USA: బొమ్మ శవాలతో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసన | Gaza protesters place fake corpses outside Michigan university official home | Sakshi
Sakshi News home page

USA: బొమ్మ శవాలతో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసన

Published Thu, May 16 2024 9:06 AM | Last Updated on Thu, May 16 2024 9:34 AM

Gaza protesters place fake corpses outside Michigan university official home

న్యూయార్క్‌: గాజాలోని పాలస్తీనియన్లకు అనుకూలంగా ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని యూనివర్సిటీల విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పరిపాలన బోర్డులో పనిచేసే ఓ అధికారిణి సారా హబ్బర్డ్ ఇంటి ముందు విద్యార్థుల నిరసన కలకలం రేపింది. ఆమె ఇంటి ముందు సుమారు 30 విద్యార్థి నిరసనకారులు.. మూడు టెంట్లు వేసి.. నకిలీ శవాలు( బొమ్మలు), రక్తం మరకలతో కూడిన చిన్న పిల్లలు  బొమ్మలను పెట్టి వెళ్లిపోయారు.

 

వాటిని గమనించిన సారా హబ్బర్డ్‌ ఈ విషయాన్ని వరసు ట్వీట్లతో సోషల్‌మీడియాలో తెలిపారు. ‘బుధవారం ఉదయం 5.54 గంటలకు సుమారు 30 మంది ఇజ్రాయెల్‌ వ్యతిరేక మిచిగాన్‌ యూనివర్సిటీ విద్యార్థి నిరసనకారులు నేను ఉండే ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటి ముందు మూడు టెంట్లు వేశారు. విచిత్రమైన బొమ్మలు, షీట్లు, మరికొన్ని వస్తులు పెట్టారు. యూనివర్సిటీలో పనిచేసే ప్రభుత్వ అధికారి ప్రైవేట్‌ ఇంటి ముందు ఇలా నిరసన తెలపటం ఆమోదయోగ్యం కాదు. ఈ విధంగా చేస్తే.. వారు అనుకున్న లక్ష్యాన్ని సంతృప్తి పరుచుకోలేరు’ అని  సారా హబ్బర్డ్‌  ‘ఎక్స్‌’లో తెలిపారు.

ఇక మరోవైపు.. ఇజ్రాయెల్‌ వ్యతిరేక విద్యార్థి నిరసనకారుల బృందం ఇర్విన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉండే  ఓ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు క్లాస్‌లను రద్దు చేసి.. పోలీసులకు సమాచారం అందించారు. గాజాలో హమాస్‌ బలగాలు లక్ష్యంగా అమాయకులైన పాలస్తీనా పౌరులై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఏప్రిల్‌లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసన పాల్గొన్న పలువురు విద్యార్థులు అరెస్ట్‌ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement