
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు.
ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది.