న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు.
ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో 133 మందిని అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment