ఇవే కారణం. శరీరంలోని కణజాలాన్ని స్పష్టంగా గుర్తించేందుకు బయో కెమిస్టులు, వైద్యులు ఇప్పుడు క్వాంటమ్ డాట్స్‌ను వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా ఎటు కావాలంటే అటు మడిచేసుకోగల ఎల్రక్టానిక్స్, అతి సూక్ష్మమైన సెన్సార్లు, పలుచటి సోలార్ సెల్స్ తయారీతోపాటు అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. క్వాంటమ్ డాట్స్‌పై పరిశోధనలకు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా సైంటిస్టులకు ప్రతిష్టాత్మక బహుమతి స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతి ఈసారి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మౌంగి బావెండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్ర నోబెల్ ప్రైజ్ లభించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పారి్టకల్స్ అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు కీలక పాత్ర పోషించారని నోబెల్ కమిటీ తెలియజేసింది. ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధికారికంగా విజేతల పేర్లు ప్రకటించకముందే ముగ్గురు సైంటిస్టుల పేర్లను స్వీడన్ మీడియా సంస్థలు బహిర్గతం చేయడం కలకలం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దటీజ్ ఏపీ..కొలంబియా యూనివర్సిటీలో సత్తా చాటిన ఏపీ స్టూడెంట్స్
-
ఏపీలో గొప్ప చర్యలు: కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ విద్యా విధానాన్ని అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయమని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెఫ్రీ సాచ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు హాజరైన ఏపీ విద్యార్థులు కొలంబియా యూనివర్సిటీలోని ఎస్డీజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జెఫ్రీ సాచ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ ఏపీ విద్యార్థులను జెఫ్రీ సాచ్‌కు పరిచయం చేశారు. ఆయన విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయించి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విద్యార్థులు తమ కుటుంబ నేపథ్యాలను.. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, విద్యా సంక్షేమ పథకాలు.. అవి పేద విద్యార్థుల ప్రగతికి ఎలా దోహదం చేస్తున్నాయో వివరించారు. ఏపీలో గొప్ప చర్యలు అనంతరం జెఫ్రీ సాచ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి బిడ్డా చదువుకోవాలని, ఆయా దేశాల ప్రభుత్వాలు విద్యకోసం అధిక నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం తాను 25 ఏళ్లుగా పోరాడుతున్నానని, ఏపీలో గొప్ప చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్ విద్య, ట్యాబ్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు, టోఫెల్ శిక్షణపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. తన ఆకాంక్షలకు అనుగుణంగా పిల్లలను బడికి పంపించే తల్లుల అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు జమ (అమ్మ ఒడి) చేయడాన్ని ప్రొఫెసర్ జెఫ్రీ అభినందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్న విషయాన్ని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకు రాగా.. ఇది ఎంతో గొప్ప చర్యగా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇప్పుడు వర్సిటీ వేదికపై ప్రసంగించిన విద్యార్థులంతా ఈ పథకం ద్వారా కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. ప్రపంచం మెచ్చిన మేధావి ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ కొలంబియా యూనివర్సిటీలో అత్యున్నత అకడమిక్ ర్యాంక్ గల ప్రొఫెసర్ హోదాలో ఉన్నారు. వివిధ పుస్తకాలు రచించిన ఆయన టైమ్ మ్యాగజైన్లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ నాయకుల్లో రెండుసార్లు పేరు పొందటంతోపాటు 42 గౌరవ డాక్టరేట్లను సైతం అందుకున్నారు. గతంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలందించిన ఈయన కొలంబియా వర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం కృషి చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్తో పాటు ప్రస్తుత సెక్రటరీ జనరల్ అన్టోనియో గుటెరస్‌కు ప్రత్యేక సలహాదారుగా కొనసాగుతున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు గౌరవించే ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్కరణలను అభినందించడం విశేషం. -
కొలంబియా యూనివర్సిటిలో ప్రసంగించిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు
అంతర్జాతీయ వేదిక కొలంబియా యూనివర్సిటిలో ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాత్మక మార్పులు ఫలితాన్నిస్తున్నాయి. విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులు అంతర్జాతీయ వేదికలపై విద్యార్ధుల రూపంలో ప్రతిబింబిస్తున్నాయి. ఎల్లలు దాటి ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలపై స్పెషల్ స్టోరీ. పదిరోజుల అమెరికా పర్యటన కోసం న్యూయార్క్ చేరుకున్న ఏపీ విద్యార్ధుల బృందం మొదటి రోజు ఐక్యారాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్ మెంట్ యాక్షన్ వీకెండ్ లో పాల్గొన్నారు. మరుసటి రోజు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అమెరికా న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ లో జరుగుతున్న “ఎడ్యుకేట్ ఏ చైల్డ్”, US ట్రాన్స్ఫార్మింగ్, యూత్-లెడ్ ఇన్నోవేషన్, గ్లోబల్ సిటిజన్‌షిప్ ఎడ్యుకేషన్ సమ్మిట్ సెమినార్ లో యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ స్ధాయి విద్యావేత్తలు, ప్రొఫెసర్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల గురించి అంతర్జాతీయ వేదికపై మాట్లాడారు మన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు. అందరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత పెంచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైన నాడు నేడు పథకం ద్వారా లబ్ధి పొంది చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్తున్నారు. కొలంబియా యూనివర్సిటి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికా అయ్యాంగార్ నిరుపేదల విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం వైఎస్ జగన్ చేస్తున్న సేవలను కొనియాడారు. వైఎస్ జగన్ చేస్తున్న పేదరిక నిర్మూళన అందరికి విద్యా, వైద్యం కల్పిస్తున్న విధానం ఎంతో ఆకర్షించిందని ఆమె అన్నారు. కొలంబియా యూనిర్సిటి సెమినార్ లో పాల్గొన్న విద్యార్ధులు తాము భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్య ద్వారా అమెరికాలో చదువుకుంటామని తమ అభిప్రాయాన్ని కొలంబియా యూనివర్సిటిలో ప్రంపంచస్ధాయి విద్యావేత్తల ముందు చెప్పారు. దీనికి విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. -
కొలంబియా వర్సిటీలో ఏపీ విద్యార్థుల ప్రసంగం
సాక్షి, అమరావతి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి ఏపీ నుంచి వెళ్లిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆదివారం కొలంబియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో పాలుపంచుకున్నారు. ఇక్కడి సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్లోని విద్యా విభాగం డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ఆధ్వర్యంలో ‘ఎడ్యుకేట్ ఎ చైల్డ్’ లెక్చర్ నిర్వహించారు.ఇందులో పాల్గొన్న ఏపీ విద్యార్థులు.. మాల శివలింగమ్మ, మోతుకూరి చంద్రలేఖ, గుండుమోగుల గణేష్, దడాల జ్యోత్స్న, సి.రాజేశ్వరి, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, వంజివాకు యోగేశ్వర్, షేక్ అమ్మాజాన్, సామల మనస్విని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా సీఎం జగన్ నాయకత్వంలో విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు..,టాబ్లెట్లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం వల్ల విద్యారంగం ఎలా మారిందో.. తాము ఎలా ప్రగతి సాధించామో వివరించారు. మనబడి నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా పేద విద్యార్థులకు ఎంత మేలు జరుగుతోందో వివరించారు. 42 లక్షల మంది విద్యార్థులకు సీఎం జగన్ భరోసా తమలాంటి 42.62 లక్షల మంది విద్యార్థులకు సీఎం జగన్ నాయకత్వంలోని ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా ఉందని విద్యార్థులు వివరించారు. సమీప భవిష్యత్‌లో తాము కూడా జగనన్న విదేశీ విద్యాదీవెన ప్రథకం ద్వారా ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ఈ సందర్భంగా యూఎన్ఓ గ్లోబల్ స్కూల్స్ ప్రోగ్రామ్ ఎక్సట్రనల్ అఫైర్స్ అధికారి అమెండా అబ్రూమ్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెఫ్రీ డి సాచ్‌తో ప్రత్యేకంగా సమావేశమై మన విద్యా విధానాలు, బోధనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ట్యాబ్స్, నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతిభ గలవారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. మధ్యాహ్నం జరిగిన ఎకో అంబాసిడర్స్ వర్క్‌షాప్‌లో సైతం పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈనెల 20న జర్నలిస్ట్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో జరిగే ఎస్డీఎస్ సర్వీస్ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల వెంట సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు ఉన్నారు. -
అలా చేస్తే తెల్లజుట్టు నల్లబడేనా?
వయసు ముదిరే కొద్దీ తలనెరవడం కామన్. కానీ యుక్త వయసులోనే నెరవడం ఆరంభమై, మధ్యవయసు వచ్చేసరికి తల ముగ్గుబుట్టలాగా మారడం చాలామందిలో కనిపిస్తోంది. తెల్లబడుతున్న జుట్టు యువతలో మానసికాందోళనకు కారణమవుతోంది. దీన్ని కవర్ చేయలేక, ఎలా ఆపాలో తెలియక పలువురు సతమతమవుతుంటారు. ఈ తరుణంలో ఎలాంటి చిట్కా చెప్పినా పాటించేందుకు రెడీ అవుతుంటారు. అంతర్జాతీయంగా కూడా ఈ అంశంపై పలు పరిశోధనలు జరిగాయి. ఒత్తిడి వల్ల జుట్టు త్వరగా తెల్లబడిపోతుందన్నది నిజమేనంటోంది సైన్స్. ఈ విషయం ఆధారంగా తాజాగా జరిగిన ఒక పరిశోధన ఆశలు రేకిత్తించే ఫలితాలనిచ్చింది. ఈ పరిశోధనలో నల్లజట్టు తొందరగా తెల్లబడేందుకు ఒత్తిడే కారణమని భావించి కొలంబియా యూనివర్సిటీలో ప్రయోగాలు చేశారు. ఒత్తిడిని అదుపులో పెట్టుకోగలిగితే జుట్టు మళ్లీ నల్లబడుతుందని ‘ఈలైఫ్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం చెబుతోంది. ‘ఒత్తిడికి, తెల్లజుట్టుకు ఉన్న సంబంధం గురించి చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తూ ఉన్నాం. మానసిక ఒత్తిడికి, జుట్టు పండిపోవడానికి కచ్చితమైన సంబంధం ఉంది అని తెలిపే అధ్యయనం ఇది. ఒత్తిడి తగ్గించుకుంటే అనూహ్యంగా కొంతమేర జుట్టు తిరిగి సహజ రంగులోకి మారుతుందనేందుకు ఆధారాలు లభించాయి’ అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ పికార్డ్ తెలిపారు. ప్రయోగంలో భాగంగా ప్రతి వెంట్రుకను అధ్యయనం చేస్తూ, దాన్లో ఉన్న పిగ్మెంటేషన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ పరిశోధక బృందం ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది. అనంతరం వివిధ వయసులకు చెందిన 14 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని, ప్రతి వారం వాళ్ల ఒత్తిడి స్థాయిలు ఎలా ఉన్నాయో నమోదు చేయమన్నారు. ఈ 14 మంది శరీరంలోని వివిధ భాగాల నుంచి వెంట్రుకలు పరిశీలించారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రయోగంలో పాల్గొన్నవారిలో అతి పిన్నవయస్కుల జీవితాల్లో ఒత్తిడి మాయమైపోయినప్పుడు జుట్టు వారి సహజ రంగుకు తిరిగి వచ్చేసిందని గమనించారు. వీరిలో ఒక వ్యక్తి రెండు వారాలు సెలవులు తీసుకుని, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా గడిపిన తరువాత ఆయన వెంట్రుకల్లో కొన్ని వాటి సహజ రంగును తిరిగి పొందాయి. ఒత్తిడి లేకుంటే చాలా? జీవితంలో అనుభవించే టెన్షన్లు, ఒత్తిళ్లు మాయం కాగానే తెల్లబడిపోయిన జుట్టంతా వెంటనే నల్లగా మారిపోతుందని భావించకూడదని సైంటిస్టులు చెప్పారు. కేవలం కుదుళ్ల నుంచి పెరుగుతున్న వెంట్రుకలు తమ సహజ రంగుకు వచ్చేస్తాయని పికార్డ్ స్పష్టం చేశారు. అంటే అప్పటికే కుదురు నుంచి పైకి వచ్చిన వెంట్రుక రంగు మారదు. ఎందుకని ఇలా జరుగుతోందనేందుకు ఒత్తిడి కారణంగా మైటోకాండ్రియాలో జరిగే మార్పుల వల్లనే జుట్టు రంగు మారుతోందని సైంటిస్టులు వివరించారు. మైటోకాండ్రియాలు కణలకు శక్తి సరఫరా కేంద్రాలు. ‘మానసిక ఒత్తిడి వలన మైటోకాండ్రియా విడుదల చేసే శక్తిలో మార్పులు వస్తాయి. మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోతే కుదుళ్ల కింద ఉండే కణాలు సరిగా పనిచేయక జుట్టు పింగ్మెంట్‌ను కోల్పోతుంది’ అని పరిశోధకులు చెప్పారు. అయితే ఒత్తిడి తగ్గగానే మైటోకాండ్రియా శక్తి విడుదలలో మార్పులు సర్దుకుంటాయని, అందువల్ల కుదుళ్ల నుంచి మొలిచే కొత్త జుట్టు తన సహజ రంగును తిరిగి పొందుతుందని తెలిపారు. అయితే అందరిలో ఇది సాధ్యమేనా? అంటే కాదనే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలంపాటు తెల్లజుట్టు ఉన్నవారికి నల్లరంగు మళ్లీ రాదు. ‘ప్రతి ఒక్కరికి ఒక బయోలాజికల్ లిమిట్ (జీవసంబంధమైన పరిమితి) ఉంటుంది. అంటే ఒక వయసొచ్చాక జుట్టు పండిపోతుంది. ఆ పరిమితికి దగ్గర్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరిగితే రావలసిన సమయం కన్నా ముందే తెల్లజుట్టు వచ్చేస్తుంది. అంటే నిర్ణీత వయసు దాటిపోయి చాలాకాలం అయిపోతే తెల్ల జుట్టు నల్లగా మారడం దాదాపు అసాధ్యం’ అని పరిశోధకులు వివరించారు. అంటే ఒత్తిడి తగ్గిపోయిన ప్రతివారికీ నల్లజుట్టు పెరగడం ప్రారంభమవుతుందని కాదు. కానీ చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లబడినవారికి మాత్రం ఒత్తిడి తగ్గితే మళ్లీ నల్లజుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం జుట్టు రంగు మార్పు గురించే కాకుండా వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న ఇతర అంశాలను మానసిక ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది, అలాంటి మార్పులను రివర్స్ చేయగలమా లేదా అనే అంశాలపై తమ బృందం పరిశోధన కొనసాగిస్తోందని పికార్డ్ తెలిపారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే మానవ జీవన గమనంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. -
బ్లడ్ గ్రూప్‌లను బట్టి కరోనా ప్రభావం
న్యూయార్క్ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయ కంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకలు వేర్వేరుగా జరిపిన రెండు తాజా అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్లడ్ గ్రూప్ ‘ఓ (పాజిటివ్ లేదా నెగటివ్)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, వారిలో వైరస్ కారణంగా శరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం చాలా తక్కువని ఓడెన్స్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వైరస్ బారిన పడుతున్న వారిలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ ప్రజలు తక్కువగా ఉండడం మరో విశేషమని, ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతుండగా, వారిపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, వారి పట్లనే వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని డానిష్ పరిశోధకులు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది కరోనా బాధితుల నుంచి 4,73,000 మంది కరోనా కేసులపై వారీ అధ్యయనం జరిపారు. ఓ, బీ బడ్ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని, ఏ, ఏబీ గ్రూప్‌లపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ జరిపిన మరో అధ్యయనంలో బయట పడింది. ఓడెన్స్ అధ్యయనంలో కరోనా కేసుల్లో 38 శాతం మంది ఓ బ్లడ్ గ్రూప్ వారుకాగా, 62 శాతం మంది ఏ, బీ లేదా ఏబీ బ్లడ్ గ్రూప్‌లవారు ఉన్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో 45 శాతం మంది ఏ, ఏబీ బ్లడ్ గ్రూప్‌లకు చెందిన వారే ఉండడం వల్ల వారంతా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది.రెండు అధ్యయనాల్లో ఒక్క ‘బీ’ బ్లడ్ గ్రూప్ విషయంలోనే పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, మిగతా విషయాల్లో ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. వైరస్ సోకిన ఏ బ్లడ్ గ్రూప్ వారికే ఎక్కువగా ఆక్సిజన్ వెంటిలేటర్ అవసరం పడుతుందని రెండు అధ్యయనాలు తేల్చాయి. వెంటిలేటర్ వరకు వెళ్లిన కరోనా కేసుల్లో 95 శాతం మంది ఏ, ఏబీ బ్లడ్ గ్రూప్‌లవారే ఉన్నారని ఓ అధ్యయనం తేల్చింది. -
అంతా వాళ్లే చేశారు..!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా, 2012 ఆగస్ట్ 10 నుంచి 2013లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్‌రాజన్ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో రాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు సీతారామన్ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ కాల్స్‌తో రుణాలు ‘‘ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్సింగ్) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు. రాజన్‌ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. -
వారి హయాంలోనే బ్యాంకులు డీలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం విధాన నిర్ణేతలు, నేతల మధ్య పరస్పర విమర్శలకు తావిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్బీఐ సారథి రఘురామ్ రాజన్ల హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అధ్వానంగా తయారయ్యాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి ప్రాణవాయువు అందించడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్తేజంగా ఉన్న సమయంలో కేంద్ర బ్యాంక్ సారథ్య బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్‌ను తాను గొప్ప మేథావిగా గౌరవిస్తానని ఆమె పేర్కొన్నారు. బ్రౌన్ వర్సిటీలో రఘురామ్ రాజన్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ రాజన్ హయాంలో జరిగిన బ్యాంక్ రుణాల జారీలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో కేవలం ఫోన్ కాల్స్‌పై రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రభుత్వ ఈక్విటీపై ఆధారపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయంలో డాక్టర్ సింగ్ భారత్ పట్ల సరైన విజన్‌తో ఉండాలని డాక్టర్ రాజన్ కోరుకుని ఉండాలని ఆమె చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు పూశాయి. సింగ్, రాజన్ల హయాంలో భారత బ్యాంకులకు దుర్థశ వాటిల్లిందని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో బ్యాంకులకు వాటిల్లే కష్టనష్టాలపై మనకెవరికీ తెలియదని అన్నారు. -
నింగికి నిచ్చెన వేద్దామా?
బాలభారతం సినిమాలో ఓ పాట ఉంటుంది.. అర్జునుడు బాణాలతో ఓ నిచ్చెన వేస్తే.. భీముడు ఆ మెట్లు ఎక్కుతూ అంతరిక్షానికి చేరుకుంటాడు. అంతరిక్షం అంచుల దాకా నిచ్చెన వేయడం ఆనాటి కవి కల్పన కావొచ్చు.. కానీ సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నిర్మించలేమా? ఎంచక్కా చేయొచ్చు కానీ కొంచెం రివర్స్‌గా ఆలోచిద్దాం అంటున్నారు శాస్త్రవేత్తలు.. స్పేస్ ఎలివేటర్.. ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఆసక్తి రేకెత్తించిన అంశం ఇది. భూమ్మీది నుంచి బలమైన ఉక్కుతాళ్లతో ఓ లిఫ్ట్ లాంటిది నిర్మించడం తద్వారా జాబిల్లితో పాటు ఇతర గ్రహాలను సులువుగా చేరుకోవడం ఆ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలు, టెక్నాలజీలతో ఈ అంతరిక్ష నిచ్చెన కట్టడం దాదాపు అసాధ్యమని తేలింది. తాజాగా కొలంబియా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పేస్ ఎలివేటర్ నిర్మాణానికి వినూత్న ప్రతిపాదన చేశారు. నిచ్చెన భూమ్మీది నుంచి కాకుండా.. చందమామ నుంచి వేలాడుతూ ఉండటం ఈ తాజా ఆలోచన! గ్రహాలను అందుకునేందుకు.. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు కోట్లల్లో ఎందుకుంటుందో తెలుసా? భూమి గురుత్వాకర్షణ శక్తి మొత్తాన్ని అధిగమించేంత శక్తి అవసరం కాబట్టి.. బోలెడంత ఇంధనం అవసరమవుతుంది కాబట్టి. సమీప భవిష్యత్తులోనే జాబిల్లిపై మకాం పెట్టాలని అగ్రరాజ్యాలు ఆలోచిస్తుండగా.. ఎలన్ మస్క్ వంటివాళ్లు ఇంకో నాలుగేళ్లలో అంగారకుడిపై కాలనీ ఏర్పాటు చేస్తామంటున్నారు. కాబట్టి ఇలాంటివి సాధ్యం కావాలంటే స్పేస్‌లైన్ సూచిస్తున్న నిచ్చెన లాంటివి అత్యవసరమవుతాయి. కొలంబియా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రతిపాదన ప్రకారం.. జాబిల్లిపై బలమైన తీగ లాంటిదాన్ని బిగించి దాన్ని భూస్థిర కక్ష్య వరకు వేలాడేలా చేస్తారు. భూమ్మీది నుంచి వెళ్లే రాకెట్లు.. ఈ తీగ కొనకు చేరుకుంటాయి. అక్కడే పార్క్ అవుతాయి. ఆ తర్వాత వ్యోమగాములు ఈ తీగ వెంబడి ఇంకో రాకెట్లో సులువుగా జాబిల్లిని చేరుకుంటారు. అంతరిక్షంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈ శక్తిని కూడా సౌరశక్తితో అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు అవసరమైన అన్ని టెక్నాలజీలు, పదార్థాలు అందుబాటులోనే ఉన్నాయని జెఫైర్ పెనైరీ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఎంతో కీలకం... అతితక్కువ ఖర్చుతో వ్యోమగాములను జాబిల్లికి చేర్చడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఇతర గ్రహాలకు వెళ్లేందుకు కూడా స్పేస్‌లైన్ కీలకమైన నిర్మాణం కానుందని వివరించారు. భవిష్యత్తులో ఈ స్పేస్‌లైన్ నిర్మాణమంటూ జరిగితే.. దాన్ని టెలిస్కోపులు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు వాడుకోవచ్చని జెఫైర్ అంటు న్నారు. భూమి, జాబిల్లి తాలూకు గురుత్వశక్తులు సమానంగా.. వ్యతిరేక దిశలో ఉండే లంగ్రాంజ్ పాయింట్ ప్రాంతంలో ఇతర వ్యవస్థలను ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పూర్తి వివరాలు ఏఆర్ఎక్స్ ఐవీ ప్రీ ప్రింట్లో ప్రచురితమయ్యాయి. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఫైబర్ గ్రిడ్‌తో అమెరికాలో ఇవ్వనంత బ్యాండ్ విడ్త్
సాక్షి, అమరావతి: ‘ప్రస్తుతం విద్యుత్తును నిల్వచేయటం మీద దృష్టి సారించాం. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ఉత్తమ దేశం..సురక్షితమని’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం గురువారం కొలంబియా యూనివర్సిటీకి వెళ్లి ప్రసంగించారు. ప్రతి గ్రామాన్నీ రహదారులతో అనుసంధానిస్తున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో అన్ని ప్రాంతాల్లో సింగిల్, డబుల్, నాలుగు, ఎనిమిది వరుసల రహదారుల నిర్మాణంలో లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో అమెరికాలో కూడా ఇవ్వనంత బ్యాండ్ విడ్త్ సమకూరుస్తున్నామన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు టెలికమ్యూనికేషన్ సంస్కరణలు వేగవంతమయ్యాయని.. అందుకు తానే బాధ్యత తీసుకున్నానని సీఎం చెప్పారు. గతంలో పబ్లిక్ సెక్టారు సంస్థలైన బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఆధిపత్యంలో ఉండేవని తెలిపారు. వీఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్‌కు, బీఎస్ఎన్ఎల్ లోకల్ కాల్స్‌పై ఆధిపత్యం వహించేవన్నారు. అప్పట్లో లైటెనింగ్ కాల్స్ ఉండేవని, వాటికి కూడా ఒకోసారి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదన్నారు. ఇవాళ మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తక్షణమే మాట్లాడుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఎవరూ కూడా ఫోన్ కాల్స్‌కు డబ్బు వసూలు చేయరని, డేటా ఇచ్చినందుకు రుసుం వసూలు చేస్తారని తెలిపారు. వినియోగాన్ని అనుసరించి విద్యుత్తు చార్జీలు వసూలు చేస్తున్నట్లే తలసరి ఆదాయాన్ని బ్యాండ్ విడ్త్ తలసరి వినియోగం ఆధారంగా నిర్ణయించే రోజులు రానున్నాయన్నారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డుతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రియల్ టైమ్ డేటా చూడవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ కూడా రియల్ టైమ్ వ్యవస్థతో పనిచేయించే విధంగా తీర్చిదిద్దామని, బల్బు వెలిగిందా లేదా అనే అంశాన్ని సెన్సర్ ఆధారంగా గుర్తించవచ్చునన్నారు. నాలుగేళ్ల కృషితో ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధిరేటు సాధిస్తోందన్నారు. నాలుగేళ్లుగా భారత ప్రభుత్వం సగటున 7.3 % వృద్ధి రేటు సాధిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.52%తో రెండంకెల వృద్ధిరేటు నమోదు చేసిందని వివరించారు. కార్యక్రమంలో జాన్ చాంబర్స్ స్వీయరచన ‘ద డాట్స్’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. స్టార్టప్స్ ప్రారంభించే వారికి ఈ రచన ఓ దిక్సూచిగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. -
రోజుకు మరో గంట పెరుగుతుంది...
రోజుకు 24 కంటే ఎక్కువ గంటలుంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా? మీ ఆశ ఇప్పుడు కాకపోయినా ఇంకో రెండు వేల ఏళ్లకైనా నిజం కానుంది! అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి నుంచి జాబిల్లి నెమ్మదిగా దూరం జరగడం దీనికి కారణమవుతోందని.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉంటాయన్నది వీరి అంచనా. కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మాడిసన్ పరిశోధకులు దాదాపు తొమ్మిది కోట్ల ఏళ్ల క్రితం నాటి రాళ్లను పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పురాతన కాలంలో... కచ్చితంగా చెప్పాలంటే 140 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు సగటున 18 గంటలు, గంటకు 41 నిముషాలు మాత్రమే ఉండేవని తెలిసింది.. భూమండలం కక్ష్య నుంచి చందమామ నెమ్మదిగా పక్కకు జరుగుతున్న కొద్దీ రోజులో గంటలు పెరుగుతున్నాయని తేల్చారు. ఈ విధంగా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్ది భూభ్రమణం కూడా నెమ్మదిస్తుందని విస్కాన్సిన్–మాడిసన్ విశ్వవిద్యాలయ జియోసైన్స్ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ వెల్లడించారు. భూమి నుంచి చందమామ ఏడాదికి 3.82 సెంటీ మీటర్ల చొప్పున దూరం జరుగుతున్నట్టు అంచనా. జాబిల్లితోపాటు అనేక ఇతర గ్రహాలు, నక్షత్రాల గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై ఉంటుందని.. ఇది కాస్తా భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సౌరవ్యవస్థలో వచ్చే మార్పుచేర్పులకు అనుగుణంగా రోజులో పగటి వేళల్లో మార్పులు సంభవిస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అక్కడ చదివితే జాబ్ పక్కా..!
ఈ విద్యాసంస్థల్లో చదివితే జాబ్ పక్కా.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని అంటోంది టైమ్స్ సర్వే.. ఈ మేరకు ఉద్యోగ కల్పనలో ముందున్న టాప్ టెన్ యూనివర్సిటీలకు ‘టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ ర్యాంకింగ్స్’ను ప్రకంటించింది. ఈ ర్యాంకుల్లో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 2017 సంవత్సరంలో ప్రపంచంలోని ఏ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని సర్వే చేస్తే అమెరికాలోని కాలేజీలే అగ్ర స్థానాలలో నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తేలింది. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్-టెన్ విద్యాసంస్థల్లో అమెరికా కాలేజీలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మొదటి స్థానంలో కాలిఫోర్నియా ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ విద్యాబోధన సాగడమే ఇందుకు కారణం అని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ, మూడో స్థానంలో కొలంబియా యూనివర్సిటీ నిలిచాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఐదో స్ధానంలో, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఎనిమిదో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ.. టాప్‌టెన్ ర్యాంకులివే.. -
‘పారదర్శకత..అక్కడ పనికిరాదు’
వాషింగ్టన్: నోట్ల రద్దుపై అత్యంత గోప్యతను పాటించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించారు. ఈ అంశంలో పారదర్శకత లేకుండా, ముందస్తు సమాచారమిస్తే నోట్ల రద్దు అక్రమాలకు నిలయమయ్యేదని చెప్పారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ల వార్షిక సదస్సుల్లో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న జైట్లీ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ట స్థితిలో నిలిపేలా సాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత మార్పులతో రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి ప్రక్షాళన కావడంతో పాటు సుధృడ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పడతాయని చెప్పారు. నోట్ల రద్దుపై ముందస్తు సమాచారం ఇస్తే ప్రజలు తమ చేతుల్లో ఉన్న డబ్బుతో బంగారం, డైమండ్, భూములు కొనడంతో పాటు పలు నగదు లావాదేవీలకు పాల్పడేవారని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జైట్లీ చెప్పుకొచ్చారు. ‘పారదర్శకత వినడానికి ఇది మంచి పదం..కానీ ఈ విషయంలో పారదర్శకత పాటించినట్టయితే అది తీవ్ర తప్పిదాలకు దారితీసేది’ అని వ్యాఖ్యానించారు.నోట్ల రద్దు అనంతరం ప్రజల్లో చిన్నపాటి అలజడి కూడా చోటుచేసుకోలేదని, ఇదే ఈ నిర్ణయం విజయవంతమైందనడానికి సంకేతమని జైట్లీ తెలిపారు. నోట్ల రద్దుతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడినా దేశ ప్రయోజనాల కోసం దీన్ని స్వాగతించారని చెప్పారు. నోట్ల రద్దు ఫలితంగా డిజిటల్ లావాదేవీలు రెట్టింపయ్యాయని, పెద్దసంఖ్యలో ప్రజలు పన్ను పరిథిలోకి వచ్చారన్నారు. -
ఫిట్నెస్ లెవెల్స్‌లో మగువలే మేటి
టొరంటోః మహిళలతో పోలిస్తే పురుషులే శారీరకంగా బలవంతులైతే కావచ్చు కానీ కండర పటుత్వం, శక్తిలో మగువలే శక్తివంతులని ఓ అధ్యయనం తేల్చింది. ఒకే తరహా వ్యాయామం చేసిన అనంతరం అదే వయసు కల పురుషులతో పోలిస్తే స్త్రీలు దీటుగా వాటిని తట్టుకోగలుగుతున్నారని కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఒకే వయసు కలిగిన ఎనిమిది మంది పురుషులు, తొమ్మిది మంది స్త్రీలను ఎంచుకున్న పరిశోధన బృందం వారితో శారీరక వ్యాయామం చేయించింది. వ్యాయామం చేసే సమయంలో సెన్సర్ల ద్వారా వారి శారీరక కదలికలను రికార్డు చేసింది. వ్యాయామం చేసే సందర్భంలో, వ్యాయామం అనంతరం పురుషులతో పోలిస్తే మహిళల వేగం, కదలికలు మెరుగ్గా ఉన్నాయని వారి పరిశోధనలో వెల్లడైంది. వ్యాయామం అనంతరం సాధారణ స్థితిలోకి వచ్చే సమయం కూడా పురుషుల్లో ఎక్కువగా ఉంటే మగువల్లో తక్కువగా ఉందని తేలింది. పురుషుల కన్నా మహిళల్లో ఫిట్నెస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయనే సందేహాలను తమ అధ్యయనం పటాపంచలు చేసిందని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. -
త్రీడీ ఊపిరితిత్తులు!
న్యూయార్క్: మానవుడి ఊపిరితిత్తుల్లాగా పని చేసే అతిచిన్న త్రీడీ అవయవాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. శ్వాస కోస సంబంధ వ్యాధు లపై మరింత అవగాహన పొందేందుకు ప్రయో గశాలల్లో అభివృద్ధి చేసిన ఈ అవయవాలు దోహదపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మానవుడి ప్లురిపొటెంట్ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) సహాయంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ త్రీడీ ఆర్గనాయిడ్స్ (లంగ్స్)ను అభివృద్ధి చేశారు. మానవుడి దేహంలోని ఊపరితిత్తుల మాది రిగా వీటిలో నిర్మాణాలను ఏర్పాటు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) సోకినపుడు ఊపిరిత్తులు ఏ విధంగా స్పందిస్తాయో అదే విధంగా ఈ త్రీడీ ఆర్గనాయిడ్స్ కూడా స్పందించినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ ఆర్గనాయిడ్స్ వివిధ రకాల నూతన ఔషధాలను పరీక్షించడానికి ఉపయోగపడ తాయని కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ హాన్స్ విలియమ్ పేర్కొన్నారు. -
డీఎన్ఏలో లఘుచిత్రం!
న్యూయార్క్: డీఎన్ఏలో ఓ లఘుచిత్రం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తోపాటు వేరే డేటాను పరిశోధకులు విజయవంతంగా పొందుపరిచారు. స్పెయిన్ లోని గుహల్లో 4.3 లక్షల ఏళ్ల పూర్వీకుడికి సంబంధించిన ఎముకల నుంచి సేకరించిన డీఎన్ ఏలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ జినోమీ సెంటర్(ఎన్ వైజీసీ)కి చెందిన పరిశోధకులు ఈ మేరకు డేటాను పొందుపరిచారు. క్యాసెట్ టేపులు, సీడీల మాదిరిగా డీఎన్ ఏ పాడైపోదని కొలంబియా వర్సిటీకి చెందిన యానివ్ ఎర్లిచ్ పేర్కొన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ‘అరీవల్ ఆఫ్ ఏ ట్రైన్ ఎట్ లా సియోటట్’ అనే 1895 సంవత్సరపు ఫ్రెంచ్ సినిమా, 50 డాలర్ల అమెజాన్ గిఫ్ట్ కార్డు, కంప్యూటర్ వైరస్, పయోనీర్ చిహ్నం కొన్ని ఫైళ్లను క్రోఢీకరించి డీఎన్ ఏలో పొందుపరిచారు. మొత్తం ఆరు ఫైళ్లకు సంబంధించిన 215 పెటాబైట్స్ను ఒక గ్రామ్ డీఎన్ఏలో నిక్షిప్తం చేసినట్లు ఎర్లిచ్ చెప్పారు. -
వచ్చినట్లే వచ్చి పోయింది!
‘సీటొచ్చింది చేరిపొండి’ అని ఈమెయిల్స్ పంపింది కొలంబియా యూనివర్శిటీ. ఆ వెంటనే కొన్ని గంటల తర్వాత ... ‘అయ్యయ్యో.. సారీ, టెక్నికల్ మిస్టేక్ ఏదో జరిగింది. మీకు సీటు రాలేదు అని చెప్పడానికి చింతిస్తున్నాం’ అని 277 మంది విద్యార్థులకు అపాలజీ మెయిల్స్ పంపింది. కొలంబియాలో సీటంటే మామూలు సంగతేం కాదు. అదృష్టం ఇలా వచ్చి, అలా చేజారినందుకు ఎంత బాధపడిపోతుంటారో ఊహించిన యూనివర్శిటీ వైస్ డీన్ జూలీ కార్న్ఫెల్డ్... ‘కొలంబియా డీప్లీ అపాలజైజస్’ అని మెసేజ్ పంపారు. -
9.0 తీవ్రతతో భూకంపం రావొచ్చు!
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో భారీ భూకంపానికి అవకాశం ఉందని, దీని ప్రభావం తూర్పు భారతంలోని పట్టణ ప్రాంతాలపై ఉంటుందని అధ్యయనంలో తేలింది. గంగ, బ్రహ్మపుత్ర నదుల పరిధిలో భూమి లోపలి రెండు ఫలకాలపై ఒత్తిడి పెరిగిపోవడమే దీనికి కారణమట. భూకంపం వస్తే తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 కన్నా ఎక్కువగా ఉండొచ్చని, 9.0కీ చేరొచ్చని.. 14 కోట్ల మందిపై ప్రభావం చూపుతుందని కొలంబియా యూనివర్సిటీకు చెందిన భూ భౌతిక శాస్త్రవేత్త మైఖెల్ స్టెక్లర్ తెలిపారు. భూమి కంపించడం వల్లే ఇంతమందిపై ప్రభావం పడుతుందని, సునామీలు వస్తే మరింత మందిపై ప్రభావం పడే అవకాశముందన్నారు. సముద్రంలో భూకంపనాలు సంభవించే అవకాశం లేకపోలేదన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు నేచుర్ జియోసైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, సునామీ 2,30,000 మందిని బలితీసుకుంది. 2011లో జపాన్ లో వచ్చిన విలయంతో 20 వేల మందిపైగా మృతి చెందారు. గతేడాది నేపాల్ లో భూకంపం సంభవించడంతో 9 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
పట్టభద్రురాలైన హీరో కుమార్తె
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సరా అలీ ఖాన్(22) పట్టభద్రురాలైంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు, డిజైనర్ సందీప్ ఖొస్లా తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే డ్రెస్ లో ఆమె ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తండ్రి మాట ప్రకారం ఆమె డిగ్రీ పూర్తి చేసింది. అంతకుముందు బాలీవుడ్ నిర్మాణ సంస్థలను ఆమె హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ముందుకు వచ్చినా సైఫ్ అలీఖాన్ ఒప్పుకోలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే దాకా సినిమాల్లోకి రావొద్దని తండ్రి చెప్పడంతో ఆమె చదువుకు ప్రాధాన్యం ఇచ్చింది. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కుమార్తె అయిన 22 ఏళ్ల సరా త్వరలోనే తెరంగ్రేటం చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 1991లో సైఫ్, అమృత పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల తర్వాత 2004లో విడిపోయారు. తర్వాత కరీనా కపూర్ ను సైఫ్ పెళ్లాడాడు. -
జంతు విషాల తొలి డేటాబేస్ ఆవిష్కరణ
న్యూయార్క్: జంతువుల విషాలు, మానవులపై వాటి ప్రభావాలతో కూడిన మొట్టమొదటి జాబితాను అమెరికాలోని కొలంబియా వర్సిటీ డేటా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనిని వెనమ్ నాలెడ్జి బేస్(వెనమ్కేబీ) అని పిలుస్తున్నారు. కేన్సర్, మధుమేహం, గుండెజబ్బులు, నొప్పుల నివారణల్లో విషం ఉపయోగాలకు సంబంధించి 5,117 అధ్యయనాలను క్రోడీకరించి జాబితాలో పొందుపరిచారు. మానవశరీరంపై 42,723 రకాల ప్రభావాలకు సంబంధించిన డాక్యుమెంట్లు వెనమ్కేబీలో ఉన్నాయి. జాబితా కొత్త పరిశోధనలకు, చికిత్సలకు ఉపయోగపడుతుందట. -
బట్టతలకు సరికొత్త మందు!
బట్టతలపై జుట్టు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేశారా.. పసరు వైద్యం నుంచి ఆధునిక ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు అన్ని రకాల వైద్యం కోసం ప్రయత్నించి విసిగిపోయారా.. అయితే మీలాంటి వారికోసమే ఈ శుభవార్త. కొలంబియా యూనివర్సిటీ వైద్యులు బట్టతల పోయేందుకు ఓ సరికొత్త పరిష్కారం కనుగొన్నారు. అంతేకాదు కేవలం పది రోజుల్లోనే ఒత్తయిన జుట్టు వచ్చేలా చేయొచ్చని చెబుతున్నారు. కొన్ని రకాల ఎంజైమ్‌ల ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని కనిపెట్టారు. ఈ ప్రయోగాల ముఖ్య లక్ష్యం.. అలోపీసియా అరేటా (అకస్మాత్తుగా శరీరంపై కొన్ని ప్రాంతాల్లో జుట్టు ఊడిపోవడం) వ్యాధికి చికిత్స. అయితే బట్టతలలో తలపై జుట్టు ఊడిపోతుంది. అలోపీసియా వల్ల మాత్రం కొంత ప్రాంతంలోనే జుట్టు ఊడిపోతుంది. వెంట్రుకల కుదుళ్లలో జానస్ కైనేజ్ వర్గపు ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించే మందులు.. ఎలుకల్లో కొత్తగా వెంట్రుకలు వచ్చేలా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మందులను చర్మంపై పూయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధన బృందం సభ్యుడు క్రిస్టియానో తెలిపారు. తమ ప్రయోగాల్లో ఉపయోగించిన రెండు మందులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించిందన్నారు.