michigan university students
-
USA: బొమ్మ శవాలతో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన
న్యూయార్క్: గాజాలోని పాలస్తీనియన్లకు అనుకూలంగా ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని యూనివర్సిటీల విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పరిపాలన బోర్డులో పనిచేసే ఓ అధికారిణి సారా హబ్బర్డ్ ఇంటి ముందు విద్యార్థుల నిరసన కలకలం రేపింది. ఆమె ఇంటి ముందు సుమారు 30 విద్యార్థి నిరసనకారులు.. మూడు టెంట్లు వేసి.. నకిలీ శవాలు( బొమ్మలు), రక్తం మరకలతో కూడిన చిన్న పిల్లలు బొమ్మలను పెట్టి వెళ్లిపోయారు.pic.twitter.com/5eAWgS4hIT— Sarah Hubbard, Regent @umich (@RegentHubbard) May 15, 2024 వాటిని గమనించిన సారా హబ్బర్డ్ ఈ విషయాన్ని వరసు ట్వీట్లతో సోషల్‌మీడియాలో తెలిపారు. ‘బుధవారం ఉదయం 5.54 గంటలకు సుమారు 30 మంది ఇజ్రాయెల్ వ్యతిరేక మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థి నిరసనకారులు నేను ఉండే ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటి ముందు మూడు టెంట్లు వేశారు. విచిత్రమైన బొమ్మలు, షీట్లు, మరికొన్ని వస్తులు పెట్టారు. యూనివర్సిటీలో పనిచేసే ప్రభుత్వ అధికారి ప్రైవేట్ ఇంటి ముందు ఇలా నిరసన తెలపటం ఆమోదయోగ్యం కాదు. ఈ విధంగా చేస్తే.. వారు అనుకున్న లక్ష్యాన్ని సంతృప్తి పరుచుకోలేరు’ అని సారా హబ్బర్డ్ ‘ఎక్స్’లో తెలిపారు.Nah. Those are sheets. The stuffed animals and doll crib are toys. https://t.co/5PJXixbgi6 pic.twitter.com/QDUsnNNIvG— Sarah Hubbard, Regent @umich (@RegentHubbard) May 15, 2024ఇక మరోవైపు.. ఇజ్రాయెల్ వ్యతిరేక విద్యార్థి నిరసనకారుల బృందం ఇర్విన్లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉండే ఓ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు క్లాస్‌లను రద్దు చేసి.. పోలీసులకు సమాచారం అందించారు. గాజాలో హమాస్ బలగాలు లక్ష్యంగా అమాయకులైన పాలస్తీనా పౌరులై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఏప్రిల్‌లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసన పాల్గొన్న పలువురు విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. -
‘మిషన్ కాకతీయ’ వేగం పెంచండి
జనవరి 10 నాటికి పనులు మొదలవ్వాలి: మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం కింద చెరువుల పునరుద్ధరణ పనులను త్వరితగతిన ప్రాంభించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జనవరి 10 నాటికి అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన చెరువుల్లో 50 శాతం చెరువుల సర్వే, అంచనాల తయారీ, పరిపాలనా అనుమతి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. మంగళవారం జలసౌధలో ‘మిషన్ కాకతీయ’ పనుల పురోగతి, ఇతర అంశాలపై నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల నోడల్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఏఈఈ, డీఈఈలు చెరువులను సందర్శించకుండానే అంచనాలను యథాతథంగా ఎస్ఈలకు పంపుతున్నారని ఈ సందర్భంగా నోడల్ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఆయకట్టు లేని చెరువుల తూములకు, కాల్వలకు మరమ్మతులను చేయొద్దని సూచించారు. మిషన్ కాకతీయకు ఆర్థిక సహాయం కోరేందుకు వీలుగా కేంద్రానికి, జపాన్ బ్యాంకు, ప్రపంచ బ్యాం కులకు సమర్పించే నివేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదుల, ప్రాణహిత, రాజీవ్ భీమా, కొమరం భీం తదితర ప్రాజెక్టుల అటవీ అనుమతుల కోసం జీడీపీఎస్ సర్వేలు పూర్తి చేసి నివేదికలు పంపాలని కూడా ఆదేశించారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన మిషిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు మం త్రిని కలిసి మిషన్ కాకతీయపై తమ అధ్యయన వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరిలో యూనివర్సిటీ నిర్వహించనున్న గ్లోబల్ వాటర్ సింపోజియానికి ప్రత్యేక అతిథిగా అమెరికాకు రావాలని వారు ఆహ్వానించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, చిన్న నీటి పారుదల శాఖ సీఈలు రామకృష్ణారావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.